অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మన రత్నం ...కల్పనా చావ్లా

మన రత్నం ...కల్పనా చావ్లా

280.jpgమన దేశానికి చెందిన కల్పనా చావ్లా 2003 లో ఒక కొలంబియా శ్రేణి షటిల్ లో అంతరిక్ష అంతరిక్ష యాత్రకు వెళ్ళింది. కాని ఆమె మళ్ళీ తిరిగి రాలేదు.

ఆమె తన అంతరిక్షయాత్రను పూర్తి చేసుకొని భూమికి తిరిగి వస్తుండగా నేలకు 61 కిలోమీటర్ల ఎత్తులో షటిల్ కి నిప్పుంటుకుని అది తునాతునకలై గాల్లో కలిసిపోయింది. తను ఏ చుక్కల లోకాన్ని, ఏ అంతరిక్షాన్ని అమితంగా ప్రేమించిందో ఆ అద్భుత లోకంలేనే కల్పనాచావ్లా శాశ్వతంగా కలిసి పోయింది. అయితే తనలా అర్ధాంతరంగా చనిపోయినప్పటికీ కోట్లాది మంది ఆడపిల్లలకు ఒక చక్కటి ప్రేరణను, ఎనలేని ధైర్యాన్ని ఆమె అందించింది. ఆడపిల్లలు తలచుకుంటే ఏమైనా సాదించగలరని, ఎంత ఉన్నత స్థానానికైనా వెళ్ళగలరని, ధైర్య సాహసాల విషయంలో వారు మగవారికి ఏ మాత్రం తీసిపోరని కల్పనాచావ్లా నిరూపించింది.

281.jpgకల్పనాచావ్లా పుట్టిన సమాజం ఎలాంటిదంటే ఆ తెగలోని ఆడపిల్లలు ఇప్పటికీ పరదాల్లోనే జీవిస్తుంటారు. అంత వెనుకబడిన సమాజంలో ఆమె పుట్టినప్పటికీ ,...... అంతరిక్షంలో విహరించాలని చిన్నప్పటి నుంచీ ఆమె కలగనేది. అంతేకాదు. ఆ కలను నిజం చేసుకోవడమే తన ఆశయంగానూ, లక్ష్యంగానూ పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకై ఆమె ఎన్నెన్నో కష్టాలను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. కొందరు బంధుమిత్రుల విరోధాన్ని కూడా ఆమె చవి చూడవలసివచ్చింది. అయినా సరే కల్పనాచావ్లా చలించలేదు. మాటల్లో చెప్పలేనంత పట్టుదలతో నిరంతరం కృషి చేస్తూ, చివరకు తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.

భారతదేశపు చిన్నారులను ఉద్ధేశించి మాట్లాడుతూ కల్పనాచావ్లా ఒకసారి ఇలా అంది.... జీవితంలో ఏవో కొన్ని చిన్నచిన్న కోరికలు తీర్చుకోవడం మాత్రమే మన లక్ష్యం కాకూడదు. మన జీవితంలో కొన్నికొన్ని విషయాలు మనకు కనీవినీ ఎరుగనంత సంతోషాన్ని కలిగిస్తాయి. అలాంటి పనులకు ఎంత కాలం చేసినా మనకు విసుగన్పించదు. పైగా చేసే కొద్దీ, వాటివల్ల మన సంతోషం మరింతగా పెరుగుతుంది. మనకు అలాంటి అపరిమితమైన ఆనందాన్ని కల్గించేవి ఏవో వాటిని మనకు మనంగానే వెతికి పట్టుకోవాలి. వాటిని సాధించేందుకై మన శక్తి వంచన లేకుండా పాటు పడాలి. దగ్గరిదారి మాత్రమే ఎల్లప్పుడూ అన్నిటికన్నా మంచిదని అనుకోకూడదు. ఒక్కోసారి మన లక్ష్యసాధనకై మనం చాలా కష్టపడవలసి వస్తుంది.

మరొక ముఖ్యమైన విషయం. మీ లక్ష్యం ఒక్కటే గొప్పదైనంత మాత్రాన చాలదు. మీ లక్ష్యాన్ని సాధించేందుకై మీరు ఎన్నుకునే దారి కూడా మీ లక్ష్యమంత గొప్పగా ఉండాలి. ఈ విషయంలో ప్రకృతి ఇచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి. మీ కలలు, లక్ష్యాలు ఏవైనప్పటికీ మనోహరమైన మన ఈ భూగోళం విషయంలో మాత్రం ఎన్నడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మీ కలలను నిజం చేసుకునే దిశగా మీరు చేసే ప్రయాణం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate