অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గణిత గమ్మత్తులు

గణిత గమ్మత్తులు

mathsవేసవి సెలవులు కదా! ఇల్లంతా పిల్లలతో చాలా సందడిగా ఉంది.

శారద: అబ్బబ్బా! సెలవులు వచ్చాయంటే చాలు, ఈ పిల్లల గోల తట్టుకోలేము.

మాధవ: అలా అంటే ఎలా శారదా, ఇన్ని రోజులు బడికి వెళ్ళారు కదా!

శారద: సాయంత్రం అయితే చల్లగా బయట ఆడుకుంటారు, కానీ మధ్యాహ్నం సమయం, వాళ్ళు పడుకోరు నన్ను కాసేపన్నా విశ్రాంతి తీసుకోనీరు కదా!

మాధవీ: అందుకే మన బాబ్జీని రమ్మన్నాను. తను గణిత గమ్మతులతో పిల్లల్ని సరదాగా ఆడిస్తాడు. అదిగో మాటల్లోనే వచ్చేశాడు.

బాబ్జీ: అలాగే...  అలా కూర్చుందాం రండి. పాచికలు ఉన్నాయికదా (dice) ఇలా అందుకో దీనితో ఒక గమ్మత్తు చేద్దాం.

మొదట దయా ఈ రెండు పాచికలను కళ్ళమూసుకుని దొర్లిస్తాడు, వేద వాటిపై అంకెలను కాగితంపై రాసి ఉంచుతాడు. తరువాత దయ, వేదాని కొన్ని ప్రశ్నలను అడిగి చివరి సమాధానం ద్వారా మొదట పాచికలపై వచ్చిన అంకెలను చెప్పేస్తాడు. ఇక ప్రారంభిద్దామా...

దయ: కళ్ళమూసుకుని పాచికలు వేస్తాడు.

వేదా: వాటిని క్రమవరుసలో రాసి ఉంచుతాడు.

దయ: మొదటి పాచికపై వచ్చిన అంకెని రెట్టింపుచేయి, వచ్చిన సంఖ్యంని 5 కలుపు, వచ్చిన ఆసంఖ్ని 5 తో హెచ్చవేయి, ఆ శబ్ధానికి రెండవ పాచికపై గల అంకెని కలుపు వచ్చిన సంఖ్య నుండి 25 ని తీసివేయి, సమాధానం పైకి చెప్పు.

వేదా: ముపై ఆరు (36).

దయ: నేను కళ్ళమూసుకుని దొర్లించిన పాచికలతో మొదటి అంకె 3, రెండవ అంకె 6

వేదా: (దాచివుంచిన కాగితం చూచి) అరె.సరిగ్గా సరిపోయింది.

మిగిలిన పిల్లలు: భలే.. భలే మామయ్యా, బాగుందీ ఆట. భలే గమ్మత్తుగా ఉంది!

బాబ్జీ: అయితే. ఇక మీరు జట్లుగా మారి ఈ ఆటని ఆడుకోంది.

పిల్లలు: అలానే మామయ్య, రేపు ఇంకొక కొత్త ఆట నేర్చించండి.

శారద: హమ్మయ్య! తమ్ముడూ. ఈ రోజు ప్రశాంతంగా గడిచింది. పిల్లలకి గణిత ప్రక్రియలపై ఆసక్తి పెరిగింది. రేపు ఇంకా మంచి మంచి ఆటలు నేర్పించు.

పిల్లలు: మామయ్యా. కొత్త ఆట నేర్చుకోవడానికి తయారుగా వున్నాము, నేర్చించండి.

బాబ్జీ: అలాగే రండి.. ఇలా కూర్చోండి.

జ్యోత్స్న: అలాగే మామయ్య, పాచికపై 1,2,3,4,5,6 చుక్కలు గల ముఖాలున్నాయి.

బాబ్జీ: ఎదురెదురు ముఖాలపై గల చుక్కలను గమనించి, ఎదైన చెప్పగలరా.

వేదా: ఆ మామయ్య ఎదురెదురు ముఖాల మీద చుక్కల సంఖ్యను కూడితే 7 వస్తుంది.

దయా: అవును మామయ్య...

బాల్టీ: గుడ్... ఇక ఆట గురించి వివరిస్తాను వినండి... ఇద్దరేసి పిల్లలు పాచికతో 21 అనే ఆట. మొదట పాచికను ఒకరు దొర్లించి పైన వున్న ముఖంమీది సంఖ్యతో ఆట వెుదలు పెడతాడు. తరువాత ఆటగాళ్ళు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరుగా ఆ పాచికను మరొక ముఖంపై వచ్చేటట్లు (90°కోణం మాత్రమే) తిప్పతారు. అలా తిప్పగా వచ్చిన పై ముఖం మీది చుక్కల సంఖ్యను మొదటి సంఖ్యకు కలుపుతూ పోతారు ఈ మొత్తం ముందుగా ఎవరు 21 కి సమానం చేస్తారో వారు ఆట నెగ్గినట్లు. ఇక ఆటను జట్ల జట్లుగా విడిపోయి ఆడి నెగ్గండి చూద్దాం.

పిల్లలు: అలాగే మామయ్య. ఇంకా ఈ ఆటలో ఏమన్నా కిటుకులు ఉంటే తెలపండి.

బాబ్జీ: పాచికను దొర్లించినపుడు యాదృచ్చికంగా పైన వచ్చిన సంఖ్చను బట్టి ఆటగాళ్ళు నెగ్గడం, ఓడటం తెలుస్తందా? ఏ సంఖ్యపైకి వస్తే మొదటి ఆటగాడు నెగుతాడు ఓడించాలంటే ఎలా ఆడాలి? అవతలి వారిని ముప్పతిప్పలు పెట్టే చిట్కాలు ఏమన్నా వున్నాయా! ఇలా... ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని ఈ ఆట చూడండి భలే గ్గమ్మత్తుగా ఉంటుంది.

దయ, వేదా, జ్యోత్న, సింధూ: మేము మీరు చెప్పినట్లు ఆడుతాము. ఒకవేళ ఆటకిటుకును కనిపెట్టలేక పోతే మీరు వివరించాలి మామయ్య.

బాబ్లీ: అలాగేరా ఆడండి ముందు మీ మెదళ్ళకు పదును పెట్టండి.

వివరణ: మొదటి పాచికపై విలువ X, రెండవ పాచికపై విలువ y అయినట్లయితే రెండంకెల్ని ఓ సంఖ్య xy గా చూపాలనుకుంటే ఆ సంఖ్య విలువ 10X+y అవుతుంది.

సూచన ప్రకారం X ను రెట్టింపు చేయమన్నారు. 2X అవుతుంది. రెండవ సూచన దానికి 5ను కలపమన్నారు. (2X+5) అవుతుంది. వచ్చిన మొతాన్ని 5తో గుణించమన్నారు (2X+5)5 అప్పడు దాని విలువ 10X+25 అవుతుంది. దీనికి రెండవ పాచికపైవున్న విలువనికలుపగా 10X+25+y అవుతుంది. ఈ మొత్తం నుంచి 25 ని తీసివేయగా 10X+25+y-25 అనగా 10X+y వస్తుంది. అనగా రెండంకెల సంఖ్య వస్తుంది. రెండవ పాచికపై ఉన్న అంకె y' ని సూచిస్తే, మొదటి పాచికపైనున్న అంకె 'X' ను సంఖ్యలోని ఒకట్లస్టానం, పదులస్థానం సూచిస్తుంది.

రచయిత: టి. తులసి, సెల్. 9493047625© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate