హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / మొక్కలు, జంతువుల స్పెసిమన్ లను ప్రయోగశాలాల్లో నిల్వ చేస్తారెందుకు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మొక్కలు, జంతువుల స్పెసిమన్ లను ప్రయోగశాలాల్లో నిల్వ చేస్తారెందుకు?

మొక్కలు, జంతువుల స్పెసిమన్ లను ప్రయోగశాలాల్లో ఫార్మల్లిహైడ్ ద్రావణంలో నిల్వ చేయడం వలన ఉపయోగం తెలుసుకుందాం.

4జంతువులు లేక మొక్కల నమూనాలు సాధారణంగా ఫార్మాలిహైడ్ ద్రావణంలో నిల్వ చేస్తారు. ఆయా నమూనాలను మళ్ళీమల్ళీ వాడాలంటే లా నిల్వచేసి ఉంచుతారు. ఇలా చేయకపోతే ఆ నమూనాలు చెడిపోతాయి. చెడిపోవటం అంటే కుళ్ళిపోవటం. కుళ్ళిపోవటం అంటే... సూక్ష్మజీవులు చేరటం వలన, అవి ఆయా జంతుకళోబరాల్ని ఉపయోగించుకొని పెరగటం వలన మనకు చెడు వాసన వచ్చి, ఆయా నమూనాలను సూక్ష్మజీవరహితం చేయాలి. అంటే అన్ని రకాల సూక్ష్మజీవులను చంపివేయాలి. ఫార్మల్డిహైడ్ ను ఫార్మాలిన్ గా పిలుస్తారు. ఈ ద్రావణంలో 37 శాతం ఫార్మాల్డిహైడ్ కలిసి ఉంటుంది. ఇది సూక్ష్మజీవులైన బాక్టీరియాలను, శీలీంధ్రాలను, వైరస్ లు మొదలైన వాటిని నిర్మూలిస్తుంది. అందువల్లనే మనం నిల్వ చేసే వివిధ రకాల నమూనాలు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఫార్మాల్డిహైడ్ ద్రావణంగానే కాక, వాయురూపంలో కూడా తల ప్రభావాన్ని చూపగలదు.

ఫార్మాల్డిహైడ్ సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుందని తెలుసుకున్నాం. కాని ఎలా? ఇది సూక్ష్మజీవుల ప్రోటీన్లలో ఉండే ఎమైనో, సల్ఫాధయాల్ గ్రూపులను ఫార్మాలేషన్ చేయటం ద్వారా సూక్ష్మజీవిని నిర్వీర్యం చేస్తుంది. అన్ని రకాల జీవుల్లో కేంద్రకామ్లాల్లో ఒకటైన DNA వుంటుందని మనకు తెలుసు. దీనిలో ప్యూరిన్లు, పిరిమిడిన్లు అనే రెండు రకాల నత్రజని క్షారాలు ఉంటాయని కూడా మీకు తెలుసు కదా. ప్యూరిన్ నైట్రోజన్ రింగు పరమాణువులపై ఫార్మాల్డిరైడ్ ప్రభావం చూపి సూక్ష్మజీవుల్ని చంపి వేస్తాయి.

ఫార్మాల్డిహైడ్ ద్రావణం వివిధ గాధతల వద్ద సూక్ష్మజీవ నాశనం చేస్తుంది. ఉదాహరణకు పోలియో వైరస్ ను 8 శాతం గాధత వద్ద 10 నిమిఫాల్లో కడతేరుస్తుంది. కాని ఇతర వైరస్లను నిర్వీర్యం చేయటానికి 2% ఫార్మాలిన్ చాలు. క్షయవ్యాధి కారకమైన బాక్టీరియా నాలుగు శాతం గఢత వద్ద 2 నిమిషాల్లో చనిపోతుంది. టైఫాయిడ్ ను కల్గించే సూక్ష్మజీవి 2.5 శాతం గాఢత వద్ద 10 నిమిషాలు నిర్వీర్యం అవుతుంది.

ఇంతటి శక్తివంతమైన ఫార్మాల్డిహైడ్ కూ కొన్ని పరిమితిలున్నాయి. దీనికి ఎక్కువగా గురైతే (పీల్చితే) కాన్సర్ కారకం (Carcinogen)గా కూడా పనిచేసే ప్రమాదం ఉంది. ఫార్మాలిన్ ను తాగితే ఫ్రాణాలకే ముప్పు. ఎక్కువ కాలం దీని ప్రభావానికి మన సరీరం లోనైతే ఉబ్బసం లేదా ఆయాసం వంటి శ్వాసక్రియ సంబంద ఇబ్బందులు, చర్మంపై దుద్దుర్లు, దురద రావచ్చు. దీనిని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సుమా!

3.0221402214
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు