పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విప్లవాత్మక పరిశోధనలో హైడ్రోజన్

లోహ హైడ్రోజన్ గురించి తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనల్లో హైడ్రోజన్ మీద జరిగిన పరిశోధన విప్లవాత్మకమైనదిగా చెప్పుకోదగినదని మీకు తెలుసు కదా! అది స్వతహాగా వాయువు. చల్లబరిస్తే ద్రవమవుతుంది. ఇంకా చల్లబరిస్తే ఘనాకారమవుతుంది. కానీ దానికి లోహ లక్షణాలు (metalic properties) ఉంటాయనుకోము కదా! అయితే లోహ హైడ్రోజన్ (మెటాలిక్ హైడ్రోజన్)ను హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన థామస్ డి క్యాబట్ ప్రొఫెసర్ ఇసాక్ సిల్వెరా డాక్టర్ రంగ దియాస్లు 2017 జనవరిలో తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన లోహ హైడ్రోజన్ తో లెక్కలేనన్ని ఉపయోగాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాయు స్థితిలో ఉండే హైడ్రోజన్ ను అత్యల్ప ఉష్ణోగ్రత (-269°C), అత్యధిక పీడనం (495 గిగా పాస్కల్స్) పరిస్థితులకు గురి చేస్తే లోహ హైడ్రోజన్ తయారవుతుందని ఋజువు చేశారు. ఇంతటి ఒత్తిడిని తట్టుకుని లోహహైడ్రోజన్ ను తయారు చేసేందుకు వీలుగా సహజ సిద్ధంగా లభించే వజ్రాన్ని మరింత ధృడంగా ఉండే పాత్రగా రూపొందించారు. ఈ లోహ హైడ్రోజన్ భూమి మీద ఇంత క్రితం ఎప్పుడూ లేదు. కారణం ఏమంటే అందుకు కావలసిన పరిస్థితులు ఈ విశ్వంలోనే ఎక్కడా లేవు. 1935లోనే యూగిన్ విగ్నర్, హిల్లార్డ్ బెల్హన్ టింగ్ టంగ్ అనే భౌతిక శాస్త్రవేత్తలు లోహ హైడ్రోజన్ గురించి ఊహాగానాలు చేశారు. 25 గిగాపాస్కల్స్ (వాతావరణ పీడనానికి 246000 రెట్లు) పీడనం వద్ద ఘన హైడ్రోజన్ పరమాణువుల మధ్య బంధాలు విచ్ఛిత్తి చెంది పరమాణువులు స్వేచ్ఛా స్థితిలోకి వస్తాయని, ఎలక్ట్రాన్ వాటి చుట్టూ పరిభ్రమిస్తాయని వారు ఊహించారు. కానీ తర్వాత కాలంలో లోహ హైడ్రోజన్ తయారు చేసేందుకు విగ్నర్ ఊహించిన దానికన్నా ఎక్కువ అవసరమని తెలిసింది.

లోహ హైడ్రోజన్ ఉపయోగాలు చాలా ఉంటాయి. హై స్పీడ్ మాగ్నెటిక్ లెవిటేటింగ్ ట్రెయిన్స్, MRI, మెషీన్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులకు లోహ హైడ్రోజన్ దోహదపడుతుంది అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త అధ్యాయానికి తెరలేస్తుంది ఇందుకు కారణం ఏమిటంటే, ప్రస్తుతం అంతరిక్షంలో పంపే రాకెట్లలో ప్రత్యేకమైన ఇంధనాని ఉపయోగిస్తున్నారు. దీని ఖరీదు ఎక్కువ. ఫలితం మొత్తం ప్రాజెక్టు వ్యయం భారీగా ఉంటోంది. కానీ లోపల హైడ్రోజన్ ఉపయోగిస్తే ఈ ఖర్చు బాగా తగ్గుతుంది హైడ్రోజన్ వాయువును లోహ హైడ్రోజన్ గా మార్చేందుకు అపారమైన శక్తి అవసరం. ఈ లోహాని తిరిగి అణు హైడ్రోజన్ గా మార్చితే ఆ శక్తి మొత్తం విడుదలవుతుంది. తద్వారా అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రొపెలెంట్ గా ఇది విడుదలవుతుందని సెల్వేరా తెలిపారు. అంతరిక్షంలో మరింత లోతుగా చొచ్చుకుపోయి అన్వేషణ చేసే వీలు చిక్కుతుంది.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు