অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అగ్గి తొక్కడం

అగ్గి తొక్కడం

(రూయా ఆసుపత్రి, ఎదురుగా పెద్దక్షరాల్తో బుర్న్స్ వార్డ్ అనే బోర్డు. రఘురాం తాత,నానమ్మ, వంశీ లోనికి పోతున్నారు)

నర్స్:- తాత !అబ్బాయిని బయటే పెట్టి మీరు మాత్రం లోనికి రండి .

నానమ్మ :- అమ్మ, వీడి స్నేహితురాలు కాలిన గాయాలతో లోపాలుండి, చూద్దామని.

నర్స్:- చిన్నపిల్లలు బుర్న్స్వార్డులోకి  రారాదమ్మ, చూసి వాళ్ళు తట్టుకోలేరు. ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా వుంది.

(వంశీని బయటనే కూర్చోబెట్టి, తాత, నానమ్మ వాళ్లిద్దరూ వార్డులోనికి వెళ్ళారు )

(ముప్పైకి పైగా మంచాలు వేసున్నాయి అక్కడ , తెల్లని దోమతెరల లోపల కాలిన గాయాలతో పేషంట్లు కన్పిస్తున్నారు.)

నర్స్:- అవ్వరు కావాలి మీకు ?

తాత :- విజిత అని ఆరేళ్ళమ్మాయి ..?

నర్స్:- ఓ ..! నిన్న రాత్రి అగ్నిగుండంలో పది పోయిందని తీసుకొచ్చారే...!

నానమ్మ :- ఆ ! అవునమ్మ! ఎలా వుంది పాపకు ?

(నర్స్ వారిని తీసుకొని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైపు నడుస్తుంది )

నర్స్:- థర్డ్ డిగ్రీ బుర్న్స్! మూడు రోజులు గడిస్తే కానీ ఎం చెప్పలేం ..!

నానమ్మ:- అయ్యో! భగవంతుడా ...!

నర్స్:- ఇంతకు ప్రమాదం ఎలా జరిగింది ?

తాత:- గ్రామదేవత జఠరని, ఊర్లోనే నిప్పుల గుండం తొక్కడానికి వెళ్ళింది. పావడ కళ్ళకు అడ్డుపడి నిప్పుల్లో పడిపోయింది.

నర్స్:- పసిపిల్లతో నిప్పులు తొక్కించడం ఏమిటి?మూర్ఖత్వం కాకపోతే ?

నానమ్మ :- అది ఆచరమమ్మా!

నర్స్:- ఆచారమే! గ్రహచారమా ?

తాత:-బతికుంటే వాడే భగవంతుడు. బ్రతకాలి తపనే భగవత్ భావన,బలికోర్ ఇలాంటి ఆచారాలనే మనాలి?

నర్స్:- మూఢాచారాలంటే ఇవేగా! వీటివల్ల మహూన్నతమైన మన భరత సంస్కృతి అనాగరికమనే మచ్చ తెచ్చుకొంటుంది.

మంచంపై అచేతనంగా విజిత,ప్రక్కనే నెల పై విజిత తల్లి కామాక్షి. ఏడ్వటానికి కన్నీరు మిగలలేదేమో, నిర్లిప్తంగా చూస్తూ వుంది.

నర్స్ :-(దోమ తెర తీసి చూపుతూ )కుడివైపు పెద్దగా కలలేదు, ఎడమవైపు నిప్పులో పడినట్లుంది. ఆ వైపు గాయాలు చాల తీవ్రంగా వున్నాయి. ''౯థ్రఒంగి చుసిన రఘురావు గారికి కాలిన అమ్మాయి చెవి దొప్ప మాత్రం మాంసపు ముద్దలా, గోధుమ రంగులో కన్పించింది. నీటి సుడులతో మసక బారడంతో కళ్ళు తుడుచుకొంటూ ...!)

తాత:- విజ్జి!నొప్పిగా వుందా తల్లి?

నర్స్:- కాలిన గాయాల తీవ్రతకు, నాడిపోగులు దెబ్బతిన్నట్లు వున్నాయి. అందుకే పాపకు నొప్పి తెలియడం లేదనుకొంటాను.

తాత:- పాపా కన్ను పైన గాజు క్లాత్ కప్పి వుంచారెందుకు?

నర్స్:- కన్ను పైన కూడా పెద్ద బొబ్బలున్నాయి. బహుశా వేడి బుడిదో, నిప్పు రేణువులో పడినట్లున్నాయి..!

తాత:- కార్నియా దెబ్బ తినలేదు కదా?

కామాక్షి:- (శోకం కట్టలు తెంచుకొంది, రెండు చేతులతో తలనుబాదుకుంటు) తాత దానీఙ్కి చూపు రావటం కష్టమని, డాక్టర్ ఇప్పుడే చెప్పి వెళ్లారు. నేనేం పాపం చేశాను తాత?(గట్టిగ అరవసాగింది )

(కామాక్షిని పొదివి పట్టుకొని బయటకు తీసుకొని వెళుమా...!)

తాత:- నర్సమ్మ ! నా భార్యకు, పాపను కనిపెట్టుకొని ఉండమని చెప్పమ్మా!

(అరగంట పైనే కామాక్షి దుఃఖం ఆగలేదు ఆపై నెమ్మదిగా లేచి, రఘురాం గారివైపు చూస్తూ...!)

కామాక్షి:- తాత!నా బిడ్డ చచ్చిపోతే మేలేమో తాత!

తాత:- ఛ! అవేం మాటలు, తల్లిగా ఆలా కోరుకోవచ్చా?

కామాక్షి:- చూపులేకుండా! వికారమైన ఆకారంతో లోకంలో ఆలా బతుకుంది?

(కామాక్షి మనస్సులో ఏ మూలకో ఆశ తన కూతురు తిరిగి ఇంటికి వస్తుందని)

తాత:- ప్లాస్టిక్ సర్జరీ, కార్డియా రిప్లేసెమెంట్ ద్వారా విజిత ఇంటికి ఆరోగ్యాంగా వతుంది ధైర్యంగా వుండు! ఇద్దరు లేచి డాక్టర్ గదివైపు నడుస్తున్నారు.)

కామాక్షి:- డాక్టర్ గారు, ఆయన రఘురాం గారు నాకు తండ్రిలాంటి వారు.

డాక్టర్:- కూర్చోండి! ప్రమాదం జరిగిన వెంటనే పాపకు ప్రథమచికిత్స చేసింది మీరే కదా!

తాత:-ఔనండీ!

డాక్టర్:- కాలిన గాయాలకు నూనె పూయక పోవడం గుడ్డతో కానీ, దూదితో కానీ తుడవడం లేదా కప్పకుండా, గాయాలపై చల్లని నీరు పోయడం వలన మీరు పాపప్రణాలను నిలిపారని మీకు తెల్సునా?

తాత:- కాలిన గాయాలపై చల్లని నీరు పోస్ట్ బొబ్బలు రావని చదివాను. పాపా పరిస్థితి ఎలా వుంది?

డాక్టర్;- ప్రస్తుతానికి క్రిటికల్ అనే చెప్పాలి. కాలిన గాయాలతో సెకండరీ ఇన్ఫెక్షన్ లు రాకుండా యాన్తి బయాటిక్స్ వాడుతున్నాము.

కామాక్షి:- అంటూ, మైలో తగిలుంటుంది సార్! వేల మంది గుండం తొక్కుతుంటే నా బిడ్డకే ఇలా జరిగింది.

తాత:- అంటూ మైల అనేవి మనం పెట్టుకున్న కట్టుబాట్లు మాత్రమే కామాక్షి! పెద్ద వాళ్ళు కాబట్టి మిగిలిన వారికీ కాళీ వుండదు.

డాక్టర్:- సాధారణంగా ఒక వస్తువు కలడం, మూడు విశాలపై ఆధారపడుతుంది. అవి 1 ) మండే  పదార్థం  2 ) మండించే పదార్థ స్వభావం  3 ) జ్వలనోష్టం.

తాత:- పదాలతో చర్మ మందంగా ఉండటం, స్నానం చేసి రావడం వల్ల తేమగా ఉండటం వల్ల కాళీ వద్ద చర్మం తొందరగా కలదు.

డాక్టర్:- అవునండి. కర్రబొగ్గులో పై పోరా మాత్రమే మండుతుంది. లోపలి భాగానికి ఆక్సిజన్ అందుబాటులో లేక చల్లగాలి ఉంటుంది. కాబట్టి తేమ తగలగానే నిప్పుకణిక పై పొరలోని జ్వలనోష్టం పొందే లోపుగా మనం పాదాలను లేపేస్తాం కదా!

తాత:- ఇలాంటి సైన్స్ చిట్కాలను వాడుకొని, ప్రజలను మూఢనమ్మకాల వైపు మార్చడం దారుణమంది!

కామాక్షి:- చదువురాని మాకివ్వాన్ని ఎలా తెలుస్తాయి. నా చిట్టితల్లిని నాకెవరు తిరిగి తెచిస్తారు?(ఏడ్వసాగింది )

డాక్టర్:- అమ్మ! ప్రమాదం దగ్గరకు పోరాదు,నీవు నీ బిడ్డకు ధైర్య చెప్పు, పలుచటి పానీయాలు ఎక్కువగా తప్పుతూ వుండు. మీ అమ్మాయిని కాపాడే భాద్యత నేను  తీసుకుంటాను.

తాత:- (నమస్కరిస్తూ ) అందుకేనండి ' వైద్యో నారాయణ హరి ' అన్నారు.

(కామాక్షి, రఘురాం తాత బుర్న్స్ వార్డు వైపు నడవసాగాడు)

ఆధారము: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate