పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మూత్రపిండాలు

మూత్రపిండాల గురించి తదితర విషయాలు తెల్సుకుందామా!

jan8పిల్లలూ! మన శరీరంలో ఎన్నో అవయవాలున్నాయి. అందులో మూత్రపిండాలు విసర్జకావయవాలు. రాత్రి ప్రక్క తడపడం వ్యాధా? కిడ్నీలలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి? కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? తదితర విషయాలు తెల్సుకుందామా! మరెందుకు ఆలస్యం? చదవండి.

మూత్రపిండం (Kidney) మానవుని శరీరంలో ఒక మహత్వపూర్ణమైన అవయవం. శరీరములోని రక్తాన్ని శుభ్రం చేసి మూత్రమును తయారు చేస్తుంది. శరీరం నుండి మూత్రం బయటకు పంపించే పని మూత్రనాళం, మూత్రాశయం (Urinary bladder), మూత్ర ద్వారాలు ద్వారా జరుగుతుంది. మనిషి శరీరంలో సామాన్యంగా రెండు మూత్రపిండాలుంటాయి. కిడ్నీలు పొట్టకు వెనుక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా, ఛాతీకి క్రింది భాగములో ఎముకల మధ్య సురక్షితంగా చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మూత్రపిండం 10 సెం.మీ పొడవు 5 సెం.మీ వెడల్పు, 4 సెం.మీ లావుగాను, 150 - 170 గ్రా. బరువుతో ఉంటుంది. మూత్రాశయంలో 300 - 400 మిల్లీలీటర్లు మూత్రం సేకరించబడిన తర్వాత మూత్రవిసర్జన చేయాల్సిన అవసరం కల్గుతుంది.

మూత్రపిండం నిరంతరం పని చేస్తూ శరీరంలోని వ్యర్థ, విషపదార్థాలను మూత్రం ద్వారా పంపిస్తుంది. శరీరంలో నీరు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్, పాస్ఫరస్ వంటి పదార్థాలను సమపాళ్ళుగా ఉంచుతుంది. విటమిన్ 'డి' తయారు చేయడంలో కిడ్నీ సహాయం చేస్తుంది,

కిడ్నీకి సంబంధించిన ప్రత్యేక వైద్యుడు Nephrologist.

కిడ్నీ రోగాల లక్షణాలు

రకరకాల కిడ్నీ వ్యాధులకు లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. వాటిలో ముఖ్య లక్షణాలు ఏమంటే ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖం, కండ్లు వాచి ఉండడం, ఆకలి తక్కువగా ఉండడం, వాంతులు చేసుకోవడం, వికారముగా అనిపించడం, తరచుగా మూత్రం విసర్జించడం (ప్రత్యేకంగా రాత్రుల్లో), మూత్ర విసర్జన సమయంలో మంట మూత్రంలో రక్తము, చీము రావడం, మూత్రవిసర్జన కష్టంగా, బొట్టు బొట్టుగా అవటం తదితర లక్షణాలుంటాయి.

మూత్రపిండ రోగాలు

jan9మూత్రపిండాల వ్యాధుల్లో కిడ్నీ రాళ్ళ వ్యాధి (Stones) ఒకటి. ఈ వ్యాధిలో కడుపులో భరించలేని నొప్పి రావడం, వాంతులు అవ్వటం, మూత్రం (Urine) ఎర్రగా ఉండడం వంటి ముఖ్య లక్షణాలుంటాయి. మూత్రంలో కాల్షియం ఆక్సిలేట్ (Calcium oxylate) లేదా ఇతర స్పటికాలు (Crystals) ఒక దానితో ఒకటి కలయికతో కొంతకాలం తర్వాత నెమ్మదిగా మూత్రమార్గంలో కఠినమైన రాళ్ళుగా తయారవుతాయి. వీటినే 'స్టోన్స్' అంటారు. దీనికి మందుల ద్వారా చికిత్స (Conservative Medical treatment), మూత్ర మార్గంలో స్టోన్ తీసివేసే చికిత్స (ఆపరేషన్, లితోటిపి) చేస్తారు.

కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు పనిచేసే శక్తిలో తగ్గుదల కనిపిస్తుంది. డయాబెటిస్ (మధుమేహ వ్యాధి) రోగులకు కిడ్నీ Right పాడయ్యే అవకాశం ఉంది. రెండు కిడ్నీలూ పాడయినపుడు శరీరంలో అనవసరమైన పదార్థాలను విసర్జించలేక పోతాం. వీటి పరిమాణం కూడా బాగా ఎక్కువగా ఉక్కువైనపుడు కృత్రిమంగా వీటిని బయటకు పంపించే ప్రక్రియను “డయాలసిస్” అంటారు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులలో వేరే వ్యక్తుల (జీవించియున్న లేదా మరణించిన) యొక్క ఆరోగ్యమైన కిడ్నీని ఆపరేషన్ ద్వారా అమర్చే విధానాన్ని ‘కిడ్నీ మార్పిడి’ అంటారు. కొత్తగా అమర్చిన కిడ్నీ బయటది కావడం వల్ల, గ్రహీత శరీరం యాంటీ బాడీస్ విడుదల చేసి కిడ్నీకి హాని కల్గించవచ్చు. దీన్నే మెడికల్ భాషలో 'Rejection' అంటారు. రిజెక్షన్ ఆపడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. అమర్చిన కిడ్నీ మామూలుగా పని చేసేంత వరకు రోగి తన ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏ వ్యక్తికైనా రెండు ఆరోగ్యకరమైన కిడ్నీలలో ఒకటి పాడెన, లేదా ఏదైనా కారణంతో తొలగించిన రెండవ కిడ్నీ దాని యొక్క పని చేసే శక్తిని పెంచుకొని శరీరావసరాల్ని పూర్తి చేస్తుంది.

నిద్రపోయే పిల్లల్లో రాత్రి పక్క తడపడం వ్యాధి కాదు. ఈ సమస్య ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లలలో 3 రెట్లు అధికంగా ఉంటుంది. ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సున్న వారిలో 10 శాతం ఈ సమస్య చూడవచ్చు. వయస్సు పెరిగిన కొలది ఈ సమస్య దానంతటగా అదే నయమవుతుంది. ఇది ఎలాంటి వ్యాధి కాదు. కావున పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వారిపై కోపం, సూటిపోటి మాటలు అనడం లాంటివి చేయకూడదు. సాయంత్రం తర్వాత నీరు తక్కువగా తాపడం, రాత్రి పడుకోబోయే ముందు మూత్రం పోయించడం ద్వారా ఈ సమస్యను కొంత వరకు నివారించవచ్చు. వయస్సు పెరిగినా ఈ సమస్య ఇలాగే కొనసాగుతూ ఉంటే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి.

కిడ్నీని రక్షించుకొనే విధానం

మూత్రపిండ రోగాలు చాలా ప్రమాదకరమైనవి. వాటి చికిత్స కూడా ఖర్చుతో కూడిన విషయం కావున ఆ రోగాలు రాకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ 8 లీటర్ల కంటే ఎక్కువ నీళ్ళు (10-14 గ్లాసులు) తాగాలి. నియమిత పద్దతిలో వ్యాయామం చేస్తూ, శరీర యొక్క బరువును అదుపులో ఉంచుకోవాలి. 40 సం.ల వయస్సు తర్వాత ఆహారములో ఉప్పు పరిమాణం తగ్గించాలి. పొగ త్రాగడం, కిళ్ళీ వేసుకోవడం. వక్కపొడి, మద్యం సేవించడం లాంటి అలవాట్లు మాని వేయాలి. వైద్యుల సలహా లేకుండా ఎటువంటి మందులు తీసుకోరాదు. ఇలా మనం మూత్రపిండాల్ని కాపాడుకోవచ్చు.

ఆధారం: పఠాన్ బాబాద్ధీన్ ఖాన్
3.02597402597
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు