অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కొవ్వోత్తులతో గారడి

కొవ్వోత్తులతో గారడి

టేబుల్ మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది. మెజీషియన్ చేతిలో ఒక తీగ వల (wire gauge) కన్పిస్తోంది. దాన్ని అందరికీ చూపించాడు. ఆ కొవ్వొత్తిని జ్వాల మధ్యకు వచ్చేలా పట్టుకున్నాడు. ఇప్పుడు జ్వాల పూర్తిగా తీగవల కిందనే మండుతూ కన్పించింది. మెజీషియన్ ఏం మాయ చేశాడో ఆ జ్వాల కొంత భాగం తీగవలపైన, మరి కొంత భాగం తీగ వల కింద మండడం ప్రారంభించింది. మళ్ళీ ఏదో గమ్మత్తు చేశాడు. ఈసారి జ్వాల పూర్తిగా తీగవల పైనే మండుతూ కన్పించింది.

అందరూ చూడండి. ఈ జ్వాల నేను చెప్పినట్టే వింటుంది అంటూ చేతితో పట్టుకున్న తీగవలను కొంచెం పైకి కిందికి కదిల్చాడు. జ్వాల తీగవల నుంచి విడివడి కొంచెం పైకి లేచింది. మళ్ళీ కిందికి పడింది. ఇదంతా ఏదో గారడీ అనే చాలా మందికి అన్పించింది.

ఈ మేజిక్ మనం కూడా చెయ్యగలం.

ఇందుకు కావల్సినవి: కొవ్వొత్తి, తీగ వల.

ముందుగా కొవ్వొత్తిని వెలిగించి టేబుల్ మీద నిలబెట్టాలి. కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉపయోగించే తీగవలను తీసుకుని జ్వాల మధ్య భాగానికి వచ్చేలా అమర్చాలి. ఇందుకు అవసరమనుకుంటే త్రిపాది (tripod)ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు జ్వాల పూర్తిగా తీగవల కిందనే మండుతుంది. ఇప్పుడు తీగవలను ఒక వైపుకు వచ్చేలా జరిపి తిరిగి మధ్యకు అంటే ఇంతకు ముందున్నట్లుగా కదపాలి. ఇప్పుడు జ్వాల కొంతభాగం తీగవలకు పైన, కొంత భాగం తీగవల కింద మండుతుంది. ఇప్పుడు తీగవలను నెమ్మదిగా పైకి లేపి తర్వాత కొద్దిగా కిందికి దించితే, జ్వాల పూర్తిగా తీగవలకు పైనే మండుతుంది.

ఇలా కొంతసేపు ప్రాక్టీస్ చేస్తే జ్వాల తీగవల కన్నా సుమారు మూడంగుళాలు పైకి లేచి, మళ్ళీ కింద పడేలా కూడా చేయవచ్చు.

కొవ్వొత్తికి, తీగవలకి మధ్యన దూరాన్ని తగిన విధంగా సర్దుబాటు చేస్తే, మండే వాయువును కొవ్వొత్తికి చెప్పుకోదగ్గ దూరంలో మండేలా చేయగలం. ఇలా

ఎందుకు జరుగుతుంది?

తీగవలకు ఉష్ణనష్టం జరగడమే ఇందుకు కారణం.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate