పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వేలిముద్రలు

ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా వుండవు .

fingerprintsమనం సినిమాల్లో చూస్తుంటాం. అనుమానం ఉన్న వ్యక్తి వేలి ముద్రలు సేకరించడానికి హిరో ఆ వ్యక్తికి ఒక పేపర్ ఇచ్చి ఈ అడ్రస్సు ఎక్కడో చెప్పాగలరా? అని అడుగుతాడు. అతను చదివి తనకు తెలియదనో తెలిస్తే పలాన దగ్గరనో చెబుతాడు. హిరో ఆ పేపరు వెనక్కు తీసుకోని ధ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పేపరు మీద ఆ వ్యక్తి వేలిముద్రలు సేకరించిన హిరో తరువాత అతన్ని దోషిగా గుర్తిస్తాడు. ఇది సినిమా కధ మరీ ఆ వేలి ముద్రల కధ ఏమిటి ?.......

మీరు మీ చేతిని పరిశీలనగా చూడండి చేతినిండా గీతలున్నాయి కాదు. మన చేతి వెళ్ళ మీద ఉన్న వాటిని వెలిముద్రలు (Finger Prints) అంటారు. చేతి మిది ఈ గీతలు ఒక్కో మనిషికి ఒక్కో లాగా ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా వుండవు . ఈ చర్మంలోని గీతలు ఏ ఇద్దరికీ వేలిముద్రలు ఒకేలా ఉండదని మొట్టమొదటి సారి 1823 లో జాన్ ఎవానజలీస్ట్ పర్కిన్ జి అనే చేకోస్లావాకియాకి చెందిన ఒక ప్రొఫెసర్ కనిపెట్టాడు. 1896లో సర్ఎడనర్డ్ రిజల్డ్ హెన్రీ అనే ఇన్ స్పెక్టర్ జన్రల్ జల్పాయిగురి అనే ప్రదేశంలో (పశ్చిమ బెంగాల్) పని చేస్తుండేవాడు. అతను మొదటిసారి క్వేలిముద్రాలని వర్గీకరించాడు. అదే పద్ధతిని ఈ నాటివరకు హంతకులను, దొంగలను పట్టుకునేందుకు ఉపయోగిస్తున్నారు. మీ వేలిముద్రలని ఎప్పుడై నా చూసుకున్నారు? ఇంకును మీ బొటన వేలుకి పూసి తెల్లటి కాగితం మీద ముద్రవేసి చూసుకోండి మీ వేలి ముద్ర ఎలా ఉంటుందో తెలుసుకోండి. అద్దం మీద నోటి శ్వాసని ఊదండి తరువాత మీ బొటనవేలిని ఆ అద్దం మీద అద్దండి. మీ వేలిముద్రలు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి.

  1. పుట్టినప్పుడు ఏర్పడే ఈ వేలి ముద్రలు చనిపోయే దాకా మారవు.
  2. ఒకే మనిషిలో ఏ రెండు వేళ్ళకు ఒకే ముద్ర ఉండదు.

ఆధారం: సి.హెచ్. ఆనంద్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు