పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సత్యాన్వేషణలో గాంధీ మహాత్ముడు

గాంధీ మార్గాన్ని అనుసరించడమంటే సత్యాన్ని అనుసరించడమే.

gandhi

గాంధీ అంటే గర్వపడని భారతీయుడు ఉండడు. అలాగే గాంధీ అంటే ఇష్టపడని వారు ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి గాంధీ మహాత్ముని ప్రత్యేకత ఏమిటి?

గాంధీజీ అంటే గుర్తు వచ్చేది అహింస మాత్రమే కాదు. సత్యం కూడా. గాంధీ ఎప్పుడూ సత్యాన్నే ప్రతిపాదించేవాడు. సత్యాన్నే ఆచరించేవాడు. సత్యం శాస్త్రియమైనది. అందుకే అది శాంతియుతమైంది కూడా. అసత్యం హింసాపూరితమైంది. అసత్యం విశ్వాసం పై మాత్రమే మనగలుగుతుంది. అందుకే బాణామతి చేతబడి వంటి విశ్వాసాలు హింసను ప్రేరేపిస్తాయి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడన్న అసత్యం, మూడవిశ్వాసం ఎంతో హింసను సృష్టించింది. బ్రూనో, గెలీలియో వంటి సత్యాన్వేషులను వేటాడింది.

గాంధీ మార్గాన్ని అనుసరించడమంటే సత్యాన్ని అనుసరించడమే. సత్యాన్ని అనుసరించడమంటే శాస్త్రీయతను పాటించడమే. శాస్త్రియతను పాటించడమంటే సైన్సును అధ్యయనం చేయడం, ప్రకృతి ప్రసాదించిన శాస్త్ర నియమాలను అర్ధం చేసుకొని ఆచరించడం. కానీ సమాజంలో శాస్త్రీయ దృష్టి పెరగకుండా విస్వాసాలను ప్రోత్సహింస్తుంటారు కొందరు. వారు మతంతో రాజకీయం చేసేవారు రాజకియాలతో డబ్బు పోగుచేసుకునేవారు ఈ బాపతువారు. ఇలాంటి వారిని గాంధిజీ ఎప్పుడూ సహించేవారు కాదు. జాతి మత సమైక్యతను పాటించేవారు. అది గిట్టకనే ఆయన్ని కాల్చిచంపారు మతోన్మాధులు.

మరి పిల్లలూ! గాంధిని ఇష్టపడే వారిగా గాంధీ మార్గాన్ని ఆచరంచే వారంగా మనమూ సత్యమార్గాన్నే ప్రయణిద్దాం. శాస్త్రీయగా జీవిద్దాం. శాస్త్రీయంగా ఆలోచించమని మన రాజ్యాంగా నిర్మాతలు శాస్త్రీయ దృష్టిని మానవతాదృక్పధాన్ని , ప్రశ్నించే అలవాటును సంస్కరణాభీలాషనూ పెంపొందించడం ప్రతి ఒక్క భారతీయుని బాధ్యత అని రాజ్యాంగం ఆర్టికల్ 51 ఎ(హెచ్) ల్ పేర్కోన్నారు.

ఆధారం: సి. మోహన్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు