অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గాలితో గమ్మత్తులు

గాలితో గమ్మత్తులు

పిల్లలు !మీరు తేలికైన బల్ ని నేలపై పెట్టి లేదా చేతిపై నొతితొ గాలి ఊడితే బాల్ కదలడం గమనించివుంటారు. ఈ గాలితో గమ్మతులేమిటనుకుంటున్నారా?! ముందుగా ఈ క్రింది మూడు అంశాలను గూర్చి ఆలోచించండి.

మొదటి కృత్యం: ఒక గఱతు లోపలా బాల్ ని పెట్టి, గఱతు సన్నని కాడా నుండి గాలిని ఊడి చుడండి ఆ బాల్ పైకి లేకపోవడం గమనిస్తారు. ఎందుకు?

రెండవ కృత్యం: అలాగే సమన పొడవున్నదారాలతో కట్టబడి స్థిరమైన ఆధారం గుండా రెలాడదీసిన రెండు యాపిల్స్ మధ్యలో ఊడితే ఆ రెండు యాపిల్స్ దూరంగా ఎడంగా జరగడానికి బదులు దగ్గరికి ఒకదానికొకటి తాకేటట్లు మధ్యకు రావడం రావడం గమనిస్తారు. ఎందుకు?

మూడవ కృత్యం :గోడకు రెలాడదీయబడిన క్యాలెండరు సీలింగ్ ఫ్యాన్ గాలికి గోడకు అంటి పెట్టుకొని ఉండక ఫ్యాన్ వైపు పైకి ఎగరడం గమనిస్తారు.?

మొదటి కృత్యములో మనకు కావలసినవి తేలికైన పింగ్ -పాంగ్ బాల్ , గరాటు.

వివరణ: పింగ్-పాంగ్ బాల్ ని గరాటు ఉంచి కడనుండి గాలిని ఊదినట్లైతే గరాటు నుండి బయటికి రాలేదు. ఎందుకంటే గాలి ఊదడం వల్ల బాల్ చుట్టూ గరాటు లోపలి భాగంలో అల్పపీడలు ఏర్పడి బాల్ ని బైటికి వెళ్ళకుండా, గరాటు అంటిపెట్టుకుని వుంటుంది.

రెండవ కృత్యములో మనకు కావాల్సిన సమన పొడవున్న రెండు ధరలు స్థిరమైన కడ్డీ రెండు యాపిల్ లు.

వివరణ : రెండు సమన పొడవుతో ఈ దారులకు వెలాడదీయబడిన, దాదాపు సమన బరువులున్న రెండు యాపిల్ ల మధ్య 1 ఫీట్ (12 inch మించకుండా )దూరం ఉండునట్లు యాపిల్ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి మధ్యలో ఊదాలి. ఆ తరువాత మీరేమి గమనించారు? ఆశ్చర్యం కదా ! రెండు యాపిల్ విడివిడిగా ఎండగా దూరంగా పోయేబదులు దగ్గరగా రావడం గమనించాము కాదు !

ఈ విధంగా గాలి ఊదడానికి ముందు యాపిల్ చుట్టూ అన్ని వైపులా పీడనం సమానంగా ఉంటూ అప్పుడైతే మనము యాపిల్ ల మధ్య గాలి ఊడగానే మధ్య అల్పపీడనము ఏర్పడుతుంది. అందుకు యాపిల్ లు ఒకదానికొకటి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాయి . అనగా యాపిల్ ల బయటి వైపు అధికపీడనం మరియు యాపిల్ ల మధ్య భాగంలో అల్పపీడనం ఏర్పడుతుందన్నమాట. మనకు తెలుసు గాలి ఎల్లప్పుడూ ఎక్కువ పీడనం ఉన్నచోటు నుండి ఎక్కువ పీడనం వున్నా వైపు ప్రవహిస్తుంది.

మూడవ కృత్యములో గదిలో సీలింగ్ ఫ్యాన్ తిరిగేటప్పుడు ఫ్యాన్ క్రింద వున్నా పీడనం తగ్గుతుంది.క్యాలెండరు కాగితములు గొడవైపుకు అంటిపెట్టుకొని యుండక , గోడ నుండి దూరంగా ఫ్యాన్ వైపుకి తిరుగుతాయి. ఎందుకంటే గాలి అధికపీడనం నుండి అల్పపీడనం వైపు ప్రవహిస్తుంది.

ఈ విధంగా డేనియల్ బెర్నౌలి అనే శాస్తవెత చాల సంవత్సరాలు ప్రవాహుల(moving fluids) గూర్చి పరిశోధన చేసాడు. బెర్నౌలి సూత్రం ఏమిటంటే "ఏదైనా ఒక వస్తువు ఉపరితలానికి సమాంతరంగా గాలి వీచేటప్పుడు తలం పైన పీడనం, క్రింద పీడనం కన్నా తక్కువ ఉంటుంది".

1.తూఫాన్ తో తాటాకు పూరిళ్ళ కప్పులు పైకి ఎగరడం.

2 . గాలి క్షితిజ సమాంతరంగా వీస్తున్నప్పుడు భూమ్యాకర్షణ బలానికి వ్యతిరేకంగా గాలిపటం ఎగరడం .

౩ .విమానాలు గాలి ఊర్థ్వ ఒత్తిడివల్ల గురుత్వబలానికి వ్యతిరేకంగా ఎగరటం .

ఆధారం: చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate