పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

శక్తి మరియు పర్యావరణం

జీవించడానికి శక్తి ఒక మౌళిక అవసరం. ఈ శక్తి ఉత్పత్తి, వినియోగం అనునది పర్యావరణం,

oct14జీవించడానికి శక్తి ఒక మౌళిక అవసరం. ఈ శక్తి ఉత్పత్తి, వినియోగం అనునది పర్యావరణం, ప్రజారోగ్యం పై ఎంతో ఒత్తిడిని కలుగజేస్తుంది.

వీటికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు:

కిరణజన్య సంయోగక్రియపై కాలుష్యరేణువుల ప్రభావం.

పరిచయం:

భారీ పవర్ ప్లాంట్స్, పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్య రేణువులు ఆయా ప్రాంతాలలోని మొక్కల పత్రాలపై పేరుకొని సూర్యరశ్మిని మరియు పత్రరంధ్రాలు తెరుచుకోవడాన్ని అడ్డుకుంటాయి. ఇది మొక్క సూర్యరశ్మి గ్రహించడంలో పెద్ద సమస్యగా మారుతుంది. మొక్కలు ప్రాథమిక ఉత్పత్తి దారులు కనుక రేణువుల వలన ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది.

లక్ష్యాలు:

పత్రాలపై ఘన రేణువులు పేరుకుపోవడం వలన కిరణజన్య సంయోగక్రియ రేటును కనుగొనుట.

పద్ధితి:

 • తోటలోని లేదా కుండీలలోని మొక్కలను ఈ ప్రయోగానికి ఎంచుకోవాలి.
 • మనం ఎంపిక చేరుకున్న ఒక గ్రూపు మొక్కల పత్రాలను ఉదయం, రాత్రి సమయాలలో శుభ్రం చేయాలి.
 • మరొక గ్రూపు మొక్కలను సహజ స్థితిలోనే పరిశీలించాలి. పత్రాలపై ధూళి రేణువులు చేరడాన్ని పరిశీలించాలి.
 • కిరణజన్య సంయోగ క్రియ సామర్థమును లెక్కించడానికి ‘ప్లాటింగ్ లీఫ్ డిస్క్’ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.
 • ఈ పద్ధతిని బ్రాడ్ విలియమ్ సన్స్ ఆవిష్కరించారు.

 • రెండు వేర్వేరు తరగతుల మొక్కలలో పిండి పదార్థం యొక్క పరిమాణములను సరిపోల్చాలి.

ఫలితము:

 • భారీ పరిశ్రమలైన విద్యుత్ కేంద్రాలు, సిమెంటు, బొగ్గుగనులు గల పరిసరాలు ధూళి రేణువులతో నిండి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల పత్రాలపైన ధూళి విలిచినప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటును గుర్తించడం.
 • కిరణజన్య సంయోగక్రియ రేటు తక్కువ కావడం వలన కార్బన్ స్థాపన తక్కువగా జరుగుతుంది. మానవుని చర్యలవలన వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ కావడం వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది.
 • గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి భూమిపై మొక్కలు, కార్బన్ సింక్ లుగా ఉపయోగపడతాయి. కిరణజన్య సంయోగక్రియ తగ్గితే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది.
 • ఈ ప్రయోగం వలన విద్యార్థులు వాతావరణం కార్బన్ స్థాపన ప్రాముఖ్యతను, కార్బన్ సింక్ లుగా అడవులపాత్రను తెలుసుకుంటారు.
 1. ట్రాఫిక్ పోలీసులు, ఆటో డైవర్ల సహాయం తీసుకొని వాహన కాలుష్యం వలన మిగిలిన ప్రజానీకం ఆరోగ్యానికి, వాహన కాలుష్యానికి గురైన వారి ఆరోగ్యానికి గల తేడాలు, అందుకు కారణాలు విశ్లేషించడం.
 2. వ్యర్థ పదార్థాల నుండి శక్తి ఉత్పత్తి చేయడం వలన పర్యావరణానికి మేలు చేయడం సంగతి అలా ఉంచితే ఘన వ్యర్థాల నుండి శక్తి ఉత్పాదన సమయంలో డయాక్సిన్, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనో ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, ఇతర పదార్థాల తొలిగింపుకు వేరే మార్గాలకు అన్వేషిస్తూ ప్రాజెక్ట్ చేయవచ్చు.
 3. పంట చెరకు సేకరణ వలన అడవులు, జీవవైవిధ్యానికి కలుగుతున్న హాని.
 4. వ్యవసాయానికి నేలను తయారు చేయడం, పంట మార్పిడి, రవాణా, ప్రొసెసింగ్ లలో వినియోగించే శక్తి లెక్కింపు మరియు శక్తి వినియోగం తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషణ.

శక్తి వలరులు:

 • పునరుర్ధరింపబడని శక్తి వనరులకంటే వునరుద్ధరింపబడే శక్తి వనరులైన సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి, బయోమాస్ మరియు భౌమ్య ఉష్ణ వనరుల వినియోగం సరియైనది. వీటిపైన ప్రాజెక్టులు తయారు చేయవచ్చు.
 • జీవశక్తి ఒక తరగని శక్తి. దీనిని జీవ సంబంధ ద్రవ్యరాశి నుంచి ముఖ్యంగా వ్యవసాయ, మున్సిపల్ వ్యర్థాలు, పశు విసర్జితాలు మొదలగునవి వాటి నుంచి తయారు చేస్తారు. దీని నుంచి జీవ ఇంధనం, బయోఇథనాల్, బయోడీజిల్ లు తయారుచేసే విధానాలను ప్రాజెక్టులుగా ఎంచుకేవచ్చు.

శక్తి వ్యవస్థలు:

 • సౌరశక్తి, పవనశక్తి పరివర్తన వ్యవస్థలు, భూ ఉష్ణశక్తి వనరుల వ్యవస్థలతో శక్తి ఉత్పత్తి ఎలా చేయబడునో తెలిపే ప్రాజెక్టులు.
 • సోలార్ కుక్కర్ తయారీ, సోలార్ కుక్కర్ లో ఉదయం గం. 7:00 నుండి సాయంత్రం గం. 5:00 వరకు విభిన్న నాభుల వద్ద ఉష్ణోగ్రతను కొలవడం.
 • ప్లైవుడ్ తో బాక్స్ టైపు సోలార్ కుక్కర్ తయారీ, అందులో వివిధ ఆహార పదార్థాలు ఉడుకుటకు తీసుకునే సమయం గుర్తించడం.
 • బయోగ్యాస్ ప్లాంట్ ను తయారు చేసి వేర్వేరు సేంద్రీయ వ్యర్థ పదార్థాల ద్వారా వెలువడే గ్యాస్ ను కొలవడం.
 • హరిత భవనాల అభివృద్ధికి అవసరమగు వేర్వేరు శక్తి వ్యవస్థల మద్య సంబంధాన్ని అధ్యయనం చేయడం.
 • కూరగాయలు తాజాగా ఉంచుటకు శక్తి వనరు అవసరంలేని శీతలీకరణ వ్యవస్థను నిర్మించడం.
 • జి.వో. షీట్స్ ను ఉపయోగించి గాలి మర టర్బైన్ ను తయారు చేసి డైనామోకు అనుసంధానించడము. గాలి వేర్వేరు వేగాల వద్ద గాలి మర నుంచి వెలువడే విద్యుచ్ఛక్తి సామర్థ్యం కొలవడం.

శక్తి సమాజం:

 • కుటుంబాల వారీగా శక్తి వినియోగంలో పొదుపు – ప్రయోగాత్మకంగా అధ్యయనం.
 • శక్తి వినియోగం తగ్గించడానికి అనువైన సౌకర్యాలు.
 • సహజ సహాకారంతో కార్బన్ నియంత్రణ.
 • పండుగ రోజులలో, సాధారణ రోజులలో ఇళ్ళలోగానీ, మండపాల వద్దగానీ వినియోగించే శక్తి – దాని ప్రభావం.

శక్తి ప్రణాళిక మరియు సంరక్షణ:

 • తక్కువ పెట్టుబడి, తక్కువ పర్యావరణ ప్రభావంతో శక్తి ఉత్పాదన, శక్తి వాడకానికి వ్యూహాలతో ప్రాజెక్టులు.
 • శక్తిని సమర్థవంతంగా ఎలా వాడుకోవచ్చో తెలుపుతూ ప్రాజెక్టులు తయారుచేద్దాం.
 • ఇంటిలోకానీ, సవస్థలో కానీ నీరు, విద్యుత్ మొదలగునవి శక్తులపై ఆడిట్ లు, ఫలితంగా వృధా వివరాలు తెలుసుకొని వృదా తగ్గించవచ్చు.
 • ప్రకృతి విపత్తుల నిర్వహణలో విద్యుత్, టెలిఫోన్ వాటి వాటి పాత్ర.

ఆధారం: సి. ఆనంద్

2.99726775956
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు