অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కొబ్బరి చేసే మేలు

కొబ్బరి చేసే మేలు

కొబ్బరితో వంటలు ఎంతో రుచి! కొబ్బరి నీళ్ళు దాహం తీర్చడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి! ఇలా కొబ్బరిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం.

jan017.jpgతరచూ కొబ్బరిని తినడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చు. కొబ్బరిలో “మోనోలారిన్” అనే ఉపయోగపడే కొవ్వు ఉంటుంది. ఇటువంటి కొవ్వే తల్లిపాలలో కూడా ఉంటుంది! అందుకే చిన్న పిల్లలకి, జబ్బుతో మంచం పట్టినవారికి కొబ్బరి నీళ్ళు ఇస్తారు. కొబ్బరితో చేసిన ఆహార పదార్థాలు తినే వారిని పరిశీలిస్తే వారిలో ఉదరం, గుండె, ప్రోస్టేటు (పురుషులలో వచ్చే వ్యాధులు) వ్యాధులు చాలా తక్కువగా ఉన్నట్టు పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

కొబ్బరిలో పీచుపదార్థం ఎక్కువ. అందుకే ఇది పెద్ద ప్రేవులకి మంచిది. అనేక రకాల హాని చేసే బాక్టీరియా, ఫంగై, వైరస్ జాతులకు ఇది శత్రువు. థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయని వారు కొబ్బరితో చేసిన ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంథికి కలిగే అనర్థాలు తగ్గుతున్నట్లు పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.

కేరళలో వంటకాలను ఎక్కువగా కొబ్బరి నూనెతో తయారు చేస్తారు. అదిగాక వారు విరివిగా తలకు కొబ్బరినూనె ఉపయోగిస్తారు. కొబ్బరినూనె తలలో కలిగే “డాండ్రఫ్” (ఫంగస్ వలన తలలో పొట్టురాలడం)ను నాశనం చేసి వెంట్రుకల కుదుళ్ళను రక్షిస్తుంది.

కొబ్బరి కేవలం శక్తినే కాదు, క్రొవ్వులో కరిగే విటమిన్ 'ఇ' వంటి పదార్థాలను శరీరం సులభంగా గ్రహించేటట్టు చేస్తుంది. జీవరసాయనిక చర్యలను మెరుగు పరచి, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అమెరికాలోని కొబ్బరి పరిశోధన కేంద్రం ప్రెసిడెంట్ డా|| బ్రూస్ ఫ్రెఫ్ చెబుతున్నారు. మనదేశంలో కూడా “కోకోనట్ డెవలప్ మెంట్ బోర్డు” సంస్థ కొబ్బరి అభివృద్ధి, లాభాల మీద విశేష పరిశోధనలు చేస్తోంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే www.coconutboard.gov.in అనే వెబ్ సైట్ లో చూడవచ్చు.


ఆధారం: కంచనపల్లి వెంకట కృష్ణారావు.



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate