పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

న్యూహారైజాన్స్ ప్లూటో ఆరిజిన్స్

ప్లూటో సంగతి తేల్చుకోవడానికి, నాసా న్యూహారైజాన్స్ అనే వ్యోమ శకటాన్ని ప్రయోగించింది.

oct3 సౌర మండలంలో సూర్యుని చుట్టూ తిరిగేవి నవగ్రహాలని నేర్చుకున్నాం (24, ఆగస్టు 2006) గ్రహాల గురించి నూతన నిర్వచనం వెలువడ్డాక 9వ గ్రహంగా అంతవరకు హోదాను అనుభవించిన ప్లుటో 13 సెప్టెంబర్ 2006 నుండి గ్రహ హోదాను పోగొట్టుకొంది. ఇప్పుడిక మన సూర్యుడి చుట్టూ ఉండే గ్రహాలు కేవలం 8. అంటే అష్ట గ్రహ కూటమి సౌర మండలంలో ఉందన్నమాట.

ఈ ప్లూటో సంగతి తేల్చుకోవడానికి, దీని గురించిన ఎన్నో భౌతిక, రసాయనిక ఖగోళ విషయాలను అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) నాసా ఓ వ్యోమ శకటాన్ని ప్రయోగించింది. ఆ శకటం పేరు న్యూహారైజాన్స్ (New Horizons). తెలుగులో దీనర్థం నూతన గగనపుటంచులు. దీనిని జనవరి 19 2006 సంవత్సరంలో భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గం. సమీపాన (స్థానిక కాలమానం సాయంత్రం 7 గం.) అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కెప్ కెనరావెల్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపారు. దీనిని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత భౌతిక శాస్త్ర ప్రయోగశాల నిర్మించింది. చూశారా అమెరికాలో విశ్వవిద్యాలయాల ప్రయోగశాలలే అంత గొప్ప రాకెట్ వ్యోమనౌకల్ని తయారు చేయగలుగుతున్నాయి. ప్రయోగ సమయంలో దాని బరువు 478 కి.గ్రా. ప్లూటో మన భూమికి సుమారు 35 ఖగోళ ప్రమాణాల (astronomical units) దూరంలో ఉంది. ఒక ఖగోళ ప్రమాణం అంటే భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న సగటు దూరమన్నమాట. దాని విలువ 149610547 కి.మీ. లేదా సుమారు 15 కోట్ల కి.మీ. అంటే భూమికి ప్లూటోకు  మధ్య దూరం సుమారు 500 కోట్ల కి.మీ. ఇంత దూరాన్ని మనం విమానంలో గంటకు 1000 కి.మీ. వేగంతో వెళ్లినా 50 లక్షల గంటలు లేదా 570 సంవత్సరాలు పడుతుంది..

oct4ఫ్లూటోను గ్రహ హోదా నుంచి తప్పించడానికి మరో అంశం ఉంది. ఇది సూర్యుని చుట్టూ సాధారణ దీర్ఘ వృత్తాకారంలో కాకుండా చాలా సుదీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. అంటే ఒక్కోసారి సూర్యుడికి అతి దగ్గరగా ఒక్కోసారి అతి దూరంగా (ఒకే ప్రదక్షిణంలో) తిరుగుతుందన్నమాట. ఇది సూర్యునికి అతి దగ్గరగా ఉన్నప్పుడు దానికి, సూర్యునికి మధ్య ఉన్న దూరం సుమారు 30 ఖగోళ ప్రమాణాలు (443 కోట్ల కి.మీ.) అత్యంత దూరంగా ఉన్నప్పుడు దీనికి, సూర్యునికి మధ్యదూరం సుమారు 40 ఖగోళ ప్రమాణాలు (590 కోట్ల కి.మీ.). అంటే దీని పరిభ్రమణంలో సూర్యునిపరంగా వ్యత్యాసమే 10 ఖగోళ ప్రమాణాలు ఉందన్నమాట.

ఇలా అది సూర్యుడికి దగ్గరగా, భూమికి దగ్గరగా ఉన్నప్పుడు దీనికి, భూమికి మధ్య ఉన్న దూరాన్ని 29 ఖగోళ ప్రమాణాలు లేదా సుమారు 428 కోట్ల కి.మీ.గా భావించాలి. ఈ దూరాన్నయినా మనం విమానంలో గంటకు 1000 కి.మీ. వేగంతో వెళ్లినా 488 సంవత్సరాలు పడుతుంది. ఇదే దూరాన్ని సుమారు గంటకు 50 వేల కి.మీ. వేగంతో వెళ్లితే సుమారు 9 సంవత్సరాలు పడుతుంది. న్యూహారైజాన్స్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. గంటకు సుమారు 58536 కి.మీ. వేగంతో వెళ్లడం వల్ల న్యూహారైజాన్ మొన్నటికి మొన్న జూలై 14, 2015 నాటికి ప్లూటోకు అతి చేరువగా (సుమారు 12500 కి.మీ.) వెళ్లి, ఫ్లూటో ఫోటోలను తీయగలిగింది.

oct5విజ్ఞాన శాస్త్ర చరిత్రలో మానవజాతి ఇంతవేగంగా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమశకటం మరోటిలేదు. ఇదే వేగంతో మనం భారతదేశం నుంచి అమెరికాకు బయల్దేరితే ఢిల్లీ నుంచి చికాగో నగరానికి 12 నిమిషాల్లోనే వెళ్లగలము, కానీ వాస్తవం పునరు అత్యంతవేగంగా వెళ్లే విమానంలో అయితే సుమారు 15 గంటలు పడుతుంది.

దాదాపు ఓ దశాబ్దం పాటు నిరావటం, బ్రేకులు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సుమారు 500 కోట్ల కి.మీ. ప్రయాణించి న్యూహారైజాన్స్

ఫుటోను అతి చేరువగా, అనుకున్న విధంగానే చేరడాన్ని నాసా శాస్త్రవేత్త Neil Degrasse Tyson ఇలా పేర్కొన్నారు. “గోల్ఫ్ ఆటలో 4 కి.మీ. దూరంలో గడ్డిపొరల్లో దాగున్న బద్ది లేక రంధ్రం(hole)లోకి ఒకే షాట్ తో గోల్ఫ్ బంతిని పంపినట్లుంది.”. న్యూహారైజాన్స్ ప్లూటో దగ్గరికి వెళ్లి పరిశోధనలు చేసిన తర్వాత ప్లూటో గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.

  1. oct61930 సం.లో Clyde Tombaugh ప్లూటో గ్రహాన్ని కనుగొన్న తర్వాత వివిధ పద్ధతుల్లో, పరిశోధనల్లో ప్లూటోను పరిశీలించారు. దీనిపై పెద్ద పెద్ద వర్వతాలున్నాయని, సుదూర ప్రాంతాల నుంచి ఉల్కల్లాంటివి. వచ్చి ప్లుటో ఉపరితలాన్ని ఢీ కొనడం ద్వారా పెద్ద పెద్ద గుంటలు (Craters) ఏర్పడ్డాయని భావించే వారము. కానీ అక్కడ గుంటలు ఎక్కువ లేవని తెలుస్తోంది. కొండలు కూడా కొన్ని మాత్రమే ఉన్నాయనీ, మహా అయితే వాటి సగటు ఎత్తు 3.5 కి.మీ. దాటదని న్యూహారైజాన్స్ ఋజువు చేసింది.
  2. ప్లూటో ఉపరితలం ప్రశాంతంగా, చల్లగా ఉందని అనుకొనే వాళ్లం. కానీ దాని ఉపరితలం చాలా తాజాగా ఉందని, దాని గర్భంలో చాలా ఉష్ణ ప్రక్రియలు జరుగుతున్నాయని న్యూహారైజాన్స్ గుర్తించింది.
  3. ప్లూటో ఉపగ్రహాల(Moons) లో అతి పెద్దదయిన శరణ్ (Charon) కూడా సోమరిగా లేదనీ, దాని ఉపరితలల్లో కూడా చాలా చురుగ్గా ఉందని తెలుస్తోంది.
  4. ప్లూటో మీద మంచుగానీ, ఇతర ద్రవ రూపాలు గాని లేవు.
న్యూహారైజాన్స్ ప్లూటోకు జూలై 14న అతి చేరువగా వెళ్లిన మాట నిజమే గానీ అది అంత మాత్రాన అక్కడి నుంచి పూర్తిగా దూరం కాలేదు. కొంచెం అటూ ఇటూగా పై సంవత్సరం ఆగస్టు వరకు తచ్చాడుతూనే ఉంటుంది. ఫ్లూటో గురించి, దానికి దగ్గరగా ఉన్న ఎరిస్ (Eris) గురించి ఇంకా కూపర్ పట్టీ (Kuiper Belt)లో ఉన్న మరికొన్ని ఖగోళ వస్తువుల గురించి మరింత సమాచారం తెలుస్తుందని ఆశిద్దాం. సాధారణ విజ్ఞానశాస్త్రాల పట్ల, ఖగోళ శాస్త్రం పట్ల తగ్గిపోతున్న ప్రజాదరణను ఇలాంటి అంతరిక్ష పరిశోధనలు, వాస్తవ చిత్రీకరణలు మనల్ని మరింత సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తాయి. ఇలాంటి ప్రకృతి దృగ్విషములకు సమాధానాలు తెలీక అద్భుత శక్తుల్ని, అతీత శక్తుల్ని ఆపాదిస్తారు. ఛాందసత్వంలో మేళవించిన జీవితాల్ని గడుపుతున్న ప్రజాకోటికి ఇలాంటి విజ్ఞాన శాస్త్ర పరిశోధనల ద్వారానే నిజాలు తెలుస్తాయి. తద్వారా నేడు కాకున్నా రేపైనా ప్రజలు శాస్త్రీయతను పెంచుకొంటారు. అభూతకల్పనలను, జ్యోతిశాస్త్రాన్ని, వాస్తును ప్రజలు త్యజించే అవకాశంను న్యూహారైజాన్స్ కల్గిస్తుంది

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

2.99455040872
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు