పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మంచి నీళ్ళు తస్మాత్ జాగ్రత్త

అన్ని నీళ్ళు మంచి నీళ్ళు కావు. అన్ని మంచి నీళ్ళు రక్షిత మంచి నీళ్ళు కావు. మనం కేవలం రక్షిత మంచి నీళ్ళనే త్రాగాలి.

సృష్టిలోని 'జీవ రాసులన్నింటికి ప్రాణాధారం నీళ్ళు. అసలు నీళ్ళు లేకుంటే ఈ జీవం పుట్టేది కాదు. మనుషులకు, జంతువులకు, చెట్లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఇలా ప్రతి పనిలోను నీళ్ళు కావాలి. ఏ దేశంలో నీళ్ళు సమృద్ధిగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధి పథంలో ఉంటుంది. అంత ప్రత్యేకమైన నీళ్ళ చరిత్ర తెలుసుకుందామా! ఈ భూపటలం పై 70 శాతం నీళ్ళున్నాయి. అయినప్పటికిని నీటి కొరత వీపరితంగా ఉంది . కారణం 97 శాతం నీళ్ళ సముద్రాలలో, మంచు కొండలుగా ఉండడమే. అవి మన అవసరాలకు ఉపయోగపడేవి కావు. కేవలం 3 శాతం నీళ్ళతో మన అవసరాలన్నీ తీరాలి. అన్ని నీళ్ళు మంచి నీళ్ళు కావు. అన్ని మంచి నీళ్ళు రక్షిత మంచి నీళ్ళు కావు. మనం కేవలం రక్షిత మంచి నీళ్ళనే త్రాగాలి. రక్షిత మంచి నీళ్ళలో ఏ మోతాదులో లవణాలు ఉండాలో క్రింద పట్టికలో చూడండి.

All the parameters are in ppm (mg/L) except pH

PH: 6.5-8.5

Hardness: 200

Ca: 75

Mg: 30

Fluoride: 1.5

Chloride: 250

Nitrate: 45

Sulphate: 200

Total Solids: 500

Zn: 5.0

As: 0.01

Cu: 0.05

Cr: 0.05

Fe: 0.3

waterfilterమన భారత దేశంలో 55 శాతం ప్రజలు కేవలం నీళ్ళను త్రాగుతున్నారు. మిగతా 45 శాతం ప్రజలు మంచినీళ్ళు త్రాగుతున్నారు. ఇవి రక్షిత మంచి నీళ్ళు కావు. దీనిని బట్టి మన ప్రభుత్వాలు రక్షిత మంచి నీటి విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉన్నాయో తెలుస్తున్నది. నూటికి 80 శాతం జబ్బులు కేవలం నీటి వల్లనే వస్తాయి. అందువల్ల ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి రక్షిత మంచి నీళ్ళ చేరేటట్లు చేయాలి. తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రతి వ్యక్తి 3-5 లీటర్ల మంచి నీళ్ళు త్రాగాలి, తక్కువ మంచి నీళ్ళు త్రాగినపుడు మూత్రము పసుపు రంగులో వస్తుంది. దీన్ని గుర్తు పెట్టుకొని తగినన్ని రక్షిత మంచి నీళ్ళను త్రాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా నీళ్ళ వల్ల వచ్చే జబ్బులలో ఫ్లోరోసిస్ అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధి మనం త్రాగే నీటిలో ప్లోరైడ్ గాఢత 1. 5 ppm (parts per million) కన్నఎక్కువగా ఉన్నపుడు వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా (WHO) త్రాగే రక్షిత మంచి నీటిలో ఫ్లోరైడ్ గాఢత 0.4 - 1.0 పిపియం రేంజ్లో ఉండాలి. కాని భారత్ ప్రమాణాల బ్యూరో (BIS) ప్రకారంగా ఫ్లోరైడ్ గాఢత 0.4 - 1.5 పిపియం వరకు ఉండవచ్చు (ఒక పిపియం అంటే 1 లీ. నీటిలో 1 మి. గ్రా. ఫ్లోరైడ్ ఉన్నట్లు). ఆహారపుటలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకొవడం ద్వారా ఫ్లోరైడ్ గాఢత 1.5 పిపియం ఉన్న నీళ్ళు త్రాగవచ్చని మన శాస్ర వేత్తలు చెబుతున్నారు. త్రాగే నీటిలో ఫ్లోరైడ్ 0.4 పిపియం కన్నాతక్కువగా ఉన్నకూడా ప్రమాదమే. దంతాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి. 0.4 నుండి 1.0 ఆరోగ్య సంస్థ ప్రకారంగా (WHO) త్రాగే రక్షిత మంచి నీటిలో ఫ్లోరైడ్ గాఢత 0.4-1.0 పిపియం రేంజ్లో ఉండాలి. కాని భారత్ ప్రమాణాల బ్యూరో (BIS) ప్రకారంగా ఫ్లోరైడ్ గాఢత 0.4-1.5 పిపియం వరకు ఉండవచ్చు (ఒక పిపియం అంటే 1 లీ నీటిలో 1 మి. గ్రా. ఫ్లోరైడ్ ఉన్నట్లు). ఆహారపుటలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకొవడం ద్వారా ఫ్లోరైడ్ గాఢత 1.5 పిపియం ఉన్న నీళ్ళు త్రాగవచ్చని మన శాస్ర వేత్తలు చెబుతున్నారు. త్రాగే నీటిలో ఫ్లోరైడ్ 0.4 పిపియం కన్నాతక్కువగా ఉన్నకూడా ప్రమాదమే. దంతాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి. 0.4 నుండి 1.0 పిపియం ఫ్లోరైడ్ ఉన్నపుడు ఆ నీళ్ళు రక్షిత మంచి నీళ్ళ (ఫ్లోరైడ్ వరకు) కాబట్టి నిరభ్యంతరంగా ఆ నీళ్ళను త్రాగవచ్చు. ఫ్లోరైడ్ గాఢత 0.4-1.5 పిపియం ఉన్నపుడు ఈ క్రింది ఆహారపు అలవాట్లను పాటిసూత్రాగవచ్చును.

  1. టీ, కాఫీ త్రాగవద్దు. ఎందుకంటే అందులో కూడా ఫ్లోరైడ్ ఉంటుంది.
  2. క్యాలియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి. ఉదా. రాగి మాల్టు.
  3. విటమిన్-సి ఆహారాన్ని తినాలి. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే మంచిది.
  4. ఆకు కూరలు ఎక్కువగా తినాలి. అందులో క్యాలియం ఎక్కువగా ఉంటుంది.
  5. చింతపండు రసం వాడటం మంచిది.

పై ఆహారపు అలవాట్లతో ఫ్లోరైడ్ 1.5 పిపియం వరకున్న నీళ్ళు కూడా త్రాగవచ్చు. 1.5 పిపియం కన్నా ఎక్కువగా ఉన్నపుడు ఎట్టిపరిస్థితులలో అలాంటి నీరు త్రాగకూడదు. తద్వారా ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు, నివారణ లేదు, కేవలం రాకుండ చూసుకోవాలి. జీవితాంతం భాదపడుతూనే బ్రతకాలి. ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలు.

  1. waterdiseaseపళ్లపై పసుపు పచ్చగార ఏర్పడుంది. (ప్రారంభంలో)
  2. కాలం గడిచినా శరీరపు ఎదుగుదల ఉండదు, నిలవడం తలపైకి ఎత్తి చూడడం కూడ చేయలేరు.
  3. వేళ్ళ వంకరగా తిరుగుతాయి.
  4. వ్యాధి ముదిరినకొద్దీ వెన్నుముక నాడిమండలం దెబ్బతింటుంది.

ఇంత భయంకర లక్షణాలున్న ఫ్లోరోసిస్ వ్యాధిని రాకుండా చూసుకోవాలంటే తప్పనిసరిగా మనం త్రాగే నీటిలో ఫ్లోరైడ్ ఏమోతాదులో ఉందో పరీక్ష చేయించాలి. దీనికొరకు ప్రతి జిల్లాలో ఉండే Public Health Department ను సంప్రదించాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది క్యాన్ వాటరు కొనుక్కొని త్రాగుతున్నారు. అందులో ఫ్లోరైడ్ అనుమతి మోతాదులో ఉందో లేదో తెల్చుకోవాలి. అందుకొరకు మీరు వాటరు ప్లాంటువారిని నీటి పరీక్షల రిపోర్టు అడగండి. వారు తప్పనిసరిగా రిపోర్టు మీకు ఇవ్వాలి. diseasedpersonఇవ్వనపుడు మీరు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. భూగర్భ జలాన్ని శుద్ధిచేసే సమయంలో ఫిలైషన్, ఏరేషన్, కార్బన్ ఫిల్ట్రేషన్, ఆల్ట్రావాయిలెట్, ఓజినేషన్ 12 రకాల శుద్ధి పక్రియలు నిర్వహిస్తున్న వాటరు ప్లాంట్లు 5 శాతమైన లేవు. అరకొర శుద్ధితోనే సరిపెడుతున్నారు. ఇలా ప్రమాణాలు పాటించిన వాటరు పాంటువారికి ISI సర్టిఫికేటు లభిస్తుంది. ISI మార్కు ఉన్నవారే వ్యాపారం చేయాలి. అందువల్ల ISI మార్కు ఉన్నదో లేదో చూసుకొండి. ISI ప్రమాణాల ప్రకారం సీసాలు, క్యాన్లు, పాలి ఇధీలీన్, పాలి వినైలు కోరైడు, పాలి ప్రావిలీన్ లతో తయారైనవే వాడాలి. నాణ్యమైన బాటిళ్ళ, క్యాన్లు వాడకపోవడం వల్ల నీటిలో త్వరగా బాక్టీరియా చేరుతుంది. కాచి, చల్లార్చి వడపోసుకొని త్రాగినటైతే బాక్టీరియా లాంటి క్రిములండవు, కాబట్టి ప్రతివారు ఇది పాటిస్తే మంచిది. జనవిజ్ఞాన వేదిక చెప్పేదేమిటంటే 'స్నానానికి చన్నీళ్ళు-త్రాగడానికి వేడి నీళ్ళు". స్నానం చన్నీళ్ళ ద్వారానైన ఫర్వాలేదు, కానీ వేడిచేసి, చల్లార్చిన నీటిని త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఆ జాగ్రత్తలను పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

రచయిత: ప్రొ. కె. లక్ష్మారెడ్డి, సెల్. 9490300457

2.99193548387
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు