హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / డి విటమిన్ గురించి..
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

డి విటమిన్ గురించి..

డి విటమిన్ గురించి..

మానవుడి శరీరంలో డి విటమిన్ చేసేటువంటి మేలు నిజంగా ఎంతో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎముకలు ఆరోగ్యంగ ఉండటానికి సహకరిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా బలంగా ఉండేట్టు చేస్తుంది.. రక్తం లో ఉన్న నాళాలను కాపాడుతుంది. ఇన్సులిని సరిగా జరుగుతున్నదా అనేది కూడా గమనిస్తూ ఉంటుంది.అందువల్లనే శరీర శ్రమ తగ్గి పోయి రక రకాల సమస్యలు పరిణమిస్తున్న తరుణంలో విటమిన్ డి ఎక్కువగా డిమాండు పెరిగిందని అనాలి. ఇది తగ్గితే ఆకలి అంతగా లేకపోవటం , బరువు తగ్గుదల, నిద్ర సరిగా పట్టక పోవటం, వంట్లో నీరసం, వంటి సమస్యలు తరచూ వేధించే అవకాశాలు వున్నాయి. ఇటీవల దీనికి సంబంధించి మరో నూతన సమాచారం వెలుగు చూసింది. డి విటమిన్ తక్కువగా ఉంటే తలనొప్పి ప్రబలుతున్నట్టు తేలింది. అయితే ఇది పురుషుల్లో బాగా కనపడటం గమనించ దగ్గ విషయం. డి విటమిన్ స్థాయిలు 20 యెన్ జి /ఎం ఎల్ నుంచి 50  ఎం జి /  ఎం ఎల్ వరకు ఉండటాన్ని సహజంగా భావిస్తారు. దీని కన్నా తగ్గితే తల నొప్పి రావటం ఎక్కువవుతున్నట్టు ఫిన్లాండ్ అధ్యనంలో చెబుతున్నది. డి విటమిన్ స్థాయిలు . 6 యెన్ జి / ఎం ఎల్ వున్నా వారితో సరి చూసుకుంటే యెన్ జి / ఎం ఎల్ ఉన్న వారు కనీసం వారానికి ఒకసారి తల నొప్పికి గురి అవుతున్నారని  తెలిసింది. విటమిన్ స్థాయిలు తగ్గుతున్న కొద్దీ తల నొప్పి రావటం కూడా పెరుగుతూ వస్తున్నది. మాటికీ ముందు తల నొప్పితో బాధ పడేవారు అంతగా బయటి వారితో కలసి తిరగక పోవటం, శరీరానికి ఎండా సరిగ్గా సోకక పోవటం దీనికి కారణంగ ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే నిజానికి డి విటమిన్ ఆహరం ద్వారా చాల తక్కువగా అందుతుంది. మన చర్మానికి ఎండ వేడి తగిలినప్పుడు దిన్ని మన శరీరమే తయారు చేసుకుంటుంది. కనుక రోజు చర్మానికి కాసంత సేపు అయినా ఎండ తగిలేట్టు చూసుకోవటం చాల అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. దింతో తలనొప్పి మాత్రమే కాదు ఇతర రకాలైన వ్యాధులను కూడా నియంతరించుకునే వీలుంది.

చ‌ర్మం కిందే విట‌మిన్ డి త‌యారీ

సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీల్లో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

విట‌మిన్ డి ల‌భించే ఆహారాలు

విటమిన్ డి మనకు సూర్యకాంతి వల్లే కాదు, పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా లభిస్తుంది. చేపలు, బీఫ్ లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపిస్తే మాత్రం పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

అనారోగ్య స‌మ‌స్య‌లు

విటమిన్ డి లోపం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు శరీర నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. డయాబెటిస్ వస్తుంది. కనుక ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి మనకు అందడం చాలా ముఖ్యం. నిత్యం సూర్యకాంతిలో కొంత సేపు ఉండడం లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ విటమిన్‌ను పొంది తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

వ్రాసిన వారు : భాస్కర్

2.95
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు