অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సర్పగంధ

సర్పగంధ

mar3.jpgసర్పగంధ మొక్కను మన సంప్రదాయ వైద్యలైన ఆయుర్వేదం, యునానీల్లోనే గాక పల్లెల్లో ప్రజలు విరివిగా అనేక రకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తూన్నారు. సంప్రదాయ  వైద్యంలోనే గాక ఆధునిక వైద్యపద్ధతుల్లో కూడా ఈ మొక్కను ఎక్కువగా వాడుతారు. దీన్ని తెలుగులో పటలగంధ లేదా పాటలగని అని కూడా అంటారు. ఇంగ్లీషులో మాత్రం దీనికి పామువేరు మొక్కని పేరు. దిన్ని సాధారణంగా భారతదేశపు పాము వేరు (Indian snake root) మొక్కగా పిలుస్తారు. దీని శాస్త్రయ నామం రావుల్ఫియా సర్పే౦టైనా (Rauwolfia Serpentina). దీనికి ఆపేరు పెట్టడానికి కారణం తెలుసా? లియోనార్డ్ రావుల్ఫ్ అనే 16వ శతాబ్దపు జర్మన్ డాక్టర్, పరిశోధకుని పేరు మీద దీనికి పేరుపెట్టారు. హిమాలయ పర్వత సానువుల దిగువ భాగంలో సముద్ర మట్టానికి 1300-1400 మీటర్ల ఎత్తులో పెరిగే మొక్క ఇది. సర్పగంధ భారతదేశంలో అంతటా వ్యాపించి ఉన్న చిన్న గుల్మము (herb). రావుల్ఫియ ప్రజాతిలో వందకు పైగా ఉష్ణమండల ప్రాంత అడవుల్లో పెరిగే జాతులున్నాయి. ఇది బహువార్శికం. తళతళమేరీ సె ముదురు ఆకుపచ్చ ఆకులు కాండం పై వలయాల్లో ఉంటాయి. పుష్చగుచ్చం కొమ్మలకోనల్లో ఉండే తెల్లటి పూలు పుస్తాయి. కొన్ని జాతుల్లో ఊధారంగు పూలు ఉంటాయి.

సర్పగంధ మొక్క వేరునుంది నిష్కర్షచేసి తీసిన రసాన్ని జీర్ణసంబంధ వ్యాధుల్లో ముఖ్యంగా డయేరియా, డిసెంట్రి (నీళ్ల వేరేచానాలు) తగ్గించడానికి వినియోగిస్తారు. ఇది మన పేగుల్లో పెరిగే నట్టులను బాగా నిర్మూలించుతుంది. యింకా ఇతర మొక్కల రసాలతో కలిపి కలరా, పేగుల్లో వచ్చే వ్యాధుల నివారణలో వాడతారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మొక్క రక్తపోటు (Hypertension) ను అదుపులో ఉంచడంలో బాగా ఉయోపడుతుంది. దీని పేరుకు తగ్గట్టే పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. మానసిక వ్యాధులు తగ్గించడంలో కూడా సర్పగంధ ప్రధానపాత్ర పోషిస్తుంది. దీనికి మత్తుగుణాలు ఉండటం వలన మానసిక ఉద్రేకాలను తగ్గించి మానసిక వ్యాధుల చికిత్సలో వాడతారు. ఈ మొక్క వేర్లలో అల్కలాయిడ్స్ అనే రసాయనాలు ఉండటం తో అనేక రకాల వ్యాధులు నివారణకు ఉపయోగపడుతుంనాయి నితిల్ ప్రమాదమైన అల్కలాయిడ్ రిసర్పయిన్. వేర్లు, కాండం ఆకులు అన్ని భాగాల్లో ఉంటుంది కాని వేర్లలో 90శాతం పైగా అల్కలాయిడ్ ఉంటాయి.ఇంకా అల్మసిన్ అజ్మాలైన్ రావుల్ఫినైన్ , సర్పెంటైన్ అంటి ఇతర అనేక అల్కలాయిడ్లు కూడా సర్పగంధ మొక్కలో ఉంటాయి. విత్తనాలు కాండం వేరు కటింగ్స్ ద్వారా దీని పెంచవచ్చు. సర్పగంధ మొక్క 18మాస వయసున్నపుడు ఎక్కువ మోతాదులో ఆల్కలాయిడ్లును సంగ్రహించావాచు.

భారతదేశంలో నేపాల్ లో రక్తపోటు కు దీనిని మందుగా వాడుతారు . కేంద్ర నాడి వ్యవస్ధకు సంబంధించిన అనేక మానసిక రుగ్ముతలను తగించేందుకు సర్పగంధను చైనా , ఆఫ్రికాలలో కూడా సాంప్రదాయకంగా వాడుతున్నారు. మానసిక వ్యదులైన ష్కిజోఫ్రినియా నిద్రలేమి, మానసిక ఉద్రిక్తత, ఏదో జరిగిపోతుందనే భయాలకు ఇది మంచి ఔషదం. దీని వేరు పొడిని ఒక చెంచా కప్పు వేడి పాలతో కలుపుకొని పడుకునే ముందు తాగితే నిద్రలేమి నుండి ఉపశమనం కలుగుతుంది . తేనే తో కలిపి దీని వేరు పొడిని ప్రతి రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే మానసిక ఆందోళనలనుండి మంచి ఉపశమనం కలగుతుంది.

ఆధారం: ప్రొ. కట్టా సత్యప్రసాద్

చివరిసారిగా మార్పు చేయబడిన : 3/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate