অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మానవ అవయవ దానం సంబంధించిన చట్టాలు

మానవ అవయవాలు మార్పిడి చట్టం, 1994.


మానవ అవయవాలు చట్టం, 1994, 1994లో పార్లమెంటు ఆమోదించిన చట్టం. ఇది గోవా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో మరియు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో ఫిబ్రవరి 4, 1995లో అమలులోకి వచ్చింది. ఆ తరువాత ఇది మానవ అవయవాలు మార్పుడిని నియంత్రించేందుకు, సొంత చట్టాలు కలిగిన జమ్మూ కాశ్మీర్, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలలో తప్ప, అన్ని రాష్ట్రాలు ఆమలు పరుస్తున్నాయి.

చట్టం యొక్క ఉద్దేశ్యం
చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం నిల్వ మరియు చికిత్సా ప్రయోజనాల కోసం మానవ అవయవాల మార్పిడిని నియంత్రించటం మరియు మానవ అవయవాలతో వాణిజ్య వ్యవహారాలను నివారించడం.
ఈ చట్టం మానవ అవయవాల సంరక్షణ, తొలగింపు, నిల్వకు సంబంధించిన వాటి గురించిన వివరణాత్మక నిబంధనలను కలిగి ఉంది.  ఆస్పత్రుల అవయవాల సంరక్షణ, తొలగింపు, నిల్వకు సంబంధించిన నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఇది ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ మరియు సంబంధించిన అధికారాలు ఇంకా శిక్ష / జరిమానాల   నిబంధనలను కలిగి ఉంది.
మరింత సమాచారం కోసం,

THOA చట్టం 1994 – చూడండి

మానవ అవయవాల మార్పిడి (సవరణ) చట్టం, 2011


భారత ప్రభుత్వ మానవ అవయవాల మార్పిడి (సవరణ) చట్టం, 2011 అవయవాలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని అనుమతిస్తుంది.  జాబితాలో తాతలు మరియు మునుమనవళ్లను చేర్చి దాతల సమూహన్ని విస్తరిస్తుంది. అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి క్రిందివి ఈ చట్టంలో కొన్ని ముఖ్యమైన సవరణలు .

 

 1. మరణించిన దాతలు నుండి అవయవాలను తీయడానికి 'రిట్రీవల్ కేంద్రాల' కల్పన  మరియు సవరించిన చట్టం క్రింద వారి రిజిస్ట్రేషన్ను చేయాలి.
  2. సమీప బంధువులు అనే నిర్వచనంలో  వారి తాతలు మరియు మునుమనవళ్లను చేర్చారు.
  3. బ్రెయిన్ మరణం సర్టిఫికేషన్ బోర్డును సరళీకృతం చేశారు మరియు మరింత మంది నిపుణులను ఈ ధ్రువీకరణ చేయడానికి అనుమతించారు.
  4. ఐసీయూ రోగి మెదడు కణాలు మరణించిన సంఘటన విషయంలో 'తప్పనిసరి' విచారణ మరియు సమాచారాన్నిఇవ్వాలి.
  5.'పారదర్శక సమన్వయకర్త' మానవ అవయవాలను తొలగించడం లేదా మార్పిడికి సంబంధించిన అన్ని విషయాలపై తప్పనిసరిగా సమన్మయం చేయాలి.
  6. జాతీయ మానవ అవయవాలు మరియు కణజాలాల తొలగింపు మరియు నిల్వ నెట్వర్క్ ఒకటి లేదా మరిన్ని ప్రదేశాలలో కల్పన మరియు ప్రాంతీయ నెట్వర్క్ కల్పన .
  7. దాతలు మరియు స్వీకర్తల జాతీయ నమోదు ఏర్పాటు.
  8. కంటి దానాన్ని సులభం చేయడానికి శిక్షణ పొందిన నిపుణులు దాత కంటిని తొలగించడానికి అనుమతించబడ్డారు.

 

మానవ అవయవాలు మరియు కణజాలాల  మార్పిడి నియమాలు(THOT), 2014


మానవ అవయవాలు మరియు కణజాలాల మార్పిడి నియమాలు (THOT), 2014లో నియమాల దుర్వినియోగం/ అపోహలను తగ్గించడానికి మరియు అవయవ దానం లోపాలను తొలగించడానికి అనేక నిబంధనలు ఉన్నాయి. వాటిలో క్రిందివి కొన్ని

 

 1. మార్పిడి ఆపరేషన్ జట్టులోని వైద్యుడు ఎవరైతే మార్పిడి ఆపరేషనులు చేస్తారో వారు అధికార కమిటీ సభ్యులుగా ఉండకూడదు.
 2. ప్రతిపాదిత దాత లేదా గ్రహీత ఇద్దరూ భారతీయులు కాకాపోతే అలాంటి వాటిని అధికార కమిటీ తనికీ చేస్తుంది. దాత భారతీయుడై గ్రహీత విదేశీయుడైతే మార్పిడిని అనుమతించదు. ఒకవేళ వాళ్లు సమీప బంధువులు అయితే మార్పుడిని అనుమతిస్తుంది.
 3. ఇచ్చి పుచ్చుకొనే ప్రతిపాదిత బదిలీలు ఆసుపత్రి లేదా జిల్లా లేదా రాష్ట్ర అధికార కమిటీకి తెలియ చేయాలి.  దాత మరియు గ్రహీతల సమీప బంధువులు అయి ఉండాలి.
 4. రోగికి ఒక వారం లోపల అవయవ మార్పిడి అవసరం అయి  క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, దాత లేదా గ్రహీత అధికార కమిటీ మూల్యాంకనం వేగవంతం చేయమని ఇన్చార్జి ఆసుపత్రి ఆశ్రయించవచ్చు.
 5. ఆథరైజేషన్ కమిటీలో కనీసం నలుగురు సభ్యులు ఉండాలి అందులో ఒకరు హెల్త్ అండ్ సర్వీసెస్ లేదా చైర్మన్, కార్యదర్శి (ఆరోగ్యం) లేదా డైరెక్టర్ మూల్యాకనంలో పాల్గొనడం తప్పనిసరి.
 6. ప్రతి అధికారిక మార్పిడి కేంద్రం  సొంత వెబ్ సైటును కలిగి ఉండాలి. మంజూరుకోసం సమావేశం అయిన ఇరవై నాలుగు గంటల్లో తుది నిర్ణయం తీసుకోవాలి. ఇరవై నాలుగు గంటల్లో ఆసుపత్రిలో మరియు వెబ్ సైటు నోటీసు బోర్డులో తమ నిర్ణయాన్ని చూపించాలి. ఆనిర్ణయం అనుమతి లేదా తిరస్కారం కావచ్చు.  మార్పిడి కేంద్రం యొక్క వెబ్ సైటు రాష్ట్రం/ప్రాంతీయ/నేషనల్ నెట్వర్క్స్  లింకు అయిఉండాలి.  ఇందులో అవయవాల కొనుగోలు, పంపకం మరియు మార్పిడికి సంబంధించిన వివరాలు ఉండాలి.
 7. కేంద్రంలో అత్యున్నత జాతీయ నెట్వర్కింగ్ సంస్థ ఉండాలి. ఆర్గాన్ (లు) లేదా కణజాలం (లు) మార్పిడికి సంబంధిచిన  ప్రాంతీయ రాష్ట్ర స్థాయి నెట్వర్కింగ్ సంస్థలు ఉండొచ్చు. రాష్ట్ర యూనిట్లు వారి ప్రాంతంలో ఆర్గాన్ /కణజాల  ల్యాబ్స్ మరియు కణజాల బ్యాంకులు మరియు ప్రాంతీయ మరియు జాతీయ నెట్వర్కింగ్ సంస్థలకు ఇంకా ఆస్పత్రులకు అనుసంధానం అవుతాయి. ఇటువంటి నెట్వర్కుల సమన్వయ కమిటీలు సేకరణ, నిల్వ, రవాణా, మ్యాచింగ్, అవయవాలు/కణజాలముల కేటాయింపు మరియు మార్పిడి మరియు నిబంధనలను మరియు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అభివృద్ధి చేయాలి.
 8. మానవ అవయవ గ్రహీతల మరియు దాతల రిజిస్ట్రేషన్ను వెబ్ సైట్లద్వారా తెలుసుకోవచ్చు. ఇవి జాతీయ , ప్రాంతీయ మరియు రాష్ట్ర స్థాయి వివరాలను కలిగి ఉంటాయి. జాతీయ/ప్రాంతీయ రిజిస్ట్రీ రాష్ట్ర స్థాయిలోని ఇతర రిజిస్ట్రీల ఆధారంగా సంకలనం చేయబడతాయి. డేటాబేస్ లోని ప్రజల గుర్తింపును పబ్లిక్ డొమైన్ ఉంచకూడదు.

 

సంబంధించిన వనరుల

NOTTO

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate