অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మిస్టర్ ఇల్లాలు

మిస్టర్ ఇల్లాలు

mrillaluపావని: విద్యక్కా! అలా చూడు! మిస్టర్. ఇల్లాలు గారు, పెళ్ళాం పావడాలు, రవికలు దండెంపై ఆరేస్తున్నాడు. (బాల్కనీ నుండి పక్కింట్లోకి తొంగి చూస్తున్నది).

విద్య: ఆ...! రోజూ చూచే తంతేలే!. ఆయన గారు ఇల్లు తుడవడం, అంట్లు, తోమడం, బూజులు దులపడం, ఒకటేమిటి ఆడవాళ్ళ పనులన్నీ చేసేస్తుంటాడు.

పావని: ఆ రాజి ఏం ఆడమనిషో ఏమో? ఈయన గారు పనులు చేస్తుంటే ఆమె వారించదు కూడా!

విద్య: చెప్పడం మరిచాను! మొన్న రాత్రి రెండు గంటలప్పడు, ఇంటి ముందు చెత్త తోసి, నీళ్ళు కూడా చల్లాడంట.

పావని: ఔనా..! ఎవరు చెప్పారు?

విద్య : పక్కింటి రఘురాం తాత గారి భార్య! పెద్దామె, తాను చల్లుతానని వెళ్ళిందట, ససేమిరా వద్దనాడంట.

పావని: అయ్యో! పాపం.

విద్య: వంటావార్పు కూడా, ఒక పూట తాను చేస్తే, రెండు పూటలు ఇతనే చేస్తాడంట.

పావని: ఆ రాజీ ఉద్యోగం చేస్తుందిగా! అదీ దాని బడాయి.

విద్య; భలే నెరజాణ! మనం ఎదురుపడితే భలే ఆప్యాయంగా పలకరిస్తుంది తెలుసా!

పావని: మొగుణ్ణి అలా హింసించవద్దని చెప్పలేక పోయావా!

విద్య: నాకంత చనువు లేదమ్మ! ఆమెను కాదులే అక్కా!

పావని: ఆమెను కాదులే అక్కా! ఆ ఆడంగి వాణ్ణి అనాలి.

(బాల్కని క్రింది వీధి అరుగుపై కూర్చున్న రఘురాం తాతకు ఈ చర్చ జుగుప్ప కల్లించడంతో నెమ్మదిగా లేచి తన యింటివైపు బయలుదేరాడు)

(రఘురాం తాత గారి ఇంట్లో టీ పార్టీ అంటే పావనీ, విద్య, మరికొంత మంది ఇరుగు పొరుగు మహిళామణులు రఘురాం తాత గారింటికి వచ్చారు. రఘురాం గారి కోడలు అందరికీ వేడి వేడి పకోడిలు, టీ అందించింది. నానమ్మ అతిధులతో మాట మంతి కలుపుకుంది)

విద్య: తాతగారూ! ఏమిటి విశేషం? వుమ్మల్నందరిని బతిమాలి, బామాలి ఇంటికి పిలిపించి పార్టీ ఇస్తున్నారు?

పావని: నానమ్మా! మీ బర్త్డేనా..?

నానమ్మ: కాటికి కాలుచాచిన దానిని! ఈ వయస్సులో తెల్లారితే, బతికున్న ప్రతి రోజూ బర్త్డేనే!

(ఇంతలో గేటు తీసిన చప్పడు. రాజీ, ఆమె భర్త లోనికి వస్తున్నారు)

తాతగారు : రామ్మ! రాజీ, పిలవగానే వచ్చినందుకు, చాలా సంతోషం.

రాజీ: బాగున్నారా తాతగారు! ఈయన మా వారు చక్రపాణి ఎలక్రిసిటి డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. (అందరు సాదరంగా ఒకర్ని ఒకరు పలుకరించుకొన్నారు)

కోడలు: రాజీ! ఈ పకోడి ప్లేటు అందుకో!

చక్రపాణ: రాజీకి వదులేండి, తాను పాలు మాత్రమే తాగుతుంది.

విద్య : (పావనిని చూచి అలవోకగా కండ్లు ఎగిరవేసింది)

పావని: (ముసి మసి నవ్వులు)

తాతగారు: రాజీ, నేరుగా విషయానికొస్తానమ్మా! మరోలా అనుకోవుగా!

రాజీ: లేదండి, నిస్సంకోచంగా చెప్పచ్చు.

నానమ్మ: (కనుబొమ్మలు ముడిపడ్డాయి, కోపంగా తాత వైపు చూస్తూ వారించబోయింది)party

తాతగారు: మీ ఆయనతో అడపనులన్నీ చేయిస్తున్నావని, నా బార్య మొదలు ఇక్కడందరు తెగ బాధ పడుతున్నారమ్మా!

(ప్రక్కన బాంబు పడినట్లు అందరు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు)

రాజీ: (నవ్వుతూ) తప్పనిసరి పరిస్థితులు తాతగారు!

నానామ్మ: ఎవరి కుటుంబం వారిది! ఇంటికి పిలిచి అవమానించడం ఏం బాగా లేదు (అరిచినంత పనిచేసింది) (మహిళామణులంతా ఔనంటూ నానమ్మను బలపరిచారు)

రాజీ : పర్లేదండి! మా నాన్న గారు వుండుంటే ఇలాగే అడిగే వారేమో!

తాతగారు: ఔనమ్మా! నలుగురూ నానా మాటలంటుంటే వినలేక..!

రాజీ : బాల్కనీలో, వీళ్ళ మాటలు అన్నీ మా యింటిలోకి వినిపిస్తాయండీ.

(అమ్మలక్కల ముఖంలో నెత్ముటి చుక్కలేదు. విద్యా పావనీలకైతే నోటతడి లేదు)

రాజీ : ఉద్యోగపరంగా బదలీరావడంతో ఈ ఊరికి వచ్చాము. ఈ మధ్యన కొత్తగా ఇల్లు తీసుకొని చేరాం కాబట్టి మా వివరాలు తెలియక మీరు పొరబడ్డారు. నాకు యురినరి బ్లాడర్ బైపాస్ ఆపరేషన్ అయ్యింది. పాలిథీన్ బ్యాగ్ నడుముకు కట్టుకుని వంగి పనులను చేసుకోలేను.

విద్య : అవునా! (ఆశ్చర్యంగా) ఎంతకాలమయింది?

రాజీ : మూడు సంవత్సరాలపైనే..!

పావని : మీ వారు అప్పటినుంచి, మీకు సహాయంగా వున్నారా?

రాజీ : (మానంగా తల ఊపింది)

నానమ్మ : దేవుడు లాంటి భర్తను పొందావు తల్లీ!

విద్య : మీ పట్టింటి వారు సాయం కాలేదా?

రాజీ : అమ్మనాన్నలకు నేనొక్కదానినే నంతానం. పెళ్ళికి ముందే నాన్నపోయారు. పెళ్ళి నాటికి అమ్మ మంచం పట్టింది. పెక్ళైన రెండు సంవత్సరాలకు ఆమే పోయారు.

పక్కింటావిడ : బాధపడకమ్మా! మేమంత లేమా?

ఎదురింటి ఆంటీ : నీ భరే నీకు తోడునీడ.

(తలోరకంగా చక్రపాణిని పొగుడుతున్నారు. తలవంచిన చక్రపాణి కళ్ళ నుండి కన్నీరు పొంగుతోంది)

తాతగారు : సార్! ఇక్కడ మేమందరం మిమ్మల్ని పొగుడుతున్నామండి?

(కళ్ళు తుడుచుకొని...! ఒక నిమిషం తరువాత తేరుకొని)

ఛక్రపాణి : ఆమె అనారోగ్యానికి కారణం నేనేనండి.

తాతగారు : (ఆశ్చర్యంగా) మీరా!

చక్రపాణి : మూడు సంవత్సరాల క్రితం, నాకు రెండు కిడ్నీలు పాడైతే, రాజీనే ఒక కిడ్నీ నాకు దానం చేసింది. కిడ్ని ట్రాన్స్ ప్లాంటేషన్ కు, మా నాన్నగారి కిడ్నీ నాకు మ్యాచ్ అయింది. కానీ అప్పటివరకు వెంట వున్ననాన్నగారు డబ్బు సంచి మా ఆవిడ చేతిలో పెట్టి, మళ్ళీ ఆసుపత్రికి రాలేదు.

విద్య : రాజీది మ్యాచ్ అయ్యిందా..?

చక్రపాణి : లేదండి! ఒరిస్సాలోని ఒక బాబుకు సరిపోయింది. ఆ అబ్బాయి అమ్మ కిడ్నిని నాకు పెట్టి, రాజీ కిడ్నీ వారి బాబుకు మార్చారు.

పావని : వామ్మో!

తాతగారు : అవయవ దానం చేసే కేసులలో 90% మంది ఆడవాలే డోనర్స్ అంటే ఆశ్చర్యం కలిగింది.

చక్రపాణి : నా ఆరోగ్యం కుదుటపడింది.  దురదృష్టం రాజీకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడంతో యూరినరి బ్లాడర్ను బైపాస్ చేసి, నడుముకు తిత్తి ఏర్పాటు చేశారు.

(అందరు మనస్సులు బాదతో మూగపోయాయి)

చక్రపాణి :(కాస్త మౌనం తరువాత) మీకందరికి ఓ విషయం చెప్పాలండి! పనులలో మగ పనులు, ఆడ పనులు ఏమిటండి? పిల్లలు కనడం, పాలివ్వడం మాత్రమే మగవారు చేయలేని పనులు!

తాతగారు : అరే! ఔనండి! నేనూ వీతో ఏకీభవిస్తున్నాను. శరీర ధర్మం ప్రకారం అవి ఒక్క అమ్మలకు మాత్రమే సాధ్యమగు పనులు!

చక్రపాణి : ఈ అమ్మల వల్లనే, పసి మనస్సుల్లో ఇల్లు తుడవడం, బట్టలుతకడం, వంట చేయడం, అంట్లు తోమడం, చెత్త ఊడ్చడం, కళ్ళాపు చల్లడం ఆడపనులనే మూఢ నమ్మకం పాతుకుపోయింది.

తాతగారు : ఈ వయస్సులో కూడా నేనా పనులు చేయడం తలవంపులుగా భావిస్తుంటానండి!

చక్రపాణి :ఔనండి! ఈ పురుషాధిక్య మూఢ నమ్మకం నుండి మనమంతా బయటకు రావాలి.

 

పక్కింటావిడ : మగవారిలో సమూనంగా ఉద్యోగాలు చేస్తున్నాం, అయినా ఇంటి పనంతా మా వంతే అవుతుంది.

విద్య :ఈ విషయంపై వూ వారితో చర్చించాల్సిందే ( ఘాటుగా చెప్తుంది).

రాజీ : పోట్లాడుకోవడం కాదు? మన కష్టం అర్థమయ్యేలా చేస్తే చాలు.

నానామ్మ : ఔనమ్మ! ఈ తరం మగపిల్లల తత్వం వూరింది. తప్పక అర్థం చేసుకొంటారు.

రాజీ : పసి వయస్సులోనే పిల్లలకు అన్ని పనులు అలవాటు చేస్తే సరిపోతుంది.

విద్య : మొక్కై వంగనిది, వూనై వంగుతుందా! అనేది నిజమే కదా!

పావని : (సిగ్గుపడి!) నేనెవరికి చెప్పను కాని, మా వారు రోజు యింటి పనులు చేసుకోవడంలో సాయం వస్తారు తెల్సా...

కోడలు : (నెమ్మదిగా) మీరు తింటున్న పకోడి లు కాలునున్నది, ఎవరనుకున్నారు. మా ఆయనే!

నానమ్మ : ఒహా! మీ దుంపతెగ ఇప్పటికే మొగుళ్ళ మెడలు వంచారన్నమాట!

తాతగారు : ఉండండి! ఈ గాసులు, ప్లేటు తియ్యడం ద్వారా నేను మారతాను. (అందరు పక పక నవ్వసాగారు! “మనస్పూర్తిగా మార్పును మన నుండే ప్రారంభిస్తాం!" పదండి!)

రచయిత: - జి. చంద్రశేఖర్, సెల్:9494746248© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate