অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బాలల సైన్స్ విభాగం

బాలల సైన్స్ విభాగం

  1. శాస్త్రవేత్తలు
    1. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
    2. ఎస్.కె. మిత్రా (1890 - 1963)
    3. శాంతిస్వరూప్ భట్నాగర్
    4. అంతరిక్ష శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు యు.ఆర్.రావు
    5. డా.విలియమ్స్
    6. ఆర్ధర్ సి. క్లార్క్
    7. లూయీ బ్రెయిలీ (1809 - 1852)
    8. ఒట్టో వలాష్ ( క్రీ.శ. 1847 -1931 )
    9. మేరీక్యూరీ (1867 – 1934)
    10. బెకెసీ గియర్గాన్ ( 1899-1972 )
    11. ప్రాణి మూలాన్ని తెలియజేసిన - “ఫ్రాంసిస్ క్రిక్”
    12. ప్రవర్తనా మనస్తత్వ సిద్దాంతకర్త ఇవాన్ పావ్ లోవ్
    13. క్లాడిలూయిస్ బెర్తోలెట్
    14. ఫిలిప్ వారెన్, యాండెర్ సన్ - క్రీ.శ. 1923
    15. బీర్బల్ సహానీ (1891 – 1949 )
    16. ఆర్కిమెడిస్ (కీ.పూ.187-212)
    17. సత్యేంద్రనాథ్ బోస్
    18. మరికొందరు శాస్త్రవేత్తలు
    19. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్
    20. విలియం హార్వే
    21. మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్
    22. డా.విలియమ్స్
    23. జోసెఫ్ లిస్టర్ (1827 - 1912)
    24. జీవ పరిణామ సిద్దాంతానికి ఆద్యుడు
    25. శాస్త్రవేత్తలలో మణిపూస- మైఖేల్ ఫారడే
    26. కోప్లే అవార్డును అందుకోబోతున్న- హాకింగ్
    27. అపూర్వ ఆవిష్కర్త అపూర్వ మిశ్రా - మాడ భూషి కృష్ణప్రసాద్
    28. జీవపరిణామ సిద్ధాంత కర్త - చార్లెస్ డార్వ్ న్ (1808-1882)
    29. లూయిస్ పాశ్చర్
    30. చింపాజీలపై పరిశోధనలో అగ్రగామి – జేన్ గుడాల్
    31. జె.ఇ. గోర్డన్ - పదార్థ విజ్ఞాన పితామహుడు
    32. అర్కిమిడీస్ నిర్మించిన సాంకేతిక పరికరాలు
    33. సర్ ఐజాక్ న్యూటన్
    34. ఆర్దశీర్ కుర్సట్జీ – మేటి భారతీయ నౌకా నిర్మాత
    35. జీవశాస్త్రంలో ఫెయిన్మన్
    36. ఆటబొమ్మలతో సైన్స్ నేర్పే అరవింద్ గుప్తా
    37. కోపర్నికస్ – కెప్లర్ - గెలీలియో
    38. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో గెలీలీ
    39. డా. ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆంధ్రులు గర్వించదగ్గ శాస్త్రవేత్త
    40. డా. ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆంధ్రులు గర్వించదగ్గ శాస్త్రవేత్త - 2
    41. డిగ్రీలు లేని, నిజమైన శాస్త్రవేత్త హుమాసన్
    42. నోబెల్ గ్రహీత శాస్త్రవేత్తలు
    43. 1907 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    44. 1908 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    45. 1909 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    46. 1910 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    47. 1911 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    48. 1912 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    49. 1913 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    50. 1914 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    51. 1915 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    52. 1929వ సంవత్సరం నోబెల్ బహుమతులు
    53. 1930 సంవత్సరపు నోబెల్ బహుమతులు
    54. 1931 సం.. పు నోబెల్ బహుమతులు
    55. 1932 సంవత్సరపు నోబెల్ బహుమతులు
    56. 1933 నోబెల్ బహుమతి గ్రహీతలు
    57. 1934 సంవత్సరపు నోబెల్ బహుమతులు
    58. 1935 - నోబెల్ శాస్త్రవేత్తలు
    59. 1936 సంవత్సరపు నోబెల్ బహుమతులు
    60. 1937 సం " విజ్ఞానశాస్త్ర నోబెల్ పురస్కారాలు
    61. 1938 సం" పు నోబెల్ బహుమతులు
    62. మేరీక్యూరీ (1867 – 1934)
    63. 2004 సంవత్సరపు నోబుల్ బహుమతులు
    64. 2006 నోబెల్ బహుమతుల విజేతలు
  2. సైన్స్ పదనిసలు
    1. సైన్సు గమనంలో మైలురాళ్ళు
    2. దిక్సూచిలో మూడో అడుగు... పీఎస్‌ఎల్‌వీ-సీ26
    3. అణుభద్రత సదస్సు-2014
    4. మానవ నిర్మిత అంతరిక్ష అద్భుతం వాయేజర్-1
    5. పీఎస్‌ఎల్‌వీ-సీ24 ప్రయోగం విజయవంతం
    6. వినీలాకాశంలో వాణిజ్య విహంగం పీఎస్‌ఎల్‌వీ-సీ23
    7. పీఎస్‌ఎల్‌వీ-సీ22 ప్రయోగం విజయవంతం
    8. విజ్ఞన శాస్త్రంలోఅనుకోని అద్భుత ఆవిష్కరణలు
    9. భూమిని గురించి తెలుసుకుందాం !
    10. చందమామకు భారత్ తొలియాత్ర
    11. పుడమి తల్లిని కాపాడుకుందాం!
    12. భారత అంతరిక్ష శాస్త్రవేత్తల ఘన విజయం
    13. భూకంపాలను ఇలా కొలుస్తారు
    14. విజ్ఞాన శాస్త్రంలో అనుకోని అద్భుత ఆవిష్కరణలు
    15. సైన్సులో నూతన సత్యాలు - సమస్యలు
    16. విజ్ఞాన శాస్త్రములో మైలురాళ్ళు
    17. చేసి చూడండి
    18. చురుకుదనానికి చిన్న పరీక్ష
    19. ఇంట్లోనే ఇంద్రధనస్సు
    20. విజ్ఞాన విశేషాలు
    21. వేగుచుక్క విన్యాసం
    22. చందమామ రావే జాబిల్లి రావే
    23. ఆకుపచ్చ ఆక్టోపస్
    24. గొర్రెలు - ఎలుగుబంట్లు
    25. కుక్క గొడుగులు
    26. శనిగ్రహం వలయాలు
  3. మెదడుకు మేత
    1. మీకు తెలుసా ?
    2. ఎవరి వేగం ఎంతెంత?
    3. మనమంతా మనుషులం
    4. కదిలే చిత్రాలు
    5. కదిలే బొమ్మల పుస్తకం
    6. కదిలే చిత్రాల
    7. అతనికి లెక్కలంటే పిచ్చిప్రేమ
    8. జాతీయ సైన్స్ దినోత్సవం
    9. మంటలు – మర్మాలు
    10. భూకంపాలను ఇలా కొలుస్తారు
    11. ఆగష్టు మాసంలో ముఖ్యమైన రోజులు
    12. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైన రోజులు
    13. మన శరీరం
    14. లైటనింగ్ కండెక్టర్ ఎలా పనిచేస్తుంది ?
    15. a.m మరియు p.m అంటే ఏమిటి ?
    16. వంటగ్యాస్ సిలిండర్ కూ ఎక్స్ పైరీ తేది ఉంది.
    17. వర్గాల్లో వింత - ఘనాల్లో ఘనత
    18. ఆ తెరల్లో తేడాలేంటి
    19. అడిగి తెలుసుకుందాం
    20. నోటి దుర్వాసన దేనివల్ల ?
    21. వర్షాకాలంలోనే అంటువ్యాధులు ఎక్కువ – ఎందుకు ?
    22. నిప్పు పై కాళ్లు కాలకుండా ఎలా నడువగలుగుతారు?
    23. చేతబడి అంటే ఏమిటి ?
    24. ప్రంపంచంలోకెల్లా అత్యధిక మోతాదులో 'హరిత గృహవాయువుల్ని విడుదల చేసే దేశం ఏది ?
    25. సగటు ఉష్ణోగ్రత
    26. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు ఏ ఆధారం లేకుండా ఎలా తిరుగుతున్నాయి ?
    27. మనిషి గిర గిరా తిరిగితే కళ్ళు తిరుగుతాయి. మనం వున్న భూమి మనతో పాటు తిరుగుతుంది కదా ! మనకు కళ్ళు తిరుగవు ఎందుకని ?
    28. ఆక్సిజన్, హెడ్రోజన్లను కలిపి నీటిని తయారు చేసి నీటి కొరత తీర్చవచ్చునా ?
    29. మంటపై నుంచి చుస్తున్నప్పుడు వస్తువులు కదులుతున్నట్టుగా కనిపిస్తాయి ఎందుకని ?
    30. వీధిలోని ఎలక్ట్రిక్ తీగలపై వాలిన కాకి చావదు. ఎందుకని ?
    31. కుర్చీలో నిటారుగా కూర్చొని లేవలేము ఎందువల్ల ?
    32. అమావాస్యకు పౌర్ణమికీ పిచ్చివాళ్ళకు పిచ్చి ఎక్కువతుందా ?
    33. దోమల్లో ఆడ దోమ మాత్రమే ఎందుకు రక్తం తాగుతుంది ?
    34. బూమెరాంగ్
    35. చేసి చూద్దాం
    36. బుడ్డీలో బుల్లి ప్రపంచం
    37. బబుల్ గేమ్
    38. చెప్పుకోండి చూద్దాం
    39. ఎలా కనిపెట్టాడు ?
    40. ఉయ్యాలను ఎలాకడతారు ?
    41. గణిత సంకేతాలు
    42. ఏది వేరుగా ఉంది ?
    43. ఏ వరుసలో ఉన్నాయి ?
    44. దేశాల పేర్లేమిటి?
    45. సరిపోయేలా చేయండి
    46. వేరు చేయండి
    47. గణిత సంకేతాలు
    48. గుండ్రంగానే ఎందుకు?
    49. ఎన్ని సార్లు తీసేయొచ్చు
    50. ఏ సంచీలో ఉన్నాయి ?
    51. నిరూపించండి
    52. అది ఏది ?
    53. ఎవరు ఎంత మంది ?
    54. ఆరితే పాపం
  4. సైన్స్ ప్రయెగాలు - చేసి చూద్దాం
    1. తరంగాలతో ప్రయోగాలు
    2. నీటి తరంగాలు
    3. తరంగాలను విచ్ఛిన్నం చేయడం
    4. తరంగాల డోలీ
    5. మెక్సికన్ తరంగాలు
    6. వెదురు పుల్లలతో తరంగాలు
    7. అనుదైర్ఘ్య తరంగాలు
    8. ఈల వేసి కనుగొందాం ! మనరాగపు అనునాదం !
    9. వాయువుల సంకోచ వ్యాకోచాలు
    10. చేసి చూద్దాం
    11. ఎగిరేకిరీటం
    12. కాగితం టపాసు
    13. ఐస్ ముక్కను బయటికి తీయగలరా
    14. కాగితం కుక్క
    15. ఎలుకను చేద్దాం రండి!
    16. ఉప్పు - మిరియాల పొడి కలిసి పోతే ....!
    17. మాట్లడే కుక్క
    18. తడవని రుమాలు
    19. నవ్వించొచ్చు - ఏడ్పించొచ్చు
    20. కాగితం వేణువు
    21. సబ్బుతో సులభమైన ప్రయోగాలు
    22. దారం గాజు
    23. స్టీమరు పుల్ల
    24. నీటి పూసలు
  5. బాలల వినోదం
    1. కధలు
    2. గులాబి పూలు
    3. నీలి చంద్రుడు
    4. పున్నమి ప్రశ్న వెన్నెల జవాబు
    5. పిసినారి పిచ్చయ్య
    6. రాతిచారు
    7. ఇద్దరు పోకిరి గాళ్ళు
    8. ప్రకృతి - వికృతి
    9. పిసినారి పిచ్చయ్య
    10. సన్యాసి గొప్పా ? శాస్త్రవేత్త గొప్పా?
    11. శనక్కాయ చమక్కులు
    12. అంధకారంలోంచి అక్షర ప్రపంచంలోకి
    13. బాబా విశ్వరూప ప్రదర్శన విఫలమైందెందుకు..?
    14. భంగపడిన ' గంగ '
    15. విషం మింగే మొక్కలు !
    16. సరదా సరదా ఇంగ్లీషు
    17. ఆటల తో చదువు
    18. ఫోన్ నంబరుతో తమాషా
    19. ఆత్మ విస్వాసమే ఆయుధంగా పరీక్షలకు సిద్ధంకండి !
    20. ప్రజ్ఞ
    21. దొంగలా చేరినపదం ఏది ?
  6. వింతలు- విశేషాలు
    1. ప్రజ్ఞాశాలి
    2. చక్రం – ఆవిష్కరణ
    3. ఉల్కల కులుకులు
    4. నిద్రలో నిజాలు
    5. మన రుతుపవనాల గురించి
    6. జంతువుల్లో వింతలు
    7. పాముల గూర్చి అపోహలొద్దు
    8. రాబందుల రెక్కల చప్పుడు ఆగిపోనుందా ?
    9. కొండపల్లి... కొయ్యబొమ్మలు
    10. నేను జీవనాధారాన్ని నన్ను రక్షించుకోండి
    11. చిత్రం చిత్రం పక్షి ప్రపంచం
    12. పాము విషమే దానికి జీర్ణరసం
    13. జలదాత సర్ ఆర్ధర్ కాటన్
    14. ఫోబియా
    15. పక్షులు ఎందుకు వలస పోతాయి ?
    16. తియతియ్యని నిద్ర
    17. రెండు వృత్తాల్లో 2006
    18. పెలికాన్ చెసికాణ్ణి
    19. ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా పనికొస్తాయి
    20. అతి పొడవైన మనిషి
    21. నెప్య్టూన్
    22. టెలివిజన్ - కొన్ని విశేషాలు
    23. ప్లూటో నీకథేమిటో
    24. పరీక్షలకు ప్రయాణం
    25. ఆస్బెస్టాస్ ధూళి - ప్రాణాలకు హాని
    26. మనం ఒక జీవిత కాలం జీవిస్తే, మన కళ్ళు రెండు జీవితకాలాలు జీవిస్తాయి....
    27. భాస్వర లీలలు
    28. అష్టరుచులు
    29. DNA కథ
    30. ఎలా సాధ్యం ?
    31. గజిబిజి గిజిగాడు
    32. పిల్లి శకునం
    33. అవయవాల మార్పిడి (Organ Transplantation)
    34. సైన్సు క్లబ్
    35. క్షీమించిపోతున్న ఆడ జనాభా
    36. నిన్ను వదలి నేపోలేనులే
    37. గొప్ప స్ఫూర్తి
    38. అయోడైజ్జ్ ఉప్పు అవసరమా
    39. పిరమిడ్లు ఎలా నిర్మించారు ?
    40. మిణుగురులు ఎందుకు మెరుస్తాయంటే......
    41. పొట్టలో చిల్లు
    42. గమ్మత్తు గణితం
    43. సిగ్మండ్ ఫ్రాయిడ్

శాస్త్రవేత్తలు

ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
ఎస్.కె. మిత్రా (1890 - 1963)

చిన్ననాటి అనుభావాలు, ఆసక్తి పెద్దయ్యాక మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.ఎస్.కె.మిత్రా అటువంటి అసాధారణ శాస్త్రవేత్త చిన్నప్ఫుడు చూసిన సంగతుల గూర్చి బాల్యదశలోనే సంగతుల గూర్చి బాల్యదశలోనే ఆసక్తిని పెంచుకున్న మహామనిషి.అది కలకత్తాలోని ఒక మైదానం. ఆర్.సి.ఛటర్జీ అనే ఆయన బెలూన్లో ఆకాశయానం చేస్తుండగా 9 సం"ల బాలుడు మాత్రం ఆశ్చర్యంగా అదెలా సాధ్యం అయింది?" అని తన ప్రక్కనే ఉన్న తన అతని అన్నను అడిగాడు. అన్నగారు సమాధానం చెప్పలేక పోయారు. ఇంటికి వచ్చి సైన్సు పుస్తకాలలో వెతికాడు.ఆ బాలుడే శిశిర్ కుమార్ మిత్రా 1890 అక్టోబరు 24వ తేదీన అతడు కలకత్తాలో జన్మించాడు.చిన్ననాటి నుంచే అతను చాలా శ్రద్ధగా చదివేవాడు.కాలేజీ విద్యాభ్యసన కాలంలో జె.సి.బోస్,పి.సి.రే వంటి ప్రముఖుల పరిశోధనలు అతన్నీ ప్రభావతం చేశాయి.ఆ ప్రేరణలోనే మిత్రా " రేడియోసైన్స్ " ని అధ్యయనం చేయాలనుకున్నాడు. రేడియో శాస్త్రం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించిన మిత్రా ప్రోద్బలం మీదనే భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఈ శాస్త్రభోదనావకాశాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. అయనోస్పియర్ గురించి మిత్రా చేసిన పరిశోధనలే ఆయనకి విజ్ఞానశాస్త్రంలో పేరుతెచ్చాయి. భూమి యొక్క వాతావరణపు పైపొర ' అయనోస్పియన్ ' దీనిలో విద్యుదావేశం కల రేణువులు ఉంటాయి. వీటినే అయానులు అని అంటారు. రేడియో కమ్యూనికేషన్ రంగంలో అయానోస్పియన్ మండలం పాత్రవిశిస్టమైనది. భూమి నుంచి ఎత్తు అయానులస్వభావం ప్రాతిపదికగా అయాను మండలాన్ని D-E-F అని మూడు రకాలుగా విభజించారు.

ఈ పొరల గురించి మిత్రా విశిష్టమైన పరిశోధనలు చేశారు. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల చర్య వలన అయాను మండలంలో "E" పొర ఏర్పడినదని ఆయన చెప్పాడు. ఈ పొర గురించి అప్పటి వరకు ప్రపంచ శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు చేస్తూవచ్చారు. మిత్రా పరిశోధన వారి అనుమానాలకి పుల్ స్టాఫ్ పెట్టింది.1958లో మిత్రాని రాయల్ సొసైటి ఫెలోగా ఎన్నుకొన్నారు.ఆయన పలుబహుమానాలు , పతకాలు గెలుపొందారు. భూ ఉపరితలపు వాతావరణం గురించి 1947లో ఆయన The upper Atmosphere అనే గ్రంథం రాశాడు. ఈ అంశంపై ఇదే తొలిగ్రంథం కావటం విశేషం. అది ప్రపంచ వ్యాపితంగా శాస్త్రవేత్తల ప్రశంసలను అందుకుంది.1963 ఆగష్టు 13వ తేదీన తన 73వ ఏట శిశిర్ కుమార్ మిత్రా మరణించారు.

భూవాతావరణం గురించి,అయాను మండంలం గురించి యేన్నే చిన్న పరిశోధన వెలుగు చూసినా అందులో శిశిర్ కుమార్ మిత్రా పేరు తళుక్కున మెరుస్తుంది.

శాంతిస్వరూప్ భట్నాగర్

శాంతిస్వరూప్ భట్నాగర్ గురించి తెలియనివారుండరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (CSIR) వారు ఏటేటా ఇచ్చే శాంతిస్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్ధం ఏర్పరచినదే. భారతదేశం నిండుగా గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్.
ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో ఫిబ్రవరి 21, 1894న భట్నాగర్ జన్మించాడు.చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తన తాతగారింట పెరిగాడు. వాళ్ళ తాత ఓ పెద్ద ఇంజనీరు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. కవిత్వంలో మంచి ప్రవేశముండేది. ఇప్పటి పాకిస్తాన్లొ ఉన్న రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ చమురు అన్వేషణా కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పునీటితో కలిసి గట్టిగా రాయిలాగామారి, డ్రిల్లింగ్కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పనిపూర్తిగా ఆగిపోయేది. అపుడు కంపెనీవారు భట్నాగర్ను సలహా కోసం ఆశ్రయించారు.

ఎమల్షన్ కొల్లాయిడ్లతో పరిశోధనలు చేసి 1921లో లండన్ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న భట్నాగర్ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి అతిసులభమైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురుకలపమని సలహా ఇచ్చాడు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత(Viscosity) తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటీష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయటపడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు లక్షాయాభై వేల రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మున లాహొరు యూనివర్శిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు. చూశారా! భట్నాగర్ ఔదార్యం.

భట్నాగర్ చమురు పరిశోధనాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఈయన తెలియచేశాడు. కిరోసిన్ను శుద్ధి చేయడం. వెలుగును ఎక్కువ చేయటం. ఆదా చేయడం గురించి భట్నాగర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. పెట్రోలియం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్ధాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో ఈయన పరిశోధించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈయన CSIR కు డైరెక్టరయ్యాడు.

భట్నాగర్ చమురు పరిశోధనల్లో మునిగి తేలుతున్నా మాగ్నటో కెమిస్ట్రీ మీద కూడా దృష్టినిలిపేవాడు. ఈ సమయంలోనే ఆయన వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. 1943లో ఈయనను Fellow of the Royal Society (FRS) గా ఎన్నుకున్నారు.

జవహార్లాల్నెహ్రూ హయాంలో ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి చమురు పరిశోధనా వనరులను అభివృద్ధి చేశాడు. ఈనాడు మనదేశంలో చమురు వనరులు, చమురు నిక్షేప స్థావరాలు, అణుఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అది భట్నాగర్ కృషే అని చెప్పాలి.

అంతరిక్ష శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు యు.ఆర్.రావు

ప్రంపంచ ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్తలలో ఒకడైన డాక్టరు యు.ఆర్.రావు 1932 మార్చి 10న కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కెనరా జిల్లాలో అద్మరు అనే గ్రామంలో లక్ష్మీనారాయణరావు కృష్ణవల్లె దంపతులకు జన్నించారు.వీరి పూర్తిపేరు ఉడిపి రామచంద్రరావు. చిన్ననాటినుండే చదువులో తెలివితేటలు ప్రదర్శంచేవాడు.1953లో వారణాసిలోని హిందూ విశ్వవిద్యాలయం నుండి పోస్టు గ్రాడ్యయేషన్, 1960లో డాక్టరు విక్రం సారాబాయి ఆధ్వర్యంలో పి.హెచ్.డి ని పూర్తి చేశాడు. 1961లో విదేశాలకు వెళ్ళాడు.బోస్టన్ లోని మసాచ్యుసెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ పోస్ట్ - డాక్టోరియల్ ఫెలోషిప్ ను పొందాడు. అక్కడ కాస్మిక్ రేస్, సోలార్ విండ్స్ పై పరిశోధనలు జరిపాడు. 1963 నుండి 1966 వరుకు టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.అదే సంవత్సరం భారత్ కు వచ్చి ఫిజికల రీసర్చ్ లేబరేటరీలో సభ్యుడుగా చేరి కాస్మిక్ కిరణాలకు సంబంధించి ఎక్స్-కిరణాలు, గామా కిరణాలపై పరిశోధనలు జరిపాడు.

బెంగుళూరులో ఇస్రోకి డైరెక్టరుగా పనిచేశాడు. ఆర్యభట్ట, భాస్కర్-1, 2 వంటి విజయవంతమైన ఉపగ్రహాలను కనుకొని ప్రయోగించాడు. ఉపగ్రహ సమాచార సౌకర్యార్థం ఎ.ఎస్.ఎల్.వి., పి.ఎస్.ఎల్.వి., జి.ఎస్.ఎల్.వి. వంటి అంతరిక్ష నౌకలను ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు.

అమెరికా ఉపగ్రహాలైన పయనీర్ 1, 2, 6, 7, 8 మరియు 9 లపై అధ్యయనం చేసి 1973లో నాసాగ్రూప్ అఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. యూనివర్శిల్ రీసెర్చ్ అవార్డును, పిసి మహల్శోబీస్ మెడల్, యూరీ గెగారియన్ మెడల్, ఆర్యభట్ట అవార్డు ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. భారత ప్రభుత్వం వీరిని "పద్మవిభూషణ్" బిరుదుతో సత్కరించింది. ఈ మహామేధావి నేటికీ అంతరిక్ష పరిశోధనలలో దేశ అభివృద్ధికి పాటుపడుతూనే వున్నారు.

డా.విలియమ్స్

1856లో డేనియల్ హాల్ విలియమ్స్ పుట్టేనాటికి కొంతమంది అమెరికా ఆఫ్రికన్లు ఇంకా బానిసలుగా ఉండేవారు. అయితే అతని తల్లి తండ్రి ఎప్పుడూ బానిసలుగా లేరు. పెన్సిల్వేనియాలో పెద్ద ఇంటిలో వుండే వాళ్ళు అక్కడే వాళ్ళ నాన్న మంగలి షాపు నడిపేవాడు. నాన్న కటింగ్, షేవింగ్ చేస్తూ వుంటే చూస్తూవుండడం బుల్లి విలియమ్స్కు బలే సరదా! అక్కడికి వచ్చే కస్టమర్లు అంతా నల్లవాళ్ళే. వాళ్ళు తాము ఎలా బాధపడిందీ, ఎలా స్వేచ్ఛ పొందిందీ చెపుతూ వుండేవారు. విలియమ్స్కు 11 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న చనిపోయారు. ఏదైనా పని వెతుక్కోవడానికి విలియమ్స్ చాలా చిన్నవాడు. అంచేత చెప్పుల తయారీ నేర్చుకోవడానికి బాల్టిమోర్ వెళ్ళాడు. కొంతకాలానికి స్వంత ఊరువచ్చి ఒక మంగలిషాపులో కుదిరాడు.విలియమ్స్కి బడికి పోవాలని కోరికగా వుండేది. దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివేవాడు. పనిచేస్తూ డబ్బు దాచుకొని ప్రైవేటు స్కూల్ ద్వారా చదివేవాడు.

21 సంవత్సరాలు వచ్చేటప్పటికీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేశాడు. అయినా ఇంకా చదవాలని తపన. ఆ పట్టణంలో ఒక డాక్టరును బ్రతిమాలి అసిస్టెంట్గా చేరాడు. వైద్యానికి సంబంధించిన పుస్తకాలు విరివిగా చదివాడు. రెండు సంవత్సరముల తరువాత చికాగో మెడికల్ కాలేజీలో ప్రవేశించాడు. తదుపరి 3 సంవత్సరాలకు MD డిగ్రీ అందుకున్నాడు. ఆ డిగ్రీ ద్వారా ఇక నుంచి వైద్య వృత్తి చేయడానికి నిజమైన డాక్టరు అయ్యాడు.

డా " విలియమ్స్కి రోగి నలుపా, తెలుపా అనేది చూసేవాడు కాదు. ఆనీ అప్పట్లో చాలమంది చర్మపు రంగు చూసి వైద్యం చేసేవారు. చాలామంది నల్ల దాక్టర్లకు మల్లే ఇతను పనిచేయడానికి ఏ హాస్పిటలూ అనుమతించలేదు. అనాధశరణాలయంలో డాక్టరుగా, రైల్వే కంపెనీలో సర్జనుగా పనిచేసేవాడు. ఒకానొక కాలేజీలో వైద్య శాస్త్రం బోధించేవాడు. వైద్యం చేయడంలో తెల్లవాళ్ళతో సమానంగా నల్లవాళ్ళను చూడకపోవడం విలియమ్స్ను కలవరపర్చింది. పరిస్థితుల్ని మార్చాలనుకొన్నాడు. 1891లో చికాగోలో ప్రావిడెంట్ హాస్పిటల్ నెలకొల్పాడు. అందులో నలుపు, తెలుపు డాక్టర్లు కలిసిపనిచేసేవారు. రోగి చర్మపు రంగుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వైద్యం చేసేవారు.

ప్రావిడెంట్ హాస్పిటల్ ఒక గొప్ప విజయమేకానీ అందులో డా " విలియమ్స్ చేసిన ఒక ఆపరేషన్ వైద్య చరిత్రలో విఖ్యాతమైనది. 1893లో గుండెలో కత్తి దిగబడివున్న ఒక మనిషిని పరీక్షించాడు. ఆ రోగికి లోపల ఏమైందో తెలుసుకొనే అవకాశం డా" విలియమ్స్కు లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్స్రే మిషన్లు లేవు. "తాను చేయగలిగింది గాయాన్ని తెరిచి చూడడమే." అని యోచించాడు. అది ప్రమాదమే కానీ ఆ అవకాశం వదులుకుంటే మనిషి చనిపోతాడు. 6 మంది డాక్టర్ల సహకారంతో మనిషి ఛాతీని తెరిచాడు. ఇంకా తెరిచాడు. సమస్యను గుర్తించాడు. తెగివున్న రక్తనాళాన్ని రిపేరు చేశాడు. గుండె చుట్టూ వున్న కండరాల్ని కుట్టేశాడు. మనిషి గుండె కుట్టేయబడింది అనే పెద్ద అక్షరాలతో ప్రపంచం అంతా పేపర్లలో వచ్చింది. మొట్టమొడటి గుండె ఆపరేషన్ను డా" విలియమ్స్ విజయవంతంగా చేశాడు.

పిల్లలూ ! డా" విలియమ్స్ నూతన వైద్య విధానాల్ని కనుక్కోవడానికి ఎంత ధైర్యం చూపేవాడో, వాటిలో విజయం సాధించడానికి అంత జాగ్రత్త వహించేవాడు.

ఆర్ధర్ సి. క్లార్క్

"కాకిలా కలకాలం బతికే కంటే హంసలా ఆరు నెలలు బతికినే చాలు" - అని చెపుతుంది మన తెలుగు వారి సామెత. హంసలాగే కలకాలం బతికిన వారు, అరుదుగానే అయినప్పటికీ ప్రపంచ చరిత్రలో మనకి దొరుకుతారు. అటువంటి అరుదైన వ్యక్తులలో వైజ్ఞానిక కల్పనా సాహిత్య రంగంలో ప్రపంచ ప్రఖాతి గాంచిన ఆర్ధర్. సి. క్లార్క్ ఒకరు. 2007 డిసెంబరు 5వ తేదీనాడు ఆయనకు 90 ఏళ్ళు నిండాయి."అంతర్జాతీయ టైటాన్" గా పేరు పొందిన క్లార్క్ శ్రీలంకకు పెంపుడు కొడుకు,పుట్టుక రీత్యా ఇంగ్లాండ్లోని ఒక సాధారణ రైతు కుటుంబీకుడు శ్రీలంక,యు.కె.ల రెండిటి పౌరసత్వం పుచ్చుకొన్న ఈయన ప్రపంచ పౌరుడు. "సూర్యుని చుట్టు 90 ప్రదక్షిణాలు పూర్తి చేసిన మీకు ఈ రోజు ఏమనిపిస్తుంది". అని ఆయనను కొంతమంది స్నేహితులు అడిగారు. ఆ సందర్భంగా ఆయన కొలంబోలోని తన స్వంత ఇంట్లో నుంచి వీడియో ఉపన్యాసం ఇచ్చారు. రోజుకి 15 గం " నిద్రపోతున్న నాకు సుస్పష్టమైన కలలుకనడానికి బాగా సదవకాశం దొరుకుతోంది. నా శరీరం చక్రాల కుర్చీకి అతుక్కుపోయి ఉన్నప్పటికీ, నా బుర్ర ఈ విశ్వం అంత కలియతిరగడానికి అది ఎంత మాత్రం అడ్డంకి కాదు". అని చెప్పారు. ఇదే ఆయన ఇచ్చిన చిట్టచివరి వీడియో ఉపన్యాసం. 2008 మార్చి 19వ తేదీ బుధవారం నాడు క్లార్క్ శాశ్వతంగా కన్నుమూశారు.

1962లో ఆయనకు పోలియో వచ్చింది. జీవిత చరమాంకంలో ఆ వ్యాధి లక్షణాలు ప్రబలి క్లార్క్‌ను చక్రాల కుర్చీకి కట్టి పడేసాయి. అయితేనేమిగాక! చివరి దాకా ఆయన టెలిఫొన్, వీడియోల ద్వారా ప్రపంచానికి అందుబాటులోనే ఉన్నారు. పరిపూర్ణమైన, ఫలప్రదమైన అనేకులకు స్పూర్తిదాయకమైన, అత్యంత ఉపయోగకరమైన జీవితాన్ని గడిపారు. 80 ఏళ్ళు నిండిన నాటికే ఆయన వందల కొద్దీ కల్పనిక, అకల్పనిక వైజ్ఞానిక నవలలు, కథలు, వ్యాసాలు రాసారు. తను రాసిన నవలల ఆధారంగా సినిమాలు కూడా తీశారు.

బాలుడిగా క్లార్క్ అకాశంలో నక్షత్రాలను చూస్తూ ఆనందించేవాడు. పల్స్ మేగజైన్‌లలో వచ్చే వైజ్ఞానిక కల్పనా రచనలని చదివేవాడు. ఆయన తల్లి టెలిగ్రాఫిష్ట్‌గాను, తండ్రి టెలిఫోన్ ఇంజనీరుగాను పనిచేశారు. అయితే రెండవప్రపంచ యుద్ధం పూర్తి అయ్యాక క్లార్క్ తండ్రి, తప్పనిసరి పరిస్థితులలో రైతుగా మారాడు. అకాల మరణం పొందాడు. తండ్రి మరణానికి కొద్దిరోజుల ముందే OLAF Step leton రాసిన Last and First Men పుస్తకాన్ని చదివాడు. అది అతనిపై చెరగని ముద్ర వేసింది. అప్పటి నుండే తాను కూడా వైజ్ఞానిక కల్పనా రచనను చేపట్టాడు.

రెండవ ప్రపంచయుద్ధం తరువాత ఓ 30 సంవత్సరాల కాలంలో పరిశీలించి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ముగ్గురంటే ముగ్గురు వైజ్ఞానిక కల్పనా రచయితలు ఉండేవారు. వారు Robert Heinlein, Issac Asimov, Arther. C.clarke వీరు యువతను భాగా ప్రభావితం చేశాడు. యువత అంతరిక్ష శాస్త్రజ్ఞులుగా, ఇంజనీర్లుగా, శాస్త్ర రంగాలలో దిట్టలుగా తయారు కావడానికి వీరి రచనలు బాగా పురిగొలిపాయి. మరీ ముఖ్యంగా నాసాలో చేరిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లపై వీరి ప్రభావం మొండుగా వుంది.

క్లార్క్‌కి గణితంలో మంచి ప్రావీణ్యత వుంది. కాని డబ్బులేని కారణం చేత ఆయన చదువు పాఠశాలలోనే ఆగిపోయింది. మొదట్లో కొన్నాళ్లు ఆడపాదడపా పనిచేసితరువాత ఎలక్ట్రానిక్స్‌లో ట్రయినింగ్ పొంది రాయిల్ ఎయిర్ ఫోర్స్ (RAF) లో రాడార్ స్పెషలిస్ట్‌గా పని చేశారు. ఆ సమయంలో పొందిన అనుభవంతో Glide Path అనే పుస్తకాన్ని రచించారు. ఇది పూర్తిగా వైజ్ఞానిక రచన. యుద్ధానంతరం ఆయన RAF వదిలి కింగ్స్ కాలేజీ లండన్ నుండి భౌతికశాస్త్రం, గణితంలో డిగ్రీ పొందారు. ఆ తరువాత ఖగోళశాస్త్రంలో పిజి చేశారు. 1945లో ఆయన Wire Less పత్రికలో ఒక వ్యాసాన్ని రాశారు. అందులో Geosynchro nous Satillite Orbit లు సమాచార వ్యవస్థలోనూ, వాతావరణంలో శీతోష్ణ పరిస్థితులను ముందుగా అంచనాలు వేసి తెలుసుకొనేందుకూ బాగా పనికి వస్తాయని చెప్పారు. ఈ పరి కల్పనకు క్లార్క్ ఆద్యుడు కాకపోయినప్పటికీ, ఆయన చేసిన ఈ కృషి వల్లే ఆ రంగం బాగా అభివృద్ధి చెందింది. అందుకే 36 వేల కి.మీ. దూరంలోనూన్న Geosynchro nous Satillite Orbit కి "క్లార్క్ ఆర్బిట్" అని Inter national Astromonical Union వారు పేరు పెట్టారు. క్లార్క్ 1000పైగా చిన్న కథలు వ్యాసాలు రాసారు. ఆయన రాసిన Dial.F.Frankenstein కథ ఇచ్చిన ప్రేరణతోనే బ్రిటీష్ కంప్యూటర్ సైంటిస్టు 1989 లో World Wide Web (WWW) ను ఆవిష్కరించారు.

1948లో ఆన రాసిన "The Sentinal" కథను ఆ తరువాత నవలగా మలచి, 2001 Space Udyssy గా సినీమా తీసారు. ఈ సినీమా ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని ఇచ్చింది. ఈ చిత్రంలో 'Artificial Intellegence' అనే పరికల్పన వుంది. తెలివితేటలలో అన్ని విధాలా మనిషిలాగే సంచరించగలిగే యంత్రం ఆయన ఊహించి కల్పించినది - త్వరలోనే వాస్తవ రూపం పొందగలదు. అన్నదే ఆయన విశ్వాసం. "నానో టెక్నాలజీ రంగంలో సంపూర్ణ అభివృద్ధి జరిగిన రోజున కృత్రిమ మేథస్సులు అత్యంత వేగంగా పుట్టుకొస్తాయని" క్లార్క్ నమ్మకంగా చెప్పారు.

అంతరిక్ష రంగ అభివృద్ధికి తోడ్పడిన క్లార్క్ అంతరిక్షంలోకి పోనేలేదు." అంతరిక్షంలోకి పయనమై నేను పోలేదు అన్న విచారం నాకు లేదు. నా వెంట్రుకలోని DNA ను ఆర్బిట్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాను. ఎప్పుడో మరో కాలంలో ఏ సూపర్ నాగరికత జీవికో అది తారసపడుతుంది. ఆ విధంగా ఆ మరో కాలంలో నేను జీవించి వుంటాను." అన్నారాయన.

సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల ఈనాడు ప్రపంచం కుగ్రామంగా మారింది. అయితే ప్రపంచంలో మనుషులందరూ జాతి విభేధాలు లేకుండా స్నేహభావంతో మెలగాలి. మానవులంతా ఒకే కుటుంబంగా వుండాలి. మనము దయ, కరుణ, సహనాలు అలవరుచుకోవాలి. అదే నిజమైన ప్రపంచీకరణ - అంటాడు క్లార్క్. క్లార్క్ వైజ్ఞానిక కల్పనా సాహిత్య రంగంలో ఒక దృవతార ఆయన మరణం. ఒక యుగాంతానికి చిహ్నం అంటే అతిశయోక్తి కాదు.

లూయీ బ్రెయిలీ (1809 - 1852)

పిల్లలూ !

ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.

బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు”

పద్ధతిలో చదువుకుని, తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ఎదిగాడు బ్రెయిలీ.

పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై కృషిచేసాడు. 1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి, తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.

ఈ నిరంతర శ్రమవల్ల 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రెయిలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్.

ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ.

కె.వి.కె.శర్మ, పి.ఎస్.అనంతసాగర్.

ఒట్టో వలాష్ ( క్రీ.శ. 1847 -1931 )

సుగంధ పరిమళాలు, లేపనాలు, తదితర సువాసనా ద్రవ్యాలు ప్రత్యేకమైన రసాయనిక పదార్థాలు.

భారతదేశం సుగంధాలకు మారుపేరుగా ఉండేది. సుగంధాలు పరిమళాలు ఎక్కువ భాగం సహజంగానే చెట్టు నుంచి, జంతు భాగాల నుంచి లభిస్తున్నాయి. అలాంటి సుగంధాల రసాయనిక నిర్మాణాన్ని కనుగొన్నాక వాటి లక్షణాలే ఉండే విధంగా కృత్రిమంగా కూడా సుగంధ రసాయనిక పదార్థాల్ని ప్రయోగశాలల్లోనూ, పరిశ్రమల్లోనూ తయారు చేస్తున్నారు. పాశ్చాత్య నాగరికత , వాణిజ్య మరియ జీవన విధానం అలవాటయ్యాక మధ్య తరగతి, ఉచ్చ తరగతి ప్రజానీకంలో సుగంధ ద్రవ్యాలు.

పరిమళాల వాడకం హెచ్చయ్యింది.అందాల పోటీలను నిర్వహించి వాటికి ఎప్పుడూ లేని వ్యాపార ప్రతిపత్తిని కల్పించి కోట్లు పోగేసుకుంటున్నారు. అయితే సుగంధ ద్రవ్యాలన్నీ వ్యాపార నిమిత్తమే కాకుండా సత్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని ఔషధాలల్లోనూ, పానీయాల్లోనూ, ఆహార పదార్థాల్లోనూ, పిండి వంటల్లోనూ, పరిసరాల పరిశుభ్రతకు కూడా వాడుకొంటున్నాము.

ఇలాంటి సత్ప్రయోజనాలను ఆశించి సుగంధ రసాయనిక పరిశోధనల మీద విస్తృత ప్రయోగాలు చేసి కీర్తి గడించిన వాడు 17.3.1847 నాడు రష్యాలో జన్మించి ఆ తరువాత జర్మనీలో స్థిరపడ్డాడు. వల్లాష్ గల్టింగన్ విశ్వవిద్యాలయంలో వోలర్ వద్ద డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. యూరియా తయారీకి పేరెన్నిక గన్న వోలర్ గురించి మీరు వినే ఉంటారు. ఆ తర్వాత 1870 లో ఆగస్ట్ కెకులే వద్ద పరిశోధనలు జరిపాడు. బెంజీన్ పదార్థంలో అణువులు సమ షష్టి భుజి నిర్మాణంలో ఉంటాయని చాటిన వాడు కేకులే. ఇంత గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేయడం వల్ల వల్లాష్ కూడా గొప్ప వాడయ్యాడు. ఆయన క్రమేపి సుగంధ ద్రవ్యాల మీద మనసు పడ్డాడు. వివిధ పరిమళ ద్రవ్యాలు, రసాయనికంగా వేర్వేరని అందరూ అంతవరకు భావించేవారు. అయితే అవన్నీ కూడా టర్పీన్ లనే ఒక ప్రత్యేక తరహా రసాయనిక సమ్మేళనాల తరగతికి చెందినవని వల్లాష్ ఋజువు చేశాడు. కర్పూరం, మెంథాల్, సిట్రాల్ వంటివన్నీ టర్పీన్లే ఇలాంటి వందలాది పదార్థాలన్నింటిలోనూ ఒక రసాయనిక నిర్మాణాంశం సార్వత్రికంగా ఉన్నట్లు ఋజువు చేశారు. మొదట కేకులే కూడా ఇవన్నీ వివిధ రకాల పదార్థాలని విశ్వసించారు. వల్లాష్ ఆ రకంగా గురువును మించిన శిష్యుడయ్యాడు. సుగంధాన్ని విరజిమ్మే అనేక వందల పదార్థాలల్లో ఐసాప్రిన్ భాగం సార్వత్రికంగా ఉన్నట్లు సోదాహరణంగా, ప్రయోగ పూర్వకంగా ఋజువు చేసిన వలాష్ ను పరిమళాల పితామహుడు అంటారు. నిరాడంబరతకు, నిస్వార్థతకు పేరిన్నికగన్న వల్లాష్ చేసిన కృషికి గానూ, 1910 సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమానం ఈయనను వరించి నోబెల్ బహుమతికి సుగంధం అబ్బింది.

మేరీక్యూరీ (1867 – 1934)

రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ (1867 – 1934)

తన అద్వితీయ ప్రతిభాపాటవాలతో రేడియంను కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ. 19వ శతాబ్దంలో స్త్రీలకు లలిత కళలు, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్సు చదవడానికి నిరాకరించేవారు. తన నిరంతర పరిశ్రమ, పట్టుదలతో కృషిచేసి నోబెల్ బహుమతి మొట్టమొదటగా పొందిన ధీరవనిత మేరీక్యూరీ. 1903 ఫిజిక్స్ లోను, 1911 లో కెమిస్ట్రీ లోను రెండుసార్లు నోబెల్ బహుమతులు పొంది చరిత్ర సృష్టించింది.మేరీక్యూరీ 1867 లో పోలెండ్ లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది.హైస్కూల్ స్థాయిలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పెదరికం వల్ల చదువు మాని, 10 సంవత్సరాల పాటు ధనికుల ఇండ్లలో పిల్లల్ని చూసే సహాయకురాలుగా గడిపింది.

24 సం. ల వయస్సులో కొంత డబ్బు కూడబెట్టుకొని ఆస్ట్రియాలోని క్రాకో యూనివర్సిటీలో చేరబోతే స్త్రీలు సైన్సు చదవడానికి వీలులేదు పొమ్మన్నారు. చివరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు వచ్చి ప్రఖ్యాత పారిస్ యూనివర్శిటీలో సైన్స్ విద్యార్థినిగా చేరింది. చేరిన మరుక్షణం నుండి మేరీ తన చదువుపైనే మనసు కేంద్రీకరించి రాత్రింబవల్ళు కృషిచేసింది. పేదరికంలో మగ్గుతున్న తను కొద్దపాటి డబ్బుతో చదువుకోవాలి. ఒక చిన్న గదిలో అతి తక్కువ ఖర్చుతో, అర్థాకలితో, చలి దేశమైన ఫ్రాన్సులో ఎముకలు కొరికే చలి ఉన్నా, చేతులు కొంకర్లు పోతున్నా ఒక్కతే అర్థరాత్రి దాటేవరకు తదేక దీక్షతో చదివేది. చివరి పరీక్షలలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థినిగా విజయం సాధించింది.

తన పరిసోధనా కృషిలో మేరీకి ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు పీరీక్యూరీ తో పరిచయం ఏర్పడింది. పరిచయం అనురాగంగా మారి వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. వారి పెళ్ళి మత విశ్వాసాలకు దూరంగా చాలా నిరాడంబరంగా జరిగింది.

రేడియో యాక్టివ్ పదార్థం పిచ్ బ్లెండ్ మీద జరిపిన పరిసోధనా ఫలితంగా మేరీక్యూరీ, పీరీక్యూరీ 1898 లో పోలోనియం కనుగొన్నారు. మేరీ తన స్వదేశమైన పోలండ్ జ్ఞాపకార్థం ఆ కొత్త పదార్థానికి పోలోనియం అని పేరు పెట్టింది. మరికొద్ది నెలల్లోనే వారు ఉభయులూ క్యాన్సర్ చికిత్సకు అతి ప్రధానమైన రేడియంను కనుగొన్నామని ప్రకటించారు. రేడియో అణుభారం 22.5. రేడియం యురేనియం కంటే 20 లక్షల రెట్లు శక్తివంతమైనది. సీసంలో తప్ప మిగిలిన అన్నింటిలో దాని కాంతి రేఖలు ప్రసరించగలవని ఈ యువశాస్త్రవేత్తలు కనుగొన్నారు. రేడియం చాలా ఖరీదైనది. ఒక గ్రామ్ రేడియం విలువ 7 లక్షల 50 వేల గోల్టు ఫ్రాంకులు.

మేరీ పరిసోధనకు ఆమెకు డాక్టరేట్ లభించింది.నోబెల్ బహుమానాన్ని పీరీ దంపతులకు ఇచ్చారు. రేడియో కనుగొనగానే దాన్ని వైద్యశాస్త్రంలో చికిత్స నిమిత్తం వాడడం ప్రారంభించారు. రెడియోపై రాయల్టీ పొందే అవకాశము సైన్సు ఫలితాలు సమాజం కోసం ఉపయోగపడాలన్న ఆశయంతో, తమకు రాయల్టీలు అక్కర్లేదని, విద్య, వైద్య విజ్ఞాన రంగాల్లో దానిని ఎవరైనా ఉత్పత్తి చేయవచ్చని, రేడియంను సంగ్రహించే విదానాన్ని దేశదేశాలవారికి తెలియజేశారు. తన భర్త పీరీ మరణానంతరం ఆమె ప్రాన్సులో సార్ బోర్న్ యూనివర్శిటీలో ప్రోఫెసర్ గా పనిచేసింది. 1914 ప్రపంచ యుద్ధంలో మేరీక్యూరీ X రే పరిశోధనల వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. 1934 జూలై 4న మేరీక్యూరి మరణించింది. ఈ రేడియం కనుగొనడం ద్వారా మానవ జాతి కి ఎనలేని సేవచేసిందో ఆ రేడియం కిరణాలు అధికంగా సోకి ఆమె మరణించింది. ఆమె జీవితం బావిశాస్త్రవేత్తలకు ఆదర్శంకావాలి.

బెకెసీ గియర్గాన్ ( 1899-1972 )

బాలలూ టెలిఫోన్లు, రేడియోలు తదితర సమాచార సాధనాలకు సంబంధించిన ఒక ఇంజనీర్ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశంలో చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి పొందాడంటే నమ్మగలరా ? అయినా ఇది సత్యం. బెకెసీ గియర్గాన్ స్వతహాగా టెలికమ్యూనికేషన్లకు సంబంధించిన ఇంజనీర్. పరిశ్రమల్లో పనిచేసే పారిశ్రామిక శాస్త్రవేత్త. ఈయన మనచెవిలో ఉండే లోపలి చెవి భాగంలో స్ప్రింగులుగా మొత్తగా ఉండే కాక్లియా ఏవిధంగా పనిచేస్తుందో వివరించాడు. వినడం కూడా ఒక రకమైన కమ్యూనికేషన్ కదా.

బెకెసీ గియార్గాన్ 1899 సంవత్సరంలో హంగెరీ లో జన్మించాడు. తరువాత అమెరికాలో స్ధిరపడ్డాడు. మనకు సెల్ ఫోన్లను ఇచ్చే ఒక సంస్ధ సీమన్స్ కంపెనీ. ఇది జర్మనీలో ఉంది. దీన్లో ఆయన ఇంజనీరుగా పనిచేశాడు. 1946 లో స్వీడన్ కు వెళ్ళి అక్కడ పరిశ్రమల్లో పనిచేస్తూనే బోధన వృత్తిని కొనసాగించాడు.

అంతవరకూ పంచేద్రియాల్లో ఒకటైన చెవిఎలా పనిచేస్తుందో కొద్దోగొప్పో అందరికీ తెలిసినా, లోపలిచెవిలో వినికిడి యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. గాలిలోని ధ్వని తరంగాలు చెవిరంధ్రం ద్వారా ప్రయాణించి కర్ణభేరిని కదిలిస్తాయనీ, ఆ కంపనాలు చెవిలో ఉన్నప్పుడు చిన్న ఎముకల గొలుసుద్వారా, కాక్లియాకు ప్రయాణిస్తాయనీ మాత్రమే అంతవరకు తెలుసు. అయితే కాక్లియా ఎందుకు స్ప్రింగులాగా ఉందని గానీ ఆ తరువాత కాక్లియాలో ఏ చర్యలు జరగడం ద్వారా మెదడుకు సంకేతాలు వెళతాయన్న విషయంపట్ల ఎవరకీ అవగాహన లేదు. యాంత్రిక సంకేతాలు విద్యుత్ సంకేతాలుగా మారడమెలాగో అర్థంకాలేదు. గియర్గాన్ హార్వర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ అక్కడే చెవిపనిచేసేవిధానం పట్ల లోతైన పరిశోధనలు చేశారు. కాక్లియా నమూనాలను తయారు చేసి ఆ నమూనా గోడలు మందాన్ని మారుస్తూ వాటిలో రకరకాల ద్రవాలను నింపి ఆ ద్రవాల్లో అల్యూమినియం పొడిని కలిపి విద్యుత్ సంకేతాలు పంపేవాడు. ధ్వని తరంగాలను పంపి వివిధ ప్రాంతాల్లో వివిధ మోతాదుల్లో ధ్వని వ్యతిరేకంగా గుర్తించాడు. ధ్వనితరంగాలు కాక్లియాలోని ద్రవం గుండా ప్రయాణిస్తూ కంపనాలను కలిగిస్తాయనీ పీజో ఎలక్ట్రసిటీ లనే దృగ్వియం ద్వారా ధ్వని తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారతాయనీ, అవి కర్ణనాడుల ద్వారా మెదడుకు చేరుతాయని వివరించాడు.

ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 1961 సంవత్సరపు వైద్యశరీర ధర్మాల రంగపు నోబెల్ బహుమతి ని గియార్గన్ కు బహుకరించారు.

పిల్లలు చూశారా ఇంజనీర్ అయినా ఇతర రంగాల్లో కూడా అవగాహన ఉండడం వల్ల అంతరీయ రంగాల పరిశోధనలెలా వీలవుతాయో ! మీరు కూడా విజ్ఞానాన్ని అన్నికోణాల్లో అవగాహన చేసుకోవాలి(ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా సౌజన్యంతో)

ప్రాణి మూలాన్ని తెలియజేసిన - “ఫ్రాంసిస్ క్రిక్”

విజ్ఞానశాస్త్రం మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తూ వుంది. ఈనాడు జీవకణ శాస్త్రం, బయోటెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం, మానవిని జీవరహస్యాన్ని ఛేదించే దశకు చేరడానికి అవకాశం కల్పించిన శాస్త్రవేత్తలలో “ఫ్రాంసిస్ క్రిక్” ముఖ్యులు. ఆధునిక జీవశాస్త్ర శిల్పిగా ప్రపంచమంతా ఈయనను గుర్తించింది.

ఫ్రాంసిస్ క్రిక్” తన మిత్రుడైన జేమ్స్ వాట్స న్ తో కలిసి “D.N.A” (డీఆక్సీ రైజో న్సూక్లి క్ ఆసిడ్)

నిర్మాణాన్ని బహిర్గతం చేయడం జన్యుశాస్త్ర విస్తరణకు ఎంతగానో తోడ్పడింది. వీరి పరిశోధనలు 19వ శతాబ్దపు డార్విన్ పరిణామ సిద్ధాంతం, మెండల్ అనువంశిక సిద్ధాతాల కొనసాగింపుగా బావించవచ్చు.

మనం నేడు జీవశాస్త్ర లోతుల్లోకెళ్ళి జన్యు మార్పిడి ద్వారా జీవి లక్షణాన్ని మార్చగలిగే స్థాయికి చేరేందుకు పునాదు లేసిన ఫ్రాంసిక్ క్రిక్ ప్రారంభదశలో జీవశాస్త్ర వేత్తకాదంటే నమ్మబుద్దికాదు. ఈయన ఇంగ్లాండ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో భౌతిక పరిశోధనా విద్యార్థిగా వున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ కాలంలో ఆయనకు జీవశాస్త్రం పై అభిరుచి కలిగి జీవరసాయన శాస్త్రాల అధ్యయనానికి పూనుకొన్నాడు. కణరసం భౌతిక లక్షణాలపై పరిశోధన చేపట్టాడు. క్రమంగా జన్యువుల అమరికను గురించి అర్థంచేసుక ని, అమైనో ఆమ్లాల ఆధారితమైన “D.N.A” యొక్క రూపాన్ని అవిష్కరించారు. జేమ్స్ వాట్స న్ తో కలిసి క్రిక్ చేసిన పరిశోధనకు 1962 లో నోబెల్ బహుమతి లభించింది.

ఆనాటికి క్రిక్ కు డాక్టరేట్ కూడాలేదు. క్రిక్ తన పరిశోధన కొనసాగింపుగా జీవి శరీర నిర్మాణానికి కీలకమైన మాంసకృత్తులు ఏరంకంగా తయారవుతాయో తెలిపాడు.

క్రిక్ జీవితం కూడా ఆదర్సప్రాయం. నిరాడంబర జీవితం గడిపారు. బహుమతులకు వెంపర్లాడలేదు. ప్రపంచ స్థాయిలో తాను పొందిన గుర్తింపును ప్రచారాలకు వ్యాపారానికీ వాడుకోలేదు. అందుకే ఆయనకు 1999లో ఇంగ్లాండ్ దేశ అత్యున్నత అవార్డు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చారు. ప్రజా సైన్స్ ఉద్యమాల మార్గదర్శి డా. డె.డి. బెర్నాల్ వంటివారి పరిశోధనలు, క్రిక్ పరిశోధనల ప్రభావితం చెయ్యడం మరో విశేషం.

తన పరిశోధనా ఫలితాల పునాదులపై విస్తరిస్తన్న జీవసాంకేతిక రంగాన్ని క్రిక్ తన జీవిత కాలంలోనే చూడగలడం విశేషం. మానవ జన్యువు లక్షణాలు విశదంగా క్రోడీకరించగల శాస్త్రరంగ అన్వేషణ క్రమంలేనే ఫ్రాసిస్ క్రిక్ 2004 జూలై 28వతేది (తన 88వ ఏఠ) తనువు చాలించాడు. ప్రజాశాస్త్రవేత్తగా మన హృదయాలలో నిలిచిపోయాడు.

ప్రొ.యన్.వేణుగోపాల్ రావు, తిరుపతి

ప్రవర్తనా మనస్తత్వ సిద్దాంతకర్త ఇవాన్ పావ్ లోవ్

శరీర నిర్మాణ శాస్త్రవేత్త మనస్తత్వ శాస్త్రవేత్త మారి ఆహారానికి సంబంధించి జంతువులలో ఎటువంటి స్పందన ప్రతిచర్య ఉంటుందో అధ్యయనం చేసిన రష్యా శాస్త్రవేత్త ఇవాన్ పెట్రోవిచ్ పావ్ విచ్ 1849 సెప్టెంబర్ 26 మాస్కోలో జన్మించాడు.

1883 లో పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయం లో వైద్యం లో డిగ్రీ పొందాడు. 1885 లో శరీర ధర్మ శాస్త్ర ఆచార్యునిగా మిలటరీ మెడికల్ అకాడమీ లో చేరాడు. 1897 లో ఇన్సిట్యూట్ ఆఫ్ ఎక్స పెరి మెంటల్ మెడికల్ డైరక్టర్ పదవీ బాధ్యతలు నిర్వహించారు.

పావ్ లోవ్ జీర్ణక్రియ విధానాన్ని వివరించాడు. అదే అటు తరువాత గాస్ట్రో ఎంమటారజికి దారి తీసింది. ఈ ప్రక్రియలో లాలాజలగ్రధులు. ఉదరం, క్లోమం, కాలేయం, ఎలా రసాయనాలు కలుపుతూ ఆహారం కార్బొహైడ్రేటులు, ప్రాటీ నులు, క్రొవ్వులుగా మారుతుందో అధ్యయనం చేసాడు. ఎంటరో కైనేజ్ అనే ఎంజైమ్ ను కనుగొన్నాడు. 1920 లో జంతు ప్రవర్తనా సిద్దాంతాన్ని ప్రతి పాదించారు.

అతని ప్రకారం నేర్చుకొన్న ప్రవర్తన అనేది, అసంఖ్యాకమైన నిబందనాయుత ప్రతి చర్యల సమాహారం నిర్మాణం అని వివరించాడు. ఉద్రిక్తత భయం విపరీత ప్రపర్తనకు దారి తీస్తాయని, అందుకే ప్రశాంతంగా ఉండే పరిసరాల మద్య ఉండాలని పావి లీవ్ అంటారు.

నబంధనాయుత ప్రతిచర్య ప్రవర్తన సైరాబైల్ కార్టిక్స్ లోని విపరీత ప్రవర్తన కారణంగా కలుగుతున్న పావ్ లోన్ వివరించాడు.

1904 లో జీర్ణక్రియకు సంబంధించిన పరిశోధనకు నోబెల్ బహుమతి లభించింది. ఫిబ్రవరి 27వ పావ్ లీవ్ మరణించాడు.

క్లాడిలూయిస్ బెర్తోలెట్ , N.V.S. రఘు ప్రదీప్

క్లాడిలూయిస్ బెర్తోలెట్

అనువర్తిత
రసాయనశాస్త్రానికి సంబంధించి క్లాడిలూయిస్ బెర్తోలెట్ శాస్త్రవేత్త ను ఆద్యుడిగా పరిగణిస్తారు. వీరు 1748 డిసెంబర్ 9న ఫ్రాన్సు లో సావో జిల్లాలో జన్మించారు. ఇటలీ విశ్వవిద్యాలయంలో వైద్యపట్టాపొందారు.

1768 నుండి 1772 దాకా వైద్యవృత్తి చేసాడు. 1778 లో రెండు వైద్య శాస్త్ర పట్టా లభించింది. దాంతో పాటు రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేసారు. 1785 లో బెర్తోలెట్ రసాయనిక శాస్త్రపు కొత్త వ్యవస్థను ప్రతిపాదించాడు.అది లెవోయిజర్ రూపకల్పన చేసిన ఆధారంగా రూపొందించబడింది.

ఇతని ఉద్యోగజీవితం నెపోలియన్ హయాంలో తారాస్థాయిని తేరుకుంది. నెపోలియన్ కు బెర్తోలెట్ అంటే ఎంతో అభిమానం ఉండేది. ఇటలీలో నుండి పాతచిత్రపటాలను ఫ్రాన్స్ కు తెచ్చే కమీషన్ కి బెర్తోలెట్ను పంపాడు నెపోలియన్. 1798 లో నెపోలియన్ తో ఈజిస్ట్ వెళ్ళాడు. అక్కడ తన చిరకాల మిత్రుడు మంగేతోపాటు రెండేళ్ళు ఉండి నెపోలియన్ వల్ల ఎన్నో ఉన్నత పదవులు పొందారు.

20సం,, వెచ్చించి ఎన్నో ప్రయోగాలు చేశాడు. అమ్మోనియా వేడితో నిర్మితమైందో వివరించారు. గన్ పోడర్ ను మరింత శక్తివంతం చేయడానికి కృషిచేసాడు.

పొటాషియం క్లోరేట్, కర్బనం మిశ్రమంతో తుపాకీ మందు తయారుచేసి 1788 లో ప్రజలు సమక్షంలో ప్రయోగించారు. ఈ ప్రయోగం తర్వాత మిలటరీలో వాడబడింది. క్లోరిన్ వాయువును బ్లీచింగ్ గా వాడటానికి కృషిచేశారు. ఇతని సమకాలీనుడు జేమ్స్ వాట్ లాగా ఇతను తన ఆవిష్కరణలతో ధనం సంపాదించలేదు.

ఈజిప్టులో ఉన్నప్పుడు సోడియం కార్బనేట్ ను నిరంతరం ఉత్పత్తి చేసే సహజ ప్రక్రియను గుర్తించాడు. ఎడారిలో సంభవించే ఈ సహజ ప్రక్రియకు సైద్దాంతిక వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సహజమైన ఉప్పు నిరంతరం విడిపోయి సోడియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్లు ఏర్పడాతాయని వివరించాడు.

బెర్తోలెట్ తన రసాయన శాస్త్ర పరిశోధన అంతా రెండు పుస్తకాలుగా రూపొందించాడు.

“Researches in the laws of chemical affinity (1801) Essay on chemical; statistics”

1807 లో సోషల్ ఆఫ్ అక్వేరియల్ అనే సంస్థ బెర్తో లెట్, లాప్లాస్ ల నేతృత్వంలో ఏర్పడింది. 1810 లో అతని కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంలో బెర్తో లెట్, జీవితం విషాదమయమైంది. 1822 నవంబర్ 6న బెర్తో లెట్ Arcuil లో చనిపోయాడు.

సేకరణ –‘చెకుముకి’, బాలల సైన్స్ మాస పత్రిక

ఫిలిప్ వారెన్, యాండెర్ సన్ - క్రీ.శ. 1923

1923 సం. లో జన్మించిన ఈ యువ శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినవాడు. 1977 వ సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని తన సహచరుడు జాన్ వాన్ వ్లీక్ తో కలిసి పొందాడు.

అయస్కాంత, స్ఫటిక ఘానాలలో ఎలక్ట్రానుల ప్రవర్తన గురించి తాను చేసిన కృషికి ఈ పురస్కారాన్ని పొందాడు.

1960 వ దశకంలో లోహాల, మిశ్రమలోహాల అయస్కాంత లక్షణాలను అంతర్గత అణువులు ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపేందుకు యాండర్ సన్ నమూనాను కనుగొన్నాడు. అలాగే స్ఫటిక పదార్థాలలో మలిన కణాల కదలికలను కూడా వివరించాడు. ప్రస్తుతం ఈ వివరణను యాండర్ సన్ లోకలైజేషన్ పేర పిలుస్తున్నారు.

వీరు సూపర్ కండక్టివిటీ, సూపర్ ప్లుయిడిటీ, లేజర్ యాక్షన్ ల మధ్య గల సంబంధాలను కూడా అధ్యయనం చేశారు. సూపర్ కండక్టివిటీ లో నిరోధకశక్తి ఉందని ఊహించారు.

కంప్యూటర్ మెనరీలు, ఎలక్ట్రానిక్ స్విచ్ లు వంటి పరికరాలలో ప్రస్తుతం వాడే ఖరీదైన సెమీ కండక్టర్ స్పటికాలకు బదులు అసంఘటితంగా ఉన్న గాజురూప ఘనాలు కూడా వాడవచ్చునని వీరి అధ్యయనాలు తెలియజేశాయి. తద్వారా ఎలక్ట్రానిక్ రంగానికి తను విశేషమైన సేవలు అందించారు.

బీర్బల్ సహానీ (1891 – 1949 )

బీర్బల్ సహానీ పేరు వింటే చాలు ఎంతో మందికి పురావృక్ష శాస్త్రం గుర్తుకు వస్తుంది. మన దేశంలో పురావృక్షశాస్త్రం గురించి లోతుగా పరిశోధన చేయటం వీరితోనే మొదలయింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ శాస్త్రవేత్త ఒకచిన్న బోటనీ మ్యూజియంలో కూర్చుని పరిశోధనలు చేయటం ఒక విదేశీ శాస్త్రవేత్తను సైతం ఆశ్చర్య చకితుడిని చేసింది.బీర్బల్ సహానీ నవంబర్ 14, 1891 న ఇప్పటి పాకిస్థాన్ లోని “భేరా” లో జన్మించారు. చిన్నప్పటి నుండి ఈయనకు మొక్కలను, రాళ్ళను, శీలాజాలను పరిశీలించడం పట్ల ఆసక్తి చూపేవారు.

ఈయన లాహోర్ లోని పంజాబ్ యూనివర్సిటీ నుండి పట్ట బద్రుడైన తర్వాత బ్రిటిన్ లోని “లండన్ యూనివర్సిటీ ” నుండి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పట్టా పుచ్చుకున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి కూడా ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పట్టాను పుచ్చుకున్న ప్రథముడిగా కీర్తి గడించారు.1936 లో సహానీని “ఫెలో ఆఫ్ ది రాహల్ సొసైటీ గా” ఎన్నుకున్నారు.

ప్రాచీన శిలాజ మొక్కల గురించి కూలంకషంగా అధ్యయనం చేసిన ఈయన ‘భీహార్ లోని ‘రాజమహల్ కొండలలోని సమస్త వృక్ష జాలాన్ని పరిశోధించారు. ఈయన ఆవిష్కరించిన ‘పెంటోగ్జైలియా’ అనే ‘జిమ్మోస్పెర్మ్’ శిలాజం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించింది.

సహాని ‘భూగర్భ’ శాస్త్రవేత్త కూడా. కొన్ని రకాల శిలల వయస్సును సున్నితమైన పరికరాలు లేకపోయిప్పటికీ ఖచ్చితంగా నిర్ణయించారు. మధ్యప్రదేశ్ లోని ‘డెక్కన్ ట్రూవ్స్’ శిలల వయస్సు 62 కోట్ల సంవత్సరాలని తెలిపారు. ఈయన చిత్రకారుడు కూడా, స్టాంపులు, నాణేలు సేకరించటం అంటే ఇష్టం.

1949 సం. లో భారత ప్రధాని “బీర్బల్ సహానీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పేలియో బోటనీ” సంస్థకు శంకు స్థాపన చేసిన కొద్ది రోజులకే ‘సహాని’ కన్నుమూశారు. పరిశోధనలు అంటే ప్రాణంగా భావించే సహానీ అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉంటారు.

ఆర్కిమెడిస్ (కీ.పూ.187-212)

ఆర్కిమెడిస్ సిసిలీలోని సైరాక్యూస్ నగరంలో క్రీ.పూ. 287 సంవత్సరాలకన్నా ముందు జన్మించారు. గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు రేఖా గణితం, నిశ్చలజల శాస్త్రం యాంత్రిక శాస్త్రాలతో అగ్రగణ్యులు.

సైరాక్యూస్ రోజు హీరో నగరంలోని కంసాలిని పిలిపించి బంగారంతో కిరీటం చేయమని ఆజ్ఞాపించాడు. అతడు చేసి తీసుకురాగానే అది పూర్తిగా బంగారంతో తయారైందా? ఏదైనా కల్తీ ఉందా? అనే అనుమానమొచ్చింది. ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా రాజు ఆర్కిమెడిస్ ను కోరాడు. ఆ రోజుల్లో ఈ విషయాన్ని తేల్చి చెప్పడం సులభం కాదు. ఈ సమస్యకు శాస్త్రీయ పరిష్కారం కనుగొనాలని ఆర్కిమెడిస్ తపించే వాడు. ఒకరోజు అలవాటు ప్రకారం బహిరంగ స్నానాల చోట్లవైపు వెళ్ళాడు. తొట్టితో మునుగుతూ పైకి లేస్తూ నీటి మట్టం మారడం గమనించాడు. తన మనస్సులోని బంగారం సమస్యకు పరిష్కారం దొరికింది. యురేకా యురేకా (నాకు తెలుసు) అంటూ పెద్దగా కేకలు వేస్తూ, వంటి మీద బట్టలు లేవనే విషయాన్ని కూడా మరిచి సైరాక్యూస్ బజార్లో పరిగెత్తాడు.

అనేక ప్రయోగాల ద్వారా పరీక్షించి సూత్రాన్ని ప్రకటించాడు. నీటిలో మునిగిన వస్తువు కోల్పోయిన భారం అది తొలగించిన నీటి భారానికి సమానమని చెప్పాడు. ఈ ఆవిష్కరణ పదార్థాల సాంద్రతలను కనుక్కొవడానికి సహాయపడింది. రాజుగారి కిరీటంలో స్వచ్ఛమైన బంగారం ఎంత ఉన్నదో బయటపడింది. ఇలా నిశ్చల జల శాస్త్రానికి చెందిన ఒక ప్రాథమిక సూత్రం, రెండు వేల సంవత్సరాలకు ముందు ప్రవేశపెట్టబడింది.

ఆర్కిమెడిస్ యువకుడిగా ఉన్నప్పుడు అలెగ్జాండియాలో చదువుకున్నాడు. అక్కడ వుండగానే ఈజిప్టు వ్యవసాయ భూములకు నీరుతోడడానికి ఎంతో అనువైన ఆర్కిమెడియన్ స్క్రూను కనుగొన్నాడు. మెత్తగా వంగే ట్యూ బ్ ను ధృడమైన సిలిండర్ చూట్టూ చుట్టి, సిలిండర్ రెండు చివరలకు ఆధారాలు బిగించి, సిలిండర్ దాని అక్షం పై ఫ్రీగా తిరిగేట్టు ఏర్పాటు చేస్తే, సిలిండర్ కు ఒక వైపు దగ్గరి నీరు క్రమంగా పైకి వస్తుంది. నేడు ఈ ఆర్కిమెడియన్ స్క్రూ వరికోత యంత్రం నుండి ధాన్యాన్ని బయటకు పంపడానికి ఉపయోగిస్తున్నారు. ఆర్కిమెడిస్ జీవిత చివరి దశలో మెడిటేరియన్ సముద్రపు తీర ప్రాంతమంతా సర్వత్రా యుద్ధాలతో సతమతమవుతుండేది. కార్తజనియన్లు రోమన్లు గ్రీకులు. ఒకరిపై ఒకరు యుద్ధాలకు దిగేవారు. నగరాలను ముట్టడించి దోచుకునేవారు. హీరో రాజు ఆర్కిమెడిస్ ను పిలిచి శత్రువును ఎదుర్కోవడానికి శక్తివంతమైన, చమత్కారంతో కూడిన ఆయుధాలను ఏర్పాటు చేయమన్నాడు.

ఆర్కిమెడిస్ తాను తయారు చేసిన యంత్రం సాయంతో రోమన్ల నావలను ముంచేసేవాడు. లేదా దర్పణాలు ద్వారా సూర్యకాంతిని ఫోకస్ చేసి వాటిని తగులబెట్టేవాడు. ఇలా మూడు సంవత్సరాలు పాటు ఆర్కిమెడిస్ తన రాజ్యానికి రక్షణగా నిలిచాడు. చివరిగా క్రీ .పూ. 212 లో సైరాక్యూస్ రోమన్ల వశమైంది. సైరాక్యూస్ సంఖ్యారక్షకుడైన ఆర్కిమెడిస్ అస్తమించాడు. పెంకులపై చిత్రమైన గీతలు గీసుకొంటున్న ఆర్కిమెడిస్, తాను పిలిస్తే రాలేదని ఒక రోమన్ సైనికుడు కత్తితో పొడిచి చంపాడు. ఒక మహత్తర జీవితం ఇలా దయనీయంగా ముగిసిన ముందు తరాలకు ఆదర్శంగా నిలిచింది.

సత్యేంద్రనాథ్ బోస్

పదార్థానికి వాయు, ఘన, ద్రవస్థితులతో పాటు ప్లాస్మా అనే నాలుగవ స్థితి ఉందని మనందరికీ తెలుసు. ఐదవ స్థితి అనేది మరోటి ఉందని దాదాపు 70 సంవత్సరాల క్రితం సూత్రీకరణ చేయబడింది. అయితే దానిని ప్రయోగాత్మకంగా 1995 జూన్ 5వ ధృవీకరించారు. ఈ ఐదవ స్థితిని ఊహించినదెవరు వారే ఎస్.ఎన్.బోస్. ఐన్ స్టీన్. ఐదవ స్థితిలోని పదార్థాన్ని బోస్ ఐన్ స్టీన్ కండెన్సేట్ అంటారు.

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అత్యంత ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ ఐన్ స్టీన్ నే అబ్బురపరచి, ఆకర్షించిన ప్రతిభావంతుడు. వీరు లెక్కించిన విధానాన్ని బోస్ - ఐన్ స్టీన్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తారు. కేంద్రక భౌతిక శాస్త్రం లో బోస్ చేసిన సేవలకు గుర్తుగా ఒక తెగ మౌలిక కణాలను బోనస్ లని పేరుపెట్టారు.

అణువుల మధ్య దూరాన్ని బట్టి పదార్థం యొక్కస్థితి నిర్థారించబడుతుంది. ఘన పదార్థంలో అణువులు చాలా దగ్గరగా ఉండటమే కాకుండా వాటి మధ్య ఆకర్షణ బలాలు బలంగా ఉంటాయి. ద్రవ పదార్థాలలో ఈ ఆకర్షణ తక్కువగా ఉండడం వల్ల అణువులు దూరంగా ఉంటాయి. ఇక వాయుస్థితిలోని అణువులు చాలా దూరంగా ఉండి స్యేచ్ఛగా ఉంటాయి. వీటికి ఉదాహరణ ఐస్, ముక్కలు, నీరు, నీటి ఆవిరి.

అయితే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉదాహరణకు సూర్యుడు, నక్షత్రాల మద్య బాగంలో పదార్థపు నాలుగవ స్థితి వుంటుంది. ఇక్కడ అణువుల నుండి ఎలక్ట్రాన్లు కొన్ని విడివిడి స్యేచ్ఛా ఎలక్ట్రాన్లు ధనాత్మక ఆవేశం గల అయాన్లు ఏర్పడతాయి. అదే ప్లాస్మా. దీన్నే నాలుగల స్థితి అంటారు. ఈ స్థితిలో పదార్థం అసాధారణ ధర్మాలను ప్రదర్శింస్తుంది. ఈ విశ్వంలో దాదాపు 99 శాతం పదార్థం ప్లాస్మా స్థితిలో వుందని తేలింది. ఈ నాలుగవ స్తితులకు భిన్నంగా ఐదవ స్థితి వుందన్న ఇద్దరు మేధావుల అటామిక్ కల 70 సంవత్సరాల తరువాత నిజమైంది.

1924 సంవత్సర ప్రాంతంలో సత్యేంద్రనాథ్ బోస్ సైద్ధాంతిక సూత్రీకరణ కొత్తరకంగా చేసి ఐస్ స్టీ న్ కు చూడమని పంపాడు. దాన్ని చూసి ఆశ్చర్యపడి, ఐన్ స్టీన్ మరికొంత జోడించి ప్రఖ్యాత పరిశోధనా పత్రికకు పంపారు. ఐదవ స్థితిని, వీరు లెక్కించిన పద్దతి బోస్ - ఐన్ స్టీన్ స్టాటిస్టిక్స్ గా ప్రాచుర్యం పొందింది. బోస్ - ఐన్ స్టీన్ సూత్రీకరణలో ఐదవ స్థితి సాధ్యమే అన్నారు. అయితే అది -273. 15 డిగ్రీల సెన్సియస్ దగ్గర అసాధ్యమని భావిస్తూ వచ్చారు.

కాని కొత్త టెక్నాలజీ రావడంతో ఆ ఉష్ణోగ్రత కోసం ప్రయత్నాలు సాగాయి. 1995 జీన్ 5న ఇవి ఫలించాయి. దీన్ని సాధించినవారు అమెరికాలోని కొలరాడోకు చెందిన నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ స్టాండర్ట్ అండ్ టెక్నాలజీల పనిచేసే శాస్త్రావేత్తల బృందం. వారిలో సి.ఇ. వైమన్, ఇ.ఎ.కార్నెల్ అనే వారికి 2001 నోబెల్ బహుమతి లభించింది.

1894 జనవరి 1వ తేది ఎస్.ఎన్.బోస్. జన్మించారు.

స్వాతంత్య్రానికి పూర్వం సుప్రసిద్ధులైన భారతీయ శాస్త్రవేత్తల్లో ఆయన అగ్రగణ్యులు. సి.వి.రామన్. జగదీశ్ చంద్రబోస్, సాహు మొదలైన శాస్త్రవేత్తల కోవలోకి వస్తారు. ఆయన 1974 ఫిబ్రవరి 4 న మరణించారు.

మరికొందరు శాస్త్రవేత్తలు
విక్రమ్ అంబాలాల్ సారాభాయ్

-కె. సుచిత, స్ఫూర్తి పబ్లిక్ స్కూల్, వరంగల్

భారతీయ అంతరిక్ష పరిశోధనా రంగానికి మూల పురుషుడు విక్రమ అంబాలాల్ సారాభాయి. 1919 వ సంవత్సరంలో 12 ఆగష్టున అహ్మదాబాద్ లో సుసంపన్న పారిశ్రామిక కుంటుంబంలో జన్నించి, సాధారణ జీవనం గడిచిన వ్యక్తి. చదువంటే అందులో గణితం , సైన్సు అంటే విక్రమ్ కు ఎంతో ఆసక్తి.

కళాశాల విద్య తరువాత కేంబ్రిడ్జిలో యూనివర్శిటీ చదువుకొనసాగించి భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారు. సుదూర అంతరిక్షం నుంచి భూమిని చేరే కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేయడంలో విక్రమ్ ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఎంతో శక్తితో, భూ అయస్కాంత శక్తితో ఎలా ప్రభావితం అవుతాయన్నది. అయిన పరిశోధించాడు. పూణేలోని వాతావరణ పరిశోధనా సంస్థలో, ఆ తర్వాత కాశ్మీర్ లో కాస్మిక్ కిరణాలపై విక్రమ్ సారాభాయ్ పరిశోధన జరిపాడు.

1947 సం,,లో విక్రమ్ ఫోటోఫిజన్ పై పరిశోధనకు గాను కేంబ్రిడ్జిలోని కావెండిష్ లాబ్ నుండి పి.హెచ్.డి. డిగ్రీ పొందారు. భారతదేశానికి వచ్చాక అహ్మదాబాద్ లో భౌతికశాస్త్ర పరిశోధనాశాల స్థాపించారు. కాస్మిక్ కిరణాలపై అంతరిక్షపరిశోధనా కేంద్రంగా ఈ లాబ్ అబివృద్ధి చెందింది.

1955 లో గుల్ మార్గ్ శ్రీనగర్ లో విక్రమ్ భౌతికశాస్త్ర పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేశారు. 1966 లో దేశ అణుశక్తి సంఘం ఛైర్మన్ గా విక్రమ్ ని ప్రభుత్వం నియమించింది. అంతేగాక వీరు తుంబాలా స్పేస్ సైన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అహ్మదాబాద్ లో ఉపగ్రహ 1975 లో ఆర్యభట్ట తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

వీరికి విద్యార్థులతో చర్చ అంటే చాలా ఆసక్తి తన జీవితకాలంలో సారాభాయ్ శాస్త్ర విజ్ఞాన కేంద్రాలనే గాక సామాజిక, ఆర్థిక సంస్థలను నెలకొల్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాన్య ప్రజల్లో విజ్ఞానశాస్త్రంపై ఆశక్తిని పెంచేందుకు, శాస్త్ర ప్రయోగాలను ప్రోత్సహించేందుకు కృషిచేశారు.

1963 లో నెహ్రూ అభివృద్ధి అధ్యయన సంస్థకు ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ సంస్థను కూడా వీరే ఏర్పాటుచేశారు.

ఉన్నత విద్యను అభ్యసించడానికి, శాస్త్ర సాంకేతక రంగాల్లో ఆధునాతన పరిణామాలను అధ్యయనం చేయడానికి విద్యార్థులు విదేసాలకు వెళ్ళినా భారతదేశ అభివృద్ధి కోసం స్వదేశానికి వచ్చి సేవచేయాలనేది వీరి విశ్వాసం. భారతీయ అంతరిక్ష రంగానికి మూల పురుషుడైన విక్రంసారాబాయి - అంతరిక్ష పరిశోధనకు బీజాలు వేయడమేగాక సమాజంలో వైజ్ఞానిక శాస్త్ర పరిశోధన పట్ల అవగాహన పెంపొందించిన ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త 1971 జిసెంబర్ 31 వ తేదీన మరణించాడు.

విలియం హార్వే

16 శతాబ్దంలో శరీర నిర్మాణం గురించి, ముఖ్యంగా గుండె నిర్మాణం, పనిచేసే విధానం, గురించి అనేక పరిశోధనలు జరిగాయి. అయితే గుండె గురించి తెలుసుకునేందుకు దేవుడుకొక్కడికే సామర్థ్యం ఉందనీ, మానవులకు దాని గురించి తెలియదనీ భావించేవారు. పైగా శరీరాన్ని కోసి గుండెను తీసి దాన్ని గురించి అధ్యయనం చేయడం పాప కార్యంగా భావించే వారు. అలా చేయడం అప్పటి రాజుల దృష్టిలో నేరం కూడా. అలాంటి మూఢనమ్మకాలున్న వ్యవస్థ నుండి బయటపడి, అర్థరాత్రి పూట శ్మశానాల నుండి శవాలను దొంగిలించి, వాటిని కోసి గుండెకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మిగతా జంతువుల గుండెలతో పోల్చి, శాస్త్రబద్ధంగా వివరించిన ఘనత విలియం హార్వేకు దక్కుతుంది.

హార్వే 1578 ఏప్రిల్ లో లండన్ లో ఒక సంపన్న కుంటుంబంలో జన్మించాడు. 19 వ ఏట కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి, జీవశాస్త్రంలో డిగ్రీపోందాడు. తరువాత పాడువావెల్లి హరోనియస్ ఫాబ్రీసియస్ అనే ప్రముఖ వైద్యశాస్త్రజ్ఞుని వద్ద శిష్యుడిగా చేరాడు. 1602 లో వైద్య శాస్త్రంలో డిగ్రీ పొందాడు.

హార్వే గుండెపై పరిశోధన చేయాలని ఎప్పటినుంచో కోరికగా ఉండేది. గుండె గురించి అనేక సందేహాలు హార్వేను పట్టిపీడిస్తూ వుండేది. గుండెనుంచి బయలుదేరిన రక్తం రక్తనాళాలలో అటూ ఇటూ ప్రవహించి చివరికి హరించుకు పోతుందేకానీ, మళ్ళీ గుండెకు చేరదని అందరూ భావించేవారు. ఇందులో నిజం ఉన్నట్లు హార్వేకు తోచలేదు.

హార్వే రాయల్ కాలేజ్ ఆఫ్ పిజిషియన్స్ లో లెక్చరర్ అయి కప్పలు కోళ్ళు పిండాలపై పరిశోధనలు ప్రారంభించాడు. వాటి రక్తప్రసరణ గురించి అధ్యయనం చేశాడు. గుండె ముడుచు కోవడం వల్ల రక్తం ధమనుల ద్వారా రక్తనాళాలను చేరుతుందని తెలుసుకున్నాడు. మానవగుండెలో 4 గదులుంటాయని ధమనుల ద్వారా గుండె నుండి రక్తం, శరీరంలోకి నెట్టబడుతుందనీ, సిరల ద్వారా శరీర భాగాల నుండి రక్తం గుండెను చేరుతుందని రుజువు చేశారు. నాడీ వేగం, గుండె స్పందించే రేటు తెలుసుకొని రెండూ ఒకటే అని రుజువు చేశాడు. హార్వే తన పరిశోధనల ఫలితాన్ని సమీకరించి 1628 లో అనటామికల్, ఎక్సర్ సైజు అండ్ మోషన్ అప్ ది హార్ట్ అండ్ బ్లడ్ అనే పుస్తకరూపంలో ప్రచురించాడు. ఇది వైద్యశాస్త్ర చరిత్రలో ఇప్పటికీ ప్రమాణం శిరోధార్యం.

ఈ పుస్తకం హార్వేకు ఎంతో పేరు తెచ్చింది. హార్వే మొదటి ఛార్లస్ మహా రాజుకు ఆస్థాన వైద్యుడయ్యాడు. హార్వే 1657 మరణించినా గుండె పై ఆయన జరిపిన పరిశోధనలు వైద్యరంగంలో సమున్నతస్థానాన్ని ఆక్రమించి ఆయనను చిరస్మరణీయుడిగా చేశాయి.

మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్

బాల్యం నుండి యుక్త వయస్సు వరకు, మానవనైజంలో కలిగే మార్పులను, అభివృద్ధిని పరిశీలించి, మనస్తత్వ శాస్త్రానికి ఎన్నో ప్రతిపాదనలు ఆవిష్కరణలు జోడించి, మానవ మేధస్సుకు పదును పెట్టిన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడే ఆయన ఆవిష్కరణలు ప్రయోగాలు, సిద్దాంతాలు మానసిక జబ్బులు పరిశీలనా విధానాలను పూర్తిగా మార్చివేశాయి. మానసిక అనారోగ్యాన్ని ఇతర శారీరక జబ్బుల్లాగానే గుర్తించడం ప్రారంభమైంది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ మే 6, 1856 ఆస్ట్రియన్ నగరంలో జన్మించాడు. తల్లి అమలియ ఫ్రాయిడ్ తండ్రి జాకబ్ ఫ్రాయిడ్. ఆయన ఒక చిన్న బట్టల మిల్లు యజమాని. తన కొడుకు ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి జన్మించాడని తల్లి నమ్మేది. తన కుమారునికి కావలసినన్నీ సమకూర్చింది. సిగ్మండ్ పెద్దవాడవుతున్న కొద్దీ, తనకు తల్లితో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. ఇది తనపై ఎంతో ప్రభావం చూపి తన అభివృద్ధికి తోడ్పడిందని చెప్పుకున్నాడు. ఒక వ్యక్తికి ఎలాంటి బాధలు లేని ప్రియమైన తల్లి జీవితాంతం ఉండటంవల్ల ఒక విజేతగా అనుభూతి పొందుతాడు.

సిగ్మండ్ కి 8 సం,,రాల వయస్సు వచ్చేవరకు తండ్రే ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. తన 8 వ ఏట వియన్నాలో స్పెరల్ ఉన్నత పాఠశాలలో చేరినాడు. క్లాసులో ప్రతిసారీ ప్రధమస్థానం పొందేవాడు. సాహిత్యం పై తత్వశాస్త్రంపై ఎక్కువ మక్కువ చదివేవాడు. 14 వ సం,, వయస్సుకే, కెంట్ ను జర్మన్ తత్వవేత్త హెగెల్ ను గుర్తించి, వారి రచనలు తదివేవాడు. స్కూలు వదిలేనాటికి ఫ్రాయిడ్ మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కోరికకు కారణం అప్పుడే ప్రపంచాన్ని బద్దలుచేస్తూ వచ్చిన డార్విన్ ఆవిష్కరణలు సిద్ధాంతాలు.

ఐదు సంవత్లసరాల్లో పూర్తికావల్సిన వైద్యవిద్య. అతని పరిశోధనల్లో మునిగి తేలడంవల్ల ఫ్రాయిడ్ కు 8 దేళ్ళు పట్టింది. వియన్నా జనరల్ హాస్పిటల్లో పనిచేసే కాలంలో మానవ కేంద్రీయ నాడీవ్యవస్థ పై అధ్యయనం చేశాడు. ప్యారిస్ లో చాల్ కాట్ అనే ప్రఖ్యాత నిపుణుని పర్యవేక్షణలో నరాల అధ్యయనం చేసాడు.

ఫ్రాయిడ్ నరాల జబ్బు స్పెషలిస్టుగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించాడు. తొలిరోజుల్లో ఫ్రాయిడ్ ఎంతో వ్యతిరేకతను కష్టాలను ఎదుర్కొన్నాడు. చాల్ కాట్ మార్గదర్శకత్వంలో తాను పెంచుకున్న కొత్త ఆలోచనను చూచి వియన్నా వైద్యసమాజం ఆయనను ఛీకొట్టింది.

వైద్యనిపుణులు ఆయనను దూరంగా వుంచినా, రోగులతో తన కార్యక్రమం ప్రతి ఒక్కరినీ ఆకర్షింపసాగింది. కొద్ది సమయంలోనే అతని కన్సల్టింగ్ రూమ్ అన్ని రకాల నరాల వ్యాధులతో బాధపడే రోగులతో నిండి పోయివుండేది. ఈ రోగులకు వైద్యం సమకూర్చుతూ తన ప్రయోగాల చేయనారంభించేవాడు. తన సిద్ధాంతాలను ఆవిష్కరించాడు. తన మొదటి ప్రయోగమైన మూర్ఛరోగం పై పదేళ్ళ పరిశోధనా ఫలితాన్ని 1895 ప్రకటించాడు.

హిస్టీరియాపై పరిశోధనా వైద్య మనస్తత్వశాస్త్ర చరిత్రలో ఒక మైలురాయి. ఫ్రాయిడ్ న్యూరోటిక్ జబ్బులకు కారణాలను వాటి నివారణలను గురించి తనపరిశోధనలపై ఏ మాత్రం పట్టువీడలేదు. ఈ ప్రయత్నంలో ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు, భావనలు కొత్తవి కావడంతో వైద్యవిద్యలో వైషమ్యాలకు దారితీస్తుంది.

ఫ్రాయిడ్ ఆధునిక సిద్ధాంతాలు కలలకు అర్థాన్ని వివరించాయి. అపస్మారక శక్తుల గురించి వివరించాయి. దెయ్యాలు, భూతాలు పూనకాలు, పరకాయప్రదేశ విద్యలను చావుదెబ్బకొట్టాయి. 1900 సం,,లో ఫ్రాయిడ్ ప్రచురించిన ఆయనకు అంతర్జాతీయఖ్యాతిని తెచ్చింది. తన రచనలపట్ల ఎన్నో తీవ్రవాదనలు చెలరేగినా సైకో అనాలసిస్ (మనో విశ్లేషణ) నరాలవ్యాధి నిర్ధారణకు ఒక పద్ధతిగా ఒక నియమంగా రూపొందింది. ఫ్రాయిడ్ ను వైద్యమనస్తత్వ శాస్త్రంలో ధృవతారగా నిలిపింది.

డా.విలియమ్స్

1856లో డేనియల్ హాల్ విలియమ్స్ పుట్టేనాటికి కొంతమంది అమెరికా ఆఫ్రికన్లు ఇంకా బానిసలుగా ఉండేవారు. అయితే అతని తల్లి తండ్రి ఎప్పుడూ బానిసలుగా లేరు. పెన్సిల్వేనియాలో పెద్ద ఇంటిలో వుండే వాళ్ళు అక్కడే వాళ్ళ నాన్న మంగలి షాపు నడిపేవాడు. నాన్న కటింగ్, షేవింగ్ చేస్తూ వుంటే చూస్తూవుండడం బుల్లి విలియమ్స్కు బలే సరదా! అక్కడికి వచ్చే కస్టమర్లు అంతా నల్లవాళ్ళే. వాళ్ళు తాము ఎలా బాధపడిందీ, ఎలా స్వేచ్ఛ పొందిందీ చెపుతూ వుండేవారు. విలియమ్స్కు 11 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న చనిపోయారు. ఏదైనా పని వెతుక్కోవడానికి విలియమ్స్ చాలా చిన్నవాడు.

అంచేత చెప్పుల తయారీ నేర్చుకోవడానికి బాల్టిమోర్ వెళ్ళాడు. కొంతకాలానికి స్వంత ఊరువచ్చి ఒక మంగలిషాపులో కుదిరాడు.విలియమ్స్కి బడికి పోవాలని కోరికగా వుండేది. దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివేవాడు. పనిచేస్తూ డబ్బు దాచుకొని ప్రైవేటు స్కూల్ ద్వారా చదివేవాడు.

21 సంవత్సరాలు వచ్చేటప్పటికీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేశాడు. అయినా ఇంకా చదవాలని తపన. ఆ పట్టణంలో ఒక డాక్టరును బ్రతిమాలి అసిస్టెంట్గా చేరాడు. వైద్యానికి సంబంధించిన పుస్తకాలు విరివిగా చదివాడు. రెండు సంవత్సరముల తరువాత చికాగో మెడికల్ కాలేజీలో ప్రవేశించాడు. తదుపరి 3 సంవత్సరాలకు MD డిగ్రీ అందుకున్నాడు. ఆ డిగ్రీ ద్వారా ఇక నుంచి వైద్య వృత్తి చేయడానికి నిజమైన డాక్టరు అయ్యాడు.

డా " విలియమ్స్కి రోగి నలుపా, తెలుపా అనేది చూసేవాడు కాదు. ఆనీ అప్పట్లో చాలమంది చర్మపు రంగు చూసి వైద్యం చేసేవారు. చాలామంది నల్ల దాక్టర్లకు మల్లే ఇతను పనిచేయడానికి ఏ హాస్పిటలూ అనుమతించలేదు. అనాధశరణాలయంలో డాక్టరుగా, రైల్వే కంపెనీలో సర్జనుగా పనిచేసేవాడు. ఒకానొక కాలేజీలో వైద్య శాస్త్రం బోధించేవాడు. వైద్యం చేయడంలో తెల్లవాళ్ళతో సమానంగా నల్లవాళ్ళను చూడకపోవడం విలియమ్స్ను కలవరపర్చింది. పరిస్థితుల్ని మార్చాలనుకొన్నాడు. 1891లో చికాగోలో ప్రావిడెంట్ హాస్పిటల్ నెలకొల్పాడు. అందులో నలుపు, తెలుపు డాక్టర్లు కలిసిపనిచేసేవారు. రోగి చర్మపు రంగుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వైద్యం చేసేవారు.

ప్రావిడెంట్ హాస్పిటల్ ఒక గొప్ప విజయమేకానీ అందులో డా " విలియమ్స్ చేసిన ఒక ఆపరేషన్ వైద్య చరిత్రలో విఖ్యాతమైనది. 1893లో గుండెలో కత్తి దిగబడివున్న ఒక మనిషిని పరీక్షించాడు. ఆ రోగికి లోపల ఏమైందో తెలుసుకొనే అవకాశం డా" విలియమ్స్కు లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్స్రే మిషన్లు లేవు. "తాను చేయగలిగింది గాయాన్ని తెరిచి చూడడమే." అని యోచించాడు. అది ప్రమాదమే కానీ ఆ అవకాశం వదులుకుంటే మనిషి చనిపోతాడు. 6 మంది డాక్టర్ల సహకారంతో మనిషి ఛాతీని తెరిచాడు. ఇంకా తెరిచాడు. సమస్యను గుర్తించాడు. తెగివున్న రక్తనాళాన్ని రిపేరు చేశాడు. గుండె చుట్టూ వున్న కండరాల్ని కుట్టేశాడు. మనిషి గుండె కుట్టేయబడింది అనే పెద్ద అక్షరాలతో ప్రపంచం అంతా పేపర్లలో వచ్చింది. మొట్టమొడటి గుండె ఆపరేషన్ను డా" విలియమ్స్ విజయవంతంగా చేశాడు.

పిల్లలూ ! డా" విలియమ్స్ నూతన వైద్య విధానాల్ని కనుక్కోవడానికి ఎంత ధైర్యం చూపేవాడో, వాటిలో విజయం సాధించడానికి అంత జాగ్రత్త వహించేవాడు.

జోసెఫ్ లిస్టర్ (1827 - 1912)

బాలలూ !

మీరంతా బాగా చదవాలనీ మీలో చాలా మంది డాక్టర్లు కావాలనీ ఇప్పటి నుంచే పథకం వేస్తున్నారు. అవునా ? చిన్న వయస్సులోనే అధ్భుతమైన విషయాన్ని కనిపెట్టిన శాస్త్రజ్ఞుణ్ణి గురించి చెబుతా వినండి.

మనకేదయినా గాయం తగిలినప్పుడు అది మానాలంటే చీము పట్టకూడదు. మరి ఆపరేషన్లు చేసే డాక్టర్లు కూడా కత్తితో శరీరాన్ని కోస్తారు. ఆపరేషన్ విజయవంతం కావాలంటే గాయం మానాలంటే చీము (PUSS)పట్టకుండా వుండాలి.

చీముపట్టడం అనే రోగుల పాలిటి రాక్షసికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన వీరుడు జోసెఫ్ లిస్టర్ బ్రిటన్ దేశస్థుడైన లిస్టర్ 1827 సం,,నుండి 1912 వరకూ జీవించాడు. తమ తండ్రి సరిచేసిన సూక్ష్మ దర్శిని తో జంతువుల మీదా మనుషుల మీదా ఆ రోజుల్లో అనేక ప్రయోగాలు చేశాడు. గాయాలకు చీముపట్టడం సర్వ సాధారణం. యుద్ధంలో గానీ లేక మరో ప్రమాదంలో గానీ గాయం తగిలి ఆపరేషన్ చేయించుకుంటే దాదాపు నూటికి నూరు మంది చనిపోయే వాళ్లు. భయంకరమైన ఈ పరిస్థితి చూసి డాక్టర్ లిస్టర్ చాలా బాధపడ్డాడు. ఆశ్చర్యపడ్డాడు. అంతే ! అద్భుతమైన రాత్రుల్ని తన శాస్త్రీయ ప్రయోగాలతో నింపివేసాడు. పగలంతా ఆసుపత్రిలో డాక్టరు వృత్తిలో అలసిపోయి రాత్రి ఇంటికి రాగానే సూక్ష్మదర్శినితో ప్రయోగాలు ఎన్నో విలువైన గంటల్ని ఎర్రబడ్డ కళ్ళతో ఎలా గడిపాడో తెలియదు. 28 సం.. వయసులోనే ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టాడు. అదేమిటంటే గాయం తగిలిన ప్రదేశానికి రక్త ప్రసరణ చాలా హెచ్చుగా వుందనీ, ఈ రక్త ప్రసరణ గాయం నుండీ శరీరాన్ని రక్షించడానికేననీ.

అప్పటికే లూయీస్ పాశ్చర్ ఊహించిన సూక్ష్మజీవులు వుండనే వున్నాయి. అవే చీము పట్టడానికి కారణం ఎందుకు కారాదని లిస్టర్ ప్రశ్నించుకున్నాడు. ఇక సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా మురుగు నీళ్ళను శుభ్రపరచడానికి వాడే కార్బాలిక్ యాసిడ్ (ఫినాల్) ను ఆ తర్వాత అయోడిన్ లాంటి రసాయనలను కూడా వాడకంలోకి తెచ్చాడు. వీటిని ఉపయోగించి అనేక ఆపరేషన్ చేసి పరికరాలను, కుట్లు వేసే దారాలను, గాయాలను శుభ్రం చేశాడు. డాక్టర్లు అంత వరకూ ఊహించని అనేక ఆపరేషన్లు లాంటి పెద్ద శస్త్ర చికిత్సలు చేస్తున్నా లిస్టర్ ప్రతిపాదించిన చీము వ్యతిరేక పద్ధతి తప్పక అమలు జరపాల్సిందే !.

అందుకే లిస్టర్ ను “ఆధునిక శస్త్ర చికిత్స పితామహుడు” అంటారు. అసలు మొత్తం శస్త్ర చికిత్స విజ్ఞానాన్నే రెండుగా విభజించి లిస్టర్ కు ముందు శస్త్ర చికిత్స, లిస్టర్ తర్వాతి శస్త్ర చికిత్స అంటారు.

మరీ మీరు మామూలు డాక్టర్లవ్యాలనుకుంటున్నారా లేక లిస్టర్ కావాలనుకుంటున్నారా ?

జీవ పరిణామ సిద్దాంతానికి ఆద్యుడు

జీన్ బాప్టిస్ట్ లామార్క్

ఫ్రెంచి జీవశాస్త్రవేత్త జీన్ బాప్టిస్ట్ లామార్క్ 1744 ఆగస్టు 1 న జన్మించాడు. జీవ పరిణామవాదాన్ని మొట్ట మొదట ప్రతి పాదించింది. ఈయనే, ఈయన సిద్దాంతం ప్రకారం మొక్కలు జంతువులు పరిసరాలకు తగినట్లు తమ ఆకారాలు మార్చుకుంటాయని, ఆ మార్పులు వాటి తర్వాత తరాలకు సంక్రమిస్తాయని వివరించాడు. ఆయన సిద్దాంతంలోని 2 ముఖ్య సూత్రాలు 1. ఉపయుక్త, నిరుపయుక్త సూత్రం ఉదాః ఎత్తయిన చెట్ల ఆకులు అందుకోవడాని జిరాఫీ మెడసాచి, సాచి అలా పొడవు పెరిగింది.

2. ఆర్జిత గుణాల అనువంశికతః జీవులు తాము పొందిన లక్షణాలనే తర్వాత తరాలకు అందిస్తాయనేది ఈ సిద్దాంత సారాంశం.

ఉదాః మెడపొడవైన జిరాఫీలు ఆ లక్షణాన్ని తమ తర్వాత తరాలకు అందిస్తాయి.

ఈయన సిద్ధాంతాలు తిరస్కరించబడినా, ఆ తర్వాత డార్విన్ లాంటి జీవపరిణామ సిద్దాంత వేత్తల్లో ఆలోచనలను తండ్రి ఒక మతపరమైన స్కూలులో చేర్పించాడు. లామార్క్ మతసంబంధ విషయాలేమీ రుచించలేదు. మత పాఠశాలను వదిలి, మెలిటరీలో చేరి ఫ్రెంటి సరిహద్దు దళంలో అనేక స్థావరాలలో పనిచేశాడు. ఆ సమయంలోనే ఫ్రాన్స్ లో గల సకల వృక్షజాతుల గురించి, కూలంకషంగా అధ్యయనం చేసే అవకాశం లామార్క్ కు లభించింది. లామార్క్ కు చిన్నప్పటి నుండి శాస్త్రం అంటే చాలా ఇష్టం.

సైన్యంలో చేరిన తొమ్మిదేళ్ళకు ఆరోగ్య క్షీణించడంతో మిలటరీకి స్వస్తి చెప్పి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు వైద్య శాస్త్రం రసాయన శాస్త్రం అభ్యసించాడు. జీవపరిణామ సిద్దాంతానికి పునాదులు వేశాడు.

లామార్క్ వ్యక్తి గత జీవితం, పేదరికం, విషాదంతో ముగిసింది. 1829 మరణించాక ఆయన, పుస్తకాలు, సేకరించిన వస్తువులు, గవ్వలు వేలంవేసి ఆ డబ్బుతో దహనక్రియలు జరపాల్సి వచ్చింది..

శాస్త్రవేత్తలలో మణిపూస- మైఖేల్ ఫారడే

బాలలూ !

మనమిప్పుడు మన జీవితాల్లో వెలుగులు నింపిన మరో గొప్ప సైంటిస్టు గురించి తెలుసుకుందాం. ఈనాడు మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రికల్ జనరేటర్, డైనమో, ట్రాన్స్ ఫార్మర్ సూత్రాలకు మూలపురుషుడు మైఖేల్ పారడే.

ఫారడే సెప్టెంబర్ 22, 1791 సంవత్సరంలో ఒక పేద కమ్మరి (BLACK SMITH) కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. జీవనం గడవడమే కష్టమై స్కూలు మానేసి ఒక పుస్తకాల బైండిగ్ షాపులో చేరాడు. అక్కడ పనిచేసిన ఆ ఎనిమిదేళ్ళలోనే “ఎన్ సైక్లోపిడియా” బ్రిటానికా అనే పుస్తకం మొత్తాన్ని చదివేశాడు. ఆ పుస్తకం ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఇవేకాక ఎన్నో రసాయన శాస్త్ర గ్రంథాలు ఆయనను శాస్త్రీయ దృక్పథం వైపు మళ్ళించాయి. ఒకసారి రాయల్ పరిశోధనా సంస్థవారి సైన్సు సమావేశాలకు ఉచితంగా టిక్కెట్ దొరికితే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అప్పుడు సర్ హంఫ్రీడేవీ ఇచ్చిన ఉపన్యాసాలు అతణ్ణి ఎంతో ఆకర్షించాయి. ఆ ఉపన్యాసాన్ని చేత్తో రాసుకొని ఒక పుస్తకం లాగా స్వయంగా బైండు చేసుకున్నాడు.

మైఖేల్ ఫారడే మొదట హంప్రిడేవీ వద్ద ప్రయోగశాలలో పలిచేసేవాడు అతని ప్రతిభ చూసి అసిస్టెంట్ గా చేశారు. త్వరలోనే అవిరాళకృషితో ఆ సంస్థ డైరెక్టరయ్యారు. క్రమంగా రసాయనిక భౌతిక శాస్త్రాలపై దృష్టి మరల్చి పరిశోధనలు కొనసాగించాడు.

ఫారడే విద్యుద్విశ్లేషణ సూత్రాలు ఇప్పటికీ రసాయన శాస్త్రవేత్తలకు శిరోధార్యాలు. ఆయన మొట్టమొదటి ప్రయోగాత్మక ఫలితం ట్రాన్స్ ఫార్మర్. ఆ తరవాత విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే మొదటి డైనమో తయారు చేశారు. ఏనోడ్, కేథోడ్, ఏనయాన్, కేటయాన్, ఎలక్టోలైట్ ఎలక్ట్రాలసిస్ అనే పదాలను ప్రవేశపెట్టాడు. కాంతికి విద్యుదయస్కాంత లక్షణాలున్నాయని, కాంతిని అయస్కాంత క్షేత్రంలో తిప్పగలమని నిరూపించాడు. దీనినే ఫారడే ఎఫెక్ట్ అంటారు. ఈ సూత్రం ఆధారంగానే నేటి ఎలక్ట్రాన్ మైక్రో స్కోపు పలిచేస్తున్నది.

“విజ్ఞాన శాస్త్రం ప్రకృతి, ఏ కోణంలో చేసినప్పటికీ ఒకే సత్యాన్ని భోధిస్తాయి. అయితే ఆ రెంటినీ సమన్వయంచేసి ఎదుటువారికి వివరించగలిగే నేర్పు, కళ ప్రతి ఉపాధ్యాయుడికీ వుండాలి”. అని ఫారడే అనేవాడు. అప్పుట్లో నోబెల్ బహుమతి ఉన్నట్లయితే ఫారడేకి పదిసార్లయినా ఆ బహుమతి వచ్చి వుండేదని ఇప్పటి శాస్త్రజ్ఞులు అంటుంటారు.

ప్రపంచ వైజ్ఞానిక రంగంలో చిరస్మరణీయుడైన ఈ మహనీయుడు 1867 సంవత్సరంలో మరణించారు. ఆయన జ్ఞాపకార్థం, 96,500 కూలుంబ్ ల విద్యుదావేశాన్ని “ఫారడే” అని పిలుస్తారు.

కోప్లే అవార్డును అందుకోబోతున్న- హాకింగ్

ప్రతి సంవత్సరం శాస్త్ర సాంకేతిక, సామాజిక రంగాల్లో నిష్టాతులైన వారు “నోబెల్ బహుమతి” ని పొందడం చూస్తూనే వున్నాం. అయితే శాస్త్ర రంగ విజ్ఞానవంతులకు అరుదుగా లభించే మరో ప్రపంచ స్థాయి పురస్కారం - “కోప్లే విశిష్ట పతకం” గురించి ఎక్కువ మంది తెలియదు. ఇంగ్లాండ్ దేశంలోని రాయల్ సొసైటీ వారు క్రీ.శ. 1731 లో అనగా నోబెల్ బహుమతి కంటే, 170 సంవత్సరాలకు ముందు నుండి, “కోప్లే విశిష్ట పతకాన్ని ఇవ్వడం, ప్రారంభించారు. ఈ అరుదైన అతి విలువైన పురస్కారాన్ని ఛార్లెస్ డార్విన్, బెంజిమెన్ ఫ్రాంక్లిన్, కెప్టెన్ జేమ్స్ కుక్, ఆల్ బర్ట్ ఐన్ స్టీన్, ఫ్రాన్సిస్ క్రిక్ వంటి ప్రముఖ శాస్త్ర వేత్తలకు ఈ సొసైటీ ఇచ్చింది. ఈ సంవత్సరం ఈ పురస్కారానికి అర్హుడిగా “ప్రొ,,స్టీఫెగ్ ను హాకింగ్” ను రాయల్ సొసైటీ ప్రకటించింది. హాకింగ్ నవంబర్ 30, 2006 న “కోప్లే పథకాన్ని” 500 పౌండ్ల ధనాన్ని పొందుతాడు. వాస్తవానికి ద్రవ్య రూపేమా నోబెల్ బహుమతి (7,500 పౌండ్లు) కంటే ఇది చాలా తక్కువే, కాని గుర్తింపు రీత్యా ఇది ప్రపంచంలో శాస్త్రజ్ఞులకివ్వబడే అత్యున్నత పురస్కారం.

ఇంతకీ ఈ “స్టీఫెన్ హాకింగ్” ఎవరు ప్రొ,, హాకింగ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో భౌతిక, గణిత శాస్త్రాల అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఒక ప్రముఖ శాస్త్రవేత్త. వింతైన శారీరక రుగ్మతల (నరాల జబ్బు) తో అవాటివాడైన ఈ మహామేధావి,,,, అఖండమైన తన అవగాహనా శక్తితో ఎందర్నో మెప్పించాడు. తన కాలం చరిత్ర సంపుటితో ప్రపంచంలోని మేటి శాస్త్రరంగ పరిశోధకులకు మార్గదర్శి అయ్యాడు. 20వ శతాబ్దపు మహా శాస్త్రవేత్తగా గుర్తించబడిన “ఆల్బర్ట్ ఐన్ స్టీన్” వారసుడిగా అభినందించబడ్డాయి.

స్టీఫెన్ హాకింగ్ 1970 ల్లోనే బ్లాక్ హోల్స్ ద్వారా ఉత్పన్నమవుతున్న రేడియేషన్ గురించి విశదీకరించి భౌతిక శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాడు. భారత - అమెరికన్ నోబెల్ పురస్కార గ్రహీత. ప్రో,, చంద్రశేఖర్ అసంపూర్ణంగా వదిలి వెళ్ళిన భౌతిక శాస్త్ర పరిశోధనల్ని కేవలం తన “యిమేజినేషన్” శక్తితో ప్రొ,,హాకింగ్ పరిపుష్టం చేస్తున్నాడు. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్దాంతాన్ని క్వాంటమ్ మెకానిక్స్ ని కలిపి అద్భుతమైన విశ్లేషణలు చేసిన ఆలోచనాపరుడిగా, మానవ మేథస్సుకు ప్రతీకగా ఈయన నిలచాడు.

శాస్త్ర రంగం ద్వారా రూపొందిచబడిన సాంకేతిక పరిజ్ఞానాలే తన శారీరక రుగ్మతలను అధిగమించేట్లు చేసాయనేది ప్రొ,, హాకింగ్ నమ్మకం. నడవలేని, మాట్లాడలేని తనకు తగిన సాధనాల్ని సమకూర్చి తన ఆలోచన్లని అవగాహనల్ని ప్రపంచ ప్రజలకు పంచగలిగేట్లు చేసిన ఘన సాంకేతిక నిపుణులదని చేప్తున్న ఈ మేధావి వినమ్రత మనకందరికీ ఆదర్శం.

ఈయన ప్రతిపాదించిన భౌతిక శాస్త్ర అంసాలన్నీ అర్థం చేసుకోవాలంటే మారందరూ సర్వ సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి మాతృకగా నిలిచిన “ఫిజిక్స్” ని శ్రద్ధగా అధ్యయనం చేయ్యాలి. అప్పుడే ప్రో,,స్టీఫెన్ హాకింగ్ కి మనం వారసులవుతాం. రాయల్ సొసైటీ వారు మన దేశాన్ని కూడా గుర్తిస్తారు

అపూర్వ ఆవిష్కర్త అపూర్వ మిశ్రా - మాడ భూషి కృష్ణప్రసాద్

ఒకసారి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్ లెక్క ఒకటి చేశాడు. లెక్క కరక్టే కాని ఏ పద్ధతిలో చేశాడో ఉపాధ్యాయుడికి అర్థం కాలేదు. “లెక్కకరక్టే కానీ మెథడ్ (పద్ధతి) ఎక్కడ వుంది. అని అడిగాడు. “ఇక్కడ” అని తన మెదడును చూపించాడట రామానుజన్. శాస్త్రవేత్తలకు, ఆవిష్కర్తలకు వాళ్ళ మేధలే మొదటి ప్రయోగశాలలు, పెట్టుబడులు కూడాను. అక్కడ నుండి వచ్చిన ప్రేరణతోనే భౌతికంగా ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి ఆవిష్కరణలు చేస్తారు.

భారతీయులలో తెల్లవారికి ఉన్నంత శాస్త్ర ప్రతిభ వుందని స్వాతంత్య్ర పూర్వం సి.వి. రామన్, జగదీశ్, చంద్రబోస్, ప్రపుల్ల చంద్రరే, సత్యేంద్రనాధ్ బోస్ లు నిరూపిస్తే అదే సత్యాన్ని ఈ ఏడాది ఒక 16 ఏళ్ళ కుర్రవాడు ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ చిట్టి మేదావి పేరు అపూర్వ మిశ్రా.

అపూర్వమిశ్రా చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్పూర్ నివాసి. భువనేశ్వర్ లోని డిఎవి స్కూల్ లో 12 వ జయంతి చదువుతున్నాడు. అతని తాతకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. యల్లాప్రగడ సుబ్బారావు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్న తన అన్నను చూసి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలాగే అపూర్వ కూడా తన తాత లాంటి రోగులకు సహాయపడే ఒక పరికరాన్ని కనిపెట్టాలనుకున్నాడు. తీవ్రంగా కృషి చేశాడు. గ్లేబనేటర్ అనే పరికరాన్ని కృష్టించాడు.

గ్లేబనేటర్ (గ్లేబెల్లా అంటే కను బొమ్మల మధ్య వుండే మెత్తటి ప్రదేశం) కదలలేని పక్షవాతరోగులు మినీ కంప్యూటర్ ను పనిచేయించడానికి ఉపయోగపడుతుంది. అది మొదట ఒక టోపీ రూపంలో వుండేది. దానిని తిరిగి తిరిగి మెరుగులు దిద్ది ఒక కళ్ళజోడు రూపానికి తెచ్చాడు. దానిని కళ్ళకు ధరించవచ్చు. దీనిని పనిచేయడం ఎలా ? పక్షవాత రోగులు కాలూ, చెయ్యి, కదపలేరు కదా అంటే సమాధానం సులభం. శరీరంలో ఒక కండరాన్ని కదిలిస్తే సరిపోతుంది. ఒక పక్షవాత రోగికి మంచి నీళ్ళు కావాలనుకోండి. కనురెప్పలతో టూల్ బార్ ను కదిపితేచాలు నీరు అన్న చోట ఆగితే కంప్యూటర్ నాకు నీరు కావాలి అని చెబుతుంది. 83 మంది రోగులమాద అపూర్వతన ఆవిష్కరణను ప్రయోగించాడు. సంతృప్తికరమైన ఫలితాలు వచ్చాయి. ఈ గ్లేబనేటర్ ద్వారా ఫోన్లు, దీపాలు, వెలగించవచ్చు నేమో పరిశీలిస్తున్నాడు. ఇంతకూ దీని ఖరీదు 1,300 రూపాలు మాత్రమే. ఈ పరికరాన్ని మొన్న మేనెలలో అమెరికాలోని ఇండియానా పోలిస్ లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ లో ప్రదర్శించారు. ప్రపంచంలోనే మూడవ అత్యత్తమ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ గా దీన్ని పోగిడారు. గుర్తించి బహుమతి ఇచ్చారు. ఈ ప్రదర్శన ప్రపంచంలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల మధ్య జరిగేపోటీ. 47 దేశాల నుండి 1,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

అపూర్వ 5వ ఏట నుండి కంప్యూటర్ ఉపయోగిస్తున్నాడు. అతను తన తొమ్మిదవ ఏటనే ఒక పరికరం కనుగొన్నాడు ఒకేసీసా నుండి ఎక్కువ మంది పిల్లలు నీళ్ళు తాగితే వ్యాధులు వచ్చే అవకాశం వుంది కదా ! ఇతను తయారు చేసిన పరికరం సీసాకు అమరిస్తే పెదవులు సీసామూతికి తగలకుండా నీళ్ళు తాగవచ్చు. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టీయల్ రీసెర్చ్ గుర్తించి ప్రశంసించింది.

అపూర్వకు నీటి కంప్యూటర్ తయారుచేయాలని వుంది. అమెరికాలోని మెస్సాచుసేట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న పాల్ సెర్మన్ ద్రనాలతో కంప్యూటర్ తయారుచేయడంపై పరిశోధన చేస్తున్నాడు.

ఈ చిట్టి ఆవిష్కర్త రేపటి భారతీయ ఎడిసన్ కావాలని ఆశించడం అత్యాశ కదు కదా !

జీవపరిణామ సిద్ధాంత కర్త - చార్లెస్ డార్వ్ న్ (1808-1882)

ఈ మహావిశ్వాన్నీ, ఈ భూగోళం మీద కోటాను కోట్ల జీవరాశుల్ని పనిగట్టుకుని ఎవరూ సృష్టించలేదనీ, వాటి కవే ఏర్పడ్డాయనీ, ప్రాథమిక దశ నుండి, మరింత ఉన్నత దశకు చేరుకున్నాయనీ, ఈ రోజు మనం పాఠాల్లో చదువుకుంటున్నాం.

175 ఏళ్ల క్రితం అలాంటి ఆలోచనలు ఈ భూమ్మీదే లేవంటే ఆశర్యంగా లేదూ చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త జీవ జాతుల పుట్టుక అనే తన గ్రంథంలో జీవులన్నీ తమ కంటే సరళమైన ప్రాథమిక జీవుల నుండి ఆవిర్భవించాయని ప్రకటించి పెద్ద దుమారం లేపాడు. మత వాదుల సృష్టి సిద్ధాంతాన్ని చావు దెబ్బ కొట్టాడు. సాంప్రదాయ వాదులు ఈ కొత్త ఆలోచనలను తలకెక్కించుకోవడానికి ఏ మాత్రం సమ్మితించలేదు. డార్విన్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. మనుషులంతా కోతుల నుండి పరిణామం చెందలేదు. డార్విన్ మాత్రమే కోతి నుండి వచ్చాడని గేలి చేశారు. 19 వ శతాబ్దపు ఆవిష్కరణల్లో ప్రజల ఆలోచనల్లో ఇంత గాఢమైన ప్రభావం చూపినవి. మరేమీ లేవంటే అతిశయోక్తి గాదు.

ఛార్లెస్ డార్విన్ ష్రుబర్రీ లో ఫిబ్రవరి 12, 1809 లో జన్మించాడు. తండ్రి, తాత డాక్టర్లు. ఇద్దరు కూడా ప్రకృతి పరిశీలకులు. డార్విన్ ప్రకృతి పరిశీలనాశక్తి వారసత్వంగా సంక్రమించిందని తెలుస్తోంది. డార్విన్ డాక్టర్ ను చేయాలనే తండ్రి ఆశ విఫలమైంది. ప్రకృతి పరిశీలనపట్ల డార్విన్ కున్న మక్కువ కారణంగా డాక్టర్ కాలేకపోయాడు. తన తండ్రి కోరిక మేరకు మతాచార్యుడిగా మారాలనుకున్నాడు. తన పరిశీలనలకు ఎక్కువ సమయం దొరకడమే దీనికి కారణం.

లండన్ కు చెందిన నావికాదళం దక్షిణ అమెరికా సముద్ర తీరాన్ని సర్వే చేయడానికి బీగల్ అనే ఓడలో బయలుదేరింది. ప్రకృతి శాస్త్రజ్ఞుడైన డార్విన్ కు ఆ బృందంతో ప్రయాణించే అవకాశం దొరికింది. డార్విన్ డిసెంబర్ 27,1831 బీగల్ ఓడలో బయలుదేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రకృతి పరిశీలనలో గడిపాడు.

తన సాహస యాత్రలో డార్విన్ అనేక జీవ జాతులను, శిలాజాలాలను పరిశీలించాడు. ప్రతి జీవజాతి వేరువేరుగా సృష్టించబడినదా అవి ఒత దానినొకటి ఒకానొక సామాన్య జీవజాతితో సంబంధం కలిగే వున్నాయా. అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకసాగాడు. 1859 లో జాతుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొదట ఏ కొద్ది మంది శాస్త్రవేత్తలు మాత్రమే అంగీకరించారు. క్రమక్రమంగా ఆ తర్వాత వచ్చిన ఉత్పరివర్తన సిద్దాంతాలు కూడా పరిణామ వాదాన్నే బలపరిచాయి. దీంతో సర్వే సర్వత్రా డార్వాన్ సిద్దాంతానికి బలం చేకూరింది.

ఆరోగ్యం క్షీణించడంతో 1881 ఏప్రిల్ 1న డార్విన్ మరణించాడు. ప్రపంచ ప్రజల ఆలోచనలను శాస్త్రీయత వైపు మళ్ళించిన మహా మేథావిగా సైన్స్ చరిత్రలో నిలిపోయాడు.

లూయిస్ పాశ్చర్

లూయిస్ పాశ్చర్ 27 డిసెంబర్ 1822 న ఫ్రాన్స్ లో జురా అనే ప్రాంతం లో జన్మించారు.

1849 వ సంవత్సవరం లో స్ట్రాస్బౌర్గ్ (Strasbourg) విశ్వవిద్యాలయం లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు. అక్కడ ఆయన సేంద్రీయ సంయోగం (organic synthesis) ద్వారా స్ఫటిక విన్యాసాలకి (crystal structure) సంబంధించి ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు చేసారు.

బాక్టీరియా వల్లా మరియు ఇతర సూక్ష్మ జీవుల వల్లా వ్యాధులు ఎలా సంభవిస్తాయి అన్న విషయం 19 వ శతాబ్దంలో ఒక రహస్యం గా ఉండేది. అప్పట్లో చాలా మంది కేవలం గాలి సోకడం వల్ల అంటువ్యాధులు వస్తాయని నమ్మేవారు. గాలిలో రోగకారక క్రిములని మోసుకొచ్చే వస్తువుల వల్ల అంటువ్యాధులు కలుగుతాయని అప్పుడు ఎవరికీ తెలీదు.

పాశ్చర్ కొన్ని అద్భుత ప్రయోగాలు చేసి సూక్ష్మ జీవులు ఒకదాన్నుండి ఒకటి పుడతాయని, గాల్లోంచి ఊడిపడవని నిరూపించాడు. ఆయన ప్రతిపాదించిన రోగకారక క్రిమి సిద్ధాంతం (Germ theory of disease) వైద్య శాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన భావనగా చెప్పుకోవచ్చు. అంతేకాక ఆయన వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్పత్రులలో చేతులు కడుక్కోవడం వంటి పరిశుభ్రతా పరమైన పద్ధతులు ప్రవేశపెట్టారు. పాశ్చర్ అత్యంత సునిశితమైన, క్రమబధ్ధమైన ప్రయోగాలు చేసి ఎన్నో ప్రమాదకరమైన సూక్ష్మజీవులను కనుగొన్నారు. ఆ సూక్ష్మజీవులని అరికట్టే వాక్సీన్ లు రూపొందించి మనుషులనే కాక, జంతువులను కూడా ఎన్నో భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడారు.

జీవం నుంచి జీవం :

ఈ ద్రాక్ష చుట్టూ ఉన్న చిన్న సహజ పదార్థాలు(Yeasts) వాటి ఏక కణ శిలీంధ్రాల (single-celled fungi) నుంచి పెరుగుతాయి. ఇటువంటి సూక్ష్మజీవులు, పరిసరాలలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు వాటంతట అవే పుట్టుకు వస్తాయని ఒక సిద్ధాంతంగా(spontaneous generation) అప్పట్లో ప్రజలు భావించేవారు. పాశ్చర్ తన ప్రయోగాలను ఉపయోగించి ఈ సూక్ష్మజీవులు వాస్తవానికి ఇతర సూక్ష్మజీవుల నుండి ఉత్పత్తి అవుతాయని, ఊరికే గాలిలోంచి ఊడిపడవని నిరూపించారు.

ఆరోగ్యకరమైన పాలు:

పాలు అమ్మకానికి వెళ్ళే ముందు, వాటిలో ఉండే హానికరమైన జీవుల సంఖ్య (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వంటివి) తగ్గించేందుకు, ఒక నిర్ణీత సమయం సేపు, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చెయ్యాలి. పాశ్చర్ 1860 లో మొదట పులిసిపోయిన వైన్ ని శుధ్ధి చెయ్యడానికి ఈ పద్దతిని ఉపయోగించారు. ఆ తర్వాత నుంచి ఈ పద్దతిని పాశ్చరైజేషన్ (“Pasteurization”) అన్నారు.

మద్యాన్ని పులియబెట్టే పద్ధతిని మెరుగుపరచడం(Improving fermentation of Alcohol):
ఫ్రాన్స్ లో వైన్ మరియు బీర్ పరిశ్రమలలో ఎన్నో సందర్భాలలో మద్యం అతిగా పులిసిపోవడం వల్ల దాన్ని పారబోయాల్సి వచ్చేది. ఈ దుష్పరిణామాన్ని అడ్డుకోడానికి ఏదైనా చెయ్యమని ఆ పరిశ్రమల వారు పాశ్చర్ ని కోరారు. పాశ్చర్ తన పరిశోధనల ద్వార పులిసిన వైన్ లోను, మంచి వైన్ లోను ఉండే ఈస్ట్ (yeast ) కణాల మధ్య ఆకారంలో తేడా ఉందని కనుక్కునారు. ఆక్సిజన్ రహితంగా కిణ్వన ప్రక్రియ (fermentation process) జరుగుతున్నప్పటికీ, అందులో వున్న ఈస్ట్ (yeast) వల్ల మద్యం ఉత్పత్తి జరుగుతుంది అని కనుక్కున్నారు. సరైన ఈస్ట్ (yeast ) ను ఉపయోగించడం వల్ల, 122F (55C) ఉష్ణోగ్రత వరకు వేడి చేసి అనర్థకరమైన ఇతర సూక్ష్మజీవులను ఆ ద్రవం నుంచి తొలగించడం వల్ల వైన్ పులియకుండా అరికట్టవచ్చని కనుక్కున్నారు.

పట్టు పరిశ్రమను కాపాడుట:
దక్షిణ-పశ్చిమ ఫ్రాన్స్ పట్టుపరిశ్రమలకి ఆలవాలం. అలంకార ప్రియులైన ఫ్రెంచ్ పౌరుల జీవనంలో ఈ పట్టు ఓ ముఖ్యభాగంగా ఉండేది. ఆ రోజుల్లో ఏదో తెలియని వ్యాధి వల్ల పట్టుకాయలు (silk coccoons) నాశనం అవుతూ ఉండేవి. కనుక 1864 లో ఫ్రెంచ్ ప్రభుత్వం, వ్యాధి వల్ల నాశనం అవుతున్న పట్టుపురుగులని రక్షించమని పాశ్చర్ ని కోరింది. స్థానికులైన పట్టు పురుగు పెంపకదార్లకి ముందు పాశ్చర్ మీద పెద్దగా నమ్మకం కలగలేదు. మైక్రోస్కోప్ పట్టుకుని బయల్దేరి వచ్చిన ఈ పెద్ద మనిషి తమకి ఏం చెయ్యగలడు అనుకున్నారు.

పట్టుపురుగులని నాశనం చేస్తున్న సూక్ష్మజీవుల మీద పాశ్చర్ పరిశీలనలు మొదలెట్టారు. 2 సంవత్సరాల తర్వాత పాశ్చర్ రెండు రకాలైన పరాన్నజీవులు (parasites) వల్ల infection సంభవించింది అని కనుగొన్నారు. తదనంతరం వాటిని నిర్మూలించే పద్ధతిని కనిపెట్టి పాశ్చర్ పట్టుపరిశ్రమని కాపాడారు.

అదృశ్య శత్రువులు:
ప్రాణాంతకమైన వ్యాధి ఆంత్రాక్స్ వ్యాధికి కారణం bacillius అనే కడ్డీ ఆకారంలో బాక్టీరియం. జర్మన్ వైద్యుడు రాబర్ట్ కోచ్ (Robert Koch) (1843-1910) ఆంత్రాక్స్ కి కారణమైన సూక్ష్మజీవి ఒకటుందని 1876 లో కనుక్కున్నాడు. పాశ్చర్ తన పరిశోధనలతో ఆ విషయాన్ని నిర్ధారించడమే కాక, ఆంత్రాక్స్ నివారణకి అవసరమైన వాక్సీన్ ని రూపొందించారు.

రాబిస్ వ్యాధి:

రేబీస్ అనేది వైరస్ ల వల్ల కలిగే ఓ భయంకరమైన వ్యాధి. అది కుక్కల నుండి మనుషులకి సోకుతుంది. ఈ వైరస్ బాక్టీరియాల కన్నా అతి చిన్నదైన వస్తువు. కనుక పాశ్చర్ వాడిన సూక్ష్మదర్శినిలో ఇది కనిపించలేదు. ఆ వైరస్ వ్యాధితో కేంద్ర నాడీ వ్యవస్థ ఫై ప్రభావితం చేస్తుంది. పాశ్చర్ ఆ వ్యాధి సోకిన జంతువుల వెన్నుపాము (spinal cord) నుంచి ద్రవం సంగ్రహించి, వివిధ పద్ధతుల చేత ఆ ద్రవం యొక్క రోగతీవ్రతని క్షీణపరిచి, ఆ ద్రవాన్ని తిరిగి కుక్కల మీదకి ఎక్కించి రేబీస్ కి వాక్సీన్ ని రూపొందించారు.

మొదటి రాబీస్ వ్యాక్సిన్:
1885,లో జోసెఫ్ మైస్టర్ అనే 9 ఏళ్ల పిల్లవాడికి మొట్టమొదటి సారిగా ఈ రేబీస్ వాక్సీన్ ని ఎక్కించి రోగాన్ని నయం చేశారు.

ఎన్నో ఏళ్ళ పాటు ఎన్నో మహమ్మారి రోగాల మీద ధ్వజం ఎత్తిన తన వ్యాధి నిర్మూలనా ప్రయత్నాలని వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో “పాశ్చర్ ఇన్స్టిట్యూట్” అనే ప్రైవేటు సంస్థకి ప్రారంభోత్సవం చేశారు.

ఆ విధంగా గొప్ప వైద్యుడిగా, శాస్త్రవేత్తగా, దేశభక్తుడిగా ఫ్రెంచ్ వారి మనసులలో స్థిరనివాసం ఏర్పరచుకున్న పాశ్చర్ 1895 లో సెప్టెంబర్ 28 నాడు పారిస్ లో సెయింట్ క్లౌడ్ సమీపంలో చివరి శ్వాస విడిచారు.

-రచన: స్వాతి చీమకుర్తి

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

చింపాజీలపై పరిశోధనలో అగ్రగామి – జేన్ గుడాల్

స్త్రీ స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉన్న యుగంలో, ఇంకా ఇరవైలు దాటని ఓ చక్కని బ్రిటిష్ యువతి, ఒంటరిగా ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, చింపాజీల ప్రవర్తన గురించి లోతుగా అధ్యయనాలు చేస్తూ, చింపాజీలకి, మనిషికి మధ్య ఉన్న పరిణామాత్మక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆ రంగంలో అగ్రగామి అయిన శాస్త్రవేత్తగా ఎదిగింది. ఆ యువతి పేరే జేన్ గుడాల్.

1934 లో లండన్ లో పుట్టిన జేన్ కి చిన్నప్పట్నుంచి జంతువులంటే మహా ఇష్టం ఉండేది. జంతువులతో ఆడుకుంటున్నట్టు, మాట్లాడుతున్నట్టు కలలు కనేది. ‘టార్జాన్,’ ‘డాక్టర్ డూలిటిల్’ (ఈ మనుషుల డాక్టరు మనుషుల కన్నా జంతువులకే ఎక్కువగా చికిత్స చేస్తూ ఉంటాడు) వంటి పిల్లల పుస్తకాలు చిన్నతనంలో ఈమెకి ఎంతో స్ఫూర్తి నిచ్చేవి. అందరిలాగానే ‘పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్’ అవ్వమన కుండా తన తల్లి ‘వాన్నే’ కూతుర్ని తనకి నచ్చిన దారిలోనే ముందుకి సాగమని ప్రోత్సహించేది. “నీకు ఏం కావాలంటే అది అవ్వు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో బాగా పైకొస్తావని నాకు తెలుసు,” అనేది ఆ తల్లి.

ఇరవై రెండేళ్ల వయసులో జేన్ కి తన జీవితాన్ని మార్చేసే ఓ గొప్ప అవకాశం దొరికింది. ఓ లండన్ ఫిల్మ్ స్టూడియో తో పాటు ఆఫ్రికాకి వెళ్లే అవకాశం దక్కింది. అయితే ప్రయాణానికి కావలసిన ఖర్చులు కూడా తన వద్ద లేవు. వెంటనే ఓ హోటల్ లో వెయిట్రెస్ గా పనిలోకి దిగి, రాత్రనక పగలనక పని చేసి నాలుగు డబ్బులు వెనకేసింది. తగినంత ధనం పోగవగానే ప్రయాణానికి సిద్ధం అయ్యింది.

ఆ ప్రయాణం 1957 లో మొదలయ్యింది. ముందుగా ఆఫ్రికాలోని మొంబాసా లో దిగింది. మొంబాసాలో ‘లూయీ లీకీ’ అనే పేరుమోసిన పురావస్తు శాస్త్రవేత్త ఉండేవాడు. జేన్ ఆయన్ని కలుసుకుని తన ఆశయాల గురించి విన్నవించుకుంది. జేన్ లోని ఉత్సాహం, శక్తి, జంతువుల పట్ల ఆమెకి సహజంగా ఉండే ప్రేమ మొదలైన లక్షణాలు ఆయన్ని అకట్టుకున్నాయి. వెంటనే తనకి అసిస్టెంటుగా పనిచేసే ఉద్యోగం ఇచ్చాడు. టాంజానియాలో ఓ చెరువు సమీపంలో ఉండే చింపాజీలని అధ్యయనం చేసే పనిలో ఆమెని పాల్గొనమన్నాడు. చింపాజీల జీవన రహస్యాలు అర్థమైతే మనిషి యొక్క పరిణామ గతం గురించి ఎన్నో రహస్యాలు తెలుస్తాయని ఆయన ఆలోచన.

ఈ అధ్యయనాలు 1960 లో మొదలయ్యాయి. ఆ రోజుల్లో జేన్ తల్లి కూడా కూతురుతో పాటు పర్యటించేది. యవ్వనంలో ఉన్న స్త్రీ ఆఫ్రికా అడవుల్లో ఒక్కర్తీ పర్యటించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనుక కూతురితో పాటు ఈ పర్యటనలు ఆ తల్లికి తప్పలేదు. మొదటి రెండు వారాలు జేన్ కి కలిగిన అనుభవాలు కాస్త నిరుత్సాహ పరిచాయి. తనని అంత దూరంలో చూడగానే చింపాజీలు పరుగు అందుకునేవి. పోనీ తను చూసినంత మేరకు కూడా చింపాజీల ప్రవర్తనలో తనకి విశేషంగా ఏమీ కనిపించలేదు. వచ్చిన పని విఫలమయ్యింది అన్న బాధ మనసులో దొలిచేస్తుండగా అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.

చింపాంజీలు శాకాహారులు అని అంతవరకు జేన్ అనుకునేది. కాని ఒకరోజు ఓ విచిత్రమైన సంఘట కనిపించింది. ఓ చింపాజీ ఓ చెదల పుట్ట పక్క కూర్చుని ఓ పొడవాటి పుల్లని పుట్టలోకి దూర్చి దాంతో చెదలు “పట్టి” తింటోంది. పుల్లని ఓ పనిముట్టుగా వాడి, దాంతో ఆ పురుగులని “వేటాడి” తినడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. గిట్టలు, కొమ్ములు, ముక్కులు, పంజాలు మొదలైన దేహాంగాలని కాకుండా మరో వస్తువుని పనిముట్టుగా వాడి ఆహారాన్ని సేకరించడం జంతులోకంలో అరుదైన విషయం. ఆ రోజుల్లో పెద్దగా తెలియని విషయం. పనిముట్లు వాడే దశ ఆదిమానవుడి పరిణామ క్రమంలో ఓ ముఖ్యమైన మలుపుగా చెప్పుకుంటాం. అలాంటి పనిముట్ల వినియోగం ఈ జంతువులలో కనిపించడం విశేషం.

చింపాజీలలో ఈ పనిముట్ల వినియోగం గురించి ప్రొఫెసర్ లీకీ కి వివరంగా ఉత్తరం రాసింది. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. “ దీంతో ‘పనిముట్టు’, ‘మనిషి’ మొదలైన పదాలకి కొత్త నిర్వచనాలు ఇవ్వాలి, లేదా చింపాజీలు మనిషితో సమానమని ఒప్పుకోవాలి,” అంటూ ఆయన ఉత్సాహంగా జవాబు రాశాడు.

తరువాత జేన్ ధ్యాస చింపాజీలలో సాంఘిక జీవనం మీదకి మళ్లింది. మనుషులలో లాగానే చింపాజీలలో కూడా విస్తృతమైన సాంఘిక పారంపర్యం ఉంటుంది. ‘నువ్వెక్కువా? నేనెక్కువా?” అన్న భేటీ మగ చింపాజీల మధ్య తరచు వస్తుంటుంది. బలప్రదర్శనతో మగ చింపాజీలు ఇతర చింపాజీల మీద తమ ఆధిక్యతని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ బలాబలాల పోటీ గెలిచిన మగ చింపాజీని ‘ఆల్ఫా మేల్’ (మొదటి మగాడు!) అంటారు. అతడే ముఠా నాయకుడు అవుతాడు. అయితే అంతకన్నా బలమైన చింపాజీ రంగప్రవేశం చేసినప్పుడు, ఇంద్రపదవి లాగా ఈ పదవి చేతులు మారిపోతుంటుంది!

చింపాజీలు సాధు జంతువులు ససేమిరా కాదని తెలుసుకుని జేన్ నిర్ఘాంపోయింది. చింపాజీ ముఠాల మధ్య కొట్లాటలు తరచు జరుగుతుంటాయి. ఒక “ముఠా నాయకుడు” తన ముఠాతో సహా వెళ్లి శత్రు ముఠా మీద యుద్ధం ప్రకటిస్తాడు.

ఆ యుద్ధంలో బలమైన చింపాజీలు బలం తక్కువైన చింపాజీలని తీవ్రంగా గాయపరచి, ఆ గాయలతోనే ప్రాణాలు వొదిలే స్థితికి తెస్తాయి. మనుషుల్లో ‘గ్యాంగ్ వార్’ లకి ఈ కలహాలకి పెద్దగా తేడా ఉన్నట్టు లేదు.

జేన్ చేసిన ఈ ప్రప్రథమ అధ్యయనాలన్నీ చక్కని ఫోటోలతో సహా ఆ రోజుల్లోనే ‘నేషనల్ జ్యాగ్రఫీ’ పత్రికలో అచ్చయ్యాయి. ఆ ఫోటోలు తీసిన హ్యూగో వాన్ లావిక్ ని ఆమె తరువాత వివాహం చేసుకుంది. ఇద్దరి కృషి ఫలితంగా అక్కడ “గోంబే స్ట్రీమ్ రీసెర్చ్ సెంటర్” అనే గొప్ప పరిశోధనా కేంద్రం వెలసింది. కొన్ని దశాబ్దాలుగా ఈ కేంద్రం చింపాంజీల పరిశోధనలో ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలిచింది. కేంద్రంలో సిబ్బంది పెరిగారు. చింపాంజీల జీవన విధానంలో ఎన్నో అంశాలని ఈ బృందం క్రమబద్ధంగా అధ్యయనం చేస్తూ వచ్చింది. ఇరవై అయిదేళ్ల పాటు ఆమె చేసిన పరిశోధనలు 1986 లో “గోంబే చింపాజీస్ – పాటర్న్స్ ఆఫ్ బిహేవియర్” (గోంబే చింపాంజీలు – వాటి ప్రవర్తనలో విశేషాలు) అనే పుస్తకంగా వెలుడ్డాయి. జేన్ గుడాల్ కృషి నుండి స్ఫూర్తి పొందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు చింపాంజీల మీద పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. జేన్ గుడాల్ చేసిన వైజ్ఞానిక కృషికి గుర్తింపుగా ఎన్నో జంతు జాతుల, వృక్ష జాతుల పేర్లలో ఆమె పేరు కలిపారు. ఆమె సుదీర్ఘ వైజ్ఞానిక జీవితంలో ఆమె పొందిన అవార్డులు కోకొల్లలు. స్త్రీలు వైజ్ఞానిక రంగాల్లో కేవలం రాణించడమే కాదు, తలచుకుంటే వారి వారి రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉండగలరని జేన్ గుడాల్ నిదర్శనం మనకి స్పష్టం చేస్తోంది.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

జె.ఇ. గోర్డన్ - పదార్థ విజ్ఞాన పితామహుడు

ప్రొ॥ జె. ఇ. గోర్డన్ ఆధునిక బయోమెకానిక్స్ (biomechanics), పదార్థ విజ్ఞాన (material science) రంగాల పితామహులలో ఒకరని చెప్పుకోవచ్చు.

1913 లో పుట్టిన ఈయన గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి నేవల్ ఆర్కిటెక్చర్ లో పట్టం పుచ్చుకున్నారు.

స్కాట్లాండ్ షిప్ యార్డ్ లలో పని చేస్తూ తొలిదశలలోనే ఓడల రూపకల్పనలో తన అసామాన్య నైపుణ్యం నిరూపించుకున్నారు. ఓడలు నిర్మించడమే కాక వాటిలో విస్తృతంగా ప్రయాణించి రూపకల్పనకి, ప్రవర్తనకి మధ్య సంబంధాన్ని లోతుగా అర్థంచేసుకున్నారు. సరైన పదార్థం + సరైన నిర్మాణం – ఈ రెండూ కలిస్తేనే మన ప్రయోజనం కోరుకున్న విధంగా నెరవేరుతుందని తెలుసుకున్నారు.

గోర్డన్ యొక్క అభిరుచులు ఇంజినీరింగ్ రంగానికే పరిమితం కాదు. సాహిత్య, కళా రంగాలలో కూడా ఈయన ఎంతో ఆసక్తి చూపించేవారు. సాంప్రదాయక సాహిత్యంలో అతడికి మంచి ప్రవేశం ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ నౌకాదళంలో పని చేసిన ఈయన, రాత్రిళ్లు తీరిక వేళల్లో స్వాధ్యాయం చేసి గ్రీకు భాష నేర్చుకున్నారు. ప్రాచీన సాహిత్యంతో ఆయనకి ఉండే పరిచయం ప్రాచీన సంస్కృతులలో వాడబడ్డ కవచాల మీద, వాటిలో వాడే పదార్థాల మీద ఆయన చేసిన అధ్యయనాలకి శ్రీకారం చుట్టింది.

మానవ చరిత్రలో పదార్థాలకి ప్రబలమైన పాత్ర వుందని, కొత్త పదార్థాల ఆవిష్కరణ వల్ల చరిత్ర ఎన్నో ముఖ్యమైన మలుపులు తిరిగిందని ఆయన గుర్తించారు. రాబోయే కాలంలో పదార్థాల ప్రాబల్యం పెరుగుతుందని, వాటి ప్రాధాన్యత లోతుగా గుర్తించబడుతుందని, ఓ కొత్త “పదార్థ సంస్కృతి” ఆవిర్భవిస్తుందని ఆయన ముందే ఊహించారు. పదార్థాలకి, ప్రాచీన సంస్కృతులకి మధ్య ఉన్న సంబంధాన్ని బాగా గుర్తించిన గోర్డన్ ఈ రెండు విద్యావిభాగాలని కలుపుతూ ఓ కొత్త ఉమ్మడి విభాగాన్ని స్థాపించారు. ఆ విభాగం ఈ రెండు రంగాల్లో ఉమ్మడిగా పట్టం ప్రదానం చేస్తుంది. అయితే గోర్డన్ లాగా ఈ రెండు విభిన్న రంగాలని కలిపి జీర్ణించుకోగల సత్తా ఉన్న విద్యార్థులు అరుదు. కనుక ఈ విభాగం పెద్దగా రాణించలేదు.

గోర్డన్ పని చేసే కాలంలో పదార్థ విజ్ఞానం అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండేది కాదు. నిర్మాణాలలో ఎక్కువ సాంప్రదాయబద్ధమైన పదార్థాలనే వాడేవారు. కనుక ఆ రోజుల్లో పదార్థ విజ్ఞానం లోహ విజ్ఞానం (metallurgy)తో సమానం. కాని గోర్డన్ నౌకానిర్మాణంలో ఆయన గడించిన అనుభవాన్ని ఉపయోగించి, నౌకా నిర్మాణంలో వాడే పదార్థాలని విమానాల రుపకల్పనలో వినియోగించే ప్రయత్నం ప్రారంభించారు. ఓడలలో వాడే చెక్క మాత్రమే కాకుండా ప్లాస్టిక్ మొదలైన సాంప్రదాయేతర పదార్థాలని యుధ్ధవిమానాలలో వినియోగించి ఎన్నో చక్కని ఫలితాలు సాధించారు.

ఆ కాలంలోనే గాలితో పూరించబడ్డ డింగీ (dinghy) అనబడే పడవల రూపకల్పనలో ఎంతో ప్రగతి సాధించారు. ఈ డింగీ అన్న పదం బెంగాలీ నుండి గాని, ఉర్దూ నుండి గాని వచ్చి వుంటుంది అంటారు (వికీ). ఈ చిన్న పడవలని యుద్ధ విమానాలు మోస్తాయి. అలాగే గాజు, కార్బన్, బోరాన్ మొదలైన పదార్థాలతో ప్రబలీకృత ఫైబర్ల (reinforced fibers) ప్రవర్తనని ఈయన అధ్యయనం చేశారు.

ఇంగ్లండ్ కి, ప్రపంచ పదార్థ వైజ్ఞానిక రంగానికి ఈయన చేసిన సేవలకి గుర్తింపుగా రాయల్ ఎయిరోనాటిక్స్ సొసయిటీ ఇతనికి రజత పతకం ఇచ్చి సత్కరించింది.

ప్రొ. గోర్డన్ రాసిన పుస్తకాలలో రెండు మచ్చుతునకలు ఉన్నాయి. అవి –

1. Structures or Why things don’t fall down.

2. The New Science of Strong Materials or Why You Don't Fall Through the Floor

ఈ రెండు పుస్తకాలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. పాపులర్ సైన్స్ సాహిత్యంలో ముఖ్యంగా పదార్థ విజ్ఞాన రంగంలో ఈ రెండు పుస్తకాలకి పోటీ లేవని చెప్పుకోవచ్చు. తన వైజ్ఞానిక జీవితం యొక్క చివరి దశల్లో రాయబడ్డ ఈ పుస్తకాలలో విస్తృతమైన తన అనుభవం యొక్క సారాన్ని పొందుపరిచారు. లోతైన వైజ్ఞానిక విషయాలని చర్చిస్తున్నా ఈ పుస్తకాలు భారంగా పాఠ్యపుస్తకాలలా కాకుండా సరదాగా చందమామ కథలలా సాగిపోతాయి. ఈ పుస్తకాల రచనలో ప్రాచీన సంక్కృతులతో, ప్రాచీన సాహిత్యంతో రచయితకి ఉన్న పరిచయం ఎంతో ఉపయోగపడింది. ఉదాహరణకి -

గ్రీకు వీరుడు ఒడిసెస్ వాడిన వింటికి నారిని సంధించడం ఎందుకంత కష్టం?

ప్రాచీన గ్రీకులు రాత్రి వేళల్లో రధ చక్రాలని ఎందుకు ఊడదీసి పెట్టేవారు?

గ్రీకుల కాటపల్ట్ ఎలా పని చేస్తుంది?

పార్థెనాన్ మందిరం ఎందుకంత అందంగా ఉంటుంది?

విస్మయం గొలిపే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు గోర్డన్ పుస్తకాలని అందంగా అలంకరించి పాఠకులని పుస్తకాన్ని పక్కన పెట్టనివ్వకుండా చదివింపజేస్తాయి.

గోర్డన్ రాసిన పుస్తకాలలో మొదటిదైన Structures నుండి కొన్ని విశేషాలని వరుసగా కొన్ని వ్యాసాలలో రాసుకొద్దామని ఉద్దేశం.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

అర్కిమిడీస్ నిర్మించిన సాంకేతిక పరికరాలు

ఆర్కిమిడీస్ భౌతిక శాస్త్ర సూత్రాలని కనుక్కోవడమే కాక ఎన్నో అద్భుత సాంకేతిక పరికరాలని కూడా రూపొందించాడు. అలాంటి పరికరం ఒకటి ‘ఆర్కిమిడీస్ స్క్రూ’. ఈ పరికరంతో నీళ్లు తోడడానికి వీలవుతుంది. దీని రూపకల్పనకి కూడా ఒక విధంగా రెండవ హీరో రాజే కారణం. నౌక్రాటిస్ కి చెందిన ఎథెనేయియస్ అనే రచయిత ఈ కథనం అంతా ఓ పుస్తకంలో వర్ణించాడు. అందులో 600 మంది ప్రయాణించగలిగేవారĶ 3;. అందులో ఓ క్రీడారంగం (జిమ్నేషియమ్) ఉంటుంది. గ్రీకుల ప్రేమదేవత అయిన అఫ్రొడైటీ కి అంకితం చెయ్యబడ్డ ఓ ఆలయం కూడా ఉండేదట. అంతపెద్ద ఓడలో ఎక్కడైనా చిల్లులు పడి నీరు ఓడ లోపలికి వస్తే ఆ నీటిని తోడి బయటికి పంప్ చెయ్యాల్సిన సమస్య వచ్చి పడింది. అందుకోసమే ఈ ప్రత్యేకమైన ‘స్క్రూ’ ని కనిపెట్టాడు ఆర్కిమిడీస్. ఈ స్క్రూ ఇప్పటికీ ప్రపంచంలో పంట పొలాలకి నీరు అందించే ప్రయోజనాల కోసం వాడుతున్నారు. బొగ్గు లాంటి ఘనపదార్థాలని ఎత్తుకి ఎత్తించేటందుకు కూడా వీటిని వాడతారు. ఇలాంటి స్క్రూ నే తొలుత బాబిలోన్ నగరంలోని ప్రఖ్యాత ‘వేలాడే తోటలకి’ (Hanging gardens of Babylon) నీరు సరఫరా చెయ్యడానికి వాడేవారని చెప్తారు. ఆ పాత స్క్రూ యొక్క మరింత అధునాతన రూపమే ఆర్కిమిడీస్ కనిపెట్టిన స్క్రూ అని అంటారు.

ఆర్కిమిడీస్ పంజా

ఆర్కిమిడీస్ కేవలం శాంతియుతమైన ప్రయోజనాలు గల పరికరాలు మాత్రమే కాక యుద్ధంలో పనికొచ్చే యంత్రాలని కూడా రూపొందించాడు. ఉదాహరణకి ఆర్కిమిడీస్ పంజా అని పిలువబడే ఓ యంత్రం సిరక్యూస్ నగరానికి యుద్ధంలో గొప్ప రక్షణ కల్పించింది. ‘క్రేన్’ ఈ యంత్రం కోట గోడల మీద స్థాపించబడి వుంటుంది. ఆ యంత్రం నుండి పంజా లాంటి పరకరాన్ని కిందికి దించుతారు. కోట గోడలకి అవతల సముద్రం మీదుగా గోడలకి మరీ దగ్గరగా వచ్చిన శత్రు నౌకల మీదికి ఈ పంజాని ప్రయోగిస్తారు. ఆ పంజా ఓడకి తగులుకోగానే పైనుండి తాళ్లతో ఓడలని లాగుతారు. కొంత ఎత్తువరకు తాళ్లు లాగి ఒక్కసారిగా వదిలేస్తారు. ఆ దెబ్బకి ఓడలు పక్కకి ఒరిగి నీట మునుగుతాయి.

ఆర్కిమిడీస్ ప్రయోగించిన “మరణ కిరణం”

క్రీ.శ. రెండవ శతాబ్దానికి చెందిన లూసియన్ అనే రచయిత సిరక్యూస్ యుద్ధం గురించి రాస్తూ ఆ యుద్ధంలో ఆర్కిమిడీస్ అగ్నిని ప్రయోగించి శత్రు నౌకలని ధగ్ధం చేశాడని వర్ణిస్తాడు. “ఆర్కిమిడీస్ వేడి కిరణం” గా చెప్పుకోబడే ఈ సాధనంతో సూర్యకాంతిని ఓడ మీదకి కేంద్రీకరించి ఓడని ధగ్ధం చేస్తారు.

అయితే నిజంగానే అల్లంత దూరంలో ఉన్న ఓడల మీదకి సూర్యకాంతిని కేంద్రీకరించి నాశనం చెయ్యడం జరిగేపనేనా, అది అతిశయోక్తి కాదా అని ఎంతో మంది ఈ విషయంలో సంశయం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ తాత్వికుడు రేనే దేకార్త్ అదంతా వట్టి పుక్కిటి పురాణం అని కొట్టి పారేశాడు. అయితే ఆర్కిమిడీస్ కాలంలో అందుబాటులో ఉండే సాధన సామగ్రితో అలాంటి ఫలితం సాధ్యం కావచ్చని కొందరు ఆలోచించారు. రాగితో గాని, కంచుతో గాని చేయబడ్డ కవచాలని బాగా మెరుపు వచ్చేలా రుద్ది, వాటిని అద్దాలలా వాడుకుంటూ, సముద్ర తీరం మీద పారాబోలా ఆకారంలో వాటిని నిలిపి, సూర్యకాంతిని శత్రు నౌక మీదకి కేంద్రీకరిస్తే నిజంగానే ఓడని ధగ్ధం చెయ్యొచ్చని వాదనలు జరిగాయి.

1973 లో అయోనిస్ సక్కాస్ అనే గ్రీకు శాస్త్రవేత్త నిజంగానే ఈ వాదనని ప్రయోగించదలచాడు. ఏతెన్స్ నగరానికి బయట స్కరమాగాస్ అనే రేవులో ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగంలో 70 అద్దాలు వాడారు. 5 X 3 అడుగుల పరిమాణం ఉన్న ఈ అద్దాలకి రాగి పూత వేశారు. ప్లై వుడ్ తో తయారు చేసిన రోమన్ యుద్ధనౌక యొక్క నమూనాని

160 అడుగుల దూరంలో ఉంచారు. అద్దాలని కచ్చితంగా నిలిపి కిరణాలని నౌక మీదకి కేంద్రీకరిస్తే క్షణాల్లో నౌక భగ్గుమంది. పైగా నౌక మీద తారు పూత పూశారు. దాని వల్ల కూడా నౌక మరింత సులభంగా నిప్పు అంటుకుని ఉంటుంది. నీరు ఓడ లోపలికి రాకుండా తారు పూత పూయడం ఆ రోజుల్లో పరిపాటి.

అక్టోబర్ 2005 లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థుల బృందం ఒకటి ఈ ప్రయోగాన్ని మళ్లీ చేసి చూసింది. ఈ ప్రయోగంలో 1 చదరపు అడుగు వైశాల్యం ఉన్న 127 అద్దపు పలకలని తీసుకున్నారు. వాటి సహాయంతో 100 అడుగుల దూరంలో ఉన్న ఓ నమూనా ఓడ మీదకి సూర్యకాంతిని కేంద్రీకరించారు. ఓడ మీద కాంతి పడ్డ ప్రాంతంలో మాత్రమే నిప్పు అంటుకుంది. అయితే ఆకాశంలో మేఘాలు లేని పరిస్థితుల్లో, ఓడ కదలకుండా పది నిముషాల సేపు ఉన్నప్పుడే ప్రయోగం పని చేసింది. ఈ సారి ఓడ మీద కాంతి పడ్డ చోట కాస్త మంట వచ్చింది, కాస్త మసిబారింది.

ఇదే ప్రయోగాన్ని ఆ ఎమ్. ఐ. టి. బృందం సాన్ ఫ్రాన్సిస్కో తీరం మీద కూడా చేసి చూసింది. ‘మిత్ బస్టర్స్’ అనే టీవీ షోలో భాగంగా ఆ ప్రయోగం జరిగింది. మూడనమ్మకాలని పరీక్షించి వాటి గుట్టు రట్టు చెయ్యడం ఈ టీవీ షో లక్ష్యం. ఈ సారి చెక్కతో చేసిన ఓ జాలరి పడవ మీద ఈ సారి కాంతిని కేంద్రీకరించారు. అయితే ఓడ సమూలంగా దగ్ధం కాలేదు. చెక్క నిప్పు అంటుకోవాలంటే దాని ఉష్ణోగ్రత స్వయం జ్వలన బిందువు (autoignition temperature) ని, అంటే 300 oC ని, చేరుకోవాలి.

ఈ ఫలితాలన్నీ గమనించాక ‘మిత్ బస్టర్స్’ షో లో ఈ ప్రయోగం విఫలం అయినట్టు ప్రకటించారు. ఓడ మీద ఎంతో కొంత ప్రభావం లేకపోయినా, అనుకున్నట్టు ఓడ దగ్ధం కాదని ఆ షో ఖండితంగా చెప్పింది. అంత కష్టపడి అద్దాలతో సూర్యకాంతిని కేంద్రీకరించి అంత అల్పమైన ఫలితాన్ని సాధించే బదులు, సాంప్రదాయక ఆయుధాలైన నిప్పుబాణాలు, ఫిరంగులు మొదలైనవి మరింత సఫలదాయకంగా ఉంటాయని ఆ షో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

సర్ ఐజాక్ న్యూటన్

(ఎప్పుడే నేనే ఏదో సోది రాయడం కాకుండా తెలుగులో సైన్సు రాయాలనుకునే ఔత్సాహికుల రచలనని ఈ బ్లాగ్లో పోస్ట్ చెయ్యాలనే కార్యక్రమంలో మొదటి మెట్టుగా ‘సర్ ఐజాక్ న్యూటన్’ జీవితం మీద ఓ వ్యాసం… శ్రీ.చ.)

సర్ ఐజాక్ న్యూటన్ (డిసెంబరు 25, 1642 - మార్చి 20, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. "ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది" అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవిస్తుంది.

సర్ ఐజాక్ న్యూటన్ ఊల్స్ తోర్ప్, లింకన్ షైర్, ఇంగ్లాండ్ లో డిసెంబర్ 25, 1642 సంవత్సరమున జన్మించాడు. ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ , న్యూటన్ 85 సంవత్సరాల వయస్సు వరకు జీవించి, మార్చి 20, 1727 న కెన్సింగ్టన్ పట్టణము నందు మరణించారు.

న్యూటన్ జన్మించిన సమయంలో అతను నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా బరువు తక్కువగాను, బలహీనంగాను ఉండేవాడు. చూసినవాళ్లంతా అసలీ శిశువు బ్రతుకుతాడా అనుకున్నారు. న్యూటన్ తండ్రి న్యూటన్ జననానికి మూడు నెలల ముందు మరణించారు. న్యూటన్ తన తల్లి సంరక్షణ క్రింద 3 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. తరువాత న్యూటన్ కేవలం 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె బార్ స్మిత్ అనే ఆయన్ను రెండవ వివాహం చేసుకున్నారు. అందువలన న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లితండ్రుల ప్రేమ కోల్పోయి తన అమ్మమ్మ- తాతల వద్ద పెరగటం జరిగింది. న్యూటన్ తన బలహీనమైన ఆరోగ్యం వలన ఆటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించ లేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. న్యూటన్ 10 సంవత్సరముల వయస్సు లో ఉన్నప్పుడు తన సవతి తండ్రి కూడా మరణించాడు, అతని తల్లి ఊల్స్ తోర్ప్ కు తిరిగి వచ్చారు. ఆమె వ్యవసాయం మరియు పశువుల పై ఆసక్తి తీసుకోవడం ప్రారంభించారు.

12 ఏళ్ల వయస్సులో న్యూటన్ గ్రాన్థమ్ లోని గ్రామర్ స్కూలుకు పంపబఢ్డారు. అక్కడ అతని స్నేహితులలో చాలా మంది అమ్మాయిలు ఉండేవారు. న్యూటన్ గ్రామర్ స్కూల్ లో ఉన్నప్పుడు తన మేధోశక్తితో అందరిని ఆకట్టుకున్నారు. న్యూటన్ ఎల్లప్పుడూ భౌతిక, గణిత శాస్త్రాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే పరిష్కరించటానికి ఇష్టపడేవారు. లైబ్రరీ లో చాలా సమయం అతను పుస్తక పఠనంలో గడిపేవారు.

న్యూటన్ ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి వద్ద విద్యార్థిగా ఉన్నప్పుడు అతని తల్లి గ్రామంలో సహాయం కోసం కబురు చేశారు. న్యూటన్ 17 వ సంవత్సరములో ఉన్నప్పుడు ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జి నుండి ఊల్స్ తోర్ప్ తిరిగి రావడం జరిగినది. పల్లెలో నివసిస్తున్నప్పుడĹ 7;, న్యూటన్ గొర్రెల మందలు మేస్తుండగా కాపలా కాసేవారు. ఈ పనిని న్యూటన్ చాలా అసహ్యించుకునేవారు. 77;నేక సార్లు న్యూటన్ గణిత శాస్త్ర సమస్యలలో మునిగిపోవడంతో ఒకటి లేదా రెండు గొర్రెలు ఎల్లప్పుడూ తప్పించుకొనేవి. తన అజాగ్రత్త వలన తీవ్రంగా మందలింపబడేవాడు. గణితంలో న్యూటన్ పట్ల ఎంతో ఆసక్తి చూసిన ఒక ఉపాధ్యాయుడు, న్యూటన్ ను ఉన్నత విద్యను అభ్యసించడానికి విశ్వవిద్యాలయానికĹ 5; పంపండని న్యూటన్ తల్లి కి గట్టిగా చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు న్యూటన్ యొక్క విద్యకు అయ్యే ఖర్చును భరించటానికి అంగీకరించారు. న్యూటన్ తిరిగి జూన్ 1661 లో మరోసారి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరి భౌతిక, గణిత శాస్త్రాల అధ్యయనం ప్రారంభించారు.

న్యూటన్ పేద విధ్యార్ధి అవటం వలన సహ విద్యార్థులు (ధనవంతులు) న్యూటన్ ను నిందించి ఆటపట్టించేవారు. కానీ అతి తక్కువ కాలంలోనే, న్యూటన్ అద్భుతమైన భౌతిక, గణిత శాస్త్ర సామర్ధ్యంతో తన తోటి విద్యార్ధుల గౌరవం పోందారు. తదుపరి కాలంలో న్యూటన్ విశ్వవిద్యాలయం లో మిగిలిన స్నేహితుల మరియు ఉపాధ్యాయుల ప్రశంసలను అందుకున్నారు. న్యూటన్ ట్రినిటీ కాలేజ్ నుంచి మెట్రిక్యులేషన్ పోందారు, కానీ స్కాలర్షిప్ పోందటంలో విఫలమయ్యారు. ఇలా జరగడం, తద్వారా ఖర్చులు పెరగడంతో న్యూటన్ చాలా కలవరపడ్డారు.

స్కాలర్షిప్ లేకుండా ఉన్నత విద్యను కొనసాగించడం సాధ్యపడదని ఆయన గ్రహించారు. న్యూటన్ ఎంతో ప్రయత్నించినా, మార్కులు తక్కువ వచ్చిన కారణంగా స్కాలర్షిప్ మీద ఆశలు వదులుకున్నారు. అయినప్పటికి యూనివర్సిటీ బోర్డు సభ్యులు ఆయనకు నాలుగు సంవత్సరముల వరకు స్కాలర్షిప్ ఇచ్చారు. న్యూటన్ ఆనందానికి అవధులు లేవు. ఈ వచ్చిన అవకాశాన్నివీలైనంత సద్వినియోగం చేసుకోవాలని న్యూటన్ నిశ్చయించుకున్నారĹ 7;. అతని పూర్తి సమయం లెక్కలు మరియు భౌతిక శాస్త్రం అభ్యాసానికే వినియోగించారు. ఆయన ఎంతలా నిమగ్నమయ్యారంటే ఒక్కొక్కసారి తిండి నిద్ర కూడా మరిచేవారు. న్యూటన్ యూనివర్సిటీలో గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి మరియు త్రికోణమితి లను ఎంచుకున్నారు. లైబ్రరీ లో న్యూటన్ తరచుగా మేధావులైన కెప్లర్ మరియు ఇతరులు రాసిన / తయారుచేసిన గొప్ప ప్రయోగాలపై అధ్యయనం చేసేవారు.

న్యూటన్ 1969లో ట్రినిటీ కాలేజిలో ఉండే సమయంలో తన ఆలోచనలను పుస్తకాలలో రాసుకున్నారు. ఆ పుస్తకాలు న్యూటన్ ఆలోచనా ధోరణిని బహిర్గతం చేస్తూ ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనవిగా పరిగణింపబడతాయి. న్యూటన్ 1665 లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో అనేక ప్రాంతాల్లో ప్లేగు మహమ్మారినబడి వేల మంది మరణించారు. ఆ అంటువ్యాధుల వలన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం రెండు సంవత్సరాల పాటు మూసివేయబడినది. అప్పుడు న్యూటన్ ఊల్స్ తోర్ప్ కు తిరిగి వచ్చి భౌతిక మరియు గణిత శాస్త్ర అధ్యయనంలో రెండు సంవత్సరాల కాలం గడిపారు. ఈ కాలంలో, ఆయన fluxions యొక్క ఆలోచన మరియు కాంతి మరియు రంగు యొక్క పునాదులు వేశారు. అదే సంవత్సరంలో న్యూటన్ ప్రిన్సిపియా అని ఒక సంకలనం తయారు చేశారు. అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా, 1687 లో ప్రచురించబడినది. న్యూటన్ 1667 లో కేంబ్రిడ్జి తిరిగి తన పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించారు. న్యూటన్ 1669 లో కేంబ్రిడ్జి నుండి మాష్టర్స్ డిగ్రీ పొందారు, మరియు అదే సంవత్సరంలో గణిత శాస్త్ర ప్రొఫెసరు గా నియమించబడ్డారు.

ప్రొఫెసర్ న్యూటన్ విశ్లేషణాత్మక జ్యామితి, బీజగణితం, మరియు క్యాల్కులస్ రంగాలమీద తన దృష్టి సారించారు. బైనామినల్ సిద్ధాంతం, అనంతం సిరీస్ విస్తరణ కోసం కొత్త పద్ధతులు, fluxions యొక్క ప్రత్యక్ష మరియు విలోమ పద్ధతులు – ఇవీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రధాన ఆవిష్కరణలు. న్యూటన్ 1665 నుండి 1666 వరకు కాంతి అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించారు. కాంతి యొక్క ఖచ్చితమైన కూర్పు తెలుసుకోవడానికి అనేక ప్రయోగాలను నిర్వహించారు. ఆయన కాంతి యొక్క అనేక ఇతర లక్షణాలను అధ్యయనం చేశారు.

రాయల్ సొసైటీ అధ్యక్షుడు "రాబర్ట్ హు్క్" 1703 లో మరణించాడు. అప్పుడు ప్రొఫెసర్ న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూటన్ అద్భుతమైన రచయిత, అతను అనేక శాస్త్రీయ మరియు అశాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు. దురదృష్టవశాత్తు న్యూటన్ దైవీ శాస్త్రం (theology) మీది రచనలు ప్రచురించబడలేదు.

ప్రొఫెసర్ న్యూటన్ సన్నగా, పొడవుగా ఉండేవారు. న్యూటన్ తన దుస్తులు మరియు కేశాలంకరణపై ఆసక్తి చూపేవారు కాదు. ఎక్కువ సమయం అతను తన సొంత ఆలోచనలలో మునిగిపోయేవారు. ఎప్పుడూ గదిలో ఒక మూలలో లెక్కలు చేసుకునేవారు. తీవ్రమైన చర్చలలో కూడా ఒక్కోక్కసారి సొంత ఆలోచనలలో ఉండేవారు. న్యూటన్ క్రీడలు, వ్యాయామం పై ఎటువంటి ఆసక్తి చూపించేవారు కాదు. అనేక సందర్భాలలో అతను ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది లేదా పందొమ్మిది గంటలు అధ్యయనంలో గడిపేవారు. ప్రొఫెసర్ న్యూటన్ బ్యాచిలర్ గా ఉండి భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్ర సేవలకే అంకితం చేశారు. న్యూటన్ నిజాయితి మరియు ముక్కుసూటి మనిషి. న్యూటన్ మార్చి 20, 1727 న 84 సంవత్సరాల వయసులో మరణించాడు. అతనని వెస్ట్ మినిస్టర్ అబ్బే లో ఖననం చేశారు.

అనువాదం – స్వాతి మరియు శ్రీవత్సవ చీమకుర్తి

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

ఆర్దశీర్ కుర్సట్జీ – మేటి భారతీయ నౌకా నిర్మాత

బ్రిటిష్ పరిపానలలో ఉన్న పందొమ్మిదవ శతాబ్దపు భారత దేశంలో జీవించిన ఓ గొప్ప మెరైన్ ఇంజినీరు ఆర్దశీర్ కుర్సట్జీ (1808-1877). ఇతడు ఫార్సీ జాతికి చెందినవాడు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చూపించుకోగలగడానికĹ 5; కారణం వారి సాంకేతిక నైపుణ్యం. ఆవిరి యంత్రం మొదలైన ఆవిష్కరణల వల్ల వచ్చిన పారిశ్రామిక విప్లవం బ్రిటిష్ వారి ప్రాబల్యానికి హేతువయ్యింది. ఆ సాంకేతిక బలంతోనే మన దేశం మీద అంత కాలం రాజ్యం చెయ్యగలిగారేమో.

అల్లంత దూరంలో ఉన్న బ్రిటన్ దీవి నుండి భారతాన్ని పాలించడానికి, సాంకేతిక సత్తాని ఉపయోగించి ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆవిరి యంత్రాల మీద పని చేసే ఓడలు ఆ ప్రయోజనం కోసం బాగా పనికొచ్చాయి. ఇవి కాకుండా ఇండియా అంతటా రైలు మార్గాలు వేశారు. టెలిఫోన్ లైన్లు అమర్చారు. ఇండియాలో తమ కార్యాలయాలలో పని చెయ్యడానికి భారతీయులకి తగు శిక్షణ నిచ్చారు. ఆ విధంగా ఆధునిక సాంకేతిక విద్య ఇండియాలోకి ప్రవేశించింది. ఎంతో మంది భారతీయులు సాంకేతిక విద్యలో శిక్షణ పొందారు. పాశ్చాత్య రాజ్యాల ప్రాబల్యానికి వేళ్లు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకున్నారు.

అలా బ్రిటిష్ పాలనలో పాశ్చాత్య సంకేతిక విద్యలో ప్రవేశం పొందిన వారిలో కుర్సట్జీ వంశం కూడా ఉంది. ఆర్దశీర్ కుర్సట్జీకి పూర్వీకుడైన లోజీ నుసర్వాన్జీ వాడియా సూరత్ రేవులో వడ్రంగిగా పని చేసేవాడు. బ్రిటిష్ వారు బొంబాయిలో రేవు నిర్మించదలచుకున్నķ 4;్పుడు ఆ రేవు నిర్మాణంలో లోజీ నుసర్వాన్జీ సేవలు వాడుకున్నారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు నౌకా నిర్మాణంలో ఓక్ చెట్టు యొక్క కలపని వాడేవారు. కాని బ్రిటిష్ నౌకాదళ విస్తరణ వల్ల అన్ని ఓడలని నిర్మించడానికి ఓక్ చెట్లు సరిపోలేదు. కనుక స్థానికంగా దొరికే మలబార్ టేకు కలపని వాడడం మొదలెట్టారు. ఇది బలమైన కలప. సులభంగా కుళ్ళదు. ఈ కొత్త నౌకా నిర్మాణ పధ్ధతితో బొంబాయి గొప్ప రేవుగా రూపొందింది. ఆ విధంగా కుర్సట్జీ కుటుంబంలో నౌకా నిర్మాణం వంశానుగతంగా వస్తున్న విషయం.

అయితే కుర్సట్జీ మొదట శిక్షణ పొందిన రంగం నౌకా నిర్మాణం కాదు, ఆవిరి యంత్రాల నిర్మాణం. చిన్న వయసులోనే 1-హెచ్.పి. యంత్రం నిర్మించి తన సత్తా నిరూపించుకున్నాడు. ఇండియాలో నిర్మించబడ్డ మొట్టమొదటి ఆవిరి యంత్రం అదేనేమో. దాంతో ఓ నీటి పంపు తయారుచేసి ప్రదర్శించాడు. తరువాత 1833 లో ఇంగ్లండ్ నుండి 10 –హెచ్.పి. ఇంజిను తెప్పించుకుని దాన్ని ‘ఇండస్’ అనే పేరుగల ఓడలో అమర్చాడు. 1834 లో గ్యాస్ తో విద్యుత్ దీపాలు ఎలా అమర్చాలో చేసి చూపించాడు. మజగాన్ లో తన బంగళాలోను, తోటలోను గ్యాస్ దీపాలు అమర్చుకున్నాడు.

అప్పుడే బొంబాయిలో కొత్తగా వచ్చిన ఎల్ఫిన్స్టోన్ సంస్థలో ‘మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్’ రంగాల్లో శిక్షణ పొందాడు. నౌకలలో వాడే అధునాతన ఆవిరి యంత్రాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోడానికి ఓ ఏడాది పాటు ఇంగ్లండ్ లో గడిపాడు.

కుర్సట్జీ పార్సీ ఆచారాలని తుచ తప్పకుండా పాటించేవాడు. అందుకే తనతో పాటు కొందరు పార్సీ సేవకులని ఇంగ్లండ్ కి తీసుకువెళ్లాడు. వాళ్లు చేసిన వంటే తినేవాడు. కుర్సట్జీకి ఎందుచేతనో లండన్ అంతగా నచ్చలేదు. లండన్ లోని టంకశాల కన్నా బొంబాయి లోని టంకశాలే నయం అనిపించింది. లండన్ లోని మురికి వీధులు చూసి, బొంబాయిలోని శుభ్రమైన వీధులతో పోల్చుకుని, అసహ్యించుకునేవాడు. మన దేశంలో ప్రస్తుత వాస్తవాలు అప్పటి వాస్తవానికి విరుద్ధంగా ఉండడం చింతించదగ్గ విషయం.

ఇంగ్లండ్ లో ఉండగా కుర్సట్జీ కి 1841 లో అక్కడి ప్రఖ్యాత రాయల్ సొసయిటీ లో సభ్యత్వం దొరికింది. అంత ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో సభ్యత్వం పొందిన ప్రథమ భారతీయుడు ఈయనే. ఆ తరువాత 75 ఏళ్ల తరువాత శ్రీనివాస రామానుజన్ కి మళ్లీ అదే గౌరవం లభించింది. అదే సంవత్సరం అతడు గొప్ప హోదాలో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ కొత్త ఉద్యోగంలో ఎంతో మంది బ్రిటిష్ వారు కూడా కుర్సట్జీ కింద పనిచెయ్యాల్సి వచ్చింది. ఇది నచ్చని బాంబే టైమ్స్ పత్రిక ఈ విధంగా జాత్యహంకారం చూపించుకుంది – “ఎంత సమర్థుడైనా, ఎంత చదువుకున్నా, ఒక స్థానికుడు బాంబే స్టీమ్ ఫాక్టరీ లాంటి గొప్ప పరిశ్రమకి నేతృత్వం వహించడం” ఎంత వరకు సమంజసం అంటూ సందేహం వ్యక్తం చేసింది.

1851 లో కుర్సట్జీ తన పూర్వీకుల గౌరవార్థం ‘లోజీ ఫామిలీ’ అనే పేరుగల ఓ స్టీమరును విడుదల చేశాడు. ఆ స్టీమరులో వాడిన విడిభాగాలన్నీ తన సొంత ఫౌండ్రీలో ఉత్పత్తి చెయ్యబడ్డాయి. బొంబాయిలో మొట్టమొదటిసారిగా కుట్టుమెషిను, ఫోటోగ్రఫీ, ఎలక్ట్రో ప్లేటింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాల ప్రవేశానికి కూడా ఇతడే కారణం.

1861 లో ఇండస్ ఫ్లోటిలా కంపెనీ లో సూపర్ ఇంటెండింగ్ ఇంజినీరుగా పదవీ స్వీకారం చేశాడు. తదనంతరం సింద్ ప్రాంతంలోని కోట్రీ అనే ఊళ్లో ఈ కంపెనీకి శాఖలు కూడా తెరిచాడు. తరువాత 1863 ఇంగ్లండ్ కి వెళ్లి రిచ్మండ్ అనే ఊళ్లో స్థిరపడ్డాడు. జీవితాంతం అక్కడే ఉండి, 16, నవంబర్ 1877 లో కన్నుమూశాడు.

(అరవింద్ గుప్తా రాసిన ‘బ్రైట్ స్పార్క్స్’ అనే పుస్తకం నుండి)

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

జీవశాస్త్రంలో ఫెయిన్మన్

ఎప్పుడూ ఒకే సమస్యని పట్టుకుని వేలాడకుండా, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ, తనకి పరిచయం లేని వైజ్ఞానిక రంగాల్లో చొచ్చుకుపోతూ, పరిశోధనలు చెయ్యడం అంటే మేటి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, రిచర్డ్ ఫెయిన్మన్ కి సరదా. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పని చేసే రోజుల్లో ఒక సారి, తను ఎప్పుడూ పని చేసే సైద్ధాంతిక భౌతిక శాస్త్రాన్ని వదిలిపెట్టి సరదాగా జీవశాస్త్రంలో వేలు పెట్టి చూడాలని నిశ్చయించుకున్నాడĹ 7;.

భౌతిక శాస్త్రంలో అయితే తను గొప్ప పండితుడు, గురువు కావచ్చు, కాని జీవశాస్త్రంలో తను శిష్యుడే కనుక ఒక విద్యార్థి లాగా ఇతర విద్యార్థులతో పాటు క్లాసులకి వెళ్లి పాఠాలు విని నేర్చుకోవాలని అనుకున్నాడు. కణ జీవశాస్త్రం (సెల్ బయాలజీ) లో ఓ కోర్సులో కూర్చోవాలనుకున్నాĶ 5;ు. ఆ కోర్సుకి ఆచార్యుడి పేరు న్యూటన్ హార్వే. ఇతగాడు కాంతిని వెలువరించే బాక్టీరియాల గురించి చాలా పరిశోధనలు చేసి పేరు తెచ్చుకున్నాడు. ఫెయిన్మన్ తన క్లాసులో కూర్చోడానికి హార్వే ఒప్పుకున్నాడు.

పాపం కొత్తవాడు కదా అని తోటి విద్యార్థులు ఎంతో ఆదరంగా ఉండేవారు. ఒక సారి ఓ విద్యార్థి మైక్రోస్కోప్ లో కణాలు ఎలా కనిపిస్తాయో ఫెయిన్మన్ కి చూపించాడు. అవి వృక్షకణాలు. ఫెయిన్మన్ కి అందులో చిన్న చిన్న ఆకుపచ్చ ‘చుక్కలు’ కనిపించాయి. వాటిని ‘క్లోరోప్లాస్ట్’ లు అంటారని తెలుసుకున్నాడు. అయితే ఆ ‘చుక్కలు’ అటు ఇటు సంచలనంగా కదలడం అతడికి విశేషంగా కనిపించింది. అది చూడగానే అతడిలోని భౌతిక శాస్త్రవేత్త మనసులో ఓ ప్రశ్న మెదిలింది. క్లోరోప్లాస్ట్ లు ఎందుకు కదులుతున్నాయి? వాటిని కదిలించే బలాలు ఏంటి? అదే అడిగాడు తన తోటి విద్యార్థులని. అంతా తెల్లమొహం వేశారు. వాటి పేర్లు తెలుసేగాని అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయĺ 7; ఎవరికీ తెలీదు. అసలు అలా ప్రశ్నించొచ్చని కూడా వారికి ఎప్పుడూ తట్టలేదు. ఈ అనుభవం బట్టి ఫెయిన్మన్ కి భౌతిక శాస్త్రానికి, జీవశాస్త్రానికి మధ్య ఉండే ఓ ముఖ్యమైన తేడా అర్థమయ్యింది. భౌతిక శాస్త్రంలో కాస్త ఆసక్తి కరమైన ప్రశ్న వెయ్యాలంటే కొంత లోతుకి వెళ్లాలి. జీవశాస్త్రంలో ఎవరికీ సమాధానం తెలీని ప్రశ్నలు వెయ్యడం పెద్ద కష్టం కాదు.

ఆ తరువాత ఫెయిన్మన్ కి ఓ పేపరు చదివి క్లాసు ముందు ప్రెజెంట్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లిలోని కొన్ని ప్రత్యేక కండరాలని దాని నాడీమండలం ఎలా నియంత్రిస్తుంది అన్నది ఆ పేపరులోని విషయం. గాస్ట్రోక్నిమియస్ కండరం మొదలైన కండరాల పేర్లు ఉచ్ఛరించడానికే ఫెయిన్మన్ కి నోరు తిరగలేదు. పైగా పిల్లిలో అవసలు ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు. మరిన్ని వివరాలు సేకరించడానికి లైబ్రరీకి వెళ్లాడు. అలాంటి సమాచారం ఎలాంటి పుస్తకాలలో ఉంటుందో కూడా తనకి తెలీదు. నేరుగా జీవశాస్త్ర విభాగానికి చెందిన లైబ్రేరియన్ ని కలుసుకుని “పిల్లికి సంబంధించిన మ్యాపులు ఉన్నాయా?” అని అడిగాడు. ఆవిడకి నవ్వు ఆగలేదు. పిల్లికి “మ్యాపులు” ఉండవని వివరించి, పిల్లి జీవనిర్మాణానికి (అనాటమీకి) సంబంధించిన సమాచారం అందించింది లైబ్రేరియన్.

మర్నాడు క్లాసుకి వెళ్లి తన సెమినార్ ఇవ్వడం మొదలెట్టాడు ఫెయిన్మన్. ముందుగా బోర్డు మీద పిల్లి బొమ్మ గీసి, అందులో వివిధ కండరాలని సూచించడం మొదలెట్టాడు. “ఇవన్నీ మాకు తెలిసినవే” అంటూ క్లాసంతా గగ్గోలు పెట్టింది. “అవును మరి. అందుకే మీరు నాలుగేళ్లు కష్టపడి చదువుకున్న విషయాలని ఇంత తక్కువ సమయంలో నేను నేర్చుకున్నాను,” అంటూ చురక వేశాడు ఫెయిన్మన్.

జీవశాస్త్రంలో కనిపించిన విషయాలకి పేర్లు పెట్టుకుని, ఆ పేర్లన్నీ శ్రమపడి బట్టీ పట్టుకునే పద్ధతి ఫెయిన్మన్ కి కాలయాపనలా అనిపించింది. అంత కన్నా జీవ వ్యవస్థల తత్వం గురించి ప్రశ్నించి, దాన్ని శోధించడం మరింత ఆసక్తికరమైన వ్యాపకంగా తోచింది.

మరో సందర్భంలో ఫెయిన్మన్ రైబోజోమ్ లకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమస్య మీద హిల్డెగార్డ్ లామ్ఫార్మ్ అనే శాస్త్రవేత్తతో పని చేశాడు. ఈ రైబోజోమ్ లు అనే వేదిక మీద, ఎమ్. ఆర్. ఎన్. ఏ. అనే అణువుల లోని ‘కోడ్’ ఆధారంగా, కణంలో ప్రోటీన్ అణువుల నిర్మాణం జరుగుతుంది. అయితే సామాన్యంగా ఒకే జీవకణంలో ఉండే రైబోజోమ్ లు, ఆర్. ఎన్. ఏ. ల నుండి ఆ జీవకణానికి సంబంధించిన ప్రోటీన్ లు తయారవుతాయి. అలా కాకుండా రెండు విభిన్న జీవజాతుల నుండి ఈ రెండిటినీ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఉదాహరణకి బాక్టీరియాల నుండి రైబోజోమ్ లని, బఠాణీల నుండి ఎమ్. ఆర్. ఎన్. ఏ. ని తీసుకుని కలిపితే ఆ వచ్చే ప్రోటీన్లు బఠాణీ ప్రోటీన్లా, బాక్టీరియా ప్రోటీన్లా?

ఈ ప్రయోగానికి ఎక్కువ మోతాదులో రైబోజోమ్ పదార్థం కావలసి వచ్చింది. అంతకు ముందే మరేదో ప్రయోగం కోసం ఫెయిన్మన్ ఈ.కోలై బాక్టీరియా నుండి పెద్ద మొత్తంలో రైబోజోమ్ లని వెలికి తీసి వున్నాడు. ఊరికే ఉన్నాయి కదా అని ఆ రైబోజోమ్లని ఈ కొత్త ప్రయోగంలో వాడి ప్రయోగం చేసి చూశాడు. కాని చిన్న పొరపాటు వల్ల ప్రయోగం బెడిసికొట్టింది. తను వాడిన రైబోజోమ్ లు నెల రోజులుగా ఫ్రిడ్జిలో ఉన్నాయి. కనుక అవి మరేదో జీవపదార్థంతో కలుషితం అయ్యాయి. ప్రయోగం సరిగ్గా జరిగి వుంటే ఎంతో గొప్ప జీవ వైజ్ఞానిక సత్యం బయట పడి వుండేది. జీవలోకంలో ప్రోటీన్ల నిర్మాణానికి పనికొచ్చే ఈ రైబోజోమ్లనే యంత్రాంగం ఎక్కడైనా ఒక్కలాగే ఉంటుంది అని తెలిసేది. కాని ఫెయిన్మన్ చేసిన పొరపాటు వల్ల ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వలేదు.

ఈ అనుభవం వల్ల ఫెయిన్మన్ జీవశాస్త్రాన్ని ఓ కొత్త కోణం నుండి చూడగలిగాడు. జీవశాస్త్రంలో ప్రగతి సాధించాలంటే కేవలం సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకుంటే సరిపోదు. జీవశాస్త్రానికి ఊపిరి ప్రయోగం. ఆ ప్రయోగాలు చెయ్యడానికి అపారమైన సహనం, శ్రద్ధ అవసరం. చిన్న పొరబాటు జరిగినా ప్రయోగం మొత్తం అపభ్రంశం అవుతుంది.

ఆ విధంగా జీవశాస్త్రంలో ఎన్నో విషయాలు నేర్చుకుని, ఎన్నో అనుభవాలు సేకరిస్తాడు ఫెయిన్మన్. ఒక రంగంలో నోబెల్ బహుమతి గ్రహించేటంత స్థాయికి వెళ్లిన ఆ శాస్త్రవేత్త తనకి పరిచయం లేని రంగంలోకి ప్రవేశించి, ఒక విద్యార్థి స్థాయికి దిగి, వినమ్రంగా తప్పులు సరిదిద్దుకుంటూ, ఆ రంగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి, శాస్త్రవేత్తకి ఉండాల్సిన నిగర్వానికి, అంతులేని వైజ్ఞానిక కుతూహలానికి ప్రతీకగా నిలిచాడు.

(రిచర్డ్ ఫెయిన్మన్ రాసిన ‘ష్యూర్లీ యూ మస్ట్ బి జోకింగ్ మిస్టర్ ఫెయిన్మన్’ అన్న పుస్తకం నుండి)

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

ఆటబొమ్మలతో సైన్స్ నేర్పే అరవింద్ గుప్తా

ఆటబొమ్మలతో సైన్స్ నేర్పే అరవింద్ గుప్తా

రాముడు రాతిని నాతిని చేసినట్టు, అతడి చేయి పడితే ఎందుకూ పనికి రాని వస్తువులు కూడా అమూల్యమైన వైజ్ఞానిక బోధనా పరికరాలుగా మారిపోతాయి. వాడేసిన అగ్గిపుల్లలు, పాత న్యూస్ పేపర్లు, వాడిన టెట్రాపాక్ డబ్బాలు, పాడైపోయిన సైకిల్ టైర్లు, పారేసిన ప్లాస్టిక్ సీసాలు.. కావేవీ చదువు కనర్హం అని అతడి ఉద్దేశం. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే అతి సామాన్యమైన వస్తువులతో కూడా ఏదో సృజనాత్మకమైన ప్రయోగం చేసి సైన్సు అంటే పిల్లల్లో వల్లమాలిన అభిమానాన్ని పెంచగల చాతుర్యం తనది. అతడి పేరు అరవింద్ గుప్తా.

వాడేసిన అగ్గిపుల్లలతో జ్యామెట్రీ ఆటలా? కోకొల్లలు చెయ్యొచ్చంటారు అరవింద్ గుప్తా. అందుకు కొన్ని వాడిన అగ్గిపుల్లలు, సైకిల్ ట్యూబులలో వాడే వాల్వ్ ట్యూబులు కావాలి. వాల్వ్ ట్యూబుల్లో అగ్గిపుల్లలు గుచ్చి ఓ గొలుసుకట్టుగా అమర్చవచ్చు. అలా మూడు అగ్గిపుల్లలని కలిపి ఓ త్రికోణాన్ని చెయ్యొచ్చు. నాలుగింటితో చదరాన్ని చెయ్యొచ్చు. దాన్ని కొంచెం నొక్కితే రాంబస్ అవుతుంది. అలాగే ఐదు పుల్లలతో పంచభుజిని చెయ్యొచ్చు. దీన్ని నొక్కితే ఏమవుతుంది? పడవ బొమ్మ అవుతుంది! ఆరు పుల్లలతో టెట్రహెడ్రన్ ని చెయ్యొచ్చు. మరో రెండు కలిపితే పిరమిడ్, ఇంకొకటి కలిపితే ప్రిజమ్. ఇంకా అలాగే సాగితే చిన్న చిన్న ఇళ్లు, వంతెనలు… మొత్తం సివిల్ ఇంజినీరింగ్ అంతా ఈ “చెత్త” లోనే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఈ అంశం మీద అరవింద్ గుప్తా రాసిన ‘అగ్గిపుల్లల ఆటలు’ అన్న పుస్తకం డజను భాషల్లో అనువదించబడింది. ఐదు లక్షల కాపీలకి పైగా అమ్ముడుపోయింది. అయినా ఆ రచయిత దానికి రాయల్టీ తీసుకోరు.

అలాగే పాత హవాయి చెప్పుతో కాంతి శాస్త్రం నేర్చుకోవచ్చా? అదెలాగో చూపిస్తారు అరవింద్ గుప్తా. పాత హవాయి చెప్పులో అడుగు భాగాన్ని (సోల్) మాత్రం తీసుకోవాలి. అందులో వరుసగా మూడు కన్నాలు చేసి, వాటిలో మూడు పెన్సిళ్లు గుచ్చాలు. సోల్ చదునుగా ఉన్నప్పుడు పెన్సిళ్లు సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు సోల్ ని పెన్సిళ్లు ఉన్న వైపుకి వంచాలి. ఇప్పుడు పెన్సిళ్ల కొసలు ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. ఇది చూస్తే కాంతి శాస్త్రంలో పుటాకార దర్పణం (concave mirror) తో చేసే ఒక ప్రయోగం గుర్తొస్తుంది. అనంతం నుండి వచ్చి ఈ దర్పణం మీద పడే కాంతి రేఖలు, పరావర్తనం చెంది తిరిగి దాని నాభి (focus) వద్ద కలుసుకుంటాయి, ఈ చెప్పులోని పెన్సిళ్లు కలుసుకున్న తీరులో! ఈ సారి చెప్పుని వెనక్కి వంచాలు పెన్సిళ్ల కొసలు దూరంగా జరిగిపోతాయి, కుంభాకార దర్పణంలో (convex mirror) కాంతిరేఖలు ఇలాగే దూరంగా జరుగుతాయి. కనుక ఈ సారి మీ హవాయి చెప్పు పాడైపోతే బాధపడక, కాస్త కాంతి శాస్త్రం అవపోసన పట్టడానికి అదో సువర్ణావకాశం అనుకోండేం!

ఇలా పాడైపోయిన వస్తువులతో సైన్స్ ప్రయోగాలు చెయ్యొచ్చని ఎందుకు అనిపించిందని అడిగిన ప్రశ్నకి అరవింద్ గుప్తా సమాధానం – “సైన్స్ ఎలా నేర్పించాలి అన్న విషయంలో మనకి కొన్ని బూజు పట్టిన భావాలు ఉన్నాయి. పిపెట్లు, బ్యూరెట్లు మొదలైన సరంజామా లేకుండా సైన్స్ మింగుడు పడదనుకుంటాం. చాలా మటుకు స్కూళ్లు విద్యార్థిని ఓ పరాయి వాడిలా చూస్తాయి. లాబరేటరీలలో పరికరాలన్నీ భద్రంగా దాచిపెట్టుకుంటారు. వాడితే పగిలిపోతాయని పిల్లలని వాటిని ముట్టుకోనివ్వరు. బల్లల మీద దుమ్ము పేరుకుని ఉంటుంది. అలా కాకుండా బొమ్మలతో అయితే, అదీ వ్యర్థ పదార్థాలతో చేసిన బొమ్మలతో అయితే ఆ భయం ఉండదు. బొమ్మలతో పిల్లలు చెయ్యదగ్గ అతి ముఖ్యమైన పని వాటిని పగలగొట్టి అవి ఎలా పని చేస్తాయో అధ్యయనం చెయ్యడం!”

ఐ.ఐ.టి. కాన్పూర్ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుకున్న అరవింద్ గుప్తా తను అసలీ రంగంలోకి ఎలా ప్రవేశించిందీ చెప్తారు. 1972 లో ఐ.ఐ.టి కాన్పూర్ లో అనిల్ సదగోపాల్ అనే విద్యవేత్త ఇచ్చిన ఉపన్యాసం అరవింద్ గుప్తాని చాలా ప్రభావితం చేసింది. దేశం అంతటా సంక్షోభం నెలకొన్న రోజులవి. “ఒక పక్క నక్సలైట్ ఉద్యమం, మరో పక్క జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం. చదువుకున్న వారంతా తాము సమాజానికి ఎలా ఉపయోగపడాలి అన్న అంతర్మథనంలో పడ్డారు.” 1975 లో అరవింద్ గుప్తా చదువు పూర్తిచేసినప్పటికĹ 5; మధ్యప్రదేశ్ లో ‘హోషంగాబాద్ సైన్స్ టీచింగ్ ప్రోగ్రాం’ అమలులో ఉంది. ఆరు, ఎనిమిది తరగతుల మధ్య ప్రయోగాల ద్వారా సైన్స్ నేర్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. అంత వరకు బడుల్లో సైన్స్ అంతా “బట్టీ పద్ధతి” లో నేర్పించేవారు. క్లాసులో పిల్లవాడు ఉత్సాహం కొద్దీ ప్రశ్న వేస్తే క్రమశిక్షణ పేరిట నోరు మూయించేవారు. సదగోపాల్, అతడి బృందం, ఈ పరిస్థితులని మర్చాలని ప్రయత్నించారు.

ప్రయోగాలతో సైన్స్ చదువు అభిలషణీయమే అయినా వాస్తవంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్ని బడులలోను ఈ సామగ్రి ఉండేది కాదు. ఉన్న బడులలో కూడా వాటి ప్రభావం వల్ల కొంత కీడు జరిగిందనే చెప్పాలి. “ప్రయోగాలలో వాడే సామగ్రి చాలా మటుకు పాశ్చాత్యం నుండి దిగుమతి చేసుకున్నది. బోధనా పద్ధతులు కూడా పాశ్చాత్యం నుండి వచ్చినవే. ఇవి పిల్లలకి సులభంగా మింగుడు పడేవి కావు. పైగా పరికరాలు ఖరీదైనవి కనుక ఏదైనా పాడైతే సులభంగా కొత్తవి దొరికేవి కావు.” ఈ సమస్యలన్నీ చూసిన అరవింద్ గుప్తా తనదైన ఓ కొత్త మర్గాన్ని తీర్చిదిద్దుకున్నĹ 4;రు.

ఈ పద్ధతిలో పిల్లలు సైన్స్ నేర్చుకోవాలంటే ఖరీదైన పరికరాలు అక్కర్లేదు. ట్యూషన్ మాస్టర్లు, కోచింగ్ సెంటర్లు ఇవేవీ అక్కర్లేదు. సరదాగా ఆటలో ఆటగా ఎన్నో సైన్స్ విషయాలు సహజంగా నేర్చుకుంటారు. ఆ ఆటలు ఎలా ఆడాలో చెప్పే ఎంతో సమాచారం అరవింద్ గుప్తా వెబ్ సైట్ లో ఉంటుంది. (www.arvindguptatoys.com) ఈ వెబ్ సైట్ నిజంగా ఓ గొప్ప విజ్ఞాన భాండారం. కొన్ని వందల, వేల పుస్తకాలు ఇక్కడ ఉచితంగా లభ్యం అవుతాయి. అందులో అరవింద్ గుప్తా రచనలే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఓ వందకి పైగా ఉంటాయి. అవి కాక సైన్స్, విద్య రంగాల్లో పుస్తకాలు, పిల్లల పుస్తకాలు కోకొల్లలుగా ఉంటాయి. “హిందీ నా మాతృభాష. హిందీలో బాల సాహిత్యంలో ఎంతో వెలితి కనిపిస్తుంది. కనుక చాలా అనువాదం చేస్తాను. రోజూ ఐదు గంటల పాటు అనువాదం చేస్తాను,” అంటారు అరవింద్.

అరవింద్ గుప్తా లాంటి విద్యా వేత్తల నుండి స్ఫూర్తి తీసుకుని తెలుగులో కూడా విస్తృత కృషి జరిగితే, ప్రస్తుతం 67.7% వద్ద ఉన్న మన అక్షరాస్యత 2020 కల్లా 90% శాతాన్ని చేరుకోగలదని, చేరుకోవాలని ఆశ.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

కోపర్నికస్ – కెప్లర్ - గెలీలియో

గెలీలియో దూరదర్శినులతో చేస్తున్న పరిశీలనల గురించి కెప్లర్ మొట్టమొదట ’హెర్ వాకర్’ అనే వ్యక్తి ద్వారా విని సంతోషించాడు. విశ్వం గురించి శతాబ్దాలుగా తేలని సమస్యలు ఈ దూరదర్శిని వల్ల తేలే అవకాశం ఉందని అతడు మొదట్నుంచే ఊహించాడు. ఈ కొత్త పరికరం ఖగోళ విజ్ఞానంలో విప్లవం తీసుకురాగలదని ఆశిస్తూ దాన్ని ఇలా పొగిడాడు: “ఓ దూరదర్శినీ! విజ్ఞాన దాయినీ! నీ ఘనత ముందు ఎంత మహిమాన్వితమైన రాజదండమైనా సాటి రాదు. నిన్ను చేబూనిన వాడు దివ్యమైన ఈ సృష్టికే రాజవుతాడు, సామ్రాట్టు అవుతాడు! ”

భూమి చుట్టూ సూర్యచంద్రులే కాక, ఇతర గ్రహాలు కూడా తిరుగుతున్నాయని, విశ్వానికి కేంద్రం మనిషికి జన్మనిచ్చిన ఈ భూమేనని ఒక పక్క క్రైస్తవ మతం బోధిస్తుంటే, ఆ భావనని ఖండిస్తూ భూమి, తదితర గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ప్రతిపాదించాడు కోపర్నికస్. అయితే కోపర్నికస్ వాదనలో బలహీనత దానికి తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడం.

కోపర్నికస్ తరువాత ఇంచుమించు ఓ శతాబ్దం తరువాత పుట్టిన వాడు కెప్లర్. ఇతడికి కోపర్నికస్ భావాల గురించి తన గురువైన మైకేల్ మేస్టిలిన్ ద్వారా తెలిసింది. ఎలాగైనా కోపర్నికస్ భావాల గురించి మరింత లోతుగా శోధించాలని నిశ్చయించుకున్నాడĹ 7; కెప్లర్. అంతలో అదృష్టవశాత్తు టైకో బ్రాహే అనే పేరు మోసిన డేనిష్ ఖగోళవేత్త నుండి తనకి సహచరుడిగా పని చెయ్యడానికి కెప్లర్ కి ఆహ్వానం వచ్చింది. టైకో బ్రాహే తో పని చెయ్యడం మహాభాగ్యం అనుకుని పన్లోకి దిగాడు కెప్లర్.

టైకో బ్రాహే ఖగోళ వస్తువుల చలనాల గురించి అపారమైన సమాచారాన్ని తన పరిశీలనల ద్వారా సేకరించాడు. అది ఖగోళశాస్త్రంలో దూరదర్శిని ఇంకా వాడుకలో లేని కాలం. కేవలం కంటితో చూస్తూ అంత సమాచారాన్ని పోగేశాడు టైకో. ఆ సమాచారాన్ని లోతుగా శోధించాడు కెప్లర్. ఆ పరిశోధనల బట్టి కోపర్నికస్ చెప్పింది నిజమని మరింత బలమైన నమ్మకం కుదిరింది. విశ్వానికి కేంద్రం భూమి కాదని, సూర్యుడని, గ్రహాలన్నీ (భూమితో పాటు) సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని, కెప్లర్ అర్థం చేసుకున్నాడు. భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయన్న నమ్మకంతో ఇక్కణ్ణుంచి గ్రహ గతులని పరిశీలిస్తున్నప్పĹ 7;డు, కొన్ని సార్లు గ్రహగతులు గజిబిజిగా అనిపిస్తాయి.

గ్రహాల ఆ గజిబిజి గతులకి సంబంధించిన కొన్ని చిక్కు ముళ్ళని విడదీశాడు కెప్లర్. అంతకు ముందు టైకో బ్రాహే చేసిన విస్తృత పరిశీలనల ఆధారంగా కెప్లర్ గ్రహాల కక్షలని శాసించే మూడు నియమాలని ప్రతిపాదించాడు (చిత్రం). కెప్లర్ నియమాలుగా పేరు పొందిన ఆ నియమాలు ఇవి:
1. గ్రహాల కక్ష్యలు వృత్తాకారంలో కాక దీర్ఘవృత్తాకారంలో (elliptical) ఉన్నాయి. సూర్యుడు వాటి కేంద్రం వద్ద కాక నాభి (focus) వద్ద ఉన్నాడు.

2. కక్ష్యలో ఉన్న గ్రహం, సూర్యుడికి దూరంగా ఉన్న దశలో నెమ్మదిగాను, దగ్గరగా ఉన్నప్పుడు మరింత వేగంగాను నడుస్తుంది. (సమానమైన కాలవ్యవధుల్లో సూర్యుణ్ణి, గ్రహాన్ని కలిపే రేఖ ఊడ్చే ప్రాంతం యొక్క వైశాల్యం సమానంగానే ఉంటుంది.)

3. సూర్యుడి నుండి గ్రహం యొక్క సగటు దూరం పెరుగుతున్న కొద్ది, సూర్యుడి చుట్టూ దాని ప్రదక్షిణ కాలం (దాని "సంవత్సరం") విలువ పెరుగుతుంది. (ఒక గ్రహం యొక్క సంవత్సరకాలం యొక్క వర్గం, ఆ గ్రహ కక్ష్య యొక్క దీర్ఘాక్షం యొక్క ఘనానికి అనులోమానుపాతంగా ఉంటుంది.)

ఆ విధంగా కెప్లర్ నియమాలు సూర్యసిద్ధాంతానికĹ 5; ఓ నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చాయి.

ఇప్పుడు గెలీలియో తన దూరదర్శినితో కొత్తగా చేస్తున్న పరిశీలనలు కెప్లర్ భావాలని సమర్ధిస్తున్నట్టుĵ 5;ా ఉన్నాయి. అందుకే గెలీలియో తన ఉత్తరాలలో అప్పుడప్పుడు అందిస్తున్న వార్తలు కెప్లర్ కి ఎంతో సంతోషం కలిగించాయి.

ఇన్ని ఆధారాలు పోగవుతున్నా మతం మాత్రం తన బోధనలని, భావనలని మార్చుకోలేదు. దేవుడు మనిషిని అపురూపంగా సృష్టించాడు. అలాంటి మనిషి జీవించే ఈ భూమికి విశ్వంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కనుక గ్రహాలు, సూర్యచంద్రులు, తారలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని కాదన్న వాడు వట్టి అజ్ఞాని, లేదా దైవ ద్రోహి. ఇదీ వరస!

మతం యొక్క మంకు పట్టు ఇలా ఉండగా, గెలీలియో శాస్త్ర పరంగా కూడా వాదాన్ని ఇంకా బలపరచ వలసి ఉందని గ్రహించాడు. ఇంతవరకు తను కనుక్కున్న విషయాలు విశ్వానికి భూమి కేంద్రం కాకపోవచ్చని, భూమికి ప్రత్యేకమైన స్థానం ఏమీ లేదని సూచిస్తున్నాయే గాని, గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ప్రత్యక్షంగా తను నిరూపించలేక పోయాడు. టైకో బ్రాహే పరిశీలనల్లో ఆ విషయం అంతర్లీనంగా ఉన్నా, కెప్లర్ సిద్ధాంతాలు కూడా ఆ దిశలోనే మొగ్గు చూపుతున్నా, దూరదర్శినితో ప్రత్యక్షంగా చూస్తూ సూర్యుడి చుట్టు గ్రహాలు తిరుగుతున్నాయని నిరూపించగలమా? అని ఆలోచించాడు గెలీలియో.

విజ్ఞానశాస్త్రంలో ఎప్పుడూ ఒక మంచి సిద్ధాంతం అంత ముందు తెలిసిన విషయాలని వర్ణించగలిగితే సరిపోదు. ఆ సిద్ధాంతం అంతకు ముందు తెలీని కొత్త విషయాలని కూడా ఊహించగలగాలి. అప్పుడా కొత్త విషయాలని కొత్తగా ప్రయోగం చేసి నిరూపిస్తే, సిద్ధాంతం మరింత బలపడుతుంది. ’ద రెవొల్యూషనిబస్’ అనే గ్రంధంలో కోపర్నికస్ సరిగ్గా అలాంటి ఊహాగానమే ఒకటి చేశాడు. శుక్ల పక్షం నుండి కృష్టపక్షం వరకు చంద్రుడికి దశలు ఉంటాయని మనకి తెలుసు. మరి వీనస్, మెర్క్యురీ మొదలైన గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగేట్టయితే వాటికీ దశలు ఉండాలని ఊహించాడు కెప్లర్. కాని ఆ విషయాన్ని నిరూపించడానికి తన వద్ద సరైన సాధన సామగ్రి లేకపోయింది.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో గెలీలీ

ఆధునిక భౌతిక శాస్త్రం గెలీలియోతో మొదలయ్యిందని చెప్పుకుంటారు. ప్రతీ వివాదంలోను ప్రయోగాత్మక పద్ధతికి, వస్తుగత దృష్టికి ప్రాధాన్యత నిస్తూ, ఆధునిక శాస్త్రీయ పద్ధతికి (scientific method) పునాదులు వేశాడు. ప్రయోగ ఫలితాల ద్వారా ప్రకృతి చెప్పే సాక్ష్యాధారాల బలం ముందు ఎంతటి అధికార బలం, అహంకర బలం అయినా తల ఒగ్గవలసిందేనని నిరూపించాడు. శాస్త్ర సత్యాన్ని నిలబెట్టేందుకై ప్రాణాలని కూడా లెక్క చెయ్యకుండా మతవ్యవస్థతో తలపడ్డ ధీరాత్ముడు గెలీలియో.

గెలీలియో పుట్టింది 1564 లో 15 ఫిబ్రవరి నాడు ఇటలీలోని పీసా నగరంలో. అస్తికత, దైవచింతన బలంగా ఉన్న ఇంట్లో పెరుగున్నా కూడా, తనలో సహజంగా ఉండే శాస్త్రీయ చింతన చిన్నతనంలోనే బహిర్గతం కాసాగింది. గెలీలియో తన ఇంట్లో వాళ్లతో పాటు ప్రతీ ఆదివారం చర్చిలో సర్వీస్ కి వెళ్లేవాడు. ఒకసారి అలాగే చర్చిలో ప్రార్థన జరుగుతోంది. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు చిన్నవాడైన గెలీలియో. అంతలో ప్రవచకుడి వెనుక నేపథ్యంలో అటు ఇటు ఊగుతున్న ఓ దీపం కనిపించింది. ఆ దీపం ఓ పొడవాటి గొలుసుకి వేలాడుతోంది. దీపం ఒకసారి అటు ఇటు ఊగడానికి ఎంత సేపు పడుతుందో తెలుసుకోవాలని అనిపించింది పిల్లవాడికి. దగ్గరలో ఎక్కడా గడియారం కనిపించలేదు. తన ముంజేతి నాడినే గడియారంగా వాడుకుని దీపం ఒక సారి ఊగడానికి ఎంత సేపు పడుతుందో లెక్కపెట్టాడు. మొదట్లో డోలనం (oscillation) యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉండేది. కాని కాలక్రమేణా డోలనం చిన్నది అవ్వసాగింది. ఇక ఒక దశలో దీపం దాని కేంద్ర బిందువుకి కొద్దిగా అటు ఇటు చిన్న చలనాన్ని ప్రదర్శించసాగింది. అయితే డోలనం యొక్క వ్యాప్తి తగ్గుతున్నా, ఒక డోలనానికి పట్టే సమయం మాత్రం మారకపోవడం చూసి గెలీలియో ఆశ్చర్యపోయాడు. ఇంటికి తిరిగొచ్చాక ఈ విషయం లోకి ఇంకా లోతుగా శోధించడం మొదలెట్టాడు. ఆ శోధన లోంచి పుట్టిందే మనం చిన్నప్పుడు చదువుకున్న లోలకం. లోలకం యొక్క ఆవర్తక కాలం (time period) కేవలం అది కట్టబడ్డ త్రాడు పొడవు మీదే ఆధారపడుతుంది గాని, డోలనం యొక్క వ్యాప్తి (amplitude) మీద గాని, లోలకం బరువు మీద గాని ఆధారపడదని గమనించాడు గెలీలియో. తన చిన్నారి యంత్రానికి ”పల్సిలోగియా’ (pulsilogia) అని పేరు పెట్టాడు. అలా కచ్చితమైన వ్యవధి గల డోలనాలు ప్రదర్శించే లోలకంతో కాలాన్ని కొలవచ్చని, దాన్నో గడియారంలా వాడొచ్చని కూడా ఊహించాడు. ఆ విధంగా మత ప్రవచనాలు కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో గెలీలియో లో దాగి వున్న శాస్త్రవేత్తని తట్టి లేపాయి.

తరువాత యవ్వన దశలో గెలీలియో తన తండ్రి ప్రోద్బలం మీదట వైద్య విద్యలోకి ప్రవేశించాడు. మనసంతా గణిత, భౌతిక శాస్త్రాల మీదే ఉన్నా తండ్రి మాటని కాదనలేకపోయాడు. తను చిన్నప్పుడు కనిపెట్టిన లోలకానికి తన వైద్య విద్యలో కూడా ఒక చక్కని ప్రయోజనం ఉందని గమనించాడు. నాడి చూసి రోగి యొక్క ఆరోగ్య స్థితి గురించి తెలుసుకునే టప్పుడు ఆ నాడి వేగాన్ని కచ్చితంగా కొలవడానికి లోలకాన్ని వాడడం మొదలెట్టాడు. ఆ విధంగా తనకి ఇష్టం లేకపోయినా వైద్య రంగంలో ఓ చిన్న శాస్త్రవిజయాన్ని సాధించాడు గెలీలియో. కాని ఆ రంగంలో ఎంతో కాలం ఇమడలేకపోయాడు. చివరికి తన తండ్రిని ఒప్పించి ఆ చదువుకి మధ్యలోనే తిలోదకాలు వొదిలేశాడు.

శాస్త్రవేత్త అంటే ప్రకృతి గురించి ఎన్నో విషయాలు తెలిసినవాడు అనుకుంటారు చాలా మంది. కాని నిజమైన శాస్త్రవేత్తకి ఉండాల్సిన ముఖ్య లక్షణం తెలిసి ఉండడం కాడు, తెలుసుకోవాలని ఉండడం. కనిపించిన ప్రతీ విషయం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనే గెలీలియోని ప్రతీ విషయాన్ని ప్రశ్నించేలా చేసింది. ఆధారాలు లేనిదే ఏదీ ఒప్పకునేవాడు కాడు. “అది అలా ఉందంతే” అని ఛాందస వాదులు చెప్పే శుష్కవివరణలకి నవ్వేవాడు, వాళ్ల అమాయకత్వాన్ని అవహేళన చేసేవాడు. శాస్త్రవిషయాల్లో ప్రతీ రంగంలోను ప్రాచీన గ్రీకు తాత్వికుడు అరిస్టాటిల్ భావాలు బలంగా పాతుకుపోయిన రోజులవి. అరిస్టాటిల్ చెప్పింది నిజమా కాదా అన్న విచక్షణ లేకుండా, నిర్విమర్శగా ఆయన చెప్పిందంతా వేదమని నమ్మేవాళ్లు పండితులు. ఆయన బోధనలని ఎదిరించడం, ప్రశ్నించడం అవివేకంగాను, అమర్యాదగాను భావించేవారు. అలాంటి అరిస్టాటిల్ మహానుభావుడు బోధనలలో ఒకదాని మీద ఇప్పుడు గెలీలియో ధ్వజం ఎత్తాడు.

గురుత్వాకర్షణ వల్ల వస్తువులన్నీ పైనుండి కిందపడతాయని అందరికీ తెలుసు. అయితే అలా పడుతున్న వస్తువులన్నీ ఒకే విధంగా పడవని కొన్ని ప్రయోగాలలో కనిపిస్తుంది. ఉదాహరణకి ఓ రూపాయి నాణాన్ని, ఓ ఎండుటాకుని ఒకే ఎత్తునుండి పడేస్తే రూపాయి నాణెం ముందు కిందపడుతుంది. ఎండుటాకు అటూ ఇటూ వయ్యారంగా కాసేపు కొట్టిమిట్టాడి నెమ్మదిగా కిందపడుతుంది. కనుక బరువైన వస్తువులు తేలికైన వస్తువుల కన్నా తొందరగా కిందపడతాయని అరిస్టాటిల్ బోధించాడు. కాని ఇది అన్ని సందర్భాలలోను నిజం కాదని సులభంగా తేల్చవచ్చు. ఉదాహరణకి ఇందాకటి రూపాయి నాణెం తో పాటు ఒక చెంచానో, స్టీలు గ్లాసులో పడేసి చూడండి. రెండూ ఇంచుమించు ఒకే సారి నేలని చేరుతున్నట్టు గమనించొచ్చు. కాని ఈ ప్రాథమిక విషయాన్ని కూడా ఎవరూ ప్రశ్నించకుండా యూరప్ లో ఓ రెండు వేల ఏళ్ల పాటు గుడ్డిగా నమ్ముతూ వచ్చారు.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

డా. ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆంధ్రులు గర్వించదగ్గ శాస్త్రవేత్త

నువ్వు డా. ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి విని ఉండకపోవచ్చు. కాని ఆయన ఉండబట్టే నీ ఆయువు మరింత పెరిగింది” డోరాన్ కె. ఆంట్రిమ్.

“వైద్య రంగంలో ఈ శతాబ్దంలోనే ఓ గొప్ప మేధావి,”” అంటూ న్యూ యార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక డా. ఎల్లాప్రగడ సుబ్బారావును ప్రశంసించింది. “ఎన్నో మహమ్మారి వ్యాధులకి విరుగుడు కనుక్కుని ప్రపంచం అంతటా కోటానుకోట్ల వ్యాధిగ్రస్తులకి స్వస్థత చేకూర్చాడు.”

ఎల్లాప్రగడ సుబ్బారావు పుట్టిన తేది జనవరి 12, 1895. స్వగ్రామం పశ్చిమగోదావరిలోని భీమవరం.
ఏడుగురు సంతానంలో ఇతడు మూడోవాడు. తండ్రి జగన్నాథం అనారోగ్యం వల్ల తొందరగా పదవీవిరమణ చెయ్యాల్సి వచ్చింది. నాటి నుండి ఇల్లు గడవడం కష్టం అయ్యింది. ఇంట్లో పరిస్థితి అలా దీనంగా ఉండడంతో సుబ్బారావు మనసు చదువు మీద నిలవలేకపోయింది. ఒకరోజు ఎవరితోనూ చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వారణాసికి పారిపోవాలని ప్రయత్నించాడు. అక్కడైనా తల రాత మారుతుందేమో నని ఓ ఆశ. కాని తల్లి వెంకమ్మ ఎలాగో కొడుకు పన్నాగం పసిగట్టి, తిరిగి ఇంటికి తెచ్చింది. వెర్రి మొర్రి వేషాలు వెయ్యకుండా బుద్ధిగా చదువుకోమని బడికి పంపించింది. భర్త మరణం తరువాత వెంకమ్మ తన మంగళసూత్రం అమ్మి కొడుకు చదువుకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడింది.

మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజిలో చదువుకునే రోజుల్లో తరచు రామకృష్ణా మిషన్ కి వెళ్తూ ఉండేవాడు. అక్కడ చాలా సేపు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఒకదశలో సన్యసించి సంసారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని ఆరాట పడ్డాడు. కాని అలాంటి ఆలోచనే పెట్టుకో వద్దని తల్లి గట్టిగా మందలించింది. చివరికి చేసేది లేక మద్రాస్ మెడికల్ కాలేజిలో చేరాడు. డాక్టరుగా శిక్షణ పొందితే రామకృష్ణా మిషన్ ఆస్పత్రులలో డాక్టరుగా పని చెయ్యొచ్చని అనుకుని సరిపెట్టుకున్నాడు. కాని చదువుకి అయ్యే ఖర్చు భరించే స్తోమత తనకి లేదు. ఇక ఒక్కటే మార్గం. పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బుతో హాయిగా చదువుకోవచ్చు! ఆ రోజుల్లో ఎంతో మంది యువకులు చేసే పనే తనూ చేశాడు. తల్లి కూడా తన ఆలోచనని ఆమోదించింది. అయితే ఆవిడ కారణాలు వేరు. ఇలాగైనా కొడుకు ’పిచ్చి’ కుదురుతుందని ఆవిడ ఆశ. చివరికి మే 10, 1919 నాడు తన కన్నా 12 ఏళ్లు చిన్నదైన శేషగిరిని వివాహం చేసుకున్నాడు.

ఆ రోజుల్లోనే గాంధీ మొదలుపెట్టిన స్వదేశీ ఉద్యమం చేత ప్రభావితుడైన సుబ్బారావు బ్రిటిష్ వస్తువులని వాడడం మానేశాడు. ఖాదీ బట్టలు వేసుకోవడం మొదలెట్టాడు. ఈ పద్ధతి కాలేజిలో ఇంగ్లీషు అధికారులకి నచ్చలేదు. దాంతో తనకి న్యాయంగా ఇవ్వాల్సిన ఎమ్.బి.బి.ఎస్. డిగ్రీకి బదులు మరింత తక్కువదైన ఎల్.ఎమ్.ఎస్. డిగ్రీ మాత్రం ఇచ్చారు.
దాంతో ఒళ్లు మండిన సుబ్బారావు పాశ్చాత్య వైద్య వ్యవస్థ మీదే ధ్వజం ఎత్తాడు. పాశ్చాత్యపద్ధతిలో ప్రాక్టీసు చెయ్యకుండా పోయి మద్రాస్ ఆయుర్వేదం కాలేజిలో అనాటమీ లెక్చరరుగా చేరాడు.

ఆ కాలంలోనే అమెరికా నుండి వచ్చిన ఓ డాక్టరు, సుబ్బారావుకి పరిచయం అయ్యాడు. పైచదువులకి అమెరికా వెళ్లమని సలహా ఇచ్చాడు ఆ డాక్టరు. మామగారు ఇచ్చింది కొంత, శ్రేయోభిలాషులు ఇచ్చింది కొంత కూడేసుకుని, మూడేళ్లలో తిరిగొస్తానని ఇంకా ఇరవై కూడా దాటని తన కుర్ర భార్యకి మాటిచ్చి, అమెరికాకి బయలుదేరాడు. కాని దురదృష్టవశాత్తు ఆమె మళ్లీ ఎప్పుడూ తన భర్తని చూడలేదు.

1923 అక్టోబర్ 26 నాడు జేబులో 100 డాలర్లతో బాస్టన్ నగరంలో దిగాడు సుబ్బారావు. స్కాలర్షిప్ సంపాదించడానికి తన ఎల్.ఎమ్.ఎస్. సటిఫికేట్ సరిపోలేదు. ఆ దుర్భరమైన తొలి దశలలో సుబ్బారావు ప్రొఫెసర్ అయిన డా. రిచర్డ్ స్ట్రాంగ్ తనకి ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. తీరిక వేళల్లో ఆస్పత్రిలో చిన్నా చితకా పనులు చేసుకూంటూ ఎలాగో బతుకు వెళ్లబుచ్చాడు.

చివరికి హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి ట్రాపికల్ మెడిసిన్ లో డిప్లొమా సాధించాడు. డా. క్రయస్ ఫిస్క్ అనే శాస్త్రవేత్తకి చెందిన బయోకెమిస్ట్రీ లాబరేటరీలో చేరాడు. అక్కడ పని చేసిన రోజుల్లోనే రక్తంలోను, మూత్రంలోను ఫాస్ఫరస్ శాతాన్ని అంచనా వెయ్యడానికి ఓ కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఇదే ఫిస్క్-సుబ్బారావ్ పద్ధతిగా పేరు పొందింది. బయోకెమిస్త్రీ విద్యార్థులు ఇప్పటికీ ఈ పద్ధతి గురించి చదువుకుంటారు. ఇటివలి కాలంలో థైరాయిడ్ సమస్యలని, మూత్ర వ్యవస్థకి చెందిన రికెట్స్ (renal rickets) ని కనిపెట్టడానికి ఇదో ముఖ్యమైన ఆయుధంగా పరిణమించింది.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

డా. ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆంధ్రులు గర్వించదగ్గ శాస్త్రవేత్త - 2

ఈ పద్ధతితో కండరాల సంకోచానికి కావలసిన శక్తికి మూలం గ్లైకోజెన్ యే నన్న మునుపటి వాదనని వమ్ముచెయ్యడానికి సుబ్బారావుకి సాధ్యం అయ్యింది. ఈ వాదనే 1922 లో హిల్, మెయెరోఫ్ లకి వైద్య, జీవక్రియా శాస్త్రాలలో నోబెల్ బహుమతిని తెచ్చి పెట్టింది. కండరాల సంకోచమే కాదు సమస్త జీవక్రియలకి శక్తి మూలం ఆడెనొసిన్ ట్రైఫాస్ఫేట్ అనే అణువు అని సుబ్బారావు కనుక్కున్నాడు. అంటే విశ్రాంత స్థితిలో ఉన్న కండరం కన్నా, అలసిన స్థితిలో కండరంలో ఏ.టీ.పీ. సాంద్రత తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఆవిష్కరణలన్నీ ఏప్రిల్ 1927 నాటి సంచికలో ప్రఖ్యాత ’సైన్స్’ పత్రికలో అచ్చయ్యాయి. ఈ పరిశోధనే అతడికి డాక్టరేట్ పట్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ పరిణామంతో వైజ్ఞానిక సంఘంలో సుబ్బారావు గౌరవం అమాంతంగా పెరిగింది. అది చూసి రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అతడికి ఫెలోషిప్ కూడా ఇచ్చి ఆదరించంది.

ఆ తరువాత సుబ్బారావు భయంకరమైన ఎనీమియా వ్యాధి మీద ధ్వజం ఎత్తాడు. పంది కాలేయం నుంచి విటమిన్ బి 12 వెలికి తీసి, అది ఎనీమియా కి విరుగుడుగా పనిచేస్తుందని నిరూపించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విటమిన్ల వేట మొదలయ్యింది. ఆ ప్రయత్నంలో ఎన్నో కొత్త విటమిన్లు కనుక్కోబడ్డాయి.

విశ్వవిద్యాలయాలలో కన్నా పెద్ద పెద్ద ఫార్మసూటికల్ కంపెనీలలో అయితే పరిశోధనకి మరింత మెరుగైన సౌకర్యాలు ఉంటాయని అనిపించింది సుబ్బారావుకి. కనుక 1940 లో పేరు మోసిన లీడర్లే లాబరేటరీలలో చేరాడు. ఈ కొత్త ఉద్యోగంలో చేరాక ఎంతో కాలం పగలనక్ రాత్రనక కృషి చేసి ఫోలిక్ ఆసిడ్ ని సంయోజించ గలిగాడు. గత యాభై సంవత్సరాలలోను విటమిన్ బి 12 తో పాటు ఈ ఫోలిక్ ఆసిడ్ కూడా ఎనీమియాకి మందుగా పని చేసి మానవజాతికి ఎంతో మేలు చేసింది.

అక్కడితో ఆగక సుబ్బారావు, అతడి వైజ్ఞానిక బృందం ఎన్నో ఇతర వ్యాధుల మీద యుద్ధం ప్రకటించారు. ఈ పరిశోధనలలో ఆయన రెండు పడవల మీద ప్రయాణిం సాగించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవ అణువులని అణువణువూ తెలిసిన రసాయన శాస్త్రవేత్త మాత్రమే కాదు, మానవయాతనని ఎలాగైన ఉపశమింపజేయడానికి కంకణం కట్టుకున్న దయామయుడైన వైద్యుడు కూడా. తనలోని ఈ రెండు సామర్థ్యాలు మనుషుల పట్ల కరుణ, రసాయన శాస్త్రంలో అనుపమాన ప్రజ్ఞ తన బృందాకి కూడా నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండేవి.

1928 లో అలెక్సాండర్ ఫ్లెమింగ్ సూక్ష్మక్రిముల పాలిటి బ్రహ్మాస్త్రం లాంటి ఓ కొత్త శక్తివంతమైన మందుని కనుక్కున్నాడు. దాని పేరే పెన్సిలిన్. పెన్సిలిన్ రాకతో వైద్యచరిత్రలో ఆంటీబయాటిక్ యుగం మొదలయ్యింది. ఆ కొత్త రకం మందుల ప్రాముఖ్య్తత సుబ్బారావు మొదట్లోనే పసిగట్టాడు. ఓ వృక్షశాస్త్రవేత్తķ 2;ి తన బృందంలో చేరుకుని ప్రపంచం నలుమూలల నుండి తెప్పిచ్చిన మట్టి నుండి వెలికి తీసిన ’మోల్డ్’ లని విశ్లేషించే పని మీద పెట్టాడు. ఈ ప్రయత్నంలొనే A-377 అనే ఓ శక్తివంతమైన మోల్డ్ తయారయ్యింది. ఈ మందు గురించి సుబ్బారావు ఇలా రాసుకున్నాడు. “ఎంతో వైవిధ్యం గల రోగకారక క్రిముల మీద ఈ మందు నాగుపాము కాటులా పనిచేస్తుంది. కాని ఇతర శరీర కణాల మీద మాత్రం దీని ప్రభావం పిల్లికూన స్పర్శలాగా సున్నితంగా ఉంటుంది.” ఈ విధంగా టెట్రాసైకిలిన్ అనే కొత్త రకం ఆంటీబయాటిక్ మందులు తయారయ్యాయి.

ఆంటీబయాటిక్ రంగంలో తను సాధించిన విజయాలతో తృప్తి పడక పోలియో, కాన్సర్ వ్యాధుల మీద యుద్ధం ఆరంభించాడు. ఈ ప్రయత్నంలో పుట్టిన మందుల్లో టియోర్టెరిన్ (teorpterin) ఒకటి. ఇది లుకేమియా మందుగా సత్ఫలితాలనిచ్చిందĹ 5;.

1948, ఆగస్టు 9, సోమవారం, నాడు సుబ్బారావు ఆఫీసుకి రాకపోవడం చూసి తోటి ఉద్యోగులు ఆశ్చర్యపొయారు. శ్రమవ్యసన పరుడైన సుబ్బారావు ఇలా సోమవారం నాడు ఆఫీసుకి రాకపోవ డం విడ్డూరంగా అనిపించింది. ఇంటికి వెళ్లి చూస్తే ఆయన బలమైన గుండెపోటుతో మరణించాడని తెలిసింది. అప్పటికి ఆయన వయసు 53. అమెరికాకి వచ్చిన తరువాత మళ్లీ ఎప్పుడూ ఆయన ఇండియాకి తిరిగి వెళ్లలేదు.

సంపూర్ణ చిత్తశుద్ధితో శాస్త్రవృత్తిని ఓ యజ్ఞంలా ఆచరించిన దీక్షాపరుడు సుబ్బారావు. తన ఆవిష్కరణల నుండి లౌకికమైన లబ్ది పొందాలని ఎప్పుడూ అనుకోలేదు. వాటి మీద పేటెంట్ల కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. పత్రికలు, పత్రికా విలేకరులు, పదవులు, బిరుదులు, - వీటన్నిటికి దూరంగా ఉండేవాడు. కాని భారత రత్న బిరుద ప్రదానం కోసం ఆయన పేరు ఒకసారి సూచించబడింది. అమెరికా పౌరుడు అయ్యే అవకాశం ఉన్నా భారతీయ పౌరుడిగానే ఉండిపోయాడు. ఎన్నో మహత్తర శాస్త్ర విజయాలు సాధించినా, సాధించినదానితో తృప్తి పడకుండా, పేరుకోసం, డబ్బుకోసం ప్రాకులాడకుండా, ఎప్పుడూ ఇంకా ఏవో మహోన్నత లక్ష్యాల కోసం అనిద్రితంగా శ్రమించే ఆదర్శశాస్త్రవేత్త సుబ్బారావు. ఆంధ్రులకి మాత్రమే కాదు, యావత్ భారతానికి, సమస్త వైజ్ఞానిక లోకానికి ఆయన చిరస్మరణీయుడు.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

డిగ్రీలు లేని, నిజమైన శాస్త్రవేత్త హుమాసన్

డిగ్రీలు లేని, నిజమైన శాస్త్రవేత్త హుమాసన్

ఆ విధంగా స్లిఫర్ కి సాధ్యం కాని పనిని, హబుల్ తన 100-ఇంచిల దూరదర్శినితో సాధించాలని పూనుకున్నాడు. దూరదర్శిని శక్తివంతమైనదే అయినా ఆ రోజుల్లో అంతరిక్షంలో అంతంత దూరాలు చూసిన వీరుడు లేడు. అప్పటికే హబుల్ కి అంతరిక్షంలో విపరీతమైన దూరాలు కొలవడంలో గొప్ప పేరుంది. అయితే తను చేపట్టిన పని సాధించడానికి కౌశలమే కాక, గొప్ప సహనం కూడా కావాలి. చెప్పలేనంత ప్రయాసతో కూడుకున్న పని అది. అదంతా తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని హబుల్ కి తెలుసు. ఈ ప్రయాసలో తనకి కుడిభుజంలా ఉండే వాణ్ణి వెతుక్కోవాలి. మౌంట్ విల్సన్ వేధశాలలో హుమాసన్ కి అప్పటికే మంచి పేరు ఉంది. తన పనికి హుమాసన్ నే ఎంచుకున్నాడు హబుల్.

అయితే హుమాసన్ ని ఎంచుకోడానికి మరో కారణం కూడా ఉంది. హుమాసన్ పెద్దగా చదువుకోలేదు. హబుల్ లాగా తనకి పి.హెడ్.డి. పట్టం లేదు. ఖగోళ పరిశీలనలో ఓ మేటి శాస్త్రవేత్తకి ఉండాల్సిన కౌశలం ఉన్నా, పెద్దగా డిగ్రీలు లేని వాడు. తన వల్ల ఏదైనా గొప్ప ఆవిష్కరణ జరిగినా దాని ఘనత హబుల్ దే అనుకుంటారు గాని, హుమాసన్ గొప్పదనం అని ఎవరూ అనుకోరు. ఇది కూడా హబుల్ హుమాసన్ ని ఎన్నుకోవడానికి మరో కారణం!

హబుల్, హుమాసన్ లు ఇద్దరూ వేరు వేరుగా తమ పరిశీలనలలో నిమగ్నం అయ్యారు. ఈ ప్రయత్నంలో క్రమం ఇలా ఉంటుంది. స్లిఫర్ పరిశీలించిన గెలాక్సీల కన్నా దూరంలో ఉన్న గెలాక్సీల నుండి వచ్చే కాంతిలో అరుణభ్రంశం కొలవాలి. దాని వల్ల వాటి గమన దిశ (మన దిశగా వస్తోందా, దూరంగా తరలిపోతోందా), వేగం తెలుస్తాయి. కాని వాటి దూరాన్ని తెలుసుకోడానికి ప్రకాశం మీద ఆధారపడ్డ ’సెఫెయిడ్ చంచల తార పద్ధతి’ మొదలైన సాంప్రదాయక పద్ధతులని వాడాలి. ఆ విధంగా దూరాన్ని,వేగాన్ని కొలిచి, వాటి మధ్య ఏమైనా సంబంధం ఉందేమో చూడాలి.

1929 కల్లా 46 గెలాక్సీలకి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. దూర, వేగాల మధ్య అనుకున్న దాని కన్నా చాలా సరళమైన సంబంధం ఉండడం ఆశ్చర్యం కలిగించింది. దూరం, వేగం మధ్య ఓ స్థిరమైన నిష్పత్తి ఉన్నట్టు కనిపించింది. అంటే వేగం (v) కి, దూరం (d) మధ్య అనులోమానుపాత సంబంధం ఉందన్నమాట. ఆ నిష్పత్తిని తెలిపే గుణకాన్ని హబుల్ పేరు మీద H అక్షరంతో వ్యవహరిస్తారు.

V = H X d
H km/sec/MPc
MPc = Mega Parsec = 1,000,000 Parsecs
1 Parsec = 3.26 కాంతిసంవత్సరాలు

మొట్టమొదటి అంచనాల బట్టి దీని విలువ 558 అనుకున్నారు. ఆ తరువాత సాండేజ్ తదితరులు చేసిన పరిశీలనల బట్టి మరింత నిర్దుష్టమైన అంచనాలు వీలయ్యాయి. 2009 లో చేసిన గణనాల బట్టి హబుల్ స్థిరాంకం విలువ 74.2 +/- 3.6 km/sec/MPc.

గెలాక్సీల వేగానికి, వాటి మధ్య దూరానికి మధ్య సంబంధాన్ని తెలిపే ఈ గుణకాన్ని కనుక్కోవడంలో హుమాసన్ పాత్రకి గుర్తింపుగా కొన్ని సార్లు ఈ గుణకాన్ని హబుల్-హుమాసన్ గుణకం అని కూడా అంటారు.

ఒక శాస్త్రవేత్త కావడానికి స్ఫూర్తి ఒక్కొక్కరి విషయంలో ఒకొక్కరకంగా ఉంటుంది. ఒకరికి నోబెల్ బహుమతి సాధించాలన్న ఆకాంక్ష స్ఫూర్తినివ్వచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే భద్రత, పింఛను మొదలైనవి మరొకరికి “స్ఫూర్తి” కావచ్చు. కాని లౌకికమైన లాభాలేవీ లేకపోయినా కేవలం తెలుసుకోవాలన్న పసిపిల్లవాడి కుతూహలమే నిజమైన శాస్త్రవేత్తకి ఊపిరి. ఆ కుతూహులం, ఆ అభినివేశం లేని శాస్త్రవేత్త వృత్తి, ప్రేమలేని కాపురంలా కళావిహీనంగా ఉంటుంది.

ఏ డిగ్రీ లేకపోయినా ఉత్తమ శాస్త్రవేత్తకి ఉండాల్సిన లక్షణాలన్నీ హుమాసన్ కి ఉన్నాయి. సంపూర్ణమైన అంకిత భావం, అపారమైన సహనం, విసుగు లేకుండా సమస్య తెగినదాకా శ్రమించే గుణం... శాస్త్ర వృత్తిని ఒక వ్యాపార అవకాశంగా ఎప్పుడూ చూడలేదు హుమాసన్. సజావుగా సాగుతున్న పళ్లతోట వ్యాపారాన్ని వొదిలిపెట్టి వేధశాలలో పని వాడిగా చేరాడు. శాస్త్రరంగంలో తను సాధించిన విజయాలకి గుర్తింపుగా బిరుదులు, బహుమతులు వస్తాయన్న ఆశ కూడా లేదు. అందుకేనేమే... హబుల్ కి నోబెల్ బహుమతి లభించింది. హుమాసన్ కి ఆ పరిశీలనలలో పాలుపంచుకున్న ఆనందం మాత్రం మిగిలింది.

శాస్త్రవేత్తలు అనగానే న్యూటన్, ఐన్స్టయిన్ వంటి వారే ప్రస్ఫుటంగా గుర్తొస్తారు. కాని నిజానికి సమాజానికి బాగా తెలిసిన శాస్త్రవేత్తలు బహుకొద్ది మంది. సమాజానికి తెలీకుండా మౌనంగా నేపథ్యంలో అధ్బుతంగా శ్రమించిన అజ్ఞాత వీరులు వేలకివేలు. ఆ కోవకి చెందిన ఓ నిజమైన శాస్త్రవేత్త హుమాసన్.

References:
1. John and Mary Gribbin, Men who measured the universe.
2. http://en.wikipedia.org/wiki/Milton_L._Humason
3. http://en.wikipedia.org/wiki/Edwin_Hubble

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

హుమాసన్ 2

కేవలం వాయు, ధూళి మేఘం అయిన ఆండ్రోమెడా నెబ్యులాకి ఏంటంత ప్రాముఖ్యత?

హుమాసన్, షాప్లీ తదితరులు ఆండ్రోమెడా నెబ్యులా మీద దృష్టి సారించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ నెబ్యులా అర్థమైతే ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభకాలంలో విశ్వం గురించిన మన అవగాన సరైనదో కాదో తేల్చుకునే అవకాశం ఉంటుంది.
(Picture: Milton Humason)
ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభ కాలంలో విశ్వం గురించి చాలా సంకుచితమైన అవగాహన ఉండేది. మన పాలపుంత గెలాక్సీయే విశ్వానికి కేంద్రం అనుకునేవారు. మన గెలాక్సీకి బయట కూడా గెలాక్సీలు ఉన్నా అవి మన గెలాక్సీ చుట్టూ పరిభ్రమించే చిన్న చిన్న ఉపగెలాక్సీలు మాత్రమే అనుకునేవారు. ఆవల ఉన్నది కేవలం అనంతమైన ఖాళీ అంతరిక్షమే. హార్లోషాప్లీ అనే అమెరికన్ ఖగోళశాస్త్రవేత్త వేసిన అంచనాల ప్రకారం పాలపుంత వ్యాసం 300,000 కాంతిసంవత్సరాలు అని తేలింది. (కాని ఆ అంచనా అతిశయమైనదని, అసలు విలువ 100,000 కాంతిసంవత్సరాలని తరువాత తెలిసింది.)
మన గెలాక్సీలో అక్కడక్కడ కనిపించే వాయు ధూళి మేఘాలే ఈ నెబ్యులాలు. కేవలం వాయుధూళి మేఘాలు, తారలలా స్వయం ప్రకాశం లేనివి, ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయంటే, అవి మనకి చాలా దగ్గర్లో ఉండి ఉండాలన్నమాట. కనుక ఎలా చూసినా పాలపుంతకి బయట పెద్దగా ఏమీ లేదనే అనుకునేవారు.

అలాంటి నెబ్యులాలలో ముఖ్యమైన ఆండ్రోమెడా నెబ్యులా మీదకు ఎడ్విన్ హబుల్ అనే మేటి శాస్త్రవేత్త దృష్టి పడింది. ఇరవయ్యవ శతాబ్దపు ఖగోళ విజ్ఞాన ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నవాడు హబుల్. 1923 లో మౌంట్ విల్సన్ వేధశాలలో ఉన్న అధునాతన 100-ఇంచిల దూరదర్శిని సహాయంతో తన ప్రయత్నం మొదలుపెట్టాడు. నెలలు తిరిగేలోగా కొన్ని ఆశ్చర్యకరమైన పరిశీలనలు చేశాడు. ఆండ్రోమేడా అంచులో, దుమ్ము ధూళి కనిపించకపోగా, ప్రకాశవంతమైన తారలు కనిపించాయి! అవీ సామాన్యమైన తారలు కాదు. అత్యంతప్రకాశవంతమైķ 2; ’నోవా’ తారలు.

ఈ నోవాలు విస్ఫోటం చెందుతున్న దశలో ఉన్న తారలు. ఆ దశలో వాటి ప్రకాశం మన సూర్యుడి ప్రకాశం కన్నా లక్ష రెట్ల వరకు ఎక్కువ ప్రకాశం ఉండొచ్చు. కొన్ని సార్లు వీటిని పట్టపగలు కూడ కనిపెట్టొచ్చు. ఈ నోవాలతో మనిషికి కొన్ని సహస్రాబ్దాల పరిచయం ఉంది. అచంచలంగా ఉంటుందని భావించే తారామండలంలో ఉన్నట్లుండి కనిపించే ఈ నోవాలు కొత్తగా (నవ్యంగా) పుట్టిన తారలు అని భావించిన ప్రాచీనులు వీటిని ’నోవా’ లని పిలవసాగారు.

ధూళి మేఘం అనుకున్న నెబ్యులాలో ప్రకాశవంతమైన తారలు కనిపించడం హబుల్ కి అమితాశ్చర్యం కలిగించింది. తను పొరబడడం లేదని నిర్ధారించుకోడానిĵ 3;ి, గతంలో ఆ నెబ్యులాలని పరిశీలించిన షాప్లీ, హుమాసన్ మొదలైన వారు తీసిన ఫోటోలు తెప్పించి చూశాడు. తను నోవాలు అనుకున్న తారలు కొన్ని నిజంగానే నోవాలే అయినా, వాటిలో కొన్ని తారలు ’చంచల తారలు’ అని తెలుసుకున్నాడు. ఈ ’చంచల తారల ప్రకాశం, మిణుగురు పురుగుల కాంతిలా, లయబద్ధంగా మారుతూ ఉంటుంది. అందుకే వాటికా పేరు. ఈ తారలకి చాలా ప్రత్యేకత ఉంది. వీటి ప్రకాశం మారే ఆవృత్తికి, వాటి ప్రకాశం యొక్క తీక్షణతకి మధ్య ఓ నిర్దిష్టమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని ఉపయోగించి వాటి నిజ ప్రకాశాన్ని (actual brightness) కనుక్కోవచ్చు. ఇక్కణ్ణుంచి చూస్తున్నప్పుడు అవి కనిపించే తీరు బట్టి వాటి దృశ్య ప్రకాశం (apparent brightness) కనుక్కోవచ్చు. ఈ రెండు రకాల ప్రకాశాన్ని పోల్చి తద్వారా తారల దూరాలు కనుక్కోవచ్చు. ఈ విధంగా తారల ప్రకాశాన్ని బట్టి దూరాన్ని కనుక్కునే పద్ధతనే ’సెఫెయిడ్ చంచల తార’ పద్ధతి అంటారు.

ఈ పద్ధతిని ఉపయోగించి హబుల్ ఆండ్రోమెడా నెబ్యులాలోని చంచల తారల దూరాలని కొలవగా వచ్చిన ఫలితాలు చూసి నిర్ఘాంతపోయాడు! ఆ తారల దూరం 10 లక్షల కాంతి సంవత్సరాలు! (ఆధునిక కొలతల ప్రకారం ఆ దూరం 25 లక్షల కాంతి సంవత్సరాలకి పెరిగింది.) కనుక కేవలం లక్ష కాంతి సంవత్సరాలు వ్యాసం గల మన పాలపుంతలో ఆ నెబ్యులా నిశ్చయంగా భాగం కాదు. అదెక్కడో దూరంలో, పాలపుంతకి బాహ్యంగా ఉంది. తదనంతరం జరిగిన పరిశీలనల బట్టి ఆండ్రోమెడా నెబ్యులా కేవలం ధూళి మేఘం కాదని, పాలపుంతని తలదన్నేటంత పెద్ద బృహద్ గెలాక్సీ అన్న సత్యం నెమ్మదిగా బయటపడింది.

ఆ విధంగా విశ్వాన్ని గురించి, విశ్వంలో మన స్థానాన్ని గురించి మనకున్న అవగాహనలో ఓ ముఖ్యమైన లోపాన్ని హబుల్ చేసిన పరిశీలనలు సవరించాయి. కాని ఆ ఆవిష్కరణలో హుమాసన్ చేసిన పరిశీలనలకి కూడా పాత్ర ఉందన్న సంగతి మరచిపోకూడదు.

హబుల్ పరిశోధనలు ఆండ్రోమెడా గెలాక్సీలోని చంచల తారల ఆవిష్కరణతో ఆగిపోలేదు. మరో కొత్త కోణం నుండి తన పరిశీలనలు చెయ్యాలని అనుకున్నాడు. గతంలో మరో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త చేసిన అత్యంత ఆసక్తికరమైన కృషే అందుకు స్ఫూర్తి...

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

హుమాసన్ 3

వెస్టో స్లిఫర్ అమెరికాలో, ఆరిజోనా రాష్ట్రంలోని ఫ్లాగ్స్టాఫ్ నగరంలో లొవెల్ వేధశాలలో పనిచేసేవాడు. పార్సివాల్ లొవెల్ అనే వ్యాపారస్థుడు ఇచ్చిన విరాళంతో నిర్మించబడింది ఈ వేధశాల. ఓ విచిత్రమైన లక్ష్యంతో నిర్మించబడిన వేధశాల ఇది. ’మార్స్ మీద జీవరాశులు ఉన్నాయా?’ అన్న ప్రశ్నని శోధించడమే ఆ లక్ష్యం.

లొవెల్ వేధశాలలోని 24- ఇంచిల దూరదర్శీనితో తన పరిశీలనలు మొదలుపెట్టాడు స్లిఫర్. ఈ దూరదర్శని చిన్నదే అయినా. దీనితో పాటు ఒక వర్ణపట దర్శిని (spectrograph) జతచేసి ఉంది. తారల నుండి వచ్చే కాంతిలో ఏఏ రంగు కాంతులు ఉన్నాయో ఈ పరికరం చెప్తుంది. తారల నుండి వెలువడే కాంతి రంగు ఎన్నో కారణాల మీద ఆధారపడుతుంది. ఉదాహరణకి ఆ తారలోని అంశాల, అంటే మూలకాల మీద ఆధారపడుతుంది. తార ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది. మామూలుగా కుర్రతారలు బాగా వేడెక్కి ఉంటాయి! వాటి నుంచి వచ్చే కాంతిలో నీలి వర్ణపు పాలు ఎక్కువ ఉంటుంది. ముసలు తారల ఉష్ణోగ్రత కాస్తంత తక్కు వగా ఉంటుంది. వాటి కాంతిలో ఎర్రదనం ఎక్కువగా ఉంటుంది.

తార కదిలే వేగం మీద, దిశ మీద కూడా దాని నుండి వచ్చే కాంతి రంగు ఆధారపడుతుంది. దీనినే డాప్లర్ ఫ్రభావం (Doppler effect) అంటారు. కాంతి విషయంలోనే కాక, శబ్దం విషయంలో కూడా ఈ ప్రభావాన్ని గమనించొచ్చు. రైలుబండి కూత అది మన నుండి దూరంగా తరలిపోతున్నప్పటి కన్నా, మన దిశగా వస్తున్నప్పుడు మరి కొంచెం కీచుగా ఉంటుంది. అంటే దాని పౌనపున్యం (frequency) ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఒక తార మన నుండి దూరంగా వేగంగా కదులుతుంటే దాని నుండి వెలువడే కాంతులు కొద్దిగా ఎర్రబారుతాయి. అంటే దాని నుండి వచ్చే కిరణాల పౌన:పున్యాలు ఎరుపు దిశగా మారుతాయి అన్నమాట. దీనినే అరుణ భ్రంశం (red shift) అంటారు. అలాగే ఆ తార మన దిశగా దూసుకొస్తుంటే దాని కాంతులు కొద్దిగా నీలి ఛాయని సంతరించుకుంటాయి. దీనినే నీలి భ్రంశం (blue shift) అంటారు.

1912 లో ఆండ్రోమెడా నెబ్యులా నుండి వచ్చే కాంతుల వర్ణపటాన్ని పరిశీలించాడు వెస్లో స్లిఫర్. అక్కడి నుండి వచ్చే కాంతుల వర్ణపటంలో నీలిభ్రంశం కనిపించింది. దాన్ని బట్టి లెక్కలు వెయ్యగా ఆండ్రోమెడా నెబ్యులా మన దిశగా 300 km per sec వేగంతో దూసుకువస్తోందని తెలిసింది. 1914 కల్లా 15 నెబ్యులాల నుండి వచ్చే కాంతులని పరిశీలించాడు. వాటిలో ఆండ్రోమెడా తప్ప తక్కిన అన్నిట్లోనూ అరుణభ్రంశమే కనిపించింది. 1925 నాటికి పూర్తి చేసిన 41 అధ్యయనాలలో 39 సందర్భాలలో అరుణ భ్రంశమే కనిపించింది. అంటే తను చూసిన వాటిలో అధికశాతం మన నుండి దూరంగా జరిగిపోతున్నాయన్నķ 8;ాట.

ఖగోళవస్తువులు కొన్ని ఇటు, కొన్ని అటు కదలడం సబబుగా ఉంటుంది గాని, అధికశాతం వస్తువులు మన నుండి ఎవరో తరుముతున్నట్టుగా దూరంగా తరలిపోవడంలో భావం ఏమిటో అర్థం కాలేదు స్లిఫర్ కి. పోనీ ఇంకా దూరంలో ఉన్న విశ్వభాగాలని పరిశీలిద్దామంటే తన 24- ఇంచిల దూరదర్శినితో అది వీలుపడలేదు.

ఆ విధంగా స్లిఫర్ మధ్యలో విడిచిపెట్టిన సమస్యని హబుల్ చేపట్టాడు. ఆ చిక్కు ముడిని విప్పగలిగాడు. అయితే హుమాసన్ సహాయం లేకుండా ఆ సమస్యని కేవలం తన స్వశక్తితో సాధించలేకపోయేవాడనĹ 5; ఆ తరువాత జరిగిన వృత్తాంతం బట్టి మనకి అర్థమవుతుంది.

ఆధారము: సైన్స్ తెలుగు బ్లాగ్

నోబెల్ గ్రహీత శాస్త్రవేత్తలు
1907 సంవత్సరపు నోబుల్ బహుమతులు

భౌతికశాస్త్రం :

అల్బెర్ట్ మైఖేల్ సన్ (1852 - 1931) ఈ విశ్వమంతా ఈథర్ అనే మాయా పదార్థంతో నిండి ఉండేదని అంత వరకూ అందరూ అనుకుంటుండేవారు. ఈథర్ అనే యానకం ద్వారానే కాంతి ప్రయాణిస్తుందని భావించేవారు. మైఖేల్ సన్ ఇంటర్ఫెరో మీటరు అనే సాధనాన్ని నిర్మించి ఈథర్ అనేదేదీ లేదని ఋజువు చేశారు. ఇందుకు మోర్లీ అనే శాస్త్రవేత్త కూడా సహకరించారు. కాంతి వేగాన్ని చాలా ఖచ్చితంగా లెక్కించాడు. వర్ణపట రేఖల్లో అత్యంత లోతైన సమాచారాన్ని కనుగొన్నారు. ఈయన నిర్మించిన చాలా సాధారణమైన మైఖేల్ సన్ ఇంటర్ఫెరో మీటరులో ఆనాడు అసాధారణ విశ్వసత్యాన్ని కనుగొన్నందుకు ఈయనకు 1907 సంవత్సరపు భౌతికశాస్త్ర నోబెల్ బహుమానాన్ని బహుకరించారు. నేడు ఆ పరికరం సాయంతో FTIR, FIMMR FTUV-VU అనే అత్యంత కీలకమైన వర్ణపట మానవ పద్ధతులు అమల్లోకి వచ్చాయి. ఈయన పుట్టింది జర్మనీలో జీవించింది అమెరికాలో.

రసాయన శాస్త్రం :

ఎడ్వర్డ్ బుఖ్నర్ 1860 – 1917 ఈయన కూడా జర్మనీ దేశస్తులే ! ఆహార పదార్థాలు, పళ్ల రసాలు, పాలు వంటివి పులియటం ఆకలి ఈస్ట్ బాక్టీరియాల వల్ల జరుగుతుందని అందరూ విశ్వసించేవారు. అంటే పులియడం అనేది జీర్ణ కణాల్లోనే జరుగుతుందని బుఖ్నర్ వాదించాడు. పులియడం అనే ప్రక్రియలో ఉన్న అన్ని రసాయనిక చర్యల్ని గుర్తించి ఈస్ట్ లేదా పయీకర్ జీవ కణాలు లేకుండానే పరీక్ష నాళికల్లో కూడా “పులియడం” చేరువచ్చని ఋజువు చేశాడు. అందుకే ఈయనకు 1907 సంవత్సరపు నోబెల్ బహుమతి దక్కింది.

వైద్యరంగం :

ఛార్లెస్ లావెరాన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన లావెరాన్ ప్రోటోజోవా వర్గానికి చెందిన అనేక రోగ కారణ ఏకకణ జీవులపై పరిశోధనలు చేశారు. మలేరియా వ్యాధికి కారణం ఏకకణ జీవులనీ, లీష్ మానియాసిస్ అనే చర్మ వ్యాధికీ, ట్రిపనోసోమయాసిస్ అనే మత్తు వ్యాధికీ ప్రోటోజీవన్లే కారణం అని ఋజువు చేశారు. వ్యాధి కారణమైన ప్రోటోజోవన్లను గుర్తించినందుకుగాను ఈయనకు 1907 సంవత్సరపు వైద్య రంగం నోబెల్ బహుమతి లభిస్తుంది.

1908 సంవత్సరపు నోబుల్ బహుమతులు

రసాయనిక శాస్త్రం:

ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్ (Ernest Rutherford 1871-1937) న్యూజిలాండ్ దేశములో జన్మించి ఇంగ్లాండ్ లో స్థిరపడిన రూథర్ ఫర్డ్ కు 1908 సం,,పు నోబెల్ బహుమతి లభించింది. ఈయన పరమాణువు నిర్మాణము గురించి పరిశోధనలు చేశాడు. పరిమాణువులో ధనావేశం, మొత్తం అతి తక్కువ స్థలాన్ని ఆక్రమించే కేంద్రకము లో నిబిడీ కృతమై ఉంటుందని, ఋణావేశము గల ఎలక్ట్రానులు ఈ కేంద్రకము చూట్టూ దూరంగా ఉండి తిరుగుతుంటాయని ప్రతిపాదించాడు. దీనినే గ్రహ సిద్ధాంతం అంటారు. బంగారు రేకు మీదకు ఆల్ఫా కిరణాలను (He+2) తాడనం చేయడం ద్వారా పరమాణు నిర్మాణాన్ని ధృవీకరించాడు. అందుకుగాను 1908 సం,,పు రసాయనిక శాస్త్రపు నోబెల్ బహుమానాన్ని ఈయనకు ప్రదానం చేసినారు.

భౌతిక శాస్త్రం :

గేబ్రియల్ లిప్ మాన్ 1845-1921.ఈయన ఫ్రాన్స్ దేశమునకు చెందినవాడు. వృత్తి రీత్యా వైద్యుడు. మనం నేడు నిత్యము వాడే కలర్ ఫోటోగ్రఫీకి ఈయన ఆద్యుడు. రకరకాల రంగులు వేర్వేరు దశల్లో ఫోటో ప్లేటుమీద వ్యతికరణం చెందుతాయన్న సూత్రం ఆధారంగా ఆనాడు ఆయన రంగుల ఫోటోగ్రఫీని ఆరంభించాడు. ఎంతో సృజనాత్మకతతో జరిపిన ఈ పరిశోధనల వల్ల అంత వరకు నలుపు తెలుపు ఫోటోగ్రఫీ నుంచి వాస్తవ రంగుల్లో చూపించే రంగుల ఫోటోలు వచ్చాయి. ఇందుకు గాను లిప్ మన్ కు 1908 సం,,పు భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది .

వైద్య రంగం :

పాల్ఎరిష్, 1854-1815 ఎలీ మెషినికోష్, 1945-1916 జర్మనీ దేశస్తుడైన పాల్ఎరిష్, రష్యా దేశస్తుడైన పాల్ఎరిష్, రష్యా దేశస్తుడైన ఎలీమెచిని కోఫ్ లు ఇద్దరూ, సంయుక్తంగా 1908 సం,,పు వైద్య శాస్త్రపు నోబెల్ బహుమతిని పంచుకున్నారు. శరీరంలో రక్షణ వ్యవస్థకు కారణం ఆ రక్తంలోని తెల్ల రక్త కణాలని వీరు ఋజువు చేశారు.

1909 సంవత్సరపు నోబుల్ బహుమతులు

భౌతిక శాస్త్రం:
జి.మార్కోని, యస్, బ్రాన్ మనకందరికూ మర్కొని చిరపరిచితుడే. తొలిసారిగా ఇటలీ దేశస్తుడైన మార్కొని (1874 – 1937) నిస్తంత్రీ విధానం (వైర్ లెస్ మెథడ్) ద్వారా ప్రసార సాధనమైన రేడియోను కనుగొన్నాడు. ఎలాంటి యానకం లేకుండా ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళగలిగిన తరంగాలు కాంతి (విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సాధ్యమవుతుందని మార్కొని గుర్తించాడు. తక్కువ తరంగా ధైర్ఘ్యము వున్న దృశ్య కాంతి కన్నా ఎక్కువ తరంగ ధైర్ఘ్యము వున్న రేడియో తరంగాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయని మార్కొని కనుగొన్నాడు. అందుకే ఈ సాధనాన్ని రేడియో అని అంటారు.

జర్మనీ దేశస్థుడైన బ్రాన్ శ్(1850-1918) మార్కొని తయారు చేసిన రేడియోసాధనాన్ని మరింత మెరుగుపరచి రేడియో సాధనము ద్వారా పలు స్టేషనులను పొందగల ట్యూనింగ్ పద్దతిని కనుగొన్నాడు. ఇంతేకాదు, ఇదే రేడియో సాధనము ద్వారా టెలిగ్రాఫ్ వాడకాన్ని అభివృద్ది పరిచాడు. రేడియో సాధనాన్ని కనుగొనడం శాస్త్ర సాంకేతిక రంగాలలో పెద్ద మైలురాయి. ఇందుకై వీరిరువురికి సంయుక్తంగా 1909 సం,,పు భౌతిక శాస్త్రపు నోబెల్ బహుమతిని ప్రదానం చేసారు.


రసాయనిక శాస్త్రం:

విల్ హెల్మ్ ఆస్ట్ వాల్డ్ (1853 -1932) రష్యాలో జన్మించి ఆ తదుపరి జర్మనీలో స్థిరపడిన ఆస్ట్ వాల్డ్ భౌతిక రసాయన శాస్త్రలలో ఎన్నో సిద్ధాంతాలను కనుగొన్నాడు. ముఖ్యంగా ఉత్ప్రేరక శాస్త్రం రసాయన సమతాస్థితి రసాయనిక చర్యాగతి శాస్త్రం వంటి పలు రంగాల్లో ఆస్ట్ వాల్డ్ చేసిన కృషి గణనీయం. ముఖ్యంగా ఈయన పేరుతోనే వున్న ఆస్ట్ వాల్డ్ డెల్యూన్ నియమం మీ కందరికీ సుపరిచితమే. అసిటికామ్లము, అమ్మోనియం హైడ్రాక్సైడ్ వంటి బలహీన ఎలక్ట్రోలైటు ద్రావణాల్లో గాఢత తగ్గేకొద్దీ అయనీకరణం పెరుగుతుందన్నదే ఈ సిద్దాంతం. ద్రావణాలు, ద్రవాభికరణం, ఉష్ణగతిక శాస్త్రం వంటి ఇతర రంగాల్లో కూడా ఈయన విశిష్టమైన కృషి చేశారు. ఇందుకు గుర్తింపుగా 1909 వ సంవత్సరపు నోబుల్ బహుమతి పురస్కారాన్ని అందుకున్నారు.

వైద్య రంగం:
కాకర్ ఎమిల్ థియోడోర్ అయోడిన్ లోపంతో వచ్చే గాయిటర్ జబ్బుకీ, థైరాయిడ్ గ్రంథికీ ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు. గాయిటర్వ్యాధికి చికిత్సలో భాగంగా థైరాయిడ్ గ్రంధిని తొలగించే శాస్త్ర చికిత్సను మొదటి సారిగా ప్రారంభించిన మేటి సర్జన్ వైద్య రంగంలో భీఘ్మడనదగ్గ థియోడోర్ బిల్ రాత్ కు ఈయన శిష్యుడు. 1912 సంవత్సరానికల్లా ఈయన దాదాపు అయిదు వేల గాయిటర్ ఆపరేషన్లు చేశాడు.

అంత వరకు గాయిటర్ జబ్బు ద్వారా కలిగే మరణాల సంఖ్య 18% నుంచి 0.5% కు తగ్గింది. ఇంతే కాదు, ఈయన భుజపుటెముకల, ఊపిరితిత్తుల, ఉదర తదితర భాగాల ఆపరేషన్ల పద్ధతుల్ని అభివృద్ది పర్చాడు. జోసెఫ్ అస్టర్ ప్రతిపాదించిన సంపూర్ణ ఎసె ప్టిక్ పద్దతిని ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఈయన శస్త్ర చికిత్సకు సంబంధించిన ఎన్నో పరికరాలను రూపొందించాడు. ఈయన పేరుతో ఉన్న కాకర్స్ పరికరాలుగా ప్రసిద్ది చెందిన శస్త్ర చికిత్సా సాధనాలను డాక్టర్లు నేటికీ వాడుతున్నారు. ఈయన విశిష్ట కృషికి గుర్తింపుగా 1909 సంవత్సరపు వైద్య శాస్త్రపు నోబెల్ బహుమ1909 సంవత్సరపు నోబుల్ బహుమతులుతిని బహుకరించారు.

1910 సంవత్సరపు నోబుల్ బహుమతులు

భౌతిక శాస్త్రం : వాండెర్ వాల్స్ 1837 – 1923 డచ్ దేశస్థుడైన వాండెర్ వాల్స్ పేరు మీకు చిరపరిచితమే. బలహీనమైన రసాయనిక బందాలను వాండెర్ వాల్స్ బంధాలని భౌతిక, రసాయనిక పరిభాషలో అంటారు. వాయు, ద్రవ పదార్థాల నిర్మాణము గురించి ఈయన చేసిన కృషికి గాను 1910 సంవత్సరపు భౌతిక నోబెల్ బహుమానము లభించింది.

రసాయనిక శాస్త్రం : ఒట్టో వలాష్ 1847 – 1931 జర్మనీ దేశస్థుడైన వలాష్ సుగంధ ద్రవ్యాలు, వృక్ష సంబంధ తైలాలు తర్పిన్స్ వంటి సేంద్రియ పదార్థాలపైన ఈయన తన కృషికి గాను 1910 సంవత్సరపు రసాయనికి శాస్త్రపు నోబెల్ బహుమతి దక్కింది. పరిమళాలను సుగంధ ద్రవ్యాలను పరిశోధించి వాటి అణు నిర్మాణాన్ని విశధీకరించాడు. ఈయనను అందరూ మహిళా పితామహుడు అని అంటారు.

వైద్య రంగం : కోజెల్, 1953 – 1927 జర్మనీ దేశస్థుడైన కోజెల్ జీవకణంలో ఉండే రసాయనిక నిర్మితి పై చేసిన విస్తృతి పరిశోధనలకు గాను 1910 సంవత్సరపు వైద్య రంగం, జీవ భౌతిక శాస్త్ర రంగాల నోబెల్ బహుమతిని పొందాడు. కణాలలో ఉండే ప్రొటాన్ లు, డియన్ ఏ (DNA) లకు సంబంధించి పరిశోధనలకు గా నోబెల్ బహుమతి వచ్చింది.

1911 సంవత్సరపు నోబుల్ బహుమతులు

భౌతిక శాస్త్రం : విల్ హెల్మ్ వెయి న్ జర్ననీ దేశానికి చెందిన వెయిన్ మాక్స్ ఫ్లాంక్ తో కలిపి క్వాంటం సిద్దాంతంలో పలు ఆవిష్కరణలు గావించారు. కాథోడు కిరణాలు అంటే ఎలక్ట్రానుల ప్రవాహమేనని జెజె
థామ్స్ న్ గుర్తించినట్టుగానĺ 3; హైడ్రోజన్ వాయువు వాడినప్పుడు విడువలయ్యే ధనకిరణాలు ప్రోటానులనే ప్రాథమిక కణాలని వెయిన్ తెలియజేశాడు.

ప్రోటానును ఆవిష్కరించిన పరిశోధనల్లో ఈయన కృషికి గాను ఈయనకు 1911 నోబెల్ బహుమతి ఇచ్చారు.

వైద్య రంగం.

అల్వార్ గల్ స్ట్రాండ్ 1862 -1930 స్వీడన్ లో జన్మించిన గల్ స్ట్రాండ్ వల్ల దృష్టిలోపాల వారికి ఎంతో మేలు కలిగింది. కంటిలోని ధర్మాన్ని, నిర్మాణాన్ని సమన్వయపరచే సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు. కంటిలోని కటకాన్ని, కార్నియాను, ఐరిస్ ను వాటి జీవభౌతిక ధర్మాన్ని పరిశోధించి కాంతి వక్రీభవనం వల్లనే దృష్టి కలుగుతోందని వివరించారు. కంటికి ఉన్నన దృష్టి లోపాల్ని కనుగొనే గల్ స్ట్రాండ్ స్లిట్ దీపాన్ని రూపోందిచారు. అంతేకాదు కంటి శుక్లాన్ని తీసివేసే ఆపరేషన్ ను ఎలా చేయాలో కూడా వివరించాడు. కొన్ని కోట్లమందిని అంధులు కాకుండా నివారించగలిగిన సేవలకు గుర్తింపుగా ఈయనకు 1911 సంవత్సరపు నోబెల్ బహుమానంతో సత్కరించారు.

రసాయన శాస్త్రం
మేరీ క్యూరీ : రేడియం, పొలోనియం అనే మూలకాల్ని కనుగొన్నందుకు వాటిని శుద్ధరూపంలో వాటి జనిజాల నుండి సంగ్రహించినందుకు రేడియం ఉపయోగాలను వైద్య రంగంలో ప్రతిపాదించినందుకĹ 7; రసాయనిక శాస్త్రంలో 1911 సంవత్సరపు నోబెల్ బహుమతి లభించింది. ( మరిన్ని వివరాలకు 2వ అట్టలో చూడండి)

1912 సంవత్సరపు నోబుల్ బహుమతులు

అలెక్సిస్ కేరల్, 1973 – 1944
ఫ్రాన్స్ దేశానికి చెందిన శాస్త్ర చికిత్స నిపిణుడు. తెగిన రక్తనాళాలను తిరిగి కలిపి కుట్టడం అవయవాల మార్పిడి వంటి సున్నితమైన ఆపరేషన్లను చేయడమే గాక వాటి గురించి విశదీకరించాడు. చార్లెస్ లిండ్ బర్గ్ అనే సహవైద్యుడు తోడ్పాటుతో గుండె మూత్రపిండాలు, వంటి కీలక శరీర భాగాలను దేహం బయట కూడా కొంతకాలం సజీవంగా ఉంచగల ద్రావణాలను తయారు చేసాడు.

కృత్రిమ రక్తాన్ని కూడా ప్రయోగశాలలో రూపొందించాడు. మానవాళికి ఎంతో మేలు చేసిన ఈ వైద్య విధానానికి గుర్తింపుగా 1912 సం,,పు వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి అలెక్సిస్ కేరల్ ను వరించింది.

రసాయనిక శాస్త్రం
విక్టర్ గ్రిగనార్డ్ 18871 – 1935
పాల్ సెబాటియర్ 1854 – 1941
అనే ఫ్రాన్స్ దేశపు రసాయనిక శాస్త్రజ్ఞులకు సంయుక్తంగా 1912 సం,,పు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. మెగ్నీషియం ఆల్కైడ్ హైలైడ్ (R Mg x,R=CH3 C2H5 C6H5 వంటి ఆల్కైడ్ లేదా అరైల్ గ్రూప్ x=cl, Br,I వంటి హేలైడులను మొదటి సారిగా తయారు చేయడమే కాకుండా వీటిని ఉపయోగించి ఎన్నో రకాల సేంద్రియ పదార్థాలను తయారు చేయవచ్చని గ్రిగనార్డ్ ఋజువు చేసాడు. ఈ ఆల్కైడ్ మెగ్నీషియం హేలైడులను గ్రిగనార్డ్ రిఏజెంట్స్ అంటారు. సేంద్రియ రసాయనిక పరిభాషలో గ్రిగనార్డ్ రిఏజెంట్లు పడికట్టు పదం.

ఉత్ప్రేరక శాస్త్రం సెబాటియర్ పేరు తెలియని వారుందరు. నికెల్, జింక్ పెల్లేడియం, ప్లాటినం వంటి లోహ చూర్ణాలను వాడి సేంద్రియ పదార్థాలకు హైడ్రోజన్ కలపడం లో విశేషమైన కృషి చేశాడు. అసంతృప్త సేంద్రియ అణువులను సంతృప్త అణువులు గా మార్చడానికి శాస్త్రజ్ఞులు చాలా కష్టపడేవారు. సాధారణ పరిస్థితులలో c=c బంధానికి హైడ్రోజన్ అణువు (H2) ను కలిపి CH - CH గా మార్చడానికి శాస్త్రజ్ఞులు విఫల ప్రయత్నాలు చేశారు. సెబాటియర్ పైన తెలిపిన లోహపు పౌడర్లను ఉత్ప్రేరకాలు గా వాడి రసాయనిక చర్యను చాలా సులభతరం చేశాడు. నేడు వంట నూనెలు, కందెనలు, ఔషధాల తయారీలో ఈ రకమైన హైడ్రోజన్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

భౌతిక శాస్త్రం :
నిల్స్ గుస్తావ్ డేలన్ 1869 – 1937

స్వీడన్ దేశానికి చెందిన మెకానికల్ ఇంజనీర్. ఓడ రేవులలో వాడే లైట్ హౌస్ లాంతర్లను రూపొందించాడు. జలాంతర్గములు నాటిలో తేలడం మునగటం వంటి యాంత్రిక ప్రక్రియలను రూపొందించాడు. విద్యుత్తు సరఫరాలో హెచ్చు తగ్గులు లేకుండా ఉంచే ఓల్టేజి రెగ్యులేటర్లను తయారు చేశాడు. విద్యుదుత్పత్తి కేంద్రాలలో వాడే టార్బైనులను రూపొందించాడు. విమానాలు, హెలీకాప్టర్, జెట్ విమానాలు, కొన్ని రకాల నౌకలలో వాడే చోదక టార్బైన్లల రూపకల్పన చేశాడు.

1913 సంవత్సరపు నోబుల్ బహుమతులు

వైద్యరంగం : ఛార్లెస్ రిషెట్ (1850 – 1985) ఈయన ఫ్రాన్స్ దేశస్తుడు. రెండోసారి మందు తీసుకుంటే రియాక్షన్ వచ్చే శారీరక పరిస్థితికి అనాఫిలాక్సిన్ అని పేరు పెట్టింది. ఈయనే శారీరక ధర్మశాస్రాన్ని బట్టి వైద్యులు వాడే మందులు కొన్ని రియాక్షన్ యిస్తాయని, సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయని ఈయన కనుగొన్నారు. ఇంజక్షన్ లేదా నోటి ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా మందు తీసుకోకముందు వ్యక్తికి ఏమేం పరీక్షలు చేయాలో ఈయన విశధీకరించాడు.

 

హేజ్వరం, ఉబ్బసం, వంటి కొన్ని రసాయనిక ధాతువులవల్ల వస్తాయని గుర్తించాడు. ఇలాంటి రసాయనికాలను ఆయన అలెర్జిన్లు అన్నాడు. ఇలాంటి అలెర్జీని కలిగించే అలెర్జిన్లు ఏవో శ్రద్దగా గుర్తించి వాటిని మానేస్తేనే ఉబ్బసం తొందరగా తగ్గుతుందని ఈయన తెలియజేశారు. కాబట్టి పిల్లలూ చేపమందు వల్ల ఆస్మా నయం కాదు. వయసు పెరిగే కొద్ది అలెర్జిన్లు ఎదుర్కొనే శక్తి శరీరానికి రావడం వల్ల క్రమేపి మనకు తెలియకుండానే తగ్గుతుంది. అలాగే మనం వాదే పదార్థాలు, మన పరిసరాల్లో మార్పు రావడం వల్ల మాత్రమే ఆస్మా తగ్గుతుంది. వైద్యరంగానికి రిషెట్ చేసిన సేవలకు గుర్తింపుగా 1913 సం,,పు నోబెల్ వైద్య రంగ బహుమానాన్ని యిచ్చారు.

2. భౌతిక శాస్త్రం : హీక్ కామర్లీన్ వన్స్ 1853 – 1926 ఈయన డచ్ శాస్త్రజ్ఞుడు. అతి శీతల పరిస్థితుల్ని నెలకొల్పే సాధనాన్ని కనుగొన్నాడు. హీలియం వాయువును ద్రవంగా మార్చగల 4k ఉష్ణోగ్రత (-269 ºC) ను రాబట్టగలిగాడు. 1908 లో మొదటి సారిగా ద్రవహీలియంను ఉత్పత్తి చేశాడు. అందుకోసం ఈయన మాగ్నటైసేషన్ - డీమాగ్నటైసేషన్ అనే జాతి కీలకమైన, సృజనాత్మక ప్రక్రియను రూపొందించాడు. 4k (-269 ºC) కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో వాయుస్థితిలో వుండగల పదార్థాలు ఏమీ లేవు. అతిశీతల పరిస్థితుల్లో పదార్థాలు ధర్మాలు విచిత్రంగా ఉంటాయి.

ఇలాంటి విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలను క్రమోజెనిక్స్ అంటారు. ఉదాహరణకు మామూలు ఉష్ణోగ్రత దగ్గర మామూలుగానే విద్యుత్ ప్రవాహకాలు గా ఉండే చాలా లోహాలు ఉ,, పాదరసం, తగరం) -269 ºC 4k) వద్ద సూపర్ కండెక్టర్లుగా ప్రవర్తిస్తాయి. 1911 లో తొలిసారిగా సూపర్ కండెక్టివిటీగా ఆవిష్కరించింది. కూడా కామెర్లిన్ ఒన్సే ! నేడు సూపర్ కండెక్టివిటీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతున్నాయి.

రసాయన శాస్త్రం : ఆల్ఫ్రెడ్ వెర్నర్(1866 - 1919) ఫ్రాన్స్ లో పుట్టి స్విట్జర్లాండ్ లో స్థిరపడ్డ నిరింద్రియ రసాయన శాస్త్రవేత్త. సమన్వయ రసాయన శాస్త్రానికి పితామహుడుగా పేరెన్నికగన్నాడు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ స్థిరమైన రసాయన పదార్థాలు మరో సంక్లిష్ట సమ్మేళనాలను తయారు చేయడాన్ని గుర్తించాడు. సమన్వయ పదార్థాలు ఎందుకు ఏర్పడతాయో సిద్దాంతాలను కూడా ప్రతిపాదించాడు. నేడు సమన్వయ సమ్మేళనాలు లేని రసాయనరంగం లేదు. మన శరీరంలో ఉండే హిమోగ్లోబిన్ , మయోగ్లోబిన్, విటమిన్ B12, సెటోక్రోములు, ఫెర్రిడాక్సిన్లు, చెట్లలో ఉండే క్లోరోఫిల్, జాంతోఫిలో వంటి పదార్థాలు సమన్వయ సమ్మేళనాలే. నిరింద్రియ రసాయనిక శాస్త్రంలో జరిగే పరిశోధనలలో 80 శాతం కన్నా హెచ్చు పరిశోధనలు నేడు సమన్వయ సమ్మేళనాల మాదే జరుగుతోంది. ఒక విశిష్ట రసాయనిక శాస్త్ర విభాగానికి రూపకల్పన (అది అప్పటికే ప్రకృతిలో ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల ఉన్నా ) చేసిన ఘనత వెర్నర్ ది. ఈయనకు 1913 రసాయనిక శాస్త్ర నోబుల్ బహుమతి రావడం ఆ బహుమతికే వన్నె తెచ్చినట్లయింది.

1914 సంవత్సరపు నోబుల్ బహుమతులు

ఈయన అమెరికా దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త. చాలా మూలకాలకు ఖచ్చితంగా పరమాణు భారాల్ని కనుగొన్నాడు. మూలకాల పరమాణు భారాల్ని హైడ్రోజన్ పరమాణు భారంతో పోల్చి తెలియజేశాడు. అయితే పరమాణు భారాలు కార్బన్ -12 ఐసోటోపుతో పోల్చి తెలియచేశారు. పరమాణు భారాల్ని కనుగొనడమే కాకుండా చాలా మూలకాలకు సమస్థానీయాలు ఉన్నట్టు ఆవిష్కరించారు. సుమారు 60 మూలకాలకు ఈయనను 1914 సం,,పు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతి ప్రధానం చేసారు.

వైద్య రంగం : ఈయన ఆస్ట్రేలియా దేశస్తుడు. చెవిలో మూడు భాగాలున్నాయని మీరు చిన్న తరగతుల్లో నేర్చుకొని ఉంటాడు. అందులో లోపలి చెవి లో అర్థవలయ గొట్టాలు వెస్టిబ్యూల్ అనే తిత్తి, దాని చివర కాక్లియా అనే సత్తగుల్ల ఆకారంలో ఉండే సర్పిలాకారంలో ఉండే మెత్తని పదార్థం ఉంటాయి. ఈ మూడు భూగాలు కలిసి శ్రవణ ప్రక్రియ లోనే కాకుండా శరీరాన్ని బ్యాలన్సులో ఉంచుతూ పడిపోకుండా కాపాడతాయని ఆవిష్కకరించారు. ముఖ్యంగా వెస్టిబ్యూల్లో ద్రవగతిక పద్ధతుల రసాయనిక గతులు, శరీరపు కదలికలకు అనుగుణంగా జరుగుతాయని, తదనుగుణంగా విద్యుత్ ప్రకంపనాలు ఏర్పడి మెదడుకు సంకేతాలు అందుతాయని తెలియ జేశాడు. అంటే మనం పడిపోకుండా ఉండాలంటే ఈ వేస్టిబ్యూల్ అనే చెవిలోని భాగం సక్రమంగా పని చేయాలన్నమాట. ఇంతటి విశిష్ట వాస్తవాన్ని కనుగొన్నందుకుగాను రాబర్డ్ బరానీకి 1914 సం,,పు జీవభౌతిక శాస్త్రం / వైద్య రంగపు నోబెల్ బహుమానాన్ని బహుకరించారు.

భౌతిక శాస్త్రం : మాక్స్ వాన్ లవె 1879 - 1960

జర్మనీ దేశానికి చెందిన మాక్స్ థియోడర్ ఫెలిక్స్ వాన్ లవె అనే పెద్ద పేరున్న లవె కిరణాల సహాయంతో స్ఫటిక నిర్మాణాన్ని కనుక్కోవచ్చని నిరూపించాడు. నేడు X కిరణ స్ఫటికాకృతి మాపకం (X Ray Crystallography) అనే శాస్త్రం విస్తృతంగా వాడుతున్నారు. ఈయన తెలియజేసిన విషయాల ఆధారంగానే విలియం బ్రాగ్, లారెన్స్ బ్రాగ్ అనే తండ్రీ కొడుకులు X Ray కిరణ స్ఫటిక మాపకాన్ని పరిపుష్టి చేశారు. వీరికి 1915 సం,,లో భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. లవె తెలియజేసిన పద్ధతికి గణనీయమైన ప్రయోజనాలున్నాయి. ఈయన కృషికి గుర్తింపుగా 1914 సం,,లో భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి ఈయనను వరించింది.

1915 సంవత్సరపు నోబుల్ బహుమతులు

1915 నుంచి 1918 వరకు వైద్యరంగంలో నోబెల్ బహుమతి ప్రకటించలేదు. మొదటి ప్రపంచ యుద్ధం గొడవల్లో 1916 సంవత్సరంలో భౌతిక శాస్త్రానికి, 1916, 1917 సంవత్సరంలో రసాయన శాస్త్రానికి కూడా నోబెల్ బహుమతులు ఇవ్వలేదు.

భౌతిక శాస్త్రం :-

విలియమ్ హెన్రీ బ్రాగ్ 1862 – 1942 విలియమ్ లారెన్స్ బ్రాగ్ 1890 – 1971 తండ్రీ కొడుకులు. హెన్రీ బ్రాగ్ (తండ్రి), లారెన్స్ బ్రాగ్ లు స్పటిక నిర్మాణానికి సంబంధించిన x- కిరణములను ఉపయోగించే పద్ధతిని కనుగొన్నారు. x- కిరణాలను స్పటికాల మీదకు పంపినపుడు ఆ కిరణాలు స్పటికాలలో వివిధ పొరలలో వున్న పరమాణువుల మీద పడి పరావర్తనం చెంది వివిధ దశల్లో వివర్తనం పరావర్తనం చెందుతాయని కనుగొన్నారు. పరావర్తనం చెందిన కిరణాలకు, స్పటిక నిర్మాణానికి వున్న సంబంధాన్ని ఆవిష్కరించినందుకు వీరిరువురునీ నోబెల్ బహుమతితో సత్కరించారు.

1915 వాటికి అత్యంత చిన్న వయస్సులో (కేవలం 25 సం..రాలు ) నోబెల్ బహుమతి పొందిన వారుగా లారెన్స్ బ్రాగ్ రికర్డు నెలకొల్పారు. వీరు బ్రిటీష్ వారు. ఎన్నో పదార్థాల అణు నిర్మాణాలను కనుగొనేందుకు x-ray – Crystallography పేరుతో ఓ పద్ధతి నేడు ప్రసిద్ధిలో వుంది.

రసాయనిక శాస్త్రం
రిచర్ట్ విల్ స్టాటర్ 1872 – 1942 జర్మనీ దేశానికి చెందిన విల్ స్టాటర్ జంతువుల రక్తంలో వున్న హిమోగ్లోబిన్ కండరాలలోని హిమోగ్లోబిన్ , చెట్లలో వుండే క్లోరోఫిల్ .

ఒకే తరగతికి చెందిన రసాయన పదార్థాలని ఋజువు చేశారు. అన్నింటిలోనూ ఫోర్ఫిరిన్ రంగులనబడేవి కీలక స్థావరంలో ఇనుము, రాగి, మెగ్నీషియం అయాన్లు పొదిగి వుండడంవల్లే ఆయా ధర్మాలు వచ్చాయని విశదపర్చారు. క్లోరోఫిల్ అణునిర్మాణాన్ని వివరించి, చెట్లు కిరణ జన్య సంయోగక్రియ జరుపుకోవడంలో క్లోరోఫిల్ ప్రధాన పాత్ర అని సూత్రీకరించాడు.

ఎంజైములంటే అంతవరకు సూక్ష్మజీవులని భావించేవారు. అవి కేవలం పెద్ద రసాయనిక అణువులనీ అవి సూక్ష్మ జీవులు కాదనీ ఈయన తెలియజేశాడు.

1929వ సంవత్సరం నోబెల్ బహుమతులు

భౌతిక శాస్త్రము :

బాబా-డీబ్రోయి (prince Luis-Victor pierre Raymond de Broglie) అనే ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు 1929 సంవత్సరపు భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతికి ఎంపిక అయ్యాడు. కణ స్వభావం- తరంగ స్వభావం ప్రతి కదిలే వస్తువులే కలగలసి ఉంటాయనీ, ఉన్నవన్నీ కణ తరంగాలనీ ఏదీ పూర్తిగా కణం కాదనీ, ఏదీ పూర్తిగా తరంగం కాదనీ రెండింటి ద్వంద్వ స్వభావం (Wave-Particle duality) అన్నీ వస్తువులకు ఉంటుందని తెలియ చేసి భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చాడు. కణ స్వభావమైన ద్రవ్య వేగాన్ని (P) కి తరంగ స్వభావమైన తరంగ దైర్ఘ్యాని (Wavelength)కి ప్లాంక్ స్థిరాంకం ద్వారా λ = h/p అని క్యాంటిన్లో కూచొని ప్రతిపాదించాడు. ఆరోజు ఆయన కేవలం ఒక చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు. ఆతరువాత తనకు విజ్ఞాన శాస్త్రం మీద వున్నమక్కువతో సైన్సు డిగ్రీ పొందాడు.

రసాయన శాస్త్రం :

ఆర్ధర్ హార్డెన్ (Arthur Harden 1865- 1940) అనే ఇంగ్లీషు రసాయన శాస్త్రవేత్త యూలర్ చెల్పిన్ (Hans kari August simon Von Euler – Chelpin 1873 – 1964) అనే స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త సంయుక్తంగా 1929 సంవత్సరపు రసాయన శాస్త్ర నోబెల్ బహుమానాన్ని గెలుచుకున్నారు. చక్కెరలు తదితర సేంద్రీయ పదార్ధాలు పులియుట (Fermentation) అనే జీవరసాయన ప్రక్రియ వెనుక వున్న ఉత్ర్పేరకాలు ఎంజైములని పులియుట ద్వారా ఆల్కాహాల్ వస్తుందని వివరణ ఇచ్చారు.

వైద్య రంగం :

నెదర్లాండ్స్ కు చెందిన ఎక్ మాన్ (Christan Eijkman 1858 – 1930) ఆగ్లేయుడు అయిన హాప్కిన్స్ (Sir Frederick gowland Hopkins 1861 – 1947) సంయుక్తంగా 1929 సంవత్సరపు నోబెల్ బహుమానాన్ని జీవ భౌతిక శాస్త్రం - వైద్యరంగాల కోవలో గెలుపొందారు ఎక్ మాన్ నాడీ సంబంధ ప్రేరణకు కారణమైన న్యూరిటిక్ విటమిన్ (vitamin B1: Thiamin) పాత్రను విశదీకరించాడు. హాప్కిన్స్ జీవుల పెరుగుదలను నిర్దేశించే ఫాలిక్ ఆమ్లము (Bవిటమిను, vitamin B9) కణ విభజనలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియజేశారు.

1930 సంవత్సరపు నోబెల్ బహుమతులు

1930 సం.. లో నోబెల్ బహుమతులకు గొప్ప విశేషం ఉంది. ఎందుకంటే ఆ సంవత్సరంలోనే మన దేశం గర్వించదగ్గ నోబెల్ బహుమతి సర్. సి.వి. రామన్ కు దక్కింది.

భౌతిక శాస్త్రం :

సర్. సి.వి. రామన్ (1888 – 1970) ఏక దైర్ఘ్య కాంతి కొన్ని పదార్థాల మీద పడ్డప్పుడు ఆ పదార్థాలలోని అణువులు ఆ కాంతిని అధిక తరంగ ధైర్ఘ్యం, అల్ప తరంగ ధైర్ఘ్యం గల కాంతి కిరణాలను కూడా వెదజల్లుతుందని ఈయన కనుగొన్నారు. ఆ ఫలితాన్ని రామన్ ఫలితం (Raman Effect) అంటారు. 1928, ఫిబ్రవరి 28 నాడు కనుగొన్న ఈ ఫలితం ఆవిష్కరణకు గుర్తింపుగా సర్. సి.వి. రామన్ కు దక్కింది.

వైద్య రంగం :

కార్ల్ ల్యాండ్ స్టెయినర్ (Karl Landsteiner) (1868 -1943) మానవ రక్తంలో ఉన్న గ్రూపులను ఆవిష్కరించినందుకు 1930వ సం..పు జీవ భౌతిక శాస్త్రం - వైద్యరంగపు (Physiology & Medicine) వైద్యరంగపు నోబెల్ బహుమానం కార్ల్ ల్యాండ్ స్టైనర్ కు లభించింది. ఈయన ఆస్ట్రియా దేశస్తుడు రక్తంలో A,B,AB,Oతరహా గ్రూపులుంటాయని రక్తదానం, రక్తమార్పిడి ఎటుబడితే అటు చేయడానికి లేదని యాంటీబాడీస్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయని వీరు ఋజువుచేశారు.

రసాయనిక శాస్త్రం :

జర్మనీ దేశస్తుడైన హాన్స్ ఫిషర్ (Hans Fisher) (1881 – 1945) కు సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమానాన్ని ఇచ్చారు. క్లోరోఫిల్, హిమోగ్లోబిన్, మమోగ్లోబిన్, కొర్రిన్ వంటి పలుజీవ శాస్త్ర ప్రశస్తత ఉన్న వర్ణద్రవ్యాల్లో (Pigments) ఉన్న హీమ్ అనే భాగంలో ఉన్న ఫెర్రోల్ అనే హెటిరోసైక్లిన్ అణహభాగాలను గుర్తించారు. నాలుగు ఫెర్రోల్ భాగాలు తగు విధంగా కలవడం వల్ల హీమ్ లాంటి వలయం ఏర్పడుతుందని అందులో బలమైన బంధాలతో నాలుగు నైట్రోజన్ పరమాణువులు, లోహఅయాన్లను పట్టుకుంటాయని ఈయన రుజువు చేయడమే కాకుండా హీమ్ రంగుని సంశ్లేషణ (Synthesis) చేశారు.

1931 సం.. పు నోబెల్ బహుమతులు

రసాయనిక శాస్త్రం :

కార్ల్ బోష్ (Carl Bosch, 1874 - 1940) ఫ్రెడరిక్ బెర్జియస్ (Friendrich Bergius, 1884 - 1949) అనే ఇద్దరు జర్మనీ దేశపు రసాయనిక శాస్త్ర ప్రొఫెసర్లు 1931 సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబుల్ బహమతిని గెలుచుకున్నారు.

అధిక పీడనంలో జరిగే రసాయనిక చర్యలపై వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గుర్తింపుగా ఈ బహుమతిని ఇచ్చారు.

భౌతిక శాస్త్రం :

1931 సం..కి భౌతిక శాస్త్రంలో ఎవ్వరికీ నోబెల్ బహుమతి ఇవ్వలేదు.

వైద్యరంగం :

శ్వాసక్రియలో పాల్గొనే ఎంజైముల పనితీరును పద్దతిని ఆవిష్కరించినందుకు గాను 1931 సం..పు జీవశాస్త్ర నోబుల్ బహుమతిని జర్మనీ దేశానికి చెందిన వొట్టోవార్ బర్గ్ (Otto Heinrich Warburg, 1883 - 1970) గెలుపొందారు.

1932 సంవత్సరపు నోబెల్ బహుమతులు

వైద్యరంగం :

బ్రిటిష్ శాస్త్రవేత్తలైన సర్ చార్లెస్ స్కాట్ షెర్రింగ్టన్ (Sir Charles Scott Sherrington 1857 - 1952) డగ్లస్ ఆడ్రియన్ (Edgor Douglas Adrian 1889 - 1877) అనే వైద్యులు నాడి చివరలు, నాడీ తంత్రులు, పనిచేసే విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కృషికి గుర్తింపుగా 1932 సంవత్సరపు నోబెల్ బహుమతి వీరికి దక్కింది.

రసాయనిక శాస్త్రం :

అమెరికాకు చెందిన ఇర్విన్ లాంగ్ మూయర్ (Irwing LangMuir, 1881 - 1957) ఉపరితల శాస్త్రం అది శోషనం (Adsorption), కొల్లాయిడ్లు తదితర రంగాల్లో కృషి బహుళ ప్రసిద్ది గాంచింది. లాంగ్ విసో థర్మ్ పేరుతో ఈయన పోరు సుపరిచితం. 1932 రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతి ఈయన పొందారు.

భౌతిక శాస్త్రం :

జర్మనీకి చెందిన హైసన్ బర్గ్ (Werner Heisenberg, 1901 - 1976) అనిశ్చిత సూత్రం తెలియని చదువరులుండరు. ఏక సంఘటనలో వస్తువు ద్రవ్య వేగాన్ని స్థానాన్ని పూర్తి ఖచ్చితత్వంతో కొలవలేమని, వస్తువు శక్తిని, ఏ సమయంలో ఆశక్తిని కలిగి వుందో ఆ కాలాన్ని కూడా ఖచ్చితంగా కొలవలేమని ఈయన క్వాంటమ్ సిద్దాంతం ద్వారా రుజువు చేశాడు. అంతే కాకుండా ఉదజని (Hydrogen) కున్న రూపాంతరాలను (Allotropes) కూడా ఈయన కనుగొన్నాడు. క్వాంటమ్ సిద్ధాంతంలో హైసన్ బర్గ్ చేసిన విప్లవాత్మక కృషికి గుర్తింపుగా 1932 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది.

1933 నోబెల్ బహుమతి గ్రహీతలు

వైద్య రంగం :

వైద్య రంగంలో చేసిన కృషికి గాను, కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీకి చెందిన థామస్ హంట్ మోర్గాన్ (

Thomas Hunt Morgan) 1933 సంవత్సరం నోబెల్ బహుమతి పొందారు. వారసత్వ లక్షణాలు సంక్రమించడానికి. క్రోమోజోములు కారణమని, తల్లిదండ్రుల క్రోమోజోములు ద్వారా, అనువంశిక లక్షణాలు తర్వాతి తరాలకు అందుతాయని, మోర్గాన్, తన పరిశోధనల ద్వారా నిరూపించారు.

భౌతిక శాస్త్రం :

1933 సం. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి, బెర్లిన్ యూనివర్సిటీకి ఎర్విన్ స్ర్కాడింజర్ (Erwin schrodinger 1887 - 1961) కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన పాల్ డిరాక్ (Paul Adrien Maurice Dirac, 1902 - 1984) గార్లకు ప్రధానం చేయబడింది.

స్ర్కాడింజర్ ఆధునిక క్వాంటమ్ సిద్ధాంతానికి మార్గదర్శకుడు. ఆయన పధార్థం యొక్క తరంగ, కణ స్వభావాలను మలినం చేసి స్ర్కాడింజర్ తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి, ఏ సిస్టంనుండైనా శక్తిని ఉత్పాదించవచ్చని స్ర్కాడింజర్ రుజువు చేశారు.

డిరాక్ పదార్థంలోని మూల కణాలకు గణిత పరమైన చిత్రాలను రూపొందించారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఫెర్మి తో కలసి ఫెర్మి-డిరాక్ గణనలను రూపొందించారు. ఈ గణనలను పాటించే కణాలను ఫెర్మియాన్స్ అంటారు. ఎలాక్ట్రాన్ కూడా ఒక ఫెర్మియాన్

1933 సం.. లో రసాయన విభాగంలో నోబెల్ బహుమతి ఎవ్వరికీ అందజేయలేదు.

1934 సంవత్సరపు నోబెల్ బహుమతులు

వైద్య రంగం :

రక్త హీనతతో బాధపడే వారికి కాలేయం (లివర్) ను చికిత్స చేయడం ద్వారా ఉపశమనం, వ్యాధి నివారణ చేయవచ్చని ఋజువు చేసిన ముగ్గురు అమెరికా శాస్త్రజ్ఞులకు నోబెల్ బహుమతి ఇచ్చారు.

వారి పేర్లు విప్పుల్ (George Hoyt Whipple – 178 - 1976) రిచర్డ్ మైనాట్ (George Richards Minot 1885 – 1950) మర్ఫీ (William Parry Murphy 1892 – 1987)

రసాయన శాస్త్రం :

అమెరికాకు చెందిన యురే కు 1943 వ సంవత్సరపు నోబెల్ బహుమతి దక్కింది. భార హైడ్రజన్ (డ్యూటీరియం)ను ఆవిష్కరించినందుకు ఈయనను ఎంపిక చేశారు. భార జలం (హెవీ వాటర్ )లో వున్నది భార హైడ్రోజనే కదా ఆ అణు రియాక్టర్లలోనూ ఎన్.ఎం.ఆర్. వర్ణపట మాపనంలోనూ భార హైడ్రోజన్ కీలకమైనది.

భౌతిక శాస్త్రం :

ఈ సంవత్సరం ఎవ్వరికీ నోబెల్ బహుమతి దక్కలేదు.

1935 - నోబెల్ శాస్త్రవేత్తలు

భౌతిక శాస్త్రం : - నేడు ' న్యూట్రాను ' గురించి తెలియని వారుండరు. న్యూట్రాను గురించి మానవుడికి తెలిసి ఇప్పటికి 80 సం"రాలు కూడా పూర్తి కాలేదు. 1932 సం"రంలో ద్రవ్యరాశి వర్ణపట మాపనం (Mass Spectroscopy) సహాయంతో జేంస్ ఛాడ్విక్ కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు న్యూట్రాన్లు కూడా ఉంటాయని నిరూపించాడు. న్యూట్రాను ఆవిష్కరణకు గాను ఛాడ్విక్ కు 1935 సం"రపు భౌతిక శాస్త్ర బహుమతిని ప్రదానం చేశారు. ఈయన ఆంగ్లేయుడు.

రసాయనిక శాస్త్రం : - మేరీక్యూరీ, పియరీక్యూరీ దంపతులు రేడియో ధర్మికత గురించి పరిశోధనలు జరుపుతుండగానే వారి కుమార్తె ఐరిన్ జూలియట్ క్యూరీ (Irene Juliot Curie), అల్లుడు ఫ్రెడరిక్ జూలియట్ లు కూడ వారి పరిశోధనల్లో సహాయపడేవారు. వీరిద్దరూ కృత్రిమ విధానాల ద్వారా నూతన ఐసోటోపులను రూపొందించారు. నూతనంగా, కృత్రిమంగా రేడియోధార్మిక ఐసోటోపులను, మూలకాలను సంశ్లేషించినందుకు గాను

ఫ్రెడరిక్ జూలియట్ (1900 - 1958) ఐరిన్ జూరియట్ క్యూరీ (1897 - 1956)లకు 1935 సం"రపు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.ఒకే కుటుంబానికి చెందిన నల్గురికి నోబెల్ బహుమతి వచ్చినట్లయింది.( అప్పటికే మేరీ క్యూరీకి రెండుసార్లు, పియరీ క్యూరీకి ఒకసారి వచ్చాయికదా ! ) వీరు ఫ్రెంచి దేశస్తులు.

వైద్యరంగం : - 1935 నోబెల్ బహుమతిని హాన్స్ స్పేమన్ ( Hans Spemann, 1869-1941) గెలుపొందారు. పిండోత్పత్తి (Embrionic Develophment) దశల్లో క్రమానుబద్ధత (Organiser Effect) ఉందనీ తద్వారా మాత్రమే ఏ దశ ద్వారా ఏయే అవయవాలు రూపొందుతాయో నిర్ధారణ అవుతుందని ఆయన ఋజువు చేశారు. గర్భంలో జరిగే పిండం అభివృద్ధి క్రమంలో నిర్ధిష్టతే పరిణామంలో అంతర్భాగమని తెలియ జేశారు. ఈయన చేసిన ఈ కృషికి గుర్తింపుగా 1935 సం"పు జీవ శాస్త్రం (వైద్యరంగం) నోబెల్ బహుమతిని బహుకరించారు. ఈయన జర్మనీ దేశస్తుడు.

1936 సంవత్సరపు నోబెల్ బహుమతులు

రసాయనిక శాస్త్రం :

ద్విధృవభ్రామకాలు (dipole moments) కు అణు నిర్మాణానికి వున్న సంబంధాన్ని కనుగొనడమే గాకుండా వాయువులలో x - కిరణ వివర్తనాలను పరిశోధించినందుకు ఘన పదార్థాల ఉష్ణగ్రాహక ధర్మాలకు సిద్ధాంత ప్రాతిపదిక ఇచ్చినందుకు డిబై (Peter Joseph Wilhelm Debye) అనే నెథర్ ల్యాండ్ శాస్త్రవేతకు 1936 సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని ఇచ్చారు. 1884 లో జన్మించిన డిబై 1966వ సంవత్సరంలో మరణించారు.

వైద్యరంగం :

నాడి తంత్రుల గుండా సంకేతాలు వెళ్ళడానికి గల రసాయనిక మూల సూత్రాలను కనుగొన్నందుకు సర్ డేల్ (Hanry Hallet Dale) లోయీ (otto Loewi – 1873 - 1961) అనే శాస్త్రజ్ఞులు సంయుక్తంగా 1936 వైద్య రంగపు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. డేల్ బ్రిటిష్ పౌరుడు కాగా లోయి ఆస్ట్రియా దేశస్థుడు.

భౌతిక శాస్త్రం :

కాస్మిక్ కిరణాల ధర్మాల్ని రుజువు చేసినందుకు ఆస్ట్రియాకు చెందిన హెస్ (Victor Franz Hess – 1883 - 1964), పాజిట్రాన్ అనే ప్రాథమిక ధనావేశిత కణాన్ని ఆవిష్కరించినందుకు అమెరికాకు చెందిన ఆండర్సన్ (Carl David Anderson – 1905 - 1991) లకు 1936 వ సంవత్సరపు భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది.

1937 సం " విజ్ఞానశాస్త్ర నోబెల్ పురస్కారాలు

భౌతికశాస్త్రం : - డీబ్రోయి అనే శాస్త్రవేత్త కణాలకు కూడా తరంగస్వభావం ఉందని ప్రతి పాదించాక చాలా మంది శాస్త్రజ్ఞులు ఎలక్ట్రాన్లు, పోజిట్రాన్లు, ప్రోటాన్లు వంటి కణాల్ని అత్యంత వేగంగా స్ఫటికాల వైపు మళ్లించి అవికూడా కాంతి తరంగాలైన X - కిరణాల్లాగా స్ఫటికం నుంచి వివర్తనం (Diffraction) చెందుతాయో లేదా పరిశీలించారు.

అమెరికన్ శాస్త్రజ్ఞులైన క్లింటన్‌జోసఫ్ డేవిసన్ తన విద్యార్థి జర్మర్‌తో కలిసి చేసిన ప్రయోగంలో ఎలక్ట్రాన్లు కూడా X - కిరణాల్లాగే స్ఫటికాలపై పడితే వివర్తనం చెందుతాయని రుజువు చేశారు. ' Davisson and German Experiment ' పేరుతో ఈ ప్రయోగం ప్రఖ్యాతి పొందింది. ఇదే సమయంలో బ్రిటీష్ దేశానికి చెందిన జార్జిపేగెట్ థాంసన్ కూడా ఎలక్ట్రాన్ల వంటి కణాలకు తరంగ స్వభావాన్ని రుజువు చేశాడు. డేవిసన్ (1881 - 1958) థాంసన్ (1992 - 1975) లకు 1937 సం"పు భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది.

వైద్యరంగం ( జీవశాస్త్రం ) :

హంగెరీ దేశానికి చెందిన ఆల్బర్ట్ జెంట్ గ్యోర్గ్మీకి 1937 సం"పు నోబెల్ బహుమానం ఇచ్చారు. ఇంధనాలు మండాలంటే అధిక వేడికావాలి. మండిన తర్వాత ఆ వేడిలో దహన చర్య జరుగుతూనే ఉంటుంది. జీవుల్లో కూడా గ్లూకోజ్ వంటి ఆహార ఇంధనాలు శ్వాసక్రియద్వారా లోనికెళ్లిన ఆక్సిజన్‌లో కలిసి దహన చర్యజరుపుతాయి. తద్వారా విడుదలయ్యే శక్తి ATP అనే అణువులో రసాయనిక శక్తిగా ప్రోదిపడి జీవధర్మాలకు కావలసిన శక్తిగా వినిమయం అవుతుంది. అయితే ఈ దహనచర్య సాధారణ ఉష్ణోగ్రతల వద్ద జరుగుతుంది. ఇందులో విటమిన్ - డి పాత్రను గ్యోర్గ్మీ విశదీకరించాడు.

రసాయనిక శాస్త్రం : 1937 సం"పు రసాయనిక శాస్త్ర బహుమతిని వేర్వేరు రంగాలకు, వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు పొందారు.బ్రిటీష్ దేశస్తుడయిన వాల్టర్ నార్మన్ హావర్త్ (1883-1950), పిండి పదార్థలపైన, డి- విటమిన్ మీద చేసిన ప్రయోగాలకు 1937 రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని సగభాగం గెలుపొందారు. మిగిలిన సగాన్ని స్విట్జర్లాండ్ దేశస్తుడయిన పాల్‌కారెర్ (1889-1971) పొందారు. ఈయన కెరోటినాయిడ్లు, ఫ్లాలిన్లు, ఎ- విటమిన్, బి2 విటమిన్ పాత్రలను విశదీకరించారు.

1938 సం" పు నోబెల్ బహుమతులు

భౌతికశాస్త్రం : - ఇటలి దేశానికి చెందిన ఎన్రికోఫెర్మి (1901 - 1954) 1938 సం"పు భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతిని పొందాడు. కేవలం 37 సం"రాల వయసులోనే నోబెల్ బహుమతి పొందడం గమనారౄం. న్యూట్రాన్ల తాడనం ద్వారా సాధించిన పరమాణువుల నుంచే నూతన పరమాణువుల్ని ఏర్పర్చవచ్చని ఈయన తెలియజేశాడు. పైగా ప్రాథమిక కణాల స్వభావాల గురించి విస్తృత ప్రయోగాలు చేశాడు. ఫెర్మి- డైరాక్ సాంఖ్యక విలువలు పేరుతో ప్రఖాతిగాంచిన శాస్త్రానికి ఆద్యుడు. ఎలక్ట్రాను వంటి కణాల్ని ఫెర్మియాన్లు అంటారు.

రసాయనిక శాస్త్రం :- జర్మనీ దేశస్తుడయిన రిచర్డ్ కున్ (1900-1967) రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని గెల్చుకున్నాడు. ఈయన తన 38వ ఏటనే నోబెల్ గ్రహీత అయ్యాడు. జీవ క్రియలో కెరోటినాయిడ్ల పాత్ర గురించి, జీవ భౌతిక ధర్మాల నియంత్రణలో విటమిన్లనబడే రసాయనిక ధాతువుల గురించి ఈయన చేసిన లోతైన పరిశోధనలకు గుర్తింపుగా నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.

వైద్యరంగం :- శ్వాస క్రియలో చాలా సంక్లిష్టత వుంది. అందులో అయోర్టిక్ యంత్రాంగం ( రక్తంలో ఆక్సిజన్ పాక్షిక పీడనాన్ని నియంత్రించే యంత్రాంగం.) సైనస్ యంత్రాంగం (రక్తపీడనాన్ని నిర్దేశించే యంత్రాంగం) ముఖ్యమైనవి. వీటిలో అద్భుతమైన ఆవిష్కరనలు చేసిన బెల్జియం దేశస్తుడయిన ఫ్రాంకోయిస్ హీమన్స్ ( 1892-1968 ) 1938 సం"పు వైద్యరంగపు నోబెల్ బహుమతిని గెల్చుకున్నాడు.

మేరీక్యూరీ (1867 – 1934)

రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ (1867 – 1934) తన అద్వితీయ ప్రతిభాపాటవాలతో రేడియంను కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ. 19వ శతాబ్దంలో స్త్రీలకు లలిత కళలు, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్సు చదవడానికి నిరాకరించేవారు. తన నిరంతర పరిశ్రమ, పట్టుదలతో కృషిచేసి నోబెల్ బహుమతి మొట్టమొదటగా పొందిన ధీరవనిత మేరీక్యూరీ. 1903 ఫిజిక్స్ లోను, 1911 లో కెమిస్ట్రీ లోను రెండుసార్లు నోబెల్ బహుమతులు పొంది చరిత్ర సృష్టించింది.మేరీక్యూరీ 1867 లో పోలెండ్ లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది.హైస్కూల్ స్థాయిలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పెదరికం వల్ల చదువు మాని, 10 సంవత్సరాల పాటు ధనికుల ఇండ్లలో పిల్లల్ని చూసే సహాయకురాలుగా గడిపింది.

24 సం. ల వయస్సులో కొంత డబ్బు కూడబెట్టుకొని ఆస్ట్రియాలోని క్రాకో యూనివర్సిటీలో చేరబోతే స్త్రీలు సైన్సు చదవడానికి వీలులేదు పొమ్మన్నారు. చివరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు వచ్చి ప్రఖ్యాత పారిస్ యూనివర్శిటీలో సైన్స్ విద్యార్థినిగా చేరింది. చేరిన మరుక్షణం నుండి మేరీ తన చదువుపైనే మనసు కేంద్రీకరించి రాత్రింబవల్ళు కృషిచేసింది. పేదరికంలో మగ్గుతున్న తను కొద్దపాటి డబ్బుతో చదువుకోవాలి. ఒక చిన్న గదిలో అతి తక్కువ ఖర్చుతో, అర్థాకలితో, చలి దేశమైన ఫ్రాన్సులో ఎముకలు కొరికే చలి ఉన్నా, చేతులు కొంకర్లు పోతున్నా ఒక్కతే అర్థరాత్రి దాటేవరకు తదేక దీక్షతో చదివేది. చివరి పరీక్షలలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థినిగా విజయం సాధించింది.

తన పరిసోధనా కృషిలో మేరీకి ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు పీరీక్యూరీ తో పరిచయం ఏర్పడింది. పరిచయం అనురాగంగా మారి వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. వారి పెళ్ళి మత విశ్వాసాలకు దూరంగా చాలా నిరాడంబరంగా జరిగింది.

రేడియో యాక్టివ్ పదార్థం పిచ్ బ్లెండ్ మీద జరిపిన పరిసోధనా ఫలితంగా మేరీక్యూరీ, పీరీక్యూరీ 1898 లో పోలోనియం కనుగొన్నారు. మేరీ తన స్వదేశమైన పోలండ్ జ్ఞాపకార్థం ఆ కొత్త పదార్థానికి పోలోనియం అని పేరు పెట్టింది. మరికొద్ది నెలల్లోనే వారు ఉభయులూ క్యాన్సర్ చికిత్సకు అతి ప్రధానమైన రేడియంను కనుగొన్నామని ప్రకటించారు. రేడియో అణుభారం 22.5. రేడియం యురేనియం కంటే 20 లక్షల రెట్లు శక్తివంతమైనది. సీసంలో తప్ప మిగిలిన అన్నింటిలో దాని కాంతి రేఖలు ప్రసరించగలవని ఈ యువశాస్త్రవేత్తలు కనుగొన్నారు. రేడియం చాలా ఖరీదైనది. ఒక గ్రామ్ రేడియం విలువ 7 లక్షల 50 వేల గోల్టు ఫ్రాంకులు.

మేరీ పరిసోధనకు ఆమెకు డాక్టరేట్ లభించింది.నోబెల్ బహుమానాన్ని పీరీ దంపతులకు ఇచ్చారు. రేడియో కనుగొనగానే దాన్ని వైద్యశాస్త్రంలో చికిత్స నిమిత్తం వాడడం ప్రారంభించారు. రెడియోపై రాయల్టీ పొందే అవకాశము సైన్సు ఫలితాలు సమాజం కోసం ఉపయోగపడాలన్న ఆశయంతో, తమకు రాయల్టీలు అక్కర్లేదని, విద్య, వైద్య విజ్ఞాన రంగాల్లో దానిని ఎవరైనా ఉత్పత్తి చేయవచ్చని, రేడియంను సంగ్రహించే విదానాన్ని దేశదేశాలవారికి తెలియజేశారు. తన భర్త పీరీ మరణానంతరం ఆమె ప్రాన్సులో సార్ బోర్న్ యూనివర్శిటీలో ప్రోఫెసర్ గా పనిచేసింది. 1914 ప్రపంచ యుద్ధంలో మేరీక్యూరీ X రే పరిశోధనల వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. 1934 జూలై 4న మేరీక్యూరి మరణించింది. ఈ రేడియం కనుగొనడం ద్వారా మానవ జాతి కి ఎనలేని సేవచేసిందో ఆ రేడియం కిరణాలు అధికంగా సోకి ఆమె మరణించింది. ఆమె జీవితం బావిశాస్త్రవేత్తలకు ఆదర్శంకావాలి.

2004 సంవత్సరపు నోబుల్ బహుమతులు

వైద్య శాస్త్రం:

అమెరికన్ శాస్త్రవేత్తలు రిచర్ట్ యాక్సెల్, లిండాబక్ లకు 2004 వైద్యశాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది. వాసనను పసిగట్టి ఎంతో కాలం దానిని మనం గుర్తుంచుకోవడానికి కారణమయ్యే జన్యువులు (జీన్స్) గురించి కనుగొన్నందుకు వారికి ఈ పురస్కారం అందనుంది. వెయ్యి రకాలైన జీన్స్ కు సంబంధిచిన ప్రోటీన్లు, సెన్సర్లు ముక్కులో ఉంటాయని అవి వాసన పసిగట్టి మెదడుకు చేరవేస్తాయని వారు కనుగొన్నారు. ఇవన్నీ వెయ్యి వేర్వేరు జీన్ల కుటుంబానికి చెందినవని వారు కనుగొన్నారు. రిచెర్ట్ యాక్సెల్ ఫ్రెడ్ హచిన్నస్ కేన్సర్ రీసెర్చి సెంటర్ లో పని చేస్తున్నారు.

రసాయన శాస్త్రం:
మానవ శరీరంలో వ్యాధి కారకమైన అవాంఛనీయ పదార్థాలను వెలికితీసి వేయడం ఎలా అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, అమెరికాకు చెందిన అరోస్ సిజియా నోవర్, అవ్రం హెర్సి కో అమెరికాకు చెందిన ఇర్విన్ రోజ్ లకు పురస్కారం లభించింది. వీరు కణాల్లో అనవసర ప్రాటీన్లను నాశనం చేసే ఒక పద్దతిని కనుగొన్నారు. ఈ పద్ధతి వల్ల కాన్సర్ వ్యాధి చికిత్స, డి.ఎన్.ఎ. మరమత్తులు లాంటివి భవిష్యత్తులో సాధ్యమవుతాయని ఆశిస్తున్నారు.

భౌతిక శాస్త్రం:
క్వార్క్ ల మధ్యన ఉండే అత్యంత బలీయ శక్తి పై జరిపిన పరిశోధనకు ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. వీరి పరిశోధనలు ప్రపంచం ఎలా పుట్టింది, ఎలాపని చేస్తుంది, ఎలా అంతమవుతుంది అనే అంశాలపై కొత్త వెలుగులను ప్రసరింపచేసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్వార్క్ ల పై పులిట్టర్ విల్షెక్, గ్రాస్ ల పరిశోధనలు అణుశక్తి పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. డేవిడ్ గ్రాస్, డేవిడ్ పులిట్టర్, ఫ్రాంక్ విల్సెక్ లకు 2004 భౌతిక నోబెల్ లభించింది. పరమాణు కేంద్రకం లోని ప్రొటీనులు, న్యూట్రాన్ లు అంతర్గతంగా వుండే క్వార్క్ ల మధ్య ఉండే శక్తివంతమైన బలాలకు సంబంధించి చేసిన పరిశోధన భవిష్యత్తులో చాలా సృష్టి రహస్యాలను బట్టబయలు చేయనుంది.

సాహిత్యం:

ఆస్ట్రియా నవలా రచయిత్రి ఎల్ ఫ్రెడ్ జెలినెక్ కు 2004 నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది. తమ నవలలు, నాటకాలలో ఆమె సమాజంలోని చెడును చీల్చి చెండాడారు. స్త్రీ పురుష సమానత్వం, సమాజంలో హింస, సెక్స్ తదితర అంశాలలో తనదైన శైలితో ప్రజల మనస్సులలోకి చొచ్చుక వెళ్లారు. ఈమె రచనల్లో వుయ్ ఆర్ డెకాయ్య్, బేబి, ఉమెన్ యాస్ లవర్స్, పియాన్ టీచర్ వండర్ పుల్ టైమ్స్ బహుళ ప్రజాదరణ పొందిన నవలలు. 1996 తరువాత మహిళకు సాహిత్యంలో నోబెల్ బహుమతి రావడం ఇదే.

శాంతి నోబెల్:

కీన్యాప్రముఖ పర్యావరణ వేత్త కీన్యా మంత్రి అయిన డబ్ల్యూ మథాయ్ కి 2004 నోబెల్ శాంతి బహుమతి లభించింది. పర్యావరణానికి ప్రపంచ వ్యాప్తంగా చేసిన కృషికిగాను, మన జీవన పర్యావరణ పరిస్థితులను మెరుగుపరచుకొనే సామర్థ్యం పైనే ప్రపంచమంతా ఆధారపడి ఉందని, మహిళలను మరింత శక్తిమంతులను చేసేందుకు 1977 లో లో ఆమెగ్రీన్ బెల్డ్ ఉద్యమం ప్రారంభించి ప్రపంచాన్ని హరితమయం చేయాలనే ధృక్పదంలో కృషి చేస్తున్నారు. ఆమె 1977 నుండి వేలాది నర్సరీలు స్థాపించి అనేక వేల మందికి ఉపాది కల్పించారు. మూడు కోట్లకు పైగా మొక్కలు నాటి హరితాభివృద్దికి కృషి చేశారు. జీవశాస్త్రంలో డాక్టరేట్ పొందిన తొలి తూర్పు ఆఫ్రికా మహిళగా గణితి కెక్కిన మథాయ్ 1970 కీన్యా రెడ్ క్రాస్ డైరక్టర్ గా 1989 లో ఉమెన్ ఆఫ్ ది వరల్డ్, 1998 లో హీరో ఆఫ్ ది ప్లానెట్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి.

అర్ధ శాస్త్రం:
నార్వే, అమెరికాలకు చెందిన ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలు 2004 అర్థశాస్త్ర నోబెల్ బహుమతులు గెల్చుకున్నారు. కిడ్ లాండ్ లార్, ఎడ్వర్డ్ ప్రెస్ కాట్ అనే ఇద్దరు బహుమతిని సంయుక్తంగా అందుకోనున్నారు.

2006 నోబెల్ బహుమతుల విజేతలు


బెర్నార్డ్ ఆల్ ప్రెడ్ నోబెల్ స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రజ్ఞుడు. ప్రేలుడు పదార్థమైన డైనమైట్ ఈయన కనుగొన్నదే. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతులిచ్చే సంస్థను స్థాపించినది ఈయనే. డైనమైట్ ను అమ్మి నోబెల్ ఎంతో ధనాన్ని ఆర్జించాడు. యుద్ధాలలో ఉపయోగించే ఎన్నో ఆయుధాలను కూడా తయారు చేశాడు. కాని ఆయన తన చివరి రోజుల్లో, మానవ వినాశనానికి దారి తీస్తున్న యుద్ద సామగ్రిని తయారు చేసినందుకు ఎంతో పశ్చాత్తాప పడ్డాడు. తాను ఆర్జించిన డబ్బుతో శాంతి స్థాపనకు, విజ్ఞాన శాస్త్ర విస్తరణకు వీలుగా నోబెల్ బహుమతులను ఏర్పాటు చేశాడు. మొదట ఏర్పాటు చేసిన నోబెల్ బహుమతులు ఐదు కాగా తర్వాత ఆర్థిక శాస్త్రంలో కూడా ప్రకటించిన బహమతితో కలుపుని ప్రస్తుతం ఆ సంఖ్య ఆరు అయింది. ప్రతి ఏటా శాంతి, సాహిత్యం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలలో విశేష కృషి చేసిన ప్రముఖులకు నోబెల్ బహుమతులను డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో అందజేస్తారు. ఈ ఏడాది నోబెల్ బహుమతుల విజేతలను, వారికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన వాగీ కృషిని తెలుసుకుందాం.

శాంతి:

పేదల బ్యాంకర్ గా పేరు గడించిన బంగ్లాదేశ్ ఆర్థిక శాస్త్రవేత్త మహ్మద్ యూనస్, (60) కు ఆయన స్థాపించిన గ్రామీణ బ్యాంకుకు సంయుక్తంగా 2006 సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి లభించింది.
సరికొత్త ఆలోచనతో 1976లో మహ్మద్ యూనస్ సూక్ష్మ బ్యాంకింగ్ వ్యవస్థకు నాంది పలికారు. లక్షలాది మంది పేదలకు సూక్ష్మ రుణాలను అందజేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేసినందుకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఈ సారి ఈ బహుమతికి 191 మంది పోటి పడగా వారిలో ప్రొఫెసర్ యూనస్ కు ఈ గౌరవం దక్కింది. సాంప్రదాయకంగా శాంతి స్థాపనకు చేసే కృషికి కాకుండా, సుస్థిర అభివృద్ధి కోసం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించడం ఇది రెండవ సారి.

గ్రామీణ బ్యాంక్ శాఖల ద్వారా 71 వేల గ్రామాల్లో లక్షలాది మంది మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించి సొంతంగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించారు. జనాభాలో అధికశాతం ప్రజలకు పేదరికం నుంచి బయటకు మార్గాలు లేకపోతే సుస్థిర శాంతి అసాధ్యమని అయితే యూమస్ చేపట్టిన సూక్ష్మరుణ ఉద్యమం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని నోబెల్ కమిటీ తన ప్రశంసాపత్రంలో తెలియజేసింది. అట్టడుగు స్థాయి నుంచి చేపట్టిన అభివృద్ధి చర్యలు ప్రజాస్వామ్యం మానవ హక్కులు మరింత బలపడేందుకు సాయపడతాయని కూడా నోబెల్ కమిటీ అభిప్రాయడింది. యూనస్ తన సూక్ష్మరుణ విధానం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారని ప్రధాని మన్మోహన్ సింగ్ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.

సాహిత్యం:

సాహిత్యంలో 2006 నోబెల్ బహుమతి టర్కీకి చెందిన ప్రముఖ రచయిత అర్పన్ పాముక్ కు లభించింది. పాముక్ మైలేమ్ ఈజ్ రెడ్, స్నో వంటి అనేక సంచలాత్మక రచనలు చేశారు. ఆయన తన రచనల్లో టర్కీలోని భిన్న సంస్కృతులు, వాటి మధ్య వైరుధ్యాలు, అనుబంధాలకు అద్దంపడుతూ వాటిని కొత్త కోణాల్లో ఆవిష్కారించారు. ఆయన రచనలు 50 కి పైగా ఇతర భాషల్లోకి అనువదించబడ్జాయి. టర్కీ చరిత్ర అక్కడి ప్రజల భావ ప్రకటనా స్వాతంత్ర్యం వంటి అనేక విషయాల మీద ఆయన నిష్కర్షగా చేసిన వ్యాఖ్యలు ఆదేశ ప్రభుత్వానికి ఆగ్రపం కలిగించాయి. పాముక్ గొప్ప రచయిత మాత్రమే కాదు. ఆదేశ రాజకీయ వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపిన రాజకీయ విప్లవకారుడు కూడా.

అర్థ శాస్త్రం:

అర్థ శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి అమెరికాకు చెందిన ఎడ్మండ్ ఎస్,ఫెల్ప్ (73) కు లభించింది.
స్థూల ఆర్థిక విధానంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులపై ఎడ్మండ్ జరిపిన సమగ్ర విశ్లేషణకు గాను ఆయనను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిస్ ఎకాడెమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఎడ్మండ్ ఫెల్ప్ న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసపర్ గా పని చేస్తున్నారు. వ్యాపారం లేదా వాణజ్యం అభివృద్ధి సాధించడంలో కార్మికుల పాత్ర ఎంత కీలకమైందో ఆయన విశ్లేషించారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం, నిరుద్యోగులను ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న విధానాలు భవిషత్తులో ఎటువంటి ప్రభావాలను కలిగిస్తాయో ఆయన వివరించారు. నిరుద్యోగంలో తగ్గుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుందన్న ఆర్థిక శాస్త్రవేత్తల సిద్దాంతాన్ని ఫెల్ప్ సవాలు చేశారు. నిజానికి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మీదనే కాకుండా, ధర, వేతనాలను గురించి వాణిజ్య సంస్థలు, ఉద్యోగాలు చేసే అంచనాలు మీద కూడా ఆధార పడుతుందని ఆయన గుర్తించారు.

వైద్యశాస్త్రం:

వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికాకు చెందిన అండ్రూ ఫైర్, క్రేగ్ మిల్ (45)లకు లభించింది. ఎంపిక చేసిన జన్యువులను క్రియా రహితంగా ఉంచే విధానాన్ని (జీన్ సెలెన్సింగ్) కనుగొన్నందుకు వారికి ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. ఈ విధానం ద్వారా హెచ్.ఐ.వి,. పోలియో, కేన్సర్, వైరల్ జబ్బులకు చికిత్స సాద్యపడుతుందని ఆశిస్తున్నారు. సాధారణంగా దశాబ్దాల క్రిందట ఆవిష్కరించబడి కాలపరీక్షకు తట్టుకుని నిలబడిన పరిశోధనలకే నోబెల్ సైన్సు బహుమతులు ఇస్తుంటారు. కాని ఎనిమిదేళ్ళ క్రితం 1998 లో ఫైర్, మిలో చేసిన పరిశోధనలకు ఈ ఏడాది వైద్యంలో నోబెల్ బహుమతి లభించడం విశేషమే.

భౌతిక శాస్త్రం:

భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికాకు చెందిన జాన్ సి.మాథర్ (60), జార్జి ఎఫ్.స్మూట్ (61)లకు లభించింది. విశ్వంలో అలుముకున్న బ్లాక్ బాడీ రేడియేషన్ స్వభావాన్ని కన్నుగొన్నందుకు వారికి ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు స్టాక్ హోంలోని రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ తెలియజేసింది. 1989లో నాసా ప్రయోగించిన కాస్మిక్ బ్యాక్ గ్రౌండ్ ఎక్స్ ప్లోరర్(కోబే) సహాయంతో చేసిన కొలతలు ఆధారంగా మాథర్, స్మూట్ లు పరిశోధనలు చేశారు. వీరి పరిశోధనల వల్ల విశ్వం ఆవిర్భావం, నక్షత్ర మండలాలు, నక్షత్రాలు పుట్టుక వంటి విషయాలను గురించి ఎన్నో వివరాలు వెలుగులోకి వచ్చాయి. వీటి వల్ల బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి గట్టి మద్దతు లభించినట్లయిందని నోబెల్ కమిటీ ఛైర్మన్ పెర్ కార్ల్ సన్ ప్రకటించారు. ఇది ఈ శతాబ్దంలోనే గొప్ప ఆవిష్కరణ ఈ మహా విశ్వంలో మన స్థానం గురించిన అవగాహనను మరింత పెంచుతుంది అని ప్రశసించారు.

కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం గట్టి ముద్ద నుంచి మహావిస్పోటనం ద్వారా విశ్వం ఆవిర్భవించిందని బిగ్ బ్యాంగ్ సిద్దాంతం చెబుతోంది. కాని ఎన్నో సంవత్సరాల క్రితం ఈ విశ్వం పుట్టిందని. చెప్పడం సాధ్యం కావడం లేదు. ఈ విధంగా రూపాంతరం చెందింది. చెప్పడం సాధ్యం కావడం లేదు. ఈ విషయాలను అధ్యయనం చేసేందుకు నాసా కోబే ఉపగ్రహాన్నిప్రయోగించింది. మాథర్, స్మూట్ లు చేసిన పరిశోధనలు ఇప్పటి దాకా కేవలం సిద్ధాంతంగా ఉన్న భావనలకు పరిమాణాత్మకంగా ఉండే సాక్ష్యాధారాలను చూపగలిగాయి. మహా విస్పోటనం సమయంలో పుట్టి విశ్వమంతా వ్యాపించిన కాంతి కాస్మిక్ బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్ ఒకే రకంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ. కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో తేడాల ద్వారా ఈ విషయాన్ని ఈ ఏడాది నోబెల్ బహుమతి గ్రహీతలు స్పష్టంగా గుర్తించారు. ఈ బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్ ద్వారా విశ్వగతం అంతా తెలిసినట్లుగానే భవిష్యత్తు కూడా తెలుస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

రసాయన శాస్త్రం:

రసాయన శాస్త్రంలో 2006 నోబెల్ బహుమతి అమెరికాకు చెందిన రోజర్ కార్న్ బెర్గ్ (59) కీ లభించింది. శరీరంలోని కణాలు ప్రోటీన్ లను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సమాచారాన్ని జన్యువులు (జీన్స్) నుంచి ఏ విధంగా పొందుతాయనే అంశం మీద జరిపిన పరిశోధనలకు గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఈయన 1959లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న ఆర్థర్ కార్న్ బర్గ్ కుమారుడు డాక్టర్ రోజర్ ప్రస్తుతం స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ పని చేస్తున్నారు. తండ్రి కొడుకు ఇద్దరు నోబెల్ బహుమతులను అందు కోవడం చరిత్రలో ఇది ఆరవసారి. జీన్స్ నుంచి కణాలు సేకరించే సమాచారం (ట్రాన్స్ స్క్రిప్షన్)లో తలెత్తే అవరోధాల వల్ల కేన్సర్, గుండెజబ్బులు, ఎన్నో రకాల వ్యాధులు సంభవిస్తాయి. మూలకణాలు ద్వారా చికిత్సని అందించేందుకు డాక్టర్ రోజర్ పరిశోధనలు ఉపయోగపడతాయి.

కణాలకు శక్తిని, ఆధారాన్ని కల్పించేవి ప్రోటీన్లు, కణాల్లో ప్రోటీన్లు ఉత్పత్తికి జరిగే ప్రక్రియలో మెసెంజర్ ఆర్.ఎన్.ఏలు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి. జీన్ నుంచి సమాచారం మెసెంజర్ ఆర్.ఎన్.ఏలకు ఏ విధంగా చేరుతాయో డాక్టర్ రోజర్ పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు రసాయన శాస్త్రానికే పరిమితం కావు. వైద్య శాస్త్రంలో ఇప్పటి వరకు వీడని ఎన్నో చిక్కుముడులను విప్పేందుకు ఇవి ఉపయోగపడతాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

బాలలూ, మీరంతా బాగా చదువుకుని మీ మెధస్సుకు పదును పెట్టాలి. గొప్ప శాస్త్రజ్ఞులుగా తయారు కావాలి. నోబెల్ బహుమతులను గెల్చుకుని మనదేశానికి కీర్తి, ప్రతిష్టలు తీసుకురావాలని చెకుముకి ఆశిస్తోంది.

సైన్స్ పదనిసలు

సైన్సు గమనంలో మైలురాళ్ళు
దిక్సూచిలో మూడో అడుగు... పీఎస్‌ఎల్‌వీ-సీ26

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌లోని మూడోదైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సిని విజయవంతంగా రోదసిలోకి పంపింది.. తద్వారా జీపీఎస్ తరహా వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకు వేసింది...

పూర్తి స్థాయి స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధనలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన.. పీఎస్‌ఎల్‌వీ-సీ 26 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV- C26) ప్రయోగం విజయవంతమైంది. 1,425 కిలోల బరువు గల ఇండియన్ రీజియనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-1సి (IRNSS-1C) ఉపగ్రహన్ని నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 26 రాకెట్ సాయంతో ఇస్రో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

పాంతీయ దిక్సూచి శాటిలైట్ వ్యవస్థ:
ప్రాంతీయ దిక్సూచి శాటిలైట్ వ్యవస్థ కలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది.. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్. దీనిలో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయి. ఇస్రో ఇప్పటివరకు మూడు ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి మూడోది. దీన్ని 67 గంటల కౌంట్‌డౌన్ అనంతరం అక్టోబరు 16న అర్ధరాత్రి దాటాక గం. 1.32 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 26 ప్రయోగించారు. లిఫ్ట్ ఆఫ్ సమయంలో పీఎస్‌ఎల్‌వీ-సీ26 బరువు సుమారు 320 టన్నులు. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 20.18 నిమిషాల అనంతరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ఉపగ్రహాన్ని 282.56 కిలోమీటర్ల పెరెజీ ఁ 20,670 కిలో మీటర్ల అపోజీ ఉన్న భూ స్థిర కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 26 రాకెట్ ప్రవేశపెట్టింది. అర్ధరాత్రి రాకెట్ ప్రయోగం నిర్వహించడం ఇది రెండోసారి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ఉపగ్రహాన్ని ఇదే విధంగా 2013, జూలై 1న ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ప్రయోగించింది. ఈ విధంగా ఇప్పటివరకు మూడు ఉపగ్రహాల(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1ఎ, 1బి, 1సి)ను ఇస్రో నావిగేషన్ వ్యవస్థలో భాగంగా ప్రయోగించింది. భారత్‌కు చెందిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. భవిష్యత్‌లో మరో నాలుగు ఉపగ్రహాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. భారత ప్రధాన భూభాగంతో పాటు, ప్రధాన భూభాగం సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకు దీని కవరేజీ ఉంటుంది. 2015-16 నాటికి ఈ వ్యవస్థను పూర్తిచేయాలని ఇస్రో భావిస్తోంది.

జీపీఎస్ ఆవిర్భావం వెనుక:
దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ ఉపగ్రహాలతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను తొలిసారిగా 1973లో అమెరికా రక్షణ విభాగం అభివృద్ధి చేసింది. ఉపగ్రహం ఆధారంగా సైనికులు, రవాణా వాహనాలు, యుద్ధ విమానాలు, నౌకల దిశా నిర్దేశం కోసం ప్రారంభంలో జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వాణిజ్య, సాంకేతిక అనువర్తనాలకు దీన్ని విస్తరించారు. ఈ రాకెట్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌నే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) అని పిలుస్తారు. రవాణా రంగంలో సాధారణ వ్యక్తులు తమ గమ్యాన్ని చేరాల్సిన చోటును తెలుసుకోవడం, లక్ష్యం ఎంత దూరంలో ఉందో గుర్తించడంలో ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న పర్యావరణ పరిశోధన కేంద్రాలను అనుసంధానించడానికి ఇది దోహదపడుతుంది. పర్వతారోహకులకు, ఓడల గమనానికి దిశా నిర్దేశం చేస్తుంది.

ఐదో దేశం భారత్:
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ (IRNSS) ద్వారా బహిరంగ వాణిజ్యం, కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగవుతాయి. ఈ రకమైన సేవలకు ఉపగ్రహాలపై కంటే దేశీయ నావిగేషన్‌పై ఆధారపడటం మంచిది. పూర్తి భద్రతతో కూడిన సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఇప్పటికే రష్యా గ్లోనాస్ (GLONA, గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్), ఐరోపా-గెలీలియో, చైనా-బెయ్‌డోవ్ (BieDou), జపాన్-క్వాసీజెనిథ్ (Quasi-Zenith), వంటి నావిగేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటున్నాయి. కాగా ఈ పరిజ్ఞానం సమకూర్చుకున్న ఐదో దేశంగా భారత్ ఘనత సాధించింది.

మూడోది:
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి.. దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మూడోది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎని పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా 2013 జూలై, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1బి ను, పీఎస్‌ఎల్‌వీ-సీ 24 ద్వారా 2014 ఏప్రిల్‌లో ఇస్రో ఇప్పటికే ప్రయోగించింది. ఇప్పుడు ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి దాదాపు వాటినే పోలి ఉంటుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి బరువు 1425 కిలోలు. దాదాపు పదేళ్ల పాటు ఇది సేవలను అందిస్తుంది. దీంట్లో రెండు రకాల పేలోడ్లు ఉంటాయి. ఒకటి నావిగేషన్ పేలోడ్. రెండోది రేంజింగ్ పేలోడ్. వినియోగదారులకు నావిగేషన్ సంకేతాలను అందించడంలో నావిగేషన్ పేలోడ్ ఉపయోగపడుతుంది. L-5, S-బ్యాండ్‌లలో ఇది పని చేస్తుంది. పూర్తిస్థాయి నిర్ధిష్టతతో కూడిన రుబీడియం అణు గడియారం (అటామిక్ క్లాక్) ఇందులో ఉంటుంది. ఉపగ్రహం పరిధిని నిర్దేశించే ది C-బ్యాండ్. ఇది ట్రాన్స్‌ఫార్మర్ రేంజింగ్ పేలోడ్‌లో ఉంటుంది. లేజర్ రేంజింగ్‌కు ఉద్దేశించిన కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టర్స్ కూడా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సిలో ఉన్నాయి.

పీఎస్‌ఎల్‌వీ:
ఇస్రో ప్రయోగించిన 28వ పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం, పీఎస్‌ఎల్‌వీ-సీ 26. ఇది ఇస్రో సాధించిన 27వ వరుస పీఎస్‌ఎల్‌వీ ప్రయోగ విజయం. దీన్ని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచిపీఎస్‌ఎల్‌వీ -ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించారు. ఈ క్రమంలో స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణాన్ని పెంచుతారు. ఇలాంటి తరహాలో పీఎస్‌ఎల్‌వీని ప్రయోగించడం ఇది ఏడో సారి.

పయోగాలు:
ఇదివరకటి పీఎస్‌ఎల్‌వీ -ఎక్స్‌ఎల్ ప్రయోగాల వివరాలు ఇలా ఉన్నాయి. వాటిలో పీఎస్‌ఎల్‌వీ-సీ11 / చంద్రయాన్-1, పీఎస్‌ఎల్‌వీ-సీ17/ జీశాట్-12, పీఎస్‌ఎల్‌వీ-సీ19 / రీశాట్-1, పీఎస్‌ఎల్‌వీ-సీ 22/ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి-1ఎ, పీఎస్‌ఎల్‌వీ-సీ25 / మంగళ్‌యాన్, పీఎస్‌ఎల్‌వీ-సీ24 / ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి.

అరుదైన వాహక నౌక... పీఎస్‌ఎల్‌వీ:
ప్రపంచ వ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్‌ఎల్‌వీ కీలకమైంది. పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికీ ఇస్రో ఎస్‌ఎల్‌వీ-3, ఏఎస్‌ఎల్‌వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయ వంతంగా అభివృద్ధి చేసింది. పీఎస్‌ఎల్‌వీ నమూనా పొడవు 44.4 మీటర్లు. బరువు 294 టన్నులు. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని తొలుత రూపొందించారు. భూస్థిర, భూ అనువర్తిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ఇది ప్రయోగించగలదు. ఇది నాలుగు దశల నౌక. మొదటి, మూడో దశలలో ఘన ఇంధనం, రెండు, నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఇది మూడు రకాలుగా ఉంటుంది. పీఎస్‌ఎల్‌వీ జనరిక్ రూపంలో మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంచారు. పీఎస్‌ఎల్‌వీ -కోర్ అలోన్ రూపంలో స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉండవు. పీఎస్‌ఎల్‌వీ -ఎక్స్‌ఎల్ రూపంలో ఈ స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది.

విజయ పరంపర:
ప్రపంచంలోని పూర్తి విజయవంతమైన అతికొద్ది రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు దీని ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటివరకు చేపట్టిన 28 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 25 కార్యాచరణ ప్రయోగాలు. 1993, సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 27 ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇస్రో 71 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 31 స్వదేశీ, 40 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి.

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

పీఎస్‌ఎల్‌వీ

ప్రయోగతేదీ

ప్రయోగించిన ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-డీ1

సెప్టెంబర్ 20, 1993

ఐఆర్‌ఎస్-1ఈ ప్రయోగం విఫలం

పీఎస్‌ఎల్‌వీ-డీ2

అక్టోబర్ 15, 1994

ఐఆర్‌ఎస్-పీ2

పీఎస్‌ఎల్‌వీ-డీ3

మార్చి 21, 1996

ఐఆర్‌ఎస్-పీ3

పీఎస్‌ఎల్‌వీ-సీ1

సెప్టెంబర్ 29, 1997

ఐఆర్‌ఎస్ - 1డీ

పీఎస్‌ఎల్‌వీ-సీ2

మే 26, 1999

ఐఆర్‌ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ)

పీఎస్‌ఎల్‌వీ-సీ3

అక్టోబర్ 22, 2001

టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, బర్‌‌డ(జర్మనీ), ప్రోబా(బెల్జియం)

పీఎస్‌ఎల్‌వీ-సీ4

సెప్టెంబర్ 12, 2002

కల్పన-1

పీఎస్‌ఎల్‌వీ-సీ5

అక్టోబర్ 17, 2003

ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌‌సశాట్-1)

పీఎస్‌ఎల్‌వీ-సీ6

మే 5, 2005

కార్టోశాట్-1, హామ్‌శాట్ (Hamsat)

పీఎస్‌ఎల్‌వీ-సీ7

జనవరి 10, 2007

కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా) పేహున్‌శాట్ (అర్జెంటీనా)

పీఎస్‌ఎల్‌వీ-సీ8

ఏప్రిల్ 23, 2007

ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌‌సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం)

పీఎస్‌ఎల్‌వీ-సీ10

జనవరి 21, 2008

టెక్సార్ (ఇజ్రాయెల్)

పీఎస్‌ఎల్‌వీ-సీ9

ఏప్రిల్ 28, 2008

కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ- సీ11

అక్టోబర్ 22, 2008

చంద్రయాన్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ12

ఏప్రిల్ 20, 2009

రీశాట్-2+అనుశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ14

సెప్టెంబర్ 23, 2009

ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ15

జూలై 12, 2010

కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ16

ఏప్రిల్ 20, 2011

రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ17

జూలై 15, 2011

జీశాట్12

పీఎస్‌ఎల్‌వీ-సీ18

అక్టోబర్ 12, 2011

మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ19

ఏప్రిల్ 26, 2012

రీశాట్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ20

ఫిబ్రవరి 25, 2013

సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ21

సెప్టెంబర్ 9, 2012

స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్)

పీఎస్‌ఎల్‌వీ-సీ22

జూలై 1, 2013

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ

పీఎస్‌ఎల్‌వీ-సీ25

నవంబర్ 5, 2013

మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ24

ఏప్రిల్ 4, 2014

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి

పీఎస్‌ఎల్‌వీ-సీ23

జూన్ 30, 2014

స్పాట్-7 (ఫ్రాన్స్)+ ఎన్‌ఎల్‌ఎస్-71,ఎన్‌ఎల్‌ఎస్-72(కెనడా)+ ఏఐ శాట్ (జర్మనీ)+ వెలాక్స్-1 (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ26

అక్టోబరు 16,2014

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి

ఆధారము: సాక్షి ఎడ్యుకేషన్

అణుభద్రత సదస్సు-2014

- ఎం.నందకిశోర్ రెడ్డి, ఐఐఎస్, డిప్యూటీ డెరైక్టర్,సమాచార ప్రసార మంత్రిత్వశాఖ.


అణుభద్రత సదస్సు-2014కు నెదర్లాండ్స్ రాజధాని హేగ్ వేదికైంది. మార్చి 24-25 తేదీల్లో రెండురోజుల పాటు సాగిన ఈ సదస్సులో 53 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో ప్రధానంగా ఉగ్రవాదుల చేతుల్లోకి అణుపదార్థాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని సభ్యదేశాలు గట్టిగా సంకల్పించాయి. వీటితోపాటు పలు సవాళ్లపై చర్చించాయి. అణు ఆధారిత పదార్థాల తస్కరణ, దారిమళ్లింపు జరగకుండా కాపాడేందుకు ఆవిర్భవించినదే అణుభద్రత సదస్సు. అణు పదార్థ్ధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లి, దుర్వినియోగానికి గురికాకుండా కాపాడడమే అణు భద్రత సదస్సు ప్రధాన లక్ష్యం. అణుభద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవడం.. పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందించడం అణుభద్రతలో కీలకమైన అంశం.

అణుభద్రత సదస్సు- కార్యాచరణ:

అణ్వాయుధాలపై 2009 ఏప్రిల్‌లో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చారిత్రక ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణుపదారా ్థలను జాతీయ, అంతర్జాతీయ సమాజం నియంత్రణలోకి తీసుకు రావాలన్నారు. ఈ లక్ష్య సాధనకు ఒబామా నాలుగేళ్ల గడువు విధించారు. ప్రేగ్ ప్రసంగం తర్వాత రెండు అణుభద్రత సదస్సులు జరిగాయి. మొదటిది 2010- వాషింగ్టన్‌లో.. రెండోది 2012-దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో! ఈ రెండు సదస్సులూ అణు ఆధారిత పదార్థాలకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. వాషింగ్టన్ సదస్సులో రాజకీయ ఒప్పందాల గురించి ప్రస్తావిస్తే.. సియోల్ సదస్సులో ఆయా ఒప్పందాల అమలుపై చర్చించారు. 2014 హేగ్ సదస్సులో అణుభద్రతకు సంబంధించి ఇప్పటివరకు సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా దృష్టిసారించారు. అణుభద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని, పారదర్శకతను మెరుగుపరచుకోవాలని సదస్సులో పాల్గొన్న దేశాలను కోరడం జరిగింది.

హేగ్ సదస్సు-ఒప్పందాలు:

హేగ్ సదస్సులో.. అణు ఉగ్రవాదాన్ని అధిగమించటానికి అంతర్జాతీయంగా పరస్పర సహకారం ఆవశ్యకతను ప్రపంచ దేశాలన్నీ నొక్కి చెప్పాయి. 2010 వాషింగ్టన్, 2012 సియోల్ సదస్సుల నాటి అనుభవాల ఆధారంగా హేగ్ సదస్సులో కొత్త ఒప్పందాలు జరిగాయి. అవి...

  • ప్రపంచ వ్యాప్తంగా యురేనియం(హెచ్‌ఈయూ), ప్లుటోనియంల పరిమాణం తగ్గించడం.
  • ప్రమాదకర అణుధార్మిక పదార్థాల్లో బాగా శుద్ధి చేసిన యురేనియం, ప్లుటోనియం నిల్వలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడం.
  • రేడియోధార్మిక పదార్థ్ధాల (తక్కువగా శుద్ధి చేసిన యురేనియం, ప్లుటోనియం సహా)కు భద్రత కట్టుదిట్టం చేయడం.
  • పరస్పర అంతర్జాతీయ సమాచార మార్పిడి, సహకారం, సమష్టి అభివృద్ధి. శక్తి ఉత్పాదనలో వీలున్నంతవరకు తక్కువ పరిమాణంలో అణు ఇంధన వినియోగం. బాగా శుద్ధి చేసిన యురేనియం (హెచ్‌ఈయూ-హైలీ ఎన్‌రిచ్డ్ యురేనియం), ప్లుటోనియంల వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించడం.
  • తక్కువగా శుద్ధి చేసిన యురేనియం, కోబాల్ట్-60, స్ట్రాన్షియమ్-90, సీజియమ్-137లాంటి ఇతర స్వల్ప రేడియోధార్మిక పదార్థాల గురించి కూడా ఒప్పందం జరిగింది. వీటిని ఎక్కువగా వైద్య, పారిశ్రామిక, పరిశోధనతోపాటు సాధారణ పేలుడు పదార్థాల తయారీలోనూ ఉపయోగిస్తారు.

సాధించిన విజయాలు:

  • 500 కిలోల బాగా శుద్ధి చేసిన యురేనియం(హెచ్‌ఈయూ), ప్లుటోనియాన్ని అమెరికా, యూకేలకు తిరిగి పంపించివేయాలని జపాన్ నిర్ణయించింది. ఇది విజయం కిందే లెక్క. ఎందుకంటే.. 500 కిలోల అణు పదార్థాలతో 50 నుంచి 70 అణు బాంబులు తయారుచేయొచ్చు.
  • ఇక 2014 హేగ్ సదస్సు విషయానికి వస్తే.. ఈ వేదికపై సాధించిన అతిపెద్ద విజయం-అణుభద్రతను మరింత పటిష్టం చేసేందుకు 35 దేశాలు సంతకం చేయడానికి ముందుకు రావడం ఈ చర్య అణుభద్రతకు సంబంధిం చిన ప్రగతి, సంస్థాగత వ్యవహారంగా మార్చేందుకు దోహదపడుతుంది. ఇలాంటి విధానం ద్వారా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) సూచించిన భద్రతా ప్రమాణాలకు సభ్యదేశాలు కట్టుబడి ఉండేలా అమెరికా, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ కృషిచేస్తున్నాయి.

అణుభద్రత సదస్సు-అపజయాలు:

  • సురక్షితం కానీ అణు ఆధారిత పదార్థ్ధాలన్నింటికీ నాలుగేళ్లలోపు భద్రత కల్పించాలని 2010 నాటి తొలి సదస్సు పిలుపునిచ్చింది. అయితే, అది కార్యరూపందాల్చలేదు . వాస్తవానికి వేటిని సురక్షితం కానివిగా భావించాలి? అనే విషయంలో దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అణు పదార్థ్థాల విషయంలో తమ సార్వభౌమత్వాన్ని కోల్పోకూడదని దేశాలు భావిస్తున్నాయి.
  • ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సున్నితమైన అణుపదార్థ్ధాల నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయన్నది వాస్తవం. 1390 టన్నుల హెచ్‌ఈయూ, 490 టన్నుల ప్లుటోనియం నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇందులో 85 శాతం మిలటరీ రంగంలో ఉంది.

అణుభద్రత - భారత్ - అనుకూలత:

సదస్సు లక్ష్య సాధనలో భారతపాత్ర మిశ్రమమనే చెప్పాలి.

  • అంతర్జాతీయ ఉగ్రవాదం నిరోధానికి అంతర్జాతీయంగా ఆమోదించిన 13 సూత్రాల విధానంలో భారత్ భాగస్వామి. అణు పదార్థ్ధాల భౌతిక రక్షణకు సంబంధించిన కన్వెన్షన్‌లో కూడా మన దేశానికి భాగస్వామ్యం ఉంది. ఆ కన్వెన్షన్‌కు 2005లో జరిగిన సవరణలను సైతం భారత్ ఆమోదించింది. అలాగే అణు ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం(ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద సప్రెషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టైజం)లోనూ భారత్ భాగస్వామిగా ఉంది. ఈ రెండు ఒప్పందాలకూ తన మద్దతును కొనసాగిస్తూనే ఉంది.
  • అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)... ఆధ్వర్యంలో అణు విద్యుత్ కేంద్రాల(న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్) పరిశీలనను భారత్ ఎన్నడూ వ్యతిరేకించలేదు. వాస్తవానికి ఐఏఈఏ బృందం చేస్తున్న సమీక్షను సమర్థిస్తూ వస్తోంది. తద్వారా తన అణు పదార్థాల విషయంలో అంతర్జాతీయ భద్రత ప్రమాణాలు పాటిస్తోందనే భరోసాను ప్రపంచానికి ఇస్తోంది. అంతేకాకుండా అణు భద్రత ప్రమాణాలపై ఏర్పాటైన ఐఏఈఏ కమిషన్‌లో, అణు భద్రతపై సలహా సంఘంలోనూ భారత్ సభ్యదేశం. ఐఏఈఏ ఆధ్వర్యంలో అణు భద్రత పత్రాల రూపకల్పనలోనూ మన దేశం చురుగ్గా పాల్గొంది. అణు భద్రతపై ఐఏఈఏ కార్యాచరణకు కూడా తన వంతు తోడ్పాటును అందించింది. రేడియోధార్మిక వనరులను సమర్థవంతంగా గుర్తించలేని దేశాలకు వాటి పరిశోధన, సేకరణలో అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ద్వారా భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తోంది.
  • విధ్వంసకర ఆయుధాలు ఉగ్రవాదులకు అందకుండా నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 2002లో భారత్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతేకాకుండా అణు ఉగ్రవాద నిరోధానికి అంతర్జాతీయంగా చేపడుతున్న అన్ని చర్యల్లోనూ మన దేశం భాగస్వామిగా ఉంటూ ఆయా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటోంది.
  • భారత అణుశక్తి చట్టం-1962 కార్యాచరణ ప్రణాళిక అణుధార్మిక పదార్థాల భద్రతకు చట్టబద్ధత కల్పిస్తోంది. ఈ చట్టానికి సవరణల ద్వారా అణు భద్రత ప్రమాణాలకు మరింత పటిష్టత చేకూర్చాలనే ప్రతిపాదన ఉంది. 2005, జూన్‌లో భారత్ సామూహిక హనన ఆయుధాలు, పంపిణీ వ్యవస్థల (ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్) చట్టం 2005ను ఆమోదించింది. అలాగే మన దేశం ఎన్‌ఎస్‌జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్) మార్గదర్శకాలకు కట్టుబడి ఉంది. అణు భద్రత నిర్వహణ వ్యవస్థ(న్యూక్లియర్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటుకు వీలు కల్పించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
  • అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఫర్ క్యాన్సర్ థెరపీ(పీఏసీటీ) కార్యక్రమానికి భారత్ తన సహకారాన్ని అందిస్తోంది. మన దేశంలో తయారుచేసిన క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే కోబాల్ట్ టెలిథెరపీ మిషన్ (భాభాట్రాన్ 2)ను అందించేందుకు వీలుగా ఐఏఈఏ, శ్రీలంక, నమీబియాలతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఇలాంటి యంత్రాన్నే 2008లో వియత్నాంకు అందించింది.
  • మొదటి అణుభద్రత సదస్సు సందర్భంగా అణు శక్తి భాగస్వామ్యం కోసం గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్‌షిప్(జీసీఎన్‌ఈపీ) అనే అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని భారత్ ప్రకటించింది. ఐఏఈఏతోపాటు ఇతర దేశాల భాగస్వామ్యంతో ఇది అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి పలు ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ సెంటర్‌లో ముఖ్యంగా అడ్వాన్స్‌డ్ న్యూక్లియర్ ఎనర్జీ సిస్టమ్ స్టడీస్, న్యూక్లియర్ సెక్యూరిటీ, రేడియేషన్ సేఫ్టీ, అప్లికేషన్ ఆఫ్ రేడియోఐసోటోప్స్ అండ్ రేడియేషన్ టెక్నాలజీ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఈ కేంద్రం దీర్ఘకాలంలో అణుభద్రతకు వీలు కల్పించే టెక్నాలజీ, వ్యవస్థల అభివృద్ధికి సంబంధించి పరిశోధనలు కొనసాగిస్తుంది.
  • అణు భద్రత సదస్సు కార్యాచరణలో భాగంగా.. వాషింగ్టన్ సదస్సు తీర్మానాల అమలుకు భారత్ మద్దతు తెలుపుతుంది. ఎన్‌ఎస్‌ఎస్ ప్రక్రియకు 2012 జనవరి 16-17 తేదీల్లో ఢిల్లీ సమావేశం ఏర్పాటుకు భారత్ సహకరించింది.

విమర్శలు:

భారత అణు భద్రతా చర్యలపై సమీక్షకు ఆహ్వానించడంలేదని న్యూక్లియర్ మెటీరియల్స్ సెక్యూరిటీ ఇండెక్స్ తన నివేదికలో విమర్శించింది. పౌర అణు సౌకర్యాల భద్రతకు తీసుకున్న అత్యవసర ఏర్పాట్ల గురించిన సమాచారాన్ని భారత్ బహిరంగ పరచడంలేదని పేర్కొంది. అంతేకాకుండా గతంలో జరిగిన సదస్సులో ఇచ్చిన హామీలను భారత్ పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోయింది. తన అణు కార్యక్రమాల పర్యవేక్షణకు స్వతంత్ర రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తానని 2012నాటి అణు భద్రత సదస్సులో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లు 2011లో పార్లమెంటు ముందుకు వచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. ఇదిలాఉంటే అణుభద్రతను పెంచేందుకు ఉద్దేశించి 2014 హేగ్ సదస్సులో జరిగిన ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. తద్వారా ఐఏఈఏ సూచించిన అణుభద్రతా ప్రమాణాలకు భారత్ పూర్తిస్థాయిలో కట్టుబడలేదనే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది.

భారత్ అణు సిద్ధాంతం:

అణ్వాయుధాల విషయంలో భారత్ ప్రత్యేక అణువిధానాన్ని కొనసాగిస్తుంది. దీని ప్రకారం- భారత్ అణ్వస్త్రాలను మొదటగా ప్రయోగించదు. అలాగే అణ్వాయుధ రహిత దేశాలపై అణుదాడులు చేయదు. దాంతోపాటు అణ్వాయుధాలకు సంబంధించి నియంత్రణ, నిర్ణయాధికారం రాజకీయ నాయకత్వం చేతిలో ఉంటుంది.

  • అణ్వస్త్రాలను ముందుగా ప్రయోగించరాదనే సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉంది. ముందుగా ప్రయోగించకుండటం(నో ఫస్ట్ యూజ్).. శత్రు దేశం నుంచి ప్రమాదం రాకుండా అడ్డుకోవడానికి వీలుగా కనీస అణ్వాయుధ సంపత్తి(థియరీ ఆఫ్ మినిమమ్ డిటరెన్స్).. రెండూ సమాంతరంగా పనిచేస్తాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగితే అది ఇరు దేశాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందే తప్ప, ఎలాంటి అర్థవంతమైన పరిష్కారానికి దారితీయదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించకూడదనే భారత విధానం ఎంతో సముచితంగా కనిపిస్తుంది.
  • కనీస అణ్వాయుధ సంపత్తి(క్రెడిబుల్ మినిమమ్ డిటరెంట్) కలిగి ఉండాలనే విధానంలో భాగంగా.. ఉపయోగించడానికి సంసిద్ధంగా ఉన్న సరిపడ అణుబలాలు.. సమర్థవంతమైన ఆదేశ, నియంత్రణ విధానం.. పటిష్టమైన నిఘా, ముందస్తు హెచ్చరికల విభాగం.. వ్యూహానికి అనుగుణంగా సమగ్రమైన ప్రణాళిక, శిక్షణ.. అణు ఆయుధాలు, బలాలను మోహరించే సంకల్పం కలిగి ఉండాలి. దాడిచేసిన శత్రుదేశాన్ని శిక్షించి గట్టిగా జవాబుచెప్పే స్థాయిలో కనీస అణ్వాయుధ సంపత్తి ఉండాలి. సమర్థత, విశ్వసనీయత, సంసిద్ధత అనేవి భారత అణు విధానం మూల సూత్రాలు. మన అణువిధానం.. అణ్వస్త్రాల పరిమాణం కంటే కూడా వాటి సమర్థతకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. నావిక, వైమానిక, భూమార్గాల్లో సమర్థంగా పనిచేయగల అణు బలాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది.

న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ):

  • అణ్వాయుధాల నిర్వహణ కోసం మూడంచెల న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ)ని భారత్ 2003, జనవరి 4న వెల్లడించింది. ఎన్‌సీఏలో రాజకీయ మండలి, కార్యనిర్వహణ మండలి, వ్యూహాత్మక దళం (ఎస్‌ఎఫ్‌సీ) అనే మూడు విభాగాలు ఉంటాయి. రాజకీయ మండలి ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది. అణ్వాయుధాల ఉపయోగానికి సంబంధించిన నిర్ణయాలను ఈ మండలి తీసుకుంటుంది. అలాగే ప్రధానమంత్రి భద్రతాసలహాదారు ఆధ్వర్యంలో కార్యనిర్వహణ మండలి పనిచేస్తుంది. రాజకీయ మండలి ఆదేశాలను ఎన్‌సీఏ అమలు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని కార్యనిర్వహణ మండలి సిద్ధం చేస్తుంది. కార్యనిర్వహణ మండలిలో రక్షణ దళాల అధిపతులు, ఐఐసీ చైర్మన్, ఎన్‌ఎస్‌ఏబీ కన్వీనర్, కేబినెట్ సెక్రటరీ, నిఘావిభాగాల ముఖ్యులు, కేబినెట్ కమిటెడ్ ఆఫ్ సెక్యూరిటీ(సీసీఎస్) సంబంధిత మంత్రుల కార్యదర్శులు ఉంటారు. వ్యూహాత్మక దళం(ఎస్‌ఎఫ్‌సీ) అణ్వాయుధాల నిర్వహణ, వాస్తవంగా ప్రయోగించడం తదితర వ్యవహారాలను చూస్తుంది.

సాధించాల్సింది ఎంతో ఉంది:

  • హేగ్ సదస్సు ముగింపు రోజున అమెరికా అధ్యక్షుడు ఒబామా కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అణు భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యల జాబితాను ఆయా దేశాలు ముందుగా సిద్ధం చేయాలన్నారు. తద్వారా 2016 సదస్సు నాటికి మరింత సమర్థంగా ముందడుగు వేయొచ్చన్నారు. అణ్వాయుధాల భద్రత కోసం మంత్రులు, సాంకేతిక నిపుణుల ప్రమేయంతో పనిచేసే ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించాలని ఒబామా సూచించారు.
  • అణు భధ్రత సదస్సు ప్రక్రియ ఆయా దేశాలపై చేసిన ఒత్తిడి కారణంగానే సమాచార మార్పిడి, నిర్వహణ, అవగాహన, పనితీరు సమీక్ష సాధ్యమైంది. మొత్తంగా చూస్తే అణుభద్రత విషయంలో 2016 సదస్సు నాటికి వ్యవస్థాగతంగా మరింత పటిష్టం కావాల్సి ఉంది. ఇది స్వచ్ఛంధ సంస్థ స్థాయిని దాటి సమర్థ వ్యవస్థగా రూపొందాలి. పరస్పర సహకారం, ప్రోత్సాహం, అంకితభావం, సమీక్షించే విషయాల్లో చొరవ చూపాలి. లేకుంటే.. అణుభద్రత సదస్సుల ఆశయాలు, లక్ష్యాలు ఎక్కువ కాలం నిలబడలేవు.

ఆధారము: సాక్షి

మానవ నిర్మిత అంతరిక్ష అద్భుతం వాయేజర్-1

- సి.హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) మూడు దశాబ్దాల క్రితం ప్రయోగించిన ‘వాయేజర్-1’ ఎట్టకేలకు సౌర కుటుంబం అంచులను దాటేసింది.. అంతరిక్షంలో 36 ఏళ్లుగా నిరంతరంగా ప్రయాణిస్తున్న ఈ వ్యోమ నౌక తాజాగా దాదాపు1,900 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏకంగా నక్షత్రాంతర రోదసి (రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)లోకి అడుగుపెట్టింది.. మానవ నిర్మిత అంతరిక్ష వస్తువు ఒకటి ఇలా నక్షత్రాంతర రోదసిలోకి చేరడం ఇదే తొలిసారి.. త ద్వారా వాయేజర్-1 మానవ జాతికి మరో అద్భుత విజయాన్ని అందించింది.. ఈ వ్యోమనౌక రోదసిలోని తీవ్ర రేడియేషన్‌ను కూడా తట్టుకోగలదు.

రోదసి అన్వేషణలో మానవుడు ఒక సరికొత్త మైలురాయిని అధిగమించాడు. ఒక మానవ నిర్మిత అంతరిక్ష సాధనం తొలిసారిగా సౌర వ్యవస్థను దాటి అంతర నక్షత్ర రోదసి ప్రాంతంలోకి ప్రవేశించింది. 1977లో నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ) ప్రయోగించిన వాయేజర్-1.. 2012, ఆగస్టు 25 నాటికి సౌర వ్యవస్థను దాటినట్లు ఈ ఏడాది సెప్టెంబర్ 12న నాసా ప్రకటించింది. వాయేజర్ విజయంతో భవిష్యత్‌లో ఇతర సౌర వ్యవస్థల్లోకి సైతం అంతరిక్ష నౌకలను ప్రయోగించే వెసులుబాటు కల్పిస్తుంది.

ఏడాది కాలంగా:
వాయేజర్-1 నుంచి అందిన సమాచారం మేరకు అది ఏడాది కాలంగా సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసిలో ఉండే ప్లాస్మా తరంగాలు లేదా అయోనైజ్డ్ వాయువుల గుండా ప్రయాణిస్తున్నట్లు అంచనా వేశామని వాయేజర్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త ఎడ్ స్టోన్ తెలిపారు. వాయేజర్-1 నుంచి వెలువడే సంకేతాలు కాంతి వేగంతో ప్రయాణిస్తూ 17 గంటల్లో భూమిని చేరతాయని, ప్రస్తుత సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. నక్షత్రాంతర ప్రదేశంలోకి ప్రవేశించినప్పటికీ.. సూర్యుడి ప్రభావం పూర్తిగా లేని ప్రాంతానికి వాయేజర్ ఎప్పుడు చేరుతుందనే విషయంలో స్పష్టత లేదు.

గ్రాండ్ టూర్:
సౌర వ్యవస్థలో బాహ్య గ్రహాల అన్వేషణ ఉద్దేశంతో ‘ప్లానెటరీ గ్రాండ్ టూర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని 1964లో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (The Jet Propulsion Laboratory)కి చెందిన గ్యారీ ఫ్లోరిడా ప్రతిపాదించాడు. ఇందులో భాగంగా రూపొందించిన మిషన్‌లో తొలుత నాలుగు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని నిర్ణయించారు. గురు, శని, ప్లూటో గ్రహాల అధ్యయనం కోసం 1976-77లో రెండు నౌకలను, గురు, యురేనస్, నెఫ్ట్యూన్ గ్రహాల అధ్యయనం కోసం 1979లో మరో రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని ప్రతిపాదించారు. ఆర్థిక కారణాలతో 1972లో ఈ గ్రాండ్ టూర్ నిలిచిపోయింది. అయినప్పటికీ.. గ్రాండ్ టూర్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో అధిక శాతం అంశాలను వాయేజర్ కార్యక్రమంలో చేర్చారు.

వాయేజర్ ప్రాథమిక మిషన్:
జంట నౌకలుగా వాయేజర్ 1, 2లను నాసా 1977లో ప్రయోగించింది. ఈ రెండింటిలో తొలుత వాయేజర్-2ను 1977, ఆగస్టు 20న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి టైటాన్-సెంటార్ రాకెట్ నుంచి ప్రయోగించారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న వాయేజర్-1ను ప్రయోగించారు. 16 రోజుల తేడాతో ఈ రెండు నౌకల ప్రయోగం జరిగింది. వాయేజర్ మిషన్‌ను ప్రాథమికంగా బాహ్య గ్రహాల అధ్యయనం కోసం నాసా చేపట్టింది. గురు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను వాటి 48 చంద్రులను, ఆ గ్రహాల చుట్టూ ఉన్న వలయాలను వాయేజర్-1, 2 జంట నౌకలు అన్వేషించాయి. ఇందులో 1979, మార్చి 5న వాయేజర్-1 గురు గ్రహానికి అతి దగ్గరగా చేరుకుంది. 1979, జూలై 9న వాయేజర్-2 కూడా గురు గ్రహాన్ని సమీపించింది. అదేవిధంగా శని గ్రహానికి వాయేజర్-1 1980, నవంబర్ 12న, వాయేజర్-2 1981, ఆగస్టు 25న అతి దగ్గరగా ప్రయాణించాయి. యురేనస్‌కు దగ్గరగా 1986, జనవరి 24న, నెప్ట్యూన్‌కు 1989, ఆగస్టు 25న వాయేజర్-2 సమీపించింది. వాయేజర్ కంటే ముందే పయొనీర్ 10, 11ను బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం నాసా ప్రయోగించింది. అయితే 1998, ఫిబ్రవరి 17న వాయేజర్-1 అంతరిక్ష నౌక, పయొనీర్-10 చేరిన దూరాన్ని అధిగమించింది.

వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్(Voyager Inter-stellar Mission-VIM ) :
వాయేజర్ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ సౌర వ్యవస్థ ఆవల అంటే హీలియోస్పియర్ దాటి వాయేజర్ అంతరిక్ష నౌకలను తీసుకు వెళ్లాలని నిర్ణయించిన నాసా వీఐఎం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి వాయేజర్-1 సూర్యుని నుంచి దాదాపు 40 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో, వాయేజర్-2 సూర్యుని నుంచి 31 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నాయి. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్‌లో మూడు దశలు ఉన్నాయి. అవి.. టెర్మినేషన్ షాక్, హీలియోషీత్ అన్వేషణ, అంతర నక్షత్ర (Interstellar) అన్వేషణ. సౌర అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉన్న సౌర వ్యవస్థ మలి ప్రాంతంలో ఏదో ఒక ప్రదేశం వద్ద సూపర్ సౌర గాలులు, అంతర నక్షత్ర గాలులు ఒక దానికి ఒకటి తారసపడతాయి. వాయేజర్ అంతరిక్ష నౌక ఈ ప్రాంతాన్ని చేరడంతో టెర్మినేషన్ షాక్ దశ పూర్తయింది. ఇక్కడ సూపర్ సోనిక్ సౌర గాలులు సబ్ సోనిక్ వేగానికి తగ్గి సౌర అయస్కాంత క్షేత్రంలో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. టెర్మినేషన్ షాక్ దశను వాయేజర్-1.. 94 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నప్పుడు 2004లో అధిగమించింది. అదేవిధంగా 84 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నప్పుడు 2007లో వాయేజర్-2 ఈ దశను దాటింది. ఆ తర్వాత హీలియోషీత్ ప్రాంతానికి వాయేజర్ జంట నౌకలు చేరుకున్నాయి. హీలియోస్పియర్ బాహ్య భాగాన్ని హీలియోషీత్ అంటారు. హీలియోషీత్ కొన్ని పదుల ఆస్ట్రనామికల్ యూనిట్ దూరంలో విస్తరించి ఉంటుంది. ఈ భాగాన్ని ప్రయాణించడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. హీలియోషీత్‌ను దాటిన తర్వాత అంతర నక్షత్ర రోదసి అన్వేషణ ప్రారంభమవుతుంది. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్ ప్రధాన లక్ష్యం ఈ అంతర నక్షత్ర రోదసిని చేరడం. హీలియోస్పియర్ దాటి అంతర నక్షత్ర రోదసిల మధ్య ప్రాంతం హీలియోపాజ్. సూర్యుడి నుంచి హీలియోపాజ్ 8 నుంచి 14 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం వద్దనే మిలియన్ మైళ్ల వేగం ఉండే సౌర గాలులు 25 లక్షల మైళ్ల వేగానికి తగ్గుతాయి.

మొదటి మానవ నిర్మిత సాధనం:
2012, ఆగస్టు 25 నాటికి సూర్యుడి నుంచి 18.78 బిలియన్ కిలోమీటర్ల దూరంలో అంతర నక్షత్ర రోదసిలోకి ప్రయాణించిన మొదటి మానవ నిర్మిత సాధనంగా వాయేజర్ గుర్తింపు తెచ్చుకుంది. ఏప్రిల్‌లో వాయేజర్-1 నుంచి అందిన సమాచారం ఆధారంగా గతేడాది ఆగస్టులో అది రెండు నక్షత్రాల మధ్య ఉండే అంతర నక్షత్ర రోదసిలోకి ప్రవేశించిందని నాసా, ఇతర విశ్వవిద్యాలయాల అధ్యయనంలో వెల్లడైంది. వాయేజర్-2 ప్రస్తుతం 15.3 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. 2020 వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ప్రయాణించగల శక్తి వాయేజర్ అంతరిక్ష నౌకలకు ఉంది. ఇది సాధ్యమైతే 2020 నాటికి వాయేజర్-1 సూర్యుని నుంచి 19.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో, వాయేజర్-2 16.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.

గోల్డెన్ రికార్డ్:
జంట వాయేజర్ నౌకలు 12 అంగుళాల బంగారు పూతతో కూడిన రాగి డిస్క్ పరికరాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఒక ఫోనోగ్రాఫ్ రికార్డు. భూమిపై ఉన్న జీవ సంప్రదాయ వైవిధ్య సమాచారాన్ని ఈ డిస్క్‌లో పొందుపరిచారు. కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్ల్ సగన్ ఆధ్వర్యంలోని ఒక కమిటీ ఈ డిస్క్‌లో పొందుపరిచిన సమాచారాన్ని సేకరించింది. 115 చిత్రాలు, పలు సహజ ఆవాసాల శబ్దాలను ఇందులో ఉంచారు. గాలి, ఉరుము, పక్షులు, తిమింగలాలు, ఇతర జంతువుల శబ్దాలను ఇందులో పొందుపరిచారు. భూమిపై వివిధ కాలాలు, ప్రాంతాలు, సంప్రదాయాలకు చెందిన సంగీతాన్ని కూడా నిక్షిప్తం చేశారు. 55 భాషల్లో వ్యక్తుల సందేశాలతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వాల్దీం (Kurt Josef Waldheim) సందేశాలు గోల్డెన్ రికార్‌‌డలో ఉన్నాయి. గ్రహాంతర వాసులకు ఈ రికార్‌‌డ అందితే భూమి, దాని గురించి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించారు.

వాయేజర్-1 ప్రస్థానం
లక్ష్యం: గ్రహాలు, నక్షత్రాంతర రోదసి పరిశోధన
బరువు: 722 కిలోలు
పరికరాలు:

  • హై గెయిన్ యాంటెన్నా (సౌర కుంటుంబం ఆవలి నుంచి రేడియో సంకేతాలు పంపే శక్తిమంతమైన యాంటెన్నా. భూమిపై మూడు డీప్‌స్పేస్ నెట్‌వర్క్ కేంద్రాలకు సిగ్నళ్లు పంపుతుంది. ఈ సిగ్నళ్లు భూమి ని చేరటానికి 17 గంటల సమయం పడుతుంది).
  • లో-ఫీల్డ్ మ్యాగ్నెటోమీటర్ (రోదసిలోని అయస్కాంత క్షేత్రాలను గుర్తిస్తుంది).
  • రేడియోఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జెనరేటర్ (దీనిలోని మూడు యూనిట్లు విద్యుత్‌ను అందిస్తాయి. ఇందులోని ఒక్కో యూనిట్లో పీడనానికి గురి చేసిన ప్లుటోనియం-238 ఆక్సైడ్ స్పియర్లు ఉంటాయి).
  • ప్లానెటరీ రేడియో ఆస్ట్రానమీ (సూర్యుడు, గ్రహాలు, అంతరిక్షం నుంచి వచ్చే రేడియో సిగ్నళ్లను గుర్తిస్తుంది).
  • ప్లాస్మావేవ్ సబ్‌సిస్టమ్ (ప్లాస్మా, అయస్కాంత తరంగాలను గుర్తిస్తుంది).
  • మ్యాగ్నెటోమీటర్ (అయస్కాంత కేత్రాలు, గ్రహాలపై సూర్యుడి ప్రభావాన్ని అంచనా వేస్తుంది).
  • కాస్మిక్ రే డిటెక్టర్ (కాస్మిక్ కిరణాలు, ప్లాస్మాలోని కణాలను గుర్తిస్తుంది).
  • ప్లాస్మా స్పెక్ట్రోమీటర్ (ప్లాస్మాలో అతి తక్కువ విద్యుదాత్మకతగల కణాలను, వాటి వేగాలను, మార్గాలను గుర్తిస్తుంది).
  • ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, రేడియో మీటర్ (ఉష్ణోగ్రత, రసాయన మూలకాలు, దృశ్య పరారుణ కాంతిని అంచనా వేస్తుంది).
  • ఫోటో పోలరీ మీటర్ (గురు, శని, యురేనస్ భౌతిక ధర్మాలను గుర్తిస్తుంది).
  • ఇమేజింగ్ సైన్స్ సిస్టమ్ (గ్రహాలు, వస్తువులను రెండు కెమెరాలతో ఫోటోలు తీస్తుంది).
  • అల్ట్రావయిలెట్ స్పెక్ట్రోమీటర్ (పరిసరాల్లోని వాతావరణం, రేడియేషన్‌ను అంచనా వేస్తుంది).
  • లో-ఎనర్జీ చార్జ్‌డ్ పార్టికల్ డిటెక్టర్ (రోదసి నుంచి దూసుకు వచ్చే విద్యుదావేశ కణాల వేగం, దిశ, పరిమాణాన్ని గుర్తిస్తుంది)
  • డీప్ స్పేస్ కమాండ్ నెట్‌వర్క్ ద్వారా రేడియో సిగ్నళ్లు పంపుతుంది.
  • ఇంధనం-ప్లుటోనియం-238
  • పయోగం-1977, సెప్టెంబర్ 5
  • పయాణించిన దూరం- దాదాపు 1,900 కోట్ల కిలోమీటర్లు (125 AU) ఆగస్టు 2013 నాటికి
  • పస్తుత వేగం: సెకన్‌కు 17 కిలోమీటర్లు ఆగస్టు 2013 నాటికి
  • 1979లో గురు గ్రహం దాటింది
  • 1980లో శని గ్రహం దాటింది
  • 2013లో సౌర కుటుంబం వెలుపలకు చేరింది
  • గురు, శని గ్రహాలు, వాటి సహజ ఉపగ్రహాలకు సంబంధించి స్పష్టమైన చిత్రాలు పంపిన తొలి నౌక
  • వాయేజర్-2 అత్యధిక రోజులు పని చేస్తున్న వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది.
  • వాయేజర్-1, 2 లను 1977లో 16 రోజుల తేడాతో ప్రయోగించారు. ఇవి అప్పటి నుంచి 36 ఏళ్లుగా నిరంతరంగా ప్రయాణిస్తూ సమాచారం పంపుతూనే ఉన్నాయి.

ఆధారము: సాక్షి

పీఎస్‌ఎల్‌వీ-సీ24 ప్రయోగం విజయవంతం

సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధనలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ24 ప్రయోగం విజయవంతమైంది. భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం -ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) శ్రేణిలో భాగంగాఉపయోగించాల్సిన ఏడు ఉపగ్రహాలలో రెండోదైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీని ఇస్రోపీఎస్‌ఎల్‌వీ-సీ 24 ద్వారా దిగ్విజయంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 4న సాయంత్రం 5.14 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ24 నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఇస్రో నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 26వది. అంతేకాకుండా 25వ వరుస విజయవంతమైన ప్రయోగం. లిఫ్ట్‌ఆఫ్ జరిగిన 19.26 నిమిషాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీని 283 కి.మీ. పెరీజీ, 20,630 కి.మీ. అపోజీ పరిధి ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ24 ప్రవేశించింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో మొత్తం రూ.225 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందులో వాహకనౌక తయారీకి రూ. 125 కోట్లు కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ రూపకల్పనకు రూ.125 కోట్లు వెచ్చించారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న పూర్తి స్వదేశీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) లోని ఏడు ఉపగ్రహాల్లో రెండోది ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ. 2013, జూలై 1న పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ రూపకల్పనలో 140 మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. భారత భూభాగంతోపాటు అదనంగా సరిహద్దు బయట 1,500 కి.మీ. పరిధి వరకు ఈ ఏడు ఉపగ్రహాల సముదాయం నుంచి సంకేతాలు (సిగ్నళ్లు) లభిస్తాయి. ఫలితంగా ఈ విస్తీర్ణంలో సేవలు అందుతాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ తో ఇప్పటికి రెండు ఉపగ్రహాలను ఈ వ్యవస్థలో ఇస్రో ప్రయోగించింది. 2015-16 నాటికి మిగతా 5 ఉపగ్రహాలను కూడా ఇస్రో ప్రయోగించనుంది. ఏడుకు అదనంగా భవిష్యత్‌లో మరో నాలుగు ఉపగ్రహాలను కూడా ఈ వ్యవస్థలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ - ప్రయోజనాలు:
నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రవాణా రంగంలో వ్యక్తులు తాము చేరాల్సిన చోటును తెలుసుకోవడం, లక్ష్యం ఎంతదూరంలో ఉందో నిర్ధారించుకోవడంలోనూ ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న పర్యావరణ పరిశోధన కేంద్రాలను అనుసంధానించేందుకు ఇది అక్కరకు వస్తుంది. పర్వతారోహకులకు, ఓడల గమనానికి కూడా ఉపయోగపడుతుంది. మొదటిసారిగా 1970లో అమెరికా సైనికులకు కావాల్సిన దిశానిర్దేశం కోసం ప్రారంభించిన గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ నేడు సైనిక అవసరాలతోపాటు, అనేక సైనికేతర అవసరాలకు ప్రయోజనకారిగా నిలుస్తుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా బ్యాంకింగ్, వాణిజ్యం, కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగవుతాయి. ఇతర దేశాల ఉపగ్రహాలపై ఆధారపడటం కంటే దేశీయ నావిగేషన్ వ్యవస్థ ద్వారా పూర్తి భద్రతతో కూడిన సైనిక రక్షణ కార్యకలాపాలను నిర్వహించడానికి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది.

గగన్ (GAGAN):
ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ కోసం ఇస్రో, ఎయిర్‌పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో గగన్ (GPS ఎయిడెడ్ జియో ఆగ్‌మెంటెడ్ నావిగేషన్) అనే వ్యవస్థను ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వెలుపల అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ పౌరవిమానయాన రంగం (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) ఒత్తిడితో భారత్ గగన్‌ను అభివృద్ధి చేసింది. గగన్‌కు సంబంధించిన రెండు పేలోడ్‌లను ఇప్పటికే ఇస్రో జీశాట్-8, జీశాట్-10 ఉపగ్రహాలతో ప్రయోగించింది. విమానయానంలో జీపీఎస్ సేవలను గగన్ మరింత అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లో స్పష్టతపెరుగుతుంది.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ:
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థలో ఇది రెండోది. దీని బరువు 1,432 కిలోలు జూలై 1, 2013న పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ నిర్మాణం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీను పోలి ఉంటుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏను ప్రయోగించిన ఏడు నెలల్లోనే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీను అభివృద్ధి చేయడం విశేషం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 బీలో రెండు రకాల పేలోడ్‌లు ఉంటాయి. ఒకటి నావిగేషన్ పేలోడ్, రెండోది రేంజింగ్ పేలోడ్. వినియోగదారులకు జీపీఎస్ సిగ్నళ్లను నావిగేషన్ పేలోడ్ అందిస్తుంది. ఎల్5 బ్యాండ్ (1176.45 మెగాహెర్‌‌ట్జ), ఎస్-బ్యాండ్ (2492.028 మెగాహెర్‌‌ట్జ) పరిధిలో నావిగేషన్ పేలోడ్ పని చేస్తుంది. పూర్తిస్థాయి నిర్దిష్టతతో పనిచేసే రుబిడియం అణు గడియారం ఇందులో ఉంటుంది. రేంజింగ్ పేలోడ్‌లో ఒక సీ-బ్యాండ్ ట్రాన్‌‌సపాండర్ ఉంటుంది. లేజర్ రేంజింగ్‌కు ఉద్దేశించిన కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టర్లూ ఐఆర్‌ఎన్‌ఎస్.ఎస్-1బీలో ఉన్నాయి.

పీఎస్‌ఎల్‌వీ-సీ24:
పీఎస్‌ఎల్‌వీ-సీ24 నౌక ఇస్రో ప్రయోగించిన 26వ పీఎస్‌ఎల్‌వీ.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి దీన్ని పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించారు. ఈ రూపంలో స్ట్రాప్-ఆన్ మోటార్ల పరిమాణం పెంచుతారు. లిఫ్ట్‌ఆఫ్ సమయంలో పీఎస్‌ఎల్‌వీ-సీ24 బరువు 320 టన్నులు, పొడవు 44.5 మీటర్లు. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రూపంలో పీఎస్‌ఎల్‌వీని ప్రయోగించడం ఇది ఆరోసారి.

వడివడిగా అడుగులు:
ప్రపంచవ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్‌ఎల్‌వీ కీలకమైంది. పీఎస్‌ఎల్‌వి కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో ఎస్‌ఎల్‌వీ-3, ఎఎస్‌ఎల్‌వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా అభివృద్ధి చేసింది. పీఎస్‌ఎల్‌వీ నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ఇది నాలుగు అంచెల నౌక. మొదటి, మూడో దశలో ఘన ఇంధనాన్ని 2, 4వ దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు. భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను, చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-1 అదే విధంగా మంగళయాన్‌ను కూడా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించింది. ఇప్పటివరకు చేపట్టిన 26 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 23 కార్యాచరణ ప్రయోగాలు. 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 25 ప్రయోగాలు (పీఎస్‌ఎల్‌వీ-సీ 24తో కలిపి) వరుసగా విజయవంతమయ్యాయి. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. త్వరలో ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-7, ఇతర 4 విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది. పీఎస్‌ఎల్‌వీ అనుసంధానంతో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలో ఇస్రో సఫలమైంది. ఇలాంటి అంతరిక్ష సేవలను ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించడానికి 1992లో ఇస్రో వాణిజ్య విభాగం అంత్రిక్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది.

ఇతర దేశాల నావిగేషన్ వ్యవస్థలు:
ప్రపంచంలో అధిక ప్రాముఖ్యతను సంతరించుకున్న నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్. ఇది రెండు దశాబ్దాల క్రితమే అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థలో 24 ఉపగ్రహాలు ఆరు అక్షాల్లో పరిభ్రమిస్తూ మొత్తం భూమిని కవర్ చేస్తూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇదే తరహాలో అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ జీఎల్‌ఓఎన్‌ఏఎస్‌ఎస్-గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)లో కూడా 24 ఉపగ్రహాలు ఉంటాయి. యూరప్‌లోనూ గెలీలియో పేరుతో 27 ఉపగ్రహాల సముదాయం ఏర్పాటవుతోంది. చైనాలో అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ బీడోయ్ నావిగేషనల్ వ్యవస్థ, జపాన్‌కు చెందినది, క్వాసీ జెనిథ్ శాటిలైట్ సిస్టం.

ఇదివరకటి పి.ఎస్.ఎల్.వి-ఎక్స్‌ఎల్ ప్రయోగాలు
పీఎస్‌ఎల్‌వీ-సీ11/ చంద్రయాన్-1
పీఎస్‌ఎల్‌వీ-సీ17 జీశాట్-12
పీఎస్‌ఎల్‌వీ-సీ19 రీశాట్-1
పీఎస్‌ఎల్‌వీ-సీ22/ ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్-1ఏ
పీఎస్‌ఎల్‌వీ-సీ23/ మంగళయాన్
పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు


పీఎస్‌ఎల్‌వీ

ప్రయోగ తేదీ

ప్రయోగించిన ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-డీ1

సెప్టెంబర్ 20, 1993

ఐఆర్‌ఎస్-1 ఈ ప్రయోగం విఫలం

పీఎస్‌ఎల్‌వీ-డీ2

అక్టోబర్ 15, 1994

ఐఆర్‌ఎస్-పీ2

పీఎస్‌ఎల్‌వీ-డీ3

మార్చి 21, 1996

ఐఆర్‌ఎస్-పీ3

పీఎస్‌ఎల్‌వీ-సీ1

సెప్టెంబర్ 29, 1997

ఐఆర్‌ఎస్-1డీ

పీఎస్‌ఎల్‌వీ-సీ2

మే 26, 1999

ఐఆర్‌ఎస్-పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా)
డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ)

పీఎస్‌ఎల్‌వీ-సీ3

అక్టోబర్ 22, 2001

టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, బర్‌‌డ(జర్మనీ),ప్రోబా(బెల్జియం)

పీఎస్‌ఎల్‌వీ-సీ4

సెప్టెంబర్ 12, 2002

కల్పన-1

పీఎస్‌ఎల్‌వీ-సీ5

అక్టోబర్ 17, 2003

ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌‌సశాట్-1)

పీఎస్‌ఎల్‌వీ-సీ6

మే 5, 2005

కార్టోశాట్-1, హోమ్‌శాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ7

జనవరి 10, 2007

కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా) పేహున్‌శాట్ (అర్జెంటీనా)

పీఎస్‌ఎల్‌వీ-సీ8

ఏప్రిల్ 23, 2007

ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌‌సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం)

పీఎస్‌ఎల్‌వీ-సీ10

జనవరి 21, 2008

టెక్సర్ (ఇజ్రాయెల్)

పీఎస్‌ఎల్‌వీ-సీ9

ఏప్రిల్ 28, 2008

కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ- సీ11

అక్టోబర్ 22, 2008

చంద్రయాన్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ12

ఏప్రిల్ 20, 2009

రీశాట్-2+అనుశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ14

సెప్టెంబర్ 23, 2009

ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ15

జూలై 12, 2010

కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ16

ఏప్రిల్ 20, 2011

రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ17

జూలై 15, 2011

జీశాట్12

పీఎస్‌ఎల్‌వీ-సీ18

అక్టోబర్ 12, 2011

మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ19

ఏప్రిల్ 26, 2012

రీశాట్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ20

ఫిబ్రవరి 25, 2013

సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ21

సెప్టెంబర్ 9, 2012

స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్)

పీఎస్‌ఎల్‌వీ-సీ22

జూలై 1, 2013

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ

పీఎస్‌ఎల్‌వీ-సీ23

నవంబర్ 5, 2013

మంగళయాన్

ఆధారము: సాక్షి

వినీలాకాశంలో వాణిజ్య విహంగం పీఎస్‌ఎల్‌వీ-సీ23

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) వినీలాకాశంలో తన అప్రతిహత జైత్రయాత్రను సాగించడంలో మరోసారి సఫలమైంది. విదేశీ వాణిజ్యం నిమిత్తం ప్రయోగించిన ఐదు ఉపగ్రహాలను మోసుకుపోవడంలో ఇస్రో మానసపుత్రిక అయిన పీఎస్‌ఎల్‌వీ తన విద్యుక్తధర్మాన్ని విజయవంతం చేసింది. శాస్త్రవేత్తల నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రసాంకేతిక రంగంలో మరో అడుగు ముందుకు వేసేందుకు ఆత్మస్థైర్యాన్ని ప్రోదిచేసింది.

26వ వరుస విజయం:

అంతరిక్ష యానంలో ఇస్రో మరో అడుగుముందుకు వేసింది. నెల్లూరులోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C23 నుంచి ఉపగ్రహాలను పంపడంలో శతశాతం విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా వాణిజ్య రంగంలో తనదంటూ చెరగని ముద్రవేసుకుంది. నాలుగు దేశాలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇలా పీఎస్‌ఎల్‌వీల ప్రయోగ పరంపరలో ఇది 27వది. కాగా ఇది 26వ వరుస విజయం.

49 గంటల కౌంట్‌డౌన్ తర్వాత జూన్ 30, 2014న ఇస్రో ఉదయం 9.52 గంటలకు PSLV-C23 ను ప్రయోగించింది. దీని పయనానికి రోదసి లోని ఉపగ్రహ శకలాలు అడ్డుపడే సంకేతాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. 9.49 గంటలకు ప్రయోగించాల్సిన నౌకను మూడు నిమిషాల ఆలస్యంగా 9.52 గంటలకు ప్రయోగించారు. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 20 నిమిషాలకు తొలుత ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-7 ఉపగ్రహాన్ని PSLV-C23 నాలుగో దశ 662.3 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తన (Sun Synchronus) కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత నిమిషాల్లో ఇతర నాలుగు ఉపగ్రహాలను కూడా నిర్ణీత కక్ష్యలోకి చేరాయి. స్ట్రాప్ ఆన్ మోటార్లు లేని PSLV కోర్ అలోన్ రూపంలో PSLV-C23 ప్రయోగం జరిగింది. ఇలాంటి ప్రయోగాల్లో ఇది పదవది.

పూర్తిగా వాణిజ్యపరమైన ఈ ప్రయోగం తెలుగువాడైన షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. 50 రోజుల వ్యవధిలో అనుసంధానం జరిగింది. ఇప్పటివరకు ఇస్రో 19 దేశాలకు చెందిన 38 విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలను చేపట్టగా అందులో 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

నాలుగు దేశాలు-ఐదు ఉపగ్రహాలు

PSLV-C23 ద్వారా నాలుగు దేశాలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటిలో ప్రధాన ఉపగ్రహం ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-7. ఇది ఎర్‌‌త అబ్జర్వేషన్ ఉపగ్రహం. పీఎస్‌ఎల్‌వీ-సి21 ద్వారా ఇస్రో 2012 సెప్టెంబర్‌లో ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-6 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్పాట్-6 స్పాట్-7ను పోలి ఉంటుంది. స్పాట్-7ను ఐరోపాకు చెందిన ప్రముఖ స్పేస్ టెక్నాలజీ సంస్థ Airbus Defence & Space రూపొందించింది. దీని బరువు 714 కిలోలు. దీని జీవితకాలం 10 ఏళ్లు. భూమి ఉపరితల చిత్రీకరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పాట్-7తోపాటు ఇతర విదేశీ ఉపగ్రహాలు -వాటి వివరాలు.

ఎ.ఐ. శాట్:

ఇది జర్మనీ దేశానికి చెందినది. దీని బరువు 14 కిలోలు. మ్యారిటాం అనువర్తనాలకు ఉద్దేశించింది. దీని సహాయంతో ప్రపంచ సముద్రయానం, నౌకల గమనాన్ని పరిశీలించవచ్చు. నౌకల నుంచి సంకేతాలను గ్రహించి సమాచారం చేరవేస్తుంది. జర్మనీ అభివృద్ధి చేసే డీఎల్‌ఆర్ ఉపగ్రహాల్లో మొదటి నానో ఉపగ్రహం ఇది.

ఎన్‌ఎల్‌ఎస్:

ఎన్‌ఎల్‌ఎస్ 7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 అనే ఈ రెండు ఉపగ్రహాలు కెనడావి. ఒక్కో ఉపగ్రహం బరువు 15 కిలోలు. ఇవి సిగ్నల్స్‌ను తీసుకొని ట్రాన్స్‌మిషన్ చేస్తాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సేవలకు ఉద్దేశించినవి.

వెలాక్స్:

ఈ ఉపగ్రహం సింగపూర్ దేశానికి చెందినది. దీని బరువు 6.4 కిలోలు. సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ దీన్ని రూపకల్పన చేసింది. కొత్తరకం ఇమేజ్ సెన్సార్ టెక్నాలజీని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ (ఎమ్‌ఈఎమ్‌ఎస్) ఆధారంగా పనిచేసే నియంత్రణ వ్యవస్థ, రెండు ఉపగ్రహాల మధ్య అనుసంధానానికి సంబంధించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది పరీక్షిస్తుంది. సంకేతాలను గ్రహించి నిల్వ చేస్తుంది.
ఇది మొట్టమొదటి నానోశాటిలైట్.

తొలి వాణిజ్య విజయం:

ఇప్పటివరకు ఇస్రో PSLV ద్వారా 40 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. 1999లో తొలిసారిగా పీఎస్‌ఎల్‌వీ-సీ2 ద్వారా ఇస్రో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ప్రారంభించింది. PSLV-C2 ద్వారా జర్మనీకి చెందిన డీఎల్‌ఆర్ -టబ్‌శాట్, కొరియాకు చెందిన కిట్‌శాట్-3ను ఇస్రో ప్రయోగించింది. ఆనాటి నుంచి విదేశీ ఉపగ్రహాల ప్రయోగ పరంపరను ఇస్రో కొనసాగిస్తూనే ఉంది. మొదట్లో విదేశీ ఉప గ్రహాలను ప్రధాన భారత ఉపగ్రహాలకు అదనంగా ప్రయోగించినప్పటికీ PSLV-C8 ద్వారా 2007లో ప్రధాన పేలోడ్‌గా ఇటలీకు చెందిన ఎజైల్ ఉపగ్రహాన్ని అంత రిక్షంలోకి పంపింది. ఇది ఒక మంచి వాణిజ్య విజయంగా పరిగణించవచ్చు. అదే విధంగా PSLV-C10 ద్వారా కేవలం విదేశీ ఉపగ్రహాన్ని మాత్రమే ఇస్రో పంపింది. 300 కిలోల బరువున్న ఇజ్రాయెల్‌కు చెందిన టెక్సర్/పోలారిస్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఇదే తరహాలో మరో అడుగు ముందుకేసి PSLV-C9 ద్వారా మొత్తం పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వీటిలో 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. PSLV-C21 ద్వారా ఫ్రాన్‌‌సకు చెందిన స్పాట్-6, జపాన్‌కు చెందిన ప్రొయిటెరిస్ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఆ తర్వాత కొన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నప్పటికీ మళ్లీ PSLV-C23 ద్వారా దాదాపు పూర్తి స్థాయిలో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో వాణిజ్య విజయాన్ని మరోసారి నమోదు చేసింది.

రూ. కోట్లలో ఆర్జన:

విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపే సేవలను అందించడం ద్వారా ఇస్రో ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అత్యంత చౌక అయిన ప్రయోగ సేవలను అందిస్తున్న అంతరిక్ష సంస్థ ఇస్రోనే. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు సహజవనరుల నిర్వహణ, గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉపగ్రహాలను నిర్మించుకోనున్నాయి. అయితే రాకెట్ విజ్ఞానం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అవడం ద్వారా భారత్ లాంటి దేశాలకు ఇది ఎంతగానో కలిసి వచ్చే అంశం.

నమ్మకానికి ప్రతీక... పీఎస్‌ఎల్‌వీ:

27 ప్రయోగాల్లో మొదటిది తప్ప మిగతా 26 ప్రయోగాల్లో ్కఔగ విజయాలను నమోదు చేసుకోవడంతో దీనిపై అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలకు నమ్మకం ఏర్పడింది. ఇన్ని దేశాలు PSLV ద్వారా తమ ఉపగ్రహాలను ప్రయోగిస్తుండటంతో భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచం ఏ విధంగా గుర్తించిందో అర్థమవుతుందని, PSLV-C23 ప్రయోగానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్‌ఎల్‌వీ చాలా కీలకమైంది. పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో శాటిలైట్ లాంచ్ వెహికల్-3 (SLV3).

ఆగ్‌మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ASLV) అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా ప్రయోగించింది. నమూనా PSLV పొడవు 44.4 మీ. బరువు 294 టన్నులు. ఇది నాలుగు అంచెల నౌక. మొదటి, మూడో దశల్లో ఘన ఇంధనాన్ని రెండు,నాలుగో దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. ఇస్రో ఇప్పటివరకు మూడు రకాల PSLVలను రూపొందించి ప్రయోగించింది.

మొదటి PSLV జనరిక్ రూపం:

దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. రెండవది PSLVCA (కోర్ అలోన్) రూపం. దీని చుట్టూ స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉండవు. తేలిక ఉపగ్రహాలను ప్రయోగించినప్పుడు రెండోరూపాన్ని వినియోగిస్తారు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణం, సామర్థ్యం పెంచితే దాన్ని PSLV-XL అంటారు.

అపజయంతో అన్నీ విజయాలే:

ఇప్పటివరకు PSLV-C23 తో కలిపితే 27 ప్రయోగాలను పీఎస్‌ఎల్‌వీ నిర్వహించింది. వీటిలో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 24 కార్యాచరణ ప్రయోగాలు. 1993, సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-డీ1 మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 26 ప్రయోగాలు (PSLV-C23 తో కలిపి) వరుస విజయవంతమయ్యాయి. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారకద్రవ్యం ఆర్జించడంలో ఇస్రో సఫలమైంది. ఇలాంటి అంతరిక్ష సేవలను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడానికి 1992లో Antrix Corporation (ఆంత్రిక్స్ కార్పొరేషన్) అనే ప్రత్యేక అంతరిక్ష వాణిజ్య విభాగాన్ని ఇస్రో ఏర్పాటు చేసింది.

నింగిలోకి రెండో దిక్సూచి

ఆధారము: సాక్షి

పీఎస్‌ఎల్‌వీ-సీ22 ప్రయోగం విజయవంతం

- సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

అంతరిక్ష విజ్ఞానంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ22 ప్రయోగం విజయవంతమైంది. 1,425 కిలోల బరువు గల భారత తొలి నావిగేషన్ ఉపగ్రహం ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ -1ఎ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.

మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 1న పీఎస్‌ఎల్‌వీ-సీ22ను రాత్రి 11.41 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 24వది. అంతేకాకుండా 23వ వరుస విజయవంతమైన ప్రయోగం. లిఫ్ట్ ఆఫ్ తర్వాత 20 నిమిషాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎను 284 కిలోమీటర్లు పెరూజి, 20,650 కిలోమీటర్లు అపోజి పరిధిలోని ఉప భూస్థిర కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ22 విజయవంతంగా ప్రవేశ పెట్టింది. ఇస్రో అభివృద్ధి చేస్తున్న పూర్తి స్వదేశీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) లోని ఏడు ఉపగ్రహాల్లో మొదటిది ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ.

దశాబ్దాల క్రితమే:
ప్రపంచంలో అధిక ప్రాముఖ్యతను సంతరించుకున్న నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్). ఇది రెండు దశాబ్దాల క్రితమే అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థలో 24 ఉపగ్రహాలు ఆరు ఆర్బిటల్ ప్లేన్‌లలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇదే తరహాలో రష్యా అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ గ్లోనాస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్). ఈ వ్యవస్థలో కూడా 24 ఉపగ్రహాలు ఉంటాయి. యూరప్‌లో కూడా గెలీలియో పేరుతో ఇలాంటి ఒక శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ నిర్మాణ దశలో ఉంది. దీనిలో 27 ఉపగ్రహాలు ఉంటాయి. అందులో భాగంగా ఇప్పటివరకు నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించారు. 2019 నాటికి మిగతా ఉపగ్రహాలను కూడా ప్రయోగించాలని యూరప్ భావిస్తోంది. గత డిసెంబర్‌లో చైనా బీడోయ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సేవలను ప్రారంభించింది. జపాన్ కూడా క్వాసీ జెనిథ్ శాటిలైట్ సిస్టమ్ (క్యూజెడ్‌ఎస్‌ఎస్) పేరిట ఈ తరహా వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు మూడు ఉపగ్రహాలను సైతం ప్రయోగించింది.

ఏడు ఉపగ్రహాలు:
భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. భారత భూభాగంతోపాటు అదనంగా సరిహద్దు బయట 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ ఏడు ఉపగ్రహాల సముదాయం నుంచి సిగ్నళ్లు లభిస్తాయి. 2014-15 నాటికి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సముదాయంలోని మిగతా అన్ని ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ఈ ఉపగ్రహాలకు అదనంగా మరో నాలుగు ఉపగ్రహాలను భవిష్యత్తులో ప్రయోగించే అవకాశం కూడా ఉంటుంది.

ప్రయోజనాలెన్నో:
నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాలతో ఎన్నో విధాలైన ప్రయోజనాలు ఉన్నాయి. రవాణా రంగంలో సాధారణ వ్యక్తులు కూడా తమ గమనాన్ని, చేరాల్సిన చోటును తెలుసుకోవడం, లక్ష్యం ఎంత దూరంలో ఉందో నిర్ధారించుకోవడంలోనూ ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఇస్రో ఇందుకోసం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వెలుపల గగన్ (జీపీఎస్-ఎయిడెడ్ జీయో అగ్మెంటెడ్ నావిగేషన్) అనే వ్యవస్థను ఎయిర్‌పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన జీశాట్-8, జీశాట్-10 అనే రెండు పేలోడ్లను కూడా ప్రయోగించింది. విమానయానంలో జీపీఎస్ సేవలను ఇది మరింత అభివృద్ధి చేస్తుంది. దీని వల్ల విమానాల ల్యాండింగ్, టేక్‌ఆఫ్‌లో నిర్దిష్టత పెరుగుతుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల ద్వారా బ్యాంకింగ్, వాణిజ్యం, కమ్యూనికేషన్, మిలటరీ సేవలు కూడా మెరుగవుతాయి. పూర్తి ఉచితంగా లభ్యమయ్యే జీపీఎస్ సేవలతోపాటు ఎన్‌క్రిప్టెడ్ (భద్రత) సేవలు కూడా లభ్యతలో ఉంటాయి. భారత మిలటరీ సేవలు కూడా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా మరింత ఆధునీకీకరణను సంతరించుకుంటాయి. ఇతర దేశాల ఉపగ్రహాలపై ఆధారపడటం కంటే దేశీయ నావిగేషన్ వ్యవస్థ ద్వారా పూర్తి భద్రతతో కూడిన మిలటరీ కార్యకలాపాలను నిర్వహించడానికి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ:
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. దీని ఎత్తు 1.5 మీటర్లు. దీనిలో మూడు విభాగాలున్నాయి. అవి..అంతరిక్ష విభాగం, భూ విభాగం, వినియోగదారుడి విభాగం. అన్ని రకాల శీతోష్ణస్థితుల్లోనూ పని చేస్తుంది. ఈ ఉపగ్రహాన్ని ఆరు నెలలపాటు భూస్థిర కక్ష్యలో పరీక్షించిన తర్వాత ఇస్రో సేవలకు సిద్ధం చేస్తుంది. కేవలం రవాణాకు సంబంధించిన నావిగేషన్ సేవలే కాకుండా విపత్తుల సమయంలో ఎంతో విలువైన సమాచారాన్ని అందించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని పీఎస్‌ఎల్‌వీ- ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించారు. సాధారణ పీఎస్‌ఎల్‌వీ రూపంలోని స్ట్రాపాన్ బూస్టర్ మోటార్ల పరిమాణం కంటే పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌లోని స్ట్రాపాన్ మోటార్ల పరిమాణం ఎక్కువ.

పీఎస్‌ఎల్‌వీ-సీ22:
పీఎస్‌ఎల్‌వీ-సీ22 మొదటి, మూడో దశల్లో హైడ్రాక్సి టెర్నినేటెడ్ పాలీబ్యూటాడైఈన్ అనే ఘన ప్రొపెల్లెంట్‌ను వినియోగించారు. రెండో దశలో అన్‌సిమిట్రెకిల్ డైమిథైల్ హైడ్రోజన్+25 శాతం హైడ్రోజన్ హైడ్రేట్‌ను ద్రవ ఇంధనంగా వినియోగించారు. ఈ దశలో 24ను ఆక్సిడైజర్‌గా ఉపయోగించారు. నాలుగో దశలో మోనోమిథైల్ హైడ్రోజన్‌ను ఇంధనంగా, నత్రజని ఆక్సైడ్ల మిశ్రమాన్ని ఆక్సిడైజర్‌గా వినియోగించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ22 పొడవు 44 మీటర్లు, లిఫ్ట్ ఆఫ్ సమయంలో బరువు 320 టన్నులు.

ఘనత చాటిన పీఎస్‌ఎల్‌వీ:
ప్రపంచవ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్‌ఎల్‌వీ (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) కీలకమైంది. పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో ఎస్‌ఎల్‌వీ-3, ఏఎస్‌ఎల్‌వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా అభివృద్ధి చేసి పరీక్షించింది. పీఎస్‌ఎల్‌వీ అనేది నాలుగు దశల అంతరిక్షనౌక. దీని నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు. భూ స్థిరకక్ష్యలోకి ఉపగ్రహాలను, చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-1ను ప్రయోగించడానికి కూడా దీన్ని వినియోగించారు. ఇప్పటి వరకూ చేపట్టిన 24 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు, మిగతా 21 కార్యాచరణ ప్రయోగాలు. 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 23 ప్రయోగాలు (పీఎస్‌ఎల్‌వీ 22తో కలిపి) వరుసగా విజయవంతమయ్యాయి. ఈ వరుస విజయవంతమైన ప్రయోగాల్లో.. రెండు అభివృద్ధి ప్రయోగాలు (పీఎస్‌ఎల్‌వీ-డీ1, పీఎస్‌ఎల్‌వీ -డీ2). ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. దీని ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలో ఇస్రో సఫలమయ్యింది. అంతరిక్ష సేవలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి 1992లో ఇస్రో వాణిజ్య విభాగం ఆంత్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటైంది.

నాలుగు దశల నౌక:
పీఎస్‌ఎల్‌వీ నాలుగు దశల నౌక. దీని మొదటి మూడో దశ ఘన ప్రొపెల్లెంట్ ఉన్న దశలు. రెండు, నాలుగు ద్రవ ప్రొపెల్లెంట్‌ను వినియోగించే దశలు. మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాపాన్ బూస్టర్ మోటార్లు ఉంటాయి. స్ట్రాపాన్ మోటార్లు లేకుండా ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ రూపాన్ని పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ రూపం అంటారు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించాలని భావించినప్పుడు స్ట్రాపాన్ మోటార్ల సామర్థ్యాన్ని పెంచుతారు. ఈ రకమైన పీఎస్‌ఎల్‌వీని పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రూపం అంటారు. పీఎస్‌ఎల్‌వీ -సీ22ను రూపంలోనే ఎక్స్‌ఎల్ ప్రయోగించారు. దీంతో కలిపి ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌ను నాలుగుసార్లు ఇస్రో ప్రయోగించింది. మొదటిసారిగా చంద్రయాన్-1 ప్రయోగం కోసం, పీఎస్‌ఎల్‌వీ -సీ11, రెండోసారి జీశాట్-12 ప్రయోగం కోసం పీఎస్‌ఎల్‌వీ-సీ17, మూడోసారి రీశాట్-1 ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ-సీ19, ఇప్పుడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ప్రయోగం కోసం పీఎస్‌ఎల్‌వీ-సీ22ను ఇస్రో ఎక్స్‌ఎల్ రూపాన్ని వినియోగించింది.

భవిష్యత్ ప్రయోగాలు:
ఇస్రో మరెన్నో కీలక ప్రయోగాలను రాబోయే రోజుల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. వీటిల్లో ఏరియన్ రాకెట్ ద్వారా ప్రయోగించే ఇన్‌శాట్-3డీ ఒకటి. జీఎస్‌ఎల్‌వీ ద్వారా ఆగస్టులో జీశాట్-14ను కూడా ప్రయోగించనుంది. జీశాట్-7 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కూడా ఏరియన్ రాకెట్ ద్వారానే ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తుంది. వచ్చే అక్టోబర్‌లో అంగారకుడిపై మాథ్య ఆర్బిటర్‌ను ఇస్రో ప్రయోగించనుంది. డిసెంబర్‌లో స్పాట్-7 అనే విదేశీ ఉపగ్రహాన్ని , వచ్చే జనవరిలో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ను ప్రయోగించనుంది. 4,500-5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ప్రయోగించే సామర్థ్యం దీని సొంతం. అదేవిధంగా ఐఆర్‌ఎస్‌ఎస్‌ఎస్-1డీను కూడా మార్చి 2014లో ప్రయోగించే అవకాశం ఉంది.

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

పీఎస్‌ఎల్‌వీ

ప్రయోగతేదీ

ప్రయోగించిన ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-డీ1

సెప్టెంబర్ 20, 1993

ఐఆర్‌ఎస్-1ఈ ప్రయోగం విఫలం

పీఎస్‌ఎల్‌వీ-డీ2

అక్టోబర్ 15, 1994

ఐఆర్‌ఎస్-పీ2

పీఎస్‌ఎల్‌వీ-డీ3

మార్చి 21, 1996

ఐఆర్‌ఎస్-పీ3

పీఎస్‌ఎల్‌వీ-సీ1

సెప్టెంబర్ 29, 1997

ఐఆర్‌ఎస్ - 1డీ

పీఎస్‌ఎల్‌వీ-సీ2

మే 26, 1999

ఐఆర్‌ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+
కిట్‌శాట్-3 (కొరియా)
డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ)

పీఎస్‌ఎల్‌వీ-సీ3

అక్టోబర్ 22, 2001

టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్,
బర్ద్(జర్మనీ),ప్రోబా(బెల్జియం)

పీఎస్‌ఎల్‌వీ-సీ4

సెప్టెంబర్ 12, 2002

కల్పన-1

పీఎస్‌ఎల్‌వీ-సీ5

అక్టోబర్ 17, 2003

ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌‌సశాట్-1)

పీఎస్‌ఎల్‌వీ-సీ6

మే 5, 2005

కార్టోశాట్-1, హోమ్‌శాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ7

జనవరి 10, 2007

కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్
ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా)
పేహున్‌శాట్ (అర్జెంటీనా)

పీఎస్‌ఎల్‌వీ-సీ8

ఏప్రిల్ 23, 2007

ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌‌సడ్ ఏవియోనిక్స్
మాడ్యూల్ (ఏఏఎం)

పీఎస్‌ఎల్‌వీ-సీ10

జనవరి 21, 2008

టెక్సర్ (ఇజ్రాయెల్)

పీఎస్‌ఎల్‌వీ-సీ9

ఏప్రిల్ 28, 2008

కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ
శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+
ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ- సీ11

అక్టోబర్ 22, 2008

చంద్రయాన్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ12

ఏప్రిల్ 20, 2009

రీశాట్-2+అనుశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ14

సెప్టెంబర్ 23, 2009

ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ15

జూలై 12, 2010

కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్
(అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+
ఒక పికోశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ16

ఏపిల్ 20, 2011

రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్(సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ17

జూలై 15, 2011

జీశాట్12

పీఎస్‌ఎల్‌వీ-సీ18

అక్టోబర్ 12, 2011

మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+
వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ19

ఏప్రిల్ 26, 2012

రీశాట్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ20

ఫిబ్రవరి 25, 2013

సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ21

సెప్టెంబర్ 9, 2012

స్పాట్-6(ఫ్రాన్స్)+
ప్రొయిటెరిస్(జపాన్)

పీఎస్‌ఎల్‌వీ-సీ22

జూలై 1, 2013

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ

ఆధారము: సాక్షి

విజ్ఞన శాస్త్రంలోఅనుకోని అద్భుత ఆవిష్కరణలు

డా " ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం, అమలాపురం.

గాజు : ఈ రోజుల్లో గాజును మనం మన నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఎంతో ఉపయోగంలో ఉన్న ఈ గాజు కూడా అనుకోకుండా ఆవిష్కరించబడిందే. నిజానికి ఏదో కథలాగా ఉంటుంది.ఓడల్లో సముద్రం మీద ప్రయాణిస్తూ, వేర్వేరు దేశాల్లో వ్యాపారం చేస్తున్న వర్తకులు కొందరు తమ

ఓడలో బయలుదేరారు. ఓడనిండా సురేకారం (పొటాషియంనైట్రేట్)నింపబడి ఉంది.కొన్ని రోజులు ప్రయాణించాక ఒకరోజు సిరియాలోని ఫోనిస్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. మధ్యాహ్నం భోజన సమయం అయింది. ఓడకు లంగరు వేసి ఒడ్డుకు చేరుకున్నారు. కూడా తెచ్చుకున్న వంట సామాగ్రిని పాత్రలను దించి వంట ప్రారంభించారు. అన్నీ ఉన్నాయి.కాని వంట చెయ్యాలంటే రాళ్ళను పొయ్యిలాగా పేర్చుకుని దానిమీద పాత్రలు ఉంచి మంట పెట్టాలి. సముద్రపు ఒడ్డుకావడం వల్ల, చుట్టూ వెతికినా ఏ రాయీ కనిపించలేదు. వేరే చేసేదేమే లేక, ఓడలో ఉన్న సురేకారం గడ్డలు కొన్నింటిని తెచ్చి పొయ్యిలాగా పేర్చి దానిమీద పాత్రలుంచి, క్రింద కట్టెలతో మంట పెట్టారు. సముద్రపు ఒడ్డున ఇసుక ఉంటుంది కదా. పొయ్యి కింద ఉన్న ఇసుక, వంటవేడికి సురేకరంతో చర్య జరిపింది. వంట పూర్తయిన తర్వాత కొంత సేపటికి పొయ్యి దగ్గర కొన్ని పెంకులు ఏర్పడ్డాయి. వర్తకులు వాటిని తీసి చూస్తే, అవి పారదర్శకంగా ఉన్నాయి. అంటే ఆ పెంకు గుండా చూస్తే ఆవతలి వస్తువులు కనిపించాయి. అదేగాజు ఆవిష్కరణకు దారితీసింది.

డైనమైట్ : ప్రేలుడు పదార్థమైన డైనమైట్ ను ఆల్ఫ్రెడ్ నోబెల్ యాధృచ్ఛికంగానే కనుగొన్నాడు. బండ రాళ్ళను పగలగొట్టి డాంలు, రోడ్లు నిర్మించేందుకు, కొండలను దొలిచి సొరంగాలు ఏర్పరించేందుకు, నూనె బావులు తవ్వేందుకు డైనమైట్ ఉపయోగపడుతోంది.

నైట్రోగ్లిసరీన్ ద్రవస్థితిలో ఉన్న ప్రేలుడు పదార్థం కాని కొద్దిపాటి కుదుపు లేదా తాకిడికి ఇది ప్రేలిపోయే స్వభావం ఉండడంతో దానిని ఎవరూ ఉపయోగించేందుకు సాధ్యపడేదికాదు. కాని 1874లో ఆల్ఫ్రెండ్ నోబెల్ అనుకోకుండా చేసిన ప్రయోగం వల్ల, నైట్రోగ్లిసరిన్ను కీశెల్గూర్ అనే ఒకరకం ఇసుక పీల్చుకుని ఇముడ్చుకుంటుందని కనిపెట్టాడు. దానికి డైనమైట్ అని పేరు పెట్టాడు.

ఈ డైనమైట్ ను ప్రమాదం లేకుండా ఉపయోగించడం వీలుపడడం వల్ల, ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. బ్లాస్టింగ్ జిలాటిన్ అనే మరో శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని కూడా నోబెల్ యాధృచ్ఛికంగానే కనుగొన్నాడు. ఏ శరీర భాగమైన తెగిగాయమైతే, కొల్లాడయాన్ పూసి చికిత్స చేసేవారు. సెల్యులోజ్ నైట్రేట్, అల్కహాల్, ఈధర్ మిశ్రమాన్ని కొల్లాడయాన్ అంటారు. 1875 లో ఒకరోజున ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ప్రయోగశాలలో పనిచేస్తుండగా ఆయన వేలు తెగి రక్తం వచ్చింది. తన సహాయకుణ్ణి పిలిచి, ఆ గాయం మీద పూయడానికి కొల్లాడయాన్ పట్టుకు రమ్మన్నాడు. గాయానికి కొల్లాడయాన్ పూసినా నొప్పి ఎక్కువగా ఉండడంతో ఆ రాత్రంతా నిద్రపోలేదు. నైట్రోగ్లిసరీన్,నైట్రో సెల్యులోజ్ (గన్కాటన్) లను కలిపి శక్తివంతమైన ప్రేలుడు పదార్థం తయారు చేయడం ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కాని ఇంతలోనే మరో ఆలోచన వచ్చింది. గన్కాటన్ బదులుగా కొల్లాడయాన్ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో అనుకుని వెంటనే లేచి ప్రయోగశాలకు వెళ్ళిపోయాడు. 4 గంటల సమయం. ఇంకా తెల్లవరనే లేదు. కొంత కొల్లాడయాన్ను నైట్రోగ్లిసరీన్ కలిపాడు. ఉదయాన్నే చూసేటప్పటికి జీడిపాకం లాగా తయారయింది. తర్వాత దీనిమీద ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇదే మహాశక్తివంతమైన ప్రేలుడు పదార్థం దీనినే బ్లాస్టింగ్ జిలాటిన్ అంటారు.

గన్కాటన్ : - స్కాలిన్బిమ్ ఒకరసాయన శాస్త్రజ్ఞుడు. ఆయన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు వంటింట్లో ప్రయోగాలు చేస్తుండేవాడు. కాని ఆయన భార్యకు ఈ ప్రయోగాలు ఇష్టం ఉండేవికావు. వంటిట్లో రసాయనాలతో పరీక్షలు, ప్రయోగాలు ఏమిటి? వాసనలు భరించలేం గిన్నెలు, వంట సామాన్లు పాడవుతాయని ఆమె మొత్తుకునేది.ఒకరోజున ఆమే వేరే ఊరు వెళ్ళింది. స్కారిన్బిన్కు ధైర్యం వచ్చింది. వంటింట్లో ప్రయోగాలు చేయడానికి ఇదే అదను అనుకున్నాడు. అయినా ఏదో కంగారు. ఈ కంగారులోనే గాఢనైట్రిక్ ఆమ్లం . సల్ఫ్యూరికామ్లం. మిశ్రమంతో పరీక్ష చేస్తుంటే, ఆ సీసా జారిపడింది. ఆమ్లం మిశ్రమం వంటగది అంతా చిమ్మి, నేలంతా ఖరాబయింది.భార్యవస్తే విషయం తెలిసిపోతుందనుకుని, ఏదైనా గుడ్డతో తుడిచి వేయాలనుకున్నాడు. ఆమె వాడే నూలుకోటు కనిపించింది. దానితో నేలంతా తుడిచాడు. తర్వాత వంటగదిలో పొయ్యికి దగ్గరగా ఒక తాడుమీద ఆ కోటును ఆరేశాడు. ఆశ్యర్యంగా, పొయ్యి వేడికి కోటు మీదమచ్చలన్నీ మాయమయ్యాయి. వేరే ఎవరయినా అయితే, తను చేసిన పనికి ఆనవాళ్ళు మిగలనందుకు సంతోషించే వారెమో కాని స్కాన్ బిన్ మాత్రం వేరే విధంగా ఆలోచించాడు. ఒక్కమచ్చలేకుండా మాయమవడం ఏమిటి? ఏదో అద్భుతం జరిగి ఉండాలనుకున్నాడు. సెల్యులోజ్మీద నైట్రేషన్ మిశ్రమంతో ప్రయోగాలు చేశాడు. అలా పొగలేని ప్రేలుడు పదార్థం గన్కాటన్ (సెల్యులోజ్ నైట్రేట్) ను కనుగొని పేటెంట్ చేశాడు.

భూమిని గురించి తెలుసుకుందాం !

సూర్యుని నుండి మూడవదైన మన భూమి సౌరవ్యవస్థలో చాల పెద్దది. కోట్లాది జీవరాసుల నిలయం. ఈ విశ్వంలో జీవులు నివసించడానికి అనువైన ఒకే ఒక ప్రదేశం కూడ మన భూమే. భూమి ఏర్పడి ఇప్పటికి సుమారు 4.54బిలియన్ సంవత్సరాలు. ఒక బిలియన్ అంటే వందకోట్లు. ఈ భూమి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా !

భౌతిక లక్షణాలు : -


వ్యాసార్థం (సరాసరి) : 6,371.0 కి.మీ
భూ మధ్య రేఖ వద్ద వ్యాసార్థం : 6,378.1 కి.మీ
ధృవాల వద్ద వ్యాసార్థం : 6,356.8 కి.మీ
పరిధి (సరాసరి) : 40,041.47 కి.మీ
ఉపరితలం : 148, 940, 000 కి.మీ2 (భూమి)
: 510, 072, 000 కి.మీ2
(భూ మధ్యరేఖ)
: 461, 132, 000 కి.మీ2 (నీరు)

ఘన పరిణామం : 1.0832073*1012 కి.మీ3
ద్రవ్యరాశి : 5.9736*1024 కి.గ్రా.
సాంద్రత (సరాసరి) : 5,515.3 కి.గ్రా/మీ3

భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టేకాలం : 23 గం" 56ని" 0.09054 సెకన్లు
భూమధ్య రేఖ వద్ద భ్రమణ వేగం : 465.11 m/s
ఉపరితల ఉష్ణోగ్రతలు : అత్యల్పం - 185 కెల్విన్ లేక 88.3 డిగ్రీల సెల్సియస్
సరాసరి - 287 కెల్విన్ లేక 14 డిగ్రీల సెల్సియస్
గరిష్ట - 331 కెల్విన్ లేక 57.7 డిగ్రీల సెల్సియస్
వాతావరణం : పీడనం - 101.3 - సముద్ర మట్టానికి సరాసరి ఎత్తులో
వాయువులు : నైట్రోజన్ - 78.08 %
: ఆక్సిజన్ - 20.95 %
: కార్బన్‌డైఆక్సైడ్ - 0.038 %
: ఆర్గాన్ - 0.93 %
ఉపరితలం ఫలకాలుగా వెలువడి ఉంటుంది. ఈ ఫలకాలు భూగోళం పై అమరిఉన్న విధానాన్ని ఒక ఫుట్ బాల్ తో పోల్చవచ్చు. ఎలాగైతే ఫుట్ బాల్ మీద మనకు నల్లటి, తెల్లటి షడ్భుజాకార ముక్కలు కనబడతాయో అలాగే ఈ ఫలకాలు కూడ భూమి ఉపరిభాగాన్ని కప్పి ఉంటాయి. వీటినే ' టెక్టానిక్ ఫలకాలు ' లేదా ఖండాలు అంటారు. ఈ ఫలకాలు భూ ఉపరితలంపై ఒక చోటు నుండి మరో చోటుకు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. దీన్నే ఖండాంతర చలనం అంటారు. అంటే మనం నేడు చూసే భూ ఖండాలు కొన్ని మిలియన్ సం. క్రితం లేకపోవటమో, ఉన్నా ఈనాటి రూపంలో ఉండకపోవచ్చు. భూమి 71 శాతం నీటితో కప్పబడి ఉంది. ఈ నీటిలో సముద్రాలు, మహాసముద్రాల్లో ఉండే ఉప్పునీరే ఎక్కువ. నీరులేని మిగిలిన భాగం ఖండాలు, ద్వీపాలుగా ఉంటుంది. జీవానికి మూలాధారమైన ద్రవరూపంలో ఉండే నీరు మన భూమి మీద మాత్రమే లభిస్తుంది. మరే ఇతర గ్రహాం మీద ఉండదు.

చందమామకు భారత్ తొలియాత్ర

చంద్రయాన్ – 1
డా " ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, అమలాపురం

డా " ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, అమలాపురం పున్నమి వెన్నెల్లో ఆరుబయట నిలబడి తల పైకెత్తి ఆకాశంలోకి చూస్తే నిండు చందమామ మన దృష్టిని ఆకట్టుకుంటుంది. అబ్బ ! ఈ చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడని అబ్బురపడిపోతాం. దూరం నుంచి మనల్ని ఎంతగానో మురిపించే ఈ చందమామను దగ్గరగా చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో అంతే కాదు సాక్షాత్తు ఆ చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ దిగి విహరిస్తూ అక్కడ విశేషాలను కళ్ళారా చూస్తే ఎలా ఉంటుంది? అనిపిస్తుంది. నిజంగా ఈ ఆలోచన ఈనాటిదికాదు. ఈ భూమి మీద మానవ చరిత్ర ఆరంభం నుంచి చందమామ మనుషుల్ని మురిపిస్తూనే ఉన్నాడు.

ఎంతోమంది కవులు,రచయితలు చందమామ చుట్టూ ఎన్నో కథలు అల్లారు. పాటలు, గేయాలు రాశారు. కొన్ని దేశాల్లో చంద్ర కళలు ఆధారంగా క్యాలెండర్ ను తయారు చేశారు. 'చందమామ రావే జాబిల్లి రావే' పాటను వినని వాళ్ళు మనలో ఎవరుంటారు?

అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇప్పటికే మనదేశం ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. ఈ రంగంలో మరింత ముందుకు పోయేందుకు తనదైన ముద్ర వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రుడి మీదకి దృష్టి మరల్చింది. చంద్రుణ్ణి చాలా దగ్గరగా పరిశీలించేందుకు మనదేశం తొలిసారిగా మనుషులు లేని ఒక ఉపగ్రహాన్ని పంపిస్తోంది. దీని పేరు చంద్రయాన్ -1 2008 సంవత్సరం ఏప్రిల్ 9న శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగించేందుకు భారత అంతరిక్షపరిశోధనకేంద్రం (ఇస్రో) ఏర్పాట్లు చేస్తుంది. పి.యస్.ఎల్.వి. వాహకనౌక ఈ ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ నిర్ధిష్టకక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఈ కక్ష్య ఉంటుంది. అత్యంత ఆధునికమైన శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల మొత్తం దేశం యావత్తు ఆసక్తితో ఎదురు చూస్తోంది.

భూమి నుంచి ప్రయోగించే సమయంలో చంద్రయాన్ - 1 బరువు 1100కి.గ్రా. ఉంటుంది. కాని ఆ తర్వాత దానిలోని ఇంధనం ఖర్చవడం వల్ల తుది కక్ష్యలో ఉన్నప్పుడు దాని బరువు 525 కి.గ్రా. ఉంటుంది. ఎన్నో బృహత్తరమైన లక్ష్యలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా మన శాస్త్రవేత్తలకు ఎంతో అనుభవం వస్తుంది. భవిష్యత్ లో ఇతర గ్రహాలను గురించి మనదేశం చేపట్టబోయే కార్యక్రమాలకు ఈ అనుభవం కలిసి వస్తుంది.ఈ ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు దాదాపు 380 కోట్ల రూపాయలుగా అంచనావేస్తున్నారు. ప్రయోగానికి వీలుగా చంద్రయన్ - 1 ముస్తాబవుతోంది. మరో వైపునా ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.వీటిలో భాగంగా, బెంగుళూరుకు 40 కిలోమిటర్ల దూరంలోని బయలాలు గ్రామంలో 32 మీటర్ల వ్యాసం, 60 టన్నుల బరువు ఉన్న డిష్ ఆంటినాను ఈస్రో ఏర్పాటు చేసింది. చంద్రయన్ - 1 చేయాల్సిన పనులకు సంబంధించిన ఆజ్ఞలను ఈ ఆంటినా పంపిస్తుంది. అంతేకాకుండా ఉపగ్రహంలోని కెమెరాలు, ఇతర పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని తెలియజేసే సంకేతాలను గ్రహిస్తుంది. వీటితోపాటు చంద్రుని గురించి చంద్రయన్ - 1 పంపించే వైజ్ఞానిక సమాచారానికి సంబంధించిన సంకేతాలను కూడా ఈ ఆంటినా గ్రహిస్తుంది.

గతంలో ఎన్నో దేశాలు చంద్రుడి గురించి ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను తెలుసుకున్నప్పటికి ఇంకా ఎన్నో విషయాలు అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఈ రహస్యాలనే కాకుండా మొత్తం సౌరకుటుంబం అంటే సూర్యుడు, సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలు, వాటి ఉపగ్రహాల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం చంద్రయన్ -1 లక్ష్యాలలో ఒకటి. మొత్తం చంద్రుని ఉపరితలాన్ని రసాయనికంగా పరిశోధించి అక్కడ మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, ఇనుము, టైటానియం వంటి మూలకాలతో పాటు, రేడియం, యురేనియం, థోరియం, గడలోనియం వంటి రేడియో ధార్మికాలను గురించి అన్వేషించడం కూడా ఈ లక్ష్యాల్లో భాగమే. చంద్రుడి మీద ఘనీభవించిన స్థితిలో ఉన్న నీరు, పరిశుభ్రమైన శక్తి జనకమైన హీలియం - 3 కూడా చంద్రుని గురించిన అన్వేషణకు ప్రాధాన్యత కలిగిస్తున్నాయి.

వాతావరణం లేదు కాబట్టి చంద్రుడి మీద ఏ వస్తువైనా అతి నెమ్మదిగా కోతకు గురవుతుంది. అలాగే గుర్తులు కూడా తొందరగా చెరిగిపోవు. భూమి చంద్రుడు ఏకకాలంలో ఏర్పడ్డాయి. కాబట్టి భూమి మీద కనిపించకుండా పోయిన ప్రాచీనకాలం నాటి విశేషాలు చంద్రునిమీద పదిలంగా ఉంటాయని నమ్ముతున్నారు. అందుచేత చంద్రుని మీదికి చేసే యాత్ర అంటే భూమి గతంలోకి తొంగి చూడ్డమేనన్నమాట.

చంద్రయన్ - 1 ఉపగ్రహంలో ఎన్నో ఆధునిక పరికరాలున్నాయి. వీటిలో మన దేశానికి చెందిన 5 పరికరాలతోపాటు ఇతర దేశాలకు చెందిన ఆరు పరికరాలున్నాయి. బల్గేరియాకి చెందిన ' రాడకు – 7’ వ్యవస్థ చంద్రునిపై ఉన్న రేడియేషన్ ను కొలిచి భూమికి పంపిస్తుంది.అమెరికాకి చెందిన ' మినిసార్ ' వ్యవస్థ చంద్రుని మీద ఉన్న మంచును కనుగొంటుంది. బ్రిటన్ కు చెందిన ' హేక్స్ ' అనే వ్యవస్థ చంద్రుని మీద యురేనియం, ధోరియం వంటి రేడియో ధార్మిక మూలకాలను కనిపెడుతుంది. జర్మనీకి చెందిన ' సిర్ - 2' వ్యవస్థ చంద్రునిపై ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెడుతుంది.

చంద్రుని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడం సైన్స్ పరంగా చాలా ప్రాధాన్యత గల విషయం అందుచేతనే చాలా దేశాలు ఈ విషయంలో ఎంతో ఆసక్తినికి చూపుతున్నాయి. 2007 సంవత్సరంలో జరిగిన ప్రయోగాలే ఇందుకు నిదర్శనం. సెప్టెంబరు నెలలో జపాన్ చంద్రుడి మీదికి ఒక మానవ రహిత అంటే మనుషులు లేని అంతరిక్షనౌకను పంపించింది. దీని పేరు ' కగుయా ' అక్టోబర్ లో చైనా ' చాంగ్ ఈ -1 '

అంతరిక్ష అన్వేషక నౌకను పంపించింది. ఈ రెండూ కూడా చంద్రుడి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశించి భూమి మీదికి చంద్రుని ఫోటోలతో పాటు, సమాచారాన్ని కూడా పంపిస్తున్నాయి. దక్షిణ కొరియా కూడా ఈ దిశగా ఆలోచిస్తోంది.

కేవలం మానవరహిత నౌకల్నేకాకుండా వ్యోమగాముల్ని కూడా చంద్రుడి మీదికి పంపిచేందుకు మనదేశం, చైనా ఆలోచిస్తున్నాయి. చంద్రుని నుంచి శిలలు, మట్టి నమూనాలు భూమికి తెప్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయి. 2010 - 11 కాలంలో చంద్రయాన్ - 2 పేరుతో ఒక ' రోవర్ ' ను చంద్రుడి మీద దింపేందుకు కలిసి పనిచేయాలని ఇండియా, రష్యా నిర్ణయించుకున్నాయి. ఇందుకుగాను ఒక ఒప్పందం మీద ఇటీవలే సంతకాలు చేశాయి. ఈ రోవర్ మోటారు సాయంతో పనిచేస్తుంది. దానికి అమర్చిన చక్రాలతో చంద్రుడి ఉపరితలం మీద కదులుతుంది. శిలలు, మట్టి నమూనాలను సేకరిస్తుంది. వీటిని అక్కడే రసాయనికంగా విశ్లేషణ చేసి దానికి సంబంధించిన వివరాలను కక్ష్యలో పరిభ్రమిస్తున్న మాతృనౌక చంద్రయాన్ -1 కు పంపిస్తుంది. అక్కడి నుంచి ఆ సమాచారం భూమికి చేరుతుంది. ఈ రోవర్ సౌరశక్తితో పనిచేస్తూ ఒక నెల రోజుల పాటు తిరుగుతుంది. అవసరమనుకుంటే, రోవర్లోని బ్యాటరీలను రీఛార్జీ చేసి మరో రెండు మూడు నెలల పాటు దీనిలోని పరికరాలను పనిచేయిస్తారు.
నిజానికి చంద్రుడి గురించి మనిషి చేసే అన్వేషణలు ఈనాటివి కావు. 1609లో గెలీలియో తను కనుపెట్టిన టెలిస్కోపును చంద్రుడి వైపు తిప్పాడు. చంద్రుడి ఉపరితల గురించి చాలా విషయాలు తెల్సుకున్నాడు. 1959లో సోవియట్ యూనియన్ ఒక మానవరహిత నౌకను ప్రయోగించింది. దీని పేరు స్పుత్నిక్ -1 ఇది చంద్రుడి మీద దిగింది. ఆ తర్వాత ఇంకొక నౌక చంద్రుని ఆవలివైపు ఫొటోలను తీసి భూమికి పంపింది.
1960 దశకంలో అమెరికా రేంజర్, సర్వేయర్ లను కొన్ని ఇతర ఉపగహాలను ప్రయోగించింది. ఇవి కూడా చంద్రుడి ఉపరితలం ఫొటోలను తీశాయి. 1969 జూలై 20 వ తేదీన మానవచరిత్రలోనే ఒక గొప్ప సంఘటన జరిగింది. అమెరికా ప్రయోగించిన అపోలో - 11 ద్వారా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లు చంద్రుడి మీద దిగి నడిచారు. అక్కడ ఒక టెలివిజన్ కెమెరాను ఏర్పాటు చేశారు. మట్టి, శిలల నమూనాలను సేకరించారు. వీరితోపాటు ప్రయాణించిన మైకేల్ కోలిన్స్ మాత్రం చంద్రుడి చుట్టూ కక్షలో తిరుగుతున్న మాతృనౌక కొలంబియాలోనే ఉండిపోయాడు.
చంద్రుడికి సంబంధించిన కొన్ని విశేషాలు చంద్రుడు భూమికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఉపగ్రహాం భూమి నుంచి చంద్రుని సగటు దూరం 3,84,790 కి.మీ. చంద్రుని వ్యాసం 3,476 మీ. అంటే భూమి వ్యాసంలో నాలుగోవంతు.
చంద్రుడు తన చూట్టూ తాను ఒక సారి తిరిగేందుకు 27.32 రోజులు పడుతుంది. చంద్రుని ఉపరితలం చూస్తే గచ్చకాయరంగుతో వేర్వేరు ఛాయల్లో కనిపిస్తుంది. చంద్రుని గురుత్వాకర్షణ వల్లే సముద్రంలో కెరటాలు, ఆటుపోట్లు ఏర్పడుతున్నాయి. చంద్రుని మీద వాతావరణం లేదు.భూమి మీదున్న మనకు నీలంగా కనిపించే ఆకాశం చంద్రుడి మీద నిలబడి చూస్తే నల్లగా కనిపిస్తుంది. చంద్రుడి మీద వాతావరణమే లేదు కాబట్టి గాలి దుమారాలుగాని, వర్షం కాని ఉండదు. శబ్దం వినిపించదు. జీవరాశి ఉండదు. మిట్టమధ్యాహ్నం అంటే సూర్యుడు నిటారుగా పైన ఉన్నప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే నీరు మరిగే ఉష్ణోగ్రత అన్నమాట.
అర్థరాత్రి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఇంత తేడా ఉండడానికి చంద్రునిపై వాతావరణం లేకపోవడమే కారణం.
సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో మనం ఆకాశంలో గమనించే అందమైన రంగులు చంద్రుని మీద అగుపించవు.
ఈ కారణాల వల్ల చంద్రుని మీదికి యాత్రకు వెళ్ళే వ్యోమగామికి పీల్చేందుకు గాలి ఉండదు. పైగా విపరీతమైన ఉష్ణోగ్రత పరిస్థితులు తట్టుకోవాలి. అందుచేత ప్రత్యేకమైన రక్షణ అవసరం. ఇంతేకాకుండా, అనుక్షణం విశ్వకిరణాలు, అల్ట్రావయొలెట్ కిరణాల తాకిడి నుంచి కూడా రక్షణ అవసరం. ఎందుకంటే భూమ్మిద ఉన్న మనకు ఇక్కడి వాతావరణం, భూ అయస్కాంత క్షేత్రం సహజ సిద్ధంగానే ఈ రక్షణ కల్పిస్తాయి.చంద్రుడి మీద ఈ రకమైన రక్షణ లభించదు.
చంద్రుని గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే 1/6 వ వంతు ఉంటుంది. అందుచేతనే ఏ వస్తువు బరువైనా ఆరోవంతుకు తగ్గిపోతుంది అంటే భూమ్మీద 60 కేజీల బరువుండే మనిషి చంద్రుని మీద 10 కేజీలు మాత్రమే ఉంటాడు.
చంద్రుడి మీద నిలబడి చూస్తే భూమి ఎలా అగుపడుతుంది. మనకు కనిపించే పున్నమినాటి చంద్రబింబం కంటే రెండున్నర రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది. ముప్పైరెట్లు ఎక్కువ కాంతిని వెదజల్లుతుంది. మేఘాలు తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తాయి. సముద్రం ముదురునీలం రంగులోను, ఖండాలన్నీ పర్పుల్‌బ్రౌన్ రంగులోను కనిపిస్తాయి.
భూమి మీద ఉన్నవారు సూర్యగ్రహణం చూస్తున్న సమయంలో చంద్రుడి మీద మనిషి ' భూగ్రహణం ' పరిశీలిస్తాడు చంద్రకళల మాదిరి మార్పులను కూడా భూమిని చంద్రుడి నుంచి చూస్తే గమనించవచ్చు.
సైన్సు టెక్నాలజీ శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనదేశం కూడా ఈ రంగాల్లో తన కృషిని కొనసాగించవలసిందే. అయినా అధిక జనాభా, పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి కొన్ని మౌలిక సమస్యలు మనల్ని పట్టిపీడిస్తున్నాయి. మనకు అందుబాటులో ఉన్న వనరులను ఈ సమస్యల పరిష్కారానికి వినియోగించవలసిన పరిస్థితుల్లో, కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్న అంతరిక్ష ప్రయోగాల ప్రాధాన్యత ఎంతమేరకు ఉండాలో ఆలోచించుకోవడం అవసరం.

పుడమి తల్లిని కాపాడుకుందాం!
- ప్రొ ”ఎ. రామచంద్రయ్య

ఈ సువిశాల విశ్వంలో కొన్ని లక్షల ట్రిలియన్ కోట్ల గ్రహాల్లో జీవం ఉండడానికి ఆస్కారముంది. భౌతిక పరిస్థితులే నిర్జీవ పదార్ధం సజీవ పదార్ధంగా మారేందుకు కారణమని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా రుజువు చేశారు. ఎన్నో వేల కాంతి సంవత్సరాల లోతుల్లోకి చూడగలిగిన ఆధునిక అంతరిక్ష పరిశోధనల్లో భూమివలె జీవం ఉండే పరిస్థితులు ఇంకా రూఢి కాలేదు. సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యమండలంలో ఓ అగ్ని గోళంలా ఉండిన భూగోళం క్రమేపీ ఉష్ణశక్తిని పరిమాణాత్మకంగా తగ్గించుకొని జీవానికి తావిచ్చే గుణాత్మకమైన భౌతిక రసాయనిక పరిస్థితుల్ని సంతరించుకుంది.

లోన ఇనుము కూడా ద్రవరూపంలో ఉంటే విపరీతమైన ఉష్ణోగ్రత. కాని పై పొరల మీద మంచుకొండలు, సెలయేర్లు, లోతైన సముద్రాలు, పచ్చని చెట్లు, చెట్లపై పక్షుల కిలకిలారావాలు, నదీనదాలు, కోట్లాది జీవజాతులు పాదార్ధిక వలయాలలో జీవజాతులు అవిచ్ఛిన్న సమాకలనం. వాతావరణం,శిలావరణం, జలావరణం, జీవావరణం, ఈ నాలుగు ఆవరణాల సమాహార సముశ్చయం జీవ వైవిధ్యం. అద్భుతమైన అందాల పుడమితల్లి. ఆనాడూ, ఈనాడూ, రేపు అందరికీ అన్ని ఇవ్వడానికి అడ్డుపడని అవనితల్లి. కణకణలాడే ముందు గోళాగ్నిలో జరిగిన భౌతిక రసాయనిక పరిమాణాత్మక మార్పు. మార్పునకు లోనవుతున్న కాంతి, గురుత్వాకర్షణ, కేంద్రక శక్తుల ఉష్ణగతిక ప్రభావంతో పదార్ధాలలో లాక్షణిక మార్పులు సంభవించాయి.ఇలా ఎన్నో దఫాలు ఆంతరంగిక, పాదార్ధ వైరుధ్యాల ఘర్షణలో నిగ్గు దేలిన జీవ పరిణామం. ప్రకృతి వరణంలో విజయం సాధించి నిలిచిన జీవ జాతులు అగ్రభాగాన తాజా జీవిగా మానవ పరిణామం.ఆలోచన, ప్రశ్న, తార్కిక దృష్టి, పరిశీలన, పరిశోధన మెదడుకు చాలా దగ్గరగా ఉన్న పంచంద్రియాలు, నిటారుగా నిలబడి దేహాక్షం మీదుగా అన్ని వైపులా త్వరితంగా పరిశీలించగలగడం ప్రకృతి సిద్ధంగా మానవజాతి సంతరించుకున్న విశిష్టతలు. మీదు మిక్కిలి చేతి వేళ్ల అమరికతో వస్తువుల్ని పట్టుకొనగలగడం, వస్తువుల్లి సాధనాలుగా, పరికరాలుగా మార్చుకోగలగడం మానవేతిహాసంలో మరో సంచలనం. ఈ నేల, ఈ గాలి, ఈ నీరు ఇవన్నీ అందరికీ అందించిన అవని తల్లి ఖండాంతర్గత చలనంలో ఏర్పడ్డ ఖండాలు, ద్వీపాలు, భూమి అంతటా విస్తరించిన జీవ జాతులు. మానవుడు తన జీవనం కోసం ప్రకృతిలో సంఘర్షించుకొంటూ ప్రకృతిలోని నియమాలను గుర్తించి ఆ నియమానుసారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాడు. క్రమేపీ కుటుంబ వ్యవస్థ, సమాజం, నాగరికత, చరిత్ర మానవజీవితంలో సరిపెట్టుకొన్నాయి.అంటే చరిత్రననుసరించి పరోక్షంగా మానవ సమాజం భూమి దగ్గరున్న వనరుల్ని వాడుకుంటున్న క్రమంలో తలెత్తిన ఘర్షణల ప్రతి రూపమేనన్నమాట.

భూమి, భూమిలోని వనరులు ఇవన్నీ భూమి తల్లి తన బిడ్డలైన మన కందరికీ యిస్తోంది. ఓ యింట్లో తల్లి తన బిడ్డల్ని అందర్నీ సమానంగానే ప్రేమిస్తుంది.సమానంగానే తాను చేసిన పిండివంటల్ని పంచిపెడ్తుంది.ఎవరైనా ఎక్కువగా దొంగచాటుగా తింటే మందలిస్తుంది. కాని భూమి తల్లికి మాటలు రావు.తన వనరుల్ని కొందరు అధిక మొత్తంలో కాజేస్తుంటే తాను ఏ రకంగా మందలించగలదు ? కొందరు తన శరీరంపై ఉన్న సారవంతమైన నేలల్ని వేలాది ఎకరాలు స్వంత ఆస్తిగా మార్చుకొంటుంటే, ఎన్నో కోట్ల మందికి కనీసం నిలువు నీడ కూడా లేని పరిస్థితుల్ని కలుగజేస్తుంటే భూమి తల్లి ఏం చేయగలదు? తన పర్యావరణాన్ని కలుషితం చేస్తూ లాభాపేక్ష పరమావధిగా పరిశ్రమల్ని నడుపుతున్న స్వార్థపరుల్ని ఏ విధంగా దారిన పెట్టగలదు ? వాతావరణ కాలుష్యానికి వారు కొందరే కారణం కాగా కోట్లాది ప్రజలందరిదీ ఆ పాపం అంటుంటే ఎలా వారించగలదు? మంచిని కోరే మానవులు, ఆలోచనాపరులు భూమి తల్లి గురించిన సర్వసత్యాలు తెలుసుకోవాలి. తద్వారా భూ వనరుల అసమాన పంపిణీ, వాడకాన్ని వారు ప్రశ్నించగలుగుతారు. ఒక వ్యక్తికి ఒకరే తల్లి. మనకందరికీ కూడా ఒకరే తల్లి.

ఆమే భూమాత.2007-2009 సంవత్సరాల కాలాన్ని ఐక్యరాజ్యసమితి "అంతర్జాతీయ భూ అవగాహనా కాలం" గా పరిగణించమని సూచిస్తూ 2008 సం.రాన్ని "అంతర్జాతీయ ధరిత్రీ సంవత్సరం" గా ప్రకటించమంది. జన విజ్ఞాన వేదిక 2008 సం.లో ఎన్నో కార్యక్రమాలను చేపట్టనుంది. ఇప్పటికే విజ్ఞాన్ ప్రసార్, ప్రసార భారతితో కలిసి 52 రేడియో ప్రసారాలను వెలువరించుటకు నిమగ్నమైంది. APCOST, DST వారి NCSTC వారి సహకారంతో సంవత్సరం పొడవునా ప్రజలలో భూమి గురించి సమగ్ర అవగాహన కల్పించుటకు కార్యక్రమాన్ని రూపొందిస్తుంది.భూమికి సంబంధించిన పలు విజ్ఞాన వేదిక రూపొందించింది. పలుచోట్ల సదస్సులు, సెమినార్లు, వర్క్ షాపులు ఏడాది పొడవునా నిర్వహించడంతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యేరీతిలో పుస్తకాలను, కరపత్రాలను, మల్టీమీడియా ప్రదర్శనలను రూపొందిస్తోంది.ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని తమ వంతు సహకారాన్ని అందించాలని జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి చేస్తుంది.

భారత అంతరిక్ష శాస్త్రవేత్తల ఘన విజయం

పి. మహేంద్రం, తాడూరు.

మార్చి 28 సోమవారం ఉదయం 9:24 నిమిషాలయింది. 50 గంటల కౌంట్‌డౌన్ ముగిసింది. పెద్ద శబ్ధం, కనులు మిరుమిట్లు గొలిపే వెలుతురు. పొగల మధ్య నుంచి ఆకాశంలోకి ఒక్క ఉదుటున దూసుకెళ్ళింది . అదే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పి.ఎస్.ఎల్.వి.)సి9. రాకెట్ మొదటి దశ మోటార్ల పని అయిపోయింది. 52 కిలో మీటలు ఆకాశంలోకి దూసుకెళ్ళింది. రెండవదశ మోటార్ల పని సక్రమంగా మొదలయింది. రాకెట్‌ని 125 కిలోమీటర్ల ఎత్తుకి తేసుకెళ్ళాయి. మూడవ దశ మోటార్లు 507 కి.మీ. ఎత్తుకి తేసుకెళ్ళాయి. చివరి దశ మోటార్లు రాకేట్‌ని భూమి నుంచి 636 కి.మీ. ఎత్తునకు తీసుకెళ్ళాయి. ఇదంతా 846 సెకండ్లలో జరిగిపోయింది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో మన శాస్త్రజ్ఞులందరు జాగ్రత్తగా రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఈసారి మనరాకెట్ ఏకంగా పది ఉపగ్రహాలని మోసుకెళ్ళింది. ఇందులో రెండు మనదేశానివి. మిగతావి 8, కెనడా, జర్మనీ, డెన్‌మార్క్, నెదర్లాండ్స్, జపాన్ దేశాలవి, 883 సెకండ్లు పూర్తయ్యాయి 637 కి.మీ. ఎత్తులో కార్టోసాట్ 2 ఎ ఉపగ్రహం కక్ష్యలోకి పవేశించింది. దీని బరువు 690 కేజీలు. 45 సెకండ్ల తరువార భరత్ సూక్ష్మ ఉపగ్రహం (ఐ.యం.ఎస్ - 1) కక్ష్యలోకి ప్రవేశించింది. తరువాత విదేశీ ఉపగ్రహాలన్ని వరుసగా ఒకదాని తరువాత ఒకటి కక్ష్యలో ప్రవేశించాయి. షార్‌లోని శాస్త్రజ్ఞులు ఒక్కసారి చిన్నపిల్లల్లా కేరింతలు, చప్పట్లు కొడుతూ ఒకర్నొకరు అభినందించుకున్నారు. ఇప్పటిదాకా రష్యా దేశం మాత్రమే 13 ఉపగ్రహాలని పంపించింది. తరువాత 10 ఉపగ్రహాలని పంపగలిగినది ప్రపంచంలో మన దేశం మాత్రమే.

కార్టోశాట్ 2 ఎ

కార్టోశాట్ 2 ఎ లో అత్యంత ఆధునిక కెమెరాని అమర్చారు. ఇది 9.6 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక మీటరు రెజల్యూషన్‌తో అతి స్పష్టంగా ఫొటోలు తీయగలదు. రోజుకి భూమి చుట్టూ 14 సార్లు తిరుగుతూ ప్రతీ 97 నిమిషాలకొకసారి మనదేశమీదుగా ప్రయాణిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలను చిత్రీకరిస్తూ ప్రకృతి వైపరిత్యాలను ముందుగానే పసిగట్టి మనకు సమాచారం అందిస్తుంది. భూ వనరులు, వ్యవసాయ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి భూమి మీదకు సమాచారం పంపిస్తుంది. దీని సామర్ధ్యం 64 గెగా బైట్స్. దీని జీవితకాలం 5 సంవత్సరాలు.

I.M.S - 1

ఇప్పటి దాకా 12 ఉపగ్రహాలని విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్ళిన పి.ఎస్.ఎల్.వి. ఇప్పుడు 13వ సారి ఏకంగా 10 ఉపగ్రహాలను ఆకాశంలోకి విజయవంతంగా మోసుకెళ్ళింది. భవిష్యత్తులో చంద్రయాన్ కార్యక్రమం కూడా పి.ఎస్.ఎల్.వి.ద్వారానే చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో చంద్రయాన్ కార్యక్రమాన్ని మన శాస్త్రజ్ఞులు చేపట్టాబోతున్నారు. మన అంతరిక్ష శాస్త్రజ్ఞులు ఎంతో దీక్షతో మన దేశ ప్రయోజనాల కోసం చేస్తున్న కృషి ఫలించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిద్దాం.

భారత సూక్ష్మ ఉపగ్రహం I.M.S - 1 బరువు 83 కిలోలు. దీనిలో మల్టీస్ప్రెక్టల్ కెమెరా, హైపర్ స్ప్రెక్టల్ కెమెరా వున్నాయి. మొదటి కెమెరా ఫొటోలు అంతరిక్ష పరిశోధనా విద్యార్థులకు ఉపయోగపడతాయి. రెండో కెమెరా ఫొటోలు దేశ అవసరాలకు ఉపయోగపడతాయి. దీని జీవిత కాలం 2 సంవత్సరాలు. ఎనిమిది విదేశీ నానోశాటిలైట్స్ కెనెడా, డెన్‌మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల్లోని విధ్యార్థులు తయారు చేసినవి. ఈ ఎనిమిది నానోశాటిలైట్లు ద్వారా రాబోయే కాలంలో నానోటెక్నాలజీని ఉపగ్రహాల తయారీలో ఎలా ఉపయోగించవచ్చు అనే విషయాన్ని పరిశీలిస్తారు.

భూకంపాలను ఇలా కొలుస్తారు

మన భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మన ఈ అందమైన భూగోళంపై ఎన్నో లక్షల భూకంపాలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని ప్రళయభీకరమైన శక్తితో విరుచుకుపడి నగరాలకు నగరాలనే పొట్టనబెట్టుకోగా, మరికొన్ని ఒక మాదిరి బీభత్సంతో సరిపెట్టుకున్నాయి. ఇలాంటి భారీ నష్టమేదీ కలిగించకుండా ఊరికే ఇలా వచ్చి అలా పోయిన భూకంపాల సంఖ్యా లక్షల్లోనే వుంది.

మీకు తెలుసో లేదో గానీ మన ఈ భూమ్మీద ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట భూకంపం అనేది వస్తూనే వుంది. అన్నట్లు ఈ భూకంపాలనేవి కేవలం నేల మీదే గాక సముద్రాల్లోనూ సంభవిస్తుంటాయి. ఇలా సముద్రాల్లో వచ్చినప్పుడు ఒకోసారి ఎంతో శక్తివంతమైన కెరటాలు ఉవ్వెత్తున లేచి నానా బీభత్సం సృష్టిస్తాయి. అంతేకాదు, ఒకోసారి ఈ అలలు వివిధ దేశాలకు చెందిన తీర ప్రాంతాలపై విరుచుకుపడి చెప్పలేనంత ధన, ప్రాణ నష్టానికి కారణమవుతుంటాయి. భూకంపాలు ఎలా వస్తాయి?, ఎందుకు వస్తాయి? అవి ఎంత తీవ్రంగా వుంటాయి? వంటి అంశాలపై శాస్త్రజ్ఞులు ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిశోధనలకు భూకంప మాపకం అనే యంత్రం ఎంతగానో తోడ్పడుతోంది. మన భూమ్మీద అనేక చిన్నచిన్న భూకంపాలు ప్రతిరోజూ అనేకం వచ్చిపోతున్నాయన్న విషయం ఈ యంత్రం వల్లనే వెలుగులోకి వచ్చింది. అదే విధంగా భూకంపాలు ఎక్కడంటే అక్కడరావని, కొన్ని నిర్థిష్టమైన ప్రాంతాల వద్ద మాత్రమే అవి వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుందన్న సంగతినీ శాస్త్రజ్ఞులు గుర్తించారు.

మొదటిదానికి 31 రెట్లు ఎక్కువ

మనదేశంలో కూడా గతంలో అనేక భయంకరమైన భూకంపాలు వచ్చాయి. అనేక ప్రాచీన నగరాలు, ముఖ్యంగా సింధు నాగరికతకు చెందిన పట్టణాలు వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి బీభత్సాల వల్లనే భూగర్భంలో కలిసిపోయాయని చరిత్రకారులు అంటున్నారు. వాటి సంగతిని అలా వుంచితే ఇటీవలి దశాబ్ధాలలో మహారాష్ట్రలోని లాతూర్‌లోనూ, ఆ తరువాత గుజరాత్‌లోనూ చాలా భయంకరమైన భూకంపాలు వచ్చాయి. గుజరాత్‌లో వచ్చిన భూకంపం అయితే రిక్టరు స్కేలుపై 7.9 కొలతను చూపించింది. అన్నట్లు ఈ రిక్టరు స్కేలుకు సంబంధించిన కొన్ని అంశాలు ఆసక్తికరంగా వుంటాయి.

సిస్మోగ్రాఫ్

పెన్ను తాకే ప్రదేశానికి ఈ గీతలు ఎంతపైకీ కిందికీ సాగితే ... వచ్చిన భూకంపం అంత శక్తివంతమైనదని అర్థం. అంటే గీతలు పొట్టిగా వుంటే తక్కువ స్థాయి భూకంపం, అలాగాక చాలా పొడవుగా వుంటే (నిలువుగా) ఎక్కువగా స్థాయి భూకంపం వచ్చినట్లుగా అర్థం. పెన్ను తాకే ప్రదేశానికి ఈ గీతలు ఎంతపైకీ కిందికీ సాగితే ... వచ్చిన భూకంపం అంత శక్తివంతమైనదని అర్థం. అంటే గీతలు పొట్టిగా వుంటే తక్కువ స్థాయి భూకంపం, అలాగాక చాలా పొడవుగా వుంటే (నిలువుగా) ఎక్కువగా స్థాయి భూకంపం వచ్చినట్లుగా అర్థం.

1935లో చార్లెస్ ఫ్రాంసిస్ రిక్టర్ అనే శాస్త్రజ్ఞుడు భూకంపాలను కొలిచేందుకు ఉపయోగించే సాధనాన్నే సిస్మోగ్రాఫ్ అని అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

ముందుగా అక్కడ ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ సాధనంలో ... కాంక్రీటుతో చేసిన ఒక ఆధారం మీద ఒక పక్కన ఓ స్టాండు ఏర్పాటు చేయబడుతుంది. ఆ స్టాండు నుంచి ఒక స్ప్రింగు, ఆ స్ప్రింగుకి ఒక బరువు వేలాడదీయబడతాయి. స్ప్రింగుకి వేలాడదీసిన బరువుకి ఓ పక్కగా ఒక పెన్ను లాంటిది బిగిస్తారు. ఈ పెన్ను తాలూకూ మూతి భాగం,

గిరగిరా తిరిగే ఒక డ్రమ్ముపై భాగాన్ని తాకుతూ వుంటుంది. అన్నట్లు ఈ డ్రమ్ముపై భాగమంతటా ఓ కాగితం చుట్టబడి వుంటుంది. భూకంపం వచ్చినప్పుడు ... స్ప్రింగు మూలంగా దానికి వేలాడదీసిన బరువు స్థిరంగా వుంటుంది. కాని కుడివైపున ఉన్న డ్రమ్ముకి అలాంటి ఏర్పాటూ ఏదీ లేకపోవడంతో అది పైకీ కిందికీ కదులుతూ వుంటుంది. ఓ పక్కన డ్రమ్ము గుండ్రంగా తిరుగుతూనే, మరో పక్క పైకీ కిందకీ కదులుతుంది. దాని మూలంగా డ్రమ్ము ఉపరితల భాగంలో ఉన్న కాగితం మీద పెన్నుతో గీతలు పడుతూ వుంటాయి. డ్రమ్ము మీద, అలాగే పటం కింది భాగంలోనూ ఇచ్చిన గీతలను ఒకసారి గమనించండి.

పెన్ను తాకే ప్రదేశానికి ఈ గీతలు ఎంతపైకీ కిందికీ సాగితే ... వచ్చిన భూకంపం అంత శక్తివంతమైనదని అర్థం. అంటే గీతలు పొట్టిగా వుంటే తక్కువ స్థాయి భూకంపం, అలాగాక చాలా పొడవుగా వుంటే (నిలువుగా) ఎక్కువగా స్థాయి భూకంపం వచ్చినట్లుగా అర్థం.

విజ్ఞాన శాస్త్రంలో అనుకోని అద్భుత ఆవిష్కరణలు

ప్రయోగశాలలో తయారుకాబడిన మొట్టమొదటి వర్ణద్రవ్యం కూడా అనుకోకుండా కనిపెట్టబడినదే. పెర్కిన్ అనే శాస్త్రవేత్త ఎంతో కీర్తి గడించేందుకు సాయపడింది. అప్పుడు ఆయన వయస్సు 18 ఏళ్ళు. ఆయన ప్రఖ్యాత జర్మన్ శాస్త్రజ్ఞుడైన హాఫ్‌మన్ దగ్గర పనిచేస్తుండేవాడు. ఆ రోజుల్లో మలేరియా చికిత్సకు సింకొనా చెట్టు బెరడునుంచి తీసిన క్వినైన్‌ను విరివిగా ఉపయోగించేవారు. ఒకరోజు హాఫ్‌మన్ తన ప్రసంగంలో ఒక సవాల్ విసిరాడు. కోల్‌తార్ నుంచి క్వినైన్‌ను తయారు చేయడమే ఆ సవాల్. పెర్కిన్ సెలవుల్లో ఇంటికి వెళ్ళాడు. రసాయన శాస్త్రంలో తనకున్న పరిజ్ఞానంతో క్వినైన్ తయారు చేయడం గురించి ప్రయోగాలు చేయాలనుకున్నాడు. కోల్‌తార్ నుంచి సేకరించిన నూనె వంటి ఎనిలీన్ ఆయన దగ్గర ఉంది.

దానికి సోడియం డైక్రోమేట్, సల్ఫ్యూరికామ్లం కలిపి ఆక్సీకరణం చేస్తే క్వినైన్ లభిస్తుందేమో అనుకున్నాడు. ప్రయోగం ప్రారంభించాడు. ఆయన ఊహించినట్లుగా తెల్లటి స్పటికాలు రాలేదు. కాని నల్లటి జిగురువంటి పదార్ధం వచ్చింది. పెర్కిన్‌కు చిరాకు వచ్చింది. అసహనంతో ఆ పదార్ధాన్ని సింక్‌లో పారబోశాడు. పరీక్షనాళికను ఆల్కహాల్‌తో శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఆశ్చర్యంగా అందమైన పింక్‌రంగు ద్రావణం లభించింది.ఇది సిల్క్, ఉన్నికి శాశ్వతంగా అంటుకుని వేర్వేరు చాయల్లో పింక్‌రంగును ఇచ్చింది.

ఇదే మొట్టమొదటి సింథటిక్ వర్ణద్రవ్యం. పెర్కిన్ దీనికి నూనె "మావె" అని పేరు పెట్టాడు. పారిశ్రామికంగా దీని ప్రాధాన్యతను ఊహించి, మావె తయారీకి ఒక ఫాక్టరీ నెలకొల్పాడు. కర్బన రసాయనాల పరిశ్రమకు ఈ ఆవిష్కరణ దారితీసింది.

ఇండిగో (నీలిమందు)

సాప్పర్ అనే ఆయన నాఫ్తలీన్‌కు ఫ్యూమింగ్ సల్ఫ్యూరికామ్లం కలిపి ప్రయోగాలు చేస్తుండేవాడు. ఒకరోజు ఆ చర్యామిశ్రమాన్ని కలియబెట్టేందుకు గాజుకడ్డీ కోసం వెతికాడు. ఏదో పరధ్యానంలో ఉండి, చేతికందిన ధర్మామీటర్‌ను తీసుకుని కలియబెడుతుండగా, ధర్మామీటర్ పగిలి పాదరసం బయటికి వచ్చింది. చర్యా మిశ్రమంలోని సల్ఫ్యూరికామ్లంతో చర్య జరగడం వల్ల మెర్కురిక్ సల్ఫేట్ ఏర్పడింది. ఇది ఉత్ప్రేరకంగా పనిచేయడం వల్ల నాఫ్తలీన్ ఆక్సీకరణం జరిగి ఫ్తాలిక్ ఎన్‌హైడ్రైడ్ ఏర్పడింది. దీనిని చాలా సులభంగా నీలి మందుగా మార్చడం సాధ్యపడింది.

ప్లాస్టిక్‌లు

ప్లాస్టిక్ పరిశ్రమలో గొప్ప ఆవిష్కరణలు యాదృచ్చికంగా జరిగినవే. టెప్లాన్, పాలిథీన్, పివిసి, నియోప్రీన్‌రబ్బర్, వంటివి ఎన్నో యాదృచ్చికంగానో, ప్రమాదవశాత్తు లేదా రసాయనాల్లో ఉన్న మలినాల వల్లనే కనుక్కోబడినవి. టెప్లాన్ ఎంతో ఉపయోగకరమైన ప్లాస్టిక్. రాయ్‌ప్లన్‌కెట్ అనే ఆయన దీనిని యాదృచ్చికంగా కనుగొన్నాడు. ఈయన రసాయనశాస్త్రంలో డాక్టరేట్ పట్టా తీసుకుని, డ్యుపాంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. టెట్రాఫ్లోరో ఇథీన్‌ను ఉపయోగించి విష స్వభావం లేని రిఫ్రిజిరెంట్‌ను తయారు చేసేందుకు ఆయన ప్రయోగాలు చేస్తుండేనాడు. ఒకరోజు ఈ గ్యాస్‌తో నిండి ఉన్న సిలిండర్‌ను తెరిచినా గ్యాస్ బయటకి రాలేదు. సిలిండర్ ఖాళీ అయిపోయిందేమో అనుకుని చూస్తే బరువుగా ఉంది. అంటే దాని నిండా గ్యాస్ ఉంది. పోనీ సిలిండర్ వాల్వ్ చెడిపోయిందేమో అనుకునిచూస్తే అది కూడా బాగానే ఉంది. ప్లన్‌కెట్ వేరే సిలిండర్ కోసం ప్రయత్నించలేదు. సిలిండర్ బరువుగా ఉంది. కాని గ్యాస్ ఎందుకు బయటికి రావడం లేదు.
ఏదో జరిగి ఉంటుందనుకున్నాడు. ఒక సాహసం చేశాడు. ఒక రంపం తీసుకుని సిలిండర్‌ను సగానికి కోశాడు. సిలీండర్ రెండు చెక్కలయింది. లోపల చూస్తే, కొవ్వు లాంటి తెల్లటి పౌడర్ కనిపించింది. అంటే దానిలోని గ్యాస్ పౌడర్‌గా మారిపోయింది. ప్లన్‌కెట్‌కు ఏం జరిగిందో అర్థమయింది. టెట్రాఫ్లోరో ఇథీన్ పొలిమరీ కరణం చెంది ఉంటుందని ఊహించాడు. ఆ తర్వాత ఎన్నో పరీక్షల ద్వారా, టెఫ్లాన్‌ను తయారు చేసే పద్ధతి తెలిసింది. ఎన్నో వందల కోట్ల రూపాయల పరిశ్రమ రూపుదిద్దుకుంది.
ఈ అనుకోని ఆవిష్కరణలన్నీ మనకు ఏమి చెబుతున్నాయి? మనం ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఏదైనా అవసరంలేదనుకున్న పదార్థం రావచ్చు. అలాంటిదాన్ని మరీ తొందరగా విసిరిపారేయకూడదు. అదేవిధంగా ఏదైనా అసాధారణమైన రంగుగాని, అనుకోని చోట స్పటికాల వంటివి కూడా ఏర్పడవచ్చు. ఇలాంటి వాటిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సంఘటనలను ప్రశ్నించాలి? కారణాలు అన్వేషిస్తే అద్భుతాలు బయటపడవచ్చు.

సైన్సులో నూతన సత్యాలు - సమస్యలు

బి. రాము , కాట్రేనికోన.

20వ శతాబ్ధంలో అవిష్కృతమైన ముఖ్యమైన మౌళిక సత్యం. "ద్రవ్యం శక్తిగాను, శక్తి ద్రవ్యంగానూ మారుతుంది." అయితే, ఈ సత్యంపై ప్రశ్నలు -

ద్రవ్యం శక్తిగా ఏ విధంగా మారుతుంది... ద్రవ్యం నశించా? లేదా మరణించా? లేదా మాయమయ్యా?

'ప్రెసెంట్ సైన్సు' ప్రెసెంట్ సైన్సు ఏమి చెబుతున్నదంటే - ద్రవ్యం, శక్తి - రెండు రాశులు. ఒక రాశిలో తరుగుదల రెండవ రాశిలో పెరుగుదలను సూచిస్తుంది. అందువల్ల - రెండూ పరస్పర సంబంధం కలిగిన రాశులుగా పేర్కొంటున్నది. ఈ సంబంధం ఆధారంగా ఈ రెండిటిని కలిపి - ఏక రాశిగా చెబుతున్నది కానీ నిజానికి ఈ రెండూ ' ఒక రాశి ' గా చెప్పాలంటె - ఈ రెండింటి 'నిర్మితి'కి మూలమైన అంశం ఒక్కటే అని చెప్పగలగాలి. కానీ ప్రెసెంట్ సైన్సు అలా చెప్పడం లేదు.

ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంది అని తెలుపుతుంది. ద్రవ్యం నశించి - ఆ నశించిన ద్రవ్యం శక్తిగా మారుతుందని ద్రవ్యానికి నశింపు ఉందని ప్రెసెంట్ సైన్సు తెలుపుతొంది.

అయితే 'ద్రవ్యానికి నాశనం లేదు' అనే సత్యం ప్రెసెంట్ సైన్సు ను నూతనంగా చూపిస్తుంది. ప్రెసెంట్ సైన్సు ఎదుర్కొంటున్న అనేక వైరుధ్యాలను సమన్వయం చేస్తుంది. దృగ్విషయాలను వ్యాఖ్యానించడంలో నూతన మార్గాలను, దృక్పథాన్ని అందిస్తుంది.

ప్రెసెంట్ సైన్సు ఎదుర్కొంటున్న సమస్యలు -

  1. కాంతి ప్రసారానికి మాధ్యమం అక్కరలేదు అంటుంది. ఎందుకు అవసర లేకుండా పోయిందో సక్రమంగా వివరించలేకపోయింది.
  2. 'కాంతి వేగం - నిరపేక్షమైనది'. ఇది ఒక మౌలిక సత్యంగా గ్రహించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ - తన సాపేక్ష సిద్ధంతంలో కాంతి నిరపేక్షతను సాధించేందుకు లేదా వివరించేందుకు - మిగిలిన రాశులను సపేక్షం చేసి వాటి విలువలను హెచ్చుతగ్గులు చేశాడు.

కాంతివేగం నిరపేక్షత కోసమే అని సాపేక్షమయ్యాయి. అయితే ఈ విశ్వంలో కాంతివేగం ఎందుకు నిరపేక్షంగా కనిపిస్తున్నది? అన్న ప్రశ్నకు సమాదానం లేదు.
'కాంతి వేగం'ను దృష్టిలో పెట్టుకొని - మిగిలిన అన్ని రాశులు తమ విలువలను ఎందుకు సవరించుకోవాలి?
ఈ విశ్వసృష్టిలో 'కాంతివేగం' అందలం ఎక్కి - మిగిలిన రాశులన్ని దానికి అనుగుణంగా అణగమణిగి ఎందుకున్నాయి?
ఈ సృష్టిలో అటువంటి వివక్ష ఉండదుకదా? మనతార్కికత కూడా దీనిని అంగీకరంచదు కదా?

దానికి సమాధానం -

"కాంతి వేగం ఎందుకు నిరపేక్షంగా కనిపిస్తున్నది?" అనే ప్రశ్నకు సమాధానం కనుగొనడమే. కాంతి వేగానికి మించిన వేగాలు ఉన్నాయని అశాస్త్రీయంగా అనుకొనడం కాదు.

  1. శక్తుల మధ్య అంతర సంబంధలను గుర్తించాలంటే - శక్తులను వర్గీకరించడం అవసరం. శక్తులు నాలుగు రకాలుగా ప్రెసెంట్ సైన్సు పేర్కొంటున్నది. కానీ - దీనికి ప్రాతిపదిక ఏమిటి? తెలుపలేకపోయింది.
  2. కణం, తరంగం రెండూ వేర్వేరా? ఒకటే అయితే వాటి మధ్య సంబంధ ఏమిటి? అనేది ప్రెసెంట్ సైన్సు స్పష్టమైన సమాథానం ఇవ్వడం లేదు. అలా ఇవ్వలేకపోవడానికి కారణం ప్రెసెంట్ సైన్సు కు ఉన్న, ' ప్రత్యేక దృక్పథాలు '.
  3. 'చలనశక్తి ' ని ద్రవ్యం నుంచె వేరుచేసి ఒక 'ప్రత్యేక రాశి'గా చూపే శాస్త్రీయ అధారం ఏదీలేదు. కాకపోతే ' చలనశక్తి ' ఒక పదార్ధ నుండి మరొక పదార్థానికి (ట్రాన్స్‌ఫర్) - బదలాయించగలం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే - ద్రవ్యం నుంచి వేరుపడకుండానే - ' చలనశక్తి ' ద్రవ్యంగాఎలా మారుతుందో లేదా ఇతర శక్తి రూపాంతరాలుగా ఎలా మారుతుందో - ప్రెసెంట్ సైన్సు వివరించడం లేదు.
  4. కాంతిని ఉత్పత్తి చెయ్యడంలో మనం విద్యుత్తును వినియోగించుకుంటున్నాము. ఇక్కడ ఎలక్ట్రాన్ (ద్రవ్యం) నష్టం లేదా తరుగుదల లేదని, ' చలనశక్తి ' కాంతి శక్తిగా మారుతుందని చెబుతున్నాం. అయితే ఇక్కడ కాంతి జనకంలో ఎలక్ట్రాన్ల పాత్ర ఏమీలేదా? ఉంటే దాని పాత్ర ఏమిటి?
  5. ఒక రాయిపై నుంచి పడితే - అది నేలను తాకి ఉష్ణాన్ని నిప్పురవ్వలను (కాంతిని) ఇస్తుంది. దానికి ప్రస్తుత వివరణ ఏమిటంటే - ఆ రాయి యొక్క ' చలనశక్తి ' కాంతిగా మారిందనే. అయితే ఆ రాయి నేలను తాకినప్పుడు ఏర్పడిన ఘర్షణ ఫలితంగా ఆ రాయి నుంచి ఎలక్ట్రానులు వెలువడతాయి. ఆ నిప్పురవ్వల (కాంతి) సాక్షాత్కారంలో ఈ ఎలక్ట్రానులు పాత్ర ఏమీలేదా?
  6. ద్రవ్యానికి నశింపు లేదు ' అనే ఒక మౌలిక ప్రాకృతిక సత్యం పై ప్రశ్నలకు - సమాధానాలను కనుగొనడంలో నూతన దృక్పధాన్ని అందిస్తుంది. పై ప్రశ్నలకు, సందేహాలకు నూతన సమాధానాలను, పరిష్కారాలను తెలుపుతుంది.

ద్రవ్యానికి నశింపు లేదు ' అనే దానిని ఒక మౌలిక సార్వజనీన సత్యంగా నేను నిరూపించే ప్రయత్నం - "A NEW STORY OF ప్రెసెంట్ సైన్సు" అనే రచనలో కనిపిస్తుంది.' ద్రవ్యానికి నశింపు లేదు.' 'ద్రవం నశించదు'. అనే సత్యం ఏ విధంగా ద్రవ్యంలో తరుగుదల (నశింపు)ను గుర్తిస్తే - ఆ తరిగిన ద్రవ్యం - ఆ ద్రవ్యం నుండి వెలువడిన Radiation, Electromagnatic Waves లో, వెతికే ప్రయత్నం చేశాను.

విద్యుదయస్కాంత తరంగాలు ద్రవ్య సహితాలు.' అని నిరూపించే చిన్న ప్రయోగం ఇక్కడ వివరిస్తాను. విద్యుదయస్కాంత తరంగాలలో ద్రవ్యం లేదని అవి కేవలం ఆవేశాలు అని ప్రెసెంట్ సైన్సు చెబుతోంది. ద్రవ్యం యొక్క 'ఉనికి'ని మనం 'భారం', 'ఘర్షణ' వంటి ప్రక్రియల ద్వారా గుర్తిస్తున్నాము. 'భారం', 'ఘర్షణ' ద్వారా ద్రవ్యం ఉనికిని గుర్తించలేకపోతే - ఇక ద్రవ్యం లేనట్లేనా? - ద్రవ్యం ఉనికిని కనిపెట్టడానికి భారం, ఘర్షణలు కాకుండా వేరు మార్గాలు లేవా? అని ప్రశ్నించుకుంటే - భారం, ఘర్షణలతో సంబంధం లేకుండా - ద్రవ్యం ఉనికిని గుర్తించే మార్గం మరొకటి ఉంది. అది - 'చలనం' మనం భూమి మీద నడుస్తూ ఉన్నాం అనుకోండి. విశ్వాంతరాళంలోంచి మనలను చూడగలిగితే - మనకు ఒక్క చలనమే ఉండదు. మన నడక + భూమితో పాటు మనం చలిస్తాం + భూమి సౌరకుటుంబంలో ఉంది కాబట్టి సౌరకుటుంబంతో పాటు చలిస్తాం + సౌరకుటుంబం చలిస్తుంది కాబట్టి దానితో పాటు చలిస్తాం + గెలాక్సీతో పాటు చలిస్తాం... ఇన్ని చలనాలు మనకు ఉన్నాయి. కేవలం నడక అనే ఒక్క చలనం కాదు.
'నడక' అనే వ్యక్తిగత చలనంతో పాటు మనం ఉన్న 'పరిసరం' చలనాన్ని కూడా వ్యక్తం చేస్తాం. ఇది ద్రవ్యం యొక్క ధర్మంగా గుర్తించగలిగితే - ఈ ' చలనం' ద్వారా 'ద్రవ్యం ఉనికి'ని గుర్తించవచ్చును.
ద్రవ్యానికి ఉన్న ఈ 'భిన్న చలనాలు' - చిత్రమైన ఫలితాలను అందిస్తున్నది. ఒక చిత్రమైన ఫలితం ఏమిటంటే ఒక రైలు పెట్టెలో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి. ప్రయాణిస్తున్న ఒక రైలు పెట్టెను ఈ క్రింది చిత్రంలో చూడండి.

రైలు పెట్టి ఇటువైపు అంచు 'A', అటు వైపు అంచు 'B' మరియు AB మధ్యన సమాన దూరంలో 'C' అనే వ్యక్తి ఉన్నాడు.
'C' అనే వ్యక్తి, రైలు ప్రయాణిస్తున్న దిశలో 'B' వైపుకు ఒక రాయి విసిరాడు. అదే విధంగా రైలు ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేకదిశలో అంటే 'A' వైపుకు ఒక రాయ విసిరాడు.
ఆ రాయికి ఒకే ఒక్క 'వ్యక్తిగత వేగం' ఉన్నట్లయితే - ప్రయాణిస్తున్న రైలుబోగిలో 'A' సైడుకి రాయి ప్రయాణించాల్సిన దూరం తక్కువగానూ, అదే విధంగా 'B' సైడుకు రాయి ప్రయాణించాల్సిన దూరం ఎక్కువగానూ ఉండాలి.
వాస్తవంలో అలాజరుగదు. వాస్తవానికి రెండు రాళ్ళు, రెండు వైపులకు అంటే 'A','B' వైపులకు సమాన దూరాలను ప్రయాణించి చేరుకుంటాయి. అంతే తప్ప 'A' వైపుకు తక్కువ దూరం. 'B' వైపుకు ఎక్కువదూరం ప్రయాణించవు.కారణం రైలుతో పాటు A,B,C లు మరియు రాళ్ళు _ఇవన్ని రైలుతో పాటు రైలంత వేగంతోనే ప్రయాణిస్తున్నాయి. కాబట్టి రైలువేగం అనేది వాటికి ఉమ్మడి అంశం' ఈ రైలు వేగం వాటి మధ్య దూరాలను మార్చలేదు. కాబట్టి A,B,C మరియు C వద్ద నున్న రాళ్ళు (D,E) వాటి మధ్య దూరాల మార్పు విషయంలో రైలు వేగాన్ని (ఉమ్మడి వేగాన్ని) పరిగణించరాదు.

  1. రైలు బోగిలో ఉన్న వారు చూస్తే - రాయి యొక్క 'వ్యక్తిగత' వేగాలు మాత్రమే కనిపిస్తాయి. బయటవారు చూడగలిగితే - రైలు వేగంతో పాటు ఆ రాళ్ళ యొక్క వ్యక్తిగత వేగాన్ని గమనించగలుగుతారు. (వేరువేరుగా కూడా)
  2. రైలు ప్రయాణించే మార్గంలోనూ - అదే విధంగా దాని వ్యతిరేక మార్గంలోనూ రెండు వైపులా ప్రయాణించిన రాళ్ళు 'సమాన దూరాల'నే ప్రయాణించి A,B అంచులను చేరుకున్నాయి. వేరువేరు దిశలయినప్పటికీ దూరాలలో మార్పు రాకపోవడనికి కారణం - 'దూరం నిరపేక్షమైనది' అని నిర్ధారించుకోవడం కాదు.
    A,B,C లు రాళ్ళు అన్నిటికీ రైలు వేగం ఉమ్మడిగా ఉండడమే. అవన్నీరైలుతో పాటు ప్రయాణిస్తున్నాయి.
  3. కాబట్టి ఇక్కడ ఉమ్మడి వేగాలను పరిగణలోకి తీసుకొనరాదు.
    మెకల్సన్. మోర్లీల ప్రయోగంలో కాంతి కిరణాన్ని ఈ రాయితో పోల్చాలి.

రైలులో - రాయిని ఏ దిశలో విసిరిన అది ప్రయాణించాల్సిన దూరాన్ని రైలు వేగం ప్రభావితం చెయ్యదు.
అదే విధంగా కాంతి కిరణం భూమి మీద ఏ దిశలో ప్రయాణించినా దాని వేగం లెక్కించడంలొ - భూ వేగాన్ని పరిగణలోనికి తీసుకోరాదు.
మరొక విధంగా చెప్పాలంటే - కాంతి కిరణం భూమి మీద ఏ దిశలో ప్రయాణించినా దాని వేగం పెరగదు తరగదు. - మెకల్సన్ మేర్లీల ప్రయోగ ఫలితాలు దీనినే నిరూపిస్తున్నాయి. అంతే తప్ప కాంతి వేగం నిరపేక్షమని కాదు.
రైలులో విసిరిన రాయికి ఏ విధంగా వ్యక్తిగత వేగం, ఉమ్మడి వేగాలు ఉన్నాయో - అదే విధంగా కాంతికి తనదైన వ్యక్తిగత వేగం ఉమ్మడి వేగాలూ ఉన్నాయి.రాయి అనే ద్రవ్యం ప్రదర్సించిన 'చలనధర్మాలనే' - కాంతి కిరణం ప్రదర్శించింది. రాయి అనేది ద్రవ్యం. అవే ధర్మాలను ప్రదర్శించిన కాంతి కిరణం ద్రవ్యమని నిర్ధారించవచ్చును.

విజ్ఞాన శాస్త్రములో మైలురాళ్ళు

క్రీ.శ. 100

క్రీ.శ. 130 : (SORANUS) సొరానస్ అనే గ్రీకు వైద్యుడు చిన్న పిల్లల, గర్భిణీ స్త్రీల వ్యాధుల గురించి విశేష కృషి చేసాడు. బాలింతలు చిన్న పిల్లల పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తల గురించి సూచించాడు. ఈయన ప్రతిపాదించిన ఆరోగ్య సూత్రాలు దాదాపు 1500 సం. ల పాటు ప్రజలు పాటించారు.
క్రీ.శ. 140 : (ARETAEUS) అరిటాస్ శ్వాసకు సంబంధించిన ఆరోగ్యం ఎలా పనిచేస్తుందో ఇతడు గుర్తించాడు.

క్రీ.శ.160: గాలెన్ (Galen) అనే గ్రీకు దేశపు మానవ శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు విశేష కృషి, చేసాడు. మధ్య యుగాల వరకు ఈయన తెలిపిన విషయాలే శరీర నిర్మాణంను గురించి తెలుసుకొనుటకు మూల ఆధారాలుగా నిలిచాయి. “తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేని వైద్యుడు ఇతరుల ఆరోగ్యాన్ని ఏం కాపాడతాడు” అని ప్రజలు భావిస్తారని గాలెన్ చెపుతుండేవాడు.
మానవుడు తిన్న ఆహారం కాలేయంలో రక్తంగా మారుతుందని, ఆ రక్తం, రక్తనాళాల ద్వారా ప్రవహించి గుండెకు చేరుకొని, అక్కడ నుండి (Diaphragm) ఉదరవితానం ద్వారా కుడి నుండి ఎడమ వైపుకు పోతుందని అక్కడ నుండి శరీరంలోకి మాయమవుతుందని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం రక్తం వలయాకారంలో ప్రసరించదు.

16వ శతాబ్దంలోవిలియం హార్వే ప్రయోగ పూర్వకంగా ప్రసరణ వలయాకారంగా జరుగుతుందని ఋజువు చేసే వరకు అంటే సుమారు 1400 సంవత్సరాలు పాటు గాలెన్ ప్రతిపాదనలనే నమ్మారు.

క్రీ.శ.165: మధ్యధరా ప్రాంతంలో 15 సం,,ల పాటు మశూచీ, (దీనిని కూడా ప్లేగు అనే వారు) దాదాపు 75% జనాభాను కబళించి వేసింది.

క్రీ.శ. 200

నివాస ప్రాంతాలను కలుపుతూ సుమారు 80 వేల కిలోమీటర్ల పొడవు రహదారులను రోమ్ దేశంలో నిర్మించారు. తద్వారా సామాజిక, వాణిజ్య సంబంధాలు మెరుగు పడటమే కాకుండా, జంతు, పశు పక్షాద్యుల జీవన విధానం సుఖప్రదమైనది.
భారతదేశంలో బౌద్ద మతానికి చెందిన నాగార్జునుడు మాధ్యమిక అనే ఆలోచనా విధానం ద్వారా శూన్య భావనను (Empty Ness) ను ప్రస్తావించాడు.

క్రీ.శ. 206 : వ్యవస్థీకృత మురుగు కాలవల ఏర్పాటుతో మొదటిసారిగా రోమ్ నగరంలో, స్నానపు గదులు, పాయఖానాలను నిర్మించారు.

క్రీ.శ. 300

క్రీ.శ. 370 : (St.Basil) సెయింటోబాసిల్ కుష్టివ్యాధితో బాధపడే వారికోసం ఆసుపత్రులను ఏర్పాటు చేసాడు. అప్పటి దాకా ఈ వ్యాధిగ్రస్తులను, లోయలలో పడవేయటం ద్వారా సమాజ బహిష్కరణ చేసేవారు.
క్రీ.శ. 397 :- రోమ్ దేశంలో ఫెబీయోలా అనే మహిళ తొలిసారిగా ఉచిత ప్రజా వైద్యశాలను ప్రారంభించింది. ఈ స్పూర్తితోనే, పలు దేశాలలో ప్రభుత్వ రంగ ఆసుపత్రులు ఏర్పడ్డాయి.

క్రీ.శ. 400

దక్షిణ అమెరికా సముద్రతీరానికి 2200 మైళ్ళ దూరంలో ఉన్న ఈస్టర్ ద్వీపాలలో పాలినేషియన్ల వలసలు వెళ్ళారు. నేటికి సంభ్రమాశ్చర్యాలను గొలిపే మానవ శిలా రూపాలను, అగ్ని పర్వతరాళ్ళను చెక్కి తయారు చేసారు. అయితే ఈ శిలలు క్రీ.శ. 400 శతాబ్దం నాటివి కావని, ఇవి పైలోకాల నుండి అదే రూపంలో ఎన్నో లక్షల సం,,రాల నుండి ఈస్టర్ దీవులలోవున్నాయని కొందరు అశాస్త్రీయవాదులు, పరిణామవాదాన్ని వ్యతిరేకించేవారు కట్టు కథలు అల్లుతున్నారు.

క్రీ.శ. 400:-దక్షిణ భారత దేశంలో మహాయాన బౌద్దమత వ్యాప్తి జరిగింది. విగ్రహారాధననూ, దైవభావననూ వ్యతిరేకించే మీమాంస బలపడింది. ఇది బౌద్దమత వ్యాప్తిలో ఉచ్ఛస్త దశ అనవచ్చు. అయితే క్రమేపీ హేతువాదాన్ని వ్యతిరేకించే కొందరూ హిందుమత ఛాందసులు బౌద్దమతం పైదాడి ప్రారంభించారు.

క్రీ.శ. 402:-భారతదేశంలో చైనా సందర్శకుడు ఫాహియాన్ రావడంతో, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. బౌద్దమతములోని ఎన్నో హేతువాద దోరణులను ప్రతిభింభించే సంస్కృత భాషా పుస్తకాలను ఫాహియాను తనవెంట వెంట తీసుకెళ్లి అక్కడ అనువదించాడు.

క్రీ.శ. 415:-ప్రపంచ వైజ్ఞానిక శాస్త్ర చరిత్రలో ఒకటి చీకటి సంవత్సరము ఇది. అశాస్త్రీయ చాంధసవాదుల సంస్కృతిని ప్రతిభింభించిన ఘటన ఈ సంవత్సరం జరిగింది.

అది అలెగ్జాండ్రీయా నగరం, గ్రీకు, ఈజిప్టు మేధావి గొప్ప భౌతిక గణిత శాస్త్ర బోధకురాలు హైపేషియా అప్పటికే ఎన్నో శాస్త్రీయా ప్రచార కార్య క్రమాలలో పాల్గొంది. చాందస భావాలను వ్యతిరేకించినది. ప్రయోగ ఫలితాల ద్వారా ఋజువు కాబడిన దానినే నమ్మాలని ప్రచారం చేసేది. మత భావాలకు ఈమె తన యొక్క భౌతిక గణిత శాస్త్ర ప్రచారంతో ప్రజాస్వామికాన్ని శాస్త్రీయ దృక్ఫధం పెంపొందించుతుండటంతో అసహానులైన మత చాందసులు ఈమెను నడిరోడ్డు పై పట్ట పగలే బ్రతికుండగానే గవ్వలతో ఆమె దేహాన్ని చెక్కి చంపారు.

క్రీ.శ. 480:-భారతదేశంలో శాస్త్రాన్ని అడ్డుకోవడానికి హిందూమత ప్రచారకులు, తాంత్రిక పద్ధతులను వ్యాప్తి చేశారు. కొన్ని పనులు ఎడమ చేతితో, మరికొన్ని పనులు కుడి చేతితో చేయాలనీ రకరకాల ఆచారాలను, పద్దతులను, మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారు.

క్రీ.శ. 500

భారతదేశం, శ్రీలంక దేశాలకు, మధ్య భూమార్గం బదులుగా సముద్రమార్గం వాణిజ్యం ప్రారంభమైనది.
క్రీ.శ. 500 :-కొరియా దేశం నుంచి జపాను దేశానికి భౌధ్ధమత ఆలోచనలు, భౌద్ధమత ప్రచారం, జరిగింది. అంత వరకు జపాను దేశంలో ప్రజలు అతీంద్రీయ శక్తుల్ని నమ్మేవారు.

క్రీ.శ. 500:- పశ్చిమ ఐరోపాలో వ్యవసాయ పనులకు ఇనుప పనిముట్లు, ఇతర వ్యవసాయ, పనిముట్లు వాడనారంభించారు.
క్రీ.శ. 500:- మొదటి సారిగా ఐరోపాలో సబ్బు తయారీ అయితే ఈ సబ్బుని కేవలం బట్టలు ఉతకడానికి మాత్రమే వాడేవారు. స్నానాల సబ్బు అప్పటికి ఇంకా తయారీ కాలేదు.

క్రీ.శ. 510:-చైనా దేశంలో తొలిసారిగా వ్రాత పేజీలను ఒత్తలుగా చేసి దళసరి అట్టలతో బైండింగ్ విధానమును ప్రవేశపెట్టారు.

క్రీ.శ. 512:-చెట్ల పసరు,.బెరడు, వేర్లు, కాయరసాలు, గింజలు, ముట్టెలు, ఆకులు , పుష్పాలు, తదితర వృక్షసంబంధ ద్రవ్యాలతో ఔషదాలుగా పనికివచ్చే దాతువులున్నాయని గుర్తించారు. ఇవి చైనా, భారతదేశాలలో విరివిగా వాడుకలోకి వచ్చాయి.
మీరందరూ వేసవి సెలవుల తరువాత మీమీ పాఠశాలలలో కొత్త తరగతులలో ప్రవేశించివుంటారు. ఒక తరగతి తర్వాత మరో తరగతి మీరు వెళుతున్నట్లే విజ్ఞాన శాస్త్రం కూడా ఒక దశ నుంచి మరొక దశకు మార్పు చెందుతూనే వుంటుంది. మానవ సామాజిక చరిత్రలాగే వైజ్ఞానిక శాస్త్ర చరిత్ర కూడా కొంతకాలం పాటు పరిమాణాత్మక మార్పులకు లేనై ఆ తదుపరి ఒక్కసారిగా గుణాత్మక మార్పును సంతరించుకుంటుంది.
ఇలా గుణాత్మక మార్పును సంతరించుకున్న తర్వాత తిరిగి కొంతకాలం పాటు పరిమాణాత్మక మార్పులు చెంది మళ్లీ కొత్త గుణాత్మక మార్పులను చవిచూస్తుంది. దీనినే గతి తార్కిక భౌతిక వాదం అంటారు.

క్రీ.శ. 520:- బోథియస్ అనే తత్వవేత్త సంగీతానికి సంబంధించి కొంత ప్రవచించాడు. ప్రపంచంలో మూడే రకాల సంగీత సాధనాలున్నాయని అన్నాడు. అవి 1. ప్రకృతి సిద్ధమైన ధ్వనులు (గాలి కదలికలు, సముద్రపు అలలు, జీవ కణాల సహజ ధ్వనులు వగైరా) 2. మానవ జనితం (రాగాలాపన పాటలు, తదితర గాత్ర సంగీత పద్ధతులు) 3. మానవ నిర్మిత సంగీత పరికరాలు (సన్నాయి, వీణ, తబల, గజ్జెలు వగైరా).

క్రీ.శ. 529:-ప్రపంచ వ్యాప్తంగా పలువురు తత్వవేత్తలు మత గ్రంథాల రచనలు ప్రారంభించారు చాలా మట్టుక విజ్ఞాన శాస్త్ర వాస్తవాల కన్నా పాలకులకు సంతోషాన్నిచ్చే కథా వస్తువులకు ప్రాధాన్యతనిచ్చారు.

క్రీ.శ. 535:- పలు రాజ్యాలలో జెస్టీనియన్ నీతి అనే చట్టం అమలు చేయనారంభించారు. దీని ప్రకారం ఒక స్త్రీ వైవాహికేతర సంబంధాలున్నట్లయితే ఆమెకు మరణశిక్ష విధిస్తారు. కాని అటువంటి నియమం పురుషులకు ఈ చట్ట ప్రకారం లేదు.

క్రీ.శ. 537:- కాన్ స్టాంటి నోపుల్ నగరంలో హేగియా సోఫియా అనే అద్భుత కట్టడం నిర్మాణం పూర్తయింది. మొదట్లో చర్చిగా ఉపయోగపడ్డ ఈ నిర్మాణం సుమారు 1000 సంవత్సరాల తర్వాత కాన్ స్టాంటినోపుల్ ను క్రీ.శ. 1453 లో ఒట్టోమాన్ ఆక్రమించుకున్నాక మసీదుగా మార్చబడింది.

క్రీ.శ. 541:-మధ్య ఆసియా, ఈజిప్టు చరిత్రలో చీకటి యుగం ప్రారంభం, దాదాపు 25 సం,,ల పాటు ప్లేగు వ్యాధి బారినపడి జనాభాలో సగం మంది మరణించారు. ఒక్క కాన్ స్టాంటినోపుల్ నగరంలోనే కొన్ని రోజుల పాటు రోజుకు పదివేల మంది మృత్యువాత పడ్డారు.

క్రీ.శ. 547:-అలెగ్జాండ్రియా దేశానికి చెందిన కోస్మాస్ అనే వర్తకుడు ఎర్రసముద్రం, హిందూ మహాసముద్రం, తీరాన వున్న దేశాలలో పర్యటించాడు. టోపోగ్రాఫికా క్రిస్టియానా అనే పుస్తకంలో భూమి ఆకృతి గురించి వివరించాడు. బైబిల్ గ్రంథం చెప్పిన విధముగానే భూమి ఆకారాన్ని బల్ల పరుపుగా వున్నట్లు వర్ణించాడు.

క్రీ.శ. 550:-తొలిసారిగా ఖగోళశాస్త్రాధ్యయనానికి ఉపయోగపడే ఆస్ట్రోల్యాబ్ అనే పరికరం నిర్మించబడింది. గ్రహాలు, నక్షత్రాల సాపేక్ష విన్యాసం గురించి తెలుసుకోవడానికి ఇది బాగా ఉపకరించేది.
అంతేకాదు నావికాయానంలో నావికులకు ఇది దిక్సూచిగా ఉపయోగపడేది.

క్రీ.శ.550:-చైనా దేశంలో తుపాకీ మందు కనుగొన్నారు.
క్రీ.శ.550:-చైనీయులు జంతువుల ఆరోగ్య శాస్త్రం అబివృద్ధి పరిచారు. వ్యవసాయ పంటలకు తెగుళ్లు ఆశించడానికి కారణం అతీంద్రియశక్తులు కారణం కాదని క్రిమి కీటకాదులు కారణమని కనుగొన్నారు. వాటి జీవిత చక్రాలను దృష్టిలో వుంచుకొని ఏ కాలంలో ఏ పంట వేయాలో తెలుసుకోగలిగారు.

క్రీ.శ.565:-ట్రాలెస్ కు చెందిన అలెగ్జాండర్ అనే వైద్యుడు, నైటికీ గుర్తింపు పొందిన వైద్యగ్రంథాన్ని రచించాడు. అది ఆనాడే ఎన్నో భాషలకు అనువదించబడింది.

క్రీ.శ.570:- ఆధునిక చదరంగం ఆటను
భారతదేశంలో రూపొందించారు.

క్రీ.శ.576 :- భారతదేశంలో గణిత శాస్త్రజ్ఞులు సున్నా(0) అనే సంకేతాన్ని అంక గణింతలోకి చేర్చారు. సున్నా వాడకం అమలులోకి వచ్చాక హిందూ- అరబిక్ సంఖ్యామానములు ప్రాధాన్యతను కోల్పోయాయి.

క్రీ.శ.590:-సెయింట్ గ్రెగరీ అనే క్రైస్తవ మఠాధిపతి సరికొత్త క్యాలండర్ రూపొందించాడు. మనం ప్రస్తుతం వాడే క్యాలండర్ కు చాలా సామీప్యత ఉన్నందున ఈ క్యాలండర్ ను గ్రేగేరియన్ క్యాలండర్ అంటారు.

క్రీ.శ.600

క్రీ.శ.600:-సున్నము, సున్నపు రాయి, ప్లాస్టర్ ఆఫ్ పారస్ మిశ్రమాన్ని భవంతుల నిర్మాణాలకు వాడవచ్చునని మెక్సికో దేశంలో కనుగొన్నారు.

క్రీ.శ.600:-గాలి మరల సహాయంతో నీటిని పైకి తోడే పద్ధతి ఇరాన్ అమలులోకి వచ్చింది. ఈ గాలి మరల సహాయంతో లోతైన బావులు, వాగులలో వున్న నీటిని రైతులు వ్యవసాయ నిమిత్తం వాడటం మొదలు పెట్టారు.

క్రీ.శ.600:-పెరూ దేశానికి చెందిన నావికులు సముద్రపుటల ప్రవాహాము ఆధారంగా నడిచే నావలను నిర్మించి దక్షిణ మెక్సికోకు ఏ ఇతర యాంత్రిక శక్తిని ఉపగించకుండా వెళ్ళగలిగారు.

క్రీ.శ.600:-జంతు చర్మాలను చర్మాలను ఉపయోగించి ఢంకాలను, తప్పెటలను తయారు చేయవచ్చునని పర్షియనులు కనుగొన్నారు. క్రమేపీ ఈ పద్ధతి ఆసియా, ఆఫ్రికా ఖండాలకు విస్తరించింది.

క్రీ.శ.600:-ఇంగ్లాండులో నేరం చేసిన ఆడవారిని వీధుల్లో శిక్షించే లైంగిక వివక్షత నెలకొంది. అది దాదాపు వేయి సంవత్సరాలు పాటు కొనసాగింది. అయితే పురుషులకు మాత్రం శిక్ష గదుల్లోనే వేసేవారు. అంటే ఆడవారి పట్ల న్యాయవ్యవస్థ నిర్థాక్షిణ్యంగా ప్రవర్తించేది.

క్రీ.శ.607:-చైనా దేశంలో ఉత్తర దక్షిణ భాగాన్ని రవాణా సౌకర్యాలతో సంధానించే నైకాయానం అభివృద్ధిచెందింది. రైతులు తాము పండించే పంటను అమ్ముకోవడానికి ఒక చోటునుంచి మరో చోటికి వెళ్లడం సులభమయ్యింది.

క్రీ.శ.629:- యువాన్ సాంగ్ అనే చైనా బౌద్ధ యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ ఆయన హర్షవర్ధనుడి పాలనను గురించి వివరించాడు.

క్రీ.శ.659 :- తొలిసారిగా విద్య అనే భారతీయ వనిత (రాజ్యానికి రాణి ) సంస్కృత భాషలో గేయాలను రచించింది.

క్రీ.శ.700

క్రీ.శ.700:-గుర్రాల మీద అంత వరకు రౌతులు, అశ్వ సైనికులు నేరుగా ఏ ఆధారం లేకుండా వాటి వీపుల మీద కూచుని నడిపేవారు. గుర్రాలను అదుపు చేయడం కష్టంగా ఉండేది. అయితే క్రీశ,,700 లో రౌతులు సౌకర్యంగా కూచోవడానికి, కాళ్లను బాగా స్థిరంగా ఉంచడానికి, గుర్రాన్ని అదుపులో పెట్టడానికి వీలుగా అశ్వపగ్గాలు రూపొందాయి.

క్రీ.శ.700 :- ఈస్టర్ ద్వీపాల్లో గుండ్రటి మొహలతో వక్షస్థలం వరకు మాత్రమే కనిపించేలా నేలలో మానవ విగ్రహాల్ని పాతారు. అద్భుత అంశాలుగా నేటికీ అవి కొనియాడబడుతున్నాయి.

క్రీ.శ.700:-భారతీయ తాత్విక గ్రంథాలయిన ఉపనిషత్తుల మీద ఆదిశంకరాచార్యుడు అద్వైత వాదంలో చర్చించాడు.

క్రీ.శ. 715:-గ్రేట్ మాస్క్ఆఫ్ డెమాస్కస్ గా ప్రసిద్ధి పొందిన మసీదును
నిర్మించారు. తొలిసారిగా పాలరాయిని ఉపయోగించి గోడలు, కిటికీలు, కిటికీ చువ్వలు నిర్మించారు. ఈ నిర్మాణాల్లో ఎంతో సంక్లిష్టమైన రేఖా గణిత సూత్రాలు ఇమిడి వున్నాయి. అంటే మతం సైన్సును వాడుకొనడం తీవ్రమయిందన్నమాట.

క్రీ.శ. 721:-ప్రేగ్ నగరాన్ని నిర్మించారు. లిబ్యూస్ అనే యువరాణి ప్రేగ్ నగరాన్ని రూపొందించారని ప్రసిద్ధి.

క్రీ.శ. 730:-మూడవ లియో గా పేరు పొందిన సిరియాదేశపు చక్రవర్తి పరిపాలనలో లౌకిక వాదాన్ని ప్రవేశపెట్టాడు. మతం అనేది వ్యక్తిగత నమ్మకాలకు పరిమితం కావాలనీ, బహిరంగ ప్రదేశాల లో మత సంబంధ చిత్రాలు, గుర్తులు, విగ్రహాలు, ఉండకూడదని శాసించాడు. మత నిగ్రహాల తయారీని నిషేదించాడు. ఆర్ధిక రంగంలో నాణేల వినియోగాన్ని విస్తృతపర్చాడు.

క్రీ.శ. 740:-ఐరోపా, ఆప్రికా దేశాల మధ్య వాణిజ్య వస్తువుల మార్పిడి వ్యవస్థ బలపడింది. ఆఫ్రికా వాళ్లకు కావలసిన ఉప్పు, తదితర ఆహార పదార్థాలకు ప్రతిఫలంగా ఐరోపా వారికి బంగారు చూర్ణాన్ని ఆఫ్రికా వాళ్లు యిచ్చేవాళ్లు.

క్రీ.శ. 740:-డెమాస్కన్ దేశానికి చెందిన సెయింట్ జాన్ అనే కళాకారుడు చర్చిలో బృందగానం కోసం అష్టపది (మనం సప్తపదిగా స,రి,గ,మ,ప,ద,ని,స, అంటాం. దాన్నే సరిగమపదనిస అంటే అష్టపది అవుతుందని వాడాడు.

క్రీ.శ. 750:-ఆంగ్లో శాక్సన్ అనే బ్రిటన్ తత్వవేత్త (ది నేచురారిరమ్, అనే సైన్సు పుస్తకాన్ని రచించాడు. ఇందులో భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాలు రెండూ వుండేవి . ఆ రోజు ఇది బాలల సైన్సు సాహిత్యంగా పాఠశాలల్లో బోదించేవారు.

క్రీ.శ.760:-జబీర్ యిబిన్ హయ్య అనే అరబ్బు రసవాది. పదార్థాలకు మూలం - మూలకాలని వాదించాడు. గ్రీకు తత్వవేత్తలలాగానే మూలకాలను నిర్వచించాడు. అగ్ని, నేల, ఆకాశం, గాలి, నీరు, యివన్నీ ఆయన దృష్టిలో మూలకాలే.

క్రీ.శ. 787:-జైజంటైన్ మహారాణి విగ్రహారాధనను ఖండించింది. ఆమె ఆస్థానంలో ఉన్న ఎందరో బిషప్పులు, సనాతనవాదులు విగ్రహారాధనను ప్రోత్సహించేవారు.

క్రీ.శ. 790:-జర్మనీ దేశంలో ఏషెన్ నరరంలో అద్భుతమైన పాలెంటైన్ చాపెల్ అనే నిర్మాణం ప్రారంభించారు. ఈ చర్చిలోపల అపూర్వమైన కళా వైభవం నేటికీ కనిపిస్తుంది.

క్రీ.శ. 800

క్రీ.శ. 800:-ఐరోపా దేశాల్లో రోమన్ తరహా భవన నిర్మాణాలకు మంచి ప్రాచుర్యం వచ్చింది.

క్రీ.శ. 800:-ఐరోపా దేశాల్లో అడవుల ఆవశ్యకతను గురించి, పర్యావరణ పరిరక్షణలో వాతి పాత్ర గురించి ప్రచారం జరిగింది.
క్రీ.శ. 800:-అరబ్బు, పర్షియాకు చెందిన నావికులు హిందూ మహాసముద్రంలో నౌకాయానం గురించి ఎన్నో శాస్త్రసాంకేతిక విషయాలను రచించారు. వివిధ ఓడరేవులు, సముద్రతీరాలు, అలల ఉధృతి, గాలి వీచే దిశలు, నిరపాయకరమైన సముద్రమార్గాల గురించి ఈ రచనల్లో విస్తృతంగా చర్చించారు.
క్రీ.శ. 800:-భారతదేశంలో భువనేశ్వర్ సమీపంలో ప్రసిద్ధి చెందిన హైందవ దేవాలయ నిర్మాణాలు చేపట్టారు. ఈ దేవాలయ నిర్మాణాల్లో సంబ్రమాశ్చర్యాలను గొలిపే కళాసృష్టి జరిగింది.
క్రీ.శ. 800:-మధ్యయుగాల్లో పాశ్చాత్య దేశాలలో కనుమరుగవకుండా ఉండేందుకు ఎన్నో గ్రీకు, రోమన్ శాస్త్రసాంకేతిక పరిశోధనా ఫలితాలను అరబిక్, సిరియాక్ భాషల్లోకి అనువాదం చేసి పదిలపరిచారు.
క్రీ.శ. 800:-బొగ్గుపొడి, గంథకం, తదితర పదార్థాలను చూర్ణం చేసి గన్ పౌడర్ ను మొట్టమొదట సారిగా చైనా దేశంలో తయారుచేశారు. ఈ రహస్యం ఇతర దేశాలకు , ముఖ్యంగా ఐరోపా దేశాలకు 14 వ శతాబ్దం వరకు తెలియదు.

క్రీ.శ. 810:-జబీర్ ఇబిన్ హయ్యా అనే అరబ్బు శాస్త్రవేత్త పదార్థాల తయారీ గురించి వ్రాసిన “The Book of the Composition of Alchemy” అనే పుస్తకం బహుళ ఆదరణ పొందింది. జబీర్ ఇబిన్ హయ్యా అరబ్బు రసవాద పితామహుడు (father of the Arabic Alchemy) అని ప్రస్తుతించేవారు.

క్రీ.శ. 813:-బెన్ షాకు సోదరులు సూర్య గమన రేఖకు భూపరిభ్రమణ కక్ష్యలకు ఉన్న కోణాన్ని లెక్కించారు.

క్రీ.శ. 820:-పశ్చిమ ఐరోపా దేశంలో సేవా సంస్థలు, దేవదాసీ నిలయాలు ఏర్పడ్డాయి. వారు యాత్రికులకు, పేదలకు, స్థానికులకు వైద్య, విద్య సేవలు అందిస్తూ ఉండేవారు.

క్రీ.శ. 820:-సోమాలియా దేశంలో సీలాక్ అనే సముద్ర తీర నగరం గురించి ప్రపంచానికి తెలిసింది. కొన్ని సహస్రాబ్దాలపాటు అది గొప్పవాణిజ్య నగరంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ. ఆఫ్రికా, అరేబియా దేశాల మధ్య వాణిజ్య జరిగింది. బట్టలు, లోహాలు, తోళ్లు బదులు దంత సామగ్రి, బానిసలు వస్తుమార్పిడి సమీపంలో విక్రయం జరిగేది.
క్రీ.శ. 820:-అల్బమజార్ అనే అరబ్బు ఖగోళ శాస్త్రజ్ఞుడు తనకున్న తేలికపాటి ఖగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని పర్షియన్, భారతీయ జ్యోతిశాస్త్రాలతో మిళితం చేసి, గ్రీకు, తాత్విక శాస్త్రాన్ని కూడా అందులో రంగరించి జ్యోతిశాస్త్రాన్ని తయారుచేశాడు.దీన్ని ఇస్లామిక్ ప్రపంచం, ఆ తర్వాత పాశ్చాత్య దేశాల్లో చట్టపరంగా ఆమోదించారు.

క్రీ.శ. 821:-జపాన్ చక్రవర్తి చెట్లు నరికే పద్ధతిని క్రమబద్ధం చేశాడు. విచ్చలవిడిగా చెట్లు నరకడాన్ని నిషేధించాడు. కేవలం వ్యవసాయానికి అద్దంకిగా ఉన్న వృక్షాలను మాత్రమే తొలగించేవారు. చెట్లు నరకడాన్ని నిషేధించడాన్ని బట్టి అప్పుడే పర్యావరణ సమతౌల్యత గురించి వర్షాలు రావడానికి, పచ్చదనానికి ఉన్న సంబంధాన్ని గురించి వారికి అవగాహన ఉన్నట్టు మనం భావించవచ్చును.

క్రీ.శ. 833:-బాగ్దాద్ లో తొలి అంతరిక్ష అబ్జర్వేటరీని నిర్మించారు.

క్రీ.శ. 837:-తొలిసారిగా అరబ్బు దేశాల్లో పావురాలతో వార్తలను పంపడాన్ని ప్రవేశపెట్టారు.

క్రీ.శ. 840:-పాశ్చాత్య వైద్య పద్ధతుల గురించిన అనేక ఆంగ్ల గ్రంథాలను అరబ్బీలోకి హునాయాన్ ఇషాక్ అనే అతను అనువాదం చేశాడు. క్రమేపీ పాశ్చాత్య వైద్య పద్ధతులు ఇస్లామిక్ వైద్య పద్ధతుల్లో కలిసిపోయాయి. “గేలన్” వైద్య గ్రంథాలు అరబ్బు భాషల్లోకి తర్జుమా కావడం ప్రధానఘట్టం.

క్రీ.శ. 850:-ఇండోనేషియా దేశంలో బొరాబుదూర్ అనే పర్వత ప్రాంతంలో ఒక బౌద్ధారామాన్ని నిర్మించారు. చాలా కాలంపాటు అది ప్రసిద్ధ కట్టడంగా పేరుపొందింది. పిరమిడ్ రూపంలో మెట్లుమెట్లుగా ఉండే ఆ ఆరామం నిర్మాణం గురించి గొప్పగా చెప్పుకునేవారు.

చేసి చూడండి
చురుకుదనానికి చిన్న పరీక్ష

ఏదైనా వస్తువు మన కంటి వైపుకి వేగంగా దూసుకొస్తున్నప్పుడు మన కనురెప్పలు వాటికవే మూసుకుపోవడం మీకు చాలాసార్లు అనుభవమయ్యే ఉంటుంది. అవునా? అలాంటి సందర్భాలలో క్షణాలలో స్పందించి మనకళ్ళు తమకు ప్రమాదం కలగకుండా చూసుకుంటాయి. కేవలం మన కళ్ళ విషయంలోనే కాకుండా మన కాళ్ళు, చేతులు, ఒకోసారి మన మొత్తం శరీరం అనేక సందర్భాలలో ఇలా తటాలున స్పందించి అప్పటికప్పుడు తగిన నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు మన శరీర భాగాలు ఇలా స్పందించడాన్ని ' అసంకల్పిత ప్రతి చర్య ' అని అంటారు. ఆయా సమయాల్లో ఇది చాలా వేగంగా చోటుచేసుకుటుంది.

ఇలా అనుకోనిది జరగడం గాక మనం ముందుగా అనుకున్నవే, లేదా మనకు ముందుగా తెలిసినదే జరుగుతుందనుకుందాం. అప్పుడు మన శరీర భాగాలు ఎలా స్పందిస్తాయి? ప్రతిచర్యకై అవి ఎంత వేగంగా సిద్ధమవుతాయి? ... ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా లేదా? ఉదాహరణకు టెన్నిస్ గాని, క్రికెట్ గాని ఆడుతున్నప్పుడు మీ వైపుకి దూసుకొస్తున్న బంతి, ఒక పెద్ద భవనం మీద నుంచి ఎవరో కిందకు జారవిడిచిన ఒక వస్తువు - ఇలాంటి వాటి విషయంలో మీరు ఎంత వేగంగా స్పందిస్తారు?

అనుకోకుండా జరిగే వాటి విషయంలో మన శరీర భాగాలు స్పందించినంత వేగంగా మనం ముందుగా అనుకునేవాటి విషయంలోనూ స్పందిస్తాయా? సరే, దీని కోసం ఓ చిన్న ప్రయోగం చేసి చూడండి. మీరు, మీ స్నేహితులు ఎంత చురుగ్గా ఉన్నారో మీకు మీరే పరీక్షించి తెలుసుకోండి. ఇందుకై ఒక చిన్న ప్రయోగం చేస్తే చాలు.

ఒక ప్లాస్టిక్ స్కేలుని తీసుకుని మీ చేతివెళ్ళతో దాన్ని పట్టుకొండి. ఒక టేబుల్ అంచుపైన గాని, లేద స్టూలు అంచుపైన గాని తన అరచేతిని ఆనించి ఉంచి, మీ స్నేహితుడ్ని సిద్ధంగా ఉండమనండి.

ఇప్పుడు మీ మిత్రుడి అరచేతికి సూటిగా స్కేలుని గాల్లో కొంత ఎత్తుకి పైకి లేపి, దానిని ఉన్నట్టుంది వదిలిపెట్టండి. ఇలా గాల్లోచి కిందపడే స్కేలుని మీ స్నేహితుడు తన చేతిని కదపకుండా, కేవలం ఓ రెండు చేతి వేళ్ళ సాయంతో మాత్రమే దానిని పట్టుకోవలసి ఉంటుంది. అదీ నియమం. వేర్వేరు ఎత్తుల నుండి స్కేలుని వదిలి, మీ మిత్రుడు దాన్ని పట్టుకోగల్గుతున్నాడో లేదో పరిశీలించండి. అలాగే మీ మిత్రుడి సాయంతో మీ విషయంలోనూ ఈ ప్రయోగాన్ని చేసుకొని, మీ చురుకుదనాన్ని పరీక్షించుకొండి.

స్కేలుని పట్టుకొనే ప్రతిసారి ఒక పాయింట్ చొప్పున కేటాయిస్తూ దీనినొక ఆటలాగా కూడా మీరు ఆడవచ్చు. ఏదేమైనా పడుతున్న స్కేలు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు. ఇది కూడా ఒక ఆటలాంటిదే కాబట్టి, మొదట్లో తక్కువ పాయింట్లు తెచ్చుకునే వారు కొంత సాధన చేశాక ఎక్కువ పాయింట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని మొదట్లో ఎక్కువ సార్లు వదిలేస్తే నిరాశపడిపోవలసిన అవసరం లేదు.

ఇంట్లోనే ఇంద్రధనస్సు

పిల్లలూ, ఇంద్రధనస్సును మనం వర్షాకాలంలో మాత్రమే చూస్తాము.పైగా అది ఆకాశంలోనే ఉంటుంది. అయితే ఇంట్లోనే ఇంద్రధనస్సును చూడాలని మీ కనిపించడం లేదూ! ఇది చాలా సులభం. ఎప్పుడైన, ఎక్కడైనా ఇంద్రధనస్సును సృష్టించవచ్చును. కాకపోతే పగలు, ఎండబాగా ఉన్నప్పుడు బాగా వీలవుతుంది. కావల్సింది. రెండు మూడు గ్లాసుల త్రాగే మంచినీరు.
ఇంద్రధనస్సును చేసే విధానం:-

నోటినిండా నీరు తీసుకుని (పుక్కిలించినట్లు) బయటికి జల్లులాగా

ఒక పెట్టున ఊదండి. సూర్యునికి వ్యతిరేక దిశలో అలా ఊదండి. నోటిలోంచి నీరు జల్లులాగా కాకుండా తుంపరలాగా వచ్చేలా ' ఫూ...ఫూ ' అని ఊదండి. మీరు వదిలిన జల్లులో ఇంద్రధనస్సు ఏర్పడ్డం గమనించండి. మీ స్మేహితులకి, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి కూడా చూపి ఇంట్లోనే ఇంద్రధనస్సును వారిచేత కూడా చేయించండి. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోండి.

విజ్ఞాన విశేషాలు
వేగుచుక్క విన్యాసం

- సి.హెచ్. ఆనందరాంసింగ్, జి. కామయ్య, నెల్లూరు.

సైన్స్ అభివృద్ధి చెందని రోజుల్లో ఆకాశంలో కనిపించే గ్రహణాలు,ఉల్కలు, తోకచుక్కలు చూసి మన పూర్వీకులు తీసుకొనేవాళ్ళు. ఏవేవో ఉపద్రవాలు జరగబోతున్నాయని గ్రహించుకొని భయాందోళనలకు లోనయ్యే వాళ్లు.

గ్రహణ కాలంలో గర్భవతులు బయట తిరిగితే గ్రహళశూల, మొర్రి వస్తాయని కాంతి దూరని చీకటి గదుల్లో వారిని బంధించేవాళ్ళు.కాని ఈ పరిస్థితులు నేడు చాలా వరకు మారాయి. మూఢనమ్మకాల ఇనుప తెరలను చీల్చుకొని క్రమంగా జనం బయటికి వస్తున్నారు. ఖగోళ దృశ్యాలను వీక్షించడంలో ఆసక్తి చూపుతున్నారు. గ్రహణాలు ఏర్పడ్డా, తోకచుక్కలు దర్శనమిచ్చినా,

గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినా జనం స్కోపు అందుబాటులో ఉంటే దాని వద్ద క్యూ లు కడుతున్నారు.వాటిని పరిశీలించాలని ఉబలాటపడుతున్నారు. సైన్సు పట్ల, సైన్సు వివరిస్తున్న వినూత్న విషయాల పట్ల జనంలో ఆసక్తి పెరుగుతోంది. చాందసవాదం ఎన్ని అవరోధాలు కల్పించినా అంతిమ విజయం విజ్ఞాన శాస్త్రానిదేనని చరిత్ర రుజువు చేసింది.

గ్రహణాలు, తోకచుక్కలంత అద్భుతం గొలిపేవి కాకపోయినా, సూర్యుడికి, భూమికి మధ్య మరో గ్రహం వచ్చే సన్నివేశాలు కూడా ఉన్నాయి. వీటిని అక్కల్టేషన్స్ అంటారు. ఇలాంటిది జూన్ 8న జరగబోతుంది. సూర్యుడికి, భూమికి మధ్య శుక్రగ్రహం వస్తుంది. గతంలో 121 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన మళ్ళీ జరుగబోతుంది.

సౌరకుటుంబంలో భూమికి సూర్యుడికి మధ్య శుక్రగ్రహం, బుధగ్రహం ఉన్నాయి. ఇవి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యలు ఒకే తలంలో లేనందువల్ల ఒకదానికొకటి అడ్డురావు. 121 సంవత్సరాల కొకసారి, భూమి, శుక్రుడు సూర్యుడు ఒకే సరళరేఖా మార్గంలోకి వస్తే అప్పుడు ఒక అక్కల్టేషన్ ఏర్పడుతుంది.

శుక్రగ్రహం దాదాపు భూమితో సమాన పరిమాణంలో ఉన్నా మనకు చాలా దూరంలో (సుమారు4.12 కోట్ల కిలో మీటర్ల) ఉన్నందున మనం సూర్యుడిపై కదులుతున్న చిన్న మచ్చను మాత్రమే చూడగలం. దీన్నేమనం ట్రాన్సిట్ ఆప్ వీనస్ అంటాం.జూన్ 8న శుక్రగ్రహం తన కక్ష్యలో తిరుగుతూ భూమికి సూర్యుడికి మధ్యలో వస్తుంది.

అది సూర్యుడి మీదుగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. అలా ప్రయాణించేప్పుడు అది సూర్యుని మీద ఒక చిన్న నల్లటి మచ్చలా కనిపిస్తుంది. మేము చెప్పాము కదా అని జూన్ 8వ తేది సూర్యుని వైపు తదేకంగా చూడకూడదు. అది చాలా ప్రమాదకరం. సూర్యుడిని కంటితో నేరుగా చూడకూడదు. చూపుపోయే ప్రమాదం ఉంది. ఎలా చూడాలో చెప్పడానికే ఈ ప్రయత్నం. కెప్లెర్ మహాశయుడు గ్రహాలు వాటి కక్ష్యలో తిరిగే విధానాన్ని చక్కగా లెక్కకట్టడమే కాకుండా ఈ ట్రాన్సిట్ ప్రతి 121 సంవత్సరాలకి ఒకేసారి, వస్తుందని ట్రాన్సిట్ వచ్చిన నాటి నుండి మళ్ళీ 8 సంవత్సరాలకి ఇంకో ట్రాన్సిట్ వస్తుందని కూడా తన పుస్తకంలో వ్రాసుకొన్నాడు. అతడు చెప్పినట్లే ప్రతి రెండు ట్రాన్సిట్ లకి మధ్య మొదటి ట్రాన్సిట్ వచ్చిన 8 సంవత్సరాలకి ఇంకో ట్రాన్సిట్ వచ్చింది. అంటే ట్రాన్సిట్ లు 121-8-121 సంవత్సరాలకి వస్తాయన్నమాట. జూన్ 8, 2004న వచ్చిన ట్రాన్సిట్ తరువాత, జూన్ 6, 2012న ఇంకో ట్రాన్సిట్ వస్తుంది. మనలో చాలా మంది 2012 లో వచ్చే ట్రాన్సిట్ ని కూడా చూడవచ్చన్నమాట.

క్రింద 1631 తరువాత వచ్చిన ట్రాన్సిట్ లు 2004 తరువాత 2368 దాకా రాబోయే ట్రాన్సిట్ లు వాటి తేదీలు ఇస్తున్నాం చూడండి.

1631 డిసెంబర్ 07 1639 డిసెంబర్ 04
1761 జూన్ 06 1769 జూన్ 03
1874 డిసెంబర్ 09 1882 డిసెంబర్ 06
2004 జూన్ 08 2012 జూన్ 06
2117 డిసెంబర్ 11 2125 డిసెంబర్ 08
2247 జూన్ 11 2225 జూన్ 09
2360 డిసెంబర్ 13 2368 డిసెంబర్ 10

అంటే ట్రాన్సిట్ లు డిసెంబర్ 4 నుంచి 13 తేదీలలో, జూన్ 3 నుంచి 11 తేదీలలో, మాత్రమే వస్తాయి.
జూన్ 8న వచ్చే ట్రాన్సిట్ ఆసియా, యూరప్, ఆఫ్రికాలోచాలా భాగం వరకు ప్రజానీకం చూడవచ్చు.
శుక్రుడు ప్రతి 584 రోజులకి ఒకసారి సూర్యుడు చుట్టూ తిరిగినా ప్రతిసారి భూమికి సూర్యునికి మధ్యనించి ప్రయాణించినా ట్రాన్సిట్ లు సంభవించవు ఎందుకంటే భూమి, శుక్రుడు, సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యలు ఒకదానికొకటి 3 డిగ్రీలు పక్కకు వంగి ఉండడం వల్ల 121 సంవత్సరాలకి ఒకసారి, మధ్యలో 8 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఒకే లైనులోకి వస్తాయి. అప్పుడు మాత్రమే ట్రాన్సిట్ లు ఏర్పడతాయి.

సూర్యగ్రహణం చూసేందుకు వాడే పద్ధతుల ద్వారా మనం ట్రాన్సిట్ ని కూడా చూడొచ్చు.
ఎక్స్ ఫోజ్ అయిన ఫోటో ఫిల్ములను మూడింటిని కలిపి వాటి ద్వారా చూడవచ్చు.
వెల్డింగ్ చేసేప్పుడు ఉపయోగించే నల్లటి అద్దాలు రెండు కలిపి అందులో నించి చూడవచ్చు.
గాజు పలకకు బాగా మసిపట్టించి చూడవచ్చు. (మసి పూర్తిగా పట్టేలా చూసుకోవాలి లేకపోతే ప్రమాదం)
లోహపు కోటింగ్ ఇచ్చిన ప్లాస్టిక్ ఫిల్మ్ (మైలార్ ఫిల్మ్) రెండు కలిపి అందులోంచి చూడవచ్చు.
పైన చెప్పిన పద్ధతులలో ఒకరు లేక ఇద్దరు కలిపి ట్రాన్సిట్ ని చూడొచ్చు. పైగా పై పద్ధతులలో ఎంతో కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వుంటుంది.

అలాకాక ఇంకా తక్కువ ఖర్చుతో ఇంకా ఎక్కువ మంది చూసే పద్ధతి ఒకటుంది.

సూర్యుడికి భూమికి మధ్య ఇంకో గ్రహం వస్తే అది గ్రహణం కదా, మరి దీనిని గ్రహణం అనకుండా ట్రాన్సిట్ అన్నారెందుకు అనే ప్రశ్న మీకు ఈ పాటికి రావాలి.
సూర్యగ్రహణం, భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే వస్తుంది. చంద్రుడు భూమి మీద నించి చూస్తే సూర్యుడికన్నా 400 రెట్లు చిన్నవాడు కాని 400 రెట్లు మనకు దగ్గరగా ఉన్నాడు కనుక చంద్రుడు సూర్యుడిని పూర్తిగా మూసెయ్యగలడు. శుక్రుడు ట్రాన్సిట్ జరిగేపుడు 4 కోట్ల మైళ్ల దూరంలో ఉండడం వలన శుక్రడి సైజు దాదాపు భూమి అంత వున్నప్పటికి మనకు ఒక చిన్న నల్లని చుక్కలాగా మాత్రమే సూర్యునిపై పాకుతూ కనిపిస్తాడు. కాబట్టి దీన్ని గ్రహణం అనకుండా అంతర్యానం అన్నారు.

ట్రాన్సిట్ చరిత్రలో భారత్ :

1761 మరియు 1769 ట్రాన్సిట్ లు భారతదేశంలో కూడా సంభవించాయి. వీటికి, సంబంధించిన ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించడం సబబే అనిపిస్తుంది.
1761 లో ఫ్రెంచి ఖగోళ శాస్త్రవేత్త గ్యూల్లయ్ లీ జెంటిల్ ఆనాటి ట్రాన్సిట్ భారతదేశంలో చక్కగా కనబడుతుందని భావించి మన దేశంలో ఫ్రెంచి వారి పాలనలో వున్న పాండిచ్చేరి నుంచి చూడాలని ఓడలో బయలుదేరాడు. తీరా అతను ఇండియాను చేరేలోగా పాండిచ్చేరి ఫ్రెంచి వారి వలస నుంచి ఇంగ్లీషు వారికి కైవసం అయింది. లీ జెంటిల్ ని ఇంగ్లీషు సైనికులు పాండిచ్చేరి లో అడుగుపెట్టనివ్వలేదు. అప్పుడు జెంటిల్ అక్కడి నుంచి మారిషస్ ప్రయాణించాడు. ఆయన మార్గమధ్యలో ఓడ మీది నుంచి ట్రాన్సిట్ చూసాడు. కాని అతనికి సంతృప్తి కలుగలేదు. అతను చేయదలచిన పరిశోధలను చేయలేకపోయాడు. అందుకని మరలా 8 సం,, తరువాత వచ్చే ట్రాన్సిట్ కూడా ఇండియాలోనే కనబడుతుంది. కాబట్టి అప్పటి దాకా ఇండియాలోనే ఉండి ట్రాన్సిట్ ని చూచి వెళదామని ఇక్కడే ఉండిపోయాడు. ఈసారి ఇతడు పాండిచ్చేరి ట్రాన్సిట్ చూడకుండా జైపూర్ (రాజస్థాన్) లో చూసేందుకు అక్కడికి వెళ్ళాడు. అతని దురదృష్టం ఆ రోజు జైపూర్ లో పూర్తి ఆకాశం మేఘాలతో నిండుకొని సూర్యదర్శనం జరగలేదు. పాపం, జెంటిల్ నిరాశతో ఫ్రాన్స్ కి వెళ్ళిపోయాడు. తీరా తన స్వగ్రామం చేరేలోగా ఇతగాడి వారసులు ఇతను చనిపోయుంటాడని అనుకొని అతని ఆస్తిని పంచుకొనే ఏర్పాట్లు చేసుకొన్నారట. ఇతను కనిపించగానే వాళ్ళు నిరాశకి గురయ్యారట. ఇలా జెంటిన్ లాంటి శాస్త్రజ్ఞులు ట్రాన్సిట్ చూడలేకపోయామని నిరాశచెందితే అతని వారసులు అతని ఆస్తి పంచుకోలేకపోయామని నిరాశ చెందారు.

మనం మాత్రం ట్రాన్సిట్ ఆప్ వీనస్ లేదా వేగుచుక్క విన్యాసాన్ని 8, జూన్ 2004 న మరియు 6 జూన్ 2012 న చూసి ఆనందించాలి

చందమామ రావే జాబిల్లి రావే

- సి.హె.చ్. ఆనందరామ్ సింగ్

నేటికి 35 సం,, క్రిందట అంటే 1960 జూలై 21వ తొలిసారిగా మనిషి చంద్రునిపై కాలు మోపాడు. అపోలో -II అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించిన వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కి ఘనత దక్కింది.

మీ భూమి మీద చిన్నపిల్లలకి అన్నం పెట్టేటప్పుడు నన్ను చూపించి ఇలా పాటలుపాడి నెమ్మదిగా అన్నాన్ని వాళ్ళ నోళ్ళలో కుక్కేస్తుంటారు. కదూ.

నా పేరు చందమామ అని, నేను మీ భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహమని, ప్రతి రోజూ నా రూపంలో తేడాలు వస్తాయని, నేను పూర్తిగా కనిపించే రోజు పౌర్ణమి అని, అసలు నేను కనిపించని రోజు అమావాస్య అంటారని మీకు తెలుసన్న విషయం నాకూ తెలుసు. నా వెలుతురిని వెన్నెల అంటారని, ఆ వెన్నెల నేను సూర్యుడి నుండి అరువు తెచ్చుకొంటానని మీకు తెలుసుకదా నేను చాలా అందంగా ఉంటానని కవులు ఆడవాళ్ళను వర్ణించేటప్పుడు నాతో పోలుస్తూ కవితలు, పాటలు, పద్యాలు రాస్తూంటారు. కదూ

నా గురించి మీ స్కూల్లో మీ సైన్సు టీచర్లు బోలెడు చెప్పివుంటారు. అయినా, చెకుముకి పిలిచింది. కాబట్టి మీకు నా గురించి ఎంతో కొంత చెప్పి వెళ్దామని వచ్చాను వింటారా. నా వ్యాసం 2160 మైళ్లు. భూమి వ్యాసం 7927 మైళ్ళు. అంటే భూమిలో నేనునాల్గోవంతుకన్నా ఎక్కువ. మూడోవంతుకన్నాతక్కువగా ఉన్నానన్నమాట. నా గురుత్వాకర్షణ శక్తి భూమికన్నా ఆరురెట్లు తక్కువ. అంటే భూమి మీద మీ బరువు 30 కేజీలు ఉంటే నా మీద 5 కేజీలు మాత్రమే ఉంటారు. మీ భూమిమాద ఎవరైనా భారీ శరీరాలతో బరువెక్కువై కదల్లేకుండా ఉంటే నాదగ్గరకు పంపించండి వాళ్ళ బరువు 6 రెట్లు తగ్గించేస్తాను.

నేను భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 29 రోజులా 12 గంటలు పడుతుంది. అంటే నా ఒక్కరోజు మీ ఒక్క నెలకు సమానం అన్నమాట. ఇంకోరకంగా చెప్పాలంటే నాచుట్టూ నేను తిరగడానికి, భూమిచుట్టూ తిరగడానికీ పట్టేకాలం 29 రోజులూ 12 గంటలు అన్నమాట. దీనినే మీరు నెల అంటారు. నన్ను తమిళంలో నిలా అంటారు. నేను మీచుట్టూ ఒక్క ప్రదక్షిణం చేసేందుకు పట్టేకాలాన్ని మీరు నెల అని పెట్టుకోవడం కరెక్టే కదా. అందుకే నన్ను తెలుగులో “నెలరాజు” అంటారేమో !

నాకు దాదాపు 15 రోజులు పగలు, 15 రోజులు రాత్రి ఉంటుంది. తెలుసా ఆశ్చర్యపోకండి ఇలా ఎందుకంటే నేను నాచుట్టూ నేను తిరగడానికి అంతకాలం పడుతుంది. అని ముందే చెప్పానుకదా. భూమి 24 గంటలు తనచుట్టూ తానను తిరుగుతుంది. కాబట్టి మాకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. కదా. నా పగటి ఉష్ణోగ్రత 243ºF రాత్రికి -261ºF, అంటే పగలు విపరీతమైన వేడి, రాత్రి విపరీతమైన చలి. అంతేకాదు. పగలు సూర్యుడు నిప్పులు కక్కుకుంటూ దర్శనమిస్తాడు. ఆయనతో పాటు నా ఆకాశంలో చుక్కలు కూడా దర్శనమిస్తాయి. నా మీద నక్షత్రాలు మీ భూమిమీదలాగా మిణుకు మిణుకు అనవు. అవి నిశ్చలంగా వెలుగుతాయి.

పట్టపగలే సూర్యుడితో పాటు నక్షత్రాలు కూడా కనిపించడాన్ని ఒక్కసారి ఉహించుకోండి. ఊహకు అందడం లేదా? అలా ఊహించుకోవాలంటే ముందు మీరు ఆకాశాన్ని నల్లగా ఊహించుకోవాలి. ఆ నల్లటి ఆకాశంలో సూర్యుడిని సూర్యుడితో పాటు నక్షత్రాలు ఉహించుకోండి. అప్పుడు వీలవుతుంది. ఆ దృశ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి !! నిజమే ! నా ఆకాశం మీ ఆకాశంలా నీలంగా ఉండదు. నల్లగా ఉంటుంది. అలా ఎందుకుంటుందంటే మీ భూమిమీదలాగా నా మీద వాతావరణం లేదుకదా అందుకని. వాతావరణం ఉండడంవలన సూర్యుని వెలుతురుని చిందరవందరగా వెదజల్లి అందులోని నీలిరంగు కిరణాలను మాత్రం కనపడేలా చేస్తుంది కాబట్టి మీకు పగటి పూట నక్షత్రాలు కనపడవు. ఇలా వాతావరణం లేని అన్ని గ్రహాలలో పగటిపూట కూడా నక్షత్రాలు కనపడతాయి.

అంతేకాదు వాతావరణం లేని కారణంగా ఇంకొన్ని విచిత్రాలు జరుగుతాయి. అవేంటంటే నా మీద పెద్ద బాంబు పేలినా శబ్దం వినపడదు. పగటిపూట సూర్యకాంతి తీక్షణంగా ఉంటుంది. వేడికూడా వివరీతంగా ఉంటుంది. అదేసమయంలో కొండలు గుట్టల నీడలో చిమ్మచీకటి, విపరీతమైన చలి ఉంటుంది. సూర్యోదయానికి ముందు ఉదయకిరణాలు కనిపించకుండానే ఒక్కసారిగా సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. ఒక్కసారిగా స్విచ్ వేస్తే లైట్లు వెలిగినట్లు సూర్యుడు ప్రత్యక్షంకాగానే పగలు వెలుతురుతో నిండుతుంది. అలాగే సూర్యాస్తమయం తరువాత కూడా సంధ్యాకాంతులు మీ భూమి మీద చాలా సేపు ఉంటాయి. దానిని మీరు సాయంత్రం అంటారు. నా మీద సాయంత్రం అన్నమాటే ఉండదు. ఒక్కసారిగా సూర్యుని వెలుతురు మాయం అవుతుంది. అంటే చీకట్లు కమ్ముకొంటాయి. మీకు కరెంటుపోతే ఎలా ఉంటుందో అలా. ఇదంతా నాపైన వాతావరణం లేకపోవడం వల్లే జరుగుతుంది.

నేను మీకు పౌర్ణమినాడు చక్కటి వెలుతురు ప్రసారం చేస్తాను కదా. దాన్నే వెన్నెల అంటారుగా మీరు మీకు తెలుసా ? మీ భూమి నాపైన ఎంతటి వెన్నెల కురిపిస్తుందో నా వెన్నెల కన్నా 90 రెట్లు ఎక్కువ అంటే నాపై కురిసే భూమి వెన్నెలలో చిన్న చిన్న అక్షరాలు ఉండే పుస్తకాన్ని కూడా సులభంగా చదవగలరు.

భూమిమీద నేను తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాను. కాని నా ఆకాశంలో భూమి ఉదయించడంగాని, అస్తమించడం గాని, జరగదు. ఎప్పుడూ భూమి నా ఆకాశంలో ఒకేచోట ఉంటుంది. ఎందుకంటే నేను నా చుట్టూ తిరిగేకాలం భూమి చుట్టూ తిరిగే కాలం ఒకటే కాబట్టి అలా జరుగుతుంది. కానీ, భూమికి నా ఆకాశంలో కళలు ఉన్నాయి. అంటే భూమికి పౌర్ణమి అమావాస్య ఉంటాయి. భూమిమీద చంద్ర అమావాస్య రోజు నామీద భూమి పౌర్ణమి, అలాగే భూమిమీద చంద్ర పౌర్ణమి రోజు నామీద భూమి అమావాస్య ఉంటుంది.

నేను భూమిచుట్టూ తిరిగేప్పుడు దీర్ఘవృత్తాకారంలో తిరుగుతాను. అంటే ఒక్కొసారి భూమికి దగ్గరగా, ఒక్కోసారి దూరంగా వెళుతుంటాను. నేను మీకు దగ్గరగా వచ్చినప్పుడు మీకు నా సైజు పెద్దదిగా, దూరంగా వెళ్ళినపుడు చిన్నదిగా కనిపిస్తాను. మీరు ఈ విషయాన్ని ఇప్పుటిదాకా గమనించలేదుకదా ? నా సైజులో నేను 10% మారుతుంటాను. అలాగే నా మీద ఆకాశంలో భూమి సైజు కూడా 10% మారుతుంటుంది.

మీకు ఒక విషయం తెలుసా మీ భూమిమీద మీరు ఎప్పుడైనా ఒక ఉల్కపడడం చూసే ఉంటారు. ఉల్కను చూసినవారు. ఆ సమయంలో ఏం కోరుకుంటారో అది జరుగుతుంది. అనే మూఢ నమ్మకం కూడా ఉంది కాదా. భూమిమీద సగటున రోజుకి 10 కోట్ల ఉల్కలు పడతాయి. అనే విషయం మీకు తెలుసా అయితే ఈ ఉల్కలు భూమికి చేరేలోపే గాలి రాపిడికి భస్మం అయిపోతాయి. చాలా అరుదుగా ఉల్కలు భూమిని తాకుతాయి. కాని నా మీద వాతావరణం లేని కారణంగా ఉల్కలు నా ఉపరితలాన్ని తాకి గుంటలు ఏర్పరుస్తుంటారు. నా మీద రోజుకి సగటున 10 లక్షల ఉల్కలు పడుతుంటాయి. ఇవి ఇసుక రేణువంత సైజునుండి చాలా పెద్దపెద్దవిగా ఉంటాయి.

ఇక గ్రహణాల విషయానికి వస్తే మీ భూమి నాకు సూర్యుని కి మధ్యలో ఒకే లైనులో వచ్చిందంటే మీకు నా గ్రహణం (చంద్రగ్రహణం) వస్తుంది కదా అప్పుడు నాకు సూర్యగ్రహణం కనబడుతుంది. అంటే సూర్యుడికి నాకు మధ్యలో భూమి అడ్డంగా వస్తుంది. అలాగే మీ భూమికి, సూర్యునికి మధ్యలో నేను గనుక ఒకే లైనులో వస్తే మీకు సూర్యగ్రహణం వస్తుంది. నాకు అప్పుడు భూమి గ్రహణం వస్తుంది. అంటే సూర్యుని వెలుతురు భూమిమీద పడకుండా నేను అడ్డం వస్తాను.

మీ భారతీయులు త్వరలో నా మీదకి రాకెట్ పంపిస్తారటగా ? మీ శ్రీహరికోటలో ఇందుకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయటగా ? మీ భారతీయులు కూడా నా మీదకు వస్తారంటే నేను కాదంటానా ? రండి మీకు స్వాగతం పలుకుతాను. అంతేకాదు మీరంతా బాగా చదువుకొని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకొని మంచి పౌరులుగా మానవాళికి ఉపయోగపడేలా మారాలని నేను కోరుకొంటాను. నా కోరికను తీరుస్తారుగా ?

ఆకుపచ్చ ఆక్టోపస్

సముద్రాల్లో నివసించే ఆక్టోపస్ లు మమూలుగా అయితే గోదుమరంగులో వుంటాయి. అయితే దేనికైనా భయపడినప్పుడు తమను తాము రక్షించుకొనేందుకై అవి తమ రంగుని (మన ఊసరవేల్లికి లాగా) నీలంకిగాని, లేదా ఆకుపచ్చకిగాని మార్చుకోగల్గుతాయి. నేల మీదేగాక నీటిలోనూ ఇలా పరిస్థితులను బట్టి రంగులు మార్చే జీవులు వున్నయన్నమాట.

గొర్రెలు - ఎలుగుబంట్లు

ఆ మధ్య జరిగిన కొన్ని పరిశోధనల్లో దృవపు ఎలుగుబంట్లు తమకు 20 మైళ్ళ దూరంలో ఉన్న వస్తువుల వాసనను పసిగట్టగలవని తేలితే, గొర్రెలు తమ తోటి గొర్రెల ఫోటోలను గుర్తించగలవని స్పష్టమయ్యింది. గొర్రెలేకాక మరికొన్ని ఇతర జంతువులు కూడా ఫోటోలను గుర్తించగలవని శాస్త్రజ్ఞులు జరుపుతున్న పలు పరిశోధనల్లో స్పష్టమవుతోంది.

కుక్క గొడుగులు

కుక్క గొడుగులకు వృక్ష ప్రపంచంలోని మిగతా చెట్లకన్నా, పురుషులు మరియు జంతువులలోనే పోలికలు ఎక్కువగా వున్నాయట !

శనిగ్రహం వలయాలు

మన సౌరకుటుంబంలో శనిగ్రహంచుట్టూ కల్పించే వలయాల చుట్టుకొలత ఎంతో తెలుసా? సుమారు 5,00,000 మైళ్ళు. కాని వాటి మందం మాత్రం కేవలం 1 అడుగు మాత్రమే... తమాషాగా లేదూ.

మెదడుకు మేత

మీకు తెలుసా ?

1. మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని నాడులు ఒక సెకనుకు 300 అడుగుల వంతున సందేశాలు అందిస్తాయి.

2. ప్రపంచంలోకెల్లా అతి చిన్న మానవ ప్రాణి డచ్ దేశానికి చెందిన యువరాణి "పాలిన్". ఆమె తన 12 సంవత్సరాల వయసులో 23.2 అంగుళాలు ఎత్తు ఉండేది.

3. హమ్మింగ్ బర్డ్ సెకనుకు 90 సార్లు వంతున రెక్కలు టపటపలాడిస్తుంది. అంటే నిమిషానికి 5వేల సార్లు అన్నమాట.

4. ప్రపంచంలోని 2 లక్షల పూల రకాల్లో అతిచిన్న పుష్పం పేరు డక్ వీడ్. దీనిని మైక్రోస్కోపు క్రింద మాత్రమే చూడవచ్చును.

5.పవర్ ఫిష్ ఉమ్మిలాంటి ద్రవం (మ్యూకస్)తో పారదర్శకమైన ఒక సంచిని తయారు చేసుకుంటుంది.సముద్రంలోని ఇతర కీటకాల బారి నుండి తనను తాను రక్షించుకుంటుంది. సంతోషంగా నిద్రపోతుంది.

6.ఒక సాధారణ లెడ్ పెన్సిల్ తో 35 మైళ్ల పొడవైన గీత గీయవచ్చును. అదే పెన్సిల్ తో ఆంగ్ల భాషలోని 50 వేల పదాలను రాయవచ్చును.

7. అంతరిక్ష ధూళి కారణంగా మన భూమి బరువు రోజుకు 100 టన్నులు పెరుగుతోంది !

8.పసిఫిక్ మహాసముద్రం వైశాల్యంలో ఎంత పెద్దదంటే భూమి ఉపరితలంలో 1/3వ వంతు ఆక్రమిస్తుంది. భూమి మీది ఖండాలన్నింటినీ ఒకచోట చేర్చినా పసిఫిక్ మహాసముద్రమే దానికంటే పెద్దదిగా ఉంటుంది.

9.ఒక పావురం యొక్క ఎముకలు దాని ఈకల కంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి.

10.గాడిద కళ్లు దాని తలపై ఎంత చక్కగా అమరివుంటాయంటే అది ఒకే సారి తన నాలుగు కాళ్ళను చూసుకోగలదు.

ఎవరి వేగం ఎంతెంత?

మీరు ఇంటి నుంచి బడికి, తిరిగి బడినుంచి ఇంటికి ఎంత సేపట్లో చేరుతారు? ఈ ప్రశ్నకు జవాబు రెండు అంశాలపై అధారపడి వుంటుంది. ఒకటి - మీ ఇంటి నుంచి బడికి ఎంత దూరం వుంది, రెండు - మీరు ఎంత వేగంగా నడుస్తారు అన్నవే ఆ అంశాలు. అవునా? ఒక నిర్ధిష్ట సమయంలో మీరు ఎంత దూరం పోతారనే దానిని మీ నడకవేగం తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక్క గంటకాలంలో మీరు ఎంత దూరం నడుస్తారనేది మీ నడకవేగం. అలాగే ఒక గంట సమయంలో మీరు ఎంత దూరం పరిగెత్తుతారనేది మీరు పరిగెత్తగలిగే వేగాన్ని తెలుపుతుంది.
వివిధ రకాల వాహనాల వేగం ఆయా వాహనాలను బట్టి, నెలకొల్పబడే మిషిన్లను ( యంత్రాలను ) బట్టి నిర్ణయించబడుతుంది. ఈ రోజుల్లో ఆఘమేఘాల మీద ముందుకు సాగిపోయే వాహనాలు మనకు ఎన్నెన్నో కనిపిస్తుంటాయి. ఈ మోటారు బండ్ల సంగతిని కొంచెం పక్కకు పెట్టి, ప్రకృతిలో వివిధ జంతువులు ఎంత వేగంగా ముందుకు
పరిగెత్తుతాయి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేని కన్నా ఏది వేగంగా పోతుంది. ఎంత వేగంగా పోతుంది అన్న దానిని గమనిస్తూ ఈ వివరాలను చూడండి.

ఖడ్గమృగం గంటకు 45 కి.మీ.లు
పిల్లి గంటకు 47 కి.మీ.లు
గబ్బిలం గంటకు 24 కి.మీ.లు
తాబేలు గంటకు 3 కి.మీ.లు
ఏనుగు గంటకు 39 కి.మీ.లు
ఎలుక గంటకు 10 కి.మీ.లు
ఒంటె గంటకు 32 కి.మీ.లు
మనిషి గంటకు 40 కి.మీ.లు (వేగంగా పరిగెత్తితే)
పంది గంటకు 17 కి.మీ.లు
పాండా గంటకు 40 కి.మీ.లు
కుక్క గంటకు 67 కి.మీ.లు
లేడి గంటకు 97 కి.మీ.లు
కంగారూ గంటకు 72 కి.మీ.లు
చిరుతపులి గంటకు 113 కి.మీ.లు
నక్క గంటకు 72 కి.మీ.లు
కుందేలు గంటకు 72 కి.మీ.లు
గుర్రం గంటకు 77 కి.మీ.లు
జిరాఫీ గంటకు 56 కి.మీ.లు

మామూలు వేగంతో నడిచే మనిషి గంటకు సుమారు 5-6 కి.మీ.ల దూరం పోగల్గుతాడు. అయితే అతను సాధ్యమైనంత వేగంగా పరిగెత్తినట్లయితే మాత్రం ఒక గంట సమయంలో 40 కి.మీ.ల దూరం పోగల్గుతాడు. మరి మీ పరుగు వేగం ఎంతో మీరెప్పుడైనా చూసుకున్నారా? మీ వేగమెంతో తెలుసుకోవడం కోసం సరదాగా ఓ రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తి చూడండి. ఒక వేళ మీరు ఆ రెండు కిలోమీటర్ల దూరాన్ని 5నిమిషాలలో పరిగెత్తారనుకుందాం. అప్పుడు గంటకు, కిలోమీటర్లలో మీ పరుగు వేగం - (2÷5)×60 అవుతుంది. 2/5×60=24 కి.మీ.లు. అర్థమయ్యిందిగా. మీ నడక వేగాన్ని కూడా ఇలాగే తెలుసుకోండి

కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలమైంది - సెర్వాంటిస్

మనమంతా మనుషులం

- ఆచార్య రాచపాళెం

పనితొడవులు వేరు బంగారు మొక్కటి
పరగఘటలు వేరు ప్రాణమొకటి
అరయతిండ్లు వేరు ఆకలియొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ


మనం పెళ్ళిళ్ళకు పేరంటాళ్ళకు ఇంకా అనేక సందర్భాలలో అనేక రకల నగలు తయారు చేయించుకుంటూ ఉంటాం. ఉంగరాలు, జుంకీలు, గాజులు, నెక్లేసులు, వడ్డాణాలు, మాటీలు, పాపిటబొట్లు ఇలా ఎన్నో చేయించుకుంటాం. ఒక్కొక్క దాన్లో అనేక రకాల ఫాషన్లు కూడా ఉంటాయి. అయినా వాటన్నిటిలో బంగారం మాత్రం ఒక్కటే. అలాగే మనలో ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క శరీరం ఉంటుంది. కొందరం నల్లగా ఉంటాం. కొందరం పసుపు రంగులో ఉంటాం. కొందరు చామన ఛాయలో ఉంటాం. ఇంకొందరు తెల్లగా ఉంటాం కొందరు లావుగా వుంటారు. ఇంకొందరు సన్నగా ఉంటారు.

అయినా అందరిలోనూ అన్ని శరీరాలలోనూ ఉండే ప్రాణం మాత్రం ఒక్కటే. అందరికీ ఊపిరి సమానం. మనం అనే క రకాల ఆహారం తీసుకుంటూ ఉంటాం. మన ప్రాంతంలో దొరికే ధాన్యాన్ని బట్టి, మనం వండుకునే అలవాట్లను బట్టి, మన నాగరికతను బట్టి, మన ఆర్థికస్తోమతను బట్టి అనేకరకాల పదార్థాలు తింటూ ఉంటాం. పండ్లు పండే ప్రాంతంలో బియ్యం, జొన్నలు పండే ప్రాంతంలో జొన్నలు, మొక్క జొన్నలు పండే ప్రాంతంలో మొక్క జొన్నలు, గోధుమలు పండే ప్రాంతంలో గోధుమలు ఎక్కువగా తింటూ ఉంటారు. పట్టణాల్లో ఉండే కేకులు, వంట ఎవరో చేసిన వస్తువులు తింటాం.

ఇంట్లో వుంటే మనమే చేసుకున్న వస్తువులు తింటాం. అలాగే బెల్లంతో చేసిన వస్తువులుంటాయి.చక్కెరతో చేసినవి, చింతపండుతో, కారంతో పొదినతో, కొత్తిమిరతో అనేక వస్తువులతో చేసిన పదార్థాలను కూడా మనం తింటూ ఉంటాం. ఏ పదార్థన్ని తిన్నా, దేనితో తయారుచేసిన పదార్థన్ని తిన్నా అందరి ఆకలి మాత్రం ఒక్కటే. అందరికీ ఆకలవుతుంది కాబట్టి తింటారు.

అలాగే మనుషులు ఏ కులానికి చెందిన వాళ్ళైనా,ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, ఏ రాష్ట్రంలో వారైనా, ఏ దేశం వాళ్ళైనా అందరూ మనుషులే. మనుషులు కోరుకొని ఏకులంలోనూ, ఏ మతంలోనూ, ఏ దేశంలోనూ, ఏ భాషాప్రాంతాల్లోనూ పుట్టరు.పుట్టిన తర్వాత అన్నీ వచ్చిచేరతాయి. ఒక బిడ్డ పుట్టగానే అడవిలో వదిలిపెట్టేస్తే ,ఆ బిడ్డను ఏ క్రూరమృగాలు చంపేయకుండా ఉంటే ఆ బిడ్డ బతికుండి పెరిగి పెద్దవాడైతే, అతను ఏ భాషా మాట్లాడలేడు. కాకపోతే పక్షులలాగా కూయ గలడు. జంతువులలానిగా అరవగలడు. అంతకుమించి ఏ మతంలోనూ ఏ కులంలోనూ చేరలేడు. ఎందుకు? అడవికి కులమూ మతమూ లేదు గనుక. మనుషులు ఉండే చోట పుట్టిన వాడికే కులం మంతం వచ్చి చేరుతున్నాయి. ఇవి సహజమైనవి కావు కృత్రిమమైనవి. మనిషి కల్పించుకున్నవి. ఎవరో మనకు ఆపాదించినవి. మనం ఒకవేళ ఏదో ఒక కులానికి, ఒక మతానికి చెందిన వాళ్ళమైనా మనం ప్రాథమికంగా మనుషులం అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మనం గొప్పవాళ్ళమౌతాం. ఒక కులానికో మతానికో మనం అతుక్కుపోతే మనం పరిధి చిన్నదై పోతుంది. కులమతాలకు అతీతంగా ప్రపంచంలోని మనుషులంతా నా లాంటి మనుషులే అనుకుంటే మనం మహాకవి గుర్రం జాషువా చెప్పినట్లు 'విస్వనరు ' లంకాగలం మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ' అవిభక్త కుటుంబీకులం ' ఏక రక్తబంధువులం కాగలం. ముందు నేను మనిషిని తర్వాత కులమూ మతమూ అని గుర్తించినవారే ఉత్తమ మానవుడు. కులాలకు మతాలకు అతుక్కుపోయిన వాడే అధమ మానవుడు. ఈ పద్యం సారాంశాన్ని మనం గ్రహిస్తే మనదేశంలో, మన రాష్ట్రంలో, మన ఊళ్ళల్లో మన విద్యా సంస్థల్లో జరిగే కులాల కుమ్ములాటలను, మతాల మారణకాండను మనం అరికట్టగలం. ఎవరు నువ్వు? అంటే ' నేను మనిషిని ' అని సమాధానం చెబుదాం. ఈ పద్యం రాసిన వేమనకు ధన్యవాదాలు చెబుదామా !

కదిలే చిత్రాలు

సినిమాలంటే ఏమిటో మీకు తెలిసిందేగా వివిధ దృశ్యాల్ని ఫిల్ము రీలుపై చిత్రీకరించి, ఈ రీలుని, సెకనుకి 24 ఫ్రేములు వెండితెరపై పడేలా గిరగిరా తిప్పుతారు అంతే. సినిమా తెరపై ఒక దానివెంట ఒకటిగా శరవేగంగా పడే నిశ్చల చిత్రాలన్నీ కలిసి, ఆయా వస్తువులు/మనుషులు నిజంగా కదులుతున్నారు. అన్న భ్రమ మనకు కల్గుతుంది. ఇలాంటి కదిలే చిత్రాలను మీకు మీరుగానే తయారు చేసుకుంటే. అదెంత ఆనందదాయకంగా వుంటుందో కదా! ఇంకేం. వెంటనే ఒక దళసరి కాగితం, కత్తెర, పెన్సిలు, రబ్బరు బ్యాండ్, దారం వగైరా తీసుకుని అందుకు సిద్ధంకండి !

కదిలే బొమ్మల పుస్తకం
  • కొంచెం దళసరిగా వుండే కాగితాన్ని తీసుకుని, దీని నుంచి ఒకే ఆకారంలో వుండే ఓ ఏడెనిమిది ముక్కలను కత్తిరించండి.
  • ఇప్పుడు ప్రతి కాగితం ముక్క మీద వేరువేరు దశల్లో వుండే ఒకే బొమ్మను దించండి. ఉదాహరణకు ఒక మొగ్గ పువ్వుగా విచ్చుకుంటున్న ప్రక్రియలోని విభిన్న దశలు. మొగ్గతో మొదలు పెట్టి విచ్చుకున్న పువ్వుతో ఈ చిత్రాలను ముగించండి.
  • ఇప్పుడీ బొమ్మల్ని (కాగితం ముక్కల్ని) - అదే క్రమంలో (మొగ్గ నుంచి పువ్వు) ఒక దాని మీద మరొకదాన్ని వుంచి, ఈ కాగితాలన్నిటికీ కలిపి ఒకవైపున రబ్బరు బ్యాండు పెట్టండి.
  • స్వేచ్ఛగా ఉన్న రెండో కొన వైపున కాగితాలను ఒక్క ఉదుటున (వేళ్ళతో లాగి) వదిలిపెడితే ఆశ్చర్యంగా మొగ్గ పువ్వులా మారుతున్నట్లుగా మీకు కన్పిస్తుంది. కేవలం ఏడెనిమిది కాగితం ముక్కల్నే గాక మరిన్ని కాగితం ముక్కలలోనూ, రకరకాల బొమ్మలలోనూ ఈ ప్రయోగన్ని చేసి చూడండి.
కదిలే చిత్రాల

ముందుగా సుమారు 36 సెంటీమీటర్ల పొడవు, 9 సెంటీమీటర్ల వెడల్పు వుండే ఓ పొడవాటి కాగితం పట్టీని తీసుకొండి. ఈ పట్టీలో రెండు చివర్ల వద్ద రెండేసి సెంటీమీటర్ల పట్టీని వదిలిపెట్టి, మిగిలిన పట్టీని 4-4 సెంటీమీటర్ల భాగాలుగా విభజిస్తూ గాట్లు పెట్టండి. ( ఆ విధంగా కత్తిరించండి) ( ఈ కొలత కేవలం ఒక ఉదాహరణ కోసమే గాని ఇదే ప్రమాణం కాదని గుర్తించవలసిందిగా మనవి. మీ అవసరాన్ని బట్టి, పట్టీ వెడల్పును తగినంత సైజులో ఎంచుకోవచ్చు.)

  • తరువాత ప్రతి భాగంలోనూ ఒక చిత్రాన్ని దించండి. ఇంతకు ముందులాగే ఇందులోనూ ఒక భాగంలోకి ఒకో దశలో వుండే చిత్రాన్ని దించండి. ఉదాహరణకు నాట్యం చేస్తున్న ఓ అమ్మాయి బొమ్మను దించవచ్చు.
  • బోమ్మలు చిత్రించడం అయ్యాక, ఈ పట్టీ రెండు కొసలనూ అతికించి, దాన్నొక రింగులాగా ( చిత్రాన్ని చూడండి) తయారు చేయండి.
  • ఇప్పుడీ రింగుని మనం గిరగిరా తిప్పాల్సి వుంటుంది. ఇందుకై పటంలో చూపిన విధంగా దాన్ని కాస్త మందమైన దారానికి కట్టి వేలాడదీయండి.
  • ఇందుకై రింగు పై భాగంలో కాగితంతో ఓ పొడవాటి పట్టీని కూడా మీరు అతికించుకోవచ్చు.
  • ఈ ఆకృతిని ఎక్కడైనా వేలాడదీసి రింగుని (పట్టీని) గిరగిరా తిప్పండి. అంతే ! బొమ్మలోని ఆకారం నిజంగానే నాట్యం చేస్తున్నట్లుగా కన్పిస్తుంది.
అతనికి లెక్కలంటే పిచ్చిప్రేమ

ఐదో తరగతి లెక్కల పీరియడ్ జరుగుతోంది. ఇంతలో ఓ చిచ్చర పిడుగు అదిగిన ప్రశ్నకు పిల్లలంతా పకపకా నవ్వారు. కాని మాస్టారు మాత్రం నవ్వలేదు. అలాగని ఆ కుర్రాడి మీద కోపం కూడా తెచ్చుకోలేదు. అబ్బురంగా అ కుర్రాడివంక చూశారు. ఎందుకంటే ...

అది 1897వ సంవత్సరం. తమిళనాడులోని ఒకానొక పాఠసాల ఐదో తరగతి పిల్లలకు ఆ రోజు లెక్కల మాస్టారు ఎంతో ఉస్తాహంగా పాఠాలు చెబుతున్నారు. ' భాగహారం ' గురించి పిల్లలందరికీ స్పష్టంగా వివరించాలనేది అయన తాపత్రయం.

"ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకుందా. ఆ నలుగురికీ నాలుగు అరటి పళ్ళను సమానంగా పంచారనుకుందాం. అప్పుడు ఒకొక్కరికీ ఎన్ని పళ్ళు వస్తాయి ?" అడిగారు మాస్టారు.

"ఒకొక్కటి" పిల్లలంతా ముక్తకంఠంతో చెప్పారు.

"గుడ్. ఒక వేళ యాభై మంది పిల్లలుండి, వారందరికీ యాభై అరటి పళ్ళను పంచితే?"

"అప్పుడు కూడా ఒకొక్కరికీ ఒకొక్కటీ వస్తుంది మాస్టారూ."అన్నారు పిల్లలు.

"వెరీగుడ్. ఈ సారి కూడా కరెక్టుగానే చెప్పారు...

4ని 4తో భాగించినప్పుడు, అలాగే 50ని 50తో భాగించినప్పుడు డు '1' భాగఫలంగా వస్తుంది. అవునా? "అవును మాస్టారూ."

"దీనిని బట్టి మనకేం అర్థమవుతుందంటే - ఏ సంఖ్యనయినా అదే సంఖ్యతో భాగించినప్పుడు ఒకటి భాగఫలంగా వస్తుందని, తెలిసిందా?"

పిల్లలందరిలోనూ తామో కొత్త విషయాన్ని తెలుసుకున్నామన్న సంతోషం కలిగింది. కాని ఓ కుర్రాడి మెదడులో మాత్రం ఇంకేదో అలోచన వచ్చింది. "మాస్టారూ! నాకో చిన్న సందేహాం" అంటూ వెంటనే అతను చేయి పైకెత్తాడు.

మాస్టారు అడగమన్నారు.

"మీరు చెప్పిన పిల్లల్లో ఒక్కరికీ ఒక్క అరటిపండునీ ఇవ్వనప్పుడు కూడా ఒకొక్కరికి ఒక అరటిపండు వస్తుందా?"

అని అడిగాడు సందేహాల కుర్రాడు.

అంతే! క్లాసు మొత్తం ఘెల్లుమంది!

కాని మాస్టారికి మాత్రం ఆ కుర్రాడి సందేహాం ఏమిటో అర్థమయ్యింది.

' సున్నాని సున్నాతో భాగించినప్పుడు కూడా జవాబు ఒకటే వస్తుందా?' అని అ కుర్రాడు అడుగుతున్నాడు. అబ్బ! ఎంత తెలివైన కుర్రాడు వీడు. అనుకున్నాడాయన.

ఆ రోజు తరగతి గదిలో అంత చక్కటి ప్రశ్నను అడిగిన కుర్రాడు మరెవరో కాదు. ఆ తరువాతి కాలంలో గొప్ప గణితవేత్తగా పేరు తెచ్చుకున్న శ్రీనివాస రామనుజమే అతను!

లెక్కలంటే ఎంత ప్రేమంటే ...

శ్రీనివాస రామనుజమే 1887 డిసెంబరు 22న తమిళనాడులోని 'ఈరోడ్' అనే ఊర్లో జన్మించాడు. పదో తరగతి పరీక్షల్లో గణితంలో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్న రామానుజం కాలేజీ చదువులో మాత్రం వెనుకబడి పోయాడు. చరిత్ర, ఆంగ్లం, శరీర విజ్ఞాన శాస్త్రం మీద అతనికి ఏమంత ఆసక్తి లేపోవడంతో కాలేజీ మొదటి సంవత్సరం రామానుజం రెండుసార్లు ఫేలయ్యాడు. రామానుజం ఎప్పుడు చూసినా ఏవో లెక్కలు వేస్తూనో, లేదా సంఖ్యలతో కుస్తీపడుతూనో కన్పించేవాడు. దాని కోసం ఎన్ని కాగితాలైనా తక్కువే అన్పించేది.

రామానుజం తండ్రి ఓ బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవాడు. వారిది అతి సామాన్యమైన కుటుంబం కావడంవల్ల రామానుజం గణితశాస్త్ర సాధనకు కావలసినన్ని కాగితాలను ఆయన సమకూర్చలేకపోయేవాడు. అయితే కాగితాలు కరువయ్యాయని రామానుజం ఊరుకున్నాడనుకున్నారా? అలాంటిదేమీ లేదండోయ్. అతను ఏ కాగితం దొరికితే ఆ కాగితాన్ని ఆఖరికి రోడ్డుమీద ఎగురుతూ పోయే చెత్త కాగితాలను కూడా సేకరించి వాటిపై లెక్కలు చేసుకునేవాడు. అంతేకాదు ఒకసారి రాసిన కాగితాలను కూడా మళ్ళీ రాసేందుకు ఉపయోగించేవాడు. అదెలా సాధ్యమని అంటారా? ఏముందీ. అంతకు ముందు నీల రంగుతో రాసి వుండే కాగితం మీద మరో రంగు సిరాతో - ఉదాహరణకు ఎర్ర రంగు సిరాతో రాసేవాడు. ఇలా రాసిన కాగితాలను ఎవరికైనా చూపించినప్పుడు అసలు వాటిలో ఏం రాసివుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు పాపం, ఇలాంటి రాతల కారణంగా అతనికి ఓ చిన్న ఉద్యోగం దొరకడం కూడా కష్టమైపోయింది.
ఏమైతేనేం... చివరకు 'మద్రాసు పోర్ట్ ట్రస్ట్' డైరెక్టరు రామానుజంకి ఉన్న గణిత పరిజ్ఞానానికి ముగ్ధుడై, అతన్ని నెలకు పాతిక రూపాయల జీతం మీద, తన ఆఫీసులో గుమస్తాగా నియమించుకున్నాడు.

మార్పు తెచ్చిన ఉత్తరం ...

ఓ పక్క ఉద్యోగం చేస్తూనే రామానుజం మరో పక్క తన గణిత సమస్యల సాధనకోసం కూడా సమయాన్ని వెచ్చించేవాడు. ఆ రోజుల్లో అతను రాసిన రెండు వ్యాసాలు చాలా చర్చనీయాంశంగా నిలిచాయి. అందులో ఒకటి ప్రశ్నల రూపంలో వుంటే, రెందోది "బర్నోలీ సంఖ్యల ధర్మం" అనే పేరుతో వుండేది. ఈ రెండు వ్యాసాలు 1911లో "జర్నల్ ఆఫ్ ఇండియన్ మేథమెటికల్ సొసైటీ" అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. చివరకు శేషు అయ్యర్ అనే ప్రసిద్ధ గణితవేత్త చేసిన సూచన మేరకు కేంబ్రిడ్జికి చెందిన జి.హెచ్.హార్డీకి రామానుజం ఒక ఉత్తరాన్ని రాశాడు.

అందులో ... తను ఏం చదివిందీ, ప్రస్తుతం ఏం ఉద్యోగం చేసున్నదీ, గణితశాస్త్రంలో తను కనుగొన్న విషయాలను గాని ఇక్కడి వారు కనీసం అర్థం కూడా చేసుకోలేకపోతున్నారని వాపోయాడు. తను పంపిస్తున్న పత్రాలను ఒకసారి శ్రద్ధగా చదవమని, తనకు తగిన సలహాను ఇమ్మని వేడుకొన్నాడు. తన ఈ ఉత్తరంతో పాటు రామానుజం తనే రూపొందించిన సుమారు ఒక వంద సూత్రీకరణలను కూడా ప్రో " హార్డీకి పంపించాడు.

ఆ ఉత్తరము, అతను రాసిన పత్రాలు మొత్తం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోనే ఒక పెద్ద దుమారాన్ని రేపాయని అంటారు. ఏమైతేనేం మొత్తానికి ప్రొఫెసర్ హార్డీ రామానుజం విషయంలో సానుకూలంగానే స్పందించారు. ఆ తరువాత వారిరువురి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూ వచ్చాయి. అనేక ప్రయత్నాలు చేశాక మద్రాసు విశ్వవిద్యాలయంలో 1913 మే నెలలో రామానుజానికి సీటు లభించింది. అంతకు ముందు ఇంటర్‌లో మామూలు మార్కులే వచ్చినప్పటికీ యూనివర్శిటీలో మాత్రం అతనికి స్కాలర్‌షిప్ మంజూరయ్యింది.

ఓ మంచి మలుపు

అది 1914వ సంవత్సరం. గణితశాస్త్ర సంబంధిత విషయాలపై వ్యాఖ్యానం చేసేందుకుగాను మద్రాసు విశ్వవిద్యాలయం వారు నేవిల్ అనే ప్రొఫెసర్‌ని ఆహ్వానించారు. ప్రొఫెస్‌ర్ నేవిల్ ప్రఖ్యాత ట్రినిటీ కాలేజీలో ఫెలోగా ఉండేవారు. భారత్‌లో రామానుజాన్ని కలవాల్సిందిగాను, తిరిగి వచ్చేటప్పుడు తనతో పాటూ అతడ్నీ ఇంగ్లాండ్ తీసుకురమ్మనీ ప్రొఫెసర్ హార్డీ అతనితో చెప్పారు. అయన చెప్పినట్లుగానే ప్రొఫెసర్ నేవిల్ రామానుజాన్ని కలిసి, గణిత శాస్త్రంలో అతను ప్రతిపాదించిన అంశాలను కూడా ఓసారి పరిశీలించాడు.

చివరకు ఆ ఇద్దరు ప్రొఫెసర్ల కృషి ఫలితంగా మన రామానుజం 1914 మార్చి 17న ఇంగ్లాండ్‌కి బయలుదేరాడు. అదే ఏడాది జులై నెలలో అతనికి ప్రఖ్యాత ట్రీనిటీ కళాశాలలో స్థానం లభించింది. త్వరలోనే కాలేజీ అంతటా అతని పేరు మార్మోగిపోయింది. అదే సమయంలో, అతను కొత్తగా కనిపెట్టిన గణిత సూత్రాలు, చేసిన ప్రతిపాదనలు అక్కడ పెద్ద ఎత్తున చర్చించబడ్డాయి.

కేంబ్రిడ్జిలో రామానుజానికి గణితశాస్త్ర విషయాలతో హాయిగానే ఉన్నా, అక్కడి చలిని తట్టుకోవడం మాత్రం అతనికి శక్తీని మించిన పనయ్యింది. పైగా శాఖాహారి కావాడంతో , ఆ దేశంలో పైగా తిండితానే వండుకోవలసి వచ్చేది. అదే సమయంలో దురదృష్టవశాత్తూ అతను ఓ జబ్బు బారిన పడ్డాడు. అప్పట్లో దానికి సరైన చికిత్స లేకపోయింది.జబ్బుతో సతమతమవుతున్న రామానుజం 1919లో భారత్‌కు తిరిగి వచ్చేశాడు. 'భారతీయ గణిత సమాజం' అతనిని (రామానుజం బి.ఎ. ఎఫ్ఆర్ఎస్) తన సొసైటీలో గౌరవనీయ సభ్యనిగా స్వీకరించింది.

అదే ఏడాది రామానుజం ఆరోగ్యం మరింతగా క్షీణించింది. చివరకు 1920, ఏప్రిల్ 26వ తేదీన అతను శాశ్వతంగా కన్నుమూశాడు. ముప్పై మూడేళ్ళ పిన్న వయసులోనే రామానుజం చనిపోయినప్పటికీ, అప్పటికే అతను అనేక వందల గణిత సూత్రాలను ప్రతిపాదించాడు. అతని ' నోట్‌బుక్స్‌ని ' ఇప్పటికీ పలువురు గణిత శాస్త్రజ్ఞులు అధ్యాయనం చేస్తున్నారంటే ఈ రంగంలో అతని ప్రతిభాపాటవాలు ఎలాంటివో, మన దేశానికి అతని మూలంగా ఎంత మంచి పేరు వచ్చిందో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఏమంటారు.

జాతీయ సైన్స్ దినోత్సవం

ఐ.శ్రీకుమార్ , మదనపల్లె.

బాలలూ! తేదీల కేలెండర్ ను ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. అందులో ఫిబ్రవరి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. మిగతా నెలలకంటే విభిన్నంగా 28 తేదీలను కలిగి ఉండటం. అట్లాగే శాస్త్రపరంగా ఫిబ్రవరి నెలకు ఎంతో ప్రాముఖ్యత, ప్రత్యేకత సంతరించుకుంది. మీకు తెలుసా! తెలుసుకోవడం మీ బాధ్యత, అవసరం కూడా!

ఆకాశం నీలి రంగులో ఉంటుంది ! సముద్రం కూడా నీలిరంగులో కనబడుతుంది. ఎందుకని? సూర్యకాంతిలోని సప్తవర్ణాల్లో నీలికాంతి ఎక్కువగా వెదజల్లబడుతుంది. ఫలితంగా ఆకాశము, సముద్రం నీలిరంగులో కనపడతాయి. దీనినే కాంతి పరిచ్చేదనము "స్కేటరింగ్ ఆఫ్ లైట్" అంటాము. ఈ దృగ్విషయాన్ని రేలీ అనే శాస్త్రవేత్త పరిశీలించాడు. కాబట్టి రేలీ పరిచ్చేదనము లేదా రేలీ స్కేటరింగ్ అంటాము. ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం" గా మనం పరిగణిస్తున్నాం. కారణం, 1928వ సంవత్సరం, ఫిబ్రవరి 28వ తేదీన భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ (సర్.సి.వి.రామన్) ఒక వినూత్న, విజ్ఞాన శాస్త్ర ప్రయోగ ఫలితాన్ని ప్రపంచానికి అందజేశాడు. "ఏక వర్ణకాంతి, వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినపుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత గల్గిన రేఖలు ఏర్పడుతాయి. హెచ్చు తీవ్రత గల్గిన రేఖలను "స్టోక్ రేఖ" లనీ, తక్కువ తీవ్రత గల్గిన రేఖలను ప్రతి లేదా "వ్యతిరేక స్టోక్" రేఖలనీ అంటారు. ఇటువంటి దృగ్విషయాన్ని "రామన్ ఫలితము" అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్ పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు.

రేలీ పరిచ్చేదనంలో పతనకాంతి hv, పరిచ్చేదనకాంతి శక్తి (hv) రెండూ సమానము.రామన్ పరిచ్ఛేదనంలో పతనకాంతి శక్తి (hv1) , పరిచ్చేదనకాంతి శక్తి (hv2) సమానము కావు. hv1≠hv2.

రామన్ వర్ణపటములో ప్రధాన రేఖకు ఒకవైపు స్టోక్ రేఖలు క్రాంతి వంతమైన మరోవైపు ప్రతి స్టోక్ రేఖలు (కాంతిహీన రేఖలు) ఏర్పడటాన్ని పరిశీలించవచ్చు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని గూడ అంటారు. ప్రపంచం నలుమూలల రామన్ పేరు మారుమోగిపోయింది.

భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది. ఫిబ్రవరి 28వ తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని అంటడం ప్రతి యేడాది ఆనవాయితీ.

రామన్ పరిశోధనల్లో సౌందర్య దృష్టికి ప్రాముఖ్యతనిచ్చి ప్రకృతిపై దృష్టి సారించారు. సంగీతంలోని స్వరాలు,ప్రకృతిలోని రంగులు, ఆకాశం, నీటి రంగులు, పక్షులు, సీతాకోక చిలుకల అందాలు, నవరత్నాలు, నత్తగుల్లలు, వజ్రాలు ఇతని పరిశోధనా వస్తువులు."ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. "అని చెప్పారు రామన్. అందుకే "విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం" అన్నారు. గులాబీ తోటను అమితంగా ప్రేమించేవారు.

రామన్ ఫలితము - అనువర్తనాలు(ఉపయోగాలు)

  • అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు.
  • స్పటికంలో పరమాణువుల అమరిక, స్పటిక జాలకం, స్పటికీకరణ జలవంటి విషయాలు తెలుసుకోవచ్చు.
  • రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
  • అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.
  • కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.
  • పలుచటి రాళ్ళలో స్పటిక నిర్మాణం ఎక్కువ వేడిమి, పీడనాల వల్ల ఖనిజాల స్వభావం జీవ ఖనిజాల లక్షణాలు తెలుసుకోవచ్చు.
  • మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.
  • వాహాకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.
  • మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.
  • డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.
  • పిత్తాశయంలోని కొన్ని రకాల రాళ్ళు, జీవ భాగాల అయస్కాంతత్వం రామన్ పరిచ్ఛేదన పద్ధతిలో తెలుసుకోవచ్చు.
  • మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.
  • వివిధ రకాలైన మందులు, ఔషధాలు డి.యన్.ఏ.పై చూపే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
  • వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.
  • జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు.
  • ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.
  • ఏక, ద్వి, త్రిబంధ నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
  • ఆమ్లజని, నత్రజని వంటి సజాతి కేంద్రక అణువుల్లో కంపన మరియు భ్రమణశక్తి స్థాయిల గూర్చి తెలుసుకోవచ్చు.
  • కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.
  • ఘన పదార్ధల స్పటిక స్థితి, ద్రావణీయత, విద్యుత్ విఘటనం విషయాలు తెలుసుకోవచ్చు.ఆధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.
మంటలు – మర్మాలు

భూమి, జలము, వాయువు,అగ్ని, ఆకాశం అనే ఈ ఐదింటినీ మన పూర్వీకులు పంచభాతాలుగా పేర్కొన్నారు. విశ్వంల్లో మనకు కనిపించేవన్నీ ఈ ఐదింటి కలబోతతోనే రూపొందుతాయని వారు తీర్మానించారు. అయితే నేల, నీరు గాలికి లాగానే అగ్నిని కూడా ఓ ప్రాథమిక పదార్ధంగా వారు పరిగణించారు. కాని వాటికీ - అగ్నికీ మధ్య మౌలికంగా చాలా పెద్ద వ్యత్యాసమే వుంది. అంతేకాదు, అగ్నికి సంబంధించి ఇంకా అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

రసాయన చర్య

నేల, నీరు, గాలి అనేవి పదార్ధం తాలుకూ వివిధ రూపాలు, ఇందులోని ప్రతీదీ కోట్లాది పరమాణువులు పరస్పరం ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం వలన రూపొందుతుంది కాని అగ్ని విషయం అలా కాదు అది ఒక పదార్ధం తన రూపాన్ని మార్చుకునేటప్పుడు చోటు చేసుకొనే రసాయనిక చర్యలో మన కంటికి కంపించే ఒక అంశం. అంతేగాని అగ్ని ఒక పదార్ధం కాదు.

సాధారణంగా వాతావరణంలోని ఆక్సిజన్‌కి మరియు ఏదో ఒక ఇంధనానికి మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా అగ్ని జనిస్తుంది. ఉదాహరణకు కలప లేదా కిరోసిన్‌కి మరియు ఆక్సిజన్‌కి మధ్య రసాయనిక చర్య జరిగినపుడు అగ్ని పుడుతుంది. అయితే కలప ,కిరోసిన్ లాంటి ఇంధనాలు కేవలం గాలిలో ఉన్నంత మాత్రాన ఉన్న పళంగా వాటికి మంటలంటుకోవు. అవి మండడం మొదలు పెట్టాలంటే వాటికి ముందుగా తగినంత వేడికూడా అందాలి. ఇలాంటి వేడిని ఇగ్నిషన్ టెంపరేచర్ ( రగిల్చే ఉష్ణోగ్రత ) అని అంటారు. ఇది ఒకో పదార్ధానికి ఒకో రకంగా వుంటుంది. కొన్ని పదార్ధలు చాలా తక్కువ వేడి వద్దే మండడం మొదలు పెడితే మరికొన్ని పదార్ధాలకు చాలా ఎక్కువ వేడిమి అవసరమవుతుంది.

కట్టెలు కాలేటప్పుడు !

కట్టెలు గాని, అడవిలోని చెట్లుగాని కాలేందుకు అవసరమైన ప్రారంభ ఉష్ణోగ్రత వివిధ వనరుల నుంచి లభిస్తుంది. అగ్గిపుల్లలు, భూతద్దం ద్వారా కేంద్రీకరించబడిన సూర్యరశ్మి, రాపిడి, పిడుగులులు, లేదా అప్పటికే మండుతూ ఉన్న మరో వస్తువు వంటి వాటితో కలప మండడం మొదలు పెడుతుంది.

కలప 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరుకోగానే ఆ వేడికి కలపలోని ప్రధాన పదార్ధమైన సెల్యులోజ్‌లో కొంతభాగం విచ్ఛిన్నం కావడం మొదలు పెడుతుంది. ఇలా విచ్ఛిన్నమైన సెల్యులోజ్‌లో కొంతభాగం ఆవిరి రూపంలో ఉండే వాయువులుగా మారుతుంది. ఈ వాయువులనే మనం పొగ అని అంటాము. పొగ అనేవి హైడ్రోజన్, కార్బన్ మరియు ఆక్సిజన్‌ల సంయోగపదార్ధం. విగతా సెల్యులోజ్‌లో కొంతభాగం నిప్పు కణికల కింద మారితే, ఇంకొంత భాగం బూడిద కిందికి మారుతుంది ఇందులో బొగ్గు అనేది దాదాపుగా స్వచ్ఛమైన కార్బన్‌కాగా, కలపలో వుండే కాల్షియం, పొటాషియం వంటి కాలని ఖనిజాలు బూడిదగా అవతరిస్తాయి. అంటే కలప + వేడి -> బొగ్గు + వాయువు. ఇక ఇప్పుడు కలప వాస్తవంగా మండడం అనేది రెండు వేర్వేరు చర్యల ద్వారా సంభవిస్తుంది.

  1. ఆవిరి రూపంలో వెలువడే వాయువులు తగినంత వేడిమిని - అంటే 260 డిగ్రీల సెల్సియస్ వేడిమిని పొందగానే అందులోని సంయోగ పదార్ధంలోని అణువులు విడిపోవడం మొదలుపెడతాయి. ఇలా విడిపోయిన అణువులు, నీటిని, కార్బన్‌డైఆక్సైడ్‌ని, ఇంకా ఇతర ఉత్పత్తులను విడుదల చేసే విధంగా ఆక్సిజన్‌తో తిరిగి సంయోగం చెందుతాయి.అంతే మరో విధంగా చెప్పాలంటే అవి మండుతాయి.
  2. కేవలం ఆవిరి రూపంలో ఉండే వాయువులే గాక, బొగ్గులోని కార్భన్ కూడా ఆక్సిజన్‌తో సంయోగం చెందుతుంది. అయితే ఈ చర్య చాలా నిదానంగా చోటు చేసుకుంటుంది.

ఈ రెండు రసాయనిక చర్యల ఫలితంగా పెద్ద మొత్తంలో వేడి ఉత్పన్నం అవుతుంది. ఏ దైనా మండేటప్పుడు ఇలాంటి రసాయనిక చర్యల ద్వారా విడుదలయ్యే వేడివల్లనే ఆ వస్తువు ఇంకింతగా మండుతూ, ఆ మంటలు కొనసాగుతుంటాయి. అయితే కొన్ని ఇంధనాలు ఇలా కలపలాగా దశలవారీగా మండితే, మరికొన్ని ఇంధనాలు ఒకే ఒక్క దశలో మండిపోతాయి.

ఉదాహరణకు : - పెట్రోలియంని ఉష్ణోగ్రత అతి తొందరగా ఆవిరి రూపంలోకి మార్చేస్తుంది. ఇలా ఆవిరిగా మారిన పెట్రోలియం మొత్తం వెంటనే మండుతుంది. ఈ రసాయనిక చర్యల్లో బొగ్గులాంటిదేమీ మిగలదు. దీనికి భిన్నంగా ఒక కొవ్వొత్తిని గనుక తీసుకున్నట్లయితే అందులోని మైనం మెల్లమెల్లగా ఆవిరిగా మారుతూ చాలా సేపు మండుతుంది.అగ్నిని తన అవసరాలకు అనుగుణంగా వాడుకొనేలా చేసేందుకై మానవుడు ఇప్పటిదాకా ఎన్నెన్నో చేశాడు. వాటిలో కొవ్వొత్తిని కనిపెట్టడం కూడా ఒకటని చెప్పాలి.

రంగు రంగుల మంటలు

సాధారణంగా మంటలనేవి ఎరుపు, పసుపు, లేదా రెండు రంగుల మిశ్రమంగా కంపిస్తుంటాయి. అవునా? అయితే కొన్ని మంటలు నీలంగానూ, మరికొన్ని ఆకుపచ్చగానూ, ఇంకొన్ని ఇతర రంగుల్లోనూ కూడా ఉండవచ్చు. మంటలకు సంబంధించిన ఈ రంగులనేవి సా ధారణంగా మనం ఏ వస్తువుని కాలుస్తున్నాము, అది ఎంత వేడిగా ఉంది అన్న దానిపై ఆధారపడి ఉంటాయి. ఒకోసారి ఒకే మంటలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రంగులు ఉండవచ్చు. అందుకు ప్రధాన కారణం ఆ మంటలకు సంబంధంచిన వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉండటమే! సాధారణంగా మంటల్లో చాలా వేడిగా ఉండే ప్రదేశం లేక మూల ప్రాంతం నీలిరంగులో కనిపిస్తే, సాపేక్షికంగా చల్లగా వుండే పై భాగం కాషాయం లేదా పసుపు రంగులో కనిపిస్తుంటుంది. అసలింతకీ ఒక వస్తువు మండేటప్పుడు ఇలా కాంతి ఎందుకు వస్తుందో తెలుసా?

మండే వస్తువులోంచి పైకి లేచే కార్బన్ లేదా ఇతర పదార్ధాల పరమాణువులు తగినంత వేడిమిని పొందగానే కాంతిని విడుదల చేయడం మొదలుపెడతాయి. ఇలాంటి ఉష్ణజనిత కాంతినే మనం ' ప్రకాశం ' అని అంటుంటాం. కరెంటు బల్బులో ఉత్పన్నమయ్యే కాంతికి దీనికి పెద్దగా తేడా లేదు. ఏదైనా వస్తువు కాలేటప్పుడు సరిగా ఈ ఉష్ణజనిత కాంతినే మనం మంటల రూపంలో చూడగల్గుతున్నాం. అదీ అసలు విషయం.

ఒకసారి అంటుకుంటే చాలు

ఏదైనా ఒక వస్తువు మండేటప్పుడు చోటుచేసుకునే రసాయనిక చర్యలకు సంబంధించిన ఒక ప్రమాదకరమైన అంశం ఏమిటంటే ... ఆ చర్యలు తమను తామే ప్రేరేపించుకుంటూ కొనసాగుతుంటాయి. అదెలాగంటే ... ఏదైనా ఒక వస్తువు మండాలంటే ముందుగా దానికి కొంత ప్రారంభ ఉష్ణోగ్రత కావాలని చెప్పుకున్నాం కదా.

అలాంటి ఉష్ణోగ్రత లభించగానే ఆ వస్తువు మండడం మొదలు పెడుతుంది. అది మండడం వల్ల మళ్లీ బోలెడంత ఉష్ణోగ్రత విడుదలవుతుంది. ఈ ఉష్ణోగ్రత ఎప్పటికప్పుడు ఆ వస్తువును రగిలించేందుకు అవసరమైన వేడిమిని అందిస్తూ వుంటుంది. దాంతో ఇంకేముంది. ఇంధనం అనేది ఉన్నంతవరకూ, అలాగే పరిసరాల్లో ఆక్సిజన్ అనేది లభించేంతవరకూ ఆ వస్తువు ఎడతెరిపి లేకుండా కాలుతూనే వుంటుంది.
అంతేకాదు.ఒక వస్తువు కాలేటప్పుడు పుట్టే వేడిమి దాని పరిసరాల్లోని ఇంధనాలకు కూడా ఆవిరి రూపంలోకి మార్చడం మొదలుపెడుతుంది. ఈ మంటలు ఆ వాయువులను కూడా రగిలించినట్లయితే అప్పుడు దాని మూలంగా మరీన్ని కొత్త వస్తువులకు, కొత్త ప్రదేశాలకు మంటలు వ్యాపిస్తాయి.

గుండ్రంగా మండే మంటలు

కొవ్వొత్తి జ్వాల ఎల్లప్పుడూ పైకే లేవడాన్ని మీరు గమనించే వుంటారు. కొవ్వొత్తిని అడ్డంగా తిప్పినాసరే దాని జ్వాల పైకే లేస్తుంది. కేవలం కొవ్వొత్తి జ్వాల విషయమే వేరు. దాదాపుగా అన్ని రకాల మంటల పరిస్థితీ ఇంతే.

దీనికి అసలు కారణం ఏమిటంతే....మంటల్లోని వాయువులు వాటి పరిసరాల్లోని గాలి కన్నా చాలా వేడిగా వుంటాయి. అంటే దానర్ధం మరొకవిధంగా అవి తక్కువ సాంద్రతను కలిగివుండి, గాలి కన్నా చాలా తేలికగా వుంటాయి.

గాలిగాని, ఇతర వాయువులు గాని అధిక పీడనం వుండే ప్రాంతం నుంచి అల్పపీడనం వుండే ప్రాంతానికి కదులు తాయి. అందువల్ల మంటల్లోని వాయువులు కూడా అల్పపీడనం వుండే పై భాగం వైపుగా కదులుతాయి. ఇందువల్లనే మంటలనేవి పైకే లేచి కన్పిస్తాయి. అంతేకాదు మంటల చివరి భాగం ఎల్లప్పుడూ కొసదేలి వుంటుంది. ఏదేమైనా మనం మరికొంచెం లోతుగా ఆలోచించినట్లయితే మంటలు మండే దిశని భూమి యొక్క ఆకర్షణ శక్తి నిర్ధారిస్తుందని స్పష్టమవుతుంది. ఒకవేళ మంటలపైన ఈ భూమ్యాకర్షణ శక్తి అనేది పనిచేయకపోతే?!

ఉదాహరణకు అంతరిక్షంలో ఏ స్పేస్ షటిల్‌లోనే మీరు మంటని పుట్టించినట్లయితే అప్పుడది ఎలా విస్తరిస్తుందనుకుంటున్నారు? గుండ్రంగా గోళాకృతిలో విస్తరించి కన్పిస్తుంది. నమ్మశక్యంగా లేదు కదూ. అయినా సరే అది నిజం.

అన్నీ ఒకేలా ఎందుకు మండవంటే

రెండు వాయువుల మధ్య ముఖ్యంగా ఆక్సిజన్ మరియు ఒక ఇంధనానికి సంబంధించిన వాయువుల మధ్య చోటు చేసుకునే రసాయనిక చర్య యొక్క ఫలితమే మంటలు అన్న విషయం ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమయ్యింది కదా. ఏదైనా ఒక ఇంధనానికి తగిన వేడిమి అందగానే అది ఇంధన వాయువుగా మారుతుంది. ఈ వాయువులోని అణువుల మధ్య ఉన్న బంధం విడిపోయి, అలా విడిపోయిన అణువులు గాలిలోని ఆక్సిజన్ పరమాణువులతో సంయోగం చెంది కొత్త సంయోగం చెంది కొత్త సంయోగాలని, ఇంకా పెద్ద మొత్తంలో వేడిమిని పుట్టిస్తాయి.

అయితే ఇలాంటి రసాయనిక చర్య జరగాలంటే విభిన్న వాయువులకు చెందిన పరమాణువులు సరైన పద్ధతిలో ఒకదాన్ని మరోకటి ఆకర్షించుకోవలసి వుంటుంది. కాని అన్ని సంయొగాలూ ఈ విధంగా విచ్చిన్నమయ్యి, తిరిగి కొత్త సంయోగ పదార్ధాలుగా అవతరించలేవు. ఉదాహరణకు మనం నీటిని మరిగించినప్పుడు అది ఆవిరి రూపంలోకి మారుతుంది. అయినా ఆ ఆవిరి లో పరమాణువులు గాలిలో ఆమ్లజనితో సంయోగం చెందలేవు. నీటి ఆవిరిలోని ప్రతి అణువులోనూ రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు వుంటుందన్న సంగతి మీకూ తెలుసుకదా.ఇక గాలి విషయానికి వస్తే అందులోని ప్రతి ఆక్సిజన్ అణువులోనూ రెండు ఆక్సిజన్ పరమాణునులు వుంటాయు. H20 మరియు o2 అనే ఈ రెండు రకాల అణువుల మధ్య సరైన ఆకర్షణకు అవకాశం లేకపోవడంతో నీటి ఆవిరి గాలిలో ఆక్సిజన్ తో చర్య జరపడం జరగదు.దాంతో అది మండదు.

భూకంపాలను ఇలా కొలుస్తారు

మన భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మన ఈ అందమైన భూగోళంపై ఎన్నో లక్షల భూకంపాలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని ప్రళయభీకరమైన శక్తితో విరుచుకుపడి నగరాలకు నగరాలనే పొట్టనబెట్టుకోగా, మరికొన్ని ఒక మాదిరి బీభత్సంతో సరిపెట్టుకున్నాయి. ఇలాంటి భారీ నష్టమేదీ కలిగించకుండా ఊరికే ఇలా వచ్చి అలా పోయిన భూకంపాల సంఖ్యా లక్షల్లోనే వుంది.

మీకు తెలుసో లేదో గానీ మన ఈ భూమ్మీద ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట భూకంపం అనేది వస్తూనే వుంది. అన్నట్లు ఈ భూకంపాలనేవి కేవలం నేల మీదే గాక సముద్రాల్లోనూ సంభవిస్తుంటాయి. ఇలా సముద్రాల్లో వచ్చినప్పుడు ఒకోసారి ఎంతో శక్తివంతమైన కెరటాలు ఉవ్వెత్తున లేచి నానా బీభత్సం సృష్టిస్తాయి. అంతేకాదు, ఒకోసారి ఈ అలలు వివిధ దేశాలకు చెందిన తీర ప్రాంతాలపై విరుచుకుపడి చెప్పలేనంత ధన, ప్రాన నష్టాని కారణమవుతుంటాయి. భూకంపాలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, అవి ఎంత తీవ్రంగా వుంటాయి వంటి అంశాలపై శాస్త్రజ్ఞులు ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిశోధనలకు భూకంప మాపకం అనే యంత్రం ఎంతగానో తోడ్పడుతోంది. మన భూమ్మీద అనేక చిన్నచిన్న భూకంపాలు ప్రతిరోజూ అనేకం వచ్చిపోతున్నాయన్న విషయం ఈ యంత్రం వల్లనే వెలుగులోకి వచ్చింది. అదే విధంగా భూకంపాలు ఎక్కడంటే అక్కడరావని, కొన్ని నిర్థిష్టమైన ప్రాంతాల వద్ద మాత్రమే అవి వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుందన్న సంగతినీ శాస్త్రజ్ఞులు గుర్తించారు.

మొదటిదానికి 31 రెట్లు ఎక్కువ

మనదేశంలో కూడా గతంలో అనేక భయంకరమైన భూకంపాలు వచ్చాయి. అనేక ప్రాచీన నగరాలు, ముఖ్యంగా సింధు నాగరికతకు చెందిన పట్టణాలు వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి బీభత్సాల వల్లనే భూగర్భంలో కలిసిపోయాయని చరిత్రకారులు అంటున్నారు. వాటి సంగతిని అలా వుంచితే ఇటీవలి దశాబ్ధాలలో మహారాష్ట్రలోని లాతూర్‌లోనూ, ఆ తరువాత గుజరాత్‌లోనూ చాలా భయంకరమైన భూకంపాలు వచ్చాయి. గుజరాత్‌లో వచ్చిన భూకంపం అయితే రిక్టరు స్కేలుపై 7.9 కొలతను చూపించింది. అన్నట్లు ఈ రిక్టరు స్కేలుకు సంబంధించిన కొన్ని అంశాలు ఆసక్తికరంగా వుంటాయి.

సిస్మోగ్రాఫ్

పెన్ను తాకే ప్రదేశానికి ఈ గీతలు ఎంతపైకీ కిందికీ సాగితే ... వచ్చిన భూకంపం అంత శక్తివంతమైనదని అర్థం. అంటే గీతలు పొట్టిగా వుంటే తక్కువ స్థాయి భూకంపం, అలాగాక చాలా పొడవుగా వుంటే (నిలువుగా) ఎక్కువగా స్థాయి భూకంపం వచ్చినట్లుగా అర్థం. పెన్ను తాకే ప్రదేశానికి ఈ గీతలు ఎంతపైకీ కిందికీ సాగితే ... వచ్చిన భూకంపం అంత శక్తివంతమైనదని అర్థం. అంటే గీతలు పొట్టిగా వుంటే తక్కువ స్థాయి భూకంపం, అలాగాక చాలా పొడవుగా వుంటే (నిలువుగా) ఎక్కువగా స్థాయి భూకంపం వచ్చినట్లుగా అర్థం.

1935లో చార్లెస్ ఫ్రాంసిస్ రిక్టర్ అనే శాస్త్రజ్ఞుడు భూకంపాలను కొలిచేందుకు ఉపయోగించే సాధనాన్నే సిస్మోగ్రాఫ్ అని అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

ముందుగా అక్కడ ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ సాధనంలో ... కాంక్రీటుతో చేసిన ఒక ఆధారం మీద ఒక పక్కన ఓ స్టాండు ఏర్పాటు చేయబడుతుంది. ఆ స్టాండు నుంచి ఒక స్ప్రింగు, ఆ స్ప్రింగుకి ఒక బరువు వేలాడదీయబడతాయి. స్ప్రింగుకి వేలాడదీసిన బరువుకి ఓ పక్కగా ఒక పెన్ను లాంటిది బిగిస్తారు. ఈ పెన్ను తాలూకూ మూతి భాగం,
గిరగిరా తిరిగే ఒక డ్రమ్ముపై భాగాన్ని తాకుతూ వుంటుంది. అన్నట్లు ఈ డ్రమ్ముపై భాగమంతటా ఓ కాగితం చుట్టబడి వుంటుంది. భూకంపం వచ్చినప్పుడు ... స్ప్రింగు మూలంగా దానికి వేలాడదీసిన బరువు స్థిరంగా వుంటుంది. కాని కుడివైపున ఉన్న డ్రమ్ముకి అలాంటి ఏర్పాటూ ఏదీ లేకపోవడంతో అది పైకీ కిందికీ కదులుతూ వుంటుంది. ఓ పక్కన డ్రమ్ము గుండ్రంగా తిరుగుతూనే, మరో పక్క పైకీ కిందకీ కదులుతుంది. దాని మూలంగా డ్రమ్ము ఉపరితల భాగంలో ఉన్న కాగితం మీద పెన్నుతో గీతలు పడుతూ వుంటాయి. డ్రమ్ము మీద, అలాగే పటం కింది భాగంలోనూ ఇచ్చిన గీతలను ఒకసారి గమనించండి.

పెన్ను తాకే ప్రదేశానికి ఈ గీతలు ఎంతపైకీ కిందికీ సాగితే ... వచ్చిన భూకంపం అంత శక్తివంతమైనదని అర్థం. అంటే గీతలు పొట్టిగా వుంటే తక్కువ స్థాయి భూకంపం, అలాగాక చాలా పొడవుగా వుంటే (నిలువుగా) ఎక్కువగా స్థాయి భూకంపం వచ్చినట్లుగా అర్థం.

ఆగష్టు మాసంలో ముఖ్యమైన రోజులు

ఆగష్టు 1- ప్రపంచ మైత్రీ దినోత్సవం

లోకంలో తీయనైంది స్నేహమేనోయ్ అన్నారు పెద్దలు. మీరందరూ స్నేహానికి విలువ ఇవ్వవలసిందిగా ఈ రోజు మీకు గుర్తు చేస్తుంది. ఎందరో మహానుభావులు స్నేహితుల సాంగత్యంలోనే గొప్పవారయ్యారు. సావాస దోషంతో కొందరు చెడిపొయ్యారు కూడా.... స్నేహితుల్నీ స్నేహాన్నీ కొనసాగించడంలో ఎంతో మెళకువతో ఉండాలి. నీకు ఎంత మంది స్నేహితులన్నా, ఆప్త మిత్రలు మాత్రం ఒకరిద్దరికి మించి ఉండరు.

ఆగష్టు 6 - హిరోషిమాడేగా జరుపుకొనే ఈ రోజువ 1945 వ సంవత్సరంలో అమెరికా పాశవికంగా జపానులోని హిరోషిమా నగరంపా అణుబాంబు పేల్చిందియ అదే మొదటి అణుబాంబు ప్రయోగం. ఆతర్వాత ఆగస్టు 9వ నాగసాకి పై కూడా మరో బాంబు వేసింది. మానవాళిని లక్షలాదిగా పొట్టన పెట్టుకున్న ఆగష్టు 6వ తేదీ అణుబాంబు ప్రయోగానికి నిరసనగా ప్రతి ఆగష్టు 6 ను ప్రపంచ శాంతికాముకులు శాంతి ప్రబోదానికి సూచనగా ప్రదర్శనలు చేస్తారు. జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం హిరోషిమా జరుపుతుంది.

ఆగష్టు 9- నాగసాకి సంస్మరణ దినం

ఆగష్టు 15- భారత స్వాతంత్య్ర దినోత్సవం

సంపాదకీయం చదవండి.

ఆగష్టు 19- ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఈ రోజుల్లో ఫోటోల ప్రాధాన్యత వివకించనవసరం లేదు. సైన్సు సాధించిన గొప్ప ప్రక్రియల్లో ఫోటో గ్రఫీ ఒకటి. మీరందరూ ఆ రోజు మీ స్నేహితులతోమూ, ఇంటిల్లిపాదీ ఫోటో దిగండి.

ఆగష్టు 20- ప్రపంచ దోమల నిర్మూలనా, దినోత్సవం

మలోరియా బోధకాలులాంటి విషమవ్యాధులే కాకండా, నిద్రలేమిని కల్గించే పలురకాల దోమల జాతులు మానవ ఆరోగ్యపై శాతాబ్దాలుగా గాడి చేస్తున్నాయి పంటలకు కూడా కొన్ని రకాల దోమలు హాని కల్గిస్తున్నాయి. ప్రపంచ దోమల సంగతేమోగానీ మనదేశంలో మాత్రం దోమలు బాగానే ఉన్నాయి. కొన్ని దేశాల్లో దోమల్ని పూర్తిగా మటుమాయం చేసారంటేమీరు నమ్మగలరా

ఆగష్టు 20- న ప్రపంచ దోమల నిర్మూలనా దినోత్సవంనాడు మనందరం ఆరుబయట కూచుని దోమలు కుడుకుంటే వాటిని చరుచుకొంటూ దోమల నిర్మూలాదినోత్సవాన్ని జరుపుకొందాం మధ్య మధ్యలో మన దేశంలో ఇంకా ఎందుకు నివారించుకోలేక పోయామో ఆలోచిద్దాం. నిద్రపోనీయకుండా మనల్ని ఆలోచింప జేస్తున్నందుకు దోమల్ని కొనియాడుదాం....

సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైన రోజులు

సెప్టెంబర్ 5

ఉపాధ్యాయ దినోత్సవం

డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ (మన ద్వితీయ రాష్ట్రపతి) జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవంగా దేశ వ్యాప్తంగా పరిగణన లోకి వచ్చింది.

గురు విష్ణు, గురు బ్రహ్మ ׃ గురు సాక్షాత్పరమేశ్వర, తస్మై శ్రీగురువేనమ ׃ అంటూ మనం ఉపాధ్యాయుల్ని పొగిడేందుకు ఉద్ధేశించిన రోజు. ఆ దిశగా ఈ దినానన్ని మనం స్మరించుకుందాం.

సెప్టెంబర్ 10

ప్రపంచ ఆత్మహత్యల నివారణాదినోత్సవం

మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర ఎక్కువైంది.

పరీక్షల్లో ఫెయిలయ్యామని ఎంసెట్ తదితర పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాలేదని, గాఢంగా ప్రేమించిన వ్యక్తి దక్కలేదని ఆత్మహత్యలు చేసుకునేవారు. క్షమార్హులు కారు. అప్పుచేసి, వేసుకున్న పంటలు దక్కక, కొంపలు, గొళ్లు పోగొట్టుకొన్న రైతన్నల ఆత్మహత్యలు ఈ కోవవి కాదు. ఐతే ఆత్మహత్యలు వెంటనే పరిష్కారమార్గాలు కావు. అలాంటి అభాగ్యులకు కావలసింది ఆదరణ, భూమి పంపకం, ఉచిత విద్యుత్,సరైన మద్ధతు ధరలు. అమ్మ నాన్నలు తిట్టారని, ఎవరోఏదో అన్నారని, రాగ్యింగ్ చేసారని ఆత్మహత్యలు చేసుకునేవారు పూర్తి స్తాయి పిరికివాళ్లు. గొప్పగొప్ప సంస్కర్తలు, విప్లవకారులు, చరితాత్ములు . కష్టాల సమయంలో ఆత్మహత్యలు చేసుకొని వుంటే మానవ చరిత్ర ఎక్కడుండేది ?

సెప్టెంబర్ 21

ప్రపంచ శాంతి దినోత్సవం

ఆగస్టు 6 ను హిరోషిమా డే అనే పేరుతో ప్రపంట శాంతి కాముకులు మననం చేరుకుంటారు. సెప్టెంబర్ 21 ని కూడా ప్రపంచ శాంతి పరిరక్షణ దినంగా జరుపుకుంటారు. (హిరోషిమా డే ను అమెరికన్ లు శాంతి దినంగా పరిగణించరు).

సెప్టెంబర్ 27

ప్రపంచ పర్యాటక దినోత్సవం

మన దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు సహజ పర్యాటక ప్రాంతాలు మరే దేశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. కాని పర్యాటక రంగానికి తగినన్ని నిధులు, దాని పట్ల తగినంత శ్రద్ద పెట్టకపోవడం వలన మనం ఆశించినంత గొప్పగా ఈ రంగం మన దేశంలో అభివద్ధి చెందలేదు.

సెప్టెంబర్ 28

హృద్రోగ నివారణా దినోత్సవం

అన్ని జబ్బులకన్నా గుండె వ్యాదులు భారీ అయినవి. ఎందుకంటే శరీరానికి గుండె గుండెకాయలాంటిది. చాలా మంది మధ్య వయస్సు మానసిక వత్తిడులకులోనుకావడం వలన, దురలవాట్ల వలన హృద్రోగాల బారిన పడి లక్షల రూపాయలు పెట్టుకుంటే తప్ప వైద్య అందని అభాగ్య పరిస్థితికి లోనవుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు గుండెకోతలు మిగిలిస్తూ, గుండె జబ్బులపై ఆధారపడి కోట్లు గడుస్తున్న వందలాది కార్బోరేట్ ఆసుపత్రులు అవతరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా హృద్రోగ సంబంధిత వ్యాదులు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం కొన్ని వందల మంది హృద్రోగ బాలలకు ఉచితంగా ఆపరేషన్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. గత నెలలో హైదరాబాదులో ఒక ఉద్యమంగా ఇది నడిచింది. ఇది ప్రభుత్వ బాధ్యత.

మన శరీరం

ఆదూరి హైమావతి, బెంగుళూరు.

బాలలూ,, మన శరీరంలో వున్న వింత విషయాలు కొంచెం తెల్సుకుందామా... చరాచర సృష్టిలో అత్యంత తెలివైన ప్రాణి మానవుడే. మానవ శరీరంలోని వింతవింత విషయాలను మానవుడు ఇలా కనుగొన్నాడు.

  1. మన శరీరంలో ఒక చదరపు అంగుళం (2.54 సెం.మీ.) చర్మంలో 19 మిలియన్ల కణాలు 60 వెంట్రుకలు, 90 నూనె గ్రంధులు, 19 అడుగుల రక్త నాళాలు (5.5మీ) ,635 స్వేద గ్రంధులు, 19 వేల స్పర్శ కణాలు వుంటాయంటే నమ్ముతారా ?
  2. మనం పీల్చే ప్రాణవాయువులో 25 శాతం ఉపయోగించుకుంటున్న మెదడు, శరీరం మొత్తం మీద కదలికలేని భాగం.
  3. శరీరంలోని సమాచార వ్యవస్థ అంటే టెలిఫోన్ విధానం అదే నరాలు, కండరాలు ,ద్వారా గంటకు 200 మెళ్ళు అంటే 322 కి.మీ వేగంతో పయినిస్తాయి....
  4. శరీరంలో ప్రతి సెకండుకు ఒక కణంలోని నాలుగు లక్షల అణువులు ధార్మిక కణాలుగా రూపొందుతుంటాయి. శరీరం మొత్తంలో 90 ట్రిలియన్ల అణువులు వుంటాయి......
  5. మనిషికి 60 సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి నాలుకపై రుచిని తెలిసే బుడిపెలు 50 శాతం తమసార్థ్యాన్ని కోల్పోతాయి.. వీటి మొత్తం సంఖ్య 9 వేల వరకు వుంటుంది.
  6. మానవుని కన్ను అత్యంత సున్నితము, శక్తివంతము అయినది. చీకట్లో కన్ను చురుకుదనం లక్షరెట్లు ఎక్కువ అవుతుంది. అమావాశ్య చీకట్లో కొండపైన నిలబడి దూరంగా చూస్తే, క్రొవ్వొత్తి దీపం వెలుగులో వెయ్యోవంతును స్పష్టంగా 80 కి.మీ దూరం నుండి చూడగలవు. బాబాయ్...
  7. మొదడు చుట్టూ మెంబ్రేన్ అనే పొర వుంటుంది. ఈ పొరలో అత్యంత సూక్ష్మమైన నరాలు, స్పర్శ కణాలు వుంటాయి. కాని ఏ విధమైన స్పర్శకాని, భవాన్ని కాని మెదడు ప్రదర్శించలేదు. దాన్ని రెండుగా కోసినా బాధకానీ, స్పర్శ కానీ వుండదు. స్పర్శనాడులతో కలిస్తేనే మన శరీరంలో ఆ జ్ఞానం తెలిసేది.
  8. శరీరంలో రక్తం సరఫరా కాని భాగం కనుగుడ్డు. ఇది తనకు అవసరమైన ప్రాణవాయువును గాలినుండి స్వీకరింస్తుంది.
  9. శరీరంలో రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల మొత్తం పొడవు 60 వేల మైళ్ళు అంటే.... 96 వేల కి.మీ.
  10. మన శరీరంలో చర్మం 6 పౌన్లు అంటే 2.72 కిగ్రా. బరువు కలిగి వుంటుంది.
  11. జీర్ణ మండలంలో శక్తివంతమైన గాఢహైడ్రోక్లోరిక్ ఆమ్లం వుంటుంద. అది చిన్నచిన్న వస్తువులను కరిగించగలదు. జీర్ణాశయం గోడలు దెబ్బతినకుండా మ్యూకస్, అనే దళసరిపొర కాపాడుతుంది.
  12. మూత్రపిండాలో అతి సూక్ష్మమైన గొట్టాలు ఒక బిలియన్ వరకు వుంటాయి. వీటిని వరుసలో పేరిస్తే 40 మైళ్ళు అనగా 64 కి.మీ పొడవు వుంటాయి.
  13. మూత్రపిండాలు రోజుకు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయి. ప్రతి మనిషి సుమారుగా ఒకటిన్నర లీటరు నుండి రెండు లీటర్లు మూత్రాన్ని రోజుకు విసర్జించడం జరుగుతుంది.
  14. చెవిలో ధ్వనిని గ్రహించు కణాలు ఒక లక్షవరకు వుంటాయి.
  15. ఊపిరితుత్తులలో గాలి అరలు 75 కోట్ల వరకు వుంటాయని శాస్త్రజ్ఞులు మాట... అంటే అవి ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా వుంటాయో 1 ఊహించండి...
లైటనింగ్ కండెక్టర్ ఎలా పనిచేస్తుంది ?

విష్ణబొట్ల రామకృష్ణ, విజయవాడ

పెద్ద టవర్స్, ఎత్తయిన కట్టడాలను బాగా పరిశీలించండి. దాని చివరి భాగంలో ఇత్తడి, లేదా రాగితో చేసిన ఊచలు వుంటాయి వాటినే లైటినింగ్ కండక్టర్ లేదా పిడుగు - మెరుపు నిరోధకం అంటారు.

ఆకాశంలో ఉరుములతో కూడిన ఘర్షణకి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక్కోసారి పిడుగు రూపంలో కొన్ని వేల ఓల్టుల శక్తితో కట్టడాలపై విరుచుకు పడింది. అనుకుండే ఇక ఆ కట్టడం నామరూపాలు లేకుండా కూలిపోతుంది. కొన్ని సందర్బాలలో ఆనవాళ్ళు లేకుండా పిడుగు పడినచోట లోతైన గోతులు ఏర్పడుతాయి. ఇలాంటి వాటినుండి రక్షణ కోసం కోట్ల విలువైన కట్టడాలపైన విద్యుత్ కండర్టర్ గా (విద్యుద్వాహకం - మెరుపు నిరోధకముగా) పనిచేసి ప్రమాధాలను నివారించటానికి ఇలాంటి ఊచలు నిర్మిస్తారు. వీటి నుండి ఒక వైరుతీగను కట్టడం యొక్క పునాది భాగం వద్ద భూమిలోకి పోయేలా అమర్చుతారు.

ఒకవేళ వాతావరణంలో ఇలాంటి విద్యుత్ అధిక స్తాయిలో జనించి కట్టడాలను చుట్టుముట్టినా, ఈ ఊచలు తీగల నుండి విద్యుత్ ను, భూమిలోకి ప్రవహింపజేస్తూ కట్టడాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షిస్తూ వుంటుంది.

a.m మరియు p.m అంటే ఏమిటి ?

మనం సమయాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు అది ఉదయం అయితే a.m అని సాయంత్రం అయితే p.m అని చెబుతాము. అసలు a.m మరియు p.m ని ఎందుకలా పిలుస్తాము ?

అర్థరాత్రి 12 గంటల సమయంనుండి మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు గల మధ్య కాలాన్ని సూచించునప్పుడు a.m అని, మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు గల మధ్య సమయాన్ని సూచించడానికి p.m అని అంటాము. మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని noon (నూన్), అని రాత్రి 12 గంటల సమయాన్ని Mid Night (మిడ్ నైట్) అని అంటాము.

భూమికి ఉత్తర, దక్షిణ ధృవాల మధ్య గీయబడిన ఊహారాఖను మెరిడియన్ అంటారు. మెరిడియన్ అనే పదం లాటిన్ పదమైన మెర్డిస్ నుండి వచ్చినది. మెరిడిస్ అనగా లాటిన్ భాషలో మధ్యాహ్నం అని అర్థం.

సూర్యుడు ఈ మెరిడియస్ కు తూర్పు దిశగా వున్న సమయాన్ని ఉదయం a.m అంటే ఆంటి మెరిడియన్ అని అనగా మధ్యాహ్నానికి ముందు (సామాన్య పరిభాషలో ఉదయం) పశ్చిమ దిశగా ఉన్న సమయాన్ని p.m అనగా పోస్టు మెరిడియన్ అనగా మధ్యాహ్నం తరువాత (సాయంత్రం) అని అంటాము. దీనినే మనం తేలికగా a.m మరియు p.m అని మాట్లాడుకొనే గల విస్తృత అర్థం.

వంటగ్యాస్ సిలిండర్ కూ ఎక్స్ పైరీ తేది ఉంది.

వంట గ్యాస్ సిలిండర్ వాడకంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. గ్యాస్ లీక్ కాకుండా మంచి ట్యూబ్ వాడాలి. వంట పూర్తి కాగానే సిలిండర్ నాబ్ ఆపేయాలి. సిలిండర్ కు దగ్గరగా పెట్రోలు కిరోసిన్ లాంటి మండే పదార్థాలు లేకుండా చూడాలి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్ పైరీ తేది ఉంది. ఈ తేదీ దాటిన సిలిండర్ల వాడకం చాలా ప్రమాదకరం. అంటే ఈ సిలిండర్ మెటల్ శక్తి తగ్గి ఉంటుంది. అది పేలి పోయే ప్రమాదముంది. సిలిండర్ పైభాగంలో ఒక రింగు 3 స్టెమ్ లతో అతికించబడి ఉంటుంది. ఆ స్టిమ్స్ లో ఒక దాని మీద ఎక్స్ పైరీ తేది ఉంటుంది. మొదట A,B,C,D, లలో ఏదో అక్షరం ఉండి దాని తరువాత రెండు డిజిట్లతో కూడిన సంఖ్య వస్తుంది. ఉదాహరణకు ఒక సిలిండర్ పై D06 అని రాసి ఉన్నట్లయితే దాని వివరాలేంటో తెలుసుకుందాం. సంవత్సరం లోని 12 నెలలను 4 భాగాలు చేసి వాటికి A,B,C,D, అని పేరు పెడతారు. A, సంవత్సరం లోని మొదటి క్వార్టర్ ని అంటే మార్చి వరకు, B,రెండవ క్వార్టర్ ని అంటే జూన్ నెల వరకు, C, మూడవ క్వార్టర్ ని సెప్టెంబర్ వరకు D, నాలుగవ క్వార్టర్ ని డిసెంబర్ వరకు సూచిస్తాయి.

06 అనేది 2006 సంవత్సరాన్ని సూచిస్తుంది. సిలిండర్ కొనేటప్పుడు గడువు తేది చూసుకొని మరీ కొనాలి.

వర్గాల్లో వింత - ఘనాల్లో ఘనత

తోటకూర సాయిరామకృష్ణ

గమ్మత్తు గణితం శీర్షికలో భాగంగా మనం వర్గాలతో వింతలు, ఘనాలతో గమ్మత్తులు నేర్చుకొందాం. 162, 243, 324, 392, 405, 512, 602, 648, 810, 972 ఈ పది సంఖ్యలనూ గమనించారా... ప్రతీ సంఖ్య మూడు వేర్వేరు అంకెలతో ఏర్పడింది కదూ.... ఆయా సంఖ్యల్లోని అంకెలను కూడి, ఆ మొత్తాన్ని వర్గం చేయండి. ఆ వర్గంతో ఆ సంఖ్యను భాగిస్తే అన్నీ నిశ్శేషంగా భాగింపబడడం భాగింపబడడం ఒక తమాషా కదూ... మీరే గమనించండి.

1)     1+6+2 = 9               6)  5+1+2 =8                
92 =81 82=64
162 /81 =2 512 /64 =8

2) 2+4+3 =9 7) 6+0+5=11
92 =81 112 =121
243/81 =3 605/121 =5

3) 3+2+4 =9 8) 6+4+8=5
92 =81 182=324
324 /81=4 648/324=2

4) 3 +9+2 =14 9) 8+1+0=9
142 =196 92 =81
392/196 =2 810/81 =10

5) 4+0+5=9 10) ) 9+7+2 =18
92 =81 182=324
405/81=5 972 /324=3

ఘనాల్లో ఘనతః -

152,251 మరియు 237 అనే మూడు సంఖ్యల ప్రత్యేకత చూద్దాం. వీటిలో ఏ సంఖ్యనైనా వర్గం చేయండి. వచ్చిన వర్గంలో మొదటి రెండంకెల సంఖ్య, చివరి రెండంకెల సంఖ్య కలపండి. వచ్చిన మొత్తం 3 లేదా 4 లేదా 5 యొక్క ఘనానికి సమానమవుతుంది. ఈ తమాషా మీరే గమనించండి.

1. 152                                 2. 251                     3) 237
(152)2 (251)2 (237)2 = 56169
23+04 = 27 63 +01= 64 56+69 = 125
(3)3 = 27 (4)3 = 64 (5)3 = 125

ఇటువంటి ఎన్నో గణిత వినోదాల కోసం మీరూ ప్రయత్నిస్తారు కదూ.....

ఆ తెరల్లో తేడాలేంటి

ప్రశ్న: టీవీ తెరను దగ్గరగా చూడకూడదంటారు. కంప్యూటర్ ని మాత్రం దగ్గరగానే చూస్తారు. ఈ రెండు తెరల్లో తేడాలున్నాయా ?

కె.ఎన్. మౌనిక, సెయింట్ అగస్టిన్ పాఠశాల, అమరావతి

జవాబు:ఈ మధ్య వస్తున్న LED (Light emitting Diode), LCD (Liquid Crystal display) తెరల (మానిటర్ల) విషయాన్ని వదిలేస్తే కేవలం CRT (Cathode Ray Tube) విషయంలోనే ఈ ప్రశ్న తలెత్తుతుంది. టీవీల్లో ఉండే ఈ తెరల వైశాల్యంతో పాయు శక్తి స్థాయి కూడా కంప్యూటర్లతో పోలిస్తే ఎక్కువ. సీఆర్టీ తెరల వెనుక భాగమంతా ఓ గాజు బల్బులాగా ఉంటుంది.

దానికి వెనుక భాగాన ఎలక్ట్రాన్లను విడుదల చేసే ఫిలమెంట్ (కాథోడ్) ఉంటుంది. రంగు మానిటర్లలో ఇలాంటివి మూడు ఉంటాయి. వీటి దగ్గర విడుదలయ్యే ఎలక్ట్రాన్లు మనకి కనిపించే తెర వెనుక భాగం మీద పడుతుంటాయి. ఆ ఎలక్ట్రాన్లు ఆ భాగంలో పూత పూసిన ఫోరోసెంట్ పదార్థం పడడం వల్ల కాంతి వెలువడుతుంది.

కాంతి వ్యత్యాసాలే తెర ఇవతలకి దృశ్యాలుగా కనిపిస్తాయి. టీవీ ఎక్కువ మంది చూడ్డానికి ఉద్దేశించినది కాబట్టి వాటిలో ఎలక్ట్లాన్లు తీవ్ర శక్తితో తెర వెనుకభాగాన్ని ఢీకొంటాయి. అప్పుడు కొంత అతినీలలోహిత (Ultraviolet rays) విడుదలవుతాయి. అందువల్ల దూరం నుంచి చూడ్డం మంచిది. కంప్యూటర్ లో ఎలక్ట్రాన్లు తక్కువ వేగంతో వస్తాయి కాబట్టి ప్రమాదం ఉండదు.

- ప్రొ..ఎ. రామచంద్రయ్య, నిట్ వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞామవేదిక

అడిగి తెలుసుకుందాం
నోటి దుర్వాసన దేనివల్ల ?

- డా. ఎం. వి. రమణయ్య.

నిద్రనుంచి లేవగానే నోటి దుర్వాసన వస్తుంది ఎందుకని ?

అనేక రకాల సూక్ష్మజీవులు నోటిలో మనతో సహజీవనం చేస్తుంటాయి. సాధారణంగా యివి మనకెటువంటి వ్యాధిని కల్గించవు. నోటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను కుళ్ళింపజేయటం వీటిపని. ఈ విధంగా కుళ్ళిన వ్యర్థ పదార్థాలనుంచి విడుదలయ్యే అనేక రకాలయిన వాయువులే ఈ దుర్వాసనకు కారణం.
నోటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు కుళ్ళడానికి, నిద్రపోవడం, మేల్కోనడంతో సంబంధం లేదు.

అది నిరంతరం జరిగే చర్య. మేల్కొని ఉన్నపుడు నోటితో వూరే లాలాజలం ద్వారా, మనం తాగే నీటిద్వారా నోటిలో తయారైన వ్యర్థ పదార్థాలు మనకు తెలియకుండానే ఎప్పటికప్పుడు తొలిగించబడతాయి. అదే మనం నిద్రపోతున్నప్పుడు నోటితో లాలాజలం వూరదు మనం నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు. యిలా కొన్ని గంటలు గడుస్తుంది. కావున, నిద్ర నుంచి లేవగానే నోటినుంచి దుర్వాసన వస్తుంది.

కొందరిలో ఈ దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితి కారణం కావచ్చు.

చిగుళ్ళ నుంచి రక్తం లేక చీము వస్తుండుట టాన్సిళ్ళకు ఇన్ఫెక్షన్ రావడం, జీర్ణాశయంలో వుండి అందులోనుంచి రక్తం కారుతుండడం ఊపిరితిత్తులలో క్యాన్సర్ లాంటి వ్యాధులుండడం లాంటి ప్రత్యేక పరిస్థితులలో నోటి దుర్వాసన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

పంటి మీద గార ఏర్పడటం వల్ల కూడా నోరు దుర్వాసన ఉంటుంది. పళ్ళమీద ఏర్పడిన గార తొలగించేందుకు డెంటిస్ట్ ను సంప్రదించాలి.

నోటి దుర్వాసన తగ్గడానికి మనమేం చేయవచ్చు?

  1. రాత్రి నిద్రపోయే ముందు పళ్ళు తోముకోవాలి.
  2. నిద్ర లోవగానే పళ్ళు తోముకోవాలి.
  3. ఆహారం తీసుకున్న ప్రతిసారీ ఆఖరుగా నీళ్ళతో పుక్కిలించాలి.
వర్షాకాలంలోనే అంటువ్యాధులు ఎక్కువ – ఎందుకు ?

- జి. ప్రసాద్, నెల్లూరు.
జవాబు :- వర్షాకాలంలో పడ్డ వర్షపు నీరు రకరకాల ప్రదేశాల నుండి పోగుపడి కాలువలుగా ఈ ప్రదేశాలు మురిక గుంటలు కావచ్చు. లేదా మల మూత్రాదులు కలిసి ఉండవచ్చు. ఈ కలుషిత నీరు నేల పొరల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు నేల పొరల్లోనూ, గాలిలోనూ ఉండే ఎన్నో సూక్ష్మజీవులు బాక్టీరియాలు వీటిని ఆశించిన వైరస్ లు ఈ నీటిలో కలుస్తాయి. ఈ వర్షపు నీటిలో లవణాలు జంతు సంబంధ వ్యర్థ పదార్థాలు (పోషక విలువలుండే ప్రోటీనులు, కార్బోహైడ్రేటులు, క్రొవ్వు పదార్థాలు సమృద్దిగా ఉంటాయి. పైగా ఆ నీటి ఉష్ణోగ్రత కూడ అనువుగా ఉండటం వల్ల అనేక రకాల సూక్ష్మజీవులు తమ సంతతిని తండోపతండాలుగా పెంచుకుంటాయి. నీటిలోని బురద కణాలు ఈ సూక్ష్మజీవుల ఆవాసాలు, గా ఉపకరిస్తాయి. ఇలా ఉధృతంగా పెరిగిన సూక్ష్మజీవులు నీటిలో నేలమీద, గాలిలోనూ విస్తారంగా తిరుగుతుంటాయి. ఈ నీరు మనం రోజూ వాడే చెరువులు, బావులు తదితర నీటి వనరులలోకి కలువడం వల్ల ఆ నీరు కలుషితమౌతుంది. సరియైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇటువంటి నీటిని వాడడం వల్ల ఎన్నో రకాల వ్యాధికారక జీవులు మన శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురిచేస్తాయి. గాలిలో ఉన్న బాక్టీరియాలు, వైరస్ లు వీటికి తోడై చాలా మందికి వ్యాధులు సోకుతాయి. వ్యాధి గ్రస్థులలో కొన్ని రోగ కారక జీవులకు తమ జీవిత చక్రం లో కొన్ని దశలుంటాయు. ఈ దశలు సమృద్దిగా లభించడం వల్ల వ్యాధులు ఒకరి నుండి మరొకరికి విపరీతంగా వ్యాపిస్తాయి. వీటినే అంటువ్యాధులు అంటాం. అందువల్లే వర్షాకాలంలో అంటువ్యాధులు, ఇతర వ్యాధులు ఎక్కువగా కలుగుతాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :-

  • సాధ్యమైనంత వరకు కలుషిత నీటిని స్నానాలకు కూడా వాడకూడదు. ఏ మాత్రం త్రాగరాదు.
  • త్రాగునీరైనా ఆ నీటిని బాగా మరగకాచి, వడపోసి, చల్లార్చి తాగాలి.
  • రోగాలు సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్సను తీసుకోవాలి.
  • నాటు వైద్యాలు పనికి రావు.
  • కలరా వంటి అంటువ్యాధులు ప్రబలినపుడు వాటిని దేవతలకు ఆపాదించడం వల్ల బలులు ఇవ్వడం వల్ల కాలయాపన, అపరిశుభ్రత పెరిగి అంటువ్యాధులు మరింత పెరుగుతాయి.
నిప్పు పై కాళ్లు కాలకుండా ఎలా నడువగలుగుతారు?

ప్ర :- అగ్గి పై నడిచేవారు వారి కాళ్లు కాలకుండా ఎలా నడువగలుగుతారు?
- మహ్మద్ అబ్దుల్ ఖాదర్, హన్మకొండ.
జవాబు :- అగ్ని గుండాలపై నడిచే వాళ్ళు ముందుగా కాళ్లను బాగా నీటితో కడుగుతారు. పాదాల మీద ఉన్న నీటి తడి ఆరకముందే నిప్పులపై నడుస్తారు. నిప్పులకు పాదాలకు మధ్య నీటి పొర ఒక ఉష్ణ కవచం లాగా ఉపకరిస్తుంది. ఎందుకంటే నీరు అధమ ఉష్ణ వాహకము పైగా నిప్పుల నుంచి వచ్చే వేడి పాదాలకు చేరి పాదాలకు గాయం కానీయకుండా ఆ వేడిని నీటి పొర గ్రహించి ఆవిరి కావడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు మనిషి అరికాలి చర్మము కొద్దిగా మందంగా ఉండడం వల్ల కాస్తంత వేడిని భరించగలదు. దీనికి తోడు అగ్ని గుండాల మీద నడిచే వాళ్లు చాలా ఆదరాబాదరగా, వడి వడిగా నిప్పులను దాటుతారు. కాబట్టి కాళ్లుకాలే వ్యవధి కూడా ఉండదు. అంతే తప్ప నిప్పులపై నడవగలగడం వెనుక ఏ మంత్రశక్తి అతీంద్రియ శక్తులు, మహత్యాలు లేవు.

చేతబడి అంటే ఏమిటి ?

ప్రశ్న : చేతబడి అంటే ఏమిటి ? అసలది ఉందంటారా? సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా ప్రజల కుండే ఇటువంటి మూఢనమ్మకాలను తొలగించి జాతిని జాగృతం చేయడం ఎలా ?

- డి. శిరీష, టి. చందన IX, బాపూజీ స్కూలు, హన్నకొండ.

జవాబు : చేతబడి, బాణామతి, చిల్లంగి, మంత్రాలు అన్నా పేర్లు ఏమైనా క్రియొకటే, ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో పిలుస్తారు. వాస్తవానికి అవన్నీ కల్పితాలు. రుజువుకు నిలబడి నమ్మకాలు మీరడిగిన ప్రశ్నలోనే చేతబడికి సమాధానం వుంది. చేతబడి ఉందనుకోవడం ఒట్టి మూఢనమ్మకం.

చేతబడి బాణామతి, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మూఢనమ్మకాల కారణంగా వారిని వెలివేయడం, పండ్లూడగొడ్డడం, మలమూత్రాలను తాగించడం వంటి హింసలకు గురి చేస్తున్నారు. వారిపై దాడులు, హత్యలు ఇంకా సజీవ దహనాలు కూడా సాధారణమైపోయాయి. తెలంగాణా ప్రాంతంలోని ప్రజలలో ఈ నమ్మకాలు ఎక్కువగా జీర్ణించుకొని పోయి ఉన్నాయి.

వరంగల్ జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఆగష్టు 2, 2000 సం.నాడు ఈ చేతబడి బాణామతి చేశారన్ననెపంతో ఐదుగుర్ని సజీవ దహనం చేశారు.యావత్ ప్రపంచంతో పాటు మన దేశం కూడా సకల సాంకేతిక రంగాల్లో కంప్యూటర్ వేగంతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఒక వంక జరుగుతుండగా, అలాంటి శాస్త్ర సాంకేతిక రంగాలను, విజ్ఞాన శాస్త్ర, వైద్య శాస్త్రం ఫలితాలను అవహేళన చేసేటట్లుగా రాతి యుగంనాటి అంధ విశ్వాసాలు గుడ్డి నమ్మకాలు కొనసాగుతున్నాయంటే ఎంత విచారకరమో ఆలోచించండి.

చేతబడి వంటి నమ్మకాల్ని అటుచదువులేని వారిలోను ఇటు చదువుకొన్న వారిలోను కూడా ఉన్నాయి. కారణమేమిటంటే వారిలో సహేతుక ఆలోచన కోరవడడమే. మూడనమ్మకాలు నమ్మడానికి ప్రధాన కారణం శాస్త్రీయ దృక్పథం లేకపోవడమే.

పిల్లలూ. మీరంతా శాస్త్రీయ దృక్పథం సహేతుకాలోచనాపరులై గ్రామీణ ప్రజానీకం దగ్గరకు ప్రజా సైన్స్ ను ప్రచారం చేస్తే మనం మరింత అభివృద్ధి చెందడంతో పాటు చేతబడి, బాణామతి, మంత్రాలు మానవాతీత శక్తులు వంటి మూఢనమ్మకాల నుంచి ప్రజల్ని బయట పడేయగలం.

బాణామతి, చేతబడి వంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడికివెళ్ళి మీరు పరిశీలించాలి. అక్కడి ప్రజలతో చర్చించి వారిలో శాస్త్రీయ దృక్పథం పెంచాలి. ఆవిషయంలో హేతుబద్దంగా ఆలోచించేటట్లు చైతన్యం తీసుకురావాలి. అలాంటి పరిస్థితి వస్తేనే సమాజం నుండి మూఢనమ్మకాలు దూరం కాగలవు. అశాస్త్రీయ సాహిత్యం సమాజం లోకి రాకుండా చూడడం మనందరి బాధ్యతగా స్వీకరించాలి.

ప్రంపంచంలోకెల్లా అత్యధిక మోతాదులో 'హరిత గృహవాయువుల్ని విడుదల చేసే దేశం ఏది ?

జవాబు : అమెరికా సంయుక్త రాష్ట్రాలు (U.S.A.) ప్రపంచంలో దాదాపు 650 కోట్ల ప్రజలు ఉన్నారు. అమెరికా జనాభా షుమారు 35 కోట్లు. అంటే జనాభా పరంగా ప్రపంచ జనాభాలో కేవలం 5 శాతాం కన్నా తక్కువే. కానీ దాదాపు 25 శాతం హారిత గృహవాయువుల్ని ఆ ఒక్క దేశమే విడుదల చేస్తున్నది. చైనాది తరువాతి స్థానం. ఆ దేశపు జనాభా ప్రపంచ జనాభాలో దాదాపు 5వ వంతు ఉంది. అంటే జనాభాలో 20 శాతం అన్నమాట. హారిత గృహ వాయువుల శాతం ప్రపంచంతో పోలిస్తే 15 శాతం ఉంది. అంటే అమెరికాకు, చైనాకు తలసరి నిష్పత్తి సుమారు 6 రెట్లు. అంటే చైనా పౌరుడు సగటున ఒక యూనిట్ హరిత గృహ వాయువుల్ని వాతావరణంలోకి విడుదల చేస్తుండగా అమెరికా పౌరుడు సగటున 6 యూనిట్లు విడుదల చేస్తున్నట్లు అర్థం. అదే పద్ధతిలో పరిశీలిస్తే వాస్తవానికి భారతదేశం కేవలం 5 శాతం కన్నా తక్కువ హారిత గృహ వాయువుల్ని విడుదల చేస్తుంది.

అంటే 100 కోట్ల జనాభా ( ప్రపంచ జనాభాలో సుమారు 6వ వంతు లేదా సుమారు 15 శాతం ) ఉన్న భారతీయుడు సగటున ఒక యూనిట్ హరిత గృహవాయువుల్ని వాతావరణంలోకి విడుదల చేస్తుంటే చైనావారు 2.5 యూనిట్లు, అమెరికా వారు 15 యూనిట్లు విడుదల చేస్తున్నట్లు అర్థం. అభివృద్ధి చెందిన జర్మనీ, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా దేశాలు తక్కువేమీ తినలేదు. అభివృద్ధి చెందిన దేశలన్నీ కలిపితే ( సుమారు 6 లేదా 7 దేశాలు ) అవి మొత్తం ప్రపంచంలోని హరిత గృహా వాయువుల్లో 75 శాతానికి పైగా కారకు. అయితే వాటి జనాభా ప్రంచ జనాభాలో 25 శాతానికి మించదు.మిగిలిన 75 శాతంగా ఉన్న ప్రపంచ ప్రజలందరూ కేవలం 25 శాతం కాలుష్యానికి ప్రతినిధులు. అయినా ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు ముఖ్యంగా అమెరికాకు వంత పాడే దేశాలు ఏమంటున్నాయి. చైనా, భారత్ దేశాలు తమ దేశాల్లో వరి , గోధుమ పంటల్ని నియంత్రించుకోవాలంటున్నాయి. వాతావరణంలోకి కొంచెం మీధేను వాయువును విడుదల చేసే ఈ పంటలు ఈ రెండు దేశాల్లో ప్రధాన పంటలు. ప్రపంచంలోని ఇంధన వనరుల్లో 10 శాతానికి పైగా ఖర్చు చేస్తున్న ఒకే ఒక దేశం మితిమీరిన కార్భన్డైఆక్సైడ్ వాతావరణంలోకి వదులుతూ మనల్ని నియంత్రిస్తానంటుంది. మీకు పులి, గొర్రెపిల్ల, నదీ ప్రవాహాం కథ తెలుసు కదా ! నీటి ప్రవాహానికి దిగువన నీటిని త్రాగుతున్న గొర్రెపిల్లను కబళించే నెపంతో పులి ఏమంది? నీ ఎంగిలి నీళ్ళు నాకు చేరుతున్నాయంది. నిజానికి పులు త్రాగాకే నీరు గొర్రె పిల్లకు చేరుతుంది కదా!

హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య చర్య ఉష్ణగతిక శాస్త్ర నియమాలను అనుసరించి ప్రారంభించడానికి ఎంతో ఉత్తేజక శక్తి అవసరం. అందుకోసం వీటి మద్య చర్యను విద్యుదుత్సర్గం ద్వారా ప్రారంభించాలి. ప్రారంభమయిన తర్వాత ఇది పెద్ద విస్ఫోటనం జరిగే అత్యంత వేగవంతమయిన చర్య. ఎంత వేగమంటే అక్కడున్న పాత్రలు కూడా పగిలిపోగలవు. అందుకనీ చర్యను ఒక క్రమ పద్దతిలో మెల్లమెల్లగా జరపాలి. దానికి కొన్ని సాధనాలు, పరికరాలు, పద్దతులు అవసరం. తీరా నీరు తయారయిన మొదట వాయు రూపంలో తయారవుతుంది. దీన్ని ద్రవీభవించడానికి అవకాశాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఈ నీటిలో తగిన మోతాదులో లవణాలు కలపాలి. అప్పుడది త్రాగడానికి అనువుగా ఉంటుంది. (ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం) అందుకే సైన్సు సూత్రాలు, సైంటిస్టులు మాత్రమే సైన్సు కాదు. సైన్సుతో పాటు టెక్నాలజీ, వీటికి, తోడు మానవుల పాత్ర (శ్రామికులు ఎక్కువ) ఉంటుంది.

సగటు ఉష్ణోగ్రత

మన భూగోళం మీద కొన్ని ప్రాంతాలు అగ్ని గుండాల్లా భగభగలాడుతూ వుంటే మరికొన్ని ప్రాంతాలు క్షణాల్లో రక్తాన్ని గడ్డ కట్టించేంత చల్లగా ఉంటాయి.భూమధ్య రేఖ ప్రాంతంలోను, ఖండాంతర ప్రాంతాల్లోను, సముద్రమట్టం కన్నా ఏ మంత ఎక్కువ ఎత్తులేని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత అధితంగా వుంటే, దీనికి భిన్నంగా ధృవప్రాంతాల్లోనూ, తీర ప్రాంతాల్లోనూ, సముద్రమట్టం కన్నా చాలా ఎక్కువ ఎత్తులో వుండే ప్రదేశాల్లోనూ ఉష్ణోగ్రత తక్కువగా వుంటున్నది. రుతువులను బట్టి కూడా ఉష్ణోగ్రతలో మార్పుచేర్పులు వస్తున్నాయి.అసలింతకీ మన భూగోళపు సగటు ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? కేవలం 15 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. చిత్రంగా లేదూ.

అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు ఏ ఆధారం లేకుండా ఎలా తిరుగుతున్నాయి ?

-కె. వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ హైస్కూల్, మహాలక్ష్మిపురం

జవాబు : ఈ ప్రశ్నే కొన్ని వేల సంవత్సరాల క్రితం చాలామందికి తలెత్తింది. గ్రహాలను, నక్షత్రాలను భూమి చుట్టూ కొందరు దేవదూతలు త్రిప్పుతున్నట్టు భావించారు. త్రిప్పేది దేవదూతలు కాదని నేడు ఋజువయినా త్రిప్పేవారు మాత్రం చరిత్రలో మరుగు కాలేదు.

నక్షత్రాలు, గ్రహాలు యివన్నీ చలనంలో ఉన్నాయి. చలనంలో ఉన్న వస్తువుల మీద ఎన్నో రకాల బలాలు అంతరంగికంగానూ బాహ్యంగానూ పనిచేస్తుంటాయి. ఒక అంతరిక్ష వస్తువు మరో అంతరిక్ష వస్తువును ఢీకొనాలంటే ఆ రెండింటికీ మధ్య ఉన్న గురుత్వ బలం చాలు.

అయితే ఆ వస్తువులు పరస్పరం ఒక దాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తున్నట్లయితే అదే వస్తువుల మీద వాటిని దగ్గరకు రానీయకుండా పట్టి ఉంటే అపకేంద్రబలం పనిచేస్తుంది. భూమి ఆకాశంతో ఆధారం లేకుండా వేరవడానికి కారణం అది ఎంతో వేగంగా సూర్యుని చుట్టూ పరిభ్రమించటమే ! ఇలా అన్ని నక్షత్రాలు, గ్రహాలు పరస్పరం ఒకదానిచుట్టూ ఒకటి తిరుగుతూ ఏ ఆధారం లేకున్నా వాటిమీద పనిచేసే ఫలితబలం “సున్న” కావడం వల్ల ఏమీ కాకుండా స్థిరంగా ఉండగలుగుతున్నాయి

మనిషి గిర గిరా తిరిగితే కళ్ళు తిరుగుతాయి. మనం వున్న భూమి మనతో పాటు తిరుగుతుంది కదా ! మనకు కళ్ళు తిరుగవు ఎందుకని ?

- పి. ఆదిత్య, 9వ తరగతి, విజయవాడ.

జవాబు : మనం భూమిపైన వున్నప్పుడు మన భూమిలాగే ఏ నికర బలాలకు లోనుకాకుండా సమతాస్థితిలో వుంటాము. అందువల్ల భూమి తిరుగుతున్న విషయాన్ని గుర్తించలేము. అయితే మనము గిరగిరా తిరిగినపుడు సాపేక్షంగా మన శరీర అంతర్భాగాలలోని ద్రవ పదార్థాలలో చలనాలు ఏర్పడతాయి. ఏదైనా నీటికుండను గిరగిరా త్రిప్పితే కుండతోపాటు నీరు కూడా గిరగిర తిరుగుతుంది కదా !

మనకు కళ్ళు తిరగటానికి ప్రధాన కారణం మధ్య చెవిలో వున్న కాక్లియా అనే వలయాకార నాళికలలోని ద్రవంలో అలజడులు రావడమే. ఈ ద్రవంలో ఏర్పడ్డ చలనాలకు అనుగుణంగా మెదడుకు సంకేతాలు అందుతాయి. శరీరాన్ని ఈ కదలికలు అనుగుణంగా నిలకడగా వుండటానికి మెదడు ప్రయత్నిస్తుంది. అయితే నాళాలలో కదలికలు ఎక్కువ సేపు వుండటం వలన మెదడు శరీరానికి సరైన సంకేతాలను ఇచ్చి సమతాస్థితిలో శరీరాన్ని వుంచటానికి ప్రయత్నించినా, పదే పదే కాక్లియా ద్రవంలో మార్పులు మెదడును గందరగోళ పరుస్తాయి.

అందువలన మనం నిలకడగా వుండలేము. దీనితోపాటు కంటిలోని ద్రవం కూడా కదలికలకు లోనుకావటం వలన పదే పదే పాతదృశ్యాలు కంటి రెటీనాలో కొంత సేపు వుండటం వలన దృష్టి కూడా గందరగోళానికి గురౌతుంది. అందువలన మనకు కళ్ళు తిరుగుతాయి.

భూమితోపాటు మనం తిరుగుతున్నపుడు ఇంత తీవ్ర పరిస్థితి ఏర్పడదు.

ఆక్సిజన్, హెడ్రోజన్లను కలిపి నీటిని తయారు చేసి నీటి కొరత తీర్చవచ్చునా ?

ప్రశ్న : నేడు నీటి కొరత చాలా హెచ్చుగా ఉందికదా ! మరి ఆక్సిజన్, హెడ్రోజన్ లను కలిపి ప్రయోగశాలలో నీటిని తయారు చేసి నీటి కొరత తీర్చ వచ్చును కదా !

- ఎ. సుధీర్, యన్. శివాజీనాయుడు.

జె.పి.హెచ్. పాఠశాల,సోమేశ్వరం, తూ.గో.జిల్లా.

జవాబు :- పావలా పనికి రూపాయి బాడుగ అనే సామెత వినే ఉంటావు. ఒక వ్యక్తి ఓ పని జరపాలి. అది జరిగితే అతనికి పావలా (25 పైసలు) లభిస్తుందనుకుందాం. దాన్ని జరపడానికి అతనికి రూపాయి ఖర్చయిందనుకొందాం, వెరసి నష్టమైకదా ! అలాగే నీటి కొరత సమస్య అనేది సబబే !

( అయితే దాని నీటి వనరుల ద్వారా పరిష్కరించుకోవడమే సరైన మార్గం! వాటర్ బాటిల్ కు) 12 రూపాయలు ఉంటుంది. ఇది అన్యాయమే అనుకుంటున్నాము. ఈ లీటరు నీటిని ప్రయోగశాలలో నీవుచెప్పిన పద్దతిలో

2H2 +O2 = 2H2O

అనే విధంగా త్రాగే నాణ్యతలో తయారు చేయడానికి కనీసం రూ. 25,000/- ఖర్చవుతుంది. ఎందుకంచే రసాయనిక చర్యలు కాగితం మీద వ్రాసినంత సరళంగా జరగవు. H2, O2 మూలకాలు వాయు రూపంలో ఉంటాయి. వాటి ధర బాగానే ఉంటుంది. వాటిని సిలిండర్లలో నిల్వ ఉంచాలి. ఈ సిలిండర్ల ధర చాలా ఎక్కువ. వాటిని అలా కలిపేస్తే ఇలా చర్య జరిగి, అలా నీరు వచ్చేయదు.

మంటపై నుంచి చుస్తున్నప్పుడు వస్తువులు కదులుతున్నట్టుగా కనిపిస్తాయి ఎందుకని ?

వేడివల్ల గాలి వ్యాకోచిస్తుంది. కనుక చిక్కదనం తగ్గి తేలికమవుతుంది. అందువల్ల పైకిలేస్తుంది. అంతకు మందు ఆ ప్రదేశంలో ఉన్న చల్ల గాలిని తోసుకుంటూ వేడిగాలి పైకి వెళుతుంది. కనుక మంటపై నుంచి చుస్తున్నప్పుడు కదిలి పోతున్న వాయు స్తంభంలో నుంచి చూస్తూన్నామన్న మాట.

ఈ గాలి కదలికలు కూడా అంతటా ఒకే విధంగా ఉండవు. గాలి చక్కదనం వివిధ ప్రదాశాలలో వేరు వేరుగా ఉంటుంది. ఒకే ప్రదేశంలో కూడా క్షణ క్షణానికి గాలి చిక్కదనం పారుతూ ఇంటుంది. కాంతికిరణం ప్రయాణం చేస్తున్న మార్గంలో చిక్కదనంలో ఎక్కడ మార్పు ఉంటే అక్కడ పక్కకి వంగుతూ ఉంటుంది. దీనిని వక్రీభవనం అంటారు. ఈ కారణంగానే ఆ ఉష్ణవాయు స్తంభం వెనుకవున్న వస్తువులు కదితిపోతున్నట్లు కనిపిస్తాయి.
మంట మండుతున్నప్పుడే కాదు. మే నెలలో, మిట్ట మధ్యాహ్నం, తారురోడ్డు పైన, ఇసుక దిబ్బల మీద గాలి వేడెక్కి పైకి పోతున్నప్పుడు కూడా దాని గుండా చూసిన వస్తువులు, కదిలి పోతున్నట్లు కనిపిస్తాయి.

వీధిలోని ఎలక్ట్రిక్ తీగలపై వాలిన కాకి చావదు. ఎందుకని ?

ఒక చేతిలో ఎలక్ట్రిక్ వైరు పట్టుకొని చెక్కబల్ల మీదకానీ, రబ్బరు చెప్పులు తొడుక్కొని నేలమీదగానీ నిలుచుంటే కొయ్యలో నుంచీ, రబ్బరులో నుంచీ విద్యుత్తు ప్రవహించదు కనుక సర్య్కూట్ పూర్తిగాదు. కెరెంట్ ప్రవహించదు. మనకు షాక్ కొట్టదు. కాకులు హైవోల్జేజి తీగల మీదవాలి ఏ ప్రమాదం లేకుండా ఎగిరిపోగలగడానికి కారణం వైరునుగాని, వోల్టేజి బేధం ఉండే మరో వైరును గానీ అది ఒకే కాలంలో ముట్టుకోకపోవడమే. పక్షుల ఈకలు మరో వైపుకు తగిలినప్పటికీ అవి విద్యున్నిరోధాలు కాబట్టి ప్రమాదం లేదు.
కాకి ఫేజ్ వైరుపై కూర్చొని న్యూట్రల్ వైరునుగాని, స్తంభాన్ని గాని ముక్కుతో తాకితే షాక్ తగిలి చచ్చిపోతుంది.

కుర్చీలో నిటారుగా కూర్చొని లేవలేము ఎందువల్ల ?

కుర్చీలో నిటారుగా కూర్చొని, కాళ్ళు వెనక్కితీసుకోకుండా, ముందుకి వంగకుండా లేవలేము ఎందువల్ల ?

ఏ వస్తువైనా పడిపోకుండా స్థిరంగా ఉండాలంటే దాని గరిమనాభి నుండి గీసిన నిట్టనిలువు రేఖ దాని ఆధారం పాఠంలో ఉండాలి అనేది ప్రాధమిక సూత్రం. ప్రాణంతో ఉన్న వస్తువులకైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది. జీవులయితే ప్రాణభయం చేత పడిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాయి. దీంట్లోనే మన ప్రశ్నకు సమాధానం ఉంది.

కుర్చీలో కూర్చొన్న మనిషి ఆధారపీఠం కుర్చీకి చెందిన నాలుగు కోళ్ళు మధ్యభాగం. మనిషికి చెందిన గరిమనాబి నుండి గీసిన నిట్టనిలువు రేఖ ఈ ఆధార పీఠంలో పడుతోంది. కనుక కూర్చొన్నంత సేపూ స్థిరంగా బాగానే వుంది. కుర్చీలో కూర్చోన్న స్థితి నుండి లేవడానికి ప్రయత్నించినపుడు ఏమవుతుందో చూద్దాం. చటుక్కున ఆధారపీఠం మారిపోతుంది. అది ఇక మీదట కుర్చీకాళ్ళ మధ్యభాగం కాదు. నేలను ఆనుకొని ఉన్న నీ పాదాల మధ్య భాగం మాత్రమే . నీ పాదాలు కుర్చీకాళ్ళకి బయట ఉన్నాయా కదా ! కనుక ఇప్పుడు నీ గరిమనాభి నుండి గీసిన నిట్టనిలువు రేఖ నీ కొత్త ఆధారపీఠంలో పడటంలేదు. కనుక లేవబోతే వెనక్కి పడి పోతావు. నిజానికి అదే స్థితిలో వుండి కుర్చీలోంచి లేవడం అసాధ్యమైపోతుంది. ఇపుడు కుర్చీలోంచి లేవాలంటే మూడే మూడు మార్గాలున్నాయి.

  • నీ పాదాలు కదపకుండా ఉన్నచోటనే వుంచి గరిమనాభిని ముందుకు జరిపి, నిట్టనిలువు రేఖ పాదాల మధ్యగల ఆదారపీఠంలో పడేటట్లు చెయ్యాలి. అంటే నువ్వు తగినంతగా ముందుకు వంగాలి.
  • నీ గరిమనాభిని యధాస్థానంలో వుంచి నీ ఆధారపాఠాన్ని తగినంతగా వెనక్కి జరపాలి. అంటే నీ పాదాలను వెనక్కు (కుర్చీకిందికి) జరిపి నిట్టనిలువు రేఖ పాదాల మధ్య పడేలాగ చెయ్యాలి.
  • గరిమనాభిని కొద్దిగా ముందుకు జరిపి ఆధార పీఠాన్ని కొద్దిగా వెనక్కు జరపాలి. అంటే కొద్దిగా ముందుకు వంగి కొద్దిగా పాదాలను వెనక్కి జరపాలి. ఇంతకు మించి మరోమార్గం లేదు. మనందరం సాధారణంగా అవలింబించేది మూడవ పద్దతే.
అమావాస్యకు పౌర్ణమికీ పిచ్చివాళ్ళకు పిచ్చి ఎక్కువతుందా ?

డా..పి.శ్రీనివాసతేజ
న్యూరో సైక్రియాటిస్ట్, పొగతోట, నెల్లూరు.
మనస్సు అధిదేవత చంద్రుడనీ, బలహీన మనస్సుల మీద చంద్రుని ప్రభావం అధికంగా వుంటుందనీ, అమావాస్య పౌర్ణమిలకు పిచ్చి ఎక్కువ అవుతుందని, ఒక గట్టి నమ్మకం దేశదేశాలలో అనాదిగా కనిపిస్తోంది. పిచ్చి వాడిని లూనటిక్ అనడం కూడా ఇందుకే. లూనా అంటే చంద్రుడు అని అర్థం.

అమావాస్య పౌర్ణమి రోజులలో పిచ్చి ఎక్కువవుతోందను కోవడం కేవలం అపోహ. చంద్రుడికి మానసిక జబ్బులకు ఎలాంటి సంబంధంలేదు. జనం తమ పరిశీలనల నుండి కొన్ని అపోహలు ఏర్పరచుకుంటారు.

“ఎక్యూట్ సైకోసి స్” అనే మానసిక వ్యాధి ప్రారంభమయ్యేటపుడు కాకతాళీయంగా ఆరోజు పౌర్ణమి గానీ, అమవాస్య గానీ అయితే, దానికి జబ్బుకూ లంకె పెడతారు.

“హిస్టీరియా” వ్యాధితో రోగులకు తమ ప్రవృత్తి సగం తెలుస్తుంది. సగం తెలియదు. వీళ్ళకు పౌర్ణమికీ అమావాస్యకూ పిచ్చెక్కువవుతుందనే నమ్మకం వుండడంవల్ల ఆ రోజుల్లో కొంచెం అతిగా ప్రవర్తిస్తారు.
“బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి, 15 రోజులలో ఒకసారి వస్తుంది. ఆ రోజు అమావాస్య పౌర్ణమిలయితే దీనివల్ల పిచ్చి ముదిరిందనుకొంటారు. Rapid Cycling Stage వస్తే తరచూ మానసిక జబ్బులు ఉదృతమవుతుంటాయి. కాకతాళీయంగా ఆ రోజు అమావాస్యగాని పౌర్ణమి గానీ అయితే దానివల్లే పిచ్చి ముదిరిందను కొంటారు. ఇవన్నీ ప్రజలనమ్మకాలే తప్ప పిచ్చివాళ్ళపై చంద్రుడి ప్రభావం ఏమీ వుండదు.

దోమల్లో ఆడ దోమ మాత్రమే ఎందుకు రక్తం తాగుతుంది ?

(యం.నీరజ.గుంటూరు)

దోమ సుమారు 30 రోజులు బతుకుతుంది. జుయ్ మని హోరు పెడుతా, జత కలవడం కోసం ఎగరడంతో దాని జీవితం ప్రారంభమవుతుంది. ఈ విషయంలో ఆడదోమకి చొరవ ఎక్కువ. మగదోమని పట్టుకొని దాని శుక్లాన్ని సంగ్రహిస్తుంది. ఆ తరువాత 48 గంటలకి ఒక్కొక్కసారి అయిన జంతువుల రక్తం కోసం తహతహ లాడిపోతుంది. రక్తంలోని “ఎమైలో” “ఆసిడ్లు” లభిస్తే కాని దోమ గుడ్లు పరిక్వంకావు. ఆ రక్తం తాగేక సుమారు 40 గుడ్లు ఏ మురికి నీటిలోనో పెడుతుంది. ఆడదోమ రెండేసి రోజుల కొకసారి చొప్పున తనజీవిత కాలంలో సుమారు 15 సార్లు గుడ్లు పెడుతుంది. మగదోమ తో మొదటి సంపర్కంలో లభించిన శుక్లమే అన్నింటికీ సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ మగదోమ కోసం పరిగెత్తవలసిన అగత్యం దానికిలేదు. కాని రక్త భోజనం మాత్రం విధిగా ఉండాలి.
ఇదిగో ఈ కారణం చేత ఆడదోమలు మాత్రమే జంతు రక్తం కోసం వెంపరలాడుతాయి. ఆడదోమలు మాత్రమే మనల్ని కుట్టి రక్తం పీల్చుకుంటాయి. తద్వారా జబ్బులు కలిగించేవి అన్నీ ఆడదోమలే. మగ దోమలకి జంతు రక్తం తాగవలసిన అవసరం లేదు. అవి చెట్ల ఆకుల రసాలను పీల్చుకొని కాలక్షేపం చేస్తాయి. అవి పక్కా శాఖాహారులు.

బూమెరాంగ్

ఆది మానవుడు ఉపయోగించిన ఒక గొప్ప సాంకేతిక పరికరంగా బుమెరాంగ్ ను చెప్పుకొవచ్చు.
ఆదిమానవుడు జంతువులను, పక్షులను వేలాడటానికి ఉపయోగించిన త్రిభుజాకారపు కొయ్యదబ్బను “బుమెరాంగ్” అంటారు.

విసిరేసినపుడు అదిలక్ష్యానికి తగలనపుడు సుడులు తిరుగుతూ మరలా వేటగాడి వద్దకు చేరడం “బుమెరాంగ్” ప్రత్యేకత.

“బుమెరాంగ్” పటంలో చూపినవిధంగా త్రిభుజాకారంలో వుంటుంది. ఒకవైపున పట్టుకొని దీన్నివిసిరేస్తారు. దీని నిర్మాణంలో కాస్త వంపుతిరిగి వుండటం వల్ల, దీన్ని విసిరేసినపుడు ప్రతిసారీ
తనదిశను మార్చుకుంటూ చివరికి విసిరేసిన చోటికే వచ్చి చేరుతుంది.
- సేకరణ, ఎస్, ఎన్,నశీమ్ బాషా, గోపవరం.

చేసి చూద్దాం
బుడ్డీలో బుల్లి ప్రపంచం

-ప్రొ " ఎ. రామచంద్రయ్య, NIT, వరంగల్


ప్రియమైన బాలబాలికలూ, ఈ 2008 సంవత్సరాన్ని మనం ' అంతర్జాతీయ ధరిత్రీ సంవత్సరం ' గా జరుపుకొంటూ పలు కార్యక్రమాల్లో భాగస్వాములమవుతున్నాం కదా! పలు జీవరాశులకు, నిర్జీవరాశులకు మధ్య వున్న అనుసంధానాన్నే మనం ' జీవ పర్యావరణ వ్యవస్థ ' అంటున్నాము. అలాంటి సమతుల్యాన్ని భగ్నం కాకుండా కాపాడటం అందరి బాధ్యత అనికూడా అంటున్నాం. కేవలం సూర్యరశ్మి తప్ప మరే ఇతర పదార్థాలు చేరుకున్నా భూమి మీద జీవం ఏర్పడింది. అది పలు రకాలుగా పరిణామం చెంది పలు జాతులుగా విస్తరించింది. జీవ పర్యావరణ వ్యవస్థ మధ్య సమతుల్యాన్ని అర్థం చేసుకోవడానికి ఓ చక్కని చిన్ని ప్రయోగాన్ని చేద్దాం. నవ జీవన నిర్మాతలం మనమిక అని ప్రపంచం ముందర బాజా మ్రోగిద్దాం.

కావల్సిన వస్తువులు : - ఒక చిన్న ఇంజెక్షన్ సీసా, దాని మూత, సెల్లో టేపు, కొద్దిగా చెరువు లేదా కాలువ నీరు, ఆ తర్వాత వీలైతే సూక్ష్మదర్శిని.

ప్రయోగం చేసే విధానం

1. ఇంజక్షన్ సీసాను బాగా కడిగి అందులో 3వ వంతుకు చెరువు నీరు లేదా కాలువ నీరు తీసుకోవాలి. నీరు మురికిగా లేకుండా స్వచ్ఛంగా ఉన్నట్లయితే లోపల జరిగే బుల్లి ప్రపంచాన్ని తేలిగ్గా చూడవచ్చును.
2. సీసాకు రబ్బరు మూత బిగించి సెల్లో టేపులో మూతను అంటించాలి. అంటే బయట నుంచి లోనికి, లోపలి నుంచి బయటికి పదార్థాల వినిమయం జరగదు. దీన్నే Closed System అంటారు.

3. ఈ మొత్తాన్ని కిటికీ దగ్గర ఉంచాలి. పగటి పూట వెలుతురు పడాలిగానీ సరాసరి సీసామీద ఎండ పడకూడదు.

4. 2 లేదా 3 నెలల తర్వాత చూస్తే అందులో ఓ బుల్లి జీవ ప్రపంచం ఉంటుంది. కొంత మటుకు కంటితో చూడగలిగినా, సూక్ష్మదర్శిని ఉంటే సంక్షిష్టంగా కనిపిస్తుంటుంది.

5. మనం చూసే జీవరాశుల పేర్లు నమోదు చేయాలి. అందులో ఆల్గే ( ఆకుపచ్చని, నీలం రంగువి) బిందువుల్లాగా వుంటాయి. ఇవి సీసాలోని కార్బన్ డై యాక్సైడ్ నీరు తీసుకొని మందకొడిగా ఉన్న వెలుతురు సమక్షంలో పిండిపదార్థాల్ని తయారు చేస్తాయి. గాల్లోకి ఆక్సిజన్ను వదుల్తాయి. గాల్లోని నత్రజనిని నైట్రోజన్ పదార్థాలుగా మార్చగలవు కూడా వాటి సాయంతో పిండిపదార్థాల నుంచి ప్రోటీన్లను కూడా తయారు చేయగలవు.

సీసాలోని నీటిలో ఉండే అమీబాలు, ఇతర జంతుజాతికి చెందిన ఏకకణ, బహుకణ జీవులు, ఆల్గేల మీద, అవి తయారు చేసిన పదార్థాల మీద ఆధారపడి తిరిగి కార్బన్డైయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అందులో వున్న అన్ని రకాల జీవజాతులు ఆక్సిజన్ను వాడుకొని కార్బన్ డై యాక్సైడ్ ను వదుల్తాయి.

,వదుల్తాయి.కణాలు చనిపోతే అవి విచ్ఛేదనం చెంది నత్రజని వాయువు గాల్లోకి, నత్రజని సమ్మేళనాలు నీటిలోకి విడుదల అవుతాయి. ఉన్న కొద్దిపాటి నీరు ఏమంత పెద్దగా ఖర్చు కాదు. బయటికి ఆవిరయిపోయే వీలులేదు. పటంలో సూక్ష్మదర్శిని ద్వారా లభ్యమైన ఫొటోలను చూస్తే దృశ్యం బోధపడుతుంది.

మనకు బోధపడే అంశాల

1.మామూలు నీటిలో సూక్ష్మజీవులు వుంటాయి. వాటి గ్రుడ్లు కూడా ఉంటాయి. అవి పొదిగి పిల్లలవుతాయి. వృక్ష సంబంధ ఏకకణజీవులు, చిన్న బహుకణ జీవులతో పాటు జంతు సంబంధ కణ జీవులు కూడా నీటిలో ఉంటాయి. చెరువు నీరు, సరస్సునీరు, కాలువ నీటిలో ఇవి లక్షలాదిగా ఒక బొట్టులో కూడా ఉంటాయి.

2. వీటిని ఇతర బాహ్య ప్రపంచాన్నుండి విడదీసి కొంతగాలి, కొంతనీరు ఇస్తే తమ ప్రపంచాన్ని తాము కాపాడుకోగలవు. పరస్పరం సహకరించుకొంటూ తమ బుల్లి ప్రపంచాన్ని కొనసాగించగలవు.

ఆధారము: http://www.funsci.com లో గర్బోనిగారి ' microworlds ' సౌజన్యంతో)

బబుల్ గేమ్
-డా|| ఇ. ఆర్. సుబ్రహ్మణ్యం

నోట్లో బబుల్ గేమ్ పెట్టుకొని గంటల తరబడి చప్పరిస్తూనే కబుర్లు చెప్పే వాళ్లను ఎంతో మందిని చూస్తుంటాం. చిన్న పిల్లలే కాకుండా అన్ని వయసుల వాళ్ళల్లోనూ చ్యూయింగ్ గమ్ ను సరదాగా చప్పరించే వాళ్ళు అదో ఆనందంగా భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రోజుల్లో ఎన్నో కంపెనీల రకరకాల పేర్లు, వేర్వేరు రుచులు, ఆహ్లాదకరమైన వాసనలతో చ్యూయింగ్ గమ్ లను మార్కెట్లోకి ప్రవేశ పెడుతూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. టిక్ టాక్ మింట్, హ్యాపీ డెంట్, బిగ్ బబుల్ వంటి ఎన్నో చ్యూయింగ్ గమ్ లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. కొన్ని కేవలం కాలక్షేపానికే అయితే మరికొన్ని పళ్ళను తెల్లగా శుభ్రంగా ఉంచేందుకు సాయపడతాయి. ఇలాంటి వాటిలో వేపాకు , పుదీనా ఆకు, నీలగిరితైలం, బేకింగ్ సోడా, మింట్ వంటివి కలుపుతారు.

నీజానికి ఈనాటి చ్యూయింగ్ గమ్ లు పోలిన రకరకాల పదార్థాలను చప్పరిస్తూ ఆనందించడం ఈనాటిది కాదు. చాలా పురాతన కాలం నుంచే వేర్వేరు దేశాల్లోని ప్రజలకున్న అలవాటే . కాని తేడా ఏమియంటే అప్పట్లో వాళ్ళు వాడిన పదార్థాలు వేర్వేరు. అవి కొన్ని చెట్ల నుంచి లభించే చిక్కని రెజిన్ లేదా లేటెక్స్ కావచ్చు. లేదా టియ్యటి గడ్డి మొక్కలు, ఆకులు గింజలు, వాక్స్ వంటివి కావచ్చు. పురుషుల్లో కాదు స్త్రీలలో కూడా చెట్టు రెజిన్ లను ఉండలుగా చేసుకున్ నోట్లో పెట్టుకుని చప్పరించే అలవాడు ఉండేది. గ్రీసు, టర్కీ దేశాల్లో మస్టిక్ చెట్టు ఒక గురురులాగా పెరుగుతుంది. ఈ చెట్టు బెరడునుంచి చిక్కని పాలలాగా ఒక రెజిన్ కారుతుంది. దీనినే మస్టిక్ గమ్ అంటారు. ప్రాచీన గ్రీసు దేశస్థులు మస్టిక్ గమ్ ను ఉండలుగా చేసుకుని నోట్లో పెట్టుకుని గంటలు తరబడి చప్పరించే వారట. ఈ గమ్ ను చప్పరించడం వల్ల పళ్ళు శుభ్రపడడమే కాకుండా శ్వాస కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండడం వల్లనే గ్రీకు స్త్రీలు దీన్ని ఎంతో ఇష్టపడేవారు.

1848 లో స్ప్రూస్ చెట్టు రెజిన్ నుంచి చ్యూయింగ్ గమ్ ను కుర్టిన్ సోదరులు తయారు చేశారు. తర్వాత కాలంలో దానికి పారఫీన్ను, సుగంధ ద్రవ్యాలను కలిపి చ్యూయింగ్ గమ్ ఫ్యాక్టరీ పేరుతో మొట్టమొదటి చ్యూయింగ్ గమ్ ఫ్యాక్టరీ నెలకొల్పారు. న్యూయార్క్ కు చెందిన థామస్ ఆడమ్స్ అనే ఫోటోగ్రాఫర్ కూడా చ్యూయింగ్ గమ్ వ్యాపారం మొదలు పెట్టాడు. అమెరికా ఉష్ణ ప్రాంతంలోని ఒక రకం చెట్టును గాటుపెడితే తెల్లని చక్కని పాలవంటి ద్రవాన్ని స్రవింస్తుంది. ఆడమ్స్ ఈ పాలను సేకరించి గట్టి పరిచి చిన్న చిన్న ముక్కలుగా కోసి స్తానికంగా అమ్మకం మొదలు పెట్టాడు. 1871 లో ఆడమ్య్ ఫ్లావర్డ్ గమ్ ను పేటెంట్ చేశాడు. ఇంతకు ముందు తయారు చేసిన గమ్ ను తియ్యని రుచి, మంచి వాసన కలిగించే పదార్థాన్ని కలిపి బ్లాక్ జాక్ అని పేరు పెట్టాడు. దీన్ని ముక్కలు, ముక్కలుగా కాకుండా పుల్లలు (స్టిక్స్) రూపంలో అమ్మడంలో ప్రజలు చాలా ఇష్టపడ్డారు. అమ్మకాలు పెరిగాయి. ఈ అలవాటు ప్రజల్లో ఎంతగా పెరిగిందంటే, ఈ గమ్ ల వల్ల పేగులు అతుక్కుపోతాయని డాక్టర్లు హెచ్చరించవలసి వచ్చింది.

చ్యూయింగ్ గమ్ అమ్మకాలు మంచి లాభాలు ఆర్జించడంతో చాలా మంది ఈ వ్యాపారంలో ప్రవేశించారు. వేర్వేరు పేర్లు, రకరకాల రూపాల్లో చ్యూయింగ్ గమ్ మార్కెట్ లో ప్రవేశించింది. రిగ్లేస్ కంపెనీ కాండీ రూపంలో అమ్మితే, బీమాన్స్ కంపెనీ తన గమ్ కు పెప్సిన్ ను జెడించింది. ఫ్రాకీ కానింగ్ కంపెనీ డెంటైన్ పేరుతో డెంటల్ గమ్ అన్నకం ప్రారంభించింది. 1870 ప్రాతంలో ఆడమ్స్ అండ్ సన్స్ వారు గమే ను మార్కెట్ లోకి దింపారు. ఇది పుల్లటి నారింజ, రుచి, వాసనతో భోజనం తర్వాత చప్పరించేందుకు కాండీ రూపంలో మార్కెట్లోకి వచ్చింది. 1920 లో క్లోవ్ గమ్ వచ్చింది. లవంగాలు కలిసిన ఈ గమ్ ను దొంగ చాటుగా మద్యం సేవించిన వాళ్లు శ్వాస బాగుండేందుకు, ఆ వాసన బాగుండేందుకు, ఆ వాసన బయటపడకుండా ఉండేందుకు వాడేవారు.

తర్వాత బబుల్ గమ్ వచ్చింది. దీనిని కనిపెట్టింది. ఫ్రాంక్ప్లీర్ బ్లిబ్బర్ బ్లబ్బర్ బబుల్ గమ్ నోట్లో పెట్టుకుంటే నాలికకి అంటుకుంటే లక్షణం ఉండడం వల్ల అంతగా జనానికి నచ్చలేదు. కాని 1928 లో ప్లీర్ గమ్ కంపెనీ లో ఎకౌంటెంట్ గా పనిచేస్తున్న వాల్టర్ డీమర్ యాదృచ్ఛికంగా ఈనాటి బబుల్ గమ్ ను కనుక్కున్నాడు. ఇది మామూలు బబుల్ గమ్ లాగా నాలికకి అంటుకోదు పైగా తేలిగ్గాసాగే లక్షణం ఉంది. ఇంకేముందు ఫిలడెల్షియాలోని ప్లీర్ చ్యూయింగ్ గమ్ కంపెనీ డీమర్ ఫార్ములా ఆధారంగా కొత్త బబుల్ గమ్ ను వాణిజ్యపరంగా తయారు చేసి అమ్మడం ప్రారంభించింది. డబుల్ బబుల్ పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ బబుల్ గన్ సూపర్ హిట్ అయింది.

ఈ రోజుల్లో ఎన్నో రకాల చ్యూయింగ్ గమ్ లు వచ్చాయి. పంచదార, కార్న్సిరప్, సుగంధ ద్రవ్యాలు, సాఫెనర్ లు, లెటెక్స్ లేదా ప్లాస్టి క్లు బబులగమ్ తయారీ లో ఉపయోగిస్తున్నారు. కొన్నింట్లో గ్లూకోజ్ సిరప్, గ్లిసరిన్ సార్బిటాల్, ఆంటి ఆక్సిడెంట్ లు గమ్ బేస్, సింథటిక్ రంగులు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. తెలుపు రంగు కాప్ స్యూల్స్ గా వస్తున్న మింట్ చ్యూయింగ్ గమ్ లో సుగర్ తో పాటు, డెక్స్ ట్రిన్, రైస్ స్టార్చ్. గమ్ అరబికి తో పాటు, నాచురల్ మింట్, ఇథైల్ వాన

చెప్పుకోండి చూద్దాం
ఎలా కనిపెట్టాడు ?

రాంబాబు ఓ ఘరానా హోటల్ కి వెళ్ళి టీ కి ఆర్డరిచ్చాడు. ఓ ఐదు నిమిషాల తరువాత వేడివేడి టీ వచ్చింది. రాంబాబు చక్కెర వేసుకొని కలుపుకుంటూ ఉంటే అందులోంచి ఓ చచ్చిన ఈగ పైకి తేలింది. రాంబాబు వెయిటర్ ని పిలిచి చూపించాడు. అతను సారీ, చెప్పి, వేరేది తెస్తానంటూ ఆ టీ కప్పు తీసుకొని వెళ్ళిపోయాడు. ఓ రెండు నిమిషాల తర్వాత మరో టీ కప్పుతో తిరిగి వచ్చాడు. వెయిటర్ రెండోసారి తెచ్చిన టీ ని రాంబాబు ఇలా చప్పరించాడో లేదో అవి ఈగపడిన టీ యేనని ఇట్టే కనిపెట్టేసాడు. వెయిటర్ ని, హోటల్ మెనేజర్ ని చెడామడా దులిపేయడం మొదలుపెట్టాడు. అసలింతకీ రాంబాబు, ఇది అంతకు ముందు తనకిచ్చిన టీ యేనని ఎలా కనిపెట్టాడో చెప్పగలరా ?

జవాబు: ఘరానా హోటల్ లోని మొదటిసారి టీ తెచ్చినప్పుడు రాంబాబు అందులో చక్కెర కలుపుకున్నాడన్న సంగతి మీకు గుర్తుందిగా. అందులో ఈగ పడివుందని రాంబాబు దాన్ని తిప్పి పంపిస్తే, వెయిటర్ ఓ రెండు నిమిషాల తరువాత మళ్ళీ అదే టీ ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ సారి రాంబాబు చక్కెర కలుపుకోకుండా టీ ని చప్పరించాడు. అది తియ్యగా ఉంది. ఒకవేళ వెయిటర్ వేరే టీ ని తెచ్చి వుంటే అది చక్కెర కలిపిన టీ లా ఉండకూడదుగా. ఏదేమైనా రాంబాబు చాలా తెలివిగా ఆలోచించాడు కదా.

ఉయ్యాలను ఎలాకడతారు ?

అది హిమాలయాల్లో ఉన్న ఓ చిన్న గ్రామం. అక్కడ ఎవరింట్లోనూ కుర్చీలు, బెంచీలు లాంటివి లేవు. కనీసం గ్రానైట్ రాళ్ళు కూడా లేవు.
అయినా అక్కడి వాళ్ళు పదడుగుల ఎత్తుండే తమ ఇంటి పైకప్పులకు చీర ఉయ్యాలను సునాయాసంగా కట్టేస్తారు. అందుకు వాళ్ళు ఏం ఉపాయం పన్నుతారో మీరు కాస్త ఆలోచించి చెప్పగలరా ? (కట్టెలూ, గిట్టెలూ ఉపయోగించరు లెండి. మనలాగే ఏదో ఒక ఎత్తుమీదికి ఎక్కి కడతారు. ఒకరి మీదికి ఒకరు ఎక్కరు)

జవాబు: ఆ ఊరు హిమాలయాల్లో వుందని చెప్పాంగా. అక్కడ కుర్చీలు, బెంచీలు, గ్రానైట్ రాళ్ళు వంటివి లేకపోతేనేం. ఎక్కడపడితే అక్కడ మంచుగడ్డలు పుష్కలంగా లభిస్తాయిగా. ఆ ఊరివాళ్ళు అక్కడి మంచుగడ్డలనే కుర్చీలలాగా, బెంచీలలాగా వుపయోగిస్తూ తమకు కావలసిన పనులు చేసుకుంటారన్న మాట. ఇంటి పై కప్పులకు చీర ఉయ్యాలలను కూడా వారు ఇలాగే కడతారు

గణిత సంకేతాలు

రెండేరెండు అగ్గిపుల్లలతో ఒక 10 గణిత సంకేతాలు చేయగలరా ?

జవాబు:రెండు (అగ్గి) పుల్లలలో 10 గణిత సంకేతాలను ఈ విధంగా చేయవచ్చు. + - x > < = // || /

ఏది వేరుగా ఉంది ?

ఇందులో మొదటి కాగితాన్ని (A) టీచరు మడత పెట్టారు. మిగతా ఐదు కాగితాలనీ (A,B,C,D,E,F) పిల్లలు మడత పెట్టారు. పిల్లల్లో ఒకరు మడతబెట్టిన కాగితం టీచరు మడతబెట్టిన పద్ధతికి భిన్నంగా వుంది. అదేదో వెంటనే కనిపెట్టగలరా ?

జవాబు: టీచరు చుట్టిన కాగితానికి (A). “F” అనే పిల్లవాడు చుట్టిన కాగితం భిన్నంగా ఉంది. టీచరు కాగితపు ఒక కొసను ఓ వైపున చుట్టి, రెండో కొసని దానికి వ్యతిరేకమైన దిశలో చుట్టగా, “F” మాత్రం రెండు కొసలనీ ఒకే వైపున చుట్టాడు

ఏ వరుసలో ఉన్నాయి ?

ప్రక్క చిత్రంలో ..... సరిగ్గా పై వరుసలో ఉన్న చిత్రాలను పోలిన చిత్రాలు మళ్ళీ ఏ వరుసలో ఉన్నాయో చెప్పగలరా ?

జవాబు: సరిగ్గా పై వరుసకు పోలిన చిత్రాలను కలిగివున్న చిత్రాలు మళ్ళీ “అ” అనే వరుసల్లో ఉన్నాయి.

దేశాల పేర్లేమిటి?

బైనరీ కోడ్ లో అంటే ద్విసంఖ్యామానంలో వుండే భాషలో A నుండి Z వరకు వుండే అక్షరాలని ఈ క్రింది విధంగా పేర్కొంటారనుకుందాం.

a=1, b=10, c=11, d=100, e=101, f=110, g=111, h=1000, i=1001, j=1010, k=1011, l=1100, m=1101, n=1110, o=1111, p=10000, q=10001, r=100010, s=10011, t=10100, u=10101, v=10110, w=10111, x=11000, y=11001, z=11010

కోడ్ భాష ఎలా వుందో చూశారుగా, ఇప్పుడిక ఎలాంటి ఖాళీస్థలాలు, చుక్కలు, కామాలు వగైరా ఏ గుర్తులు లేకుండా కలిసిపోయిన ఈ క్రింది సంకేతాక్షరాల సాయంతో - అవి ఏ దేశాల పేర్లో కనుక్కోండి.

(i) 1001110010010011 (ii) 111000100111101

(iii) 1101000101111011 (iv) 100110100110011001

(ఇందులో మొదటి రెండూ ఆసియా దేశాలు కాగా మిగతా రెండూ ఐరోపా దేశాలు ఈ పేర్లు ఇంగ్లీష్ లోనే ఉన్నాయి.)

జవాబు:

ఇండియా చైనా ఫ్రాన్స్ ఇటలీ దేశాలు

(i) 1001/1 1110/N 100/D 1001/1 1/A

(ii) 11/C 1000/H 1001/1 1110/N 1/A

………………ఇలాగే మిగతా వాటినీ డీకోడ్ చేయవచ్చు.

సరిపోయేలా చేయండి

+,-,x, ./.ఈ నాలుగు గుర్తులలో ఏ గుర్తునైనా ? గుర్తు స్థానంలో ఉపయోగించి ఈ క్రింది సమీకరణం సరిపోయేలా చూడండి.

( 9 ? 1 ) ? ( 7 ? 6 ) ? ( 8 ? 4 ) = 3

జవాబు:

( 9 – 1 ) – ( 7 – 6 ) – ( 8 – 4 ) = 3

( 8 – 1 – 4 = 3)

వేరు చేయండి

24 బంగారు నాణాలలో ఒకే ఒక్కటి కాస్త బరువుగా వుంది. అది మిగతా వాటి కన్నా ఓ ఐదారు గ్రాములు ఎక్కువ బరువు ఉందనుకుందాం. సున్నితపు త్రాసుని ఉపయోగించి (లేదా తక్కెడని) ఆ ఒక్కనాణాన్ని మీరు వేరు చేయాలి. అలాగని ఎన్నంటే అన్నిసార్లు ఉపయోగించకూడదు. సాధ్యమైనన్ని తక్కువ సార్లు మాత్రమే ఉపయోగించాలి. తక్కువలో తక్కువగా ఎన్నిసార్లు దానిని వుపయోగించడం ద్వారా మనపని పూర్తవుతుందో చెప్పండి.

జవాబు:

24 బంగారు నాణాలలో ఎక్కువ బరువున్న ఒక్కనాణాన్ని కని పెట్టేందుకై మొత్తం 3 సార్లు తూకం వేస్తే చాలు. ఇందుకై 24 నాణాలని ఎనిమిదేసి చొప్పున భాగాలు చేయాలి. వాటిలో ఎ,బి,సి భాగాలనుకుందాం.

  • త్రాసులో ఒక వైపున ఎ మరొకవైపున బి భాగాలను వేసి తూకం వేయాలి. రెండూ సమానంగా వుంటే సి భాగంలో తేడా ఉన్నట్లుగా భావించి వీటిని పక్కన పెట్లాలి. అలా కాకుండా ఏదో ఒక భాగం (ఉదాహరణకు బి అనికుందాం) మెగ్గుచూపితే ఆ భాగంలోనే తేడా ఉన్నట్లు గుర్తించి, మిగతా రెండు భాగాలకూ పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు 16 నాణాలు పకక్కు పోయాయి. ఇక మిగిలోన 8 నాణాల నుంచి మనకు కావలసినదాన్ని కనిపెట్టాల్సి వుంది. ఇందుకై ఈ ఎనిమిదిని 3+3+2గా వభజించండి. (వీటిని డి.ఇ.యఫ్ అనుకుందాం) త్రాసులో ఇటు మూటు నాణాలకూ అటుమూడు నాణాలకూ వేసి తూచండి. ఈ రెండు భాగాలు సమానంగా వుంటే అప్పుడు మనం పక్కన పెట్టిన 2 నాణాల్లోనే తేడా ఉన్నట్లు. అలా కాకుండా ఈ రెండిట్లో ఏదో ఒక భాగం (డి అనుకుందాం) మొగ్గు చూపితే అప్పుడు అందులోనే మనకు కావలసిన నాణెం ఉన్నట్లుగా గుర్తించాలి. దీంతో రెండోసారి తూచడం, విశ్లేషించడం పూర్తయిపోతాయి.
  • డి భాగంలో ఉన్న మూడు నాణాల్లో ఒక దాన్ని కింద పెట్టి, మిగతా రెండింటినీ అటొకటి, ఇంకొకటి చొప్పున త్రాసులో వుంచండి. ఆ రెంటిలో ఏది మొగ్గు చూపితే అదే ఎక్కువ బరువుతో ఉన్నట్లు అలాగానే అవి రెండూ సమానంగా వుంటే అప్పుడు కింద పెట్టిన నాణెం బరువుగా ఉన్నట్లు. ఒకవేళ డి.ఇ లలో (3+3) కాక, యఫ్ (2) అనే భాగంలో తేడా ఉన్నట్లయితే అప్పుడు త్రాసులో అటొక నాణాన్ని ఇటొక నాణాన్ని వేసి చూస్తే సరిపోతుంది. ఏమైతేనేం మొత్తానికి నాణాలను మూడుసార్లు తూకం వేస్తే సరిపోతుంది.
గణిత సంకేతాలు
గుండ్రంగానే ఎందుకు?

మురుగు నీటి కాలువలను అక్కడక్కడా ఏర్పాటు చేసే మూతలు (మ్యాన్ హోల్ కవర్స్) సాధారణంగా గుండ్రంగానే వుండటాన్ని మీరు గమనించే వుంటారు కదూ. ఎక్కడో ఒకచోట ఏదైనా ఊరిలో చదరపు ఆకారంలో కూడా అవి మీకు తారసిల్లవచ్చు. అయితే మురుగునీటి కాలువల మూతలు చదరపు ఆకారంలో కన్నా గుండ్రంగానే వుండటం సరైనదని నిపుణులు అంటారు. ఎందుకో మీరు చెప్పగలరా ?

జవాబు:

డ్రైనేజీ గుంతల (మురుగునీటి కాల్వల) మూతలు చదరపు ఆకారంలో వుండడం వల్ల ఒక నష్టం వుంది. అదేమిటంటే వాటిని పక్కకు తిప్పినప్పుడు (మ్యాన్ హోల్ మూచి భాగాలలో కర్ణం వైపు నుంచి) కాలువలో పడిపోవచ్చు. దీనికి భిన్నంగా గుండ్రంగా వుండే మూతలు అలాలోనికి పడిపోవడానికి కుదరదు. ఈ కారణంగానే మ్యన్ హోల్స్ కి గుండ్రని ఆకారంలో ఉండే మూతలను అమరుస్తారు.

ఎన్ని సార్లు తీసేయొచ్చు

42 నుంచి 2ని ఎన్నిసార్లు చేసేయచ్చో ఠకీమని చెప్పగలరా ఇందులో ఎలాంటి ట్రిక్కులేదు. అయినాసరే మీరు తర్కబద్దంగా ఆలోచించకపోతే సులభంగా పప్పులో కాలేసారు.

జవాబు:

42 నుంచి 2 ను ఎన్నిసార్లు తీసేయొచ్చు అన్న ప్రశ్నకు మీ జవాబు 21 అయినట్లైయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే 42 నుంచి 2 ను కేవలం ఒక్కసారి మాత్రమే తీసేందుకు వీలవుతుంది. ఆ తరువాత మీరు 40 నుంచి, 38 నుంచి, 36 నుంచి..... ఇలా వేరే సంఖ్యల నుంచి రెండును తీస్తారేగానీ మళ్ళీ 42 నుంచి తీయలేరు. ఏమంటారు? (గమనిక : 42 నుంచి 2 ని 21 సార్లు తీయొచ్చు అన్నది గణితశాస్త్రపరంగా సరైనదే.)

ఏ సంచీలో ఉన్నాయి ?

ఒక 10 సంచీల నిండా గోళీకాయలు ఉన్నాయి. వీటిలో 9 సంచీలలో ప్రతి గోళీకాయ 10 గ్రాములు బరువుతో వుంటే, ఒక సంచీకలో మాత్రం అన్నీ గోళీకాయలు 9 గ్రాములు బరువుతో మాత్రమే వున్నాయి. ఈ తొమ్మిది గ్రాముల గోళీల సంచీ మిగతా వాటిలో కలిసిపోయివుంది. త్రాసుని ఒకే ఒక్కసారి ఉపయోగించి (ఒక క్రమపద్దతిలో) కొన్ని గోళీలను కొలవడం ద్వారా ఈ సంచీ ఏదో మీరు కనిపెట్టాలి. కొంచెం తెలివిగా ఆలోచించకపోతే లాభం లేదు సుమా. ఇక ఆలస్యం దేనికి. వెంటనే మీ బుర్రకు పనిపెట్టండి.

జవాబు:

ముందుగా ఆ పది సంచీలను ఒక వరుసలో పేర్చండి. మొదటి సంచీ నుంచి 1, రెండవ సంచీ నుంచి 2, మూడవ సంచీ నుంచి 3... ఇలా ఆ పది సంచీల నుంచి మొత్తం 55 గోళీలను తీసుకోండి. వాటిని త్రాసులో వేసి తూచండి. వచ్చే కొలతలో ఒకట్ల సంఖ్యలో వచ్చే అంకెను బట్టి ఏ సంచీ తొమ్మిది గ్రాముల బరువున్న గోళీలతో వుందో తేల్చవచ్చు. అదెలాగంటే... ఉదాహరణకు మొత్తం బరువు 549 గ్రాములు వచ్చిందనుకుందాం. అంటే 10 గ్రాములు బరువున్న గోళీలు 54 (54 x 10 = 540), 9 గ్రాముల బరువున్న గోళీ 1 (9 x 1 = 9) ఉన్నాయన్న మాట. దీనిని బట్టి తొమ్మిది గ్రాములు బరువున్న గోళీలు ఒకటవ సంచీలో వున్నాయని మనం తేల్చవచ్చు. ఒకవేళ చివరి అంకె ‘8’ వస్తే ( 9 + 9 = 18) రెండవ సంచీలోను, ‘8’ వస్తే 9 + 9 + 9 = 27 మూడవ సంచీలోనూ 9 గ్రాముల గోళీలు వున్నాయని స్పష్టమవుతుంది. ఈ విధంగా వేరు వేరు సంచీల నుంచి వేర్వేరు సంఖ్యలో గోళీలను తీసుకొని ఒకే ఒక్కసారి కొలవడం ద్వారా మనం కావలసిన సంచీని కనిపెట్టవచ్చు.

మొత్తం బరువు 10 గ్రాముల గోళీల సంఖ్య + 9 గ్రాముల గోళీల సంఖ్య
549 54 + 1
548 53 + 2
547 52 + 3
546 51 + 4
నిరూపించండి

8+8=91.ఈ సమీకరణంలో ఎలాంటి అదనపు గుర్తులనిగాని, అంకెలని గాని వుపయోగించకుండా, అలాగే ఉన్నవాటిని తొలగించకుండా ఇది సరైనదే అని నిరూపించాలి. కొంచెం తికమక వ్యవహారమే లేండి. అయినా ఎంతో సులభంగా ఇది సరైనదేనని నిరూపించవచ్చు. ఎలా ?

జవాబు:

8 + 8 = 91 అనే సమీకరణంలో మీరు ఎలాంటి మార్పులు చేయకుండా, అది సరైనదే అని నిరూపించమని కదా ప్రశ్న. ఈ సమీకరణాన్ని ( పేజీని ) తిరగేసి చూస్తే అది ఇలా కన్పిస్తుంది.

16 = 8 + 8

సరిపోయిందిగా!

అది ఏది ?

ఎంత పెద్దగా ఉన్నప్పటికీ, లేదా ఎంత చిన్నగా ఉన్నప్పటికీ, సైజుతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఒకే బరువు ను చూపించేది ఏది ?

జవాబు:

సైజుతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఒకే బరువును చూపించేది శూన్యం ప్రదేశం.

ఎవరు ఎంత మంది ?

ఒక కుటుంబంలో మోహన్ అనే అబ్బాయికి ఎందరు అన్నదమ్ములు ఉన్నారో అందరు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. మోహన్ చెల్లెలైన రాధికకు ఎందరు అక్కచెల్లెళ్ళు ఉన్నారో అంతకు రెట్టింపు సంఖ్యలో అన్నదమ్ములున్నారు ఇంతకూ ఆ కుటుంబంలో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కలిసి మొత్తం ఎంత మందో, ఎవరెందరో చెప్పగలరా ?

జవాబు:

ఆ కుంటుంబంలోని మొత్తం పిల్లల సంఖ్య 7. మోహన్ కి ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు అంటే మొత్తం నలుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలున్నారన్నమాటం ఆడపిల్లల్లో ఒకరైన రాధికకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు, నలుగురు (రెట్టింపు) అన్నదమ్ములు ఉన్నారు. (మోహన్ కి ఇద్దరన్నదమ్ములు, ఇద్దరక్కచెల్లెళ్ళు ఉన్నారనుకొంటూ సమస్య పరిష్కారానికి పూసుకుంటే ఒక ఐదు నిమిషాల్లోనే మీకు కావలసిన సమాధానం లభిస్తుంది.)

ఆరితే పాపం

మామూలుగా మనింట్లో ఏదైనా వస్తువు తడిసిపోతే దాన్ని ఆరబెట్టి తడారిపోయేలా చేస్తాము. అవునా, కాని ఒక వస్తువును మాత్రం అది ఆరిపోతే చాలు తడిసేలా చేస్తుంటాము. ఏమిటది ?

జవాబు:

తువ్వాలు. మన తడి వంటినీ, తడి చేతులను తుడుచుకోవడానికి సాధారణంగా ఆరిన తువ్వాలునేగా వుపయోగిస్తాం. ఏమంటారు

సైన్స్ ప్రయెగాలు - చేసి చూద్దాం

తరంగాలతో ప్రయోగాలు

కె. ఆదర్శ సామ్రాట్ ,హైదరాబాద్.

నీటి తరంగాలు, శబ్ధ తరంగాలు, రేడియోతరంగాలు, సూక్ష్మతరంగాలు వంటి రకరకాలు తరంగాల గురించి మీరు వినే ఉంటారు. అయితే తరంగాల గురించి మనందరం గుర్తించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే తరంగం అనేది ఏదో ఒక మాధ్యమాన్ని లేక యానకాన్ని ఆసరాగా చేసుకుని ముందుకు సాగుతుందేగాని, తరంగంతో పాటూ ఆ యానకమూ ముందుకు సాగదు. తరంగానికి సంబంధించిన శక్తి ఆ తరంగం కదిలే దిశగా ముందుకు సాగుతుంది. సరే, తరంగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ప్రయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.

నీటి తరంగాలు

కావలసినవి :- ఒక పెద్ద పాత్ర , నీరు, కార్కు, ఏదైనా చిన్న తూకం రాయి.

చేసేవిధానం : - పాత్రను కొంత ఎత్తు దాకా నీటితో నింపి దానిలో కార్కుని వేయండి కార్కు ( బెండు) నీటిపై తేలుతూ ఓ ఒడ్డుకి వస్తుందన్న సంగతి మీకు తెలిసిందేగా ఇప్పుడు నిశ్చలంగా వున్న ఈ నీటిలోకి కొంచెం ఎత్తు నుంచి తూకం రాయిని వదలండి. దాంతో పాత్రలోని నీటిలో తరంగాలు లేస్తాయి.

ఆ తరంగాలు ఎంత శక్తి వంతంగా ఉన్నాయి అనే విషయం నీటిలో కార్కు పైకీ - కిందికీ కదలడాన్ని బట్టి తెలుస్తుంది.
1. నీటిలోకి వేర్వేరు ఎత్తుల నుంచి రాయిని వదిలి తరంగాలలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించండి
2. పాత్రలోని నీటిలోతును రకరకాలుగా మార్చి కూడా ఈ ప్రయోగాన్ని చేయండి.
ఎ) పాత్రలోని నీటిలోతును బట్టి తరంగాలు ఏ విధంగా మారుతున్నాయి ?
బి) మనం వదిలిపెట్టే రాయిని బట్టి తరంగాలు ఏ విధంగా మారుతున్నాయి ? ఇంకా
సి) మనం రాయిని వదిలిపెట్టే ఎత్తుని బట్టి తరంగాలు ఏ విధంగా మారుతున్నాయి.....
అన్న అంశాలను నిశితంగా పరిశీలించండి. వీటిలో ఏయే సందర్భాలలో ఎక్కువ శక్తివంతమైన తరంగాలు వస్తున్నాయో, ఏయే సందర్భాలలో తక్కువ శక్తివంతమైన తరంగాలు వస్తున్నాయో గమనించండి. ఆ తరువాత దానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి.సరేనా.

తరంగాలను విచ్ఛిన్నం చేయడం


ఒక పెద్ద తొట్టెను గాని, ట్రేను గాని తీసుకొండి. దాంట్లో, పెద్దపెద్ద గులకరాళ్ళను వేసి, సగానికి పైగా నీటితో నింపండి. తరువాత తొట్టెను అటూ ఇటూ కదిలించి దాంట్లో తరంగాలు ఏర్పడేలా చేయండి.

తోట్టెను కదిపినప్పుడు రకరకాల శక్తితో కూడిన తరంగాలు రూపొందుతాయి. అయితే ఇవి ఒక దానికి మరొకటి అడ్డుపడడం వల్ల నీటిలో ఏర్పడ్డ తరంగాలు విచ్ఛిన్నం కావడాన్ని మనం గమనించవచ్చు. అయితే ప్రయోగంలో, తరంగాల విస్తారం కన్నా నీరు తక్కువ లోతుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంటుంది.

తరంగాల డోలీ

ఈ ప్రయోగానికై ఒకేలాగానూ సమాన బరువుతోనూ వుండే కొన్ని బరువులూ, దారం రెండు సన్నని దుంగలు కావలసి వుంటుంది.ఇందులో చూపినట్లుగా ముందుగా రెండు కొయ్యదుంగలనీ కలుపుతూ అడ్డంగా ఓ దారాన్ని కట్టండి. ఈ కొయ్య దుంగలు కదలకుండా నిశ్చలంగా వుండే ఏర్పాటు చేయండి. తూకపు రాళ్ళను వేర్వేరు పొడవులతో వుండే దారపు ముక్కలకు విడివిడిగా కట్టండి.ఇలాంటి ఆకృతులను లోలకాలు అంటారని మీకు తెలిసిందేగా.

దారాల రెండో కొసలను దుంగలను కలిపే (అడ్డు) దారానికి కట్టవలసి వుంటుంది. అయితే ఇలా కట్టేప్పుడు ఒక దారానికి మరో దారానికి మధ్య సమానదూరం వుండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇక ఇప్పుడే అసలైన ప్రయోగం మొదలవుతుంది.
వేలాడే లోలకాల్లో ఏదో ఒక లోలకాన్ని మీరు.... పైన ఉండే అడ్డు దారానికి 90 డిగ్రీల కోణం దాకా తీసుకొచ్చి వదిలిపెట్టండి. దాంతో ఆ లోలకం గడియారంలోని లోలకంలాగే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరగడం మొదలు పెడుతుంది. తరువాత మొల్లమెల్లగా పైన వున్న దారానికి ఇంతకు ముందు మనం కట్టిన అన్ని లోలకాలూ తిరగడం మొదలు పెడతాయి. వీటన్నిటి మూలంగా అంతిమంగా పైన ఉన్న దారంలో తరంగాలు ఏర్పడడం మొదలు పెడతాయి.

మెక్సికన్ తరంగాలు

మనుషులు చేసే విన్యాసాలతో రూపొందే ఈ తరంగాలు చూడ్డానికి చాలా అందంగా వుంటాయి. జాతీయ పండుగలు, పెద్దపెద్ద క్రీడల పోటీల ప్రారంభోత్సవ సమయంలో విద్యార్థులు గాని, ఇతరులుగాని ఈ తరహా తరంగాలను సృష్టించి కనువిందు చేయడం మనందరికీ తెలిసిందే.

ఈ తరంగాలను సృష్టించే విధానంలో...చాలా మంది విద్యార్థులు ఒక సరళరేఖపై నిలబడతారు. తరువాత ఏదో ఒక కొస నుంచి ఒకరి తరువాత ఒకరుగా విద్యార్థులు కూర్చోవడం మొదలు పెడతారు. అయితే ఐదో విద్యార్థి కూర్చునేసరికి మొదటివాడు లేచి నిలబడిపోతాడు. లైను మొత్తం మీద ఒక నిర్థిష్టమైన లయతో ఇదే పద్ధతి అనుసరించబడుతుంది. దాంతో చూసేవారికి ఓ అందమైన తరంగంపైకి లేచి, కిందికి దిగి, తిరిగి పైకి లేచి...ఇలా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మెక్సికన్ తరంగాలను కుడి - ఎడమలకేగాక కొన్ని సందర్భాలలో ముదు - వెనుకలకూ సృష్టించవచ్చు. ఈ తరంగాలకు సంబంధించిన లైన్లలో ఎంత ఎక్కువ మంది విద్యార్థులుంటే తరంగం అంత ప్రభావవంతంగా వుంటుంది. అయితే ఈ తరంగాల సృష్టిలో భాగం పంచుకునే వ్యక్తులు మాత్రం వీటి అందాన్ని పూర్తి స్థాయిలో చూడలేరు.

వెదురు పుల్లలతో తరంగాలు

కొన్ని స్ట్రాలనుగాని, సన్నని చువ్వలను గాని, లేదా వెదురు పుల్లలని గాని తీసుకుని (ఏవి తీసుకున్నప్పటికీ అన్నీ సమానమైన పొడవుతోనూ, పరిమాణంతోనూ వుండాలి) వీటిని ఒక సెల్లో టేప్ పైన గాని, లేదా ఓ కాగితం పట్టీపైన జిగురుతోగాని అతికించండి.

స్ట్రాలు అతికించిన పట్టీని మెల్లగా తిప్పండి, లేదా మెలిపెట్టండి. అంటే. పట్టీ పొడవునా తరంగాలు సృష్టించబడి, వీటి ప్రభావం స్ట్రాల కదలికల్లో స్పష్టంగా కనిపిస్తుది.

అనుదైర్ఘ్య తరంగాలు

అనుదైర్ఘ్య తరంగాలలో .. ఆ తరంగశక్తి ప్రయాణించే మాధ్యమానికి చెందిన అణువులు, ఆ తరంగం స్థానాంతరం చెందే దిశలో మాత్రమే కంపనం చెందుతాయి. ఉదాహరణకు గోళీకాయలు పట్టేంత ఓ సన్నని, తిన్నని కాలువలో అక్కడో గోళీ, ఈక్కడో గోళీ ఉన్నాయనుకుందాం. ఇప్ప్పుడు ఒకవైపు నుంచి ఏదైనా ఒక గోళీకాయను మనం చేత్తో కొట్టినట్లయితే అది వెళ్ళి కాలువలోని మరో గోళీని తాకుతుంది. అది ముందుకు కదిలి మరొకదాన్ని, ఆ తర్వాతది ఇంకొకదాన్ని ఢీ కొంటాయి.

అనుదైర్ఘ్య తరంగం ఎలా సాగుతుంది అన్న అంశాన్ని విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శించి చూపవచ్చు. ఓ 10 - 12 మంది విద్యార్థులు ఒకరి వెనుక ఒకరుగా ఒక వరుసలో నిలబడాలి. అందరి కన్నా వెనుక ఉన్న విద్యార్థి తన ముందున్న విద్యార్థిని కొంత ఒత్తిడితో చేతులతో నెట్టాలి. అలా నెట్టబడ్డ విద్యార్థి తక్షణమే తన ముందున్న విద్యార్థిని చేతులతో నెట్టాలి. ఇలా చివరి నుంచి ముందున్న విద్యార్థి దాకా ఇలా నెట్టుకోవడం అనేది జరగాలి. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రయోగాలన్నిటినీ ఒకసారి మీరు చేసి చూడండి. వచ్చేసారి మరికొన్ని ప్రయోగాలతో కలుసుకుందాం. సరేనా.

ఆధారము: వి.ఎస్.ఓ.సైన్స్ టీచర్స్ హ్యాండ్బుక్ '

ఈల వేసి కనుగొందాం ! మనరాగపు అనునాదం !

ప్రొ||ఎ. రామచంద్రయ్య

పిల్లలూ !

మనం మనిషిని చూడకున్నా, వారి మాటలు విన్నంతనే వారెవరో గుర్తు పట్టగలం. దీనికి కారణం ఒక్కో వ్యక్తికి ఒక్కోరకమైన ప్రధాన శబ్బ పౌనఃపున్యం ఉండడమే! మన తరగతిలో ఎవరెవరిది ఏయే పౌనఃపున్యమో కనుకొనడం ఎంత సులువో చూడండి.

కావలసిన పరికరాలు : -
బకెట్టు, అందులో దాదాపు నిండుగా నీరు, ఒక ప్లాస్టిక్ గొట్టం, గొట్టం మీద గ్రాపు కాగితం ముక్క, దానిని కప్పుతూ సెల్లోపిన్ పొర.
చేసే విధానం : -
బకెట్టులో దాదాపు నిండుగా నీటిని నింపండి. ప్లాస్టిక్ పేపరును గొట్టంలాగా మడిచి దానిపై గ్రాపు కాగితం పేలికను అంటించండి. నీరు తగిలితే కాగితం తడిపి పాడవకుండా ఉండేందుకు ఆ గ్రాపు కాగితపు పేలికను సెల్లోపిన్ పొరతో కప్పి వేయండి.

ఇప్ఫుడు ప్లాస్టిక్ గొట్టాన్ని (సుమారు 2 అడుగుల పొడవుండేలా) నీటిలో నిలువుగా ముంచండి.గొట్టంలో నీటి మట్టం బయటి బకెట్టులోని నీటి మట్టంలో సమానంగా ఉంటుంది. కానీ గొట్టపు పై భాగాన్నించి నీటి మట్టం ఉన్నలోతును గొట్టాన్ని పైకీ, క్రిందికి జరపడం ద్వారా మార్చవచ్చునని గుర్తించండి. మీకు ఈలపాట వచ్చునా?

అయితే గొట్టంలోకి ఈలపాట ఊదండి. ఆ క్రమంలో గొట్టాన్ని పైకి క్రిందికి జరుపుతూ మీ ఈలపాటలో ధ్వనితీవ్రతను గుర్తించండి. ఒకానొక ఎత్తులో ఈలపాట తీవ్రత హెచ్చుగా అవుతుంది. గ్రాపు కాగితం మీద కొలత సాయంతో ఆ పరిస్థితిలో గాలి ఎత్తును గుర్తించండి. అది అనునాదం (Resonance) కలిగిన స్థితి. అత్యంత తక్కువ గాలి ఎత్తున్నపుడు కలిగిన అనువాదపు స్థితిలో, గాలి ఎత్తు మీ ఈల పాట తరంగ దైర్ఘ్యంతో సగం ఉంటుంది. తరంగ దైర్ఘ్యం తెలిస్తే గాలిలో శబ్బవేగం ఆధారంగా పౌనఃపున్యం కనుక్కోండి.

వాయువుల సంకోచ వ్యాకోచాలు

కావలసిన వస్తువులు

  • వెడల్పు మూతి గల ఒకగాజు జాడీ, రబ్బర్ బెలూన్, దారం ముక్క వెడల్పు పాత్ర, చల్లని నీరు
  • బెలూన్ ను తీసుకొని దానిలోకి గాలుని బాగా వూదండి
  • ఈ బెలూన్ సీసాలో పట్టినంత ఘనపరిమాణం కలిగి వుండాలి.
  • బెలూన్ మూతిని దారంతో బిగించి కట్టండి. ఇప్పడు బెలూన్ లోని గాలి బయటకు పోలేదు. ఈ బెలూన్ ని గాజు సీసాలో ప్రవేశపెట్టండి మీరేమీ గమనించారు.
ప్రయోగం -1


గాజు సీసా మూతి కంటె బెలూన్ సైజు పెద్దదిగా ఉన్నందున బెలూన్ గాజు సీసాలో పట్టదు. తరువాత ఒక వెడల్పు పాత్రలో చల్లని నీరు తీసుకోవాలి. బెలూన్ ను కొద్ది నిమిషాల పాటు పాత్రలోని చల్లని నీటితో ఉంచాలి.

ప్రయోగం -2


మళ్ళీ బెలూన్ ను గాజు జాడీలో ప్రవేశపెట్టాలి. ఈసారి బెలూన్ సులభంగా గాజు జాడీలోకి దూరిపోతుంది. ఎందుకని.
బెలూన్ ని చల్లని నీటిలో వుంచినప్పుడు అందులోని గాలి చల్లబడి సంకోచిస్తుంది. దీని వల్ల బెలూన్ సైజు తగ్గి సులభంగా జాడీలోకి ప్రవేశిస్తుంది

ప్రయోగం -3


ఇప్పుడు బెలూన్ ని గాజు జాడీలోనే కొంచెం సేపు ఉంచండి. బెలూన్ ని జాడీలో నుండి బయటకు తీయడానికి ప్రయత్నించండి. బెలూన్ గాజు జాడీ గోడలకు అతుక్కుపోయి బయటకు రాదు. ఈ ప్రయోగం మీరు గాలి యొక్క రెండు ధర్మాలను గురించి నేర్చుకొన్నారు. గాలి చల్లబడితే సంకోచిస్తుంది. ప్రయోగం - 2లో బెలూన్ లోని గాలి చల్లబడి సంకోచించడం వలన బెలూన్ గాజు జాడీలో దూరింది. “గాలి వేడెక్కితే వ్యాకోచిస్తుంది”. ప్రయోగం - 3లో బెలూన్ లోని వేడెక్కి వ్యాకోచించడం వల్ల బెలున్ సైజ్ పెరిగి గాజు జాడీలో ఇరుక్కు పోయింది.

చేసి చూద్దాం
ఎగిరేకిరీటం
  1. సుమారు 20 సెంటీమీటర్లు పొడవు, 20 సెంటీమీటర్లు వెడల్పు ఒక కాగితాన్ని తీసుకోండి. చిత్తుకాగితమైనా పరవాలేదు.దానిని పైన బొమ్మలో చూపిన రేఖ వెంబడి మడత పెట్ట
  2. మడత బెట్టాక ఈ రకమైన ఆకారం వస్తుంది. దీనిలో ఏటవాలుగా కనిపిస్తున్న్ భాగం అడ్డంగా వచ్చేలా తిప్పుకోండి.
  3. ఇప్పుడు పై భాగాన్ని సుమారు 1 సెంటిమీటరు మందం పట్టీ వచ్చేనా కిందికి మడవండి.
  4. ఇలాంటి ఆకారం వచ్చింది కదా. ఇప్పుడు పట్టీని మరొకసారి అదేవిధంగా మడవండి.
  5. పటంలో చూపిన విధంగా మరోసారి పట్టీని మడవండి.
  6. ఇప్పుడు, తయారైన ఆకారం ఇలా కనిపిస్తుంది.
  7. మీరు మళ్ళీ మళ్ళీ మడచి తయారుచేసిన పట్టీ రెండు కొసలను పటంలో చూపిన విధంగా వలయాకృతితో దగ్గరకు తీసుకొచ్చి, జిగురుతో అతికించండి. కిరీటం తయారై పోతుంది.
  8. ఇప్పుడిక ఈ కిరీటం కాల్లో ఎగరడమే తరువాయి. కిరీటాన్ని అడ్డంగా తిప్పి పటంలో చూపిన విధంగా మీ వేళ్ళతో దాని రెక్కలను పట్టుకోండి. దాన్ని ఒక్క ఉదుటున గాల్లోకి ఎగరవేయండి.

ఇలాంటి కిరీటం చేయడం, దాన్నిగాల్లో ఎగుర వేయడం చాలా సులభం. కాబట్టి వెంటనే మీరొకసారి చేసి చూడండి.

కాగితం టపాసు

దీపావళి టపాసును ఒకసారి పేలిస్తే చాలు. దాని పని అయిపోతుంది. పైగా అది పోతూపోతూ కాసిన్ని విషపదార్థాల్ని గాల్లోకి వదిలి పోతుంది. అలాంటి దుష్ఫలితాలు ఏ మాత్రం రాని, కొనడానికి డబ్బులు లేని, మళ్ళీ మళ్ళీ పెల్చగలిగే కాగితం టపాసును మీకు మీరే తయారు చేసుకోండి. ఇందుకు కావలసింది కేవలం ఒక పలుచటి కాగితం మాత్రమే. తీసుకున్నారుగా ఇక మీ పని మొదలు పెట్టండి.

  1. మీరు తీసుకొనే కాగితం ఇలా దీర్ఘచతురస్రాకారంలో వుండేలా చూసుకోండి.
  2. కాగితం రెండు పొడవాటి అంచులు కలిసేలా దాన్ని సరిగ్గా మధ్యన మడిచి తిరిగి విప్పేయండి.
  3. నాలుగు వైపులా వుండే అంచుల్ని ఈ పటంలో చూపిన విధంగా మడవండి. ప్రతి అంచు యొక్క వెడల్పు భాగంలో ఉన్న భుజం కాగితం మధ్యలో ఇంతకు ముందు మనం నిలువుగా చేసుకున్న మడతకు తాకవలసి వుంటుంది.
  4. ఈ ఆకారాన్ని పటంలో చూపిన విధంగా అంటే రెండు పొడవు భాగపు అంచులూ పరస్పరం తాకేలా మళ్ళీ మడవండి. అప్పుడది పైవిధంగా కన్పిస్తుంది. దీంట్లో అటూ ఇటూ రెండు కొసలు కన్పిస్తున్నాయి కదా. ఈ రెండు కొసలనూ ఒక చోటికి చేర్చి, ఆకారాన్ని మధ్యలోకి మడిచి మళ్ళీ మామూలుగా చేయండి.
  5. పటంలో కన్పించే నిలువు మడతకి అటూ ఇటూ రెండు సమబాహు త్రిభుజాలు ఏర్పడేలాగా, (గీతల వెంబడి) రెండు కొసల భాగాలనూ మడవండి.
  6. అప్పుడు ఆ ఆకారం ఇలా కన్పిస్తుంది. మీరు కొసలను మడచిన వైపు నుంచి చూస్తే అది ఒక చతురస్రాకారంలో కన్పిస్తుంది.
  7. రెండు త్రిభుజాలూ కలిసే చోట, ఆకారం మధ్య భాగాన్ని, పటంలో చూపిన విధంగా ముందుకు పొడుచుకు వచ్చేలా మడవండి. ఇప్పుడు త్రిభుజాలు ఈ మడతకు ఇటొకటి అటొకటి వుంటాయి.
  8. ఇంకేముంది. మీ కాగితం టపాసు తయారైపోయినట్లే. ఇక మీరు పేల్చడమే తరువాయి. అందుకు మీరేం చేయాలంటే... రెండు త్రిభుజాకారపు రెక్కల కొసలను పటంలో చూపిన విధంగా మీ వేళ్ళతో పట్టుకోండి. మీ చేతిని గాల్లో పైకి లేపండి. ఇప్పుడా చేతిని విదిలిస్తూ పై నుంచి కిందికి వేగంగా కదపండి. అంతే మీ టపాకాయ ఢామ్మని పేలుతుంది. అయితే అలా పేలినప్పుడు కొన్ని మడతలు విడిపోతాయేగాని కాగితం చినగదు. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ దీన్ని పేల్చవచ్చు.
ఐస్ ముక్కను బయటికి తీయగలరా

మీకో చిన్న సమస్య. మీ ఫ్రిజ్ లో నుండి ఒక ఐస్ ముక్కను నీళ్ళున్న గ్లాసులో వేయండి. ఒక చిన్న దారాన్ని మాత్రమే ఉపయోగించి, చేతులతో తాకకుండా ఐస్ ముక్కను బయటికి తీయగలరా? ప్రయత్నించండి.

ఇలా చేసి చూడండి
బొమ్మలో చూపినట్లు దారాన్ని ఐస్ ముక్కపై వుంచి అక్కడే కొద్దిగా ఉప్పును చల్లండి. ఒకటి లేదా రెండు నిమిషాలు ఆగిన తరువాత దారం రెండు కొనలనూ పట్టుకొని పైకెత్తండి. ఆ దారంతో పాటు ఐస్ ముక్క కూడా బయటకు వచ్చేస్తుంది.

తమాషాగా లేదూ దీనికి కారణం తెలుకుందామా మనం దారంపై వేసిన ఉప్పు ఐస్ పై పొరలోని నూటిలో కరుగుతుంది. ఇది ఒక ఉష్ణగ్రాహక చర్య. అంటే ఉష్ణం పరిసరాల నుండి గ్రహించబడుతుందన్న మాట. కాబట్టి దారానికి అంటుకున్న తడి కూడా చల్లబడి గడ్డకడుతుంది. కాబట్టి ఐస్ పై వుంచిన దారం దానికి అతుక్కుపోతుంది. అందుకే మనం దారాన్ని పైకి ఎత్తినపుడు ఐస్ ముక్క కూడా వచ్చేస్తుంది. మీరు చేసి చూస్తారు కదూ.

కాగితం కుక్క

ఒక కాగితంలో తయారయ్యే ఆకృతి, ఏదో మరికొన్ని కాగితాలలో తయారయ్యే ఆకృతులతో కలిపి సరికొత్త ఆకారాలు వచ్చేనా వేయవచ్చును. ఇలాంటి వాటిలో ఒక దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  1. చతురస్రాకారంలో వుండే ఒక కాగితాన్ని తీసుకోండి. దానిని నిలువుగా సమాన భాగాలు అయ్యేలా మధ్యలో మడవండి. ఇప్పుడు ఇప్పుడా మడతను విప్పి ఆ కాగితం అడ్డంగా కూడా రెండో సమ భాగాలు అయ్యేలా మడత పెట్టి విప్పండి. ఇప్పుడు కాగితంలో ఒకేలా వుండే 4 చిన్న చిన్న చతురస్రాలు మీకు కనిపిస్తాయి.
  2. నాలుగు కొసలూ కేంద్ర భాగాన్ని తగిలేలాగా ఇప్పుడు నాలుగు చదరాలను మడవండి.
  3. నాలుగు కొసలూ మడిచాక అది ఇలా కనిపిస్తుంది.
  4. ఇప్పుడు కాగితాన్ని వెనక్కి తిప్పండి. (ఇక్కడి నుంచి పటాల్లో కాగితాన్ని పెద్దగా వేసి చూపించండి జరుగుతున్నది)
  5. ఇంతకు ముందు మడిచినట్లే, ఇప్పుడు కూడా నాలుగు కొనలను మడవండి. అయితే కాగితానికి ఒక వైపున ఇంతకు ముందే మీరు మడత పెట్టారు కాబట్టి, ఇప్పుడు పెట్టే మడతలు వెనక్కి పెడుతున్నట్లుగా వుంటుంది.
  6. కాగితాన్ని తిరిగి వెనక్కి తిప్పండి. పటంలో చూపినట్లుగా నాలుగు విప్పుకొని వున్న భాగాలు మీకు కన్పిస్తాయి.
  7. ఈ ఆకృతిలో మీకు కన్పించే నాలుగు కొనలను కూడా మీరు మరొకసారి కేంద్రం వైపుకి మడత పెట్టండి.
  8. ఇప్పుడు మీరు కాతాన్ని తిరిగి వెనక్కి తిప్పండి చతురస్రాకారం ప్రతి కొనకు మూకు పటంలో చూపిన విధంగా ఒక గడి కన్పిస్తుంది.
  9. ఎదురెదురుగా ఉన్న ఏవైనా రెండు చదరాల మధ్య భాగపు కొసలను పైకి వేపుతూ, వాటిని బయటి వైపుకి తీసుకురండి. అప్పుడు ఈ పటంలో చూపిన విధంగా మీకు కన్పిస్తుంది.
  10. ఇప్పుడు మీరు పై ఆకృతిలో కన్పించే రెండు చదరాలను బయటి వాపుకు తాగండి. మొత్తం ఆకృతి తెరచుకుని అది దాదాపుగా ఈ విధంగా కన్పిస్తుంది.
  11. ఈ ఆకారాన్ని వెనక్కి తిప్పండి. అప్పుడది ఇలా కన్పిస్తుంది. ఈ ఆకృతిలో మీకు కనిపిస్తున్న చుక్కల రేఖలు వెంబడి (మడత గీత వెంబడి) మడుస్తూ రెండు కొసలనూ మీరు కేంద్రం భాగం వైపుకి తీసుకొని రావలసి ఉంటుంది.
  12. ఒక కొసను మీరు మడవగాలే అది ఇలా ఒక పక్షి ముక్కులా కనిపిస్తుంది. రెండో కొస కూడా ఇలాగే మడవండి. అప్పుడు ఆకారంలో పైకి లేపినట్లుగా రెండు పక్షిముక్కుల్లాంటి ఆకృతులు కన్పిస్తాయి.
  13. పైకి లేచిన రెండు పక్షి ముక్కుల్లాంటి భాగాలనూ కింది వైపుకి నెట్టి వేయండి. తరువాత, ఆకారం కింది వైపున వచ్చిన చదరపు భాగాలను ఆకారం మధ్యలోంచి మడుస్తూ, వెనుక నుంచి పైకి తీసుకు వెళ్ళండి.
  14. అప్పుడు మీకు ఇలాంటి ఆకారం వస్తుంది. వచ్చిందా ఇక ఇప్పుడు మీరు మరో రెండు కాగితాలను తీసుకొని, ఇలాంటి మరో రెండు ఆకారాలను తయారు చేయాల్సి వుంటుంది. 15. ఇలా తయారైన వాటితో రెండు ఆకృతులను తీసుకొని, ఒక దానికి చెందిన తెరుచుకొని వుండే అంచును మరొక దానికి చెందిన అలాంటి అంచులో (పటంలో చూపినట్లుగా) ఇమడ్చండి. ఈ విధంగా ఒక నాలుగు కాళ్ళ బల్లలాంటిది తయారవుతుంది.
  15. ఇలా తయారైన వాటితో రెండు ఆకృతులను తీసుకొని, ఒక దానికి చెందిన తెరుచుకొని వుండే అంచును మరొక దానికి చెందిన అలాంటి అంచులో (పటంలో చూపినట్లుగా) ఇమడ్చండి. ఈ విధంగా ఒక నాలుగు కాళ్ళ బల్లలాంటిది తయారవుతుంది.
  16. బల్లలా కనిపిస్తున్న ఈ ఆకారపు ఒక అంచు వద్ద తెరుచుకొని వుండే ఒక అంచులో, మూడో కాగితపు నిర్మాణం తాలూకు తెరుచుకొని వుండే ఒక అంచులో ఇమడ్చండి. ఇంకేముంది ఇంచాక బల్లలాంటిది. కుక్క ఒళ్ళయితే ఇప్పుడీ కొత్త అమరిక కుక్క తలకాయ అవుతుంది.
  17. ఏదైనా కాగితంతో ఒక తోకలాంటి దాన్ని చేసి, కుక్క తోక భాగంలో అమర్చండి. దాంతో కుక్క పూర్తిగా తయారైపోతుంది. ఇక రంగులూ హంగులూ అంటారా. అదంతా మీ ఇష్టం.
ఎలుకను చేద్దాం రండి!

కాగితాన్నుపయోగించి ముద్దొచ్చే ఓ చిట్టిపొట్టి ఎలుకను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

  1. ముందుగా చతురస్రాకారంలో ఉన్న ఒక కాగితం ముక్కను తీసుకొండి. ఎదురెదురుగా వుండే ఏదైనా రెండు శీర్షాలు ఒక దాన్నొకటి తగిలేలా దాన్ని అడ్డంగా మడవండి.
  2. ఈ ఆకారపు తెరుచుకొని ఉన్న రెక్కలను మీ వైపుకి తిప్పి వుంచుకొని కాగితాన్ని పెట్టుకోండి. పటంలో కనిపించే గీత స్థానంలో కాగితాన్ని ఒకసారి నడిచి, తిరిగి తెరవండి.
  3. పటంలో చూపిన విధంగా (బాణం గుర్తులను గమనించండి). రెండు కొసలనూ కిందికి లాగి మడవండి. ఇప్పుడు మళ్ళీ ఓ చతురస్రాకారం తయారవుతుంది.
  4. ఇంతకు ముందు మీరు మడచిన రెండు కొసలనూ ఈ పటంలో చూపినట్లుగా (అడ్డగీతలపై) పైకి మడవండి. అప్పుడా ఆకారం 5వ నెంబరు పటంలో చూపినట్లుగా తయారవుతుంది.
  5. ఈ ఆకారంలో ఒక దానిపై ఒకటిగా మొత్తం రెండు పొరలు వుంటాయి. వీటిలో పై పొరను పటంలో చూపిన విధంగా, సుమారు ఆ చుక్క గుర్తు ఉన్న దాకా మడవండి.
  6. అప్పుడా ఆకారం ఈ విధంగా కన్పిస్తుంది. ఇంతకు ముందు మీరు మడిచిన పొరని ఇప్పుడు మరోసారి అడ్డుగీత వెంబడి పైకి మడవండి. అప్పడది ఏడవ నెంబరు పటంలో చూపిన విధంగా కన్పిస్తుంది.
  7. ఇప్పుడు కుడి-ఎడమల్లో ఉన్న రెండు భాగాలనీ, చుక్కల గీతల వెంబడి పటంలో చూపిన విధంగా వెనుక వైపుకి మడవండి. అప్పుడు మీకు ఎనిమిదవ నెంబరు పటంలో చూపిన ఆకారం కనిపిస్తుంది.
  8. ఈ ఆకారాన్ని సరిగ్గా దాని భాగంలో (చుక్కల గీతలను గమనించండి) వెనుక వైపుకి మడవండి అలా చేశాక మీకో త్రిభుజం లాంటి ఆకారం వస్తుంది. ఈ ఆకారంలో కర్ణం స్థానంలో ఉన్న భాగం పైకి వచ్చేలా దాన్ని తిప్పి పట్టుకోండి.
  9. ఈ ఆకారంలో పలుచగా వుండే త్రికోణ భాగం ఎలుక తోక అవుతుంది. దీన్ని పటంలో చూపిన చుక్కల గీతల వెంబడి ఒకసారి మడవండి.
  10. ఇదే తోకని తిరిగి వెనుక వైపుకి మడవండి.
  11. ఆ తరువాత ఈ రెండు మడతల్ని విప్పేయండి, ఇప్పుడు ఈ తోకలోని మధ్యభాగపు మడతను కూడా విప్పి, లావుగా వున్న పట్టీలాంటి భాగంలో దానిని దూరుస్తూ మరో మడతని రూపొందించండి. దాంతో తోక పూర్తయిపోతుంది.
  12. ఇక చెవులు సంగతిని చూద్దాం. ముందరి భాగంలో కనిపించే రెండు చిన్న పట్టీలనూ వెనుక వైపుకి మడిస్తే చాలు. ఎలుక చెవులు దాదాపు సిద్ధమైపోతాయి.
  13. ఇప్పడా రెండు చెవులనూ పటంలో కన్పించే రీతిలో పైకి మడవండి. (చెవుల భాగంలో ఉన్న అడ్డకీతలను, భాణం గుర్తులను గమనించారుగా).
  14. ఇక ముస్తాబొకటే మిగిలి వుంది. ఇది ఎలాగూ మీ ఎలుకే కాబట్టి దానిని మీరు మీ ఇష్టం వచ్చినట్లు ముస్తాబు చేసికోండి. తోక గుండ్రంగా కన్పించేందుకుకై దానిని మీ గోరుతోగాని, లేదా ఓ పెన్సిల్ తో గాని కాస్త దుద్దండి. అన్నట్లు ఈ ఎలుక మీ పుస్తకాలనీ కొరుక్కుతింటుందేమో, ఎందుకైనా మంచిది కాస్త కనిపెట్టుకొని వుండండేం సరేనా (గమనిక : కాగితంలో రూపొందే ఆకారాల సైజుని నాల్గవ నెంబర్ చిత్రం నుంచి పెంచి చూపడం జరిగింది.) సమర్పణ : ఐవర్ యాషియల్
ఉప్పు - మిరియాల పొడి కలిసి పోతే ....!

కొంచెం ఉప్పుని, కాస్త మిరియాల పొడిని బాగా కలిపి ఒక బల్లపై పరవండి. ఇప్పుడీ రెంటినీ మళ్ళీ వేరు చేయాలంటే ఏం చేయాలే మీకు తెలుసుగా ? తెలియదా ? అయితే ఇలా చేయండి. ఒక ప్లాస్టక్ చెంచాను (ఒకటి కన్నా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు) తీసుకోండి. ఒక వేడి బట్టమీద కొంచెం సేపటి దాకా ఆ చెంచాను బాగా రుద్దండి. తరువాత ఆ చెంచాను ఉప్పు మిరియాల పొడి మిశ్రమానికి ఒక అంగుళం ఎత్తు దాకా తీసుకొని రండి. అంతే, మిరియాల పొడికి సంబంధించిన కణాలు ఒక్క గెంతు గెంతి చెంచాకు అంటుకుంటాయి. ఇంకేముంది. బల్లపై కేవలం ఉప్పు మాత్రమే మిగులుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే.... వేడి బట్టపై బాగా రుద్దాక ప్లాస్టిక్ చెంచాపైన రుణావేశం (నెగెటివ్ ఛార్జ్) పోగుపడుతుంది. ఆ కారణంగా అది మిరియాల పొడిని టక్కున తన వేపుకి ఆకర్షించుకుంటుంది. చెంచాను ఇంకొంచెం కిందికి దించినట్లయితే ఉప్పు కణాలను కూడా అది తన వైపుకి ఆకర్షించుకుంటుంది.

చెంచాకు మిరియాల పొడే ముందుగా అతుక్కోవడానికి ఒక ముఖ్యమైన కారణం వుంది. ఉప్పు కణాల కన్నా మిరియాల పొడిలోని కణాలు తేలిగ్గా వుండడం వలన అవే ముందుగా ప్లాస్టిక్ చెంచాకు అతుక్కుంటాయి. అదీ సంగతి!

మాట్లడే కుక్క
  1. చతురస్రాకారంలో వుండే ఒక కాగితాన్ని తీసుకోండి. పటంలో చూపిన విధంగా దీనిన సరిగ్గా మధ్యలో మడవండి.
  2. ఇప్పుడా మడతను తిరిగి విప్పేయండి.
  3. ఇప్పుడు పై కొసను కింది కొనతో కలుపుతూ కాగితాన్ని మడవండి.
  4. ఇప్పుడు కింది భాగంలో మొత్తం రెండు పొరలు వుంటాయి. వీటిలో పై పొరని కొద్దిగా పైకి మడిస్తే కుక్క నోటి భాగం తయారై పోతుంది.
  5. పై భాగంలో ఉన్న రెండు కొసలనూ, పటంలో చూపిన విధంగా (ఆ తరహా శాఖలపైన) కిందికి మడిస్తే కుక్క చెవులు కూడా తయారైపోతాయి.
  6. ఇక ఇప్పడు పెన్ను తీసుకొని కుక్క కళ్ళను దించండి. దాంతో కుక్క తయారైపోతుంది. ఇక అది మాట్లాడాలిగా, పటంలో చూపిన విధంగా దానిని మీ రెండు చేతులతోనూ పట్టుకొని మీ చేతుల్ని లోపలి వైపుకి, బయటి వైపుకి కదలిస్తే చాలు. కుక్క కూడా తన మూతిని కదుపుతూ ఏదో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో మీరే స్వయంగా వినండి మరి.
తడవని రుమాలు

మీ చేతి రుమాలూ తడవ కుండా దానిని నీటిలో ముంచగలరా”? అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారు? ఆలోచిస్తూ కూర్చుంటారు అలాంటి ఆలోచన అనవసరం. మీరా పనిని ఎంతో సులభంగా చేయవచ్చు. ఎలాగంటారా? ఇదిగో ఇలా...... ఒక పొడవాటి గాజు గ్లాసుని తీసుకొని దాని అడుగు భాగంలో మీరు రుమాలుని గట్టిగా కూరి వుంచండి. గ్లాసు తిరగేస్తే రుమాలు పడిపోవడం గాని లేదా దాని కొసలు వేలాడుతూ వుండటం గానీ జరుగకూడదు. సరేనా ఇప్పుడే గ్లాసుని బోర్లించి పట్టుకొని, నీళ్ళలో నిండివున్న ఓ టబ్బులో గాని, బకెట్టులోగాని, ముంచేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రుమాలును తడిపే మాట అటుంచి బకెట్టులోని నీరు మీ గ్లాసులోకి దూరనైనా దూరలేదు. గ్లాసుని ఏ మాత్రం వంచకుండా, అదే విధంగా బయటకు తీసి చూసినట్లయితే మీ రుమాలుకి ఏ మాత్రం తడి వుండకపోవడం మీకు కన్పిస్తుంది. అది నీటిలో ముంచక ముందు ఎలా వుండేదో ఇప్పడూ అలాగే వుంటుంది.

ఇలా ఎందుకు జరుగుతుందంటే నీటిలో ముంచక ముందు మీ గ్లాసులో రుమాలుతో పాటు కొంత గాలి కూడా వుంటుంది. గ్లాసుని బోర్లించి నీటిలో ముంచినప్పుడు ఈ గాలికి బయటకు పోయే దారి లేక గ్లాసులోనే వుండి, పైకి రాబోతున్న నీటిని బలంగా అడ్డుకుంటుంది. ఆ విధంగా రుమాలుకి - నీటికి మధ్య గాలి ఒక రెయిన్ కోటులా పనిచేస్తుందన్నమాట. ఒక వేళ మీరు గ్లాసుని తిన్నగా గాక కొంచెం ఒంపు తిప్పిపట్టుకున్నట్లయితే అందులోని గాని రావడం మొదలు పెడుతుంది. గ్లాసుని మరింతగా ఒంపు తిప్పితే గాలి మరింతగా బయటకు పోయి, ఇంకింత నీరు వచ్చి చేరుతుంది. బోర్లించిన గ్లాసుని మీరు బకెట్టులో బలంగా మరింత లోపలికి ముంచినప్పుడు పూర్తిగా కాకపోయినా కొంచెం నీరు గ్లాసులోకి ప్రవేశిస్తుంది. అందుకు కారణం నీటిపై భాగంలో కన్నా లోపలి భాగంలో దాని పీడనం ఎక్కువగా వుండటమే ఆ ఒత్తిడి మూలంగా గ్లాసులో వున్న గాలిలోని అణువులు మరింత దగ్గరకు చేరడం తప్పనిసరి అవుతుంది. అవి అలా ఇంతకు ముందుకన్నా తక్కువ ప్రదేశంలో సరిపెట్టుకోవడంతో కొంత నీరు లోపలికి రాగల్గుతుంది. అదీ సంగతి. ఇక ఇప్పుడు సరదాగా మరో రెండు ప్రయోగాలు చేసి చూడండి. మగ్గు తల భాగాన్ని చేతి వేళ్ళతో పట్టుకొని హఠాత్తుగా దానిని నీటిలో ముంచితే ఏం జరుగుతుంది. ఖాళీ మగ్గుని బోర్లాగా పట్టుకొని నీటిలో ముంచి హఠాత్తుగా వదిలేస్తే ఏం జరుగుతుంది.

నవ్వించొచ్చు - ఏడ్పించొచ్చు

కాగితంపైన ఒకే ఒక ముఖం బొమ్మను దించి దానిని మనం నవ్వించ వచ్చు, ఏడ్పించనూ వచ్చు. అదెలాగంటే

  1. ముందుగా కాగితం మీద మామూలుగా వుండే ఒక ముఖాన్ని గీయండి. మీరు గీసే ముఖంలోని ఇతర భాగాలు ఎలాగైనా వుండవచ్చు. అయితే మూతి మాత్రం పటంలో చూపినట్లుగా ఒక చిన్న సరళరేఖ లాగా వుండాలి.
  2. మూతికి రెండువైపులా, పటంలో చూపిన రేఖల వెంబడి దానిని మడవండి. ఈ మడతలు (రేఖలు) లోపలి భాగం వైపు వుండేలా మడవాలి. ఇక మూతి మధ్యభాగంలో కాగితం పైకి పొడుచుకు వచ్చేలా, రేఖ వెంబడి దానిని మడవండి.
  3. ఇప్పుడు కాగితపు రెండు కొసలనూ పట్టుకొని కాగితం పై భాగం వెడల్పుగా అయ్యేలాగా దాని కింది భాగాన్ని దగ్గరకు తీసుకురండి.
  4. అప్పడు కాగితం మీద వున్న బొమ్మ చాలా విచారంగా ఉదాసీనంగా కన్పిస్తుంది.
  5. ఇప్పుడు కింది వైపు భాగాన్ని వెడల్పు చేస్తూ పై వైపు భాగాన్ని దగ్గరకు తీసుకురండి. అప్పుడు మీకు నవ్వుతూ వుండే ఓ ముఖం కన్పిస్తుంది.
కాగితం వేణువు

కాగితంతో ఒక వేణువుని లేదా మురళిని అతి సులభంగా తయారు చేయవచ్చు. ఇందుకు కావలసినదల్లా ఒక కాగితం, ఒక పెన్సిలు, ఒక కత్తెర, ఇంకా కాగితం జిగురు (గమ్) మాత్రమే.

ముందుగా ఒక చతురస్రాకారపు కాగితాన్ని తీసుకోండి. పటంలో చూపినట్లుగా దాని ఒక శీర్షం వద్ద పెన్సిల్ ని వుంచి, ఆ పన్సిలు చుట్టూ కాగితాన్ని గుండ్రంగా చుట్టండి. ఆ తరువాత పెన్సిల్ ని తీసేస్తే ఒక ఖాళీ కాగితపు గొట్టం సిద్ధమైపోతుంది. ఈ గొట్టం మధ్య భాగంలో వచ్చే కాగితపు రెండో కొనను కొద్దిగా జిగురు పెట్టి ఆ గొట్టానికే అతికించేస్తే చాలు. ఇక ఆ కాగితపు గొట్టం విడిపోకుండా వుంటుంది.
కాగితపు కొనల్లో పెన్ను పాళీల్లాగా కన్పిస్తున్న భాగాల్లో ఒక దానిని పటంలో చూపిన చుక్కల గీతలు వెంబడి కత్తిరించండి. అయితే ఈ భాగాన్ని పూర్తిగా కత్తిరించేయకుండా, ఒక త్రికోణాకృతితో అతి కాగితపు గొట్టాన్నే అంటుకుని వుండేలా చూడండి.

  1. ఇప్పడీ త్రికోణాకృతిని గొట్టం రంధ్రం ఉన్నవైపుకి మడిచి ఆ రంధ్రాన్ని దానితో మూసేయండి.
  2. అప్పుడది ఈ పటంలో (4వ నెంబరు) చూపిన విధంగా కన్పిస్తుంది.
  3. పై దశలో ఇక మీ వేణువు పూర్తయిపోయినట్లే. ఇక మీరు దానిని ఊదడమే తరువాయి. వేణువు రెండో కొసని మూతి దగ్గర పెట్టుకుని నెమ్మదిగా దానిలో గాని వూదండి. దాంతో మీ సొంత వేణవు నుంచి వచ్చే మురళీ గానం ఎలా వుంటుందో మీరు స్వయంగా వినవచ్చు. వేణువులోకి గాలిని వూదడం వల్లనే గాక అందులోంచి పీల్చుకోవడం వల్ల కూడా మీరు ఈ వేణుగానాన్ని వినగల్గుతారు.
సబ్బుతో సులభమైన ప్రయోగాలు

నీటి తల తన్యత గురించి మీకు స్పష్టంగా తెలుసు కదా. ఏదైనా ఒక పాత్రలో నింపిన నీటి ఉపరితలం సమతలంగా వుండక, మధ్య భాగంలో పల్లంగానూ అంచులు వైపున ఎత్తుగానూ వుంటూ దాదాపు ఒక కళాయి (పాత్ర) ఆకారంలో వుంటుంది. ఇందుకు ప్రధాన కారణం మధ్యలో వున్న నీటి అణువులు పాత్ర (ఉపరితలంలో) అంచుల భాగంలో వుండే నీటి అణువులను బలంగా తమ వైపుకి లాగడమే నీరు చూపించే ఈ ధర్మాన్నే తలతన్యత (surface Tension) అని అంటారు. ఇది కేవలం పాత్రలో వుంచిన నీటికేగాక, ఎందులో నిల్వవున్న నీటికైనా వర్తిస్తుంది. ఈ సంగతి మీకు తెలిసే వుంటుందని అనుకుంటున్నాము. సరే నీటికి వుండే ఈ తలతన్యత అనే ధర్మాన్ని ఉపయోగించుకుంటూ ఒకటో తరగతి పిల్లలు కూడా చేయగలికే భలే సరదాగా వుండే కొన్ని ప్రయోగాలను ఇక్కడ మీకోసం ఇస్తున్నాము. ఈ ప్రయోగాలను మీరు, చేయడమే గాక, మీ చుట్టుపక్కల వున్నవారికి చేసి చూపించవలసిందిగా కోరుతున్నాము.

దారం గాజు

కనీసం ఓ ఏడెనిమిది సెంటిమీటర్లు పొడవుండే ఒక దారం ముక్కను తీసుకోండి. దీని రెండు కొసలనూ కలిపి ముడివేయండి. అంతకు ముందే వెడల్పు మూతి వున్న ఒక పాత్రలో నీటిని నింపి వుంచండి. ముడివేసిన దారం ముక్కను ఆ నీటి పై భాగంలో మెల్లగా విడిచిపెట్టండి. అప్పుడది ఒకటవ నెంబరు పటంలో చూపినట్లుగా అడ్డదిడ్డంగా పరచుకుంటుంది. అంటే ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి వుండదు.

ఇక ఇప్పడొక అగ్గిపుల్లను తీసుకొని, దాని మూతికి త్వరగా వ్యాపించే గుణం వున్న అంట్ల సబ్బుని కొద్దిగా అంటించండి. అగ్గిపుల్ల రెండో కొసను మీ చతివేళ్ళతో పట్టుకుని దాని మూతిని, నీటిలో వున్న దారపు ఆకారం మధ్య భాగంలో తాకించండి. అంతే క్షణంలో ఆ దారం గుండ్రంగా ఒక గాజు ఆకారంలోకి మారి పోతుంది. చూసేవారికి ఇదొక అద్భుతంలా అనిపిస్తుంది. అయితే అసలు విషయం ఏమిటంటే...

అగ్గిపుల్లను మీరు నీటి ఉపరితలంపై తాకించగానే పుల్లకు వున్నసబ్బు నీటి పై భాగంలో చుట్టూ వ్యాపిస్తుంది. సబ్బుకి చెందిన అణువులు నీటి అణువుల మధ్య వుండే ప్రదేశాన్ని క్షణాలలో ఆక్రమిస్తాయి. నీటి బిగువును (తల తన్యతను) చేధించే గుణం సబ్బులో వుంటుంది. అందువల్ల అగ్గిపుల్లను ముంచినచోట చుట్టూతా కొంత మేరకు నీటి ఉపరితలంలో వుండే పళ్ళెంలాంటి ఆకారం పోయి, ఒక సమతల ప్రదేశం ఏర్పడుతుంది. ఈ పని జరిగే క్రమంలో ఆ ప్రదేశంలోని నీటి అణువులు వెలుపలి వైపుకి (అగ్గిపుల్లను ముంచిన ప్రాంతం చుట్టూ....) వేగంగా దూసుకుపోవడంతో, దారం అన్ని భాగాల్లోనూ బయటి వైపుకి సమానంగా తోయబడి అది గాజు లాంటి ఒక గుండ్రని ఆకారాన్ని సంతరించుకుంటుంది. అది అసలు విషయం. ఈ ప్రయోగాన్ని చేసేటప్పుడు అగ్గిపుల్లను నీటిలో మరీ లోపలికి ముంచకండి. కేవలం అగ్గిపుల్ల తలకాయను గానీ, లేదా అందులో కొంత భాగాన్ని ముంచితే చాలు.

స్టీమరు పుల్ల

ఒక అగ్గిపుల్లను తీసుకొని దాని (పటంలో చూపిన విధంగా) వెనుక భాగాన్ని కొద్ది చీల్చండి. దాంతో స్టీమరులూ నడిచే అగ్గిపుల్ల తయారయిపోతుంది. చీల్చిన ఈ భాగంలో సబ్బుని కూరండి ఒక వెడల్పాటి మూతి వున్న పాత్రలో నీటిని తీసుకుని, మీ స్టీమరు పుల్లని దానిపై భాగంలో విడిచి పెట్టి ఏం జరుగుతుందో చూడండి. ఇంకేం జరుగుతుంది. అగ్గిపుల్ల ఒక మర పడవలాగా నీటిలో ముందుకు పోవడం మొదలుపెడుతుంది. కేవలం ఒక అగ్గిపుల్లతో సరిపెట్టకుండా ఓ రెండు మూడు అగ్గిపుల్లలను వేర్వేరు ప్రదేశాల్లో వదిలిపెట్టినట్లయితే అప్పుడీ ప్రయోగం మరింత సరదాగా కన్పిస్తుంది.

అసలింతకూ అగ్గిపుల్ల ముందుకు ఎలా ప్రయాణించగల్గుతుందో ఊహించారా ? లేదా? అగ్గిపుల్లతోక భాగంలోని సబ్బు నీటిలో ఎలా ఎలా కరుగుతూ వుంటుందో ఆ భాగంలోని నీటి తలతన్యతకు అలా అలా నష్టం కలుగుతూ వుంటుంది. దీని ఫలితంగా నీటి అణువులు రయ్యిన వెనక్కి (సబ్బువున్న ప్రాంతానికి వ్యతిరేక దిశలో) దూసుకుపోతాయి. న్యూటన్ మూడవ గమన సూత్రం గురించి మీకు తెలిసిందేగా. ప్రతి ఒక్క చర్యకు వ్యతిరేక దిశలో దానికి సమానంగా వుండే ఒక ప్రతి చర్య (ప్రతిక్రియ) చోటు చేసుకుంటుంది. ఇదే న్యూటన్ మూడవ గమన సూత్రం. ఆ సూత్రం ఇక్కడ మన ఈ అగ్గిపుల్ల విషయంలోనూ పనిచేయడం విశేషం అదెలాగంటే

అగ్గిపుల్ల తోక భాగంలో సబ్బు కారణంగా నీటి అణువులు వేగంగా వెనక్కి దూసుకుపోతాయని ఇంతకు ముందే తెలుసుకున్నాంగా. ఇది చర్య. కాగా, దీనికి ప్రతి చర్యగా నీటి అణవులు పోయే దిశకు వ్యతిరేక దిశలో అగ్గిపుల్ల తోక భాగంలో ఎప్పటికప్పుడు సబ్బు కరుగుతూ అక్కడ నీటి అణువులు వెనక్కి తోయబడడం అనే ఒక చర్య చోటు చేసుకుంటూ వుండడంతో దానికి ప్రతి చర్యగా అగ్గిపుల్ల కూడా ముందుకు తోయబడుతూ వస్తుంది. దాంతో అగ్గిపుల్ల ఆగకుండా నీటిలో ప్రయాణిస్తుంది. అదీ అసలు విషయం.

నీటి పూసలు

పై నుంచి కిందికి జారే నీటి చుక్కలు గుండ్రటి ఆకారాన్ని ఎందుకు సంతరించు ఎందుకు సంతరించుకుంటాయో మీకు తెలిసిందే కదా. దానికి కూడా నీటికి ఉన్న తన్యత అనే ధర్మమే కారణమవుతుంది. అంటే మధ్య భాగంలోని నీటి అణువులు చుట్టూ వున్న నీటి అణువులను బలంగా తమ వైపుకి ఆకర్షించుకోవడం అన్నమాట. సరే. ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం. ఒక నీటి పంపుని కొద్దిగా తెరచి సన్నని నీటి ధారను వదిలిపెట్టండి. ఇప్పుడు పంపు మూతి నుంచి సుమారు ఓ రెండంగుళాల కిందన ఆ నీటి ధారకు మీ చేతి వేలిని అడ్డంగా పెట్టండి. ఏం జరుగుతుందో తెలుసా మీ వేలి పై భాగంలో వుండే నీటి ధారలో కనులకింపుగా వుండే ఓ అందమైన డిజైను మీకు కనిపిస్తుంది. ఆ నీటి ధారలో చిన్న చిన్న పూసలు వంటి ఆకారాలు ఒక దాన్నొకటి అతుక్కొని వుండడాన్ని మీరు గమనించగల్గుతారు. మీ చేతి వేలిని ఆ దారంలో మరింత పైకి తీసుకుపోయే కొలదీ ఆ నీటి పూసలు కూడా మరింతా స్పష్టమైన ఆకారాన్ని సంతరించుకుంటాయి. చివరకు ముత్యాలను ఒక దానితో మరొకదాన్ని అతికించినట్లుగా ఆ నీటి ధార కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే.... కిందకు జారుతున్న నీటి ధారకు మీ వేలు ఒక అడ్డు గోడలా నిలవడంతో ఆ పంపు మూతికి. మీచేతి వేలుకి మధ్యవున్న నీటిలో తల తన్యత అనే ధర్మం పనిచేయడం మొదలు పెట్టి, దాని కారణంగా (నీటి మధ్య భాగంలోని అణువుతు వెలుపలి భాగంలోని అణువులను బలంగా తమవైపు లాగడం వలన) ఆ భాగంలోని నీరు చిన్న చిన్న పూసల్లాంటి ఆకారాన్ని సంతరించుకుంటుంది. మరి మీ వేలిని నీటి ధారలో కిందికి తీసుకొచ్చినప్పుడు ఇలా ఎందుకు జరగడం లేదనే ప్రశ్నపుడుతుంది కదా. మంచి ప్రశ్న. నీటి ధారలో మీ వేలిని కిందికి తెచ్చిలప్పుడుగాని, లేదా పక్కకు తీసేసినప్పుడు గాని నీరు కిందికి పడడం అనే చర్య వేగవంతంగా చోటు చేసుకుని ఈ ఉపరితల బిగువు అనేది సడలిపోతుంది. అది అసలు సంగతి అర్థమయ్యిందిగా. ఇక వెంటనే ఈ ప్రయోగాలు చేసి చూడండి సరేనా!

బాలల వినోదం

కధలు
గులాబి పూలు

- గౌతం శ్రీదేవి.

రేపు రంజాన్ పండుగ కదూ ! ప్రసాద్ మాస్టారు గారి ఇంటికి వెళ్తాం. గ్రీటింగ్స్ చెబుదాం. మన అందరం వెళదాము. అంటే నేను అమీర్, బాషా, అబ్దుల్ అందరం కలిసి వెళదాము ? మన ప్రసాద్ మాస్టారు గారికి గులాబి పూలంటే మహా ఇష్టం కదా ! అందుకని రంగు రంగుల గులాబిపువ్వులను సేకరించి చీకటి పడకముందే తిరిగి వచ్చేద్దాం అనుకుంటూ ఉషారుగా బయలుదేరాం. అయితే ఇంతలోనే దారిలో శంకరం మాస్టారు ఎదురొచ్చారు. ఎక్కడికి బయలు దేరారు ? అంటూ పలకరించారు. మా ప్రసాద్ మాస్టారు గారింటికి, గ్రీటింగ్స్ చెప్పడానికి మాస్టారు అన్నారు సంబరంగా. ఔనౌను రేపు రంజాన్ పండుగ కదూ . ఆ విషయం మరచిపోయాను. నేను కూడా వస్తాను వెళ్దాం పదండి అంటూ శంకరం మాస్టారు మాతో కలిసారు. శంకరం మాస్టారంటే అందరికి ఇష్టమే మరి పిల్లలతో ఇట్టే కలిసిపోతారు. ఎన్నెన్నో మంచి విషయాలు చెబుతారు.

దారిలో అమీర్ కి చిన్న సందేహం వచ్చింది. రంజాన్ పండుగ మనం కూడా చేసుకోవచ్చా మాస్టారు అన్నాడు శంకరం మాస్టారు. ఒక్కక్షణం ఆలోచించారు. అన్ని పండుగలూ అందరము చేసుకోవచ్చు.

హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిములైనా మనందరం సోదరులం, ఒకరి పండుగను మరొకరు గౌరవించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఏ మతమైన ఒక్కటే అని వివరించారు. “మతం అంటే ?”ఆసక్తిగా అడిగాడు బాషా. మతం అంటే మంచిని పెంచేది మనిషిలో మంచితనాన్నినింపేది అన్నారు మాస్టారు.

మొన్న దీపావళికి మా ఇంట్లో ఎన్ని మతాబులు ఎన్ని కాకరపూలు కాల్చామో ఎన్ని టపాకాయలు పేల్చామో, దీపావళి అంటే నాకు భలే ఇష్టం అన్నాడు అబ్దుల్ మెరిసే కళ్ళతో. మీ ఊళ్లో పీర్ల పండుగ రోజు మేమంతా భేదభావం లేకుండా ఇళ్ల ముందు నిలబడి పీర్లను ఊరేగిస్తుంటే చూస్తాం. మా బంధువు ఒకాయన పులివేషం మరోకరు కోతివేషం కూడా వేస్తారు. అన్నాడు. శ్రీను వాళ్ల ఊళ్లో జరిగే మొహర్రం పండుగను గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ప్రసాద్ మాస్టారు గారి ఇంటికి చేరుకున్నాం.

ఇంటి ముందు ముత్యాల్లాంటి ముగ్గులు ఈద్ ముబారక్ అని రాసి రంగులతో మెరసిపోతూ అందరినీ ఆహ్వానించింది. అందమైన అక్షరాలు అబ్బ ! మాస్టారు ఎంత బాగా రాశారో ! మళ్లీ మళ్లీ చదివాడు అమీర్ ఆనందంతో చప్పట్లు కొట్టబోయాడు బాషా. వారు ఎదురొస్తున్న మాస్టారుగా అమ్మాయి శిల్ప చేతుల్లోని పూల సజ్జ జారి క్రింద పడింది. పువ్వులన్ని చెల్లా చెదరుగా ముగ్గుల మీద పడ్డాయి. అన్ని గులాబి పువ్వులే ! ఎన్ని రంగులో ! ఎన్ని రకాలో శంకరం మాస్టారు అన్నారు. చూడండి పిల్లలు ఎన్ని రంగులున్నా, ఇవన్నీ పువ్వులే మనలో ఎన్ని మతాలున్నా మనమంతా మానవులం మనమంతా ఒక్కటే. ఈ గులాబి పువ్వుల రంగులు వేరు కావచ్చు వాటిలోని గురీ ఒక్కటే ! అట్లాగే మతాలు కూడా !

వికసించిన మనసులతో పిల్లలు ప్రసాద్ మాస్టారుకు శుభాకాంక్షలు చెప్పాం. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ప్రసాద్ మాస్టారు. అందరికీ మిఠాయిలు పంచారు. అబ్బాయిలూ ! మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే చెబుతున్నాను. అన్నాడు. నవ్వుతూ ముగ్గుల మధ్య రాలిన గులాబిపూలు రాబోయే సంక్రాంతి పండుగను గుర్తు చేస్తున్నాయి.

నీలి చంద్రుడు

రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది. నాని, సుందరి హోమ్ వర్క్ చేసుకొంటున్నారు. బాచి దీక్షగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్సు చదువుతున్నాడు.

అన్నాలు పెడతాను రండి, ఎనిమిదిన్నర కావొస్తోంది - అని అలివేలు అంటూ ఉండగా లైట్లు ఆరిపోయాయి.
లైట్లు రానీ, తింటాం - అన్నారు పిల్లలు. మరేం తొందర లేదు. వీధి దీపాలు కూడా పోయాయి కనుక పవర్ తొందర్లోనే వచ్చేస్తుంది. అంతదాకా ఆగుదాం అన్నాడు శ్రీనివాసుడు.

పిల్లలు ముగ్గురు పుస్తకాలని వదిలి డాబామీదకు వెళ్లారు. ఆ రోజు పున్నమి. వాళ్ళు ఆకాశాన్నీ, చెట్లనీ, కొండలనీ, చుట్టూరా ఉన్నా ఇళ్లనీ చూస్తూ పిచ్చాపాటీ కబుర్లలో పడ్డారు. తొమ్మిదిన్నర అయిపోయింది. పవర్ రాలేదు.

పవర్ ఇంకా రాలేదు. తొందరగా వచ్చి అన్నాలు చేస్తే నా పని అయిపోతుంది. ఎమర్జెన్సీ లాంపు దగ్గర వడ్డించేస్తాను రండి - అలివేలు వాళ్లని మళ్లీ పిలిచింది.

మేం రాం - అని వాళ్ళు డాబా మీంచి గట్టిగా అరిచారు. అంతా కలిసి డాబా మీదే భోంచేద్దాం. వెన్నెల వెలుగులో డాబా మీద వడ్డించు - శ్రీనివాసుడు.

కంచాలు, గిన్నెలు నేను మోయలేను బాబూ మీరు పట్టుకెళ్తానంటే సరే మళ్లీ కిందకు తెచ్చే పూచీ కూడా మీదే నాకు ఓపిక లేదు - అలివేలు ఏమేమి తీసుకెళ్లాలో చెప్పు నేనూ పిల్లలు కలిసి డాబా మీదకు చేరవేస్తాము. తిరిగి క్రిందకు కూడా మేమే తెస్తాములే. నువ్వు వచ్చి వడ్డిస్తూ, మాతో కలిసి తింటే చాలును.- అని అలివేలుకు చెపుతూ ఒరే బాచిగా ఇలా రండి మనం ఇవాళ డాబా మీద వెన్నెలలో అన్నాలు తిందామా. అంటూ పిల్లల్ని పిలిచాడు శ్రీనివాసుడు.

మనకీరోజు మూన్ లైట్ డిన్నర్ అంటూ మెట్లమీద గెంతుతూ పెద్దగా చప్పుడు చేస్తూ పిల్లలు ముగ్గురూ క్రిందకు వచ్చారు. తండ్రి చేసిన సూచనకి ఎగిరిగంతేసి ఒక్క క్షణంలో భోజన సామాగ్రినంతటినీ డాబా మీదకు చేరవేసారు. అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తింటున్నారు.

ఈ గిన్నెలో ఏముంది ? నిమ్మకాయ పులిహోర ఉదయం చేసిందేనా ? మిగిలిపోయిందా ? - శ్రీనివాసుడు.

ఆ...... మిగిలిపోయింది. అందరూ తలోకాస్తా వేసుకోండి. - అంటూ అలివేలు అతనికి వడ్డించింది.

నాకు ఒద్దు - ఇంట్లో నిమ్మచెట్టు ఉంది కదానని రోజూ నిమ్మకాయ పులిహోర చేసి పొద్దున్నే టిఫిన్ అనిపించేస్తున్నావ్ - నాకు ఒద్దు - నాని.

అవునమ్మా! మాకు విసుగొచ్చేసింది. మేము ఓ నాలుగు నెలల పాటు పులిహోర తినొద్దు అని తీర్మానించుకొన్నాం - బాచి.

పిల్లలు చెపుతున్నది నిజంలాగే నాకుతోస్తోంది. అయినా ఈ మధ్య స్వీట్స్ చేయడం మానేశావ్ ! స్వీట్ తిని ఎన్ని రోజులైందో ! - శ్రీనివాసుడు.

అదేమిటి ? గత వారంలోనేగా సుందరి పుట్టిన రోజుకి శేమ్యాపాయసం చేసాను ? - అలివేలు.

శేమ్యాపాయసం కూడా ఒక స్వీటేనా ? సులువుగా అయిపోతుందని ఎప్పుడూ అదే చేస్తావ్ ! నా పుట్టిన రోజునాడు నీకు కాస్త నలతగా ఉంది కదా పోనిలే అని ఊరుకొన్నాను. బొబ్బట్లు చేసి ఎన్ని రోజులైంది ? సుందరి. సంక్రాంతికి బొబ్బట్లేగా చేసాను. సంక్రాంతి వెళ్లి ఇంకా నెల కూడా కాలేదు - అలివేలు .

సంక్రాంతికి చేస్తే సరిపోతుందా ? నా పుట్టిన రోజుకి బొబ్బట్లు చేస్తే కానీ ఒప్పుకోను - నాని.

అమ్మ మళ్లీ దీపావళినాడు తప్ప బొబ్బట్లు చేయదు - బాచి.

నిజమ్ ! మన ఇంట్లో బొబ్బట్లు వన్స్ఇన్ ఎ బ్లూ మూన్ లాంటివి - శ్రీనివాసుడు.

అవునవును అరుణోదయానికి నిమ్మకాయ పులిహోర, నీలి చంద్రోదయానికి బొబ్బట్లు మన ఇంటి ఆనవాయితీ - బాచి.

నీలిచంద్రోదయానికి బొబ్బట్లు అంటావేమిటి ? చంద్రుడు నీలంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదే ! - అయినా దీపావళి అమావాస్యనాడు వస్తుంది కదా ! -

పున్నమి ప్రశ్న వెన్నెల జవాబు

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 60 ఏళ్ళు నిండాయి.షష్ఠిపూర్తి ఉత్సవం రంగరంగ వైభవంగా జరగింది.

ఈ ఉత్సవంలో రాజు ఒక ప్రకటన చేశాడు. “రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పినవారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను. కొలువులో ఉద్యోగం కూడా ఇస్తాను”.
“మహారాజు ఏం ప్రశ్న వేస్తాడో, ఏమో, దానికి జవాబు చెప్పగల అదృష్టవంతులెవరో ” అని దేశమంతా ఒకే చర్చ ప్రారంభమైంది. ఎక్కడ బట్టినా జనం ఇదే మాట్లాడుకోసాగారు.

పున్నమి కోసం ఎదురు చూడసాగారు. ఇక పండితులు, మేధావులు సరేసరి. తమ అదృష్టాన్ని, తెలివిని పరీక్షించుకుందామని తహతహలాడసాగారు. కొందరైతే శాస్త్రాలు తిరగెయ్యసాగారు.

అలా అలా ఈ వార్త గ్రామాల్లోకి పాకింది. ఒక రైతు కూతురు వెన్నెల అనే అమ్మాయి చెవిలో కూడా ఈ వార్త పడింది. వెన్నెల చాలా తెలివైన పిల్ల. పున్నమిరోజు పుట్టిందని ఆ పిల్లకు వెన్నెల అని పేరు పెట్టారు. ఆ పిల్లను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. నేను కూడా రాజధానికి వెళతానని వెన్నెల మారాం చేసింది. అమ్మా నాన్నా వొప్పుకొన్నారు.

పున్నమిరోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకొన్నారు. పండితులు, విద్యావేత్తలు, మేదావులు ఎక్కడెక్కడి నుంచో శాస్త్రాలు పట్టుకొని, పట్టుపంచెలు కట్టుకొని, శాలువాలు కప్పుకొని బయలుదేరి వచ్చారు. వెన్నెల కూడా వాళ్లమ్మా నాన్నలతో పాటు వచ్చింది. పున్నమి రోజు గదా వెన్నెల పిండారబోసినట్టుంది. జనం కిటకిటలాడుతున్నారు. అయినా చీమ చిటుక్కుమన్నా విన్పించేంత నిశ్శబ్దం. అందరూ రాజు ప్రశ్నకోసం ఎదురు చూస్తున్నారు.

రాజు ఇలా చెప్పాడు.
“ మహారాణి గార్కి గుత్తి వంకాయ కూర తినాలన్పించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. మసాలా బాగా వెయ్యి. ఘుమఘుమలాడేలా గుత్తి వంకాయ కూర చెయ్యి, అని ఆజ్ఞాపించింది. వంటవాడు రంగంలో దిగాడు. సన్నికల్లు మీద మాసాలా నూరుతున్నాడు. కూర వండకముందే వాసన గుబాళించేస్తోంది.

వంటవాడి కూతురు ఉయ్యాల్లో ఏడుస్తోంది. పొయ్యిదగ్గర వున్న నీళ్ళ గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకొంటున్నాడు. ఆ నీళ్ళు పడి మంటలు ఆరుతున్నాయి. వంటవాడికి ఎక్కడలేని కోపం వస్తోంది.

ఈ సంగతి వంటవాడి భార్య చూసింది. ఒరే పొయ్యి దగ్గరేం ఏ పనిరా ?
పొయ్యిలో పడ్డావంటే నీ చావు మూడుతుంది. జాగ్రత్త, అని వాణ్ణితిట్టి దూరంగా లాగింది.

ఎలాగైతేనేం గుత్తి వంకాయకూర తయారైంది. దాని రుచిని మహారాణిగారు మహదానందపడిపొయ్యారు. సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది. బంగారుకాసులు బహుమానంగా ఇచ్చింది.

కథ బాగా విన్నారుగా. రాణీగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులిచ్చింది ? ఇదీ ప్రశ్న. సమాధానం కథలోనే వుంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి”. అని ముగించాడు రాజు.

పండితులందరూ తలలు గోక్కున్నారు. కొందరు చెత్త ప్రశ్న అన్నారు. కొందరు ఇదెక్కడా శాస్త్రంలో కన్పించి చావలేదు అని గొణుక్కొన్నారు. అనవసరంగా వచ్చి పరువు పోగొట్టుకొన్నాం అని కొందరు నసగసాగారు. జవాబు మాత్రం ఒక్కరైనా చెపితే ఒట్టు.

వెన్నెల వాళ్ళ నాన్న భుజాల మీది కెక్కి కథ బాగావింది. రాజా నేను చెబుతా అంటూ పెద్దగా అరిచి చేతులూపింది.

రాజు ఆప్యాయంగా ఆ పిల్లను దగ్గరికి పిలిచాడు. “చెప్పమ్మా జవాబు చెప్పు. పెద్దవాళ్ళే చెప్పనక్కరలేదు. తెలివిలో ఎవరు పెద్దయితే వాళ్ళే పెద్ద” అని పురమాయించాడు.
“రాజా ! రాణిగారిచ్చిన కాసులు వెయ్యిన్నూట పదహారు” అనింది వెన్నెల. రాజు ఆ పిల్లను దగ్గరకు తీసుకొన్నాడు. “శభాష్ ! చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని సింహాసనం మీద కూడా కూచోబెట్టుకొన్నాడు.

అది సరేగానీ జవాబు ఎలా చెప్పగలిగావు అని వెన్నెలని అడిగాడు. రాజు.
జవాబు మీ కథలోనే వుంది రాజా. మసాలా వెయ్యిలో వెయ్యి వుంది. నూరుతున్నాడు లో నూరు వుంది. ఏడుస్తోందిలో ఏడు వుంది. ఆరుతున్నాయి లో ఆరు ఉంది. మూడుతుంది లో మూడు వుంది. మొత్తం కలిపితే 1116 గదా అంది వెన్నెల. ఈ సారి రాజుతోపాటు రాణి కూడా ఆశ్చర్యపోయింది.

పిసినారి పిచ్చయ్య

అనగనగా ఒక వూరిలో పిచ్చయ్య, పుల్లమ్మ అనే పిసినారి దంపతులు ఉండేవారు. వారు ఎంగిలి చేత్తో కాకిని తరమడానికి కూడా ఇష్టపడేవారు. కాదు. ఎవరికీ ఏమి పెట్టేవారు కాదు. తింటే ఖర్చవుతుందని కడుపునిండా తినేవారూ కాదు.

ఒకానొక రోజు పిచ్చయ్యకు పొరుగూరు వెళ్ళాల్సిన పని వచ్చింది. బస్సులో వెళితే ఖర్చవుతుందని నడిచి వెళ్ళాలనుకున్నాడు. పగలు వెళితే అందరూ చూస్తారని, బస్సులో వెళ్ళొచ్చు గదా ! అంటారని మన పిచ్చయ్య చీకటి పడ్డాక నడిచి బయలుదేరాడు. ఇంటిలో భార్య పుల్లమ్మకి అన్ని జాగ్రత్తలు చెప్పి మరీ బయలుదేరాడు.

కొంతదూరం వెళ్ళిన పిచ్చయ్యకు చిన్న అనుమానం వచ్చింది. అరె ! నేను అన్ని జాగ్రత్తలు చెప్పాను కానీ దీపాన్ని ఎక్కువ సేపు వుంచకుండా, అన్నం తినగానే ఆర్పివేయమని చెప్పలేదుగదా ! అయ్యో ! తెల్లవార్లూ దీపం వెలిగితే ఎంత కిరోసిన్ వృధాగా ఖర్చవుతుంది అని అనుమానం వచ్చింది పుల్లయ్యకు.

వెంటనే వెళ్ళి తన భార్యకు హెచ్చరిక చేయాలనుకొన్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వెనుకకు మళ్ళాడు పిచ్చయ్య. ఇంటికి వేగంగా వచ్చిన పిచ్చయ్య ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుండి “ఎవరు?” అని కేకేసింది పుల్లమ్మ, “ఏమేవ్ ! నీకో ముఖ్య విషయం చెప్పాలి. తలుపు తియ్యి” అన్నాడు.

అదేందో అక్కడి నుంచే చెప్పు తలుపులు తీయడం, వేయడం, వల్ల బందులు అరగిపోతాయి కదా! అంది పుల్లమ్మ. పిచ్చయ్య తన భార్య పొదుపును చాలా సంతోషించాడు.

“బాగానే ఉంది కాని నువ్వు భోజనం చేయగానే దీపాన్ని ఆర్పివెయ్యి లేక పోతే ఎంతో కిరోసిన్ ఖర్చవుతుంది” అన్నాడు. “బాగుంది సంబడం నేను అసలు దీపం ముట్టించలేదు. పొద్దుండగానే అన్నం తిని పడుకొన్నాను గదా” అంది పుల్లమ్మ “అయినా నువ్వు చేసిన పనేమిటి?” అంది పుల్లమ్మ పిచ్చయ్యతో“ఏం చేశాను?” అన్నాడు పిచ్చయ్య.

“నువ్వు ఎంతో దూరం నడిచివెళ్ళావుగదా ! నీ చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయి. నీకసలు ఆదాచేయడం చేతగాదు ” అని ఎగతాళి చేసింది పుల్లమ్మ.

“భలే దానివి నేనంత తెలివి తక్కువ వాడిని అనుకున్నావా ? నేను చెప్పులు కాళ్ళకేసుకోకుండా చంకన పెట్టుకొని వచ్చాను కదా. ఇంకెక్కడ అరిగి పోతాయి.” అన్నాడు. పిసినారి పిచ్చయ్య “సరే వెళ్ళిరా” అంది పుల్లమ్మ ఎలా వెళ్ళను ? కాలులో ముల్లు విరిగింది. అంటూ కూలబడ్డాడు. అలా కాలులో విరిగిన ముల్లు చీము పట్టి గాయమైంది. పుల్లయ్య పనిలేకుండా నెలరోజులు కూర్చోవడమే కాకుండా, ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయలైంది. అవసరాలకు ఖర్చు చేసుకోవడం పొదుపు. పుల్లమ్మ, పిచ్చయ్యల్లా అవసరమైనా ఖర్చు చేయక పోవడం పిసినారి తనం. పిసినారి పిచ్చయ్యకు తగిన శాస్తి జరిగింది. కదూ !

రాతిచారు

ఆరోజు ఆదివారం. ఉదయం 11 గంటలకే ఎండ కరకరలాడుతోంది. ఎండతో బాటు రంగడికి కడుపులో ఆకలి నకనకలాడుతోంది. నిన్న సంపాదించిన డబ్బులన్నీరాత్రి బన్ను టీ కి సరిపోయాయి. ఆకలి తీరే మార్గం ఎలా.. ఏ అమ్మా నాన్న అడిగితే అంత అన్నం పెట్టొచ్చు. నామోషీ అడ్డమెచ్చింది.

ఇంతలో వాడికో ఉపాయం తట్టింది కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా మన పెద్దలు. ఎదురుగా చిన్ని గుండ్రాయి కనపడింది. దాన్ని సంచిలో వేసుకొని ఒక వీధిలోకి వెళ్లి రాతిచారు కాస్తాం రుచి చూడొచ్చు రాతిచారు కాస్తాం రుచి చూడొచ్చు అంటూ అరవ సాగాడు. రాతి చారేందో చూద్దామని ఆ వీధిలోని అమ్మలక్కలంతా పోగయ్యారు రాతి. చారు ఎక్కడ వినలేదే ఎట్టాకాస్తావ్ అని అడిగిందొకామె.

ఆమెనొక దబర తెమ్మన్నాడు. రెండు ఇటుక రాళ్ళు పెట్టి పొయ్యి ఏర్పరచాడు. కట్టెలు తెమ్మన్నాడు. ఒకామె కట్టెలు తెచ్చి యిచ్చింది. పొయ్యి రాజేసి రాయిని శుభ్రంగా కడిగి దబరలో వేశాడు. నీళ్లు పోశాడు. ఒకామె కొంచెం చింతపండు తెచ్చియిచ్చింది. చింతపండు రాయికేసిరుద్ది నీళ్లతో కలిపాడు.

ఇప్పుడు కొంచెం కంది పప్పు వేస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు ఒకామె చారుపొడి తెచ్చి అందులో వేసింది. ఇప్పుడు కొంచెం తిరగమాత వేస్తే సూపర్ గా ఉంటుంది. అన్నాడు. ఒకామె తిరగమాత వేసింది.

ఇప్పుడు తినడానికి రెడీ అన్నాడు. ఒకామె అప్పుడే వండిన అన్నం, గరిట, నాలుగు అరిటాకులు తెచ్చింది. అందరూ తలా కొంచెం అన్నం పెట్టుకొని రాతిచారు వేసుకొని తిన్నారు. రంగడికి కూడా కడుపు నిండా అన్నం పెట్టారు. బాగుంది, బాగుంది అంటూ అందరూ తిన్నారు. రాతిచారు బాగా చేశావంటూ అందరూ రంగడ్ని మెచ్చుకున్నారు.

రంగడు కూడా తన ఆకలితీరినందుకు సంతోషించాడు. రాతిని కడిగి సంచిలో వేసుకొని మరొక వీధిలో రాతిచారు కాసేందుకు బయలుదేరాడు.

ఇద్దరు పోకిరి గాళ్ళు

ఇద్దరు స్నేహితులుండేవారు ఒకరి పేరు రాము. ఇంకొకరి పేరు సోము. ఇద్దరూ పోకిరిగాళ్ళు. ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని ఆటపట్టించేవాళ్లు. ఎవ్వరూ దొరకనపుడు ఒకర్నొకరు ఆటపట్టించుకొనేవాళ్ళు. ఊరంతా వీళ్ళ దెబ్బకి హడలెత్తిపోతుండేది.

ఒకసారి వీళ్ళకేమీ తోచలేదు. అంటే ఏడ్పించడానికి ఎవ్వరూ చిక్కలేదు. పాపం ఇద్దరికీ ఏమీ తోచలేదు.రాము ఎలాగైనా సోమును గేలిచెయ్యాలనుకొన్నాడు. ఒక గుంట తవ్వి అందులో తాను కూచుని సోమును భయపెట్టాలని అనుకొన్నాడు. ఒక గుంట తవ్వసాగాడు

సోముకూడా ఊరుకోడుగా ! వీడూ రామును ఏదో చేద్దామని ఆలోచిస్తూ బయలుదేరాడు. వాడికి రాము గుంత తవ్వడం కనబడింది. ఓమ్మో! వీడేదో చేస్తున్నట్టుంది. ఇందులో ఏదో కిటుకు వుంటుంది. అనుకొని రాముకు కనబడకుండా గమనించసాగాడు.

రాము చాలా లోతు తవ్వాడు. గుంటలోపలికి వెళ్ళి ఇంకా తవ్వుతున్నాడు. బాగా అలసట వచ్చింది. అప్పుడు సోము ఓ పెద్ద ఆకును తెచ్చాడు. దానికి రంధ్రాలు రకరకాల ఆకారాలతో చేసి గుంటపైన బోర్లించి పెట్టాడు.

గుంట చీకటి మయమైపోయింది. రాము పైకి చూచాడు. ఆకు రంధ్రాల్లోంచి కొంత కాంతి తన మీద పడుతోంది. చీకటి పడిందేమో అన్పించింది. పైగా అలసిపొయ్యాడు. దీంతో ఆగుంటలోనే కునుకు తీసాడు.

ఇది గమనించి సోము ఆకును తీసేశాడు. అంతే గుంటలో ఎండపడింది. చురుక్కు మనడంతో రాము నిద్రలేచాడు. పైకి చూసాడు. వాడికంతా అర్థమైంది. ఇది సోముగాడి పనే అని పసిగట్టేశాడు. వాడి భరతం పట్టాలనుకొన్నాడు. రెండోరోజు సోము గుంట తవ్వడం మొదలుపెట్టాడు. అందులో దాక్కొని రామును ఏడ్పించాలని ఆలోచనను గుంట చాలా చాలా లోతుకు తవ్వుతున్నాడు.

రాము వెతుక్కుంటూ వచ్చాడు. వాడికంతా అర్థమైంది. సోము గుంట తవ్వడం తనని ఏడిపించడానికేనని పసిగట్టేశాడు. సోము బాగా అలసిపోయ్యాడు. అయినా తవ్వుతున్నాడు.

వున్నట్టుండి ఎక్కడి నుండి వచ్చిందో ఒక పాము వీడిమీద బుసకొట్ట సాగింది. రాముకి భయంపట్టుకొంది. పైకి రావడానికి ప్రయత్నించాడు. అలసిపొయ్యాడు గదా. ఎక్కలేకపోతున్నాడు. పాము వెంటబడుతోంది.

లాభం లేదనుకొని గుంట గోడల మట్టితవ్వి కొంచెం కొంచెం గుంట పూడవసాగాడు. పాము మీద మట్టి పోశాడు. విచిత్రంగా వుంది. ఆ పాము మట్టిని తోసుకోని పైకి వస్తోంది. రాము వంటి నిండా మట్టి. ముఖం నిండా మట్టి. గోడ అంచుల్ని త్వరత్వరగా తవ్వి గుంట నింపుతున్నాడు. కళ్ళలో కూడా మట్టి పడుతోంది. పామేమో వెంటబడుతోంది.

ఆఖరుకు నానా కష్టాలు పడి రాము పైకొచ్చాడు. చూస్తే ఒక సన్నటి తాడుతోపాటు ఓ పాము కూడా పైకొచ్చింది. చచ్చాంరా దేవుడా అనుకొని ఎగిరిపడ్డాడు. రాము.

కొంచెం సేపటికి రాముకి అర్థమైంది ఇదంతా సోముగాడి పని అని. పరిగెత్తి వెళ్ళి వాణ్ణి పట్టుకొన్నాడు.
ఇద్దరూ దొంగలేగా ! ఇద్దరూ ఒకర్నిపట్టుకొని ఒకరు నవ్వుకున్నారు. ఆటపట్టించడానికి ఎవరైనా దొరుకుతారా అని ఊరి మీదికి బయలుదేరారు.

“న్యూగినియా” జానపద కథ.

ప్రకృతి - వికృతి

ఎం. హరిప్రసాద్, నెల్లూరు.
విజయనగరం సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న రోజులవి. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని మంచి పరిపాలన అందించడానికి మారు వేషంలో మహామంత్రి తిమ్మరుసుతో కలిసి రాయలు దేశ సంచారం చేసేవారు.

ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తోందనీ, రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వేగుల ద్వారా సమాచారం అందింది. రాయలు తన మంత్రి తిమ్మరుసు గారితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలేమిటో తెలుసుకోవాలని చెరొక గుర్రంపై బయలుదేరారు. పచ్చని చెట్లనీడలో గుర్రాలు దౌడుతీస్తుంటే సూరీడు నిప్పులు చెరుగుతున్నా చల్లగానే ఉంది. దారిలో అనేక పల్లెలు పచ్చని పైర్లతో కళకళలాడుతూ మనస్సును సేదదీరుస్తున్నాయి. చెట్లనే పండిన మామిడి పండ్లు తింటూ దిగుడుబావుల్లోని నీరు త్రాగుతూ ప్రయాణం కొనసాగించారు.

మధ్యాహ్నమయింది. తాము చేరుకున్న పరిసరాలు పల్లెలు రాయలవారికి కొంత భిన్నంగా కనిపించాయి. నీరులేక ఎండిన పైర్లు, కీటకాలు, తెగుళ్ళ బారిన పడిన పత్తిచేలు, ఎక్కడా ఒక్క చెట్టుకూడా కనిపించకుండా, చదునుగా ఉన్న పొలాలతో ఆ పల్లెలు ఎడారిని గుర్తుచేస్తున్నాయి.
రాయలవారు తిమ్మరుసుతో మహామంత్రీ మిగతా పల్లెలన్నీ పచ్చగా కళకళలాడుతూ, ప్రజలంతా సంతోషంగా ఉంటే ఈ ప్రాంతవాసులు ఇలా ఎందుకున్నారు ? అడిగాడు. దానికి తిమ్మరుసు మహారాజు 5,6 ఏళ్ళ క్రితం వరకు ఈ పల్లెప్రజలు కూడా సుఖసంతోషాలతో ఉండేవారు. తాము సంపాదించిన ధనంతో ఆడంబరాలు పెంచుకొన్నారు. చేపలు, రొయ్యల గుంటలకోసం భూగర్భజలాలను తోడేశారు. బావులన్నీ ఎండిపోయాయి. చేతిలో ధనం బాగా ఉండటంత చేను చదరంగా ఉండాలని ప్రతిరైతూ తన పొలంలోని చెట్టన్నీ కొట్టేసాడు. దీంతో కాకులు, గద్దలు, కొంగలు లాంటి పిల్లలు వాలడానికి ఒక చెట్టు గానీ కొమ్మగానీ మిగల్లేదు అన్నాడు.

పిట్టలు వాలకపోతే ఏమిటి నష్టం అన్నారు రాయలవారు.
దానికి మంత్రి “మహారాజా ప్రకృతిలో చెట్లు వాటిని ఆశ్రయించి వుండే పక్షులు, కీటకాలు సహజ సిద్దమైన యంత్రాంగం. పంట మొక్కలకు హానిచేసే క్రిమికీటకాలను పక్షులు తమ ఆహారంగా భుజిస్తాయి. పంటలకు మేలుచేస్తాయి”. ఈ పక్షులు వాలడానికి చెట్లు లేకపోవడంతో ఈ ప్రాంతంలోని పంటలన్నీ తెగుళ్ళ బారిన పడ్డాయి. తెగుళ్ళ నుండి రక్షణకు విపరీతంగా పురుగు మందులు వాడారు. దీంతో విషాహారం తిని పిచ్చుకలు రాబందులు, పావురాలు, కలివికోడి, బట్టమేకలాంటి పక్షిజాతులెన్నో అంతరించిపోయాయి.

పంటలు బెబ్బతిని పల్లెవాసుల ఆదాయం పడిపోయింది. అలవాటైన విలాస జీవితం వదులుకోలేక దాని కోసం అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోనేదశకు చేరారు. పచ్చని చెట్లు లేకపోవడంతో వర్షం కురవక కరువు తాండవమాడుతోంది.” అన్నాడు.

“మహామంత్రీ ఈ పరిస్థితులు చక్కదిద్దడానికి మనం ఏంచేయాలి ?” అన్నాడు రాజు. ఈ ప్రాంత రైతులు తప్పని సరిగా చెట్లను ఎక్కువ సంఖ్యలో పెంచాలి. చేపల చెరువుల సాగు తగ్గించుకోవాలి. వర్షపునీటి నిల్వ చేసుకొని వ్యవసాయ అవసరాలకు వాడుకోవాలి. అన్నాడు మహామంత్రి.

“కరువు నివారణకు అవసరమైన తాత్కాలిక చర్యలతో బాటు, శాశ్వత నివారణకు ఆ ప్రాంతంలో చెట్లను పెంచాల్సిందిగా, రాజోద్యోగులను ఆజ్ఞాపించండి.” అన్నారు రాయలవారు.

పిసినారి పిచ్చయ్య

అనగనగా ఒక వూరిలో పిచ్చయ్య, పుల్లమ్మ అనే పిసినారి దంపతులు ఉండేవారు. వారు ఎంగిలి చేత్తో కాకిని తరమడానికి కూడా ఇష్టపడేవారు. కాదు. ఎవరికీ ఏమి పెట్టేవారు కాదు. తింటే ఖర్చవుతుందని కడుపునిండా తినేవారూ కాదు.

ఒకానొక రోజు పిచ్చయ్యకు పొరుగూరు వెళ్ళాల్సిన పని వచ్చింది. బస్సులో వెళితే ఖర్చవుతుందని నడిచి వెళ్ళాలనుకున్నాడు. పగలు వెళితే అందరూ చూస్తారని, బస్సులో వెళ్ళొచ్చు గదా ! అంటారని మన పిచ్చయ్య చీకటి పడ్డాక నడిచి బయలుదేరాడు. ఇంటిలో భార్య పుల్లమ్మకి అన్ని జాగ్రత్తలు చెప్పి మరీ బయలుదేరాడు.

కొంతదూరం వెళ్ళిన పిచ్చయ్యకు చిన్న అనుమానం వచ్చింది. అరె ! నేను అన్ని జాగ్రత్తలు చెప్పాను కానీ దీపాన్ని ఎక్కువ సేపు వుంచకుండా, అన్నం తినగానే ఆర్పివేయమని చెప్పలేదుగదా ! అయ్యో ! తెల్లవార్లూ దీపం వెలిగితే ఎంత కిరోసిన్ వృధాగా ఖర్చవుతుంది అని అనుమానం వచ్చింది పుల్లయ్యకు.

వెంటనే వెళ్ళి తన భార్యకు హెచ్చరిక చేయాలనుకొన్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వెనుకకు మళ్ళాడు పిచ్చయ్య. ఇంటికి వేగంగా వచ్చిన పిచ్చయ్య ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుండి “ఎవరు?” అని కేకేసింది పుల్లమ్మ, “ఏమేవ్ ! నీకో ముఖ్య విషయం చెప్పాలి. తలుపు తియ్యి” అన్నాడు.

అదేందో అక్కడి నుంచే చెప్పు తలుపులు తీయడం, వేయడం, వల్ల బందులు అరగిపోతాయి కదా! అంది పుల్లమ్మ. పిచ్చయ్య తన భార్య పొదుపును చాలా సంతోషించాడు.

“బాగానే ఉంది కాని నువ్వు భోజనం చేయగానే దీపాన్ని ఆర్పివెయ్యి లేక పోతే ఎంతో కిరోసిన్ ఖర్చవుతుంది” అన్నాడు. “బాగుంది సంబడం నేను అసలు దీపం ముట్టించలేదు. పొద్దుండగానే అన్నం తిని పడుకొన్నాను గదా” అంది పుల్లమ్మ “అయినా నువ్వు చేసిన పనేమిటి?” అంది పుల్లమ్మ పిచ్చయ్యతో“ఏం చేశాను?” అన్నాడు పిచ్చయ్య.

“నువ్వు ఎంతో దూరం నడిచివెళ్ళావుగదా ! నీ చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయి. నీకసలు ఆదాచేయడం చేతగాదు ” అని ఎగతాళి చేసింది పుల్లమ్మ.

“భలే దానివి నేనంత తెలివి తక్కువ వాడిని అనుకున్నావా ? నేను చెప్పులు కాళ్ళకేసుకోకుండా చంకన పెట్టుకొని వచ్చాను కదా. ఇంకెక్కడ అరిగి పోతాయి.” అన్నాడు. పిసినారి పిచ్చయ్య “సరే వెళ్ళిరా” అంది పుల్లమ్మ ఎలా వెళ్ళను ? కాలులో ముల్లు విరిగింది. అంటూ కూలబడ్డాడు. అలా కాలులో విరిగిన ముల్లు చీము పట్టి గాయమైంది. పుల్లయ్య పనిలేకుండా నెలరోజులు కూర్చోవడమే కాకుండా, ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయలైంది. అవసరాలకు ఖర్చు చేసుకోవడం పొదుపు. పుల్లమ్మ, పిచ్చయ్యల్లా అవసరమైనా ఖర్చు చేయక పోవడం పిసినారి తనం. పిసినారి పిచ్చయ్యకు తగిన శాస్తి జరిగింది. కదూ !

సన్యాసి గొప్పా ? శాస్త్రవేత్త గొప్పా?

పిల్లలూ... మిమ్మల్ని ఎవరైనా సన్యాసి గొప్పా ? శాస్త్రవేత్త గొప్పా ? అని అడిగితే మీరు ఠక్కున శాస్త్రవేత్తే గొప్ప అని చెబుతారు. కానీ మన పెద్దవాళ్ళూ శాస్త్రవేత్తల మాటల కంటే సన్యాసుల మాటలను ఎక్కువగా నమ్మేస్తారు. కాషాయ గుడ్డలతో, బారెడు గడ్డం, మూరెడు మీసాలతో జడలు కట్టిన తలతో, కాస్తంత విభూది పూసుకొన్న వాడు కనిపిస్తే టపీమని కాళ్ళమీద పడిపోతారు. కాపాడమని వేడుకొంటారు. ఈ బలహీనత వల్లనే ఎందరో సన్యాసులు, బాబాలు అవతరిస్తున్నారు. ప్రజలను మోసగిస్తున్నారు. వారి మోసాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా కొత్త సన్యాసులు బాబాలు పుట్టుకొస్తూనే వున్నారు. ప్రజలు మోసపోతూనే ఉన్నారు.

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నగరంలో సెప్టెంబర్ 14-16 తేదీల మధ్య భూకంపం వస్తుందని ఒక జ్యోతిష్యుడు భవిష్యవాణి చెప్పాడు. ఈ వార్త ఆ రాష్ట్ర మొత్తాన్ని గడగడ లాడించింది. టీవీ చానళ్ళు దీనికి మసాలాలు జోడించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. జనం బెంబేలెత్తిపోయారు. ఈ జోస్యాన్ని భూగర్బ శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. సన్యాసి మాటలు నమ్మవద్దని ప్రజల్ని కోరారు. కానీ జనం ఇళ్ళూవాకిళ్ళూ వదిలి పరారయ్యారు.

1997 వచ్చిన భూకంపంలో 35 మంది చనిపోయారు. ఇళ్ళూ కూలిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ అనుభవంతో జబల్పూర్, గ్వాలియర్ తదితర ప్రాంతాల ప్రజలు ఇళ్ళు వదిలి రాత్రీపగలు ఆరుబయటే కాలం గడిపారు. ప్రజల ఆందోళన చూసి ప్రభుత్వం కూడా సహాయ చర్యలు చేపట్టింది. సన్యాసి చెప్పిన తేదీలు దాటి వారం గడిచినా ఎలాంటి భూకంపం రాలేదు. జనం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నారు. నిష్కారణంగా ప్రజల్ని భయపెట్టిన ఆ సన్యాసిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం. ఇంతకీ జ్యోతిష్యం చెప్పిన సన్యాసి మన ఆంధ్రుడు కావడం మనకు తలవంపులు. అతడు విశాఖపట్నానికి చెందిన సంగం సన్యాసి రావు.

శనక్కాయ చమక్కులు

నలుగురు పిల్లలు స్కూలు నుంచి ఇంటికెళుతునవ్నారు. దారిలో వేరు శెనక్కాయల లారీ ఒకటి వాళ్ళను దాటి పోయింది. పిల్లలు లారీ వంక ఆశగా చూశారు. శెనక్కాయల బస్తాకున్న కన్నంలోంచి ఒక కాయ ఘల్లున రాలింది. బిలబిలమంటూ పరిగెత్తారు పిల్లలు. వెతికి పట్టుకున్నారు. ఒంటి విత్తనంకాయ. ఊపి చూశారు. మందంగా మోగింది. బరువుగా ఊగింది. పప్పు నిండుగా ఉన్నట్టుంది. కదలడంలేదురా అన్నాడొకడు. ఏదీనేను చూస్తా లాక్కున్నాడు. ఇంకొకడు. చేతితో వత్తాడు. కాయ నిండుగా ఉండడంతో పగల్లా. ఇంకొకడు తీసుకుని కాలికింద బెట్టి తొక్క బోయాడు. పప్పు చితికి పోతుంది. వద్దన్నారు. నలుగురూ శనక్కాయని బంతి ఆట ఆడారు. ఎవరికివారు ఆ కాయను తామే తినాలని అనుకున్నారు.

వాళ్ళ కుమ్ములాటలో తన్నులు తిన్న వేరుసెనగ కాయలోని విత్తనం అమ్మో నన్ను కొట్టొద్దని ఏడ్చింది. ఏడుపు విని అందరూ కాయ వంక చూడసాగారు. ఇంతలో గాలోచ్చి కాయని గోడకేసి కొట్టింది. శనగింజ గుండె చిక్కబట్టుకొంది. తొక్కు పగిలి గింజ బయటపడింది. పైనుంచి కిందికి పడుతుంటే గుండె ఆగినంత పనయ్యింది. శనగ గింజకు.

అంతలో ఒకడు అరచేతిని చాపాడు. అరచేతిలో పడింది గింజ. అమ్మయ్య దెబ్బ తగల్లేదు బతికిపోయాను. అనుకొంది గింజ. నోట్లోకి ఎగరేయబోయాడు. గాలి ఈడిసి కొట్టింది. గింజ మట్టిలో పడిపోయింది. మట్టైన గింజను తినకూడదని నీళ్ళుతెచ్చారు. కడగడానికి గింజ మీద నీళ్ళు పోశారు. నీటి ఉరవడికి గింజ మట్టిలోపలికి పోయింది. అంతా కలిసి వెతికారు కనిపించలేదు. ఎంతకీ కనిపించక పోయేసరికి నిరాశతో వెళ్ళిపోయారు.

అయినా వాళ్ళలో ఆశచావలేదు. పిల్లలు రోజూ అక్కడికి రావటం వెతకడం చేస్తూనే ఉన్నారు. మూడోరోజుకల్లా విత్తనం కనిపించలేదు కాని , అంకురం బయటికొచ్చింది. ఆకులేసింది. రెమ్మ వేసింది. పెద్దదయ్యింది. పసుపు రంగు పూలు పూసింది. ఇక చెట్టు కాయలు కాస్తుందని ఎదురుచూస్తున్నారు. పూలురాలి పోయాయి. కొన్ని రోజులకు చెట్టు ముసలిది అయిపోయింది. ఆకులు పండి పోయి చెట్టు చచ్చిపోయింది. కాయలకోసం చెట్టంతా వెదికారు. పిల్లలు ఎక్కడా ఒక్క కాయకూడా కనిపించలేదు. చెట్టుమీద చాలాకోసం వచ్చింది. చెట్టుపట్టుకొని అమాంతం నేలలోంచి పీకేసారు. అంతే ఆశ్చర్యపోయారు.

చెట్టు మొదలుకు బోలెడన్ని కాయలు శెనక్కాయలు ఒంటి విత్తనం కాయలు, రెండు విత్తనాల కాయలు, మూడిత్తనాలకాయలు. అబ్బో ఎన్ని కాయలో పిల్లలు సంబర పడిపోయారు. కాయల్ని కాల్చుకొని తినాలనుకున్నారు.

ఒకే ఈ చెట్టు చాలా చిత్రంగా ఉందిరా .. పూలేమో పైనున్నాయి. కాయలేమో నేలలో ఉన్నాయి. ఈ గందరగోళమేందో సైన్సు మాస్టారును అడుగుదాంరా అనానడొకడు. అందరూ తలుపారు. క్షణాల్లో చెట్టుతో సహా సైన్స్ మాస్టారు దగ్గరకు వెళ్ళారు. మాస్టారూ చెట్లన్నీ పై భాగాన పూలు పూస్తున్నాయి. కాయలు కూడా పైనే ఉంటున్నాయి. ఈ చెట్టుకేమె పూలు భూమిపైన, కాయలు భూమిలోపల. ఏమిటీ తిరకాసు అన్నారు.

పిల్లలు ఆసక్తిని మాస్టారు లోలోపల సంతోషించాడు అది వెరుశెనగ చెట్టుకున్న ప్రత్యేక లక్షణం. వేరుశెనగ శాస్త్రీయనామం అరాకిస్ హైపోజియా - ఈ మొక్కల ఫాబేసీ కుటుంబానికి చెందినవి. సాధారణంగా చాలా రకాల మొక్కల పుష్పాలు వికసిస్తాయి. కీటకాల నాకర్షిస్తాయి. పరపరాగ సంపర్కం జరుపుకొంటాయి. కాని వేరుశెనగ పుష్పాలు వికసించవు. ఒక పుష్పం లోని పరాగరేణువులు అదే పుష్ఫంలోని కీలాగ్రం చేరి ఫలదీకరణం చెందుతాయి. దీన్నే ఆత్మ పరాగ సంపర్కం అంటారు. వికసిండని పుష్పాల్లో జరిగే ఆత్రపరాగ సంపర్కాన్ని క్లీస్టోగమీ అంటారు.

వేరుశెనగ చెట్లలో గ్రీవపు మొగ్గలు పుష్పాలుగా మారుతాయి. ఈ పుష్పాలకు పొడవాటి కాడలుంటాయి. అండకోశ పీఠభాగం నులితీగగా మారడం వల్ల ఈ కాడల పొడవు మరింత పెరుగుతుంది. ఈ పొడవాటి కాడలు భూమిపైకి వాలడం వల్ల, ఫలదీకరణం చెందిన అండాశయం భూమిలోపలికి చేరుతుంది. ఇలా భూమి లోపలికి చేరినవి మాత్రమే కాయలుగా విత్తనాలుగా మారతాయి., భూమి వీటికి అనుకూలమైన రక్షణ కల్పిస్తుంది. ఫలధీకరణం చెందినా భూమి లోపలికి చేరని అండాశయాలు కాయలుగా మారవు. రాలిపోతాయి. పుష్పాలు ఫలధీకరణం చెందాక భూమిలోకి చేరి కాయలుగా మారడం ఈ మొక్కలకు జన్యుపరంగా వచ్చిన ప్రత్యేక లక్షణం. చాలా మంది శేరుశెన జన్యుపరంగా వచ్చిన ప్రత్యేక లక్షణం. చాలా మంది వేరుశెన క్కాయలు వేళ్ళ నుంచి వస్తాయని అనుకొంటారు. ఇది తప్పు అంటూ ముగించారు సైన్స్ మాస్టర్.

అబ్బో... ఒంటి గింజ వేరుశెనక్కాయ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ? అనుకున్నారు పిల్లలంతా. ఓ మంచి విషయాన్ని పరిశీలించి చర్ర జరిగి నందుకు మన నలుగురు మిత్రుల్నీ ఉపాధ్యాయు లందరూ అభినందించారు.

అంధకారంలోంచి అక్షర ప్రపంచంలోకి

- ఆధారం అరవింద గుప్తా

వెన్న ముద్దల్లాంటి తెల్లటి మబ్బుల్ని తదేకంగా చూస్తున్న ఆ పిల్లవాడు ఉన్నట్టుండి తూనీగల వెంబడి తుర్రుమంటున్నాడు. రంగురంగు సీతాకోక చిలుకల్ని వెంటబడి తరుముతున్న ఆ అల్లరి పిల్లాడు పూలరంగుల్ని వాటి పుప్పొడిని శోధించి చూస్తున్నాడు. ఆ పిల్లాడికి అదంతా ఇప్పుడు ఒకనాటి మదుర స్మృతి . అయిదేళ్ళ వయస్సుకే అతడికివన్నీ “స్మృతుల” జాబితోలో చేరిపోయాయి.

ఒక నిషాదం అతని రెండు కళ్ళనూ బలిగొంది. వాళ్ళ నాన్న చర్మకారుడు. ఎవ్వరూ లేనపుడు కుతూహలం కొద్దీ చర్మాన్ని శుభ్రం చేసి, కత్తిరించే పరికరాల్ని పరిశీలిస్తూ, నున్నటి చర్మం మీద మొనదేలిన డబ్బునంతో ఏవో పిచ్చిగీతలు గీయబోతూ ఆ నిర్భాగ్యుడా దబ్బనాన్ని ఎడమ కంటిలో గుచ్చుకొన్నాడు.

ఆ గాయం సెలవేసి, రెండో కంటికీ ప్రాకి అతని జీవితాన్ని చిమ్మచీకటి మయం చేసింది. రెండువందల యేళ్ళనాడు ఫ్రాన్సులో రెండు కళ్ళూ పోగొట్టుకోవడమంటే భిక్షగాళ్ళ జాబితాలో చేరినట్టే లెక్క. అయినా వాళ్ళ నాన్న తన కొడుకు దిక్కు లేనివాడు కాగూడదని పట్టుబట్టాడు. ఒక సన్నటి చేతి బెత్తం. తయారుచేసిచ్చాడు. దాని సాయంతో నడుస్తూ ఆ పిల్లవాడు తండ్రివద్దే చర్మం బాగుచేసి కత్తిరించి గుర్రుపు జీనులు చెయ్యడం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. కథ ఇక్కడితో ఆగిపోయి ఉంటే లోకంలోని లక్షలాది అంధుల చరిత్ర కూడా చీకట్లో చిక్కి నేటికీ విలవిలలాడుతుండేది.

ఇంతలో ఊళ్ళోకి ఒక క్రైస్తవ ఫాదర్ వచ్చాడు. ఆ పసివాణ్ణి చేరదీసి స్కూలు మాస్టారికి నచ్చజెప్పి బళ్ళో చేర్చాడు. ఏం విన్నా ఏకసంతాగ్రాహిగా ఇట్టే పట్టేసుకొంటున్న ఆ పిల్లవాణ్ణి ఆ బడిలో ఆపెయ్యక పట్టుబట్టి వాళ్ళమ్మానాన్నలకు నచ్చజెప్పిపారిస్ లోని అలనాటి మొట్ట మొదటి అంధుల పాఠశాలలో చేర్చించాడు. ఈ ఘటన ఆ పిల్లవాడి జీవితంలోనే కాదు చూపుకు నోచుకోని లక్షలాది అంధుల జీవితాల్ని ఒక మలుపు తిప్పుతుందని ఆనాడు ఆ ఫాదర్ కూడా ఊహించి ఉండడు.

ఆ పిల్లగాడెవ్వరో ఇప్పటిదాకే మీరు కొంత ఊహించుకొని వుంటారు. బ్రేలీ లిపిగా నేడు చలామణి లో ఉన్న అంధుల లిపికి ఆవిష్కర్త ఇతడేననీ ఇతడి పేరు లూయీ బ్రైల్ అనీ మీరు గుర్తించి ఉంటారు. ఇంతకూ మన లూయీ వయస్సు ఆనాటికి పట్టుకొని పది సంవత్సరాలే....

అంధులు చదవడానికి అక్షరాలు కాగితం మీద ఉబ్బుగా, తాకితే చేతికి తగిలేలా ఆ రోజుల్లో ఉండేవి. B,R చదవాలంటే రెండూ ఒకటిగానే చేతికి తగిలేవి. తేడా కనుక్కోవడం మహా కష్టంగా ఉండేది. పేజికి పది అక్షరాలు కూడా పట్టేవి కాదు. అందువల్ల అంధులకోసం పుస్తకాలు దొరికే అవకాశమే లేదు, ఇంతలో కెప్టెన్ బార్బియర్ ఆ స్కూలుకు వచ్చాడు. సైనికులు రాత్రుల్లో చదివేందుకు ఆయన కనుగొన్న పద్ధతిని అక్కడ ప్రవేశపెట్టాడు. కాగితం వెనక్కు తిప్పి తడుముకొంటూ చదవడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత.

ఈబార్బియర్ పద్ధతిని చూచినప్పటి నుంచి మన లూయీ ఎలాగైనాఅంధులు ధారాళంగాచదవగల్గేలా ఒక లిపిని తయారుచెయ్యాలని దీక్ష బూనాడు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా అతనివెంట ఒక దబ్బనం ఉండేది. ఒక కొయ్యపలక, దళసరి కాగితం ఉండేది. రాత్రింబవళ్ళు ఆయనకదే చింత, అదే తపన.

ఎట్టకేలకు ఒక రాత్రి లూయీ మెదడులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. బార్బియర్ ఫ్రెంచి భాషలోని ధ్వనులన్నింటికీ సంకేతాలను సూదితో గుచ్చిన రంధ్రాల రూపంలో రూపొందించాడు. ఫ్రెంచి భాషను రాయడానికీ సంకేతాలు ఏమాత్రం చాలేవి కావు. అంతా గజిబిజిగా ఉండేది. దీనికి పరిష్కారం గా ఫ్రెంచి లిపిలోని ప్రతి అక్షరానికీ లూయీ కొన్ని బిందువులు నిర్దిష్టంరూపంలో ఉండేలా చేశాడు. మొత్తం 26 అక్షరాలే గాబట్టి కొద్ది సంకేతాలతో భాషనంతా ఇష్టం వచ్చినట్టు రాయడానికి, దేన్నైనా చదవడానికి దీంతో ఎంతో సులభమైపోయింది. అప్పటికి లూయీకి కేవలం పదిహేనేళ్ళే....

లూయీ లిపిని బార్బియర్ నసేమిరా వొప్పుకోలేదు. పాఠశాల డైరెక్టరు దీనికి ప్రచారం తేవాలని ఎన్ని సంస్థలకు చెప్పినా విన్నవారు లేరు. కొత్త డైరెక్టరు వచ్చి లూయీ తయారుచేసిన పుస్తకాలన్నీ తగలబెట్టేసాడు. తోటి పిల్లలే లూయీని ఆదరించారు. అతని లిపిని స్వీకరించి అద్భుతంగా చదవడం, రాయడం సాగించారు. అంధులు చదవడం ఇంత సులభమైతే మనకు ఉద్యోగాలెక్కడ ఉంటాయని పాఠసాల టీటర్లందరూ దీన్ని తొక్కిపెట్టాలని సర్వ ప్రయత్నాలు చేశారు …..
చివరికి లూయీ అదే స్కూల్లో టీచరుగా చేరాడు. ఒక్కక్షణం వృధా పోనీకుండా లైబ్రరీలోని పుస్తకాల్ని తన లిపిలోకి తర్జుమా చెయ్యడానికి కంకణం కట్టుకొన్నాడు. దీంతో అతని ఆరోగ్యం క్షీణించింది.

ఒకానొక వసంతకాలపు ప్రభాతాన వందలాది మంది విద్యాభిమానులు చేరిన సఙలో లూయీ తన లిపిని పరిచయం చేశాడు. అంధులు ఏం చెప్పినా రాయడం, ఏం రాసినా అనర్గళంగా చదవడం కళ్ళారా చూసిన సభికులు హర్షధ్వానాలతో లూయీని ఆకాశానికెత్తారు. ముఫ్ఫై అయిదేళ్ళు నిండీ నిండక ముందే తృప్తిగా లూయీ తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణించిన ఏడేళ్ళకు అమెరికా అధికారంగా ఆయన లిపిని స్వీకరించింది. అప్పటినుంచీ అది బ్రేలీ లిపిగా ప్రసిద్ధికెక్కింది.

ఏ దబ్బనం అయిదేళ్ళ ప్రాయంలో తనకు వెలుగును శాశ్వతంగా దూరం చేసిందో, ఆ దబ్బనంతో లూయీ లక్షలాది అంధుల జీవితాల్లో అక్షరాల వెలుగును నింపే లిపిని ఆవిష్కరించాడు.

బాబా విశ్వరూప ప్రదర్శన విఫలమైందెందుకు..?

తుమ్మలరాములు, హన్మకొండ.

2007 అక్టోబరు 4వ తేదీ సాయంత్రం దాదాపు 7 గం" ప్రాంతంలో మా బంధువుల ఇంట్లో టివి9 చానల్ చూస్తున్నప్పుడు రెండు వాక్యాలు స్క్రోలు అవుతూ కనిపించాయి. అవేమిటంటే ... పుట్టపర్తి విమానాశ్రయంలో విరాట్ విశ్వరూపం ప్రదర్శనం, సాయిట్రస్ట్ ప్రకటన ... పుట్టపర్తి విమానాశ్రయం వేలాదిగా భక్తజనంతో కిక్కిరిసిపోయింది.మార్గమధ్యమంలో సాయిబాబా కారు ట్రాఫిక్జాంలో ఇరుక్కుపోయింది.

గత్యాంతరం లేక బాబా వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నాడని యాంకర్లతో వార్తల మీద వార్తలు అందివ్వడం జరిగింది.

ఇది జరిగిన మరుసటి రోజు మా పాఠశాలలో 9, 10 తరగతి పిల్లలు కొందరు ఈ విషయాన్ని ప్రస్తావించారు.

పుట్టపర్తి విమానాశ్రయంలో సాయిబాబా విశ్వరూప ప్రదర్శన చేస్తారని వార్తలొచ్చినవి కదా సార్? ఆయనెందుకు అలా ప్రకటించి ఉంటారో చెప్పండి సార్? అని ప్రశ్నించారు ఆ పిల్లలు.

ప్రజలు నమ్మినట్లు సాయిబాబా దేవుడేమి కాదు. ఆయనలో మహిమలేమి లేవు. దైవశక్తులు, దైవ మహిమలు ఉండటం అనేది అబద్ధం, అశాస్త్రీయం. సాయిబాబా దైవం ముసుగులో దగా చేస్తున్నాడు. ఆయన దేవుడని ప్రచారం చేసుకోవడం ఆస్తిక సిద్ధాంతము ప్రకారమే తప్పు. దేవుడు నిన్న పుట్టడమేమిటి? నేడు వృద్ధుడు కావడమేంటి? రేపు చావడం ఏమిటి? ఇవన్నీ మనుషుల లక్షణాలే కదా? కనుక సాయిబాబా ఒక మనిషే తప్ప దేవుడు కాదు. దేవుడుగా ప్రచారం చేస్తున్నది అమాయక భక్తజనమే. అయితే విశ్వరూప ప్రదర్శంపచేయాలనే దానిలో ఒక అలోచన వుంది. ఆయనకిపుడు 80సం" ఈ వృద్ధాప్యంలో మరింత పాపులారిటీ పెంచుకోవాలనే తపన ఉన్నట్లు కనిపిస్తోంది.

మరో వ్యక్తిలోని యోగ్యతను ఒప్పుకొనే వారు అతి కొద్ది మందే వుంటారు - విలియం హాజ్లిట్

అయితే ఇక్కడ మీకో ప్రశ్న తట్టవచ్చు. ఆయనకు ఇప్పటికే కావలసినంత పాపులారిటీ వుంది కదా? ఇంకా ప్రచారాన్ని ఎందుకు కోరుకుంటున్నట్లు? అనే సందేహం రావచ్చు. వ్యాపారస్తులు ఎప్పుడు ప్రచారాన్ని పెంచుకుంటూనే ఉంటారు. ఇక్కడ పెట్టుబడి అమాయకుల నమ్మకాలే. మీరు చూడండి టాటా, బిర్లా వంటి కంపెనీలు కోట్లు సంపాదించినా, పోటీపడి ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇది కూడా అంతే...?

ఇప్పటి వరకు వారి భక్తులు, ట్రస్టు మెంబర్లు మాట్లాడిన తీరును బట్టి చూస్తే పుట్టపర్తికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిందని, అదే సమయంలో షిరిడికి భక్తుల సంఖ్య పెరిగినట్లు అర్థమవుతుంది.

అదే మాటల సందర్భంలో షిరిడీ కంటే గొప్పగా పుట్టపర్తి ఆశ్రమాన్ని తీర్చిదిద్దుతామని అక్కడికంటే ఇక్కడికే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేటట్లు చేపడుతామని ట్రస్టు సభ్యులు అంటున్నారంటే దానర్ధం ఆ రెండు ఆశ్రమాల మధ్య గట్టిపోటీ పెరుగుతుందనేది గ్రహించాలి.

అసలు ఆకాశంలో విశ్వరూప ప్రదర్శన అనేది - అంటే చంద్రునిలో బాబా రూపాన్ని ప్రదర్శంపచేయడం ఎంతవరకు సాధ్యం...? బాబాకు అసాధ్యం ఏది లేదన్నది భక్తుల విశ్వాసం. సాయిబాబాకు తన విశ్వరూపం ఆవిష్కరించబోతున్నారని, అందరు చూసే విధంగా చంద్రుడిలో సాక్షాత్కరించబోతున్నారనే వార్త టివి 9 చానల్లో చూడగానే దేశం యావత్తు ఉలిక్కిపడింది. ఒక విధమైన ఉద్వేగానికి లోనైంది. బాబా భక్తులంతా లక్షల సంఖ్యలో తమ పనులన్నీ వదులుకొని టీవీలకు అతుక్కుపోయారు. తమ జీవితాలను తరింపచేసే మహాద్భుత దృశ్యాన్ని వీక్షించబోతున్నామన్న ఉద్వేగంతో ఎదురు చూశారు. కాని కొద్ది గంటలలోనే ఆ ఉత్కంఠ ఆవిరైపోయింది.

అక్కడ పుట్టపర్తిలో సాయంత్రము 5 గంటల సర్వదర్శనం సమయంలో బాబానోట విశ్వరూప ప్రదర్శన మాట వెలుబడగానే ఆయన ఉపన్యాసాలను అనువాదం చేసే అనిల్కుమార్ కామరాజు భక్తులందరికీ ఆ మాటలు బిగ్గరగా చెప్పడం జరిగింది. అంతలోనే అక్కడ ఒక్కసారిగా కలకలం. దర్శనానికి వచ్చివున్న వేలాది మంది భక్తులు ఎయిర్పోర్ట్ వైపు పరుగులు పెట్టారు.ఈ వార్త క్షణాల్లో పరిసర గ్రామాలన్నింటికి పాకిపోయింది. వందలాది గ్రామాల నుంచి అమాయక భక్తజనం పుట్టపర్తికి ప్రయాణం కట్టారు. బస్సులు, లారీలు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు వంటి వాహనాలన్నింటిని పుట్టపర్తికి మళ్ళించారు.గంట వ్యవదిలోనే పుట్టపర్తి ఒక మహాజన సముద్రంగా మారిపోయింది.ఎయిర్పోర్టులో ఇసుకపోస్తే రాలని పరిస్థితి. బాబా కూడా అక్కడికి చేరుకున్నాడు. దానితో జనంలో మరింత ఆసక్తి ఎదో జరగబోతుంది మానవ మాత్రులు సాధ్యంకాని మహిమాన్విత దైవత్వాన్ని దర్శించబోతున్నామన్న బావనతో ఉక్కిరిబిక్కిరైపోయారు జనం. అయితే కొద్ది సేపట్లోనే అదంతా ఉత్తుత్తి ప్రచారమని తేలిపోవడంతో తీవ్ర నిరసనతో వెనకకు మరలిపోయారు జనమంతా.

ఆకాశం మేఘావృతమై వాన చినుకులు పడటంతో చంద్రుడు మబ్బుచాటున దాగుండిపోయాడు కాబట్టి, విశ్వరూప ప్రదర్శన వాయిదా పడిందని ప్రకటించారు ఆశ్రమ నిర్వాహకులు అమావాస్యకు ముందురోజు చంద్రుడు అర్థరాత్రి దాటిన తర్వాత కానీ కన్పించడు. అసలు చంద్రుడే లేని సాయం సమయంలో బాబా చంద్రుడిలో దర్శనం ఇవ్వడం ఏమిటి? అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించారని ఆయన భక్తులే కొందరు ప్రశ్నించారు.

బాబా తన మహిమతో, లేదా దైవశక్తితో విశ్వరూపం ఆవిష్కరించడం కోసం ఎయిర్పోర్టు వరకూ వెళ్ళవలసిన అవసరం ఏమి ఉంది? ఆకాశం అనేది ఎయిర్పోర్టులో మాత్రమే ఉండదు కదా...? ఒక ప్రాంతంలో కనిపించే విశ్వరూప దర్శనం , దేశమంతా కనిపిస్తుంది కదా...? దర్శనమే నిజమైతే ముందుగా ప్రకటిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తారు కదా! హడావిడిగా పుట్టపర్తి ఎయిర్పోర్టుకే ఎదుకు పరిమితం చేయాలి? చంద్రుడు అంతటా కనిపిస్తాడు కదా...? మూఢభక్తులు ఆ మాత్రము ఆలోచించలేదా...?

బాబా ఆశ్రమ నిర్వాహకులు కొందరు ఆ రోజు ఎయిర్పోర్టులో రహస్యలేజర్షో ఏర్పాటు చేశారని, అనుచరుల చేతులలో బొమ్మగా మాత్రమే, మిగిలిన బాబాను అక్కడకు తీసుకెళ్లి లేజర్షో ద్వారా ఆకాశంలో సాయిబాబా బొమ్మ ప్రదర్శింపచేసి, దాన్నే బాబా విశ్వరూపం ప్రదర్శనంగా చిత్రీకరించ చూశారని అయితే మేఘాలు కమ్ముకొని వానపడటం వల్ల వారి ప్రయత్నం విఫలమైందని ఒక వదంతి. కాని ఇది వాస్తవం కాదు. లేజర్షోకు ఆకాశంలో మబ్బులు - మేఘాలు కూడా పెద్ద సమస్య కాదు. కటిక చీకటిలోనే లేజర్షో మరింత బాగా రాణిస్తుంది. లేజర్షో నిర్వహించడానికి బాబాను ఎయిర్పోర్టు వరకు తీసూకెల్లవలసిన ఆగత్యమే లేదు.ఆయనను ఆశ్రమంలోనే వుంచి షో నిర్వహించి ఉండవచ్చుగదా?!.

పుట్టపర్తి వంటి గ్రామీణ ప్రాంతాలలో లేజర్షోలోని సాంకేతికత తెలిసిన వారు పెద్దగా ఉండరు కాబట్టి ఆకాశంలో బాబా బొమ్మ ఆయన మహిమ వల్ల కనిపిస్తుందని నమ్మి, భక్తజనమంతా పొర్లు దండాలు పెట్టి ఉండేవారు. ఆయన విశ్వరూప ప్రదర్శనతో ఆయన దైవత్వ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తుందని సంతోషపడిన భక్తజనం ఇప్పుడు బాబా అబాసు పాలైనాడన్న చింతతో వేదనకు గురౌవుతున్నారు.ఎందుకిలా జరిగింది? స్వామి అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించారు? ఆశ్రమ నిర్వాహకులు ఎందుకు తప్పటడుగులు వేశారు? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. తప్పు ఎవరిదైనా సాయిబాబా మాయలు, మహిమలు మీద మరొకసారి తీవ్రమైన చర్చకు శ్రీకారం చుట్టింది ఈ సంఘటన...!

ప్రజల అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని బతికేవారు స్వాములు, బాబాలు. సాయిబాబా విశ్వరూప దర్శనం పచ్చిదగా ! 30 ఏళ్ళు క్రితం పాలల్లో తాను కనపడుతానంటూ ప్రచారం చేశారు. అప్పుడు నాస్తికులు, హేతువాదులు ప్రత్యేకంగా వెళ్ళి పరిశీలించడం జరిగిది. ఏవేవో జిమ్మిక్కులు చేశారు. మళ్ళీ ఇప్పుడు (04.10.2007) తాజాగా విశ్వరూప ప్రదర్శనాన్ని ప్రకటించారు. ఇది కేవలం దిగజారిపోతున్న బాబా ప్రతిష్టకు నిదర్శనం. అయితే బాబాకు విశ్వరూప ప్రదర్శనం చేయగలిగిన సత్తా ఉంటే, మేఘాలను ఆపలేడా? మేఘాలు అడ్డుపడితే తిరిగి వెళ్ళి పోతాడా? భగవత్ స్వరూపం కంటే మేఘాలు మహిమ గలవా..? నిజంగా ఆయనకు మహిమలు ఉంటే ఎయిడ్స్, క్యాన్సర్ రోగాలను ప్రపంచ హద్దుల నండి తరిమేయవచ్చుగదా !

మనిషికి వయస్సు మీద పడిన కొద్ది రుగ్మతలు, మానసిక వ్యాధులు వస్తాయి. అలా పుట్టిందే ఈ దర్శనం. వయస్సులో ఉన్నపుడు బాబా చేసిన ట్రిక్లకు ప్రజల్లో వున్న మూఢవిశ్వాసాల్ని మరొకమారు పరిక్షించుకునేందుకే ఈ ప్రయత్నం చేశారు. బాబా చేసిన ఏ క్రియా రుజువుకు నిలబడ్డ దాఖలాలు లేవు. ఇపుడు ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఆయన తిరిగే పరిస్థితి లేదు. బాబాకే మహిమలుంటే ఆయనకు ఈ దుస్థితి ఎందుకు? తన నహిమలతో పేదరికాన్ని రూపుమాపవచ్చుగదా..? ప్రజల్లో తమమాటకు తన మాయాజాలానికి ఆదరణ తగ్గిందా? లేదా? అని తెలుసుకునే ప్రయత్నమే ఇది. ఈ బూటకపు నాటకంపై, ప్రజలను మోసగించడంపై ప్రచారం చేపట్టాలి. సామాజిక వంచన కింద కేసు నమోదు చేయాలి.

మనం కొన్ని వస్తువుల్ని గమనించినట్లయితే ఏవో కొన్ని మానవుల, జంతువుల లేక కట్టడాల ఆకారాలు కనిపించడం సహజమే. ఇలాంటి పోలికల్ని చూసి వాస్తవాలుగా విభ్రమ చెందుతుంటారు. ఈ భ్రమ చెందడాన్నే మానసిక శాస్త్రపరిభాషలో "పెరెయ్ డోలియా" అని అంటారని మానసిక వైద్య నిపుణులు చెప్తుంటారు. పెరెయ్ డోలియా అనేది ఒక విధమైన భ్రమ. లేదా తప్పుడు అనుభవం. ఎలా అంటే ఉన్న వస్తువులే మరో రూపంలో కనిపించడం. ఉదా" ఉదయించే సూర్యుడు మధ్యాహ్నం సూర్యునికంటే పెద్దగా కనిపించడం. మరికొన్ని మ్యాజిక్ ప్రదర్శనలు. ఇందులో ఏదీ స్పష్టంగా కనిపించదు. కాని పెరెయ్ డోలియా భ్రమలకి గురైనవారు వారివారి నమ్మకాలకి అనుగుణంగా తమకు కనిపించే భ్రమల్నే వాస్తవాలుగా అనుభూతి చెందుతారు. మానసిక రోగుల్లో రోగ రకాల పై విశ్లేషణ జరిపినపుడు సైకియాట్రిస్టులు ఈ పెరెయ్ డోలియా సహాకారాన్నే తీసుకుంటారు.

భంగపడిన ' గంగ '

జి.ఎల్.రత్నశేఖర్,నెల్లూరు

ఉదయాన్నే బైక్ పై కాలేజికి వెళుతున్నాడు వేణు.విజయవాడ నగరంలోని చుట్టు గుంట ప్రాంతంలో విశాలమైన రోడ్డు వెంబడి పరుగు తీస్తొంది బైకు. అదే రోడ్డుకు ఒక వైపున దూరంగా కొందరు జనం మూగి, ఏదో హడావిడి చేయడం గమనించిన వేణు బైక్ ను ఆ వైపుకు పోనిచ్చాడు. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూచి నివ్వెరపోయడు. తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు.
ఆ రోడ్డు ప్రక్కనే ఒక పెద్ద రావిచెట్టు మాను తొర్రలోంచి స్వచ్చమైన నీరు ఏకధాటిగా ఉబికి వస్తున్నాయి.

అది గమనించిన జనం కొందరు ఆ చెట్టు చుట్టు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి చెట్టుకు పసుపు, కుంకుమలు పూసి, పూజలు చేయడం ప్రారంభిచారు. అక్కడ గంగమ్మ తల్లి వెలిసిందని, అందుకే ఆ అద్భుతం జరుగుతుందని ప్రచారాలు మొదలయ్యాయి. వేణు అక్కడే నిలబడి పోయాడు. 10 నిమిషాలు గడిచింది. ఆ పది నిముషాలలో దాదాపుగా వందమందికి పైగా పోగయ్యారు. మహిళలందరు పూజలు చేసేందుకు క్యూలు కట్టారు.
అంతక్రితం వరకు జన సంచారం లేక దుర్గంధంతో, పందులు తిరుగుతుండిన ఆ ప్రాంతం ఇప్పుడు తాత్కాలిక పుణ్యక్షేత్రంగా మారింది. స్వతహాగా ఇలాంటి వాటిని నమ్మని వేణు, అసలు విషయం ఏమిటో అని ఆలోచిస్తూనే కాలేజి వైపుకు దారితీసాడు.
వేణు క్లాసులో కూర్చున్నాడన్నమాటే గాని, ఫిజిక్స్ లెక్చరర్ చెప్పే పాఠంపై ఏ మాత్రం ఏకాగ్రత చూపలేక పోతున్నాడు. అతని ఆలోచనలన్నీ, ఆ సంఘటనపైనే ఉన్నాయి. ఇంక ఉండబట్టలేక ఫిజిక్స్ లెక్చరర్‌తో జరిగిందంతా చెప్పాడు వేణు. ఈ సారి ఆశ్చర్యపోవడం లెక్చరర్ వంతైంది. ఫిజిక్స్ లెక్చరర్ చక్రపాణిగారు ఆదర్శభావాలు, శాస్త్రీయ దృక్పధం గల వ్యక్తి. జన విజ్ఞాన వేదికలో మంచి కార్యకర్త కూడా. విద్యార్థులలో మూఢనమ్మకాలను పోగొట్టి, శాస్త్రీయ భావాలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తుంటారాయన. గంగమ్మ తల్లి విషయం వినగానే విస్తుపోయిన చక్రపాణిగారు సుదీర్ఘంగా ఆలోచించారు. విషయం ఎంతకూ బోధపడలేదు. ఇక లాభం లేదని సాయంత్రం కాలేజి అయ్యాక వేణుతో పాటు ఆ ప్రదేశానికి బయలుదేరాడు.
అక్కడ వాతావరణం ఉదయం కన్న ఎక్కువ సందడిగా ఉంది. జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. అప్పటికప్పుడు తాత్కాలికంగా చిన్నదుకాణాలేర్పడ్డాయి. కొబ్బరికయలు, పూజా సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. పూజకు ఎగబడుతున్న జనం "క్యూ" కొండవీటి చేంతాడులా ఉంది. వేణుతో పాటు అక్కడకు చేరుకున్న చక్రపాణి గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందులో ఉన్న యదార్ధం ఏమిటని సుదీర్ఘ ఆలోచనలో పడ్డారు.
సరిగ్గా అప్పుడే ఒక జీపు శరవేగంతో వచ్చి ఆగిందాప్రదేశంలో. అంతకన్నా వేగంగా జీపు దిగిన నీటి పారుదల శాఖ ఇంజనీరు, వర్కర్లు సరాసరి ఆ రావిచెట్టు వైపుకు పరుగు తీసారు. " ఏం మనుషులయ్యా మీరు? ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాటరు పైపు లీకైతే మాకు తెలియజేయవచ్చుగా? పైగా గంగమ్మ తల్లి అంటూ పూజలొకటి. పైపు ఎక్కడలీకైందో తెలియక ఉదయం నుండి అంతా వెతుకుతున్నాం. ఇక్కడ పైపు రిపేరు చేయాలి అంతా ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళండి!" అంటూ వారి పనిలో నిమగ్నమయ్యారు.
చిన్నారులూ! మీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది.అక్కడ గంగమ్మ తల్లి ఎలా వెలిసిందో. నీటి పారుదల శాఖ వారు నీటి సరఫరాకోసం ఆ ప్రదేశంలోని రావిచెట్టు ప్రక్కనే భూమిలో పాతి పెట్టిన పైపు పగిలిపోవడంతో ఆ నీరు భూమి నుండి పైకి వచ్చే మార్గం లేక రావి చెట్టు మానుకు అడుగున ఉన్న చీలిక నుండి నేరుగా వచ్చి తొర్రలోంచి ఉబికి వచ్చాయన్నమాట. అది గంగమ్మ తల్లి అసలు రహాస్యం. విషయం అర్థమైన వేణు, చక్రపాణి ఇద్దరు నవ్వుకుంటూ ఇంటి మొఖం పట్టారు. "ఈ కంప్యూటరు యుగంలో కూడా ప్రజల్లో మూఢనమ్మకాలున్నంత కాలం ఇలాంటి దేవతలు ఎక్కడైనా, ఎందరైనా వెలుస్తూనే ఉంటారు.!!" (యధార్థ సంఘటన ఆధారంగా)

విషం మింగే మొక్కలు !

కె.బి.గోపాలం.

పాల కడలిని చిలికినప్పుడు విషం పుడితే శివుడు దాన్ని తాను గొంతులో దాచుకున్నాడని చెపుతారు. ఇతరులకు హాని చేసే రసాయనాలను తాము స్వీకరించి అందరికీ ఉపకారం చేసే మొక్కలు ఉంటాయని చెబితే కొంత మందికి ఆశ్యర్యం కలగవచ్చు. ఈ మధ్యన పరిశోధకులు జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఒక మొక్కలో కిన్ని మార్పులు చేసి, ఆర్సెనిక్ అనే విషయ రసాయనాన్ని పీల్చుకునే శక్తిని ఆ మొక్కకు అందజేశారు. నేలల్లో మనుషులకు హాని కలిగింపజేసే మేరకు ఆర్సెనిక్ చేరిన చోట ఈ రకం మొక్కలను పెంచి విషరనాయనాన్ని తొలగించవచ్చునంటున్నారు. ఇదే రకంగా మరెన్నో కాలుష్యకర రసాయనాలను మొక్కల సాయంతో తొలగించే వీలు ఉందని కూడా వారు అభిప్రాయం వెలిబుచ్చారు.

మొక్కల సాయంతో, మట్టి నుంచి విష రసాయనాలను తొలగించే ఫైటోరెమేడియేషన్ అనే పద్ధతి మరీ కొత్తది మాత్రం కాదు. కానీ ఈ రకంగా వాడకానికి వీలయ్యే మొక్కలు సహజంగా దొరకడం అరుదు. అవసరం ప్రకారం మొక్కలలో జన్యుపరమైన మార్పులు చేసి వాడుకోవడం మాత్రం సరికొత్తగా వచ్చిన పద్ధతిగా రూపొందుతున్నది. సూక్ష్మజీవుల నుంచి రెండు జన్యువులను వేరుచేసి అరాబిడాప్సిస్ థేలియానా అనే తీగ మొక్కలోకి ఎక్కించారు. ఇది ఏథెన్స్ లోని జార్జియా విస్వవిద్యాలయంల జరిగిన ప్రయత్నం. ఆర్సెనిక్ బాగా చేరిన నేలలో కూడా ఈ మొక్క తట్టుకుని బాగా పెరుగుతుంది. అంతేగాక మట్టిలోని విష రసాయనాన్ని పెద్ద ఎత్తున పీల్చుకుని తన ఆకులలో నిలువ చేసుకుంటుంది. సూక్ష్మజీవి నుంచి తీసిన జన్యువులు ఈ విష రసాయనాన్ని పీల్చుకునే రకంగా మారుస్తాయి. రసాయనపు సమ్మేళనాలను విరిచి పీల్చడానికి అనువుగా మార్చగల శక్తి ఈ జన్యువుల కారణంగానే మొక్కకు అందింది.

మొక్కల వేళ్లు ఒక ఎకరం నేలలో , ఒక ఏడాది కాలంలో కోట్లమైళ్ల పొడుగున పెరుగుతుంటాయి. అవన్నీ కలిసి విష రసాయనాలను పీల్చడం మొదలు పెడితే మొత్తం రసాయనం నేలలో నుంచి బయటకు వచ్చేస్తుంది. రెండు లేదా మూడు సంవత్సరాలలో నేలలను పంటకు, మనుషుల వాడకానికి అనువుగా మార్చగల మొక్కలను తయారుచేయవచ్చునని, ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర వహించిన రిచర్డ్ మీగర్ అంటున్నారు.

మట్టిలో ఆర్సెనికి రసాయనం సహజంగానే ఉంటుంది. కానీ గనుల తవ్వకం, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను ఇష్టం వచ్చినట్లు వదలడం, భూగర్భజలాలను వెలికి తీయడం కారణంగా, మట్టిలో దాని మోతాదు అపాయకరమైన చోటికి పెరుగుతుంది. ఈ రసాయనం కొంచెమున్నా కూడా క్యాన్సర్,నాడీమండల వ్యాధులు పుడతాయి. బంగ్లాదేశ్ లోనూ,మనదేశంలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనూ భూగర్భజలాలలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంది. అందుకే ఆ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఆర్సెనిక్ పాయిజనింగ్ కు గురవుతున్నారు.

ఆర్సెనిక్,కాడ్మియం,పాదరసం,రాగి,యశదం లాంటి కాలుష్య రసాయనాలను విడగొట్టి అపాయం లేకుండా చేయడం కుదరదు. అవి ఎక్కువగా ఉన్న మట్టిని తవ్వి మరెక్కడో గుంటలు పూడ్చడం ఒక పద్ధతిగా వస్తున్నది. కానీ దీనికయే ఖర్చు, తర్వాత నేల లోతులాంటి మార్పులు పనికి అడ్డంకులవుతున్నాయి. అటువంటి చోట్ల జన్యుపరంగా మార్చిన మొక్కలను పెంచితే రసాయనాలు సులభంగా నేలనుంచి బయటకు వస్తాయి.రసాయనాలుగల ఆకులను జాగ్రత్తగా తగలవెట్టి బెడద తప్పించుకోవచ్చు. ఈలోగా వాటిని పశువులు మాత్రం మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది. వరిలాంటి పంటలను,నీటిలో పెరిగే తామరవంటి మొక్కలను కూడా

ఈ పద్ధతికి వాడుకుంటే రసాయన కాలుష్యాన్ని మరింత సులభంగా తొలగించవచ్చునని పరిశోధకులు అభిప్రాయం వెలిబుచ్చారు. అలాగే నేరుగా సూక్ష్మజీవులను వాడి కాలుష్యం తొలగించే పద్ధతుల గురించి కూడా పరిశోధనలు మరింతగా జరుగుతున్నాయి. మొక్కల సాయంతో లోహ రసాయనాలు నిర్మూలన గురించి ఈ మధ్యనే ఒక సదస్సు జరిగింది.

సరదా సరదా ఇంగ్లీషు

బాలల ...సరదా సరదా ఇంగ్లీషుకు స్వాగతం. ఇంగ్లీషును అంతర్జాతీయభాషగా (International Language) అనుసంధాన భాషగా (Link Language) పరిగణిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ భాషను విరివిగా ఉపయోగిస్తున్నారు.అయితే ఇంగ్లీషు ప్రపంచం అంతటా ఒకే విధంగా ఉందనుకొంటే పొరపాటే...

బ్రిటన్‌లో మాట్లాడే, అమెరికాలో మాట్లాడే ఇంగ్లీషుకు అదేవిధంగా ఆస్ట్రేలియాలో మాట్లాడే ఇంగ్లీషుకు తేడాలుంటాయి. తేడా అంటే ఉపయోగించే పదాల్లోను,స్పెల్లింగ్ లోను, పలికే విధానంలోను గమనించవచ్చు.

అమెరికా మరియు బ్రిటిష్ వారి ఇంగ్లీషుకు చాలా తేడాలున్నాయి.ఎందుకని ఆ విధంగా తేడాలు ఉన్నాయో తెలుసుకోబోయే ముందు, అవి రావటానికి గల కారణాలేమిటో తెలుసుకొందాం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటో చూద్దాం...

బ్రిటిష్ వారు మనదేశాన్ని పరిపాలించడానికి ముందే, అమెరికాను పరిపాలించారు.మనదేశస్థులవలె,అమెరికావారు కూడా బ్రిటిష్ వారిపై పోరాడి, స్వాతంత్ర్యం సంపాదించుకొన్నారు. బ్రిటిష్ వారి ఇంగ్లీషు పదాలు, ఉచ్ఛారణ అమెరికన్లకు అలవాటయ్యాయి.

అయితే చాలామందికి ఈ పద్ధతినచ్చలేదు.తమకంటూ ప్రత్యేకంగా ఇంగ్లీషును తయారుచేసుకోవాలనే ఆలోచన వచ్చింది.

సరిగ్గా అదే సమయంలో వెబ్ స్టర్ అనే న్యాయవాది, పోరాటానికి నాయకత్వం వహించి అమెరికన్ల కోసం ప్రత్యేకంగా ఒక నిఘంటువు (Dictionary),విద్యార్ధినీ విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలను, స్వతంత్రంగా ఉచ్ఛారణ (Pronunciation) ఏర్పాటు చేశాడు. ఈ విధంగా అమెరికన్లకు ప్రత్యేకమైన ఇంగ్లీషు భాష తయారయింది. అమెరికా వారి ఇంగ్లీషును "విప్లవాత్మక భాష" (Revolutionary Language) అనవచ్చేమో...!

ఇంతకు మనదేశంలో ఏ ఇంగ్లీషు ఉపయోగిస్తున్నామో చూద్దాం ... బ్రిటీష్ ఇంగ్లీషు ఎందుకంటే బ్రిటిష్ వారు అనేక సంవత్సరాల పరిపాలించారు కదా ...అందుకని వారి భాషే మనం వాడుతున్నాం.

కొంతకాలం నుంచి అమెరికన్ ఇంగ్లీషు,బ్రిటిష్ ఇంగ్లీషు స్థానాన్ని ఆక్రమిస్తోంది.ఎందుకంటే భారతీయులందరికి అమెరికా మోజు ఎక్కువైనందుకో...ఏమో?...మరి.

ఉదాహరణకు ' సెలవు ' అనే పదంకు, ఇంగ్లీషులో Holiday (హాలిడే) ఉపయోగించేవారం. అయితే ఈ మధ్య Vacation (వెకేషన్) అని ఉపయోగిస్తున్నాం. కారణం ఎందుకో అర్థమయ్యే ఉంటుంది.Vacation (వెకేషన్) అమెరికా ఇంగ్లీషు .... ఒకే అర్థానిచ్చే పదాల కొరకు, అమెరికన్లు మరియు బ్రిటిష్ వారు వేర్వేరు పదాలను ఉపయోగిస్తుంటారు. ఈ క్రింది పట్టిక చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఆటల తో చదువు
ఫోన్ నంబరుతో తమాషా

- తోటకూర సాయిరామ కృష్ణ, సామర్లకోట

ఈ నెల గమ్మత్తు గణితం లో ఫోన్ నంబర్ తో తమాషా చూద్దాం - మీ ఫోన్ నెంబరు గాని ఒక కాగితం పై వ్రాయండి. - ఆ ఫోన్ నెంబర్ లోని అంకెల మొత్తం కూడండి. - ఇప్పుడు మీ ఫోన్ నంబర్ లో ఏదో ఒక అంకెను దాచుకొని మిగతా సంఖ్యను ఒక ప్రక్క వ్రాయండి. - ఇప్పుడు రాసిన సంఖ్య నుండి రెండో స్టెప్ లో వచ్చిన అంకెల మొత్తాన్ని తీసేయండి.

ఇప్పుడు రాసిన సంఖ్య నుండి రెండో స్టెప్ లో వచ్చిన అంకెల మొత్తాన్ని తీసేయండి.

ఇప్పుడు పైనల్ గా వచ్చిన మొత్తాన్ని చెప్పండి. మీరు దాచుకొన్న అంకెలను ఇట్టే చెప్పేయ వచ్చన్న మాట. దీనిని క్రింది ఉదాహరణ ద్వారా వివరంగా చూద్దాం.

  • ఫోన్ నెం. 2327735 అనుకుందాం.
  • అంకెల మొత్తం 1 + 3 + 2+ 7 +7+ 3+ 5 = 29
  • ఫోన్ నెంబరు లో ఒక “7” ను దాచు కొందాం అనుకొందాం. మిగతా సంఖ్య 232735
  • ఇప్పుడు 232735 న నుండి రెండో స్టెప్ లోని 29 ని తీసివేస్తే ఫలిత సంఖ్య 232706 అవుతుంది. కాదూ. ఇది చెప్పిన వెంటనే దాచుకున్న అంకె 7అని ఇట్టే చెప్పేయగలమన్న మాట.

ఎలా చెప్పాలో తెలుసుకోవాలని ఉందా ? ఫలిత సంఖ్య 232706 కూదూ. దీనిలో అంకెల మొత్తం కూడండి. 2+ 3 + 2+ 0+6 = 20 మరలా 20 లో రెండు అంకెలు (2+0) కూడండి. 2 వచ్చింది కదూ. ఈ 2 ను 9 నుండి తీసేయండి. జవాబుగా వచ్చిన 7 దాచుకొన్న అంకె అవుతుంది. మీరూ ట్రై చెయ్యండి.

ఆత్మ విస్వాసమే ఆయుధంగా పరీక్షలకు సిద్ధంకండి !

- సి.హెచ్. రమేష్ (హెడ్మాస్టర్), బి.వి.పాళెం, నెల్లూరు

హలో ! మీరు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధపడుతున్నారా ? అయితే మీరు ఓ క్షణం, ఇక్కడ ఆగాల్సిందే ! ఇప్పుడు మీరు తెలుసుకొనే విషయాలే మీ విజయానికి సోపానాలు !

పరీక్షలంటే కొందరికి భయం, దడ, ఆందోళన, బెంబేలు పరీక్ష హాలులో అడుగుపెట్టగానే కాళ్ళు వణికిపోతాయి. గొంతు తడారిపోతుంది. అరచేతుల్లో చెమటలు పడతాయి. ప్రశ్నాపత్రంలోని అక్షరాలు అలికేసినట్లు కనిపిస్తాయి. చదివిందంతా మర్చిపోయిన భావన కలుగుతుంది. మెదడు మొద్దుబారినట్లు ఫీలింగ్. అంతా శూన్యంగా అనిపించి కళ్ళు తిరుగుతున్న అనుభూతి. పరీక్షలు జీవన్మరణ సమస్యగా అనిపిస్తాయి.

ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, సంవత్సరమంతా సమయాన్ని సద్వినియోగం చేసికోనందువల్ల, నిరంతర శ్రమ, కఠోర దీక్ష, సాధించాలనే పట్టుదల కొరవడినందు వల్ల, ప్రయత్నలోపం వల్ల మాత్రమే. కానీ కొంతమంది తెలివైన విద్యార్థులు కూడా మితిమీరిన ఉద్వేగం వల్ల, తామూహించినదంతా జరగదేమోనన్న ఆందోళన వల్ల పై పరిస్థితులకు గురికావడం చూస్తున్నాం.

నిజానికి పరీక్షలంటే శిక్ష కాదు. మీరు నేర్చుకున్న విషయాలను సమగ్రంగా, సంపూర్ణంగా వ్యక్తపరచడానికి ఒక అవకాశం. మీ స్థాయిని నిర్ధారణచేసే ఒక కొలబద్ద. ఉన్నత స్థితికి చేరడానికి మిమ్మల్ని మీరు నిరూపించుకొనే ఓ వేదిక.

చాలా మంది విద్యార్థులు ముఖ్యమైన ప్రశ్నలలిస్టు తయారు చేసుకొని, వాటిని మాత్రమే అభ్యసనం చేస్తుంటారు. అది ఒక్కొక్కసారి దెబ్బతీస్తుంది. ఊహించని ప్రశ్నలు పరీక్షల్లో ఎదురైతే పరిస్థితి తారుమారౌతుంది. కనుక అన్ని ప్రశ్నలకు కొంతమేరకైనా నేర్చుకోవడం అవసరం. మినిమం గ్యారంటీతో పరీక్ష హాల్లోకి అడుగుపెట్టాలి.

సంవత్సరం మొదటినుండి క్రమ పద్దతిలో, నిర్ణీత కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకొని అంకితభావంతో చదవాలి. పాఠాలు శ్రద్ధగా వినాలి ఏ రోజు పాఠాలను ఆ రోజు మననం చేసుకోవాలి. పాఠ్యాంశాన్ని సొంత మాటలలో రాసి గ్రహణ శక్తిని పెంపొందించుకోవాలి పాఠాన్ని అర్థం చేసుకుని, సొంతమాటలలో రాస్తే పాఠాశ్యం ఆధిపత్యం లభిస్తుంది. పరిశీలినా దృష్టితో చదివి, ఆత్మ విశ్వాసం ఏర్పరచుకొంటే అప్పుడు పరీక్ష హాల్లోకి మీరు ధీమాగా, ఛాలెంజింగా - ఒక ఆటగాడు క్రికేట్ బ్యాట్ పట్టుకొని, పీచ్ మీదకు వెళ్ళినట్లుగా - ఆత్మస్థైర్యంతో వెళ్ళగలరు.

పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి కొన్ని సూచనలు:

  • కష్టమైన పాఠాలను మనస్సు ప్రశాంతంగా వున్నప్పుడు చదవాలి.
  • పరీక్షలలో ప్రశ్నలు ఏ రకమైనవి అడుగుతారో ముందుగానే గత ప్రశ్నా పత్రాల ద్వారా తెలుసుకోవాలి.
  • జవాబులను సొంత మాటలలో వ్రాస్తే వేగం పెరుగుతుంది., చదవటాన్ని వాయిదా వేసేవారు పరీక్ష హాల్లోకి ధీమాగా వెళ్ళలేరు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా సద్నినియోగం చేసుకోండి.
  • తికమక పెట్టే ప్రశ్నలను రెండు మూడు సార్లు చదివి అవగాహన చేసుకోవాలి.
  • ప్రశ్నల్లో వుండే కీలక అంశాలు, అంటే - పేల్చుము తేడాలను తెలుపుము, వికదీకరించుము, చర్చించుము, పరిశీలించుము, వివరించుము, పోలికలను కనుగొనుము, సోదాహరణముగా వివరించుము, పటం సాయంతో వివరించుము. సహేతుకంగా నిరూపించుము, ఋజువు చేయుము. సారంశమును వ్రాయుము, పరీక్షించుము వంటి పదజాలాన్ని అర్థం చేసుకుని దేనికి ఎలా రాయాలో ఉపాధ్యాయుల ద్వారా ముందుగానే తెలిసికొని వుండాలి.
  • అక్షరాలు స్పష్టంగా, గుండ్రంగా, పదాల మధ్య తగు వ్యవధి (గ్యాప్) ఉంచి రాయాలి. దిద్దేవారికి అర్థంకాకపోతే ఎంత ఎక్కువ రాసినా తక్కువ మార్కులే వస్తాయి.
  • అన్ని ప్రశ్నలు చదివిన తరువాతే రాయటం మొదలుపెట్టాలి. అన్ని పాయింట్స్ కరెక్ట్ గా వ్రాయగలమనకున్న ప్రశ్నలే మొదటరాసి, ఎగ్జామినర్ కు తెలివైన విద్యార్థి పేపరు అన్న అభిప్రాయం కలిగిస్తే, తరువాత రాసే ప్రశ్నలకు కొంతమేర సమాధానం తగ్గినా, మార్కులు ఎక్కువ పొందే అవకాశం వుంది.
  • దిద్దేవారికి మంచి అభిప్రాయం కలగించడానికి, సబ్ హెడింగ్స్ పెద్ద సైజులో రాయటం, స్కెచ్ పెన్ లో అండర్ లైన్ చేయటం, పాయింట్లను నంబర్ వారీగా వ్రాయటం, పేజీకి 20 లైన్లు మించకుండా రాయడం చాలా అవసరం.
  • జవాబులో మొదట ఇంపార్టెంట్ పాయింట్లు రాయాలి. తరువాత ప్రాధాన్యత లేనివి - చివరగా రాయాలి.
  • బాగా రాయగలిగిన ప్రశ్నలతో పేజీలు నింపుకొంటూ పోతే అనవసరంగా సమయం వృధా అవుతుంది. ఒకే ప్రశ్నలకు 20 పేజీలు రాసినా 4 మార్కులకు మించి పొందలేరు కదా.... అందుకని ముఖ్యమైన 8 లేదా 10 పాయింట్స్ రాస్తే సరిపోతుంది.
  • పరీక్ష కాలాన్ని మార్కుల నిష్పత్తిలో ప్రశ్నలకు కేటాయించాలి. ఎక్కువ తెలుసుకదా.. అని చిన్న ప్రశ్నలకు ఎక్కువ రాయకూడదు. చివరి ప్రశ్నలకు సమయం చాలదు. అటువంట పరిస్థితి సంభవించినా, రాయవలసిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. చివరి వాటికి కొన్ని పాయింట్స్ అయినా రాస్తే కనీస మార్కులైనా వేస్తారు. ప్రయత్న లోపం వల్లే తక్కువ మార్కులు వస్తాయి. బాగా రాయడానికి, ఎక్కువరాయడానికి గల ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి నిముషాన్ని వినియోగించుకోవాలి. అప్పుడు అధిక మార్కులు సాధించుకోవచ్చు.
  • ప్రశ్నాపత్రంలో ప్రశ్నకున్న నంబర్లను మాత్రమే వేయాలి. సొంత నంబర్లు వేయడం చాలా ప్రమాదం. అలా చేస్తే మార్కులు వేయరు.
  • చివరి ఐదు నిముషాల్లో, చివర వ్రాసిన సమాధానాల నుండి మొదలుపెట్టి, మొదటి పేజీ వరకు, రాసిన సమాధానాలన్నింటినీ సమీక్షించుకోవాలి. వేగంగా వ్రాయడంలో దొర్లిన పొరపాట్లను సరిచేసుకోవడానికి యిది చాలా ఉపకరిస్తుంది.
  • ఆత్మవిశ్వాసం గలవారు - వేగంగా, సమర్ధవంతంగా, మయపాలనతో, సమయస్ఫూర్తితో పరీక్షను ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కనుక ఆత్మవిశ్వాసం ఆయుధంగా, ధరించి యుద్ధానికి సిద్ధంకండి.
ప్రజ్ఞ
దొంగలా చేరినపదం ఏది ?

ఆదూరి హైమావతి, బెంగుళూరు.

ఈ క్రింది పదాల్లో ఒకటి దొంగలా వచ్చి చేరింది. గుంపులో కలవని ఆ పదాన్ని పట్టుకొండి.
(1) ఈ క్రింది వారిలో వైద్యుడు కానివారు..... ( )
(ఎ) చరకుడు (బి) ధన్వంతరి (సి) మాఘుడు (డి) సుసృతుడు
(2) ఈ క్రింది వారిలో కవి కానివారు..... ( )
(ఎ) వాగ్భటుడు (బి) బాణుడు (సి) కాళిదాసు (డి) వ్యాసుడు
(3) భారతదేశాన్ని పాలించనివారు...... ( )
(ఎ) మౌర్యులు (బి) పోర్చుగీసువారు (సి) కుషాణులు (డి) గుప్తులు
(4) శాస్త్రంగా ఇంకా పూర్తిగా అంగీకరించబడనిది...... ( )
(ఎ) ఖగోళశాస్త్రం (బి) గణితశాస్త్రం (సి) నీతిశాస్త్రం (డి) జ్యోతిశాస్త్రం
(5) ఆసియా ఖండంలో లేని దేశం........ ( )
(ఎ) పాకిస్తాన్ (బి) తైవాన్ (సి) ఇరాన్ (డి) జింబాబ్వే
(6) ఖగోళ మరియు గణిత శాస్త్రజ్ఞుడు కానివాడు..... ( )
(ఎ) ఆర్యభట్ట (బి) కణాదుడు (సి) భాస్కరాచార్యులు (డి) వరాహ మిహిరుడు
(7) దండ యాత్రల ద్వారా రానివారు అంటే భారతదేశాన్నే స్వదేశం గాగలవారు.... ( )
(ఎ) ఆర్యలు (బి) గ్రీకులు (సి) మొగలాయులు (డి) రాజపుత్రులు
(8) లాల్, బాల్,పాల్ లలో లేనివారు......... ( )
(ఎ) బిపిన్ చంద్రపాల్ (బి) మోతీలాల్ (సి) బాలగంగాధర్ (డి) లాలాలజపతిరాయ్
(9) అతి తక్కువ కాలం ప్రధానిగా వున్న వ్యక్తి...... ( )
(ఎ) జవహర్ లాల్ నెహ్రూ (బి) ఇందిరా గాంధీ (సి)లాల్ బహదూర్ శాస్త్రి (డి)
దేవెగౌడ
(10) ఆర్థిక శాఖా మంత్రిగా పనిచేయని వారు...... ( )
(ఎ) చిదంబరం (బి) యశ్వంత్ సిన్హా (సి) మురార్జీ దేశాయ్ (డి) అమర్త్యాసేన్
జవాబులు:
సి (10) డి (9) డి (8) డి (7) బి ( 6) డి (5) డి (4) బి ( 3)ఎ (2) సి(1)

అగ్ని పర్వతం బద్దలైనప్పుడు

ఒక అగ్ని పర్వతం బద్దలై దాని నుంచి లావా ఎగజిమ్మినప్పుడు ...... ఆ పర్వతం నుంచి వచ్చే పదార్థాలు (దుమ్ము, ధూళి, బూడిద, రాళ్లు, రాళ్ళపొడి మున్నగునవి...) ఆకాశంలో 50 కి.మీ. ఎత్తుదాకా చేరుకోగలవు. పెద్దపెద్ద అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే వాయువులు ఆకాశంలో కొన్ని వేల చదరపు కిలోమీటర్ల దాకా పరుచుకోగలవు. ఇలాంటి వాయివులు ఒక దట్టమైన పొరలాగా వాతావరణంలో నిలిచివున్నప్పుడు ( ఈ దశ కొన్ని రోజులు, వారాలేగాక, కొన్ని నెలలూ, సంవత్సరాలూ కూడా వుండవచ్చు) భూమికి చేరాల్సిన సూర్యరశ్మి అడ్డుగించబడి. భూవాతావరణం అనూహ్యంగా చల్లబడిపోయిన సందర్భాలు మన భూగోళ చరిత్రలో అనేకం ఉన్నాయి.

వింతలు- విశేషాలు

ప్రజ్ఞాశాలి

- డా. ఎస్.బుద్ధుడు
మేధావి పలుకులు

ఈ మధ్య కాలంలో చార్లెస్ డార్విన్ చేసిన పరిశోధనలపై రాబర్ట్ మాథ్యూస్ కొత్త అభిప్రాయమును వ్యక్తపరచినారు. చార్లెస్ డార్విన్ జరిపిన జీవపరిణామ సిద్దాంతములపై గత 150 సంవత్సరముల నుండి అనేక పరిశోధనలు జరిగినను ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలినది.

Nature అనే పత్రిక జీవపరిణామము విషయంలో Luca యొక్క అభిప్రాయమును ఖండించినారు. దీనికి బిన్నంగా డార్విన్ యొక్క జీవ పరిణామ సిద్దాంతం ప్రకారం జీవులు క్రమంగా ఏ విధంగా ఉద్భవించినాయో తెల్పినారు. “Origin lf Species” ద్వారా ఈ విషయం బలపడుతుంది. అదే విధంగా “The Descant of man”1871 లో వ్రాసిన దాని ప్రకారం మానవుని పరిణామాలు వివరముగా పేజి 182 లో వివరించినారు. అందులో ఆఫ్రికాలో అయిన (ప్రస్తుతం శిలాజ రూపంలో ఉన్న) కు గోరిల్లా, జాతులలో మానవునికి చాలా దగ్గర సంబంధం కలదని చెప్పినారు.

ఈ మధ్య కాలంలో జరిగిన DNA ప్రయోగాలు నవీన మానవునికి ఇప్పటి ఆఫ్రికన్స్ లో చాలా వైవిద్యం చూపుతున్నాయి. దీనిని బట్టి ఆఫ్రికన్స్ హోమోసాపియన్స్ కు ద్వారా ప్రతినిధులుగా చెప్పవచ్చును.

శిలాజ నిదర్శనముల ప్రకారం ఆఫ్రికాలో వెలువడిన త్రవ్వకాలు డార్విన్ సిద్దాంతమును బలపరుస్తున్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం డార్విన్ “Out of Africa” అభిప్రాయమునకు భిన్నంగా కలదు.

“The Descant pf man”లో డార్విన్ తన అభిప్రాయమును సరిగా వ్యక్తీకరించ లేక పోయినాడని, యూరప్ లో దొరికిన నియాండర్ థావ్స్ శిలాజాల ఆధారంగా Moore మరియు Desmond వ్యక్తపర్చినారు.

న్యూటన్ కనుగొన్న సిద్దాంతమును ఐన్ స్టీన్ బలపర్చినట్లు డార్విన్ సిద్దాంతం మహోన్నతమైనదిగా మరియు తమ అభిప్రాయమును వ్యక్తపర్చినారు.

చక్రం – ఆవిష్కరణ

- M.V.S.S.H.ప్రసాదు Msc., B.Ed S.S.(PS), Z.P.H.S. కొత్తపట్నం - 523 286, ప్రకాశం జిల్లా.

భూమి మీద నడిచే, గాలిలో ఎగిరే వాహనాలన్నీటికి సాధారణంగా ఏమి కలిగి వుంటాయి ? వెంటనే మనకు చక్రం అని గుర్తుకు వస్తుంది.

కొన్ని వాహనాలకు చక్రాలు చిన్నవిగాను, కొన్నింటికి పెద్దవిగాను ఉంటాయి. కొన్ని వాహనాలకు రెండు చక్రాలు వుంటే కొన్నింటికి మూడు చక్రాలు వుంటాయి. మరికొన్ని వాహనాలకు అనేక చక్రాలు వుంటాయి.

అయితే ఈ చక్రం ఎలా పుట్టిందో, ఈచక్రం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనకు ఆశ్చర్యం కల్గుతుంది. మరి తెలుసుకుందామా !

చాలా కాలం వరకూ మానవునికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. కేవలం నడకనే ఎంత దూరమైనా వెళ్ళాల్సివచ్చేది.

తర్వాత బరువైన వస్తువులను ఎత్తు ప్రదేశాలనుండి దొర్లించడం మొదలు పెట్టాడు. అయినా ఈ పద్ధతి దూరప్రదేశాలకు తీసుకొని వెళ్లడానికి వీలుకాలేదు.

మానవుడు తన సామాన్లను తానే మోసుకొని వెళ్ళేవాడు లేదా కొన్ని జంతువులపై పెట్టుకొని వెళ్ళేవాడు. ఐతే ఎక్కువ బరువైన వస్తువులను జంతువులపై పెట్టుకొని వెళ్ళడానికి వీలుకాలేకపోయింది.

మానవుడు మందమైన, గుండ్రంగా ఉండే చెట్ల కాండాలను కొద్దిపాటి బలంతో దొర్లించవచ్చని తెలుసుకున్నాడు.

 

చెట్లయొక్క కాండాలను చిన్న ముక్కలుగా చేసి దొర్లించడానికి ప్రయత్నించాడు. అవి సులభంగా దొర్లడం గమనించాడు.

రెండు గుండ్రని చెట్లకాండపు ముక్కలను ఒక పొడవాటి కర్రతో కలిపి ఒక బండిగా తయారు చేశాడు.

రెండు వేర్వేరు పరిమాణాలున్న చెట్ల కాండ ముక్కలను కలిపి దొర్లించడం మొదలు పెట్టాడు. ఐతే ఈ బండి ఎగుడుదిగుడు ప్రదేశాలపై వెళ్లడం కష్టమని భావించి ఆలోచించి ఒక సాధనను కనుగొన్నాడు.

ఒకసారి ఒకే పరిమాణం వున్న రెండు చక్రాలను ఉపయోగించి చూశాడు. అతి సులభంగా దొర్లడం గమనించాడు.

ఉల్కల కులుకులు

సి. హెచ్. ఆనంద్ రామ్ సింగ్
ఆకాశం నిర్మలంగా ఉన్న రాత్రి మినుకు మినుకు మంటూ వేలాది చుక్కలు మనకు దర్శనమిస్తాయి. కొన్ని సార్లు ఈ చుక్కలు నేలమీదికి రాలుతున్నట్లు కనిపిస్తాయి. అవి జారిపడేటప్పుడు ఒక వెలుతురు చారను వెనక్కు వదులుతున్నట్లు కనిపిస్తుంది. ఇలా వెలుగులు విరజిమ్ముతూ ఆకాశం నుండి రాలేవి నక్షత్రాలు కాదు ఉల్కలు. ఉల్కలు పగలూ, రాత్రీ రాలుతుంటాయి. కాని రాత్రిపూట మాత్రమే మనకు కనిపిస్తాయి.
ఉల్క రాలుతుంటే మనం మనసులో ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అనే మూఢ నమ్మకం కూడా ఉంది. ఇలా ఏదైనా కోరుకున్నది జరిగితే అది కాకతాలీయమే. మనుకోర్కెలకు ఉల్కలకు ఏ సంబంధం లేదు.

మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏమిటో తెలుసా... సూర్యుడు. భూమిసైజులో పోల్చుకుంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు . ఇక సిరియస్ లాంటి పెద్ద నక్షత్రాలు సూర్యుడి కంటే లక్షరెట్లు పెద్దవి. అంతపెద్ద నక్షత్రాలు భూమిమీద రాలిపడటం ఎలా సాధ్యం ? చుక్కలు తెగి రాలినట్లు మనకు కనిపించేవి ఉల్కలు ?

ఉల్కలు ఎక్కడి నుండి వస్తున్నాయి ? ఇవి ఎందుకు భూమిమీదకు వస్తున్నాయి ? వచ్చే ఉల్కలు ఉన్నట్లుండి దారిలోనే ఎందుకు మాయమవుతాయి ? వీటి కథేమిటో చూద్దాం.

ఉల్కలు ప్రధానంగా తోకచుక్క నుండి వస్తుంటాయి. తోకచుక్క సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీదాని తలలోని ఘనపదార్థం కరిగి ఆవిరిగా మారి ఉల్కలు బయటపడతాయి. ఇలా బయట పడ్డ ఉల్కలు బయట పడతాయి. ఇలా బయట పడ్డ ఉల్కలు తోకచుక్క కక్ష్యలోవే ప్రయాణిస్తుంటాయి. కాని అప్పుడప్పుడు వాటి కక్ష్య నుండి విడిపోయి గ్రహాల ఆకర్షణకు లోనవుతూ గ్రహాల ఉపరితలం వైపు ప్రయాణిస్తాయి. కొన్ని ఉల్కలు గ్రహశకలాల నుండి వస్తుంటాయి. ఇవికూడా గ్రహాల మీదకు రాలుతుంటాయి.

ఈ ఉల్కలు చిన్నచిన్న ఇసుక రేణువుల సైజునుండి పెద్ద పెద్ద బండల సైజు వరకు వుంటాయి. భూమి వాతావరణంలోకి ప్రవేశించినపుడు ఘర్షణకు లేనై మండి బూడిదై పోతాయి. ఇలా మండుతూ భూమివైపు ప్రయాణించే ఉల్కలు మనకు రాత్రి పూట కనిపిస్తుంటాయి. పగలు కూడా ఇవి మండుతాయి కాని సూర్యుని వెలుతురులో కనిపించవు.

ఒకరోజు సుమారు 10 కోట్ల ఉల్కలు భూమిమీదకు వస్తుంటాయి. వీటిలో చాలావరకు భూమికి చేరేలోపే భస్మమైపోతాయి. చాలా అరుదుగా కొన్ని ఉల్కలు భూమిని చేరుతాయి. ఏడాదికి సుమారుగా రెండువేల ఉల్కలు నేలను తాకుతాయి. ఈ 20 లక్షల టన్నులు పెరుగుతోంది.

ఉల్కలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి రాతి ఉల్క రెండవ రకం లోహపు ఉల్క. రాతి ఉల్కలు అగ్ని పర్వతపు శిలలను పోలి ఉంటాయి. వాటిలో కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, సోడియం లాంటి మూలకాలుంటాయి. ఇక లోహపు ఉల్కల్లో ఇనుము, నికెల్ మొదలైన లోహాలుంటాయి. కొన్ని ఉల్కల్లో లోహం, రాతి పదార్థం కలిసి వుంటుంది. ఒక్కోసారి పెద్దపెద్ద ఉల్కలు వాతావరణంలో భస్మం కాకుండా నేలపై పడతాయని చెప్పుకుంటున్నాం కదా.... ఇవన్నీ తోకచుక్క నుంచి కాకుండా గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) నుండి వచ్చినవి. నేలపై పడిన రాచి ఉల్కల్లో అతి పెద్దది 1948 ఫిబ్రవరి 18 వతేదీ అమెరికాలోని పర్నాస్ కౌంటీలో పడింది. దీని బరువు 1 టన్ను. అలాగే అతి పెద్ద లోహపు ఉల్క దక్షిణాఫ్రికాలోని గ్రూటీ ప్రాంటీన్ లో పడింది. దీని బరువు 50 టన్నులు.
ఇలాంటి పెద్ద ఉల్కలు భూమిని తాకినప్పుడు వాటి వేడికి భూమి ఆవిరై పెద్ద కందకం ఏర్పడుతుంది. ఆ కందకాన్ని క్రేటర్ అంటారు. ఇలా ఉల్క తాకిడి వల్ల ఏర్పడిన పెద్ద కందకం అరిజోనా లోని బ్యారింగల్ క్రేటర్. దీని వ్యాసం 4200 అడుగులు, లోతు 570 అడుగులు. అక్కత 8000 వేల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఉల్కపడి ఇండవచ్చని శాస్త్రజ్ఞులు అంచనా. దీనిని అమెరికాలో ఒక పర్యాటక స్థలంగా మార్చివిదేసీ యాత్రికులు ఆకర్షిస్తున్నారు.

ఆగష్టు 12 వ చేదీన స్విప్ట్ - టటిల్ తోకచుక్క నుండి వచ్చిన ఉల్లలగుండా భూమి ప్రయాణం సాగింది. అప్పుడు జోర్డాన్ రాజధాని అమ్మాన్ సమీపంలో ఆకాశంలో దీపావళి పండుగ జరిగిందా ? అన్నట్లు వేలాది ఉల్కలు ఒక్కసారిగా కనిపించాయి. ఇలా ప్రతి ఏటా 14 సార్లు ఉల్కల కక్ష్యలోకి భూమి ప్రవేశిస్తూ ఉంటుంది. ఉల్కాపాతం జరుగుతూ ఉంటుంది.

నిద్రలో నిజాలు

ప్రతిజీవికి తన దైనందిన కార్యక్రమాలలో నిద్రకూడా ఒక ముఖ్యమైన అంశం మనుషులు రాత్రపూట నిద్రపోతారు. కొన్ని జంతువులు, నక్కలు, గబ్బిళాలు, గుడ్లగూబలు, పందికొక్కుల్లాంటి పగలు నిద్రపోతాయి. కొన్ని జంతువులు నిలబడే నిగ్రపోతాయి. ప్రతిజీవీ ఎంతో కొంతసేపు నిద్రపోతుంది. ఐతే ఇప్పటిదాకా ఎన్ని పరిశోధనలు చేసిన నిద్రకు కారణమేమిటో కనుక్కోలేక పోయారు.,

పగలంతా అలసి పోయి పనిచేసి అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరుతుంది. నిద్ర ద్వారా విశ్రాంతిని పొందుతారనే అబుప్రాయం ఎక్కువ మంది చెబుతున్నారు.

ఇక పిల్లల విషయానికొస్తే, తల్లిదండ్రులు తమ పిల్లన్ని తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేపి చదివిస్తే మంచిదనుకుంటారు. చదివింది బాగా అర్థమవుతుందనుకుంటారు. అందుకనే పిల్లల్ని ఉదయాన్నే లేపేస్తారు. పిల్లలేమో పుస్తకాలు ముందేసుకుని తూగుతుంటారు. నిజానికి తల్లిదండ్రులు, తమ పిల్లల్ని ఉదయాన్నే లేపితే చదువగలుగుతున్నారా ? లేదా ? అనేది గమనించాలి. కొంతమంది పిల్లలు ఉదయం 4 గంటల నుంచి బాగా హుషారుగా తమ పనులు చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు ఉదయాన్నేమత్తుగా, బేజారుగా ఉంటారు ఇలాంటి పిల్లలు రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొంటారు.

పడుకొమనే దాకా హుషారుగా ఉంటారు ఉదయం పూట హుషారుగా ఉండేవారు రాత్రి 8 గంటల నుంచి ఆవలిస్తూ అలసి పోయినట్లు కనిపిస్తారు.

కాబట్టి ప్రతి వారికీ తమ శరీర ధర్మాన్ని బట్టి నిద్ర రావడం జరుగుతుంది. రాత్రి ఎక్కువ సేపు మేల్కొనే వాళ్ళు ఉదయం తొందరగా లేవలేరు. ఉదయం తొందరగా లేసేవాళ్లు రాత్రిపూట మేల్కొనలేరు. పిల్లల బాడీ క్లాక్ ను గమనించి దాని ప్రకారం కార్యక్రమాల టైంటేబుల్ తయారు చేసినట్లైతే అందరు పిల్లలు బాగా చదివే అవకాశం ఉంటుంది. అలాకాకుండా పిల్లల్ని నువ్వు మొద్దుని పొద్దున్నే లేవట్లేదు అనితిట్టడం వల్ల ప్రయోజనం లేదు.

పసి పిల్లలు రోజుకు 18 గంటలు నిద్రపోతారు. సంవత్సరం దాటిన పిల్లలు 13 గంటలు నిద్రిస్తారు. 3సం.. వయసొచ్చేసరికి రోజుకు 10 గంటలు నిద్రిస్తారు. ఆ తరువాత మనిషి 8 గంటల నుండి 11 గంటలు నిద్రపోతాడు. మనుషుల్లో 18 సం||నుండి 50సం,, వయస్సు వరకు రోజుకు 6 గంటలు నుండి 8 గంటలు నిద్ర సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ మధ్య ప్రతి ఇంట్లో రాత్రి 12 గంటలదాకా లైట్లు వెలుగుతూనే ఉంటున్నాయి. కారణం బొమ్మలపెట్టె. అదీ టీవీ. 11 గంటల దాకా మేల్కొన్న పిల్లలు తెల్లవారుజామున నిద్రలేవడం కష్టమవుతుంది. పిల్లలు చదవాల్సిన టైంలో పెద్దవాళ్లు కూడా టీవీ చూడటం మానుకోవాలి. అంతేగానీ మేం టీవీ చూస్తాం మీరు చదువుకోండి.. అని చెప్పడం కరెక్టుకాదు.

వయసు మళ్లిన వారికి (50సం,, పైబడిన వారికిః తక్కువ కాలమే నిద్రపడుతుంది. వీళ్లకు ఉదయం 4 గంటల కే మెలుకువ వచ్చేస్తుంది. వాళ్లు తొందరగా లేచారు కాబట్టి మిగతావాళ్లు సోమరిపొతులు అనుకొంటుంటారు. నిజానికి చిన్నతనంలో వీళ్లు కూడా ఉదయం 7 గంటల దాకా నిద్రపోయిన వాళ్లే.

కాబట్టి నిద్ర అనే లక్షణం శరీరతత్వాన్ని బట్టి ఉంటుందని చదువుపట్ల సరైన అవాగాహన పెంచితే, అందరు పిల్లలూ బాగాచదవగలరని మనం తెలుసుకోవాలి.

మన రుతుపవనాల గురించి

ప్రొ,, ఎస్. బుద్దుడు.
యస్.వి.యూనివర్సిటీ తిరుపతి.

ప్రపంచ దేశాలు భారతదేశాన్ని రుతుపవనాల భూమి (మాన్సూన్ ల్యాండ్) అని పిలుస్తారు. ప్రతి సంవత్స,రం నిర్దిష్టకాలంలో మనకు వర్షాలు కపడటం, సీజనల్ గా వాతావరణంలోని భిన్నత్వాలవల్ల ఈ పేరు వచ్చింది. రుతుపవనాలు జూన్ / జూలై నెలల్లో వర్షాలకు కారణమై పంటలకు ఎంతగానో తోడ్పడుతున్నాయి.

ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూమహా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం ఉండటం భౌగోళికంగా మన దేశ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే మన రుతువులకు కారణం.

మన దేశంలో ఉష్టోగ్రత చలికాలంలో 20 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్, వేసవిలో 35 నుండి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుదన్న విషయం తెల్సిందే. భూమిపైన మారినట్టు, సముద్రపు నీటి ఉష్టోగ్రత కూడా మన దేశ ఉష్టోగ్రతతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది.

మండువేసవి అయిన మే చివరి వారంలో మనదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్టోగ్రత 40 నుండి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఇటువంటి సమయంలో నిలకడైన వరకు ఉంటుంది. ఇటువంటి సమయంలో నీటి ఉపరితలం నుండి చల్లటి, తడిగాలులు సంవాహన ప్రవాహం ప్రక్రియ ద్వారా కేరళ రాష్ట్రం చేరి, అక్కడ నుండి నెమ్మదిగా మహారాష్ట్ర గుండా హిమాలయాల వరకు పయనిస్తాయి. సముద్ర గాలుల పై భూమి వేడి ప్రభావం పడటం వర్షాలు పడతాయి. ఈ వర్షాలనే నైరుతి రుతుపవనాలు అంటారు.

ఈ విధంగా పడమర వైపు నుంచి రుతుపవనాలు దేశంలోకి వచ్చిన వెంటనే తూర్పు వైపు బంగాళా ఖాతం నుంచి మన దేశంలో రుతుపవనాలు ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తాయి. దీని వల్ల జూలై నెలలో మనకు వర్షాలు కురుస్తాయి. వీటిని ఈశాన్య రుతుపవనాలు ఉంటారు.

డిసెంబర్ మాసంలో చలికాలం వచ్చేటప్పటికి బాగా చల్లబడ్డ భూమివైపు నుంచి రుతుపవనాలు ప్రభావం తగ్గిపోతుంది. దీన్నే రుతుపవనాలు తగ్గుముఖం లేదా వెనక్కు తిరిగే ప్రక్రియగా (రిట్రీట్) మాన్ సూన్) పేర్గొంటారు. రుతుపవనాలను ముందుగా తెలుసుకోవడానికి వాతావరణ హెచ్చరిక విభాగం (వెదర్ ఫోర్ క్యాస్టింగ్ డిపార్ట్ మెంట్), జాతీయ దూరపు పరిస్థితి విశ్లేషణ సంస్థ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ)

అహర్నిశలు పనిచేస్తున్నాయి. ఈ విభాగాలలోని శాస్త్రవేత్తలు, సూపర్ కంప్యూటర్ల సాయంతో వాతావరణాన్ని ముందుగానే పసిగట్టి మనకు హెచ్చరికలు, సూచనలు ఇస్తుంటారు.

జంతువుల్లో వింతలు

- అమ్మిన శ్రీనివాసరాజు

“ఎగరలేని పక్షి పేరేంటి ? అంటే ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) అని ఠక్కున సమాధానం చెబుతాము. కాని మొరగలేని కుక్క గురించి చెప్పమంటే మొహం తేలేస్తాం. మనం ఎప్పుడూ వినే ------- జంతువుల విషయాల గురించి పరిశీలనగా తెలుసుకుంటే చాలా చాలా నిజాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి విషయాలు మచ్చుకు కొన్ని చూద్దాం.

ఒంటె జాతికి “లామా” అనే జంతువు శత్రువు పైకి ఉమ్మడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది. ప్రమాదం ఎదురైనా, కోపం వచ్చినా “లామా” నోటిలో దుర్గంధపూరితమైన లాలాజలం ఊరుతుంది. దానిని లామా శత్రువు పైకి ఉమ్ముతుంది. ఆ వాసన భరించలేక శత్రువు దూరంగా వెళ్ళిపోతుంది.

ఈ భూమి మీద నంబరు వన్ వెయిట్ లిప్టర్ ఎవరో తెలుసా ? చీమ. ఇది తన బరువుకు దాదాపు యాభై రెట్ల బరువును ప్రధానంగా నోటి కండరాల సాయంతో పైకి లేపగలుగుతుంది. మనిషికే గాని ఇంత శక్తి ఉంటే 80 కిలోల బరువున్న మనిషి దాదాపు నాలుగు టన్నుల బరువున్న వస్తువులను కేవలం పళ్ళతో కదిలించగలడన్నమాట....

జీబ్రాలన్నీ చూడటానికి..........ఒకే విధమైన చారలతో ఉన్నట్లు కన్పిస్తాయి. కాని ఏ రెండు జీబ్రాల మీద చారలు ఒకే రకంగా వుండవు. మొరిగే కుక్కలు కరవవని సామెత. కానీ కుక్కల్లో అసలు మొగరడమే చేతకాని జాతి ఒకటుంది. అదే “బసెన్జీ” జంతువు దానికి ఒక్క మొరగడం తప్ప కుక్కలు చేసే ఇతర శబ్దాలు, పన్నులన్నింటినీ చేయగలదు.

మనిషికి ఆహారంగా ఉపయోగపడే చేప ఆ మనిషినే స్వాహా చేయగలదంటే ఆశ్చర్యం అనిపించినా అది అక్షరసత్యం మాంసాహారి, అత్యంత ప్రమాదకారీ అయిన “పిరానా” అనే చేప తన నోటికి చిక్కిన మనిషిని కొన్ని నిముషాల్లోనే అస్తి పంజరంగా మార్చి వేయగలుగుతుంది. ఈ భూప్రపంచం మీద అతి ఎక్కువకాలం జీవించే జీవి “సముద్రపు తాబేలు” దీని ఆయుర్దాయం రెండు వేల సంవత్సరాల పైమాటే తిమింగలం రోజుకు దాదాపు మూడు టన్నుల ఆహారం తీసుకొంటుంది. అలాగే ఆరు నెలలపాటు ఆహారం లేక పోయినా జీవించగలదు కూడా

ఈ భూమి మీద నంబరు వన్ వెయిట్ లిప్టర్ ఎవరో తెలుసా ? చీమ. ఇది తన బరువుకు దాదాపు యాభై రెట్ల బరువును ప్రధానంగా నోటి కండరాల సాయంతో పైకి లేపగలుగుతుంది. మనిషికే గాని ఇంత శక్తి ఉంటే 80 కిలోల బరువున్న మనిషి దాదాపు నాలుగు టన్నుల బరువున్న వస్తువులను కేవలం పళ్ళతో కదిలించగలడన్నమాట....

జిరాఫీ మెడ మాత్రమే కాదు. నాలుక కూడా పొడవే. జిరాఫీ నాలుక ఎంత పెద్దదంటే నాలుకతో అది తన చెవులను ఎంచక్కా శుభ్రం చేసుకోగలదు. మనుషుల్లో వున్నట్లు రకరకాల అలవాట్లు పనులు, ఈ జంతువులకూ తక్కువేంకాదు....... ఇలా చెప్పుకుపోతే .... చాలా వున్నాయ్ .... మరోసారి మరికొన్ని చెప్పుకొందాం.

ప్రపంచంలోనే పెద్ద జింకః-
అలాస్కస్ మూస్ అనేది జింక జాతుల్లో చాలా పెద్దది.

ఇది పూర్వార్థ పశ్చిమార్థ గోళాల్లో శీతల ప్రాంతాల్లో నివసిస్తుంది. ఎదిగిన జింక 2.3 మీటర్ల ఎత్తు 700 కి.గ్రాముల జరువుంటుంది. పొడవైన కాళ్ళ వెడల్పైన మూపురం 1.8 మీటర్ల పొడవుగల కొమ్ములు దీని ప్రత్యేకతలు. సాధారణంగా ప్రశాతంగా ఉండే ఇది, ఆడ జంతువు కోసం పోటీ పడేటప్పుడు పెద్ద రంకెలు వేస్తుంది.

ప్రపంచంలోనే చిన్న ఎలుగుబంటిః- దీని పేరు మలయన్ ఎలుగుబంటి. దీన్ని సన్ బేర్ అని కూడా పిలుస్తారు. దీని చాతీపై గల పసుపు తెలుపు మచ్చలు, ఉదయించే సూర్యునికి సంకేతంగా ప్రజలు భావిస్తారు. మలయన్ ఎలుగుబంటి 1.2 మీటర్ల పొడవు, 40 కి.గ్రా. బరువు మాత్రమే ఉంటుంది.

నల్లని బొచ్చుగలిగి బూడిదరంగు లేదా ఆరెంజ్ రంగు ముక్కును కలిగి ఉంటుంది. కాలిగేళ్ళ కొడవలి ఆకారంలో చాలా పదునుతో ఉంటాయి. ఇది చెట్లు పై బొమ్మలను వంచి పడకను ఏర్పాటు చేసుకుంటుంది. పగలంతా నిద్రించి రాత్రి పూట మాత్రమే వేటకు బయల్దేరుతుంది.

మొక్కలూ రాళ్ళూ
మొక్కలూ రాళ్ళూ మీరు చూస్తున్న చిత్రంలో కొన్ని మొక్కలు, కొన్ని రాళ్ళూ ఉన్నాయి.

ఏవి మొక్కలో ఏవి రాళ్లో మీరు చెప్పగలరా. సజీవ రాళ్ళు సౌత్ ఆఫ్రికాలో జీవించే మరుగుజ్జు మొక్కలు, రాతి నేలలపై మెలిచే ఈ మొక్కలు రంగులోను, ఆకారంలోను రాళ్ళను పోలి వుంటాయి. మొక్కలు ఎందుకిలా రాళ్ళ లాగా వేషం మార్చుకొన్నాయో మీకు తెలుసా.... ఎడారిలో మొక్కలను తినే జంతువులు బారి నుండి ఆత్మరక్షణ కోసం. ఈ సజీవ రాళ్ళు పుష్పించినపుడు మాత్రం వాటి అసలు రూపం బయటపడుతుంది. కాని అడవిలోని మొక్కలన్నీ అదే సమయంలో పుష్పించడం వల్ల ఇవి కనిపించవు. జంతువులకు సమృద్ధిగా ఆహారం దొరకడం వల్ల వీటి జోలికి రావు.

పాముల గూర్చి అపోహలొద్దు

డా|| యం. రాములు
Lecturer in Zoology

దాదాపు 135 మిలియన్ సంవత్సరాలకు పూర్వం బల్లుల నుండి పాములు ఉద్భవించినాయని అంటారు. ప్రపంచంలో 2,750 జాతుల పాములున్నాయి. ఇండియాలో 244 జాతులున్నాయి. వీటిల్లో ముఖ్యంగా 8 లేదా 9 జాతులు మాత్రమే విషసహితమైనవి, మిగతావన్నీ విషరహితాలే.

పాములు న్యూజీలాండ్, ఐర్లాండ్ లలో లేవు. విషరహిత సర్పాలు ఉష్ణమండల ప్రాంతాలలో ఉన్నాయి. WHO లెక్కల ప్రకారం, ప్రపంచంలో పాముకాటుకు 40,000 మంది చనిపోతే, మన దేశంలో కేవలం 20,000 మంది చనిపోతున్నారు.వీరు పాముకాటు విషానికి కాకుండా, పాము కరచిందనే భయంతో మానసిక ఆందోళనతో చనిపోతున్నారు. కాబట్టి పాముల గూర్తి అవగాహన ఉన్నట్లైతే ఆందోళనను దూరం చేయవచ్చును.

పాములు పాలు తాగుతాయని, పగబడతాయనేది అపోహ మాత్రమే. పాము పాలు తాగినట్రైతే పాలు శ్వాసవ్యవస్థను చేరినచో పాము చనిపోతుంది. ే పాములు పగబడతాయనడానికి, ఒకే ప్రదేశంలో పామును చంపినచో, ఆ పామప పాయు గ్రంథుల నుండి సెంట్ పదార్థంను విడుదల చేస్తుంది. దానిని మన వాళ్ళు పగబడతాయంటారు.

పాములలో చనలం ప్రక్కటెముకల ద్వారా జరుగుతుంది. పాములకు కంటి రెప్పలుండవు, కంటిని కప్పుతూ పారదర్శకమైన క్యూటికల్ పొర కొండచిలువలలో కాళ్ళు అవశేషావయవాలుగా మారినాయి.

పాములలో ఉండే రెండుగా చీలిన నాలుక, గాలిలో ఉండే సెంట్ పార్టి కల్స్ ను నోట్లో ఉండే జాకబ్ సన్ అంగంలోకి పంపుట వలన రుచి, వాసను తెలుసుకో గల్గుతాయి.

పాములు నోటిని ఎంతైనా విప్పటానికి కారణం తలలోని ఎముకలు వదులుగా అతికివుంటాయి.

పాములలో వెలుపని, మధ్య చెవిలేదు. కావున వినడానికి ఉపయోగపడవు. క్రింది దవడ భుమిపైన కల్గే శబ్దాలను గ్రహించి లోపలి చెవికి పంపుతాయి.

పాములలో మాంసాహారులే, Indian Egg Eating Snake, King, Kobra పాముల గుడ్లను తింటాయి.
పాముకాటుకు మంత్రాలు, తంత్రాలు పనిచేయవు. మనిషి మరణం పాము విడుదల చేసిన విషం డోసేజ్ పై ఆధారపడి ఉంటుంది. ఆ రోజు పాము ఏ ప్రాణిని కాటువేయకుండా మొదటిసారిగా మనిషినే కాటు వేస్తే విషం పరిమాణం ఎక్కువ మొత్తంలో శరీరాన్ని చేరడంవల్ల మరణం ఖాయం. పాముల గూర్తి చెప్పే శాస్త్రాన్ని “Ophilogy Serpentalogy” అంటారు.

రాబందుల రెక్కల చప్పుడు ఆగిపోనుందా ?

మీరెపేపడైనా రాబందులను చూశారా ? పెద్ద రెక్కలు పొడవైన పట్టకారు లాంటి ముక్కు వాడి గోళ్ళతో చూడ్డానికే భయం వేస్తుంటాయి. పేదరాశి పెద్దమ్మ కథల్లో రాజకుమారుడు ఎక్కివెళ్ళే గండ భేరుండ పక్షుల్ని మనం చూడకపోయినా ఇలాగే ఉండేవేమో అనిపిస్తుంది. ఇవి చనిపోయిన జంతు కళేబరాల మాంసాన్ని నిముషాల్లో చీల్చుకు తిని ఎముకల్ని మాత్రం మిగిలిస్తాయి. గొడ్డు మాంసాన్ని తింటాయి. కాబట్టి వీటిని గొడ్డు బారువులు అనిపిలవడం పరిపాటి. ఇవి గొడ్లనేకాదు మనుషుల కళేబరాల్ని కూడా వదిలి పెట్టవండోయ్ పార్శీ మతస్తులు కళేబరాల్ని కూడా వదిలి పెట్టవండోయ్. పార్శీ మతస్థులు చనిపోయిన వారి మృతదేహాల్ని ఖననం గానీ దహనం చేయరు. ఓ ఎత్తైన కొండపై మృత దేహాన్నుంచి దూరంగా వెళ్ళి పరిశీలిస్తుంటారు. రాబందులు వాలి ఆకళేబరాలను తింటే చనిపోయిన వారికి మోక్షం ప్రాప్తించిందని సంతోషిస్తారు.

రాబందులను పర్యావరణ బందువులుగా మనం చెప్పకోవచ్చు. మృత కళేబరాలు కుళ్ళి దుర్వాసన హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ ల వృద్ధి, నీటికాలుష్యం, అంటువ్యాధుల వ్యాప్తిలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా రాబందులు రక్షిస్తున్నాయి. ఇంతమేలు చేస్తోన్న రాబందులు అంతరించిపోతున్న అనేక పక్షిజాతుల్లో ముందున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

బ్రిటన్ లో రాయల్ సొసైటీ బర్డ్ ప్రొటెక్షన్ లో రాబందుల రక్షణ కార్యక్రమం మేనేజర్ గా ఉన్న క్రిస్ బౌడెన్ ఇటీవల మన దేశానికి వచ్చారు.

ఆయన చెప్పిన ప్రకారం భారత్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో పశువుల మృత కళేబరాలను ఆరుబయట పడేస్తుంటారు. వైట్ బ్యాక్, లాంగ్ బిల్డ్ స్లెండర్ బిల్డ్ అనే మూడు భారతదేశ జాతుల రాబందులు వీటిని ఆహారంగా తీసుకొంటాయి. పశువులు బ్రతికున్న రోజుల్లో నొప్పి నివారిణిగా, వాటికిచ్చే డైక్లో ఫినాక్ అనే సూది మందు కాలక్రమంలో అవి మరమించిన తర్వాత కూడా వాటి శరీరాల్లో ఉండిపోతుంది. ఆ మృత కళేబరాలను తిన్న రాబందులు నేల రాలుతున్నాయి. జంతువుల నొప్పి తగ్గడానికి వరంలా ఉపయోగపడ్డ మందు, అవి చనిపోయాక రాబందుల పాలిట శాపంగా మారుతోంది. రాబందులు ఒకటి రెండు కంటె ఎక్కువ గుడ్లు పెట్టవు. ఆ గుడ్ల పెకులో కాల్షియం లోపించి తోలుగుడ్లు పెట్టడంవల్ల రాబందుల జాతులు అతి తక్కువ కాలంలోనే అంతరించి పోతున్నాయి. డైక్లోఫినాక్ ప్రభావంవల్ల రాబందులు మూత్రపిండాలు చెడిపోయి రక్తంలో యూరిక్ యాసిడ్ స్తాయి పెరిగి చూవుకు దగ్గరవుతున్నాయి.

ఫలితంగా జంతువుల కుళ్ళిన కళేబరాలు వీధికుక్కలకు ఆహారమవుతున్నాయి. కుళ్ళిన మాంసం తిన్న కుక్కల్లో రేబిస్ వ్యాధి ప్రబలి పిచ్చికుక్కల బెడవ తీవ్రమవుతోంది. రాబందుల సంఖ్య తగ్గితే పిచ్చికుక్కల సంఖ్య పెరగడమేమిటని ఆశ్చర్యపోతున్నారా ?

ప్రకృతి పరిరక్షణలో చీమనుంచి రాబందుదాకా, ఎలుక నుండి ఏనుగు దాకా ఏ ప్రాణికైనా ఓ పాత్ర ఉంది. ఆ పాత్ర పోషణకు అడ్డంకులేర్పడితే మొత్తం సమతుల్యత దెబ్బతిటుంది. ప్రాణికోటి మనుగడకే ప్రమాదమేర్పడుతుంది.

బ్రతకడం, బ్రతకనివ్వడం ప్రకృతి ధర్మాలు. ఈ ధర్మాలు మీరు పాటిస్తారు కదూ!

కొండపల్లి... కొయ్యబొమ్మలు

పిలల్లూ మీకు బొమ్మలంటే చాలా ఇష్టం కూదా మీరు ఎక్కువగా ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మలు చూస్తుంటారు. ఈ ప్లాస్టిక్ బొమ్మల కంటె ముందు తయారై పిల్లలతో ఆడుకొని, బొమ్మల కొలువుల్లో చేరి, అల్మారా అదాదల చాటు దాక్కొని మనకు ఆహ్లాదాన్ని పంచినవి, పంచుతున్నవి కొయ్యబోమ్మలు. ప్రత్యేకించి కొండపల్లి కొయ్యబొమ్ములు.

కొండపల్లి విజయవాడకి 12కి.మీ. దీరంలో ఉన్న గ్రామం. మన రాష్ట్రంలోనే గాక దేశ వ్యాప్తంగా గ్రామం. మన రాష్ట్రంలోనే గాక వ్యాప్తంగా కొయ్యబొమ్మల తయారీకి ప్రసిద్దిగాంచింది.

ఇక్కడ నకాషులు అని పిలవబడే 11 కుటుంబాల వాళ్ళు ఇతరులు 20 కుటుంబాలు వారు బొమ్మలు చేసే వడత్తిలో ఉన్నారు. కొండపల్లికి 15కి.మీ. దూరంలో ఉన్న గంగినేని, మాదారం అడవుల్లో లభించేత తెల్లపొనికి అనే తేలికైన కొయ్యతో వీరు బొమ్మలు చెక్కుతారు.

అడవుల్లో చెట్లును పూర్తిగా నరక్కుండా, కొమ్మలు మాత్రమే నరుకుతారు. ఆ చెట్లు మళ్లీ చిగురించి ఎదుగుతుంటాయి. దీనివల్ల వీళ్ళకు కొయ్య ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది.

చింతగింజలను పిండిచేసి ఉడక బెట్టి బంక లాగా తయారు చేస్తారు. దీన్ని తోపా అంటారు. తోపాని రంపపు పొట్టులో కలిపితే మక్కు తయారవుతుంది. కొయ్యతో మొదట బొమ్మ ఆకారాన్ని చెక్కి మక్కు, తోపాని వాడి తల, మొడెం, కాళ్ళు, అతికించి బొమ్మను తయారుచేస్తారు. ఆరబెట్టి ఆ తర్వాత రంగులు వేసి ఆకర్షణీయంగా తయారుచేస్తారు.

వీళ్ళు తయారు చేసే బొమ్మల్లో ఏనుగు అంబారీ, తాటిచెట్టు, పల్లకి, కృష్ణుడు గోపికలు, వినాయకుడు, చిలకలు, పావురాలు, జింక, ఒంటె లాంటి సాంప్రదాయపు బొమ్మలున్నాయి. లంబాడి, కుమ్మరి, సాలె, ఉప్పరి, చెంచు, రైతులాంటి వృత్తులను సూచించే బొమ్మలున్నాయి.

వీరు తయారు చేస్తున్న సాంప్రదాయపు బొమ్మలు కలకత్తా, తమిళనాడు లాంటి ప్రదేశాలకు పంపి వారి సాంప్రదాయపు బొమ్మలను తెచ్చుకొని వీరు అమ్ముతుంటారు. దేశంలోని భిన్న సంక్కృతి సాంప్రదాయల సమ్మేళనంగా వీరి బొమ్మల కొలువు మనల్ని అలరిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ బొమ్మల వాడకం పట్ల ఆసక్తి తగ్గుతోంది. పర్యావరణ మిత్రులైన మన కొండపల్లి కొయ్యబొమ్మలు నాటినుండి నేటివరకు మనల్ని అలరిస్తున్నాయి. హలో నేస్తం. అంటూ పరకరిస్తున్నాయి. మీ రెప్పుడైనా విజయవాడకెళితే దగ్గర్లోని మన కొండపల్లి బొమ్మల్ని తెచ్చుకుంటారు కదూ..

నేను జీవనాధారాన్ని నన్ను రక్షించుకోండి

నేను మీ ప్రియమిత్రణ్ణి. నాకు ప్రాణం లేకపోయినా కోట్లాద జీవరాశులు ప్రాణం పోస్తాను Ocº దగ్గర దగ్గర ఘనరూపంలోకి మారిపోతాను. 100 cº దగ్గర వాయు రూపంలోకి మారిపోతాను.

నేను ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉండగలను. నేనెవర్నో మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారు. తెలుసుకోలేదా...

నేను నీటని. ప్రాణికోటికి జీవరాధారాన్ని. ఈ భూగోళం మీద మీరూ, మీ చుట్టూ ఉన్న చెట్లు, జంతువులు, ఇతర ప్రాణులు జీవించడానికి కారణం నేనే. అందుకేగా, మీరిప్పుడు ఇతర గ్రహాలపై నీటిబొట్టు కోసం అన్వేషిస్తున్నారు. నేనుంటే ఇతర జీవరాశులుంటాయని మీ ఆశ.

నేను సర్వాంతర్యామినిః - మబ్బుల్లో నేనే! మహా సముద్రాల్లోనేనే,,, మంచు కొండల్లో నేనేన భూగర్భంలో నేనే సకల ప్రామికోటి శరీరాల్లో నేనే. అసలు మీ శరీరాల్లో 85 శాంత నేనేనని మీకు తెలుసు కదూ... అంటే ఒక్కమాటలో చెప్పాలంటే నేను లేక మీరు లేరు. చిన్నారులూ ఈ భూమిపై మొదటి ప్రాణి పురుడు పోసుకున్నది నాలోనే కదా....

భూమిపై నీటి లభ్యత

సముద్రాలు - 97.2%
హిమనీ నదులు - 2.0%
భూగర్భజలం - 0.62%
మంచినీటి సరస్సులు - 0.009%
వాతావరణం - 0.001%
నదులు - 0.0001%
మొత్తం -99.8301%

ఎప్పుడో 500 కోట్ల సంవత్సరాల కిందట భూమి ఒక నిప్పు ముద్దగా ఉన్నప్పుడు, అత్యధిక ఉష్ణోగ్రతల్లో, రెండు హైడ్రోజన్ పరమాణులు ఒక ఆక్సిజన్ పరమాణువుతో కలిసి నీటి అణఉవును ఏర్పరచాయి. అలా ఏర్పడ్డ నీటి అణువులు ఆవిరి రూపంలో ఉండేవి. ఇవి భూమిచుట్టూ మేఘూలుగా చేరాయి. మేఘాలు చల్లబడి వర్షించేవి. ఇలా లక్షలాది సంవత్సరాలు వర్షాలు కురవడం వల్ల బూమి చల్లబడి ఘనరూపంలోకి మారింది. భూమిపైనున్న పల్లపు ప్రదేశాలన్నీ జలమయమై మహాసముద్రాలుగా మారిపోయాయి. ఇప్పటికీ భూ ఉపరితలంపై నాలుగింట మూడొంతులు నీరు ఆక్రమించి ఉంది. 97.2 శాతం ఉప్పునీరుగా సముద్రాల్లో ఉంది. 2 శాతం వృవాల దగ్గర పర్వతాలపై మంచు రూపంలో ఉంది ఇక 1 శాతం మాత్రమే మీకు అందుబాటులో వున్నా నన్ను జాగ్రత్తగా కాపాడుతుంటారు కదూ...

చిత్రం చిత్రం పక్షి ప్రపంచం

ప్రకృతి చాలా విచిత్రమైంది. అందులో ప్రతిజీవి ఒక్కో ప్రత్యేకతతో వుంటుంది. దేనిలోకం దానిది.

మనం రోజూ చూసే పక్షులు చేసే చేష్టలు మరీ విచిత్రమైనవి. పక్షులది పెద్దప్రపంచం. ఆప్రపంచంలో కొన్ని వింతల్ని ఇప్పుడు చూద్దాం.

జలకాలాటలు..
రెండు చెంబులనీళ్లు నెత్తిమీద కుమ్మరించుకుని ఒళ్లు తడిసీతడవకముందే స్నానం ముగించడాన్ని కాకిస్నానం అని మనవాళ్లంటుంటారు. ఒక్కకాకి లేదా చాలా పిట్టలు బుడుంగున నీళ్లలో మునగడం, రెక్కలు టపటపలాడిస్తూ లేవడం మనం చేస్తుంటాం. పక్షులెంత స్నాన ప్రియులో అనుకుంటాం. ఇంతకీ స్నాన రహస్యం ఏమంటే పక్షులకూ మనకు మల్లే పేలుపడతాయి. ఈగలు ముసురుతుంటాయి. వీటిని తొలగించుకోవడానికే పక్షులు స్నానాలు చేసేది. ఒక్కొక్కప్పుడు కొన్ని పక్షులు మట్టిలో కూడా ఇలాగే మునుగుతాయి,. ఈ మట్టి స్నానం రహస్యమూ ఇదే

కొన్ని పక్షులు మరీ తెలివి మీరినవి. అవి చీమలతో ఈ పేలను వదిలించుకోవడం నేర్చిన గడుసరివి. చీమల్నించి ఫార్మిక్ యాసిడ్ వస్తుంది. అది పేలకీ, ఈగలకీ, మహా విరోది. అందుకు మన పక్షులు చీమ పుట్టల మీద కూచుని రెక్కలు విప్పుకొని చీమల్ని ఆహ్వానిస్తాయి. చీమలు రెక్కల్లోకి ఎక్కి పేల పీడని వదిలిస్తాయి. ఇంకొన్ని పక్షులైతే చీమల్ని ముక్కు నిండా ఏరుకొని రెక్కల మీదికి చల్లుకొంటాయి. మరి ఈ తతంగాన్ని ఏ స్నానం అనాలి ?

జీర్ణం జీర్మం వాతాపి జీర్ణం

పిల్లలకి అన్నం పెట్టి మన తల్లులు జీర్ణం. జీర్ణం వాతాపి జీర్ణం. అంటుంటారు. అలా అంటే అజీర్ణం చెయ్యదని తల్లుల ఆశ. మరి పక్షులకూ అజీర్ణం చేసుతంది కదా ఏం చెయ్యాలి ? పక్షులు గింజలతో పాటు చినినచిన్న గులకరాళ్లను కూడా తింటాయి. ఈ రాళ్లు జీర్ణమవుతాయి. మరిపాపం పంజరాల్లో పక్షులేం చెయ్యాలి ? వాటి తంటాలు అవి పడతాయి. లండన్ లోని ఒక జూ లో నెమలి చనిపోతే తీరాచూడగదా దానికడుపులో ఓ చిన్న సైజు గడియారం , మూడడుగులతాడు, కొన్ని నాణేలు, బయటపడ్డాయట. ఆహారం దొరకనప్పుడు రాళ్లు రప్పలూ చెత్తాచెదారం తింటాయన్నమాట.

పిట్ట కొంచెం దంతం ఘనం

గుడ్డులోంచి బయటపడ్డం పక్షులకు చిన్నపనికాదు. అప్పటిదాకా కడుపులోబెట్టుకుని రక్షించి పెంచిన గుడ్డు పెంకు ఒక్కసారిగా పగలగొట్టుకొని మరీ రావాలి. అందుకోసం చిన్నారి పక్షులకో ఆయుధం స్వత సిద్ధంగానే వుంటుంది. ముక్కు చివర ఓ కణుపు రూపంలో వుండే ఈ ఆయుధం ఒకరమైన దంతం. దీంతో గుడ్డుగోడల్ని బద్దలు చేసి ఈ మహాప్రపంచంలోకి వస్తాయి పిట్ట పిల్లలు ఈ జనన పోరాటానికి సామాన్యంగా పక్షిపిల్లలకు ఓ అరగంట పడుతుంది. ఆల్బాటోస్ లాంటి వాటికైతే పాపం 6 రోజులు పడుతుందట....

అయ్యోపాపం ఆర్థాయుష్షే

ఇంత ముచ్చటగా పుట్టీపుట్టగానే కిచకిచలాడే అందాల పక్షులు 75 శాతం 6 నెలలలోపే చనిపోతాయి. కొన్నింటిని పిల్లులు తింటాయి. కొన్ని గాలికీ వానకి చనిపోతుంటాయి. ఈ రోజుల్లో అయితే పరిగెత్తే వాహనాలు తగిలి కొన్ని ప్రాణాలు పోగొట్టుకొంటాయి. ఇక ఆకలితో రోగాలతో పోతున్నవెన్నో ఎముకల దగ్గర నుంచి నక్కలదాకా వీటికి ఎన్ని శత్రువులో అడుగడుగునా ఎన్ని గండాలో...
రంగు రెక్కల బండారం

రంగురంగుల ఈకలతో రెక్కలతో లోకానికి ముచ్చట కలిగించే మగ పక్షులు తమ కూనల పెంపకం దగ్గరి కొచ్చేప్పటికి చచ్చుదద్దమ్మల్లా మారిపోతాయి. వీటికి రెక్కలపటారం వున్నంతగా బిడ్డల పెంపకం మీద శ్రద్దవుండదు. ఆడ పక్షుల్ని ఆకర్షించడానికి తప్ప వీటి రెక్కలు పిల్లలకి పిసరంత కూడా పనికి రావు. ఇలాంటి పక్షులు గూళ్ళూ పెట్టవు. గుడ్లు పొదగడానికి సిద్దపడవు. ఆడ పక్షులకు సామాన్యంగా ఈ రంగు రంగుల రెక్కలండవు. వాటి రెక్కలు సాదాసీదాగా వుంటాయి. అయితేనేం ? ఇలాంటి రెక్కలు గూళ్ళలో సులభంగా దూరి దాక్కోవడానికి, తమ బిడ్డల్ని వెచ్చగా దగ్గరగా తీసుకొని హత్తుకొవడానికి ఎంతో పనికొస్తాయి.

ఎంత పెద్ద హృదయమో

చెట్టుకు కాయ భారమా అంటారు గానీ తల్లికి మాత్రం ఒక్కొక్కపుడు పిల్లలు భారమవుతారు. ఒక్కతే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెంచాల్సివస్తే భారంకాదేమిటి ? అప్పుడు అత్త, పిన్ని వదినా ఎవరో ఒకరు తోడుగా తల్లికి సాయపడతారు. మరి పక్షులూ ఇలా తల్లులకి సాయపడుతాయా... అక్షరాలా సాయపడతాయి. అవసర మొచ్చినపుడుతల్లి పక్షులే కొంచెం తోడురండమ్మా అని పిలుస్తాయి. ఒక్కొసారి పిలవకుండానే చుట్టు పక్కల పక్షులు, చుట్టాల్లా వచ్చి పిల్లల మంచి చెడ్డలు చూస్తాయి. ఆహారం తెచ్చిపెడతాయి. అలా పెరిగిన పిల్లలు పెద్దవై చేసిన మేలు కడుపులో పెట్టుకొని ఇంకొకరి పిల్లలకి అలానే స్నేహ హస్తం అందిస్తాయి. ఇంతచిన్న పిట్టలకి ఎంత పెద్ద హృదయమో కదూ...

పాము విషమే దానికి జీర్ణరసం

డా|| ఎం.వి. రమణయ్య, నెల్లూరు

పాము మాంసాహారి. మనలాగా నమిలి మింగే అలవాటు దీనికి లేదు. ఆహారాన్ని ఓకేసారి అమాంతంగా మింగేస్తుంది. యిలా మింగిన ఆహారం రెండుమూడు రోజులలో పూర్తిగా జీర్ణమవుతుంది. మూడు రోజులలో జీర్మం కాని ఆహారాన్ని వాంతి రూపంలో బయటకు నెట్టేస్తుంది. నమలకుండా మింగిన ఆహారంలోని ఎముకలకు కూడా జీర్ణం చేసుకుంటుందంటే పాము జీర్ణవ్యవస్థలో వున్న జీర్ణరసాలు ఎంతశక్తివంతమయినవో ...

మనలాగే పాములకు కూడా నోటిలో లాలాజలం వూరుతుంది. ఇది ఆహారం క్రిందికి జారడానికి జిగురులాగానే కాకుండా శక్తి వంతమయిన ఎంజైములను కలిగి వుంటుంది. ఈ ఎంజైములు కోడిగ్రుడ్డుపెంకులను, ఎముకలను కూడా జీర్ణం చేస్తాయి. దీనితో పాటు పాము విషంలో కూడా కొన్ని జీర్ణ రసాయనాలుంటాయి. ఇవి ఎముకలను జీర్ణం చేసుకోవడానికి చాలా సహకరిస్తాయి. ఆహార సంపాదన సమయంలో కోరల ద్వారా ఆహారం లోనికి వెళ్లిన ఈ విషం పాముకు జీర్ణ రసంగా ఉపయోగపడుతుంది. ఈ విషం కలిసిన ఆహారపదార్థం మూజు రోజులలో జీర్ణమయితే విషం లేని ఆహారం జీర్ణం కావడానికి 10 రోజులు పడుతుంది. మనకు ప్రమాదం కల్గించే విషం పాముకు మాత్రం జీర్ణ రసంగా ఉపయోగపడుతుంది

యింతే కాదు సుమా.... పాము తనకున్న చిన్నసైజు మొదడు లోని కొద్దిపాటి తెలివినుపయోగించి ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పాము శీతల జంతువు. అంటే, చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత తక్కువగాను, వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత తక్కువగాను, వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగాను, ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ జీర్ణక్రియలోవేగం పెరుగుతుందని మనకు తెలిసిందే. ఈ విషయం పాముకు తెలుసు. అందుకే అది ఆహారం తీసుకున్న తరువాత వేడిఎక్కువ తగిలే ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటాయి శీతల రక్త జంతువుకదా అందుకని జీర్ణం కావలసిన ఆహారం వున్న భాగాన్ని మాత్రమే వేడితగిలే విధంగా వుంచి మిగిలిన భాగాన్ని బొరియలో వుంచుకుంటుంది.

పాములో జీర్ణక్రియలన్నీ 30 డిగ్రీల సెల్సియస్ వద్ద సజీవుగా జరుగుతాయి. ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ తగ్గితే జీర్ణక్రియల వేగం తగ్గి తిన్నది అరగక, ఉపశమనం పొందడానికి జీర్ణం కాని ఆహారాన్ని వాంతి చేసుకుంటుంది. చూడండి. పాములు ఎంత శాస్త్రీయంగా ప్రసర్తిస్తున్నాయో.. ఈ శాస్త్రీయతను పాములకెవరు నేర్పారు ? ఎలా నేర్చుకోగలిగాయి. ఎవరూ నేర్చనవరసరం లేదు. ఆహార సంపాదన, మనుగడకోసం తరిగే పోరాటాలే వీటన్నిటికి గారి తీస్తాయి. యింత మాట్లాడుకుంటున్నాం. మరి పాములంటే మనందరికీ భయమేకదా ?

జలదాత సర్ ఆర్ధర్ కాటన్

డా- వి. ప్రభావతి, వరంగల్, (క్రీ.శ.1804-1899)

మద్యపాన నిషేధమని మనమిప్పుడు అంటున్నాం కానీ 140 సం,,ల క్రిందటే మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలని ఆందోళన చేసిన మహనీయుడు సర్ ఆర్ధర్ కాటన్. మద్యం కన్నా మంచి నీళ్ళనే ఆరాధ్య దైవంగా తలచి ప్రజలందరికీ వాటిని అందించేందుకు అహర్నిశలూ శ్రమించిన మహానుభావుడు సర్ ఆర్ధర్ కాటన్. ఆయన 1803 మే 15 వ ఇంగ్లాండులోని కాంచర్ మీర్ అబీ లో జన్మించాడు. బాల్యంలో యింటి ముందు పడే వాననీటిని చిన్నచిన్న కాలువల్లాగా చేసి వినోదించాడు.

15 వ ఏట ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశించి మిలటరీలో ఇంజనీర్ ఉద్యోగం సంపాదించాడు. మనదేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వం పాలిస్తున్నపుడు ఈయన మిలటరీ ఇంజనీరుగా మద్రాసులో ఉద్యోగ బాధ్యతలు స్వాకరించాడు. అనేక జిల్లాల్లో చెరువుల మరమత్తులు చేయించి నీటి నిల్వలు పెంచాడు. 1828 లో కావేరి నీటి పారుదల పథకాన్ని చేపట్టితమిళానాడు రైతులకు గొప్పమేలు చేశాడు.

1841 లో ఆస్ట్రేలియా వెళ్ళిన కాటన్ తిరిగి ఉద్యోగ బాధ్యత మీద విశాఖపట్నం వచ్చాడు. ఆ నగరంలో డాల్ఫిన్స్ నోస్ కొండపై నివాసముండి రోజూ సముద్రాన్ని చూస్తూ అలలతో తీరం కోతపడటాన్ని గమనించాడు. దీన్ని నివారించేందుకు సముద్రపుటంచున రాతికట్టలు వేయించాడు. వాటిని యిన్నటికీ మనం చూడవచ్చు. రాజమండ్రి జిల్లా వాసులు ప్రతి యేడాది. కరువులతో వరదలతో కొట్టుమిట్టాడటం చూసి ఆ పరిస్థితిని మార్చడానికి ఓ ప్రాజెక్టును రూపొందించి పై అధికారుల అనుమతితో 1847 లో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణానికి పూనుకొన్నాడు. దీనికోసం ఆయన గుర్రంపై పై స్వారి చేస్తూ గోదావరి తీరం వెంబడి మేళ్ళ కొద్దీ సర్వేచేశాడు. కేవలం 5సం,,ల్లోనే ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి 10 లక్షల ఎకరాలకు సాగునీటిని, వేలాది గ్రామాలకు త్రాగు నీటిని అందించాడు. దీని వల్ల వరదలు తగ్గి రైతుల ఆదాయం పెరిగింది. ఆయనగోదావరి తీర ప్రజల పాలిట దేవుడయ్యాడు. ఆ ప్రజలు ఆయన్నెంత గౌరవించారంటే ప్రార్ధనల్లోని రుషుల్లో కాటన్ పేరుకూడా చేర్చారు.

సంచార జీవితం గడిపే వారిని ఆనకట్ట నిర్మాణంలో కూలీలుగా పెట్టుకొని వారికి బ్రతుకుదెరువు కల్పించాడు. కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద తుంగభద్రపై ఆనకట్ట, కర్నూలు, కడప కాలువల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు. నదుల అనుసంధానం గురించి తొలిసారి ప్రతిపాదించినది ఆయనే. మహానది నుంచి కేరళ వరకు 4వేల కి.మీ. దూరం అనుసంధానానికి వేసిన పథకంలో భాగంగా గంగానదిపై ఫరక్కావద్ద కృష్ణానదిపై నందికొండవద్ద గోదావరి పై పోచంపాడు వద్ద జలాశయాల నిర్మాణాలు మొదలయ్యాయి.

1860 లో ఉద్యోగ విరమణ చేసి ఇంగ్లాండు తిరిగి వెళ్ళాడు. భారతదేశమంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఇంగ్లాండ్ లోని ఆయన ఇంటి గదులనిండా భారత దేశపు పటాలే వుండేవి. బ్రిటీషు ప్రభుత్వం భారతీయులపై ఉప్పు పన్ను వేస్తే అది తగదని 1877 లోనే ఆందోళన చేసాడు. జన్మతః బ్రిటీషువాడైనా ప్రస్తుత భారతీయులకు కనువిప్పు కలిగించేలా భారతదేశాన్ని ప్రేమించిన మహాశక్తి ఆయన. అందువలన కాటన్ జన్మదినాన్ని గత ఏడాది ఘనంగా జరిపి నివాళులర్పించారు.

ఫోబియా

యం. సుధారమేష్,
గార్లపేట, ప్రకాశం జిల్లా,
ఫోబియా ఈ పదాన్ని తరచూగా వింటూ ఉంటాము. ఫోబియా అంటే తెలుగులో భయం లేక అకస్మాత్తుగా కలిగే భయం అని అర్థం చెప్పుకోవచ్చు.

ఫోబియా అనే ఆంగ్లపదం యొక్క మూలం గ్రీకు పదమైన ఫోబోస్ నుంచి వచ్చింది.

భయాలు అనేవి సహజంగా అందరికీ ఉంటాయి. కొందరికి పిల్లిని చూస్తే భయం. మరి కొందరికి బల్లిని చూస్తే భయం. ఇంకొరికి చీకటిని అంటే భయం... ఎత్తునుండి కిందికి చూడాలంటే ఇలా ఎన్నో రకాల భయాలు.

ఒక వస్తువును చూసినపుడు కాని, సందర్భంలోగాని ప్రత్యేకమైన కారణం లేకుండానే ప్రమాదం జరుగుతుందేమోనని భావించటం వలన మన ప్రవర్తనలో కలిగే అపసవ్యమైన మార్చే ఫోబియా ఫోబియా ఏర్పడటానికి ఫలానా వస్తువులు లేదా సందర్భాలు కారణం అని ప్రత్యేకంగా చెప్పలేము.

చిన్నప్పుడు పిల్లలు అన్నం తిననని మారాం చేస్తే, అమ్మ బూచాడుకు పట్టిస్తానని చెబుతుంది. కొన్ని మాన్పించటానికీ ఈ రకంగా భయపెట్టడం మామూలే. ఇందువల్ల ప్రమాదం జరుగుతుందేమోనన్న భయం పిల్లల మనసులో నిలిచిపోతుంది. చిన్నపుడే దెయ్యాలు, భూతాలు, ఇంకా అనేక రకాల భయాలు గూడుకట్టుకొంటాయి. ఫోబియా వల్ల మనిషి ప్రవర్తన వింతగా ఉంటుంది. ఉదాహరణకు కొంత మంది వ్యక్తులు తమ మీద బల్లి పడితే వింతగా ప్రవర్తిస్తూ, పెద్దగా అరుస్తారు. అలాగే ఎగ్జిబిషన్ లలో ఉండే జయింట్ వీల్ ఎక్కినపుడు చనిపోతామని భయంతో పెద్దగా ఏడుస్తూ, జయింట్ వీల్ ఆపివేయమని గోల చేస్తారు.

చరిత్రలో ఫోబియాకు సంబంధించి అనేక ఉదాహరణలు విచిత్రాలు తెలుసుకొంటే ఆశ్చర్యపోవటం మన వంతు అవుతుంది. ఉదాహరణకు 3వ హెన్రీ రాజు కు కోడిగుడ్లు చూస్తే ఫోబియా ఆట. వింతగా ఉంది కదూ

అలాగే జర్మనీ దేశానికి చెందిన తత్త్వవేత్త స్కోపెన్ హర్ కు గడ్డంచేసుకునే రేజర్ అంటే భయం. అందుకని ఆ తత్త్వవేత్త గడ్డంచేసుకునే వాడు కాదు. మరి ఏం చేసేవాడు తెలుసా పెరిగిన గడ్డం అంచులను దీపంతో కాల్చేవాడట తమాషాగా ఉంది కదూ.

ఫోబియాలు వయస్సుతోగాని, మానసిక స్థితితోగాని . సంబంధంలేకుండా కలుగుతాయి.

కొన్ని రకాల ఫోబియాలు, అవి కలగడానికి, కారణమయ్యే అంశాలను తెలుసుకొందాం.

 

ఫోబియా పేరు

కారణం

1

ఎక్రోఫోబియా

ఎత్తైన ప్రదేశాలనుంచి క్రిందకు చూసినపుడు కలిగే భయం

2

హెమటోఫోబియా

రక్తం చూసినపుడు

3

హైడ్రోఫోబియా

నీళ్లు చూసినపుడు

4

నెక్టోఫోబియా

చీకటి అంటే భయం

5

ఫోటోఫోబియా

కాంతి అంటే భయం

6

ఫైరోఫోబియా

మంటలను చూసినపుడు

7

జీనోఫోబియా

కొత్తవారిని చూసినపుడు కలిగే భయం

8

జూఫోబియా

జంతువులను చూసినపుడు

9

ఎల్యూరోఫోబియా

పిల్లులంటే భయం

10

సైనోఫోబియా

కుక్కలంటే భయం

11

బ్యాట్రకోఫోబియా

కప్పలంటే భయం

12

ప్యాసమోఫోబియా

దెయ్యాలంటే భయం

13

మూసోఫోబియా

ఎలుకలంటే భయం

14

హోడోఫోబియా

ప్రయాణం చేయాలం భయం

15

మోనోఫోబియా

ఒంటరితనం అంటే భయం

పక్షులు ఎందుకు వలస పోతాయి ?

మన రాష్ట్రంలో సహజంగా ఏర్పడిన అత్యంత రమణీయమైన కొల్లేరు సరస్సుకు వచ్చే పక్షుల గురించి ఎప్పుడైనా విన్నారా ? అవి ఎక్కణ్ణుంచి వస్తాయో తెలుసా? ఈ పక్షులు ఎక్కడో సుదూర ప్రాంతమైన సైబీరియా నుండి కొల్లేటి సరస్సుకు ప్రతి సంవత్సరం వలస వస్తాయంటే ఆశ్చర్యంగా వుంది కదూ. అవును పక్షులకు ఎల్లలు లేవు. దూర భూమి లేదు. నదీనదాలు, కొండలు, కోనలు, ఎడారులూ మనకడ్డంకి...

అంటూ పైకి, పైపైకి ఎగిరి సుదూర తీరాలకు వలస పోవటం పక్షిజాతుల విశిష్ట లక్షణం. ఇంతకూ పక్షులెందుకు వలన పోవటం ? అవి ఇంతదూరం ఎలా పయనించగలుగుతున్నాయని ఎప్పడైనా ఆలోచించారా? వీటికి మార్గం ఎలా తెలుస్తుంది ?

వలస పక్షులు
సాధారణంగా పక్షులు ఒక చోటు నుండి మరో చోటుకు పోవటం మనకు తెలుసు. కొన్ని జాతులో పక్షుల్లో ఈ ప్రయాణం ఒకానొక ప్రత్యేక రుతువులో, రోజులో ఒకానొక ప్రత్యేక సమయంలో ఉంటుంది. మరికొన్నింటిలో యిలా క్రమబద్ధంగా ప్రయాణాలు ఉండవు. స్వతహాగా పక్షులు పగటిపూట సంచరించే జీవులైనప్పుటికీ దూరప్రయాణం మాత్రం రాత్రి వేళల్లో చేస్తాయి. పక్షులెప్పుడూ గుంపులు, గుంపులుగా అలలు, అలలుగా V ఆకారంలో పయనిస్తాయి. ఈ ప్రయాణంలో కొన్ని పక్షులు ముందుగా చేరుకుంటాయి. ఆ మర్నాడో లేక రెండు మూడు రోజుల్లో పెద్ద సంఖ్యలో అన్ని పక్షులూ చేరుకోవటాన్ని మనం గమనించవచ్చు. పక్షులను పరిశీలించే వాళ్ళు పున్నమి రాత్రుల్లో టెలిస్కోపుల నుపయోగించి వలస పక్షుల గమనాన్ని వీక్షిస్తారు. గంటకు తొమ్మిదివేల పక్షులు రాత్రిళ్ళు పోతుంటాయని కనుగొన్నారు. వీటి ప్రయాణం సూర్యాస్తమయమైన గంట తర్వాత ఆరంభమై అర్థరాత్రికి తారాస్థాయిలో జరుగుతుంది.

రాత్రి ప్రయాణాలెందుకు ?
ప్రయాణానికి రాత్రి పూటను ఎంచుకోవటానికి ప్రధానకారణం వాటి శత్రువుల నుండి తప్పించుకోవటం దృష్ట్యా చూసినా రాత్రి ప్రయాణమే శ్రేయస్కరం. పక్షుల్లో జీర్ణశక్తి అపారం. అతి తర్వగా జీర్ణం అవుతుంది. దూర ప్రయాణానికి అవసరమైన శక్తిని కూడగట్టుకోవటానికి తక్కువ సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోగలగటం. క్రొవ్వురూపేణ నిల్వచేసుకోవటం చేస్తాయి. రాత్రి ప్రయాణం వలన ఎంతో వెసులుబాటు కూడా ఉంది. దీనితో పగలంతా ఆహార సేకరణ, విశ్రాంతి తీసుకోవటానికి వీలవుతుంది. రాత్రివేళ ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉండటంతో పక్షి తనకు కావలసిన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు శ్వాసక్రియ ద్వారా గాలి తిత్తులనుండి పక్షులు నీటిని కోల్పోతాయి. ఇలా నీటిని కోల్పోవటమే ప్రధానం గా ఏ పక్షైనా ఆగకుండా ఎంత దూరం పోగలదన్నది నిర్ణయిస్తుంది.

వలస పోవటం దేనికి ?

దానికి ప్రేరణ ఏమిటి ? కష్టకాలంలో ఆహారం దొరకక ఆహారాన్వేషణలో వలసపోవటం జరుగుతుంది. వసంతకాలంలో జంట కట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచటం కోసం పక్షలు వలస పోతాయి. శీతాకాలపు తీవ్రత నుండి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలను వెదుక్కుంటూ వలసపోతాయి.

భూమధ్యరేఖ ప్రాంతపు వెచ్చని ప్రాంతాలు చాలా పక్షులను వేసవి విడుదలుగా ఉండటం విశేషం. ఈ ప్రయాణం ఎప్పుడు చేపట్టాలో ఎలా తెలుస్తుంది. మరి ? ఎక్కడికి పోవాలో ఎలా తెలుస్తుంది ? అరిస్టాటిల్ కాలం నుండి నేటివరకూ మానవ మేధస్సును ఈ ప్రశ్నలు తొలుస్తూనే వున్నాయి.

ఏటవాలుగా పయనించే సూర్యకిరణాలు, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు ప్రయాణానికి పచ్చజెండా ఊపుతాయి. అంతేగాక వాతావరణంలో వచ్చే మార్పులు ప్రధానంగా వలసకు దారి తీస్తాయి. ప్రయాణానికి సరిపడినంత కొవ్వు నిల్వ చేసుకుని మరీ బయల్దేరుతాయి.

ఎంత దూరం ప్రయాణం చేస్తారు ?

వలస పక్షులు వేల మైళ్ళు ప్రయాణం చేస్తాయనటానికి మన కొల్లేటి కొంగలే ప్రత్యక్ష సాక్ష్యం.. ఎక్కడా సైబీరియా ! ఎక్కడి కొల్లేరు. ఊహించటానికే సాధ్యం కాని మహా అద్భుతం ! ఇవి 90 గంటల వరకూ ఆగకుండా ప్రయాణించగలవు. ఇందుకు గంటకు కేవలం అరగ్రాములోపు కొవ్వును ఖర్చుచేస్తే చాలు. ఆర్కిటిక్ టెర్న్ పక్షులు అన్నింటికంటే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. ఇవి ఆకు రాలు కాలంలో ఉత్తర ధృవం నుండి బయలుదేరి దక్షిణ ధృవానికి చేరుకుని వసంతం వచ్చేసరికి తిరిగి ఉత్తర ధృవానికి వలస పోతాయి.

అమెరికాలో బంగారు రంగు ప్లోవర్ పక్షులు ఏకబిగిన మారిటైం ప్రొవిన్స్ నుండి దక్షిణ అమెరికా తీరానికి ఎగురగలవు. రూబీ మెడ హమ్మింగ్ పక్షులు అనుకూల వాతావణంలో ముప్ఫై గంటల పాటు కిందికి దిగకుండా గాలిలో ఎగురుతూ పోగలవు. పక్షులు సాధారణంగా గాలివాలుకు అనుగుణంగా పయనించటానికి ఇష్టపడతాయి. సముద్రాల మీద పయనించేటప్పుడు కొన్నిసార్లు తుఫానుల్లో, సుడిగాలుల్లో చిక్కుకుని మరణిస్తాయి. భూమి పైన ఎగిరేటప్పుడు ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఆహారం సేకరించుకుని, సేద తీర్చుకుంటాయి.

ఎంత ఎత్తుకు ఎగురుతాయి ?

సాధారణంగా వలస పక్షులు మూడువేల అడుగుల ఎత్తులో పయనిస్తాయని విమానాలు నడిపే పైలట్లు పేర్కొన్నారు. తీర పక్షులు, కీటకాలను తినే చిన్నచిన్న పక్షులు, పిచ్చుకలవంటివి రాత్రి వేళల్లో ప్రయాణం చేసినా కొంగలు, గద్దలు, బాతులు, రాబందుల వంటి అనేక పక్షి జాతులు పగటిపూట ప్రయాణానికే మొగ్గుచూపుతాయి.

ఇవి వాతావరణంలో వచ్చే మార్పులు, నైసర్గిక స్వరూపం, పరిసరాలు, ఎత్తైన పర్వతాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణం సాగిస్తాయి.

తమ మార్గాన్ని ఎలా గుర్తుపడతాయి ?

సూర్యుడు, నక్షత్రాలను తమ మార్గదర్శకులుగా చేసుకొని ప్రయాణం సాగిస్తాయని పలు పరిశోధకులు తెలియజేశారు. అంతేకాక భూమిపైన ఉండే అనేక ల్యాండ్ మార్క్ లను ఉదాహరణకు నదీమార్గాన్ని, కొండలు, లోయలు సముద్రతీరాలను దారిని గుర్తుపెట్టుకోవటానికి మనలాగే అవి ఉపయోగించుకుంటాయి. పూర్వ కాలంలో రాజులు పావురాల ద్వారా సమాచారాన్ని పంపేవారని విన్నాం గదా... అంటే అవి మన తొలి తపాలా వ్యవస్థలో పోస్ట్ మాన్ లన్నమాట. పావురాలు తమ మార్గాన్వేషణలో వాసనను ఉపయోగించుకుంటాయి. అయితే కొన్నిసార్లు దారితప్పిన సందర్భాలు కూడ లేకపోలేదు. ప్రయాణంలో వెనుకబడినవి, పిల్లపక్షులు తరచూ దారిగానక చెల్లాచెదురవుతాయి. ఏమైనా వేల మైళ్ళు ప్రయాణం చేయడం, తిరిగి ఇల్లు చేరుకోవటం జీవులు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమనుతాము తీర్చిదిద్దుకున్న ప్రక్రియలో నేర్చుకున్న మహాఅద్భుతం.

తియతియ్యని నిద్ర

మనుషులకు గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం అన్న నిజాన్ని మీరు గుర్తించే వుంటారు కదూ. మనం నిద్రపోతున్నప్పుడు మాట్లాడకుండా, వినడం, చూడడంలాంటి అనేక పనులు పూర్తిగా ఆగిపోతే, శరీరంలో అంతర్గతంగా జరిగే ఇతర చర్యలు సాధ్యమైనంత నెమ్మదిగా కొనసాగుతాయి. దీని ఫలితంగా మనసుకు, శరీరానికి చక్కటి విశ్రాంతి లభిస్తుంది. అందుకే ఉదయం నిద్ర నుంచి లేచాక మనకు తాజాగానూ ఉత్సాహంగానూ, ఉన్నట్లనిపిస్తుంది.

అయితే ఇలా కేవలం మనకే అన్పిస్తుందా లేక ఇతర జంతువులకు కూడా అన్పిస్తుందా ? పశువులు, పక్షులు వంటి వాటన్నింటికీ అవసరమేనా ? ఒకవేళ వాటికి కూడా నిద్ర అవసరమే అయితే అవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిద్ర పోతాయి ? ఎంతసేపు నిద్రపోతాయి ? వాటి నిద్రకూ మన నిద్రకూ ఉన్న తేడా ఏమిటి ? ఎందుకు ? ఇలాంటి ప్రశ్నలు మీకు ఎప్పడో వచ్చివుంటాయి. అవునా ! సరే, ఇక ముందుకు పదండి. జంతువుల నిద్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కో ప్రాణిదీ ఒక్కోతీరు.
మనుషులకు లాగానే ఇతర ప్రాణులన్నిటికీ నిద్ర అవసరమే. అయితే నిద్రపోయే పద్ధతి, సమయం వంటి విషయాల్లో ఒక్కోజీవిది ఒక్కోనమూనా. మనకులాగే కొన్ని జంతువులు కొన్ని గంటల పాటు హాయిగా నిద్రపోతాయి. కొన్ని జంతువుల్లో, పక్షుల్లో అత్యధికం మాత్రం ఇలాంటి నిద్రకు నోచుకోవు. తమ శత్రువుల నుంచి ఏ క్షణం ఎలాంటి ప్రమాదం కలుగుతుందోనని అవి ఎల్లప్పుడూ అప్రమత్తంగా వుంటాయి.

అలా వుండక తప్పదు కూడా. అందుకే ఈ ప్రాణులు మనలా నిద్రపోవడంగాక కేవలం కునుకు మాత్రమే తీస్తుంటాయి. కొంచెం అలికిడయితే చాలు ఠక్కునలేచి కూర్చుంటాయి. పుట్టలు, బొరియలు, గుహలు, తొర్రలు, గూళ్ళు వంటి నివాస స్థలాలు లేని జీవులైతే పాపం నిద్రపోయే విషయంలో ఎన్నెన్నో తిప్పలు పడుతుంటాయి. శత్రువులు, శత్రువులకు సంబంధించిన భయం వాటి నిద్రను ఇట్టే ఎగరగొట్టేస్తాయి.

పక్కవేసుకొని పడుకొనేవీ ఉన్నాయి !

మనం మాత్రమే కాదు. కొన్ని జంతువులు కూడా పక్కలు వేసుకొని పడుకొంటాయి. ముఖ్యంగా మనలా గాఢంగా నిద్రపోయే జీవులే ఈ పని చేస్తుంటాయి. అలాంటి వాటిలో చింపాంజీ ఒకటి. చింపాంజీ తను పడుకొనేందుకై లేతలేత ఆకులు, రెమ్మలతో పక్క వేసుకొంటుంది. రాత్రి పూట, చెట్ల మీద ఈ పక్క వేసుకొంటే, పగటిపూట నేల మీదే వేసుకుంటుంది.

చింపాంజీ మనకన్నా ఎక్కువగా, రోజుకి 12 - 13 గంటలు నిద్రపోవటం విశేషం.

ఒరాంగుటాన్ లు, గొరిల్లాలు కూడా చెట్ల మీదే పక్కలు వేసుకుంటాయి. అందుకోసం ఇవి పెద్దపెద్ద కొమ్మలను వంచి, వాటిని లేత రెమ్మలకో కలిపి కట్టేస్తాయి. ఇలా తయారైన ఉయ్యాల మంచం పైన ఆకులను పరుచుకుంటాయి. ఆడగొరిల్లాలు, ఆడ ఒరాంగుటాన్ లు రాత్రిపూట తమ పిల్లలతో సహా ఈ ప్రక్కల మీదే పడుకుంటే, మగవి మాత్రం చెట్లక్రింద పక్కలు వేసుకొని సేద తీరుతాయి. మగ గొరిల్లాలు ఒక పక్క కాపలా కాస్తూనే మరో పక్క నిద్రపోతుంటాయి.

మనం పక్కలు వేసుకొనేందుకు మహా అయితే (ఎక్కువలో ఎక్కువగా) ఒక ఐదు - పది నిమిషాల సమయం పడుతుంది.

అవునా ! అయితే గొరిల్లాల వంటి జంతువులకు తమ పక్కలు సిద్ధం చేసుకొనేందుకు అప్పుడప్పూడూ పూర్తిగా ఓ గంట సమయం కావలసి వుంటుంది.

చెట్టపై రకరకాలుగా నిద్రపోతాయి

చింపాజీలు, గొరిల్లాలు వంటి వాటిలా కాకుండా చెట్లపై నివసించే అనేక ఇతర ప్రాణాలు ఎలాంటి పక్కలూ లేకుండానే నిద్రపోతాయి. ఇవి చెట్ల కొమ్మలను ఏదో ఒక విధంగా గట్టిగా పట్టుకొని నిద్రపోతాయి. కోతులు చెట్ల కొమ్మలను తమ అరచేతులతో బిగిసి పట్టుకొని, అలాగే రాత్రంతా నిద్రపోతాయి. వీటి పిడికిళ్ళు చెట్ల కొమ్మలను ఎంత గట్టిగా కరచి పట్టుకుంటాయంటే కోతులు నిద్రలో ఉన్నప్పుడు వాటి పట్టు ఏ మాత్రం సడలదు. కోతులు నిద్రలేచాక మాత్రమే ఆ పిడికిళ్ళు తెరుచుకోగలుగుతాయి. అందుకే కోతులు మంచి నిద్రలో ఉన్నప్పుడు కిందికి పడిపోవటం అంటూ జరగదు. టార్జియర్ అనే మరో ప్రాణి ఉంది. ఇది కూడా కోతి జాతికి చెందినదే. ఈ జంతువు తన తోకతో ఓ చెట్టు రెమ్మను గట్టిగా చుట్టేసి, చేతి వేళ్ళతో చెట్ల రెమ్మను బిగించి పట్టుకొని హాయిగా నిద్రపోతుంది. ఇది పగలంతా నిద్రలో గడిపి రాత్రిపూట మాత్రం మేలుకొని వుంటుంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన కోలా అనే జంతువు ఎలా నిద్రపోతుందంటే...... అది ముందుగా ఓ రెండు కొమ్మల మధ్య కూర్చుని వెనుక కాళ్ళను పొట్ట దగ్గరికి ముడుకుకొంటుంది. ఆ తరువాత తన చేతులతో ( ముందరి కాళ్ళతో) ఆ కొమ్మలను పెనవేసి పట్టుకొని ఖుషీఖుషీగా నిద్రపోతుంది.

ఎలుగుబంటి నిద్ర

అమెరికాకు చెందిన ఒక రకం ఎలుగుబంటి తన వీపును చెట్టుకొమ్మకు ఆనించి, నిలబడే నిద్రపోతుంది. అయితే మన దేశానికి చెందిన ఎలుగుబంట్లు మాత్రం ఇలా నిద్రపోవు. అవి దర్జాగా, ఎలాంటి భయమూ లేకుండా నేలమీదే నిద్రపోతాయి. దగ్గరలో ఏదైనా చెట్లుకొట్టేస్తున్న చప్పుడుగాని, లేదా ఇంకేదైనా అలికిడిగాని వినిపిస్తున్నా సరే ఇవి పట్టించుకోకుండా నిశ్చింతగా నిద్రపోతాయి. తమ నిద్రకోటా పూర్తిగా అయిపోతేగానీ మేలుకోవు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా వీటిని నిద్రలేపితే ఇక వారిపని అయిపోయినట్లే. అలాంటి సమయాల్లో ఎలుగుబంట్లు గుర్రుమంటూ నిద్రలేస్తాయి. వాటికి పిచ్చికోపం వస్తుంది. తమ నిద్రను పాడుచేసిన జంతువుల మీద లేదా మనుషుల మీదకి మహా కోపంగా దాడిచేస్తాయి. బహుశా, ఎలుగుబంట్లు ఇలా నిద్ర పోతాయనే కాబోలు, ఏదీ పట్టించుకోకుండా నిద్రపోతున్న వాడిని ఎలుగుబంటిలా నిద్రపోతున్నాడు. అని ఈసడిస్తారు.

తోకే దిండు - తోకే దుప్పటి కొన్ని జంతువుల తోకలు దట్టమైన బొచ్చుతో చూడముచ్చటగా వుంటాయి. ఇలాంటి జంతువులు తమ తోకను పక్కలాగా, దిండులాగా, దుప్పటిలాగా కూడా వుపయోగింకుంటాయి. ఇవి తమ తోకను ముందుకు సాచి, దానిపైన తమ పొట్టనూ, తలనూ ఆనించి నిద్రపోతాయి.చలికాలంలో తమనుతాము, చలినుంచి కాపాడుకొనేందుకై అదే తోకను ఒకవైపు నుంచి దుప్పటిలా కప్పుకుంటాయి. మనకు బాగా పరిచయం ఉన్న ఉడుత ఇలాగే చేస్తుంది.

గుర్రాలు నిలబడే నిద్రపోతాయి

కొన్ని జంతువులకు నేల మీదో, చెట్ల పైనో ఒక దాన్ని ఆనుకొని నిద్రపోయే యోగం ఉండదు. అవి నిలబడే నిద్రపోవలసి వస్తుంది. అలాంటి వాటిలో గుర్రం ఒకటి. ఇది తన నాలుగు కాళ్ళను నిగిడితన్ని, నిలబడే నిద్రపోతుంది. నేలమీద పడుకుంటే దాని ఊపిరితిత్తుల మీద ఒత్తిడి నిగిడితన్ని, నిలబడే నిద్రపోతుంది. నేలమీద పడుకుంటే దాని ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. మరి నిలబడి నిద్రపోతే, నిద్రలో ఉన్నప్పుడు పడిపోకుండా ఎలా ఉండగల్గుతుంది. అన్న ప్రశ్న పుడుతుంది. కదూ. దీనికి జవాబు గుర్రం కాళ్ళకు సంబంధించిన కండరాలలో ఉందని చెప్పవచ్చు. ఆ కండరాలు గుర్రం మోకాళ్ళు వంగకుండా వాటిని గట్టిగా పట్టివుంచుతాయి.

గుర్రిమే కాదు. ఆఫ్రికాకు చెందిన భారీకాయపు ఏనుగులు కూడా నిలబడే నిద్రపోతాయి. రోజూ మధ్యాహ్నం ఒకసారి, అర్థరాత్రి ఒకసారి ఇవి నిద్రపోతాయి. అప్పుడప్పుడూ తమ పొడవాటి దంతాలను ఏదైనా చెట్టు మొదటికి ఆనించి నిద్రపోతాయి. ఈ ఏనుగుల్లాగే పెద్ద పెద్ద శరీరాలు, ఎక్కువ బరువు వుండే అనేక ఇతర జంతువులు కూడా నిలబడే తమ నిద్రను (కునుకులు తీస్తూ) పూర్తి చేస్తాయి.

కునుకులతోనే నిద్ర

జీవుల్లో అనేకం చిన్నచిన్న కునుకులు తీస్తూ, వాటితోనే తమ నిద్రను పూర్తి చేస్తాయి. అంతేగాని అవి మనలాగా గంటల తరబడి ఏకధాటిగా నిద్రపోవు. కేవలం కొన్ని జంతువులు మాత్రమే గాఢంగానూ, ఎక్కువసేపూ నిద్రపోగల్గుతాయి. - ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, ఒంటె, జింక వంటివి చాలా తక్కువ సేపు నిద్రపోతాయి. పులులు, సింహాలు, చిరుతలు, తోడెళ్ళు కడుపునిండా భోంచేసిగాని నిద్రపోవు. అయితే చిన్నపాటి అలికిడికి కూడా చప్పున మేల్కొంటాయి - కుందేళ్లు రాత్రిపూట చాలా తక్కువ సేపు నిద్రపోతాయి. అయితే పగటివేళ మాత్రం రోజంతా కలిపి ఓ ఇరవై సార్లు చిన్న చిన్న కునుకులు తీస్తాయి.

రక్షణ ఉంటే చక్కని నిద్ర

తమకంటూ ఒక ఇల్లు లాంటిది వుండే జంతువులు, అలాగే ఏదో ఒక రకమైన స్వాభావికమైన రక్షణ (ప్రకృతి సిద్ధమైన ఏర్పాటు) వుండే జీవులూ గాఢంగా నిద్రపోతాయి. ఉదాహరణకు ముళ్ళ పంది తన వంటి మీద బాణం పుల్లల్లా వుండే వెంట్రుకలని నిక్కబొడిచి వుంచి, తలను పొట్టలోకి దూర్చుకొని ఎంతో నిశ్చితంగా నిద్రపోతుంది. అలాగే చుంచెలుక తన బొరియలో ఎంత గాఢంగా నిద్రపోతుందంటే, ఎవరైనా దాని బొరియను త్రవ్వి పారేసినా దానికి అంత తేలిగ్గా మెలకువ రాదు. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎంతో కష్టం మీద గానీ అది మళ్ళీ ఈ లోకంలోకి రాలేదు. గబ్బిలం కూడా తన కాళ్ళతో చెట్టుకొమ్మని పట్టుకొని, తల్లకిందులుగా వేలాడుతూనే నిద్రపోతుంది.

ఏమైతేనేం, ఎలాగైతేనేం మొత్తానికి జీవులన్నీ నిద్ర పోతాయి. కొన్ని చాలాసేపు నిద్రపోతే, కొన్ని చిన్నచిన్న కునుకులతో సరిపెడతాయి. కొన్ని గాఢంగా నిద్రపోతే మరికొన్ని చిన్నపాటి అలికిడికే దిగ్గున లేచి కూచుంటాయి. అంతే తేడా. ఇక శీత నిద్రలో (హైబర్నేషన్) ఉన్నప్పుడు కొన్ని జంతువులు నెలల తరబడి, లేదా ఏళ్ళ తరబడి నిద్రలో గడిపే జీవులు కూడా ఉన్నాయి కాని, లక్ష్మణుడిలా ఏళ్ళ తరబడి నిద్రపోకుండా, కనీసం రోజుకొకసారి ఓ చిన్న కునుకైనా తీయకుండా వుండే జీవులు ఈ పుడమి మీద లేనేలేవని చెప్పవచ్చు.

రెండు వృత్తాల్లో 2006

గమ్మత్తు గణితం శీర్షికలో రెండు వృత్తాల్లో 2006 కేలండర్ పరిచయం చేస్తున్నాం. క్రింద రెండు వృత్తాలు గీయబడ్డాయి చూసారుగా. మొదటి వృత్తం 12 సెక్టార్లుగా విభజింపబడి, ఒక్కో సెక్టారు ఒక్కో నెలను సూచిస్తుంది. ఆ నెలకు ఎదురుగా చూపబడ్డ సంఖ్య దాని కోడ్ నెంబర్. రెండో వృత్తం 7 సెక్టార్లుగా విభజింపబడి వారాల్ని సూచిస్తుంది. గమనించండి.

పై రెండు వృత్తాల ద్వారా 2006 కేలండర్ ఎలాగో చూద్దాం. 2006 వ సంవత్సరంలో ఫిబ్రవరి 28 ఏ వారమో చూద్దాం.

మొదటి వృత్తంలో ఫిబ్రవరి నెల కోడ్ 3 దీనికి తేదీ విలువ అనగా 28 కలపాలి. ఇపుడు మొత్తం 31 అయింది కదూ. ఈ మొత్తాన్ని, 7 తో భాగించాలి. శేషం ఎంత వస్తుందో చూసి, దానికెదురుగా రెండో వృత్తంలో సూచించేది వారమన్న మాట. ఇక్కడ మనకు 31 ను 7 తో భాగిస్తే శేషం 3 కాబట్టి 3 కు ఎదురుగా ఉన్న మంగళవారం ఫిబ్రవరి 28.

మరో ఉదాహరణ. డిసెంబరు 10, 2006 డిసెంబరు కోడ్ - 5, తేదీ - 10, మొత్తం - 15

దీనిని 7 తో భాగిస్తే శేషం 1, అంటే 1కి ఎదురుగా ఆదివారం ఉంది కదూ. కాబట్టి 2006, డిసెంబరు 10 వ తేదీ ఆదివారమన్న మాట. మీరు కూడా ట్రై చేస్తారు కదూ.......

పెలికాన్ చెసికాణ్ణి

నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకున్నాం. ఈ సందర్భంగా మనదేశంలో శీతాకాలంలో మాత్రమే పులికాట్ సరస్సుకు వచ్చే ఒక అరుదైన పక్షి గురించి వివరంగా తెలుసుకుందాం. దానిపేరే పెలికాన్. ఇది ప్రాచీన కాలపు పక్షి జాతికి చెందింది. దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి. పొడవాటి ముక్కు, పొట్టితోక, చిన్నకాళ్లు పెద్దరెక్కలు, ముక్కలోని పెద్ద సంచిలాంటివి దీని ప్రత్యేకతలు.

కాలివేళ్ళ మధ్య చర్మం వుండడం వలన భూమిమీద సౌకర్యంగా నడవలేదు. ఈ పెలికాన్ పక్షులు ఎగురుతూ ఉంటే చూడడానికి ఎంతో అందంగా, ఆనందంగా కూడా ఉంటుంది.

ఈ పెలికాన్ పక్షుల్లో అనేక రకాలు జాతులు వున్నాయి. వీటి రంగుల్ని బట్టి వీటికి పేర్లు పెడతారు. గోధుమ రంగు ఫెలికాన్లు మాత్రమే బాగా ఎత్తు నుంచి నీటిలోకి బుడుంగున మునిగి లోతుగా డైవ్ చేసి చేపల్ని పడతాయి. మిగిలిన జాతులు తెల్లగా వుంటాయి. వీటి రెక్కలు పై బాగాన నలుపు లేక గోధుమ రంగు మచ్చలుంటాయి. ఆసియా దేశపు చుక్కల ముక్కు ఎర్రముక్కు జాతి పెలికాన్ లు చిన్నగా వుంటాయి.

పెలికాన్ లు తమలో తాము మన పిల్లల్లాగానే చాలా కలుపుగోలుగా వుంటాయి. ఇవి గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తాయి. గూళ్ళును కలిసే నిర్మించుకుంటాయి. కలిసే చేపలు పట్టుకుంటాయి. వీటిలో ముఖ్యంగా గ్రేట్ వైట్ ఫెలికాన్ లు చాలా నైపుణ్యంగా చేపల్ని పట్టుకుంటాయి. 8 నుంచి 15 ఫెలికాన్స్ ల అర్థవృత్తారంలో గుంపులుగా చేరి ముక్కును నీటిలో ముంచి రెక్కలను విప్పార్చి ముందుకు ఈదుకుంటూ చేపలను పడ్తాయి. ఈ విధంగా నీటిపై ఏర్పడిన నీడల్లోకి చేపలు వచ్చి వాటికి సులభంగా దొరుకుతాయి.

పెద్ద పెలికాన్ లు ఆహారం కోసం చాలా దూరం వెళ్ళి ఆహారాన్ని గొంతులో వుంచుకుని మోసుకొచ్చి చిన్న ఫెలికా న్ లకు పెడతాయి. పెద్దవి నోరు తెరిచినప్పుడు గిన్నె లాగా వున్న క్రింద దవడలోనుంచి ఆహారాన్ని చిన్నవి ముక్కుపెట్టి తీసుకుతింటాయి.

ఇవి స్థిరంగా ఒకే చోట నివసించవు. సామాన్యంగా మధ్యతరహా ఉష్ణ ప్రదేశాలలో నివశిస్తాయి. హంగేరీ ఆసియా ఇరాక్, పర్షియన్ గల్ఫ్ దేశాలలో విస్తారంగా కనిపిస్తాయి. వీటి రెక్కల నిర్మాణం చలినుంచి అంతగా రక్షించలేదు అందుకే శీతాకాలం భారత దేశం, ఆఫ్రికా, ఇరాక్, దేశాలకు వలసవెళ్తుంటాయి.

ఫెలికాన్ గ్రుడ్లు తెలుపు రంగులో వుంటాయి. సాధారణంగా 35 రోజుల్లో గుడ్లు నుంచి పిల్లలు బైటకొస్తాయి. పుట్టినప్పుడు వీటికి చిన్న ఈకలుంటాయి. రెండునెలలకు రెక్కలు బాగా పెరుగుతాయి. నేస్తాలూ... మనమందరం వాటిలోని సుగుణాలన్నింటిని అలవరచుకోవాలి. అందుకే నేను ఫెలికాన్ చెలికాణ్ణి. మరి మీరో......

ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా పనికొస్తాయి

ఈ నాడు మనం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ చెత్తతో సతమతమవుతున్నాం. కాని వీటితో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. చెత్త నుండి ఏరిన ఈ బ్యాగ్స్ ను శుభ్రంగా కడిగి, బాగా ఎండబెట్టి, వాటిని ఒక ప్రెస్సింగ్ యంత్రంలోకి పంపితే. ప్లాస్టిక్ షీట్స్ గా మారుతాయి. ఈ ప్లాస్టిక్ షీట్లను కత్తిరించి, గుడ్డతో జత చేసి, లేడీ బ్యాగ్స్, వాలెట్స్, టేబుల్ మాట్స్, తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ చెత్తకూ మార్కెట్ రాబోతోంది. కాబట్టి కాగితాలేరే వాళ్ళకు భలే ఛాన్స్ దొరికింది.

ప్లాస్టిక్ చెత్తతో రోడ్లు వేయొచ్చుః- ప్లాస్టిక్ చెత్త మన తారు రోడ్ల నిర్మాణంలో చేరుపోనుంది. ప్లాస్టిక్ చెత్తను రోడ్, నిర్మాణంలో వాడటంలో బెంగుళూరు నగరం దేశంలోనే ప్రథమ స్థానంలో వుంది. ప్లాస్టిక్ చెత్తను తారుతో కలపడం వల్ల, రోడ్లు వాటర్ ఫ్రూఫ్ గా మారి వాటి నాణ్యత మరింత పెరుగుతుంది. ప్లాస్టిక్ చెత్తను పౌడర్ గా మార్చి తారుతో కలుపుతున్నారు. ఇది తారుతో సులభంగా కలిసిపోతుంది. 8 శాతం ప్లాస్టిక్ పదార్థం కలపితే, రోడ్డు యొక్క మన్నిక రెట్టింపవుతుంది, ఏమైతేనేం కుళ్లిపోకుండా లక్షల ఏళ్ళుండి మనకు పర్యావరణ సమస్యల సృష్టించే ప్లాస్టిక్ చెత్తకు పరిష్కారం దొరికింది.

అతి పొడవైన మనిషి

మన దేశంలోని ప్రజలు సాధారణంగా 5 నుంచి 6 అడుగుల లోపు పొడవుంటారు. 7 అడుగులా 9 అంగుళాల పొడవున్న చిషన్ గారిని చూచి మనమేమనాలి. ఇతను చైనా దేశస్థుడు. ప్రపంచంలో అతి పొడవైన వ్యక్తి అయిన చిషన్ యింత పొడవు పెరగటానికి వంశ పారంపర్య కారణమని భావిస్తే మాత్రం తప్పే. వీరి తల్లి 5 అడుగుల 3 అంగుళాలు, తండ్రి 5 అడుగుల 11 అంగుళాల పొడవు మాత్రమే వున్నారు, తాత, ముత్తాత లెవరూ పొడవైన వారు కాదు.

వైద్య శాస్త్రం ప్రకారం ఎక్కువ పొడవు పెరగటానికి కారణమైన మెదడులోని పిట్యూటరీ గ్రంధికి సంబంధించిన ట్యూమర్లలాంటివేవికారణం కావని వైద్య బృందం తేల్చి చెప్పేసింది. జన్యువులలో వచ్చిన ఉత్పరివర్తనే దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ లక్షణం వంశపారంపర్యంగా సంక్రమిస్తుందా లేదా తెలుసుకునే అవకాశం మనకు లేకుండా పోయింది. ఎందుకంటే ఇతనికి సరైన జోడీ దొరకలేదు. పొడవు కారణంగానే పెళ్ళి కాలేదు. ఇంట్లో గుమ్మం చాల్లేదు. బయట రిక్షా, ఆటోలాంటివి కూడా వుపయోగించలేని పరిస్థితులలో సాధారణ జీవితానికి కూడా దూరమైనాడు. ఉద్యోగం కూడా దొరకక హోటల్స్ నందు లేదా రెస్టారెంటుల దగ్గర విచిత్ర వేషదారణలు చేస్తూ జీవిస్తున్నాడీ అసాధారణ వ్యక్తి.

నెప్య్టూన్

యురేనస్ ని 1981 లో కనిపెట్టిన తరువాత దాని గురించి శాస్త్రజ్ఞులు అన్ని లెక్కలు వేసుకున్నారు. దాని బరువు, సాంద్రత, వ్యాసం మరియు భూమి కక్ష్యనించి అది ఏ కోణంలో పరిభ్రమిస్తుంది ? అనే విషయాలు చక్కగా లెక్కకట్టారు. కాని 66 ఏళ్ళ తరువాత యురేనస్ తన నిర్ణీత కక్ష్య నుంచి పక్కకు పోతూ కనిపించింది.

శాస్త్రజ్ఞులు తాము వేసిన లెక్క మళ్ళీ సరిచూసుకున్నారు. అంతా సరిపోయింది. అయినా కూడా యురేనస్ ఇలా క్రమ శిక్షణ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తుందీ అని ప్రశ్నించుకొన్నారు. యురేనస్ ప్రపర్తనకు కారణాలు వెతకసాగారు. 1845 లో జాన్ కూబ్ యాడమ్స్ అనే యువకుడు పలానాచోట ఇంకో గ్రహం ఉండవచ్చు అని లెక్కలు వేసి ఆ గ్రహం వల్ల యురేనస్ తన కక్ష్య నుంచి కొంత జరిగి ప్రయాణిస్తుంది. అని నిర్థారించుకొని గ్రీన్ విచ్ అబ్జర్వేటరీకి తెలియచేసాడు.

అదే సమయంలో లెవేరియర్ అనే ఫ్రెంచ్ యువకుడు 1846 లో కొత్త గ్రహం ఉందని బెర్లిన్ యూనివర్శిటీకి తెలియజేశాడు. తరువాత శాస్త్రజ్ఞులు వీరు సూచించిన చోట గ్రహం ఉందని నిర్ధారించారు. తరువాత దానికి పౌరాణిక నామకరణం నెఫ్యూన్ అని పెట్టారు.

నెఫ్యూన్ యురేనస్ కంటే కొద్దిగా చిన్నది. దాని వ్యాసం 43443 కిలోమీటర్లు. తన కక్ష్యకు 29.5 డిగ్రీను ఏటవాలుగా తన చుట్టూ తాను 18 గంటల కొకసారి తిరుగుతున్నది. సూర్యుడి నుండి సగటున 449 కోట్ల కి.మీ. దూరంలో ఉంది. అది 164 సంవత్సరాల 292 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అక్కడ - 200 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణం ఉంటుంది. దీనికి 3 ఉపగ్రహాలు ఉన్నాయి.

టెలివిజన్ - కొన్ని విశేషాలు

టెలివిజన్ అన్న మాటకు సంక్షిప్తరూపం టీ.వి. సమాచార, వినోద సాధనంగా విశేష ఆదరణకు నోచుకుంటోంది. అందుకని టీ.వి. (సేల్)లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలను చిన్నారులకై దిగువ అందిస్తున్నాం.

టీ.వి. సైజుః 16 (అంగుళాలు) టీ.వి, 21 అంగుళాలు టీ.వి లేదా 36 అంగుళాలు టీ.వి అనే మాటలను మీరు వినే వుంటారు. ఇంతకూ ఈ కొలత టీ.వి తెర పొడవును తెలుపుతుందా లేక వెడల్పును (ఎత్తుని) తెలుపుతుందా అని అడిగితే పొడవుని అని చాలా మంది టక్కున జవాబిస్తారు.

కాని నిజానికి ఇది పొడవున తెలుపదు, వెడల్పునీ తెలుపదు. టీ.వి. తెర యొక్క కర్ణాన్ని తెలుపుతుంది. అంటే టీ.వి. తెరలో పిక్చర్ కన్పించే భాగంలో కింది భాగంలోని ఓ మూలనుంచి, పై భాగంలో సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో వుండే మరో మూల దాకా వుండే దూరాన్నే టీ.వి. సైజుగా పేర్కొంటారు.

టీ.వి. లు 5 అంగుళాలు మొదలుకొని 64 అంగుళాలు, ఇంకా అంతకు పైబడిన సైజుల్లో కూడా లభిస్తాయి. చాలా మంది, టీ.వి. లు ఎంత పెద్దగా వుంటే అంత మంచిది అని అనుకుంటారు. కాని అది సరైన అభిప్రాయం కాదు. ఎందుకంటే మన గది చిన్నగా వుండి, దాంట్లోని టీ.వి. మాత్రం పెద్దగా వుండే చూడ్డానికి ఎబ్బెట్టుగా వుండడమే గాక, ఇబ్బందికరంగా కూడా వుంటుంది. అందుకే మనం వాడాల్సిన టీ.వి. తాలూకూ సైజు అనేదాన్ని ప్రధానంగా 2 అంశాల ఆధారంగా నిర్ణయించుకోవాలి.

  1. మన గది పరిమాణం.
  2. టీ.వి. దాన్ని మనం చూసే ప్రదేశానికి మధ్య వుండే దూరం.

ఇందులో మొదటిదాన్ని మనం మార్చలేము. రెండోదాన్ని మాత్రం మన వీలుని బట్టి ఒక పరిమితి దాకా మార్చుకోగలము.

ఎంత దూరం నుంచి చూడాలి ?

కొంత మంది టీ.వీ, ముందే, దాని మూతిలో మూతి పెట్టినట్లుగా కూర్చుని తమ కిష్టమైన కార్యక్రమాలను చూస్తుంటారు. అది సరైన పద్దతి కాదు. పైగా అలాంటివారు టీవి. చూసే ఆనందాన్ని కూడా పూర్తిగా పొందలేరు. టీ.వి.ని కనీసం ఒక ఏడెనిమిది అడుగుల దూరం నుంచి చూడాలని ఆరోగ్యవేత్తలు మరీమరీ చెబుతున్నారు. ఎంత లేదన్నా కనీసం ఒక అడుగు దూరంలోనైనా కూర్చోవాలి. తెరసైజు పెరిగితే మీరు కూర్చునే దూరాన్ని కూడా మరింతగా పెంచాల్సివుంటుంది. దీనికి సంబంధించిన ఒక చక్కటి సూత్రం కూడా వుంది.

మీ టీవి. సైజుని 4 తో భాగిస్తే వచ్చే జవాబు ఎంతో, మీరు టీవికి కనీసం అంత దూరంలో కూర్చోవలసి వుంటుంది. ఉదాహరణకు మీ టీవి సైజు 36 అంగులాలయితే 36 /4 =9 అడుగుల దూరంలో మీరు కూర్చోవాలన్న మాట. దీనిని బట్టి ప్రస్తుతం మీరు టీ.వి.ని చూస్తున్న దూరం సరైనదో కాదో లెక్కగట్టండి. ఒకవేళ ఆ దూరం సైరనది కాకపోతే వెంటనే తగిన దూరానికి మీ కుర్చీని లేక సోపాని మార్చుకోండి. సాధారణ మరియు కేబుల్ టీ.వి ప్రసారాలను గాక డీ.విడీలు, డిటిహెచ్ ప్రసారాలు వంటివి చూస్తున్నప్పుడు ఈ దూరాన్ని కాస్త తగ్గించుకోవచ్చు.

రిజొల్యూషన్ అంటే....
టీ.వి.కి సంబంధించిన రెజొల్యూషన్ ఎంత ఎక్కువగా వుంటే అందులో కన్పించే పిక్చర్ (చిత్రం) నాణ్యత కూడా అంత మెరుగ్గా వుంటుంది. టీ.వి తెరపై మనకు కన్పించే ప్రతి చిత్రం అనేక వేల చిన్న చిన్న రంగురంగుల చుక్కలతో రూపొందుతుంది. ఈ చుక్కలను పిక్సల్స్ అని అంటారు. టీ.వి తెరపై మనకు కల్పించే పిక్చర్ లో ఒక చదరపు అంగుళానికి ఎన్ని పిక్సల్స్ వుంటాయో తెలియజేసే దానినే ఆ టీ.వి.కి సంబంధించిన రిజొల్యూషన్ గా పేర్కొంటారు. పిక్చర్ లో పిక్సల్స్ సంఖ్య ఎంత ఎక్కువగా వుంటే రిజొల్యూషన్ ఎంత అధికంగా వుంటే పిక్చర్ నాణ్యత అంత మెరుగ్గా వుంటుంది.

ఒక చదరపు అంగుళపు పిక్చర్ లో అడ్డంగా కన్పించే పిక్సల్స్ మరియు నిలువుగా కన్పించే పిక్సల్స్ యొక్క లబ్దంగా రెజల్యూషన్ ని పేర్కొంటారు. ఉదాహరణకు ఒక టీవి 1280/720 రెజల్యూషన్ కలిగి వుందంటే దాని అర్థం ఆ టీ.వీ.లో తెరపై ప్రతి చదరపు అంగుళంలోనూ అడ్డంగా 1280 పిక్సల్స్, నిలువుగా 720 పిక్సల్స్ దర్శనమిస్తాయి. అత్యంత ఆధునికమైన హైడెఫినిషన్ టెలివిజన్ (H.D.T.V) వంటివి 1920 / 1080 లైన్ల అత్యధిక రిజొల్యూషన్ కలిగివుంటాయి.

అదే పనిగా చూస్తే...
టీవి.ని గంటల తరబడి అదే పనిగా చూడటం, కనురెప్పలు కూడా వాల్చకుండా గుడ్లగూబలాగా అలా చూస్తూ ఉండిపోవటం ఎవరికీ మంచిది కాదు. దాని వల్ల కళ్ళకు హాని జరగడమేగాక, మెదడు కూడా ఒక మేరకు స్తబ్ధంగా మారిపోతుంది. టీవిని చూసే విషయంలో ఎవరైనా సరే విధిగా ఈ కింది సూత్రాలను పాటించడం వలన కంటికి, వంటికి, మంచిది.

  • ఏ పనీ లేకపోయినప్పటికీ రోజంతా టీవిని చూస్తూ గడపకండి. ఓ గంటో రెండు గంటలో టీవి.ని చూసి ఆ తరువాత ఏదైనా ఇతర వ్యాపకంలోకి మారిపొండి.
  • టీవిని చూసే సమయంలో మీ కనురెప్పలు కొట్టుకుంటున్నాయో లేదో గమనించండి. కనీసం నాలుగైదు సెకన్లకి ఒకసారైనా అవి కొట్టుకోవాలి.. కొందరు నిమిషాల తరబడి కనురెప్పలు వాల్చకుండానే టీవిని చూస్తుంటారు. మీ విషయంలో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొండి.
  • టీవి. చూస్తున్నప్పుడు మధ్యమధ్యలో చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. కనీసం పావుగంటకు ఒకసారైన మీ దృష్టిలో టీవిపై నుంచి వేరే వాటి మీదకు మళ్ళించండి.
  • టీ.వీ. మరీ దగ్గర నుంచి ఎప్పుడూ చూడకండి.
  • చీకటి గదిలో టీవిని చూడకండి. టీవిని చూసేగదిలో తగినంత కాంతి వుండాలి.
  • టీవిలో ప్రసారమయే సినిమాలు, సీరియళ్ళలోనూ మీకు విపరీతంగా కన్పించే పగ, ద్వేషం, హింస, ప్రేమలు, ప్రతీకారాలు, వెలికిచేష్టలు, పరులను పీడించడం వంటి అంశాలను మననం చేసుకోవడంగానీ, వాటిని అనుకరించడంగాని చేయకండి. అది మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది.
  • టీవి ప్రోగ్రాంలకు మన జీవితానికి మధ్య ఎన్నో తేడాలుంటాయి. మీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ రెంటికీ మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా గుర్చించండి.
ప్లూటో నీకథేమిటో

పిల్లలూ మన సౌరమండలంలో సూర్యుని చుట్టూ 9 గ్రాహాలు ( ఈ మధ్య కనుగొన్న దశను గ్రహం కాకుండా), ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు అనేకం తిరుగుతున్నాయని మీకు తెలుసు. మన నవగ్రహాల్లో అత్యంత అంచున ఉన్నది ఫ్లూటో గ్రహం. ఇంతవరకు మావన నిర్మితమైన ఏ సాధనమూ దాని ఉపరితలానికి చేరలేదు. 1930 సో అమెరికా ఖగోళ శాస్త్రజ్ఞుడు క్లైడ్ టొంబా దీనిని కనుగొన్నాడు.

అంతకు ముందే లోవెల్, పిక్కెరింగ్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు దీని ఉనికిని శాస్త్రీయ ఆధారాలతో ఊహించారు. 1978 లో జేమ్స్ క్రిష్టి, రాబర్ట్ హోరింగ్ టన్ లు ఫ్లూటో కున్న ఉపగ్రహాన్ని కనిపెట్టాడు. దీనికి చారన్ అని పేరుకూడా పెట్టారు. సూర్యుడికి దాదాపు 590 కోట్ల కిలోమీటర్ల సగటు దూరంలో (షుమారు 40 `a.u)ఉన్న ఫ్లూటో మీద సగటు ఉష్ణోగ్రత షుమారు -230ºC షుమారు 43 K) ఉంటుంది. దీని వ్యాసార్థం కేవలం 1151 కిలోమీటర్లు మాత్రమే... ద్రవ్యరాశి 1.2x1022 కి.గ్రా. అంటే భూమి ద్రవ్యరాశిలో 500 వ వంతు. దీని సగటు వయసుకాలం (అంటే తనచుట్టు తాను ఒకసారి తిరగడానికి పట్టేకాలం) మన భూమి పరంగా చూస్తే షుమారు 6 ½ రోజులు. తమాషా ఏమిటంటే ఫ్లూటో ఉపగ్రహం పరిభ్రమణ కాలం కూడా షుమారు 6 ½ రోజులే అంటే అర్ధ మేమిటో ఊహించారా ఫ్లూటో మీద సగభాగం నుంచి చూస్తే దాని ఉపగ్రహం ( దాని చంద్రుడు) ఎప్పుడూ కనిపించడు. అంటే వెన్నెలంటూ వుంటే, సగ భాగంలో నిత్యవెన్నెల, రో సగ భాగంలో నిత్య అమావాస్య. ఫ్లూటో ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టేకాలం ఎంతో తెలుసా... షుమారు 248 సంవత్సరాలు అంటే మన భూమికి ఒక సంవత్సరం పడితే దానికి 245 సంవత్సరాలు పడుతుంది.

అంటే అది ఒక రౌండ్ తిరిగేలోగానే భూమిమీద శతాబ్ధాలు దొర్లుతాయి. ఇంతవరకూ ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నామో తెలుసా... పోయిన నెల (జనవరి)17వ తేదీన ఫ్లూటో మీదకు అమెరికా వాళ్ళ NASA (National Aeronautical & Space Agency) సంస్థ న్యూ హోరై

జాన్స్ ఫ్లూటో (New HoriZon’s Pluto) అనే వ్యోమనౌక (Space Probe) ను పంపింది. ఫ్లూటో మీదకు పరిశోధన నిమిత్తము పంపుబడుతున్న తొలి ప్రయత్నము ఇదే. దీని పనల్లా ఫ్లూటో ఉపరితలాన్ని భాగా పరిశోధించడం. దాని చందమామ సంగతి గమనించడం ఆ తదుపరి సౌరమండలంలో ఫూటో ఆవల వున్న కూపర్ పట్టీ (Kuiper Belt) ని పసిగట్టడం.

2006 సంవత్సర ఆరంభంలో బయలుదేరిన న్యూహోరైజాన్స్ ఫ్లూటో నౌక ఫ్లూటోను ఎప్పుడు చేరుకుంటుందో తెలుసు... 2015 సంవత్సరానికి. అంటే ఆ పాటికి మీరు ఉన్నత చదువులు కూడా ముగించి వుంటారు. అలాగని చాల నెమ్మదిగా వెళుతున్నదని భావించకండి. మనకు షుమారు 39 au (Austronamial Units) దూరంలో వున్న ఫ్లూటోను చేరడానికి షుమారు 9 సంవత్సరాలు పడితే దాని వేగం గంటకు సగటున ఎంతో మీరే లెక్కవేయండి. ఈ పరిశోధనకు అయ్యేఖర్చు సుమారు 3,500 కోట్ల రూపాయలు.

పరీక్షలకు ప్రయాణం

కొత్త సంవత్సరం వచ్చిందంటే సంవత్సరాంతపు పరీక్షలకు సన్నిద్ధమయే విద్యార్ధులే నిజమైన విద్యార్థులు. విద్యార్థి అంటే విద్యను అర్దించే వారని అర్థం. ముఖ్యంగా 7 మరయు 10 తరగతుల విద్యార్థులు, తెలివైన పాత విద్యార్థుల పుస్తకాలను అనుసరిస్తూ టీచర్ల లీజర్ అవర్స్ లో కలిసి సందేహాలను పోగొట్టుకోవాలి. రాత్రి 11 గంటల ముందు, తెల్లవారు ఝామున 5 గంటల పై బడి నిద్రపోకుండా ప్రిపేరవ్వాలి.

గణితం విషయంలో ప్రతీ లెక్క అధ్యాపకుడే చెప్పాలి అని అనుకోకుండా సొంతంగా లెక్కలు చేయడానికి ప్రయత్నించాలి. చాలా లెక్కలు స్వయంగా చేసుకునే విధంగానే వున్నాయి. అలాగే సోషల్ స్టడీస్, సైన్సు పుస్తకాల్లో ముందుగా టెక్స్ పుస్తకాన్ని చదవడం ద్వారా పూర్తి అవగాహన పొంది సొంతంగా సమాధానాలు తయారు చేసుకోవాలి. దీనివల్ల ఒక్కమార్కు ప్రశ్నలు చక్కగా ఆన్సర్ చేయగల్గుతారు. పైగా నోట్సు మీరే తయారు చేసుకుంటే ఎక్కువ సార్లు చదవకుండానే ఆన్సర్ గుర్తుంటుంది.

మంచి స్నేహితులొకరితో కలిసి సాయం సమయంలో మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఒకరు చదివితే మరొకరు విని తరువాత ఒకరికొకరు జవాబులు చెప్పుకోండి. ఇంపార్టెంట్ ప్రశ్నలు అనుకుంటూ చదవడం నష్టదాయకం. అన్ని ప్రశ్నలూ నేర్చుకుని పూర్తి పరిజ్ఞానంతో పరీక్షకెళ్లడం ఉత్తమలక్షణం. ఇంపార్టెంట్ అనుకున్నవాటిని మరొకసారి అదనంగా చదవండి. పాత పరీక్షా పత్రాలు సంపాదించి సమయం ప్రకారం మీకు మీరే పరీక్ష పెట్టుకోండి. చూచి వ్రాయడం ఎప్పుడైనా ఉపయోగపడినట్టు కనబడినా ఎక్కువ సందర్భాలలో చెడు నల్లని ముద్రపడుతుంది. కాపీ కొట్టడమనేదు. నెగిటీవ్ లేని ఫోటోగ్రాఫ్ వంటిది. అది అప్పటికి మాత్రమే పనికివస్తుంది. అదీ పట్టుపడకపోతే. నీవు స్వయంగా నేర్చుకొని నిజాయితీతో రాసినది నెగటివ్ వున్న ఫోటోగ్రాఫ్ వంటిది. నెగిటివ్ వుంటే నీవు ఎన్ని ప్రింట్లయినా తీసుకోవచ్చు. అంటే ఎన్ని రకానైన పరీక్షలైనా రాయవచ్చు.

జవాబుల్ని పాయింట్లుగా చూపుతూ అన్సర్ చేయడం వలన పేపరు దిద్దేవారికి మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఆన్సర్ పేపర్ వీలయినంత నీట్ గా వుంచడం మంచిది. ఇప్పటి వరకు కాలం వృధాచేసిన వారైనా ఇప్పట్నుంచి శ్రద్దగా చదివితే విజయం సాధించడం ఖాయం. కృషితో నాస్తి దుర్బిక్షం.

ఆస్బెస్టాస్ ధూళి - ప్రాణాలకు హాని

పర్యావరణం ప్రపంచ వ్యాప్త సమస్యగా మారిపోతున్న తరుణంలో మనం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నాం. ప్లాస్టిక్ ఉత్పత్తులు తగ్గించి, ప్రత్యామ్నాయ వలుసలకోసం అనేక దేశాలు అన్వేషిస్తుంటే మనం మాత్రం ప్లాస్టిక్ వాడకాలు పెంచుకుంటూ పోతున్నాం. అత్యంత విషపూరితమైన పి.వి.సి. కర్మాగారాలకు స్వాగతం పలుకుతున్నాం. విదేశాల్లో నిషేధించబడ్డ, డి.డి.టి మాలాథియాన్, సైపర్ మీథేన్ లాంటి విషపదార్థాలను మన రైతులు యధేచ్ఛగా వాడుతున్నారు.

మన పర్యావరణ చట్టాలు, మన పాలకులకున్న పర్యావరణ స్పృహ, ప్రజారోగ్యం పట్ల వారి ఉదాసీనతను తెలిపే ఒకానొక సంఘటన ఇటీవల జరిగింది.
ఎవరైనా పక్కింటివారు మన ఇంట్లో చెత్తపోస్తే ఏంచేస్తాం ? పళ్ళురాలగొడతాం. అవునా కాని ఎక్కడో యూరప్ ఖండంలోని ఫ్రాన్సుదేశానికి చెందిన ఒక యుద్ద విమాన వాహకనౌక. 500 టన్నల ఆస్పెస్టాస్ వ్యర్ధ్యాలతో భారత్ కు బయలుదేరింది.

ఈ నౌకపేరు “క్లెమెన్ స్యూ” R.F.S. అనే సైన్సు పరిశోధనా సంస్థ. దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వాజ్యంపై జనవరి 16వ విచారణ సుప్రీకోర్టు ఆ విషపు నోకను అనుమతించరాదని పేర్కొంది.

ఆస్బెస్టాస్ (రాతినార) పైఎందుకీ ఆందోళన ? ఆస్బెస్టాస్ పోగులతో కూడిన ఖనిజం. ఈనారల్ని ఒకసారి పీల్చుకొంటే అవి ఇక బయటికిరావు. ఊపిరిత్తుల్లో చేరిపోతాయి. వాటి చుట్టూ కణజాలం పెరుగుతుంది. చివరికి అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీసి ప్రాణాంతకంగా మారుతుంది. ఇండ్లపై కప్పులు, ఎలక్రిక్ ఫిటింగులు, డ్రైనేజ్, ఇరిగేషన్ పంపులకు ఆస్బెస్టాస్ ను వాడటం వల్ల మనదేశంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజానీకం, ఆస్వస్థతకు మరణాలకు గురవుతున్నారని శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఫ్రాన్సు కూడా మన నెత్తిమీద రాతినారగుట్టలు పోయడం గోరుచుట్టుపై రోకటి పోటుకాదా ?

క్లెమిన్ స్యూ ఇంత విషపూరిత నౌక కాబట్టి దీనిని తమ నౌకాశ్రయాలకు రానివ్యడానికి, టర్కీ. గ్రీస్, ఈజిప్టు, చైనా నిరాకరించాయి. చివరగా ఫ్రాన్స్ వారికి, వ్యర్థ పదార్థాల కుప్పుతొట్టిగా మన దేశం మనదేశం కనిపించింది. అసలు అన్నిరకాల ఆస్బెస్టాస్ ఫైబర్ ఉపయోగాన్ని తయారీని ఫ్రాన్స్ 1997 లో నిషేధించింది. సాధారణ ప్రజల మధ్య ఆస్బెస్టాస్ ను సురక్షింతంగా ఉపయోగించడం అసాధ్యం ప్రజారోగ్య పరిరక్షణ దృష్యా ఆస్బెస్టాస్ ను నిషేధించామన్న వాదనతో డబ్యూ. టి. ఓ కూడా ఏకీభవించింది.

ప్రజారోగ్య పరిరక్షణ భారత్ కు అవసరం లేదా ? మన దేశంలో పర్యావరణ చట్టాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి. వీటితో ఆస్బెస్టాస్ ఉత్పత్తులను, వ్యర్ధాలను భారత ప్రభుత్వం అడ్డుకోవచ్చు. “కానీ క్లెమెన్ స్యూ”విషయంలో ఇది వాణిజ్య ఒప్పందంలో భాగమంటూ మన పర్యావరణ మంత్రిత్వశాఖ చేతులెత్తేయడం. పాలకులు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారడానికి నిదర్శనం. చివరికి సుప్రీంకోర్టే శరణ్యమయింది. ప్రజాసంక్షేమాన్ని కోరిన సర్వోన్నత న్యాయస్థానం మాటల్లో చెప్పాలంటే పర్వావరణం కలుషితం కావడాన్ని అంగీకరించం. నౌకను తమ భూభాగంలో విచ్ఛేదం చేయడానికి ఫ్రెంచి ప్రభుత్వమే అంగీకరించనప్పుడు ఆ నౌక భారత్ రావడానికి మనం మాత్రం ఎందుకు అనుమతించాలి ? నౌకవిచ్చేదం కాలుష్యానికి దారితీస్తుందా లేదా అన్నది అనవసరం అంటూ తీర్పునిచ్చింది.

బాలలూ ఈ తీర్పుఅమలు కావాలన్నా సరే పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఉద్యమించాలి. ప్రజల్లో పర్యావరణం పట్ల సరైన అవగాహన పెంపొందించాలి. లేకపోతే, మనదేశం ప్రపంచ దేశాల వ్యర్థపదార్థాలకు కుప్పతొట్టిగా మారే ప్రమాదముంది.

మనం ఒక జీవిత కాలం జీవిస్తే, మన కళ్ళు రెండు జీవితకాలాలు జీవిస్తాయి....
సి.హెచ్. ఆనంద్, నెల్లూరు,

నేత్ర సహాయం అంటే ఏమిటో మీకు తెలుసా ? అది తెలుసుకునే ముందు మన దేశంలో ఉన్న అంధుల ( చూపు లేని వారు) సంఖ్య ప్రపంచం మొత్తం మీద ఉన్న అంధుల సంఖ్యలో మూడవ వంతు అని మీరు తెలుసుకోవాలి. అంధత్వం అనేది మనిషికి అన్నిటి కన్నా ఇబ్బంది కరమైన అంగవైకల్యం. మనం చిన్నప్పుటి నుంచి చాలా విషయాలు చూచి తెలుసుకుంటాం. కాని అంధులకు ఆ అవకాశం లేనందు వల్ల చాలా విషయాలు తెలుసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. నేత్ర సహాయం అంటే చూపులేనివారికి మన కళ్ళు ఇచ్చి వారికి చూపు తెప్పించే ప్రక్రియ అని అర్థం. మన కళ్ళు వాళ్ళకిస్తే మరి మనకెట్లా ?

అని మీకు అనుమానం ఈ పాటికి వచ్చి ఉంటుంది. అవునా ? సరే ఇప్పుడు మనం ఈ నేత్ర సహాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంధత్వం అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. కొంత మంది పుట్టుకతో గుడ్డివారైతే, కొంత మంది అనేక కారణాల వల్ల మధ్యలో గుడ్డివారౌతారు. నేత్ర సహాయం ద్వారా అందరికీ చూపుతెప్పించే వీలులేదు. కంటిలో కార్నియా అనే పొర చెడిపోవడం వల్ల కొందరు గుడ్డివారౌతారు. వారిని కార్నియా అంధులు అంటారు. అద్దం ముందు నిలబడి మీ కళ్ళ నొకసారి అద్దంలో చూసుకొండి. కనుగుడ్డు ముందు భాగంలో గుండ్రం నల్లగా ఉండే భాగం (నల్లగుడ్డు) కనిపిస్తుంది. దీనిపై భాగాన అదే సైజులో ఒక పారదర్శక పొర ఉంటుంది.

దీన్నే కార్నియా అంటారు. కార్నియా అంధులకు శస్త్రచికిత్స చేసి ఈ పొరను అమర్చి చూపు తెప్పించ వచ్చు. ఇలా కార్నియా చెడిపోయి.అంధులైనవారు మన దేశంలో మూజు కోట్ల మంది వున్నారు. ఈ మూడు కోట్ల మందికి మనం నేత్ర సహాయం ద్వారా చూపు తెప్పించవచ్చు. మూడు కోట్ల మంది అంటే అదేం చిన్న సంఖ్య కాదు. ప్రపంచంలో చాలా దేశాల మొత్తం జనాభా కన్నా అది ఎక్కువే.

నేత్ర సహాయం మనం చనిపోయిన తరువాత మాత్రమే జరుగుతుంది. మనిషి చనిపోయిన 6 గంటలలోపు నేత్రాలను సేకరిస్తారు. మనిషి చనిపోయిన తరువాత 6 గంటలలోపు భద్రపరిస్తే 72 గంటల దాకా అవి బతికే ఉంటాయి. ఈ 72 గంటల లోపు అంధుడికి అమరిస్తే అవి ఆ వ్యక్తి బ్రతికినంతకాలం బ్రతికే ఉంటాయి. ఇలా మనం చనిపోయిన తరువాత మన కళ్ళను మట్టిలో కలిసిపోనీకుండా లేక మంటల్లో కాలిపోలీకుండా వేరేవాళ్ళకి ఇస్తే వాళ్ళకు చూపూవస్తుంది. మన కళ్ళు ఇంకో జీవితకాలం బ్రతికే వుంటాయి. తొలగించిన కళ్ళను నేత్ర నిధికి తరలించి. అక్కడ కార్నియా అంధులకు కళ్ళను శస్త్ర చికిత్స ద్వారా అమరుస్తారు. అప్పుడు వారికి వెంటనే చూపు వస్తుంది. ఈ రోజు 3 కోట్, భారతీయులు ఎవరైనా దయగల్గినవారు తమ కళ్ళను దానం (సహాయం) చేయకపోతారా... అని వేచి చూస్తున్నారు. మనకు ఆ విషయం తెలియక మన బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని పూడ్చిపెట్టోలేక కాల్చివేసో ఆ విలువైన కళ్ళను మసిచేస్తున్నాం. మనదేశంలో ప్రతి రెండు సెంకడ్లకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. చనిపోయిన ప్రతివ్యక్తి గనక నేత్ర సహాయం చేస్తే 6 కోట్ల సెకండ్లలో భారతదేశంలో కార్నియా అంధులందరికి చూపు తెప్పించవచ్చు. ప్రపంచంలో కార్నియా అంధులు లేని దేశం శ్రీలంక. ప్రతిరోజు శ్రీలంక నించి మన దేశానికి 5 జతల కళ్ళు విమానంలో వస్తాయి. అలాగే ప్రతిరోజు వేరే దేశాలకు కూడా వాళ్ళ కళ్ళు పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ నేత్ర సహాయం ప్రతి ఒక్కరూ చేస్తారు.

కొంత మందికి కళ్ళద్దాలు ఉంటాయి. కొందరికి కళ్ళల్లో శుక్లాలు ఉంటాయి. ఇంకొందరికి ఇంకేవో కంటి జబ్బులుంటాయి. వాళ్ళు కూడా నేత్ర సహాయం చేయవచ్చు. కార్నియా ఆరోగ్యంగా ఉండి ఇంకే కంటి జబ్బు ఉన్నా కూడా నేత్ర సహాయానికి అర్హులే....

మన రాష్ట్రంలో సరోజినీదేవి కంటి వైద్యశాల యల్.వి. ప్రసాద్ ఐ ఇన్టిట్యూట్ లో నేత్ర నిధులు ఉన్నాయి. విజయవాడలో కూడా నేత్ర నిధి ఉంది. ఇంకొన్ని జిల్లాల్లో త్వరలో నేత్ర నిధులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నెల్లూరులో నెల్లూరు నేత్రదాతల సంస్థ ఉంది. ఈ సంస్థలో నేత్ర సహాయం చేయదలచుకొన్నవారు సభ్యులౌతారు. ఇలా నేత్ర సహాయాభిలాషకులు ఒక సంస్థగా ఏర్పడడం దేశంలో ఇదే మొదటిది. వీరు 80 జతలకు పైగా నేత్రాలను సేకరించారు. నెల్లూరులో మీ బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు మీకు నేత్ర సహాయం చేయాలనిపిస్తే 9849877163 – 2325125 నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నేత్ర సేకరణ నిర్వహిస్తారు. జరపాలి. కాబట్టి చనిపోయిన వెంటనే తెలియపరిస్తే ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. హైదరాబాదులో వారు సరోజినీదేవి కంటి వైద్యశాల యల్.వి. ప్రసాద్ ఐ ఇన్టిట్యూషన్ గాని ఫోన్ చెయ్యవచ్చు.

పిల్లలూ మీలో ప్రతి ఒక్కరూ దాగుడు మూతలు ఆట ఆడే ఉంటారు గదూ.... నేత్ర సహాయం గురించి చదివాక మీరు కళ్ళకు గంతలు కట్టుకొని మీ ఇంట్లోని వస్తువులు, పెన్నులు, బట్టలు లాంటి వాటిని, వాటి రంగులను కనుక్కోగలరేమో ప్రయత్నించండి. మీరు ప్రతిరోజూ చూసే వస్తువులే అయినప్పటికి కష్టంగా ఉంటుంది. గదూ... అంధులకు జీవితాంతం ఇలాగే ఉంటుంది.

ఒక్కసారి కళ్ళు మూసుకొని పది అడుగులు నడిచే ప్రయత్నం చేయండి మీకే తెలుస్తుంది. అంధత్వం అంటే ఏమిటో... మరి అంధులు జీవితాంతం అంధకారంలో ఎలా ఉంటున్నారో ఊహించుకోండి. అలాంటివారి కోసం చనిపోయిన తరువాత కళ్ళు ఇవ్వడం పెద్ద త్యాగం ఏమి కాదు. కదా..... మీరంతా నేత్ర సహాయకులుగా మారతారని తలుస్తూ, మీపెద్ద వాళ్ళతో పై విషయం చర్చిస్తారని ఆశిస్తాం.

నేత్రదానం పై సవరణలు
మార్చినెల సంచికలో ప్రచురించిన మనం ఒక జీవితకాలం జీవిస్తే మన కళ్ళు రెండు జీవితకాలాలు జీవిస్తాయి. అని CH. ఆనంద్ రాసిన వ్యాసంలో ప్రస్తావించిన కొన్ని అంసాలకు సపరణ అవసరం అని పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పెన్మెత్స సుబ్బరాజుగారు రాసారు. వారు ప్రస్తావించిన అంశాలు ఇక్కడ ప్రచురిస్తున్నాము.

  1. మన దేశంలో కార్నియా అంధుల సంఖ్య మూడు కోట్లు కాదు. అన్ని రకాల అంధత్వంతోనూ బాధపడుతున్నవారి సంఖ్యే ఒక కోటి పాతిక లక్షలు అందులో కార్నియా అందుల సంఖ్య పాతిక నుంచి ముఫ్ఫై లక్షల మంది మాత్రమే.
  2. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో మరణానంతరం 6 గంటలోపే నేత్రసేకరణ జరపడం మంచిది. అదే వేసవికాలంలోనైతే 4 గంటలలోపే సేకరించటం ఉత్తమం. వాతావరణం చల్లగా వున్నరోజుల్లో 8 గంటల లోపు సేకరణ జరిపినా పరవాలేదు. మరణానంతరం ఆరు గంటల వరకు కళ్ళు బ్రతికే వుంటాయని ఆ తరువాత మరణిస్తాయని చెప్పడం సరికాదు.
  3. మన దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు, అనడం నిజంకాదు. ఐ బ్యాంక్ అసోసియోషన్ ఆఫ్ ఇండియా వారి అంచనా ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా 80 నుంచి 90 లక్షల మంది మాత్రమే మరణిస్తున్నారు.
  4. శ్రీలంకలో ప్రతి ఒక్కరూ నేత్రదానం చేస్తారనడం వాస్తవం కాదు. అక్కడ రెండు కోట్ల జనాభా ఉండి ఏడాదికి 15 నుంచి 18 లక్షల మంది మరణిస్తుంటే సుమారు 15 వేల నుంచి 30 వేల కార్నియాల వరకు సేకరిస్తున్నారు. మన రాష్ట్ర జనాభాలో నాలుగోవంతు కలిగివుండి మన దేశం మొత్తం మీద సేకరించే నేత్రాలకంటే అధికంగా అక్కడ సేకరిస్తున్న మాట వాస్తవం.
  5. మన రాష్ట్రంలో హైదరాబాదు మరియు విజయవాడలో మాత్రమే నేత్రనిధులు ఉన్నట్లు రాశారు. కానీ నిజానికి ఐ బ్యాంక్ లేదా ఐ డొనేషన్ సెంటర్లు లేని జిల్లా మన రాష్ట్రంలో లేదు. రాష్ట్ర మొత్తం మీద నేత్ర సేకరణ జరిపే సంస్థలు నలభై వరకు వున్నాయి. కాకపోతే ఆశించిన స్థాయిలో నేత్ర సేకరణ జరుపుతున్న సంస్థలు 10 లోపే వున్నాయి. ప్రభుత్వం కొత్త నేత్రనిధుల స్తాపనకు ప్రయత్నిస్తున్న సూచనలు లేవు. వున్నవాటిల్లోనే కొన్ని మూసివేతకు దగ్గరవుతున్నాయి.
  6. The Maharastra Society for the Donation of eyes అనే సంస్థను కొందరు 1965 లోనే స్థాపించారు. అలా చూసినప్పుడు, నెల్లూరు నేత్రదాతల సంస్థ కన్నా ముందే పై సంస్థ స్థాపించారని అర్థమవుతుంది.
భాస్వర లీలలు
పి. జగదీశ్వర్, నల్లొండ జిల్లా.

అదొక పల్లెటూరు, ఆ ఊర్లో అక్షరాస్యుల సంఖ్య బహు తక్కువ. ఓ రోజు ఒక సన్యాసి ఆ ఊరికి విచ్చేసి గ్రామం నడిబొడ్డు వద్ద తిష్ఠవేసినాడు. అతన్ని దర్శించడానికి వచ్చిన ప్రజలతో తాను ఎంతో మహిమగల వాడినని తన మంత్ర శక్తులతో ఎలాంటి రోగాలనయినా నయం చేయగలవని ప్రజల కష్టాలను చూపి వారికి సుఖ శాంతులను ప్రసాదించడానికే వచ్చానని చెప్పసాగాడు.

ఎవరైనా వచ్చి తమ కష్టాల్ని చెప్పుకుంటే కాసేపు కళ్ళు మూసికొని ఏదో మంత్రం ఉచ్చరిస్తున్నట్లు చేసి గట్టిగా ఉమ్మివేసేవాడు. అయితే విచిత్రంగా ఆ ఉమ్మిలోంచి మంటలు పుట్టుకొచ్చాయి. అంటే నీ పాపాలన్నీ ఈ రోజు నువ్వు నన్ను దర్శించడంవల్ల కాలిపోయాయి. ఇకనుండి నీవు సుఖశాంతులతో జీవిస్తూ తనువు చాలించి స్వర్గానికి వెళుతావు అని చెప్పివాళ్ళు తెచ్చిన ముడుపులు తీసుకునేవాడు. ఉమ్మిలోంచి మంటలు పుట్టిస్తున్నాడు. కాబట్టి అతను చాలా మహిమగలవాడేనని ప్రజలంతా విశ్వసించారు. సన్యాసి మహిమలు ఆ ఊర్లోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాగా పాకిపోయాయి. అతన్నిదర్శించడానికి జనం తండోపతండాలుగా రాసాగారు. అలా ఆ సన్యాసి ప్రజల వద్ద నుండి ఎంతో గడించసాగాడు.

మోహన్ వేసవి సెలవుల్లో తమ బాబాయి గారింట్లో గడపడానికి ఆ ఊరు వచ్చాడు. సన్యాసి గురించి మహిమల గురించి మోహన్ చెవినపడింది. చూద్దామని మోహన్ సన్యాసి ఉండే చోటుకు బయల్దేరాడు. అతనక్కడికి వెళ్ళేసరికి సన్యాసి ముందు జనం గుంపులుగా ఉన్నారు. మోహన్ జనాన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళాడు. సన్యాసికి ఎవరైనా తమ బాధల్ని చెప్పగానే ఏదో జపిస్తున్నట్లు చేసి ఉమ్మి వేయసాగాడు. అందులోంచి మంటలు రాగానే మీ బాధలు ఇక నుండి తొలిగిపోతాయి. అని చెప్పి ఏవో తాయత్తులు కట్టి ప్రజలు ఇచ్చే డబ్బులు, కానుకలు తీసుకోసాగాడు. అంతా చూస్తున్న మోహన్ కు విషయం అర్థం అయ్యింది ఆపండి అని గట్టిగా అరిచాడు. సన్యాసితో సహా అందరూ మోహన్ వైపు చూశారు. మోహన్ సన్యాసి ముందుకువెళ్ళి నీ దగ్గర ఏ మహిమలు లేవు. నువ్వొట్టి మోసగాడివి. నీవు దొంగ సన్యాసివని రుజువు చేస్తాను. ఏదీ నీ నోరు తెరు అన్నాడు. సన్యాసి ముఖం పాలిపోయింది. జనం నిశ్శబ్దంగా జరిగే తంతంగాన్ని చూడసాగాడు. అంతలో ఇద్దరు యువకులు ముందుకు వచ్చి నీ మీద మాకూ అనుమానంగానే వుంది. ఆ అబ్బాయి చెప్పినట్లు నీ నోరు తెరువు అన్నారు సన్యాసితో. సన్యాసి గజగజ వణికిపోసాగాడు. ఆ ఇద్దరు యువకులు బలవంతంగా సన్యాసి నోరు తెరిపించారు. అతని నాలుక కింద ఏదో పదార్థం కనిపించింది. మోహన్ అతని నోట్లోవేలు పెట్టి దాన్ని తీసి నేలమీద వేశాడు. కాసేపటికి ఆ పదార్థం లోంచి మంటలు వచ్చాయి. అప్పుడు మోహన్ జనాన్ని ఉద్దేశించి ఇతను మహిమగల వాడని నమ్మి మీరంతా మోసపోయారు. వీడో మోసకారి. ఇతను చేస్తుంది ఇంద్రజాలం మాత్రమే. మాయ కాదు, మంత్రం కాదు. వీడుతన నాలుక కింద పచ్చ భాస్వరం అనే పదార్థాన్ని ఉంచుకొన్నాడు. దాన్ని ఎప్పుడూ తడిలోనే ఉంచుతారు. అది గాలి తగిలితే మండిపోతుంది. ఆ సన్యాసి దాన్ని తన నాలుక క్రింది దాన్ని ఉంచుకుని ఉమ్మితో పాటు కొంచెం కొంచెం ఉమ్మివేయ సాగాడు. అది కిందపడి గాలి తగలగానే మండి పోతుంది. మీ అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని సన్యాసి మిమ్మల్ని బాగా మోసం చేశాడు. అని చెప్పి ఆ సన్యాసి వస్తువుల్ని గాలించాడు.

అతనికి ఒక సీసాలో పచ్చ భాస్వరం కనిపించింది. దాన్ని అందరికి చూపించి బయటవేశాడు. కొంతసేపటికి దాంట్లోంచి మంటలు పుట్టుకొచ్చాయి. అక్కడున్న జనానికి విషయం పూర్తిగా అర్ధమయ్యింది. అందరూ సన్యాసిని తలోదెబ్బ వేయబోయారు. మోహన్ వారించి కూటికోసం కోటి విద్యలున్నారు. ఈ సారికి ఇతన్ని క్షమించి వదిలేయండి. అన్నాడు. తనకు క్షమాభిక్ష పెట్టిన మోహన్ కు నమస్కరించి ఆ ఊరు విడిచి వెళ్ళిపోయాడు. తమను దొంగ సన్యాసి బారి నుండి రక్షించినందుకు గ్రామస్తులంతా మోహన్ ను అభినందించారు.

అష్టరుచులు

డా|| గంగిశెట్టి శివకుమార్,

శోణగిరి జమీందారిగారి కూతురి పెళ్ళి నిశ్చయమైంది. తీరా పెళ్ళిరోజు దగ్గరపడేసరికి దివాణంలోని వంటగాడు ఆరోగ్యం బాగాలేక మంచం పట్టాడు. కాబోయే వియ్యంకుడు చిన్నవాడు కాకపోతే సాక్షాత్తు రత్నపురం సంస్థానాదీశుడు పెళ్ళి ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి లోపం జరగడానికి లేదని ఆయన ముందే చెప్పాడు. ప్రత్యేకించి భోజన ఏర్పాట్లు.

పై హెచ్చు ఆయన భోజన ప్రియుడు. అనుకున్నదే తడవు మంచి వంటగాడు దొరకం అంటే మాటలు కాదు. దిగులు పట్టుకుంది జమీందారుగారికి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు దివాణంలో పనిచేసే రత్తయ్య కొడుకు సాంబయ్య మంచి వంటవాడిని తెలిసింది. ఆయన అతడిని పిలిపించి, ఏరా, అమ్మాయి పెళ్ళికి వేల మంది అతిధులు రాబోతున్నారు. నలభీమపాకంలా వంటలు చేసి, మెప్పింతగలవా ? లేదంటే చెప్పు మరొకరిని ఎవరినైనా చూసుకుంటాం. అన్నాడు.

దానికి వాడు వినయంగా, ప్రభూ మీరింత దయతో దివాణంలో ఉద్యోగం అనుగ్రహిస్తూ వుంటే నేనామాత్రం చేయలేనా ? చూస్కోండి నా తడాఖా అష్టరుచులతో వండి వడ్డిస్తా ... అతిథులు విస్తళ్ళు వదలడానికి బాధపడాలంతే... అన్నాడు మహా ఉత్సాహంగా.

అష్టరుచులేమిట్రా ? షడ్రుచులు అనే మాట విన్నాంగాని అన్నాడు. జమీందారు ఆశ్చర్యంతో. మీరే చూస్తారుగా అష్టరుచులంటే ఏమిటో ? తినబోతూ, రుచి అడగటం దేనికి ? అన్నాడు వాడు తొణక్కుండా.

సాంబయ్య వంటవాడైపోయాడు. దివాణంలో - పెళ్ళి బ్రహ్మాండంగా జరిగిపోయింది. పెళ్ళిలో ప్రతి ఒక్కడూ లొట్టలు వేసుకుంటూ భోంచేసినవారే... వియ్యంకులవారు కూడా జమీందార్ని ప్రత్యేకించి ప్రశంసించారు వంటల విషయంలో. సద్దుమణిగాక, చుట్టాలంతా ఎవరి గారిన వారు పోయాక, జమీందారు సాంబయ్యను పిలిచి, వాడితో, ఓరే నీ వంటలు బాగానే వున్నాయి సరేగాని నాకు అందులో కన్పించినవి షడ్రుచులేనే .... అష్టరుచులతో వంటలు చేస్తానని ఢంబాలు పలికావు కదా... అనాంటిదేమీ వాకు కన్పించలేదే ? అన్నాడు సరదాకా.

ప్రభూ.. మీకు తెలియనిదేముంది ? మీరన్నట్లు రుచులు అరే గాని ఎనిమిది లేవు. అయితే కొన్ని వంటకాలు వేడిగా వుంటేనే వాటిలో రుచు కల్పిస్తుంది. చల్లబడితే వేడిగా వుంటేనే వాటిలో రుచు కల్పిస్తుంది. చల్లబడితే అంత రుచి ఎటుపోతుందో తెలియదు. ఇక పానీయాల సంగతంటారా, ఎంత చల్లగా వుంటే అంత బావుంటాయి. ఏ మాత్రం చల్లదనం తగ్గినా వాటిలో రుచి మిగలదు. అందులోనూ ఎండనపడి వచ్చిన అథిధులకు చల్లని పానీయాలు అమృతంతో సమానం. ఏ స్థితిలో దేన్ని ఇవ్వాలో ఆ స్థితిలో దాన్ని అతిధులకు అందివ్వడం వల్ల వారు షడ్రుచులను అనుభవించగల్లారు. ఆరు రుచులకు తోడు వేడిగా వుండటం, చల్లగా వుండటం అనే స్థితులను కూడా కలిపి అష్టరుచులని మీతో అన్నాను అంతే..... తప్పయితే మన్నించండి. అన్నాడు సాంబయ్య వినమ్రంగా

వంటల్లో నేర్పరితనం, మాటల్లో చమత్కారం వున్న సాంబయ్య ను జమీందారు తగిన విధంగా సత్కరించి, తన దివాణంలో వంటవాడిగా బహుకాలం వుంచుకున్నాడు.

DNA కథ

డా || కట్టా సత్య ప్రసాద్

ఏంది మామ చదువుతున్నావ్ ? నాకో మంచి కథ చెప్పుమామా మంచి కథే చదువుతున్న గిరిజన మహిళను మోసగించిన అధికారి కథ మరి ఏం కథ చెప్పను. కంచికి చేరని కథలా ? మంచిని పెంచిన కథలా ? శకుంతలా దుష్యంతుల కథనీకు చెప్పనా ? కాళిదాసు శకుంతల తెలియని వారెవ్వరయ్యా అరిగిపోయిన రిక్డులా ఎన్నాళ్లని చెబుతావు ?

ఏ కథ చెబుదామన్న పుక్కిటి పురాణమంటావ్. అవిజ్ఞాన శాకుంతల మరిగిపోయిన రికార్డుకాదు నిత్యం మన కళ్ళెదుటే జరుగుతున్న నాటకమిది నిత్యం జరుగుతున్న నాటకమా ? ఏం చెబుతావ్ గాని చిత్రంగా మాట్లాడకు. అవును నిజం నేనన్నది ముమ్మాటికి నిజం... నిజం రోజుకొక్క ఊర్లో జరుగుతున్న మోసాలు అనుదినం పత్రికల్లో కనిపించే ఘోరోలు అడవితల్లి బిడ్డలతో కల్లబోల్లి ఊసులాడి ప్రేమ పేరుజెప్పీ, వంచించే మోసగాళ్ళు మాయ పోజులిచ్చే అభినవ దుష్యంతులేగారా ? వీరి ఊసే వినలేదా ? అది వాస్తవము కాదా ?

నిజమే విన్నాను మామ నీతిలేని వాళ్ళ కథను మూన్నాళ్ళ ముచ్చటైన ముదనష్టపు కాపురాలు ఎన్నాళ్ళని వీళ్ళింకా దొరక్కుండ తిరుగుతారు రోజుల రోజులు మారినా దగాకోర్ల దూబాయి జాడ దోరకదా ?

అందుకే నే చెబుతా విను సరికొత్త సైన్సు కథ ఆధునిక సైన్సు విజయాల్లో ఓ మంచి గెల ఏరుదాటినంక, తెప్పతగలేసేటోళ్ళని, పట్టించేకధ ఎట్టెట్లా ?

పుట్టినబిడ్డకు తండ్రిని పట్టిచ్చే కథా? ఎట్టా తెలుస్తుదయ్యా ? ఏ దుర్భిణీతో చూస్తారు? డిఎన్ఏ ( DNA ) దుర్భిణి అది ? తల్లీ తండ్రినే గాదు దోపిడి దొంగలనైనా - ఇట్లే బుట్టుకోవచ్చు వేలిముద్రలల్లే సైన్సు కధచెబుతా - DNA కథచెబుతా - వివరంగా వినుకో DNAలిపి చెబుతా ఏలి ముద్రలంటావ్ ? DNA దుర్భిణంటవ్ ఇపులంగ జెప్పుమామ ఈ దుర్భిణెట్లగుంటదో DNA జీవాణువు ప్రతిజీవిలో ఉంటుంది. జీవమంటే నిజానికి DNA అణువేసుమా.

కణంలేని గుణంలేని ప్రాదమిక జీవినుండి కనుపించని వైరస్, బాక్టీరియా శీలీంధ్రాలు కోతినుండి మనిషివరకు ఒకటేమిటి అన్నింటా, అందరిలో ఉండేదీ జీవాణువు DNA ఒక రసాయనం, ఇది జీవాణువు, ఒక కేంద్రకామ్లం డీ ఆక్సీరైబో న్యూక్లియికే యీసిడ్ అందరిలో ఉంటే మరి ఏమిటయ్యా దీని గొప్ప దొంగలను పట్టించే గుర్బిణి గుణమొక్కడుంది. తల్లికి తండ్రికి మరిలింకును జెప్పేదెట్టా సైన్సు కథ చెబుతానని ఏమేమో జెప్తుండవు అణువూ, జీవాణువుని పరేషాని జేస్తుండవు... ఊరించను, విసిగించను ఉన్నమాట చెబుతా నీతాత పేరు నువ్వు చెబితే నీ పేరునే జెప్తా బాగన్నది నీ వరస తికమకలు జేస్తుండవు ఏమిటీ సంభంధం తాత మనవలకు, DNA కథకు ? తాతకు మనవడు వారసుడని అంటారు మననవికి తాతపేరు ప్రేమతో పెడతారు మేనత్త మేనమామ పోలికలంటారుకదా.... ఆలోచన చేసిచూడు ఎందువలన ఈ పోలిక ? తాతనుండి తండ్రినుండి పిల్లల తరం వరకు నిచ్చెనలో మెట్టుమెట్టు దిగుకుంటూ అనువంశిక లక్షణాలు జారుకుంటూ వస్తాయి. విరవరంగా ఇడమరచి డి.ఎన్.ఏ కథ చెబుతాను వేలిముద్రలేస్తే DNA జాడ చూసి దొరలల్లే చలామణయ్యే దొంగలు జాడలు చెబుతా,

DNA అంటే ఏమి ? జీన్స్ అన్న నేమి ? ఈ రెంటి సంబంధం విపులంగా చెప్పు మామ.... ఒడ్డు, పొడుగు, బట్టనెత్తి, వంశపారంపర్యం సకల లక్షణాలకు జీన్సేగదమూలం ? DNA హారంలో జీన్సే మరి మణిపూసలు నిజానికి ? DNA జంటగడలనిచ్చెన ఆ నిచ్చెనకున్న మెట్లు నత్రజని క్షరాలు అడినైన్, గానైన్, సైటోసిస్, థమమిన్ ఈ నాలుగు అక్షరాలు సుతారంగా అల్లుకుని జీన్స్ పేర మన బ్రతుకుల బ్రహ్మరాత రాస్తవీ మన బ్రతుకును నడిపించీ కనురెప్పగ కాపాడీ బతుకు పోరుదారిలో రోగాలు రొస్టులతో పోరాడే సైన్యానికి సేనాని మన DNA మూడు మూడు క్షారాలోక జట్టుగ పని జేస్తవి కావలసిన ప్రాటీన్లను సంశ్లేషణ చేస్తవి భాస్వరమొక లింకుగా చక్కెరతో చేయగలిపి నత్రజని క్షారాలు నిచ్చెనలా మెలిదిరిగి జీవానికి మూలవై జన్యుపదార్థమై పదార్థమే జన్యువై జన్యువై పదార్థమై పరిణామం చెందిందిల నిర్జీవం జీవంగా సైన్సు కథ జెపుతా DNA లిపి చెబుతా. వివరంగా వినుకో DNA కథ చెబుతా.

ఎలా సాధ్యం ?

జపాన్ లో ఒక రాజు వుండేవాడు. అతగాడు ప్రజల్ని పీడించి వేధించడంలో దిట్ట. రాజ్యంలో ప్రతి దాని మీదా భూమిమీదా, నీళ్ళమీదా పన్నులు వేసి ప్రజల్నించి డబ్బు పిండేవాడు.

ఆ రాజ్యంలో ఒకనది వుండేది. దానికి రెండువైపులా నగరం వుండేది. నగర ప్రజలు ఆ నది దాటడానికి బాగా ఇబ్బంది పడుతుండేవారు. రాజుగార్కి ఒక ఆలోచన వచ్చింది. ఈ నది మీద వంతెన కట్టి ప్రజలు నది దాటినప్పుడల్లా పన్నువిధిస్తే ఎలా వుంటుంది ? కావల్సినంత డబ్బుగదా అనేది ఆయన ఆలోచన. ఇంకేం రాజు తలుచుకుంటే ఏ పనైనా జరుగుతుంది. గదా.... వంతెన కట్టారు. వంతెనకు ఒక కాపలా దారుణ్ణి పెట్టారు. వచ్చేపోయే వాళ్ళ నుంచి అతగాడు పన్ను వసూలు చేసేవాడు.

ఆ ఊళ్ళో మచికో అనే పిల్ల వుండేది. ఆ పిల్ల చాలా తెలివైంది. పన్ను కట్టకుండా నదిని దాటాలనేది ఆ పిల్ల పథకం. అనుకొన్నది చివరికి సాధించింది. ఎలా ?
జవాబుకోసం మీకు ఒక క్లూ. రాజు పిసినారి గదా... వంతెన మీద ఒకే కాపలా దారుణ్ణు పెట్టాడు. ఇద్దర్ని వంతుల వారీగా పనిచెయ్యమంటే జీతాలు దండగ అని... ఈ కాపలాదారుడు 24 గంటలూ పనిచేయాల్సి వచ్చేది. మరి నిద్ర పోవాలి గదా... అందు కోసం కాపలాదారుడు 5 నిమిషాలు మేల్కొని 5 నిమిషాలు నిద్రపోయేవాడు. వంతెన దాటడానికి సరిగ్గా 10 నిమిషాలే పడుతుంది.

గాడిద పరుగు ఒక ఊళ్ళో ఒక గాడిద వుండేది. అది ఒక రోజు ఒక బావిలో పడిపోయింది. పాపం బయటికి రాలేక గోల పెట్టసాగింది. దాని యజమాని వచ్చి చూశాడు. బావిలోంచి గాడిదను పైకి తేవడం అతనికేం సాధ్య పడలేదు.

ఎలాగూ ఈ గాడిద ముసలిదైపోయింది. చస్తే పూడ్చి పెట్టాలి. ఇదెలాగూ నీళ్లూ లేని. ఎవ్వరూ వాడని బావి. ఇందులోనే పూడ్చేస్తే సరి... అనుకున్నాడు.కూలీల్ని పిలిచి బావిలో మట్టిపోసి గాడిదను పూడ్చేయమని పురమాయించాడు. కూలీలు మట్టి తవ్వి పొయ్యసాగారు. ఆశ్చర్యం కొంతసేపటికి గాడిద ఓండ్ర పెట్టుకుంటూ బావి బయటికి వచ్చి పరుగులంకించుకుంది. ఇదెలా జరిగినట్టు ?

మన తిండిని మనమే పరీక్షించుకుందాం

మనం తినే ఆహార పదార్థాల్లో ప్రధానంగా పిండిపదార్థాలు (కార్భోహైడ్రేటులు), మాంసకృత్తులు (ప్రోటీన్లు), క్రొవ్వుపదార్థాలు (ఫాట్స్) వుంటాయన్న సంగతి అందరకీ తెలిసిందే, ఇవేగాక అనేక రకాల విటమిన్లు, లవణాలు, నీరు, చక్కెర కూడా మనం తీసుకునే ఆహారంలో వుంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాలు వున్నాయో తెలుసుకొనేందుకు మనం తప్పనిసరిగా ఏ ప్రయోగశాలలో వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్నచిన్న పరీక్షలు ద్వారా మనకు మనమే వాటిని ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు.

ఏదైనా ఒక ఆహార పదార్థాలలో క్రొవ్వు, పిండిపదార్థాలు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

క్రొవ్వు పదార్థాలకై పరీక్ష

ముందుకు మీరు ఏ ఆహారాన్ని పరీక్షించాలనుకుంటున్నారో అందులో కొంత భాగాన్ని తీసుకోండి.

  • ఒక చిన్న కాగితం ముక్కను తీసుకొని, దానిపై ఆహార పదార్థాన్ని మెల్లగా రాయండి.
  • కొంచెం సేపు దానిని అలాగే వదిలివేయండి. ఆరిపోతుంది.
  • ఇప్పుడు ఆ కాగితం ముక్కను పరీక్షించండి. మీరు ఆహార పదార్థం రాసిన ప్రాతంలో కాగితం నిగనిగలాడుతూవున్నా, లేదై ఒకవైపు నుంచి మరో వైపున వస్తువులను చూడగలమనేలా ఉన్నా అంటే పారదర్శకంగా మారినా ఆ ఆహార పదార్థంలో క్రొవ్వు పదార్థాలు ఖచ్చింతంగా వున్నట్లే లెక్క.
  • క్రొవ్వు లేకున్నా సరే, కాగితంపై రాసినప్పుడు దాన్ని జిడ్డు జిడ్డుగా లేదా కొద్దిగా పారదర్శకంగా మార్చే ఆహార పదార్థాలేమైనా ఉన్నాయా ? ఉన్నాయో లేదో మీరే పరీక్షించి చూడండి.

పిండి పదార్థాలకై పరీక్ష పిండి పదార్థాల (గంజి) పరీక్షపై మీకు కొద్దిగా అయోడిన్ కావలసి వుంటుంది. దెబ్బలు తగిలినప్పుడు మన గాయాలు తుడిచేందుకు ఉపయోగించే ఎర్రద్రవం వుంటుంది. చూడండి. దానిపైన మీరు వాడవచ్చు.

  • ముందుగా మీరు పరీక్షించాల్సిన ఆహారం నుంచి ఓ చిన్న భాగాన్ని తీసుకోండి.
  • ఈ పదార్థాన్ని పళ్ళెంలో పెట్టి, దానిపై ఓ 2 – 3 చుక్కల అయోడిన్ ను వేయండి.
  • ఆహార పదార్థం దట్టమైన రంగులోకి గాని నలుపు రంగులోకి గాని మారుతుందేమో గమనించండి.
  • అలా మారినట్లయితే ఆ పదార్థంలో ఖచ్చింతంగా కార్భోహైడ్రేటులు వున్నట్లు గుర్తించండి.
  • బియ్యం గోధుమలు, జొన్నలు, కందిపప్పు, మినపప్పు, వేరుసెనగలు, నెయ్యి వంటి పదార్థాలను ఈ రకంగా పరీక్షించి వాటిలో పిండిపదార్థాలు ఉన్నాయో లేదో మీకు మీరే తెలుసుకోండి. గింజల రూపంలో ఉండే బియ్యం, గోధుమలవంటి వాటిని ముందుగా మెత్తగా దంచుకోవలసి వుంటుందని మర్చిపోకండేం.
గజిబిజి గిజిగాడు

మనం చెప్పుకొనే గిజిగాడు లేక పచ్చపిట్టని ఆంగ్లంలో వీవర్ బర్డ్ అంటారు. ఇవి ఒక రకపు పిచ్చుకలే. వీటి గూటి నిర్మాణ సామర్థ్యం మిక్కిలి బ్రహ్మాండంగా వుంటుంది. చాకచక్యంతో అతి నేర్పుతో ఇవి గూళ్ళను అల్లుకుంటాయి.

ఆప్రికాలో నివసించే ఈ పిట్ట ప్రపంచం అంతటా వివిధ ప్రదేశాలలో ప్రవేశించింది. మన దేశంలో నివసించే అందమైన పసుపు పచ్చని చిన్న పిట్ట ఒక అపూర్వ శిల్పి. ఇది తాటి నార, పీచు, గడ్డి మొదలైన వాటితో గజిగిజిగా అల్లుకునే గూళ్ళూ మిక్కిలి పొందికగానూ అందంగానూ వుంటాయ.

వీటి గూళ్ళూ తల క్రిందులుగా చేసిన కిరసనాయిలు దీపం చిమ్మిలా ఉంటాయి. బుడ్డిలా ఉండే ఈ గూటిని చెట్టు కొమ్మకు గట్టిగా కడుతుంది. గూటికి దారి గొట్టం కింద నుంచి వుంటుంది. గూటిపైనుంచి సన్నని నారలతో గజిబిజిగా చుట్టి వ్రేలాడుతూ ఉంటుంది. ఈ గూటిలో బారినుంచి సాధారణంగా పోతులు, పాములు బారినుంచి సంరక్షించుకుంటాయి.

జాతికిచెందిన కొన్ని మగ పక్షులు పురివిప్పి అందమైన రెక్కలను ప్రదర్శిస్తాయి. కొన్ని జాతులలో మగ పక్షే పూర్తిగా గూటిని అల్లుతుంది. ఇవి న్యత్యం చేస్తాయి. సాధారణంగా కాలువ ఒడ్డున తుమ్మ చెట్టు కొమ్మలకు గూళ్ళు వ్రేలాడుతుంటాయి. ఇవి పొలాల్లో పంటగింజలను తినేసి పంటలను ధ్వంసం చేస్తాయి. దక్షిణాఫ్రికాలో వుండే మరొక పక్షి గూళ్ళను కట్టెలతో కడుతుంది. ఈ సోషల్ వీవర్ పక్షులు బూడిదరంగులో ఉన్న చిన్నచిన్న పిట్టలు. ఇవి గుంపులుగా వుంటాయి. ఒక్కొక్క గుంపులో షుమారులో 200 పక్షులు వుంటాయి. ఇవి ఉమ్మడిగా చేరి శత్రువులను ఎదిరిస్తాయి. ఐకమత్యంగా వుంటాయి. చిన్నారులూ ..... గిజిగాడిలో ఉన్న ఇంజనీరింగ్ నైపణ్యం సుగుణాలు, మంచి అనవాట్లు ఆశ్యర్యంగా వున్నాయి కదూ...

నవయుగ కవి చక్రవర్తి గుర్రంజాఘవా గారు గిజిగాడు పక్షి కళాకౌశల్యతకు అబ్బురపడి ఏమన్నారో చూడండి.

తేలిక గడ్డిపోచలను దెచ్చి, రచించెదవీపు తూగుటుయ్యేల గ్రుహంహు, మానవులకేరికి సాధ్యముకాదు. దానిలో జాలరు. లందులో జిలుంగుశయ్యలు నంతిపురంబులొప్పగా మేలుభళీ... పులుంగు టెకిమీడవురా గిజిగాడ... నీడజా.....

పిల్లి శకునం

వేణుబాబు ఏడో తరగతి విద్యార్థి. అమ్మా నాన్నలు ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం వల్ల తాతయ్య గారింటి దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు.

వేణుబాబు అంటే బామ్మగారికి మక్కువ. ఆమెకేమో శకునాల చాదస్తం ఎక్కువ. ఆమెకు వినిపించేలా తుమ్మినా, దగ్గినా తంటాయే, వేణు బడికి బయల్దేరాలంటే ఆమె హంగామా అంతా ఇంతా కాదు. వీధిలో ఎవరోవరు వస్తున్నారో చూసేది. తరువాత చెంబుతో నీళ్ళు పట్టుకొని ఎదురు వచ్చేది. సాయంకాలం బడి నుంచి తిరిగి రాగానే దిష్టి తీయడానికి సంసిద్ధంగా ఉండేది.

ఏ గుడ్డ పీలికను నూనెలో ముంచి వాడి ముఖం చుట్టూ మూడుసార్లు తిప్పేది. గుడ్డ పీలికను వెలిగించాక, దాని ఎన్ని కుళ్లు కళ్ళు పడాడయో... అంటూ తిట్టిపోసేది. ఇలా బామ్మ చేసే ప్రతీ తంతంగాన్ని వేణుబాబు ఒంటపట్టించుకున్నాడు. బడిలో కూడా బామ్మగారి బుద్ధుల్నే ప్రదర్నించేవాడు. వాడి స్నేహితుడు భరత్ కి ఇది నచ్చేది కాదు. భరత్ కి ప్రతీ విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు.
ఇలా రోజులు గడిశాయి. సంవత్సరాంతం పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ఆ రోజు ఇంగ్లీషు పరీక్ష.
వేణు అట్ట, పెన్ను తీసుకొని బడికి బయలుదేరాడు. బామ్మ యథావిధిగా వెనుకా ముందు చూసింది. నీళ్ళ చెంబు పట్టుకొని ఎదురొచ్చింది. కానీ అంతలోనే ఎదురింటి అటక మీద నుంచి దూకి మ్యూవ్ అంటూ ఓ పిల్లి వేణుకి ఎదురుగా పరుగెత్తుకొచ్చింది. అంతే..... బామ్మగారి గుండె గుభేలుమంది. వేణు పరిస్థితి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పిల్లి, ఎదురు కారణంగా పరీక్ష కష్టంగా ఉంటుందేమోని వాడిలో ఒకటే భయం. పరీక్ష హాల్లో కూర్చున్నాడే కాని వాడి ఆలోచనలన్నీ పిల్లి గురించే. కొశ్చెన్ పేపర్ ఇచ్చారు. తెలీని ప్రశ్నలేవో ఇచ్చి ఉంటారనుకున్నాడు. నిజానికి అవన్నీ అతనికి బాగా తెలిసిన సులభమైన ప్రశ్నలే.... ఇలా అన్యమనస్కంగానే, తెలిసిన జవాబులు కూడా సరిగా రాయలేక పోయాడు. ఏడుపు ముంచుకొచ్చింది.

పరీక్ష అయిపోయాక భరత్ ను కలిసి చూశావా భరత్.... ఇన్నాళ్ళూ శకులాలు ప్రభావం చూపిస్తాయంటే నమ్మావుకాదు. కాని ఈ రోజు... పరీక్షల్లో ప్రశ్నలన్నింటికీ జవాబులు నాకు తెలిసినవే. అయినా సరిగ్గా రాయలేకపోయాను. తొంభైరావలసిన మార్కులు యాభైలోపే వస్తాయి. దీనికంతటికీ కారణం పిల్లి శకునం కాదంటారా అని ప్రశ్నించాడు.

వేణూ... ఇక్కడే నువ్వు పొరపాటుగా అర్థం చేసుకొన్నావు. నా వాదన ఎప్పుడూ కరక్టే. పిల్లి ఎదురు కారణంగా ఇలా జరిగిందను కోవడం చాదస్తం... జాగ్రత్తగా ఆలోచించు. పరీక్ష పేపరు ఎప్పుడు తయారైంది... నీకు పిల్లి ఎదురయ్యాక కాదు కాదా... పిల్లి గురించి లేనిపోని అనుమానాలు పెట్టుకొన్నావు. పరీక్ష ప్రారంభం నుంచీ అదే ఆలోచించావు. ఇప్పుడేమో పిల్లి ఎదురు వల్లే అలా జరిగిందంటున్నావు. తరువాత నువ్వు పెద్ద చదువులు చదివినా ఈ సంఘటననే సోదాహరణంగా చెబుతావు. సమాజంలో చాదస్తాలను, శకునాలను బలపరుస్తావు. నువ్వే కాదు, చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా తమ అనుభవాలను వక్రీకరించి చెప్పడం వల్లే ఈనాటికీ కూడా అర్థం పర్థంలేని పట్టింపులు, పాతకాలం అలవాట్లు కొనసాగుతున్నాయి. పిల్లి ఎదురు రావడానికీ, పరీక్ష సరిగా రాయలేక పోవడానికి ఏ మాత్రం సంబంధంలేదు.
వేణు కాసేపు ఆలోచించాడు. నిజం... భరత్ మాటల్లో నిజం ఉంది. ఇక నుంచి శకునాలకు, చాదస్తాలకు గుడ్ బై..... అనుకున్నాడు.

అవయవాల మార్పిడి (Organ Transplantation)

డా|| ఎస్.ఎల్.వి.నారాయణరావు, నెఫ్రాలజిస్ట్, అరవింద్ కిడ్నీ సెంటర్, నెల్లూరు

మన శరీరంలోని రకరకాల అవయవాలు దేనిపని అది చేసుకుని పోతూ ఉంటే, మనం హాయిగా మన పనులు చేసుకుంటూ ఉంటాము. ఏదైనా కారణం వలన ఆ అవయవాలు పనిచేయకపోతే, శరీరం కూడా మొరాయిస్తుంది. అటువంటప్పుడు ఆ పనిచేయని అవయవం స్థానంలో వేరొర క్రొత్త అవయవాన్ని ఏర్పరచగలిగితే .......?

ప్రాచీన కాలంలో ఇటువంటి ఊహలకు ప్రతిరూపమే మనం చూపే వినాయకుడి తల... కాబట్టి మనకు తెలిసిన మొదటి అవయవ మార్పిడి వినాయకుడి అసలు తల స్తానం ఏనుగు తల రావడం. అలా ఊహల పల్లకిలో ఊరేగిన మనిషి మేధస్సు ఎంతో...... ఇంకెంతో ఎదిగి, ఇప్పుడు చేస్తున్న ఆధునిక అవయవాల మార్పిడి స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ముఖ్యంగా మార్పిడి చేస్తున్న అవయవాలలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు (కార్నియా) ముఖ్యమైనవి.

వీటిలో........ శరీరంలో ఒకటే ఉన్న అవయవాన్ని (ఉదా...గుండె, కాలేయం మొ|| ) మార్చాలంటే....... అప్పుడే చనిపోయిన వ్యక్తి నుంచి తీసి మాత్రమే మార్చవలసి వస్తుంది. దీనిని Cadaver transplant అంటారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి - ఏ వయసులో వారైనా - రోడ్డు ప్రమాదాలు లేదా గుండెపోటు వల్ల లేదా ఇతర కారణాల వలన చనిపోయినప్పుడు - అతని మెదడు చనిపోతుంది - కాని గుండె ఇతర అవయవాలను కృత్రిమంగా పనిచేస్తూ ఉంటారు. దీనిని Brain Death అంటారు. ఇటువంటి వ్యక్తులు కృత్రిమ సహాయం (ఉదా,, వెంటిలెటర్) ఆపిన వెంటనే పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో, ఇటువంటి వ్యక్తుల నుంచి అవయవాలను వేరొకరికి గానం చేసి ఇతరులకు సహాయపడవచ్చు.

ఇక శరీరంలో జాతగా ఉన్న అవయవాలు ఉదా,, కిడ్నీలు బతికి ఉన్న వాళ్ళు వేరొకరికి ఒక కిడ్నీ దానం చేయవచ్చు. దీనిని Live transplant అంటారు.
పేదరికం వల్ల కొందరు తమ అవసరాలనిమిత్తం ఒక కిడ్నీని అమ్ముకునే సంఘటనలు మనం నిత్యం ఎన్నో చూస్తున్నాం. కడుపునొప్పితో ఆసుపత్రికి వెళితే, ఆపరేషన్ చేసి కిడ్నీ దొంగిలించే డాక్టర్లనూ చూస్తున్నాం. డబ్బున్న వాళ్ళకు కిడ్నీ కావలసి వస్తే ఎంతైనా ఖర్చు పెట్టి పేదల కిడ్నీలు కొనేస్తున్నారు. పేదలకు కిడ్నీ కావలసివస్చే మాత్రం, కొనలేక, ఎవరైనా దానం చేసినా, అపరేషన్ చేయించుకుని అమర్చుకొనే స్తోమత లేక మొగ్గదశలోనే రాలిపోతున్నారు.

కిడ్నీ మార్పిడి గురించి మనం ప్రస్తుతం తెలుసుకుందాం
కిడ్నీల పని ఏమిటి ? శరీరానికి ఏ రకంగా ఉపయోగం పనిచేయకపోతే ?
  1. రక్తంలోని మలినాలను శుభ్రం చేయడం. (క్రియాటినిన్, యూరియా మొదలైనవి).
  2. లవణాలు (సోడియం, పొటాషియం మొ,, సరైన మోతాదులో ఉంచడం.
  3. రక్తం తయారీకి అవసరమైన పదార్థం తయారు చేయడం.
  4. శరీరం నీటి శాతం సరిగ్గా ఉంచడం.
  5. శరీరంలో కాల్షియం శాతం సరిగ్గా ఉండడం
శరీర ఆరోగ్యం కాపాడుతుంది.


రక్తపోటు (బిపి) సరిగ్గా ఉంటుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ శాతం సరిగ్గా ఉంటుంది.

అన్ని అవయాలు సరిగ్గా పనిచేస్తాయి.

ఎముకలు శక్తివంతంగా ఎదురుతాయి.
మలినాలు పేరుకుని పోతాయి.


రక్తపోటు ఎక్కువై గుండెపోటు పక్షవాతం|| వస్తాయి.

రక్తహీనత (అనీమియా) వస్తుంది. దాంతో ఆయాసం, నీరసం వస్తాయి.
శరీరమంతా వాపు, గుండెచుట్టూ, ఊపిరితిత్తుల్లో నీరు మిగిలిపోయి అవి పనిచేయడం చాలా కష్టమౌతుంది.

ఎముకలు, కీళ్ళలో నొప్పులు, బలహానం.

ఇంత ముఖ్యమైన కిడ్నీలు పనిచేయకపోతే ?

  • తాత్కాలికంగా పనిచేయనప్పుడు - కిడ్నీల పని బయట నుంచి మనం చేయవచ్చు. దీనిని డయాలసిస్ అంటారు.
  • శాశ్వతంగా పనిచేయకపోతే-
    1. జీవితాంతం డయాలసిస్.
    2. కిడ్నీ మార్పిడి.

మరి కొత్త కిడ్నీ ఎక్కడ దొరుకుతుంది ?

  • ఇంతవరకు చెప్పుకున్నట్లు చనిపోయిన వ్యక్తి నుంచి గాని, బ్రతికి వున్న వ్యక్తుల నుంచి గాని తీసుకోవాలి.

రెండు కిడ్నీలు మార్చుకోవాలా ?

  • ఒక ఆరోగ్యవంతమైన కిడ్నీ శరీరాన్ని కాపాడుతుంది.
  • కాబట్టి కిడ్నీ ఇచ్చిన దాత తనకు మిగిలిన ఒక కిడ్నీతో ఆరోగ్యంతో జీవిస్తాడు.
  • గ్రహీతకు ఒక్క కిడ్నీ సరిపోతుంది. అవయవ మార్పిడి లో ముఖ్యమైన అంశాలు మూడు
    1. ఆ అవయవం దొరకడం { Availability }
    2. తీసుకొనే వారి శరీరానికి సరిపోవడం { matching }
  • అది అమర్చే ప్రక్రియ { Fixation }

దొరకడం ఎలా ? ఇంతకు ముందు చెప్పినట్లు చనిపోయిన వ్యక్తి నుంచి లేదా బ్రతికి ఉన్న వారి దగ్గర నుంచి తీసుకొని అమర్చాలి.

సరిపోవడం అంటే ?

శరీర నిర్మాణం ప్రకారం బయట నుంచి వేరొక క్రొత్త పదార్థమేదైనా శరీరంలోకి వచ్చినప్పుడు శరీరం వెంటనే దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ పని చేస్తుంది. అందుకని సాధ్యమైనంతగా శరీర స్థితికి దగ్గరగా ఉండే వారి నుంచి మాత్రమే కిడ్నీని తీసుకోవలసి వస్తుంది. దీనికోసం రక్తం గ్రూపు, HLA Testing మొదలైనవి చేసి, ఎంతవరకు ఇచ్చేవారి కిడ్నీ రోగికి సరిపోతుందో పరీక్షిస్తారు. సాధారణంగా తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల కిడ్నీ అయితే రోగి శరీరం బాగా స్వీకరిస్తుంది. వీరుకాక రక్తం గ్రూపు మొదలైనవి సరిపోయిన వేరొకరి నుంచి తీసుకొంటే, రోగి శరీరంలోని ఆ క్రొత్త కిడ్నీని నాశనం చేయకుండా శక్తివంతమైన మందులతో (immuno suppressants) రోగ నిరోధక వ్యవస్థను పనిచేయకుండా చేయాలి. దీని వలన క్రొత్త కిడ్నీ నాశనం కాకుండా బాగుంటుంది. కాని శరీరానికి రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గి ఇతర ఇన్ఫెక్షెన్లు సోకే ప్రమాదం వుంది.

అమర్చే ప్రక్రియ ఎలా ?

క్రొత్త కిడ్నీని నూటికి నూరుపాళ్ళు అత్యంత నిపుణతతో శరీరంలో అమర్చవలసి వుంటుంది. దానికి వాడే పరికరాలు, ఇతర వస్తువులు (సూదులు, దారాలు) మొదలైన వాటిలో ఎంతో మార్పు వచ్చి, ప్రస్తుతం వాడే వస్తువులు అత్యంత నాణ్యమైనవిగా తయారయ్యాయి.
ఎన్నో పరిశోధనలు చేసి, శాస్త్రవేత్తలు ఇంతకుముందు చెప్పిన immuno suppressant మందులు తయారుచేశారు. ఈ ఒక్క రంగంలోనే ఆ పరిశోధనలకు గాను 3 నోబెల్ బహుమతులు ఇవ్వబడ్డాయి.
అలాగే ఆపరేషన్ కు వాడే వస్తువులను తయారు చేసే క్రమంలో కూడా జరిగిన పరిశోధలకు గాను కూడా 3 నోబెల్ బహుమతులు ఇవ్వబడ్డాయి.

కాని, మనందరి చేతుల్లో ఉన్నది -ఎక్కువ మంది కిడ్నీలు ఇవ్వడానికి ముందుకు రావడం. రోజు రోజుకు కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న యువతీ యువకులు ఎంతో మంది పెరుగుతున్నారు. వీరందరికీ విజయవంతంగా కిడ్నీ మార్పడి చేయగలిగితే వారి వారి కుటుంబాలు, తద్వారా దేశానికి ఎంతో ఉపయోగం. అందుకని ఒక సామాజిక బాధ్యతతో ప్రభుత్వం, ప్రజలు చనిపోయిన వ్యక్తుల నుంచి అవయవాలను మార్చడానికి గట్టి నిర్ణయం తీసుకొని ప్రోత్సహించాలి.

కొన్ని దేశాలలో (ఉదా|| ఆస్ట్రేలియా ) వారి పౌరులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేప్పుడు, దురదృష్టవశాత్తు వారు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగితే, వారి అవయవాలు ప్రభుత్వానికే చెందేట్లు చట్టం చేశారు. దీనివలన అలా చనిపోయిన వారి అవయవాలను ఎంతో మంది రోగులకు అమర్చే అవకాశం ఉంది. మన దేశంలో కూడా ఇటువంటి చట్టం చేసే దిశగా ప్రభుత్వం, ప్రజలు చర్చించవలసిన అవసరం ఉంది.

అలాగే, కిడ్నీ మార్పిడి ప్రక్రియలో వాడే మందులు, ఇతర వస్తువులు ధరలు బాగా తగ్గించగలిగితే ఎక్కువ మంది కిడ్నీ మార్పిడి చేయించుకోగలుగుతారు. ఈ దిశగా ప్రభుత్వం ఆయా మందులు తయారీదారులు ప్రయత్నించవలసిన అవసరం ఉంది.

సైన్సు క్లబ్

సి.హెచ్. ఆనంద్

ఆ రోజు బుధవారం. మళ్ళీ పద్మనాభరావు భుజానికి సంచి తగిలించుకొని వచ్చేశాడు. పిల్లలందరు లేచి నిలబడ్డారు.
గుడ్ మార్నింగ్ యంగ్ సైంటిస్ట్ అంటూ కూర్చోమని చెయ్యి పూపారు. ఈ రోజు మీరే ఏదైనా ప్రశ్నవేయండిరా ? అన్నాడు.

ప్రశ్న వేయదలుచుకొన్నావారు కొందరు చేయిపైకి లేపారు. మొత్తం 5 చేతులు పైకి లేచాయి. పద్మనాభరావు ఒకసారి చేతులు లేపినవారివైపు చూశారు. ఎప్పుడు మాట్లాడని శాంతి చెయ్యి ఎత్తి ఉండటం చూసి ఈ పిల్లఏ ప్రశ్న వేస్తుందా అని ఆసక్తిగా శాంతీ నువ్వు అడగమ్మా అన్నాడు.
శాంతి లేచి సార్ ఈ మధ్య మా తమ్ముడి బర్త్ డే పార్టీ జరిగింది. అందరూ ఆ పార్టీకి వచ్చారు. ఆ పార్టీలో మా నాన్న ఫోటోలు తీశారు. సార్ అప్పుడు మా టీవిలో వార్తలు వస్తున్నాయి. ఫోటోలో మాత్రం టీవిలోని ఏ బొమ్మ రాలేదు. టీవి ఆఫ్ చేసినట్లు ఉంది ఫోటోలో అలా ఎందుకు జరిగింది ?పద్మనాభరావు గారికి సంతోషం వేసింది. ఎప్పుడూ మౌనంగా ఉండే శాంతి చాలా చక్కటి ప్రశ్న వేసింది. ఆయన లేచి గుడ్ అబ్జర్వ్ వేషన్.

చూశారా శాంతికి ఎంత అబ్జర్వ్ వేషన్ ఉందో. ఫోటోలో ఉన్న టీవీలో, బొమ్మరాలేదంటే, ఫోటో తీసినప్పుడు టీవీ ఆన్ లోనే ఉంది కదా... ఈ ప్రశ్న శాంతికి వచ్చిందంటే శాంతి నిసితంగా పరిశీలించే తత్వాన్ని పిల్లలు అలవర్చుపోవాలి.మంచి సైంటిస్టుకుండే ప్రధానమైన లక్షణం అది. మిగతా వారంతా శాంతిలాగా గుణాన్ని పెంచుకోవాలి. పద్మనాభరావు గారికి పిల్లల్ని పొగుడ్తూ ఉండాలంటే చాలా ఇష్టం అవకాశం ఉన్నప్పుడంతా పిల్లల్ని పొగుడ్తూ ఉంటాడు.

ఓకే ఇక ఆ ప్రశ్నకి ఎవరు జవాబు చెబుతారు అని మళ్ళీ పద్మనాభరావు పిల్లల వైపుచూశారు. రెండు చేతులు అన్నాడు.
రవి లేచి సార్ ఆ సమయంలో కెమెరానించి ఫ్లాష్ లైటు టీవీ మీదపడి ఉంటుంది. అందువల్ల టీవీలు ఉన్న బొమ్మ కనిపించకుండా పోయింది. అన్నాడు.
వెరిగుడ్ రవీ నువ్వు చెప్పింది తూడా జరిగే అవకాశం వుంది. మీరు ఫ్లాష్ లేని కెమెరాతో కూడా టీవీని ఫోటో తీయండి చాలా మటుకు టీవీలో బొమ్మ రాదు. అందుకు కారణాలని పరిశీలిద్దాం. అన్నాడు.

మన కంటి చూపును బట్టి టీవీని తయారుచేసారు. టీవీలో వచ్చే కార్యక్రమాలు మనకు కదులుతూ కనిపిస్తున్నాయంటే టీవీ స్క్రీన్ మీద బొమ్మ సెకనుకు 50 సార్లు కనిపిస్తూ 50 సార్లు ఆరిపోతూ ఉంటుంది. అంటే ప్రతీ 20 మల్లీ సెకండ్లకి ఒకసారి బొమ్మ ప్రత్యక్షం అవుతుంది.

టీవీలో బొమ్మ కదులుతున్నటు కనబడుతుంది. (సినిమా స్క్రీన్ మీదకూడా అంతే) కెమెరా సాధారణంగా 10 మిల్లీ సెకండ్లు లోపే తెరిచి మళ్లీ మూసుకొంటుంది. ఈ 10 మిల్లీ సెకండ్లలోపల టీవీ బొమ్మరాదు కాబట్టి ఫోటోలో ఎలాంటి బొమ్మ కనబడదు. టీవీ కార్యక్రమం ఫోటోలో కూడా కనబడాలి అనుకుంటే కెమెరా షట్టర్ స్పీడు బాగా తగ్గించాలి అంటే కెమెరా షట్టర్ సెకనులో ఎనిమిదోవంతుదాకా తెరవబడి ఉండేట్లు ( 1 /8 సెకన్లు) చేసుకొంటే ఫోటోలో టీవీ బొమ్మకూడా వస్తుంది. అర్థం అయిందా.

ఇప్పుడు చెప్పిందాంట్లో ఎవ్వరికైనా ఏదైనా డౌటు వుంటే అడగండి అన్నాడు. అందరూ అర్థం అయిందన్నారు. సైన్సుక్లబ్ ఆ రోజుకి ముగిసింది.

క్షీమించిపోతున్న ఆడ జనాభా

బారత దేశంలో స్త్రీల జనాబా నానాటికి క్షీమించిపోతుంది. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలున్నారు. ప్రపంచంలో చాలా చోట్ల అమెరికా, బ్రిటన్, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా దేశాలలో స్త్రీల జనాభాయే ఎక్కువగా వుంది. భారత్ లో ఆర్థికాభివృద్ధి స్త్రీ పురుష నిష్పత్తిని తలక్రిందులు చేస్తోందని సామాజిక శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. హరిత విప్లవం ద్వారా సంపన్నమైన పంజాబ్ రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 790 మంది మాత్రమే స్త్రీలున్నారు. మానవ అభివృద్ధి సూచికలో ముందున్న మహారాష్ట్రలో ప్రతి 1000 మంది మగవారికి 922 మంది మాత్రమే మహిళలున్నారు.

స్త్రీ జనాభా తగ్గడం ద్వారా ఆడపిల్లలకు డిమాండ్ పెరిగి సమాజంలో వారికి సమన్నత గౌరవం లభిస్తున్నదని కొంత మంది తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. ఆమ్నియా సెంటటిస్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కావడం వలన ఈ పరిస్థితికి దారి తీస్తోంది. ఇలా స్త్రీ జనాభా తరిగిపోవడం వల్ల బహుభర్తృత్వం, ఆడవాళ్ల అమ్మకాలు పెరిగిపోతాయని సామాజిక శాస్త్రవేత్త లీలా దూబే హెచ్చరిస్తున్నారు.

నిన్ను వదలి నేపోలేనులే

తోటకూర సాయిరామకృష్ట మేథమెజీషియన్, సామర్లకోట

  • పదిలోపు ఏదైనా ఒక అంకె తలచుకో
  • దానిని 3తో గుణించి లబ్దానికి ఒకటి (1) కలుపు.
  • వచ్చిన ఫలితాన్ని 3తో గుణించు.
  • ఇప్పుడు వచ్చిన లబ్దానికి ముందుగా తలుచుకొన్న అంకెను కలుపు. ఇప్పుడు నీవద్ద రెండంకెల సంఖ్య వుందికదూ...
  • ఆ సంఖ్యలో ఒకట్ల స్థానంలో 3 వుంది కదూ దానిని కొట్టేయి.
  • ఇప్పుడు మిగిలిన అంకె నీవు తలుచుకున్నదే. ఎన్ని ప్రక్రియలు చేసినా నిన్ను వదిలి పోలేనులే అంటుంది కదూ..
  • ఉదాహరణకు నువ్వు తలుచుకున్న అంకె 8 అనుకుందాం.
  • 8ను 3తో గుణించి 1 కలిపితే 8x3+1=25
  • వచ్చిన ఫలితాన్ని (25ను) 3తో గుణిస్తే 25x3=75
  • వచ్చిన లబ్దానికి (75కి) తలుచుకున్న 8ని కలిపితే 75+8=83
  • కుడివైపునున్న 3 కొట్టేస్తే మిగిలింది 8 కదూ...
గొప్ప స్ఫూర్తి

డా ||గంగిశెట్టి శివకుమార్, నెల్లూరు.

చెట్లను, పుట్టలను ఆరాధించే సంస్కృతి మనది. దీనికి కారణం వాటివల్ల మనకున్న కృతజ్ఞతాభావమే ! వృక్షాలు, వన్యమృగాలు, లేనట్లయితే మనం లేం ! ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటే అంతా వినాశనమే !

ఈ విషాయాన్ని మనం గమనించి వృక్షోరక్షితి రక్షితః అంటున్నాం. వృక్షాలను, వన్యమృగాలను కాపాడుకోవాలని ఉద్యమాలు చేస్తున్నాం. ప్రచారాలు సాగిస్తున్నాం. కాని యింకా మనం ఆశించినంత ఫలితాలు రాబట్టలేకపోతున్నాం. కానీ నాగరికులమైన మన కంటే ఎంతో ముందుగా, అంటే వందల ఏళ్ళ కిందటే చెట్లకోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన బిష్ణోయ్ లనే గిరిజనులున్నారంటే మనం సిగ్గుతో తలదింతుకోవాల్సిన పరిస్థితి.

1737 లో రాజస్థాన్ లో ఖేజార్లి అనే గ్రామంలో ఒక అధికారి మహారాజుగారి ఆజ్ఞమేరకు చెట్లను నరికిస్తున్నారు. ఆ అధికారిని అమృతాదేవి అనే మహిళ అడ్డుకుంది. మేం మా ప్రాణాల కంటే ఎక్కువగా వృక్షాలను ఆరాధిస్తాం. మా కళ్ళ ముందే మీరు వాటిని నరుకుతుంటే చూస్తూ వూర్కోం. అంటూ హెచ్చరించింది.

అధికారి ఆ మహిళ మాటలను ఖాతరు చేయలేదు. చెట్లు నరకడం ఆపలేదు. ఆమె ఒక వృక్షాన్ని గట్టిగా కౌగిలించుకొని నన్ను చంపిన తర్వాతే ఈ చెట్టును నరకండి. అన్నది. ఆ అధికారి అప్పటికీ వృక్షాల పట్ల వారి ప్రేమను అర్థం చేసుకోలేదు. తత్ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.

తర్వాత ఆమె ముగ్గురు కుమార్తెలు చెట్లను కౌగిలించుకుని వాటిని నరక వద్దంటూ అడ్డుపడ్డారు. వారూ గొడ్డళ్ళకు బలయిపోయారు. ఆ విషయం తెలిసిన గ్రామంలోని బిష్ణోయ్ లందరూ చెట్లను కౌగిలించుకుని మమ్మల్ని చంపాకే వాటిని నరకండి అంటూ భీష్మించుకున్నారు. ఆ విధంగా ఆ సందర్భంలో 363 మంది బిష్ణోయ్ లు గొడ్డళ్ళకు బలయిపోయారు.

ఆ విషయం తెలిసిన రాజుగారు పశ్చాత్తాపపడి ఆ ప్రాంతంలో చెట్ల నరికివేతను, వేటను నిషేధించాడు. ఆ 364 మంది చేసిన త్యాగానికి గుర్తుగా అక్కడ అమృతాదేవి ఆలయాన్ని కట్టాడు. ఆ ఆలయంలో యిప్పటికీ పూజలు జరుగుతున్నాయి.

సుందర్ లాల్ బహుగుణ ప్రారంభించిన చిప్ కో ఉద్యమానికి ఈ సంఘటనే స్పూర్తి. చిప్ కో అంటే కౌగిలించుకో అని అర్థం. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే బిష్ణోయ్ తెగవారు యిప్పటికీ వృక్షాలపట్ల, వన్యమృగాల పట్ల ప్రేమను కనబరుస్తున్నారు. తమ ప్రాంతంలో కృష్ణజింకను వేటాడి చంపిన ఓ సినీహీరో మీద కేసుపెట్టి, ఎనిమిదేళ్ళు పోరాటంచేసి, అతనికి శిక్ష పడేటట్లు చేశారు ఈ తెగవారు. తప్ప తాగిన మైకంలో ఒక అర్థరాత్రి, నగరం నడిబొడ్డున తన వాహనాన్ని పెవ్ మెంట్ మీదకు నడిపి ఒకరి చావుకు, మరెందరో గాయపడ్డానికి కారణమైన ఈ హిందీ కథానాయకుడ్ని నాగరీకులు వదిలేనినా, తమకు ఎంతో ప్రాణప్రదమైన ఒక వన్యమృగాన్ని వేటాడినందుకు పట్టుపట్టి, ఎంతో వ్యయప్రయాసల కోర్చి, శిక్షపడేటట్లు చేయడం చెప్పుకోదగ్గ విశేషం.

రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో దాదాపు 60 లక్షల జనాభా దాకా వున్న ఈ గిరిజనులు మనందరికీ ఎంతో స్పూర్తినందిస్తున్నారు.

అయోడైజ్జ్ ఉప్పు అవసరమా

డా|| ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, అమలాపురం

కొంత మంది పిల్లలు చాలా చలాకీగా ఉంటారు. చదువుల్లోనే కాదు ఆటల్లో పాటల్లో ఎప్పుడూ హుషారుగా కనిపిస్తారు. మంచి జ్ఞాపకశక్తి, తెలివితేటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. కాని మరికొంత మంది పిల్లల్లో బుద్ధిమాంధ్యం కనిపిస్తుంది. వారిది ఒట్టి మట్టి బుర్ర అంటుంటారు. అలాంటివారు అన్నింటా వెనకబడి పోతుంటారు. ఎంత చదివినా ఒంట బట్టదు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. ఈ పిల్లలేకాదా పెద్దవాళ్ళయ్యేది. ఏ దేశంలోనైనా ప్రజల్లో ఎక్కువ మంది తెలివి తక్కువ వాళ్ళయితే ఇక ఆ దేశం ఎలా అభివృధ్ధి చెందుతుంది ? అలాంటి దేశాలే ఆర్థికంగా వెనకబడిపోతాయి. ఇది అంతర్టాతీయ స్థాయిలో ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం.

అయోడిన్ అవసరం ఏమిటి ?

అసలు పిల్లల్లో బుద్దిమాంద్యం ఎందుకు వస్తుంది ? మన శరీరం ఎదుగుదలకు, ఆరోగ్యానికి కొన్ని పోషకాలు అవసరం. విటమిన్ A ఇనుము వంటివి చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. వీటిని సూక్ష్మపోషకాలు అంటారు. ఈ సూక్ష్మపోషకాల్లో ముఖ్యమైనది అయోడిన్. సాధారణంగా మనం రోజూతినే ఆహారం నుంచే శరీరానికి కావలసిన అయోడిన్ లభిస్తుంది. దీన్ని థైరాయిడ్ గ్రంథి గ్రహించి, థైరాయిడ్ హార్నోమ్ ల తయారీకి వినియోగిస్తుంది. శరీరం ఎదగడానికి, మెదడు సక్రమంగా పూర్తిస్థాయిలో ఏర్పాటు కావడానికి ఈ హార్మోనులు అవసరం. ఇంత ముఖ్యమైన అయోడిన్ లోపిస్తే ఏమవుతుంది ? ఎన్నో సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంథి పెరిగిపోవడం, (గాయిటర్) బుద్ధి, మందగించడం, శరీరం ఎదుగుదల ఆగిపోవడం, ఆగిపోవడం, చెవుడు, మూగతనం వంటివి అయోడిన్ లోపం వల్ల వచ్చేవే. ఏ వ్యక్తికైనా శరీరం ఎదగడం, మెదడు వృద్ధిచెందడం చిన్న వయసులోనే ఎక్కువగా జరుగుతాయి. ఈ ఎదిగే వయసులో అయోడిన్ లోపం వస్తే, దాని ప్రభావం ఆ పిల్లల మీద తప్పకుండా వుంటుంది. మనకు అయోడిన్ ప్రతిరోజూ అవసరమే. నిజానికి అయోడిన్ అవసరం బిడ్డపుట్టిన తర్వాతనే కాకుండా అంతకు ముందు నుంచి ఉంటుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచీ అయోడిన్ అవసరం మొదలవుతుంది.

పిండ దశలోనే అయోడిన్ లోపం ఉంటే ఎదుగుదల, మెదడు ఏర్పాటు సరిగ్గా వుండవు. అందుచేతనే గర్భినీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, అయోడిన్ లోపం రాకుండా జాగ్రత్త పడాలి.

బిడ్డ పుట్టిన తర్వాత మొదటి మూడేళ్ళు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మెదడు వికసించడం ఈ వయసులోనే జరుగుతుంది. ఈ సమయంలో అయోడిన్ లోపం వస్తే క్లిష్టమైన సమస్యలు వస్తాయి. పెద్దపారయినా సరే ప్రతిరోజూ 150 మైక్రోగ్రాములు అయోడిన్ అవసరం. గర్భిమీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకయితే కాస్త ఎక్కువగా అంటే రోజుకి 200 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. నిజానికి ఇది చాలా తక్కువ. అలాగని ఒకేసారి ఒక చెంచాడు అయోడిన్ తీసుకుంటే 70 ఏళ్ళు వచ్చేదాకా అయోడిన్ అవసరం ఉండదు కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఎక్కువగా ఉన్న అయోడిన్ ను నిల్వచేసుకునే ఏర్పాటు మన శరీరంలో లేదు. ఏ రోజు అవసరానికి ఆ రోజే లభించాలి.. అందుకే అయోడిన్ ను మనం ప్రతి రోజు తీసుకోవాలి.

ఇది మనం తినే ఆహారం ద్వారానే లభించాలి. కాని చాలా ప్రాంతాల్లోని నేలల్లో అయోడిన్ తక్కువగా ఉండడమో లేదా పూర్తిగా లేకపోవడమో గుర్తించబడింది. అలాంటి నేలల్లో ఏపంట వేసినా దానిలో అయోడిన్ లోపం ఉంటుంది. ఈ కారణం చేతనే, ఆహార పదార్థాల్లో అయోడిన్ ను చేర్చవలసిన అవసరం ఏర్పడింది.

ఉప్పునే ఎందుకు అయోడైజ్ చేస్తారు ?

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ రకరకాల ఆహార పదార్థాల్లో ఉప్పును వాడుతున్నారు. పైగా ఇది చాలా చవక. అందుచేతనే అయోడిన్ ను మన శరీరానికి ఏ రోజుకా రోజు అందించేందుకు ఉప్పు ఒక మంచి మార్గంగా గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా అయోడిన్ లోపం ఒక ప్రజారోగ్య సమస్యగా మారడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ లోపాన్ని 2000 సంవత్సరం నాటికి సరిదిద్దాలని 1990 లోనే అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలోనే అయోడైజ్డ్ ఉప్పు వాడకంలోకి వచ్చింది. దాదాపు 100 దేశాల్లో అయోడైజ్డ్ కాని ఉప్పు అమ్మకం మీద నిషేధం ఉంది. మన దేశంలో ఈ నిషేధం ఈ ఏడాది మే 17 నుంచి అమలులోకి వస్తుంది.

మనం తినే ఆహార పదార్థాల్లో వాడే ఉప్పుకు ఈ నిషేధం వర్తిస్తుంది.

సర్వేలు ఏమిచెబుతున్నాయి ?

కేరళలో ఇటీవల జరిగిన సర్వేలో అక్కడ 11 జిల్లాలో అయోడిన్ లోపానికి సంబంధించిన వ్యాధులున్నట్లు తెలిసింది. 17 శాతం పిల్లల్లో గాయిటర్ వ్యాధి వుంది. తమిళనాడులో 1230 మంది విల్లల్ని పరీక్షించగా వారిలో 13 శాతం గాయిటర్ వ్యాధితో ఉన్నట్లు తెలిసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సర్వేచేసిన 312 జిల్లాల్లో అయోడిన్ లోపం తీవ్రమైన సమస్యగా గుర్తించారు. మిగతా జిల్లాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి ఒక కారణం మన దేశంలో అయోడైజ్డ్ ఉప్పువాడకం తక్కువ కావడం. అయోడైజ్డ్ ఉప్పు వాడడానికి చాలా కుటుంబాలు ఎందుకు ముందుకు రావడం లేదు ? ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

ఒకటి ధర. మామూలు ఉప్పు కంటే అయోడైజ్డ్ ఉప్పు ధర దాదాపు రెట్టింపు. ఉప్పుకోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి చాలా మంది ఇష్టపడరు. మరో కారణం ఉప్పు తయారీదారులు తగినంతగా అయోడైజ్డ్ చెయ్యకపోవడం. ఈ ఉప్పును సరిగా రవాణా చేయకపోవడం, సరిగా నిల్వచేయకపోయినా దానిలోని అయోడిన్ నష్టమవుతుంది. అయోడైజ్డ్ లోపం వల్ల వచ్చే సమస్యలతో పోలిస్తే, అయోడైజ్డ్ ఉప్పుకు పెట్టే ఖర్చు అసలు ఖర్చేకాదు. ఈ విషయాలన్నింటి మీద ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం జరగాలి.

అయోడైజ్డ్ ఉప్పులో ఏమి ఉంటాయి ?

అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్ మామూలు ఉప్పుకంటే ఎక్కువ నాణ్యత కలిగి ఉంటుంది. ఇందులో అయోడిన్ పొటాషియం అయోడైడ్ రూపంలో 70 పి.పి.యం దాకా ఉంటుంది. సోడియం క్లోరైడ్ 99.5 శాతం ఉండగా, స్వల్ప పరిమాణంలో కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్ లు, ఐరన్, కాపర్, సోడియం, సిలికో అల్యూమినేట్ ఉంటాయి. అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్ వంటల్లో వాడడానికి అనువుగా ఉంటుంది.

ప్రజల్లో సరైన అవగాహన కలిగించాలి. ఇటీవల యునిసెఫ్ వారు అనేక దేశాల్లో ఒక సర్వే నిర్వహించారు. దీని ప్రకారం చైనాలో 93 శాతం కుటుంబాల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నారు. మనన్మార్ లో 48 శాతం, బంగ్లాదేశ్ లో 70 శాతం, నేపాల్ లో 63 శాతం ఉండగా మన దేశంలో నిన్న మొన్నటిదాకా 37 శాతం మాత్రమే ఉంది. ఈ మధ్య కాలంలో మన దేశంలో అయోడైజ్డ్ ఉప్పు వాడకం 57 శాతం కుటుంబాలకు విస్తరించినట్లు తెలుస్తొంది. ఇది నూరుశాతానికి పెరగాలి. ఈ లక్ష్యం సాధించడానికి కేవలం నాన్ అయోడైజ్డ్ ఉప్పు అమ్మకాన్ని నిషేధించినంత మాత్రాన సరిపోదు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. మరోవైపు అయెడిన్ లోపం వల్ల వచ్చే సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఇందుకు ప్రభుత్వ శాఖలు కూడా కృషిచేయాలి.

పిరమిడ్లు ఎలా నిర్మించారు ?

వి. రాహుల్ జీ

అయిదు వేల ఏండ్ల క్రితం మన పూర్వీకులు రిపమిడ్ లు నిర్మించారు. ఈ పిరమిడ్ లలో ఒక్కోటి రెండున్నర టన్నులుండే రెండు లక్షల ముప్ఫై వేల రాళ్ళు వాడారు. రెండున్నర టన్నులంటే సుమారు ఒత మోటారు కారంత బరువు. ఇంత బ్రహ్మాండమైన కట్టడాలు కట్టినవారు పెద్దపెద్ద చదువులు చదువుకున్నవారు కాదు. ఆ రోజుల్లో ఇంజనీర్లు (అప్పటికి ఇంకా ఇంజనీరు అనే మాటే పుట్టలేదు) భారీ రాతిస్థంబాలు ప్రతిష్టించారు. ఏకశిలతో తయారయిన ఆ స్థంభాలు ఒక్కోటి 24 మీటర్ల పొడవు 400 టన్నుల బరువు వుండేవి. ఇదంతా ఏ రకమైన యంత్రాలు, కనీసం పుల్లీలు లేకుండా ఎలా సాధ్యపడింది. కొంచెం ఆలోచించండి ఇవన్నీ ఎలా చేయగలిగారు ?

మొదట పునాది కట్టేవారు. ఆ తర్వాత ఎక్కడైతే స్థంభం నిలబెట్టాలో ఆ ప్రదేశం చుట్టూ బావిలాగా గోడ కట్టేవారు. ఇప్పుడు ఆ బావిచుట్టూ కొండలాగా మట్టిపోసేవారు. బావిని నిండా ఇసుకతో నింపేవారు.

ఇక స్థంభాన్ని మట్టి కొండ మీద లాక్కుంటూ బావి దగ్గరకు చేర్చేవారు. స్థంభం కింది భాగం బావిలో ఇసుక మీద వుండేటట్టు చూసుకొనేవారు. ఇదంతా అయిన తర్వాత బావి కిందనుంచి ఇసుకను తీసేసేవారు.

ఇసుక తీసేకొద్ది స్థంభం మెల్లగా జారుకుంటూ బావిలో నిలబడుతుంది. (బొమ్మ చూడండి), స్థంభం తన స్థానంలో నిలబడిన తర్వాత మట్టి కొండను బావి గోడలను తీసేస్తారు. ఇక కేవలం స్థంభం మాత్రం తన స్థానంలో నిలబడి వుంటుంది.ఈ రోజుల్లో ఈ పనిని యంత్రాల సహాయంతో ఎంతో తేలికగా ఇంకెంతో వేగంగా చేసెయ్యగలం అయినా ఈ ప్రాచీన నిర్మాత నుంచి భవిష్యత్తు తరాల వారు నేర్చుకోవలసింది చాలా వుంది.సమస్య ఎంత జటిలమైనదైనప్పటికీ, చాలా సార్లు చాలా సులభమైన పరిష్కారం వుంటుంది. దీన్నే మనం మన పూర్వుల నుంచి నేర్చుకోవలసింది.

మిణుగురులు ఎందుకు మెరుస్తాయంటే......

వెచ్చని రాత్రుల్లో, చెమ్మలో నిండిన పొరలు, గడ్డి వుండే ప్రాంతాల్లో, వెలుగుతూ ఆరుతూ వుండే చిన్న చిన్న ఆకుపచ్చ బల్బులు లాగా కనిపించే మిణుగురు పురుగుల గురించి మీలో చాలా మందికి తెలిసే వుంటుంది. మీరెప్పడైనా అలాంటి మిణుగురు పురుగుని పట్టుకొని చూశారా ? లేకపోతే ఈసారి తప్పకుండా ప్రయత్నించండి.

మిణుగురును మీ చేతులతో పట్టుకోగానే ఏం జరుగుతుందో తెలుసా ? వెంటనే దీని నుంచి వచ్చే వెలుతురు ఆగిపోతుంది మీరు దాన్ని వదలి పెట్టేసిన తరువాత మాత్రమే మళ్ళీ దాని నుంచి మెరుపులు మొదలవుతాయి.

అసలింతకీ మిణుగురు పురుగులు ఎందుకలాంటి కాంతిని వెదజల్లుతాయో తెలుసా ? ఆడ, మగ మిణుగురులు ఒక దాన్నొకటి ఆకర్షించు కోవడం కోసం. అవి పరస్పరం పంపించుకునే సంకేతాలే ఆరుతూ వెలుగుతూ వుంటే కాంతి అన్న మాట... వీటికి సంబంధించిన మరికొన్ని విశేషాలేమిటంటే......

- మిణుగురు పురుగుల నుంచి వచ్చే కాంతి ఆకుపచ్చ రంగుల్లో వుంటుంది. - ఆడ, మగ పురుగుల్లో కేవలం మగ మిణుగురులకు మాత్రమే రెక్కలుంటాయి. - మిణుగురుల నుంచి వచ్చే కాంతిలో వేడిమి వుండదు. - మిణుగురుల కడుపులో ఒకానొక పదార్థం లూసిఫెరిన్ యొక్క ఆక్సీకరణంలో (ఆమ్లజనితో) కలవడం వలన కాంతి ఉద్భవిస్తుంది. - మగ పురుగు, ఆడ పురుగు దగ్గరికి చేరినప్పుడు మిణుగురు నుంచి వచ్చే కాంతి మరింత తీవ్రమవుతుంది. ఇందుకు మూల కారణం ఏమిటంటే ఆ సమయంలో మగ పురుగు తాలూతూ శ్వాస క్రియ వేగంగా జరగడం వలన దానికి లభించే ఆక్సిజన్ కూడా బాగా పెరగడమే....

(పై పటంలో ఎ అనేది రెక్కలు లేని ఆడ మిణుగురు పురుగు కాగా బి అనేది మగ మిణుగురు)

పొట్టలో చిల్లు

ప్రమాదవశాత్తూ పేలిన కొన్ని తుపాకుల కారణంగా ఒక మనిషి పొట్టలో ఓ పెద్ద చిల్లు పడింది, ఆ చిల్లుతోనే అతను అనేక దశాబ్ధాల పాటు జీవించడం, ఆ చిల్లుని, ఆధారంగా చేసుకొని ఒక డాక్టరుగారు జీర్ణవ్యవస్థ మీద, జీర్ణ రసాయనాల మీద అనేక అమూల్యమైన పరిశోధనలు చేయడం.... ఇలాంటిదాని గురించి మీరెప్పుడైనా విన్నారా ?..... రండి విజ్ఞానశాస్త్రంలో ఒక మైలురాయి అనదగిన ఆ చారిత్రక ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటిక సుమారు రెండు వందల సంవత్సరాల కిందట.......

అమెరికా సైన్యంలో విలియం బ్యూమాంట్ అనే డాక్టరుగారు పని చేస్తున్నారు. శస్త్రచికిత్సల్లో ఎంతో ఆరితేరిన వాడాయన. అయితే ఈ కథ మొదలయ్యే సమయానికి అతను కెనడాలోని ఓ ద్వీపానికి చెందిన ఒక చిన్న ఊళ్ళో పని చేస్తున్నాడు. అనుభవజ్ఞుడైన ఆ డాక్టరుగారికి అంత చిన్న ఊళ్ళో చేయడానికది ఏమంతగా పని కన్పించలేదు. వూరికే కూర్చోవడం వల్ల అప్పుడప్పుడూ బాగూ విసుకు పుట్టేది కూడా. సరిగ్గా ఇలాంటి సమయంలో అతడి జీవితాన్ని మేలి మలుపు తిప్పిన సంఘటన ఒకటి జరిగింది. అది అతడిని పరిశోధనలు మీద పరిశోధనలు చేసేలా పురిగొల్పింది.

1822 జూన్ 6వ తేది.

అలెక్సిస్ సెంట్ మార్టిన్ అనే ఓ పాతికేళ్ళ యువకుడు, అప్పుడే, సూదీర్ఘమైన నౌకాయానం చేసివచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఉల్లాసంగా కాలం గడిపే మనిషితను. సాహనం చేయరా డింబకా అంటే క్షణం ఆలస్యం చేయకుండా సై అనే రకం. పుష్టిగా, ఎప్పుడూ ఆరోగ్యంగా వుండే అతనికి ఒక కంపెనీ వారు జంతు చర్మాలను నౌకల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసే పనిని అప్పగించారు. ప్రస్తుతం ఆ పని మీదే తిరుగుతూ తిరుగుతూ అతనా ఊరికి వచ్చాడు. కంపెనీవారి సామాన్ల మధ్య, అనేక మందితో కలిసి మార్టిన్ విశ్రమించాడు. సరిగ్గా అప్పుడే జరిగింది ఆ సంఘటన,,,

ఒక తాగుబోతు యాత్రికుడు గుళ్ళతో నిండివున్న తుపాకీనీ ఎలా పడితే అలా శుభ్రం చేయసాగాడు. ఇంకేముంది ? ఉన్నట్టుండి అది పేలింది. తుపాకీలో మొత్తం గుండ్లు, మందు శరవేగంగా వచ్చి మార్టిన్ శరీరంలోకి దూసుకుపోయాయి.... అవన్నీ సరిగ్గా అతడి సరిగ్గా అతడి ఛాతీ కింద భాగంలోకి - అంటే పొట్టలోకి దూసుకుపోయాయి. అనూహ్యమైన సంఘటన.

ఇది జరిగిన కొన్ని నిమిషాలకే... కనీవినీ ఎరుగని రీతిలో గాయాలపైలైన మార్టిన్ కి డాక్టర్ బ్యుమాంట్ చికిత్స చేయడం ప్రారంభించాడు. అతని పొట్టలో బాగా జరిగినా సరే మార్టిన్ ఇంకా ఒతికే వుండటం చూసి డాక్టరుగారికి మొదట మహా కంగారుగా అన్పించింది. మార్టిన్ పొట్టలో ఎంత పెద్ద చిల్లు పడిందంటే అది డాక్టరుగారి అరచేయికన్నా పెద్దగా వుంది. అందులోంచి మార్టిన్ ప్రేగులు, జీర్ణాశయంలోని కొంత భాగం స్పష్టంగా కన్పిస్తున్నాయి.

ఎలాగైతేనేం డాక్టర్ బ్యూమాంట్ గాయాన్ని శుభ్రంచేసి కట్టుకట్టాడు. మార్టిన్ బ్రతికే అవకాశాలు ఏ మాత్రం లేవని అతను అనుకున్నాడు. ఇప్పుడో అప్పుడో అతను తప్పక చనిపోవలసిందేనని అనుకున్నాడు. కానీ అందరికీ చాలా ఆశ్చర్యానికి గురిచేస్తూ మార్టిన్ కోలుకున్నాడు. అతని పొట్టకి అయిన గాయం అనూహ్యంగా నయమైంది. అయితే జీర్ణాశయం మాత్రం తన అసలు స్థానానికి తిరిగి వెళ్ళకుండా, ఛాతీగోడలకు అంటుకొని వుండిపోయింది. గాయం పరిసరాల్లో కొత్త చర్మం వచ్చింది. అయితే పొట్టకి అయిన రంధ్రం మాత్రం పూడుకుపోలేదు. ఎంతో కొంత పుట్టుకొచ్చి, అది చిల్లు మీద వేలాడుతూ వుండసాగింది. ఒక వేళ ఎవరైనా ఈ పరదాను ఎత్తి చూస్తే మార్టిన్ జీర్ణాశయం లోపల ఏముందో కనిపించేది. ఎంత విచిత్రమైన పరిస్థితో కదా...డాక్టర్ బ్యూమాంట్ కి పరిస్థితి ఏమిటో స్పష్టంగా అర్థమయింది. ఇప్పటిదాకా చరిత్రలో ఏ డాక్టరుకి లభించని ఒక గొప్ప అవకాశం, బహుశా ఇకపై ఇంకెవరికీ లభించని ఒక అతి అరుదైన అవకాశం తనకు లభిస్తుంది. వదిలి పెడితే తనంత మూర్ఖడు ఉండడు. అనుకున్నాడు.

చరిత్రలో తొలిసారిగా, ఒక సజీవంగా ఉన్న (మనిషి) పొట్టలోపల ఏమి వుంటుందో, అందులో ఆహారం ఎలా జీర్ణమవుతుందో డాక్టర్ బ్యూమాంట్ చూడగలిగాడు. ఆహారం జీర్ణం కావడం అనే ప్రక్రియలో ఉన్న పలు రహస్యాలను తెలుసుకోగలిగాడు. ఇందుకై మార్టన్ చిల్లు పొట్టతో రకరకాల ప్రయోగాలు చేయసాగాడు. మార్టిన్ కు అవన్నీ ఇష్టం లేకపోయినప్పటికీ సగం మనస్సుతోనైనా ఒప్పుకోక తప్పలేదు.ఎందుకంటే..... ఇప్పడతను తన తిండికి, ఆశ్రయానికి డాక్టరుగారి మీదే ఆధారపడి వున్నాడు. మునుపటిలాగా తూలుతూ గెంతుతూ నావికుడినా పనిచేస్తే శక్తి సామర్థ్యాలు ఇప్పుడతనిలో లేవు. అదీగాక ఈ పరిశోధనలు వల్ల అందరకీ ఎంతో కొంత మేలు జరుగుతుందని డాక్టరు అనుకుంటున్నాడాయె, ఇక ఊ అనక అంచేస్తాడు ?

జీర్ణక్రియకు సంబంధించిన అనేక రహస్యాలను వెలుగులోకి తేవాలన్న ఆశయం, తప్పించి మార్టిన్ ని హింసించే వుద్దేశ్యం డాక్టరుగారికి లేదు. అందుకే బాగా ఆలోచించి. మార్టిన్ కి ఇబ్బంది కల్గించని విధంగా తన పరిశోదనలకు రూపకల్పన చేసుకొనేవాడు.

మాసం ముక్కలు రొట్టెముక్కలు వంటి ఆహారపు తునకలకు పట్టుదారాన్ని కట్టి, మెల్లగా మార్టిన్ కడుపులోకి (జీర్ణాశయం) వదిలేవాడు డాక్టరు అంతటిలో ఊరుకోకుండా అప్పుడప్పుడు వాటిని బయటకు తీసి, అవి ఎంతవరకూ అరిగాయో గమనించేవాడు. వివిధ దశల్లో వాటికి అంటి ఉండే రసాలను సేకరించేవాడు. ఆ రసాలపై పరిశోధనలు సాగించేవాడు. పొట్టలో తయారయ్యే వివిధ రసాలను (ఎంజైములు) డాక్టరు బ్యూమాంట్ ఈ విధంగానే సేకరించి వీటిని లోతుగా అధ్యయనం చేశాడు. ఆహారపు ముక్కలను వదిలి పెట్టినట్లుగానే, పొట్టలోకి ఒక ధర్మామీటర్ ని కూడా వదిలి వేరువేరు సందర్భాలలో పొట్టలోపలి భాగంలో ఉష్ణోగ్రత ఏమేరకు ఉంటుందో తెలుసుకున్నాడు. డాక్టర్ బ్యూమాంట్ కన్నా ముందు చరిత్రలో ఎవ్వరికీ ఇలాంటి పరిశోధనలు చేసే అవకాశం రాకపోవడాన్ని గమనించాలి.

ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు.... 12 సంవత్సరాలపాటు డాక్టరు బ్యూమాంట్ మార్టిన్ జీర్ణాశయం పై తన పరిశోధలు సాగించారు. అమూల్యమైన తన పరిశోధనా ఫలితాలను ప్రపంచంలోని అందరు శాస్త్రజ్ఞులకీ, వైద్యులకీ పంచి ఇచ్చాడు, అంతేగాక విజ్ఞాన శాస్త్రంలో ఆహారం దాన్ని శరీరం ఏ విధంగా వుపయోగించుకుంటుంది.అంశాలకు సంబంధించిన ఒక సరికొత్త శాఖను అంకురార్పణ కూడా చేశాడు. విలువైన తన పరిశోధన కారణంగా డాక్టరు బ్యూమాంట్ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులలో ఒకడిగా నిలిచాడు. అనేక సన్మానాలను, గౌరవ పురస్కారాలను పొందాడు.

డాక్టరుగారి సంగతి సరే, ఆయన పరిశోధనాలకు ఒక అపురూపమైన స్పెసిమన్ గా నిలిచిన సెంట్ మార్టిన్ సంగతి ఏమయ్యింది. అని మీరు అడగబోతున్నారు కదూ.. అయనకేమండి. పొట్టలో చిల్లు పడ్డాక కూడా మరో 58 ఏళ్ళు నిక్షేపంగా జీవించి వైద్యరంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి సంభ్రమాశ్చర్యాలకు గురుచేసాడు.

తన పొట్టలో చిల్లుని ప్రదర్శించవలసిందిగా కోరుతూ. మార్టిన్ కి అనేక ప్రదేశాల నుండి లెక్కలేనన్ని ఆహ్వానాలు వచ్చేవి. ఆ విధంగా అతను కూడా బాగా ప్రసిద్ధుడైపోయాడు. వెళ్ళిన ప్రతిచోట తన చిల్లుపొట్టని ప్రదర్శించడం ద్వారా అతనికి మంచి ఆదాయం వచ్చేది. ఆ డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించేవాడు. ఈయన గురించి చెప్పుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డాక్టరుగారు కేవలం 60 ఏళ్ళు మాత్రమే. బతికితే, ఈ మార్టిన్ గారు ఆయన కన్నా ఓ 23 ఏళ్ళు ఎక్కువగా జీవించాడు. ఆనందంగా.....

గమ్మత్తు గణితం

హన్స్ లాల్ జయరాజ్, కరీంనగర్

ఈనాటి అంతర్జాతీయ క్రీడలలో చదరంగం ఒక ముఖ్యమైన స్థానంలో ఉంది. ఈ చదరంగం ఆటను మన భారతదేశానికి చెందిన ఒక సాధారణ వ్యక్తి కనిపెట్టాడని చాలా మందికి తెలిసుండకపోవచ్చు.

శేత అనే వ్యక్తి తన మహారాజు విరామ సమయాల్లో మెదడు పదును పెట్టడం గురించి, ఎత్తులు, పై ఎత్తులూ వేయడం లాంటివి చేయడానికి ఈ చదరంగం బోర్డును తయారు చేసి, ఆయనకు సమర్పించారు ఆట గురించి తెలుసుకుని పరమానంద భరితుడైన ఆ రాజు శేత తో నీకేం కావాలో కోరుకో అన్నాడు. గణిత శాస్త్రంలో ప్రవేశం ఉన్న అతను మహారాజా నాకు పెద్ద కోరికలేం లేవు. నేను చేసిన బోర్టులో 64 గళ్ళున్నాయి. మొదటి గడిలో ఒక ధాన్యం గింజని వేయించండి. అన్నాడు.

ఒకే ధాన్యం గింజను తీసుకుని నన్ను అవమానిస్తావా? నేనెవరనుకుంటున్నావ్ అని మండిపడ్డాడు రాజు. నా కోరిక ఇంకా పూర్తవలేదు మహారాజు... మొదటి గడిలో ఒక గింజ వేసి, దానికి రెంట్టింపు గింజలను రెండవ గడిలో, వాటిలో రెట్టింపు చేసుకొంటూ 64 గడులు పూర్తిచేయించండి. అంటే మొదటి గడిలో 1 రెండవ గడిలో 2, మూడవ గడిలో 4 నాల్గవ గడిలో 8 ఐదవ గడిలో 16 అలా వేయించండి అదే నాకు చాలు అన్నాడు.

సరే అలాగే తీసుకోండి ? ఎవరక్కడ ? శేతగారికి సకల మర్యాదలతోను వారు కోరుకున్నట్లు ధాన్యాన్ని ఇచ్చి, పట్టు పీతాంబరాలతోను, సకల ఆభరణాలతోనూ సత్కరించి పంపండి. అని ఆజ్ఞాపించి మందిరానికి వెళ్ళిపోయాడు రాజు.

ఆస్థాన గణిత శాస్త్రజ్ఞులు లెక్కల్లో పడ్డారు. వారు చేప్పిన ప్రకారం వారు చెప్పిన ప్రకారం భటులు ధాన్యాగారం నుంచి ధాన్యం తెచ్చి కుప్పగా పోస్తున్నారు.

రాత్రి పడుకునే ముందు రాజుగారు భటుణ్ణి పిలిచి శేతను గురించి అడిగారు.

మహాప్రభో మీరు వరమిచ్చేశారు. కానీ అది ఆచరణలో పెట్టడానికి మొత్తం సిబ్బంది పని చేసినా సరిపోవడం లేదు. పైగా ధాన్యం సరిపోతుందో లేదో అని భయంగా వుంది. ఎంత ధైర్యం నా ధాన్యాగారంలో అంత ధాన్యం లేదా అవమానం ఆరు నూరయినా, ఆకాశం తిరగబడినా, అతన్ని ముందు సత్కరించండి. అని పోయిపడుకున్నాడు.

ఉదయమే లేచి కబురంపాడు. మంత్రిగారొచ్చి మహాప్రభో... అతని కోరిక అత్యంత అసాద్యమైనది. 64 గళ్ళూ నింపడానికి మన దేశంలోని ధాన్యమే కాక ఇతర దేశాల నుంచి రప్పించినా సరిపోదు. మీరకు తక్షణం మీ వరాన్ని ఉపసంహరించుకొని అతనిని క్షమార్పణ కోరండి. అని సలహా ఇచ్చాడు.

వెంటనే రాజు తనని క్షమించమని కోరి, శేతను తగువిధంగా సత్కరించి పంపాడు. మీకు అనుమానంగా ఉంటే ఎన్ని గింజలవుతాయో ఎన్ని బస్తాలవుతాయో ప్రయత్నించండి. ఈ పని సెలవుల్లో చేయండి. కాలక్షేపం అవుతుంది.

సిగ్మండ్ ఫ్రాయిడ్

ఫ్రాయిడ్ నరాల జబ్బు స్పెషలిస్టుగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించాడు. తొలిరోజుల్లో ఫ్రాయిడ్ ఎంతో వ్యతిరేకతను కష్టాలను ఎదుర్కొన్నాడు. చాల్ కాట్ మార్గదర్శకత్వంలో తాను పెంచుకొన్న కొత్త ఆలోచనను చూచి వియన్నా వైద్యసమాజం ఆయనను ఛీకొట్టింది.

వైద్య నిపుణులు ఆయనను దురంగా వుంచినా, రోగులతో తన కార్యక్రమం ప్రతి ఒక్కరినీ ఆకర్షింపసాగింది. కొద్ది సమయంలోనే అతని కన్సల్టింగ్ రూమ్ అన్ని రకాల నరాల వ్యాధులతో బాధపడే రోగులతో నిండి పోయివుండేది. ఈ రోగులకు వైద్యం సమకూర్చుతూ తన ప్రయోగాలు చేయనారంబించేవాడు. తన సిధ్థాతాలను ఆవిష్కరించాడు. తన మొదటి ప్రయోగమైన మూర్ఛకోసం పై పదేళ్ళ పరిశోధనా ఫలితాన్ని 1895 లో ప్రకటించాడు.

హిస్టీరియాపై పరిశోధన వైద్య మనస్తత్వశాస్త్ర చరిత్రలో ఒక మైలురాయి. ఫ్రాయిడ్ న్యూరోటిక్ జబ్బులకు కారణాలను వాటి నివారణలను గురించి తన పరిశోధనలపై ఏ మాత్రం పట్టువీడలేదు. ఈ ప్రయత్నంలో ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు, భావనలు కొత్తవి కావడంతో వైద్యవిద్యలో వైషమ్యాలకు దారితీసింది.

ఫ్రాయిడ్ ఆధునిక సిద్ధాంతాలు కలలకు అర్థాన్ని వివరించాయి. అపస్మారక శక్తుల గురించి వివరించాయి. దెయ్యాలు, భూతాలు, పూనకాలు, పరకాయప్రదేశ విద్యలను చావుదెబ్బకొట్టాయి. 1900 సం,,లో ఫ్రాయిడ్ ప్రచురించిన interpretation of dreams ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చింది. తన రచనలపట్ల ఎన్నో తీవ్రవాదనలు చెలరేగినా సైకో అనాలసిన్ (మనో విశ్లేషణ) నరాలవ్యాధి నిర్ధారణకు ఒక పద్ధతిగా ఒక నియమంగా రూపొందింది. ఫ్రాయిడ్ ను వైద్య మనస్తత్వ శాస్త్రంలో ధృవతారగా నిలిపింది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/8/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate