অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

టూత్ పేస్టు కథ

టూత్ పేస్టు కథ

toothpaste1నేను లేనిదే మీకు దినం ప్రరంభామవదు. నన్ను వాడకుండా ఏమి తినలేవు. నన్ను ఉపయోగించకపొతే నీ దగ్గరకు ఎవరూ రారు? నేనెవరిని? తెలుసా? నేనే “టూట్ పేస్టు” ను! ఉదయాన్నే బ్రష్ మీదో చేతిమీదో నన్ను వేసుకొని పళ్ళు తోముకుని మీరు అల్పాహారం ఆరగిస్తారు. రోజంతా హయిగా వుంటారు. అవునా ! మరి నాగురించి మీకు పూర్తిగా తెలుసా? చెబుతాను. చదవండి.

నాపుట్టుక క్రీస్తుపూర్వం 3000-5000 సం.ల మధ్య ఈజిప్టు దేశంలో జరిగింది.

అప్పుడు వారు ఎద్దుల గిట్టలు, కాల్చిన గుడ్డు పెంకు, రాతి పొడి నీరు ఉపయోగించి నన్ను తయారుచేసేవారు. క్రి.శ 1000 తో వర్షయా దేశంలో కాల్చిన నత్తగుల్లల గవ్వలతో, జిప్సంలతో నన్ను పేస్టులాగా తయారుచేసారు. కానీ అప్పుడు నన్ను అత్యధిక ధనవంతులు మాత్రమే వాడేవారు. సామన్యులు కాల్చిన పొత్తుతో ఉప్పు కలిపి పళ్ళు పొట్టుతో ఉప్ప కలిపి పళ్ళు తోముకునేవారు. toothpaste2తరువాత 18వ శతాబ్దంలో ఇంగ్లండు దేశస్తులు బోరాక్స్ ను, శుభ్రపరిచే పొడిని కలిపి నన్ను తయారుచేసి పింగాణి పాత్రలలో నింపి ప్రజలకు అమ్మటం మొదలు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నన్ను సీసపు ట్యూబ్ లలో నింపి అమ్మేవారు. కొన్నాళ్ళకు మైనము, పేపరు, ప్లాస్టిక్ పూత పూసిన సీసపు ట్యూబులలో అమ్మేవారు. 20వ శతాబ్దంలో నన్ను ప్లాస్టిక్ ట్యూబులలో నింపి అమ్ముతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది నన్ను వాడుతున్నారు. వివిధ రకాల కంపెనీలు రకరకాల పేర్లతో బ్రండ్లతో , రంగులతో నన్ను అమ్ముతున్నారు. 1950 లో డా విలియం ఈగిల్ పళ్ళ తరుగుదలను ఫ్లోరైడ్ సమర్ధవంతంగా అరికడుతుందని కనుక్కున్నా తరువాత నారూపు పూర్తిగా మారిపాయింది.

నేను మీ పళ్లను ఎలా కాపాడతాను ? నా ప్రభావం ఏమిటి ? ఇవి తెలుసుకోవాలంటే మొదట మీ నోటి గురించి తెలుసుకోవాలి, మీ నోరు దాదాపు 500 రకాల సుక్ష్మజీవులతో కూడి వుండే ఒక ’జూ’ (Zoo) లాంటిది. వీటిలో ముఖ్యమైనది స్టెప్టోకాకస్ మ్యూటస్. ఈ సూక్ష్మజీవి పళ్ళమధ్య మిగిలిపోయిన ఆహారాన్ని తిని బ్రతుకూతూ బంకలాంటి పొరలు (Plaque) తయారుచేస్తాయి. మరియు అమ్మాన్ని (acid) ఆవిరయ్యే స్వభావం కల గంధకం (Volatile Sulphur) అణువులను తయారు చేస్తాయి. ఆమ్లం పళ్ళ పై వున్న ఎనామల్ ను తినివేసి రంధ్రాలను (Cavity) ఏర్పరుస్తుంది.

గంధకం అణువులు దుర్గంధాని వెదజల్లుతాయి. ఇదీ స్ధూలంగా మీనోటిలో జరిగే తంతు. మరి నేనేమి చేస్తానో తెలుసా?

  1. బ్రష్ సహాయంతో నీవు వళ్ళు తోముకున్నప్పుడు నేను పళ్ళ మధ్య దూరి అక్కడ మిగిలిపోయిన ఆహారపు ముక్కలను, పళ్ళ పై ఏర్పడ్డ పొలుసులను తొలగించి పళ్ళు మెరి సేటట్లు చేస్తాను.
  2. నాలో వున్న ఫోరైడ్ ఆమ్లం వలన ఏర్పడ్డ గుంతలను పూడ్చి రాబోయే ఆమ్ల దాడిని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తుంది.
  3. నాలోని గ్సైలిటాల్, కృత్రిమ ట్రైక్లోసం పళ్ళలో బాక్టీరియా తయారిని కాకుండా అరికట్టుతుంది.
  4. నాలో వున్న శుభ్రపరిచే పొడి (కల్షియుం పోస్పేట్, అల్యూమినా, కల్షియం కార్బోనేట్) సిలికా, పళ్ళను శుభ్రపరుస్తాయి.

మరి నాలో ఏఏ పదార్ధాలు వున్నాయో మీకు తెలుసా?

  1. నేను ట్యూబులో గడ్డకట్టకుండా వుండేందుకు గ్లిసరిన్, గ్సైలిటాల్ లాంటి పదార్ధాలు (Humectants) కలుపుతారు. ఇవి నా రూపాన్ని కాపాడుతాయి.
  2. చిక్కదనం కోసం కారిజినన్ సెల్లులోన్ లను కలుపుతారు.
  3. నేను చెడిపోకుండా, నాలో సుక్ష్మ జీవులు వృద్ధికాకుండా ఉండేటందుకు సోడియం బెంజాయేట్, మిధైల్ పార బమ్ ఈధిలై పారబం లాంటి సంరక్షకాలు జతపరుస్తారు.
  4. నురగ వచ్చి బ్రష్ తో పాటు కాసేపు నోటిలో వుండేందుకు మరికిని పోగొట్టే పదార్ధాలు (detergents) ను సోడియం లారైల్ సల్ఫేట్ (SLS)ను కలుపుతారు. ఇవి కాస్త చెడ్డ రుచిని ఇస్తాయి. కనుక నాకు రుచిని వాసనను ఇచ్చే రంగురంగుల తీపిని కలుపుతారు. (శాక్రిన్)
  5. నావల్ల మంచితో బాటు చెడు కూడా ఉంది. రంగు కోసం కృత్రిమమైన అద్దకపు రంగులు టైటానియం ఆక్సైడ్ లాంటివి కలుపుతూ నురగరావడానికి, ఎక్కువ శుభ్రం చేయడానికి నాకు గాడమైన డిటర్జంట్ లు , ఎస్ ఎల్ ఎన్ లు కలుపుతున్నారు. ఇవి నోటిపూత (Mouth ulsers) కాన్సర్ గుల్లలు రావడానికి కారణమవుతున్నాయి. దాదాపు 20% ప్రజలు నోటి పూతతో, కాన్సర్ రంధ్రాలు (sores) తో బాధపడుతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి. ఎంత ఎక్కువ రుచి, వాసనా వుంటే అంత ఎక్కువగా డిటర్జంట్ లు, ఎన్ ఎల్ ఎన్ లు వున్నాయని అర్ధం.

నన్ను కొనేటప్పుడు రిలేటివ్ డెంటల్ అబ్రేసిబిలిటి (Relative Dental Abbrasibility) RDA ను గమనించి కొనండి. ఎంత తక్కువ RDA వుంటే అంత మంచి పేస్టు అన్నమాట. ఉదాహరణకు సాధారణ కాల్గేట్ లో 218 ఆర్ డిఎ వుంది. కొన్ని టూట్ పేస్టు కంపెనీలు ఎక్కువ మోతాదులో రసాయనాలు కలపడం వలన నేను మీ పళ్ళ పై వున్న ఎనామిల్ ను తొలగించి మీపళ్ళు పసుపురంగులో మార్చి ఏమి తిన్న మిపళ్ళ జివ్వుమని లాగేటట్లు చేస్తున్నారు. కనుక పళ్ళకు తక్కువ హానికరమైన సాధారణ పేస్టులనే వాడండి.

వేపపుల్ల కానుగ పుల్లలతో పళ్ళు తోముకునే పాటశాలలో ఉచితంగా బ్రష్ పేస్టు ఇచ్చి పిల్లలకు నన్ను అలవాటు చేస్తున్నారు. వ్యాపారం పెంచుకుంటున్నారు. హానికరమైన పెస్లుల వలన రకరకాల పళ్ళజబ్బులు వస్తున్నాయి. పళ్ళ డాక్టర్ల (Dentists) అవసరం పెరుగుతోంది. నా పై ఆధారపడి ఇంత మంది వున్నారు మరి, ఇదండీ నా సంగతి. ఉంటాను మరి శెలవా.......

ఆధారం: యుగంధర్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate