హోమ్ / ఆరోగ్యం / మానసిక వైద్యుడు లేనిచోట / మానసిక ఆరోగ్యం పెంపుదల, అనుకూలవాదన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మానసిక ఆరోగ్యం పెంపుదల, అనుకూలవాదన

మానసిక ఆరోగ్యం పెంపుదల, అనుకూలవాదన

మానసిక ఆరోగ్యానికి ఆసరాబృందాలు

క్రమంగా కలుస్తూ, తమందరికీ ఉన్న సమాన అంశాల్ని చర్చించుకునే వ్యక్తుల సమూహమే ఆసరాబృందం. ఆసరా బృందం ప్రాసఁగికదీ: ఏదో ఒక లక్షణాన్ని పరస్పరం పంచుకుంటారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి రెండు రకాల ఆసరా బృందాల ప్రాసంగికత వుంటుంది:

 • ఒకేరకపు మానసిక వ్యాధితో బాధ పడుతున్నవారు, దీనికి మంచి ఉదాహరణ మద్యపానం సమస్యలు వున్నవారు క్రమబద్ధంగా కలుసుకునే ఆల్కహాలిక్ ఎనానిమస్.
 • ఒక ప్రత్యేక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని సంరక్షించే వ్యక్తుల సముదాయం- ఉదాహరణలు, మతిమరపుతో బాధపడుతున్నవారిని, తీవ్రమైన మానసిక వ్యాధులు వున్నవారిని, బుద్ధిమాంద్యం వున్నవారిని సంరక్షించే కుటుంబ సభ్యులు.

ఆసరా బృందాలు ఎలా పనిచేస్తాయి

తమ భావాల్ని సమస్యల్ని ఆలోచనల్ని సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఆసరా బృందాలు అవకాశాన్ని కలిగిస్తాయి. పెట్టె10.1 వాటిగురించి కొన్ని సామాన్య ప్రశ్నలకు జవాబిస్తుంది. బృందాలు ఈక్రింది వాటిని అందించడం ద్వారా పనిచేస్తాయి.

 • ఆచరణకు సూచనలు- ఉదాహరణకు బుద్ధిమాంద్యం వున్న బిడ్డ తల్లి తన బిడ్డ అల్లరిని తనెలా సంబాళించేదో, లేక తాగుడు సమస్యవున్న ఒక వ్యక్తి స్థానిక బ్రాందీషాపుమీదుగా వెళ్తున్నప్పుడు తాగాలనే కోరికను తనెలా అదుపు చేసుకుంటున్నాడో చెప్తారు.
 • సమాచారం-ఉదాహరణకు, షిజోఫ్రినియా ఉన్నవ్యక్తి సోదరుడు ఆ జబ్బుకు కొత్త చికిత్సకు సంబంధించిన వార్తను చెప్పడం లేక మతిమరపు వున్న వ్యక్తి కుమార్తె పెద్ద వారిని సంరక్షించే ఒక కొత్త డేకేర్ హోమ్ గురించి చెప్పడం.
 • పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి అవకాశం-ఉదాహరణకు బుద్ధిమాంద్యం వున్న ఇద్దరు పిల్లల తల్లి లేక తండ్రి వారంలో ఒక రోజున ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం ద్వారా రెండోవారికి ఒకరోజున వేరే పనులు చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది లేక ఒంటరితనంతో బాధపడుతున్న ఇద్దరు షిజోఫ్రినియా వ్యక్తులు కలిసి సినిమాకు వెళ్ళడానికి నిర్ణయించుకోవడం;
 • నేనొక్కడినే ఈ వ్యాధితో బాధపడడంలేదనే భావన.
 • మానసిక వ్యాధి గురించి సున్నితమైన, దుఖఃదాయకమైన భావాల్ని ఆభావాలకు కారణాల్ని అర్థం చేసుకోగలిగిన వారితో పంచుకోగలిగిన చోటు వుండడం.

అంతిమంగా ఆసరాబృందం పరస్పర సహాయాన్ని అందించడం ద్వారా పనిచేస్తుంది. దీని అర్థం బృందం లోని ప్రతి సభ్యుడు ఇతరులకు ఆసరాని అందిస్తూ, ఇతరులనుండి సహాయాన్ని స్వీకరిస్తాడు. మెడికల్ క్లినిక్ లో లాగా రోగి అనే భావనకు విరుద్ధంగా ఇది వారిని శక్తిమంతుల్ని చేసే భావన.

 

ఆసరా బృందాల గురించి కొన్ని సాధారణ ప్రశ్నలు ఎంతమంది సభ్యులు పాల్గొనవచ్చు?

ఈ సంఖ్యే సరైనది అని చెప్పడానికి వీలులేదు. చాలా బృందాలు చిన్న సంఖ్యతో ప్రారంభమవుతాయి. బృందం పెద్దదయినకొద్దీ సహజంగానే ఎక్కువమందికి సహాయం లభిస్తుంది. ఇల్లు ఉన్న ప్రదేశం, పాల్గొనేవారి వయసు మొదలైన వాటి ఆధారంగా చిన్న బృందాలు పని చెయ్యొచ్చు.

ఈబృందం ఎక్కడ కలుస్తుంది?

తగినంతచోటు, ఏకాంతం లభించే ఎక్కడైనా కలవొచ్చు. కాని ప్రతిసారి ఒకేచోట కలవాలి. ఒక్కొక్క సారి ఒకో సభ్యుడి ఇంట్లో కూడా సమావేశాన్ని నిర్వహించుకోవచ్చు.
ఎంత తరచుగా ఈబృందం కలవాలి?
ఎంత తరచుగా కలవాలో ఆబృందమే నిర్ణయించుకోవాలి. సులభంగా సమావేశపు తేదీని గుర్తుంచుకోవడానికి ప్రతినెల మొదటి శనివారం లాంటి ఏదో ఒక నిర్ణీత సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి.
ఎంతఖర్చవుతుంది?
బృంద సభ్యుడిగా వుండడానికి ఖర్చేమీ అవగూడదు. ఆతిథ్యమివ్వడానికయే ఖర్చు (టి, బిస్కట్లు) మాత్రమే వుంటుంది. అదికూడా సభ్యులందరూ ఉమ్మడిగా భరిస్తారు.
ఎంత కాలం ఈబృందం కొనసాగుతుంది?
అది కొనసాగాలని ఆసభ్యులు భావించినంత కాలం. విజయవంతంగా నడిచే బృందాలకు సమయ పరిమితి లేదు, ఉదాహరణకు, ఆల్కహాలిక్స్ ఎనానిమస్ బృందాలు కాలపరిమితి లేకుండా పనిచేస్తాయి. పాల్గొనేవారు మారొచ్చు, వచ్చేవారిలో కొంతమంది మానేయవచ్చు, కొత్తసభ్యులు చేరొచ్చు.
ఈబృందం ఎక్కడ కలుస్తుంది? తగినంతచోటు, ఏకాంతం లభించే ఎక్కడైనా కలవొచ్చు. కాని ప్రతిసారి ఒకేచోట కలవాలి. ఒక్కొక్క సారి ఒకో సభ్యుడి ఇంట్లో కూడా సమావేశాన్ని నిర్వహించుకోవచ్చు.ఎంత తరచుగా ఈబృందం కలవాలి?ఎంత తరచుగా కలవాలో ఆబృందమే నిర్ణయించుకోవాలి. సులభంగా సమావేశపు తేదీని గుర్తుంచుకోవడానికి ప్రతినెల మొదటి శనివారం లాంటి ఏదో ఒక నిర్ణీత సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. ఎంత ఖర్చవుతుంది? బృంద సభ్యుడిగా వుండడానికి ఖర్చేమీ అవగూడదు. ఆతిథ్యమివ్వడానికయే ఖర్చు (టి, బిస్కట్లు) మాత్రమే వుంటుంది. అదికూడా సభ్యులందరూ ఉమ్మడిగా భరిస్తారు.ఎంత కాలం ఈబృందం కొనసాగుతుంది?అది కొనసాగాలని ఆసభ్యులు భావించినంత కాలం. విజయవంతంగా నడిచే బృందాలకు సమయ పరిమితి లేదు, ఉదాహరణకు, ఆల్కహాలిక్స్ ఎనానిమస్ బృందాలు కాలపరిమితి లేకుండా పనిచేస్తాయి. పాల్గొనేవారు మారొచ్చు, వచ్చేవారిలో కొంతమంది మానేయవచ్చు, కొత్తసభ్యులు చేరొచ్చు.

ఆసరాబృందాన్ని ఏర్పాటు చెయ్యడం

ఆసరాబృందాలు కొనసాగడం అంత సులభం కాదు, అన్నిటికంటే ముందు ఈ ఆలోచన పట్ల ఆసక్తి, అంకితభావం వున్న కొంతమంది సభ్యులు అవసరం. ప్రతిఒక్కరికీ ఆసరా బృందాలంటే ఆసక్తి వుండదు. కొంతమందికి తమ వ్యక్తిగత భావాల్ని ఇతరులతో చెప్పుకోవడం ఇష్టం వుండదు. తమకు ఉన్న సమస్యలాంటి సమస్యే వున్న ఇతరుల్ని క్రమబద్ధంగా కలవడంలో ఉన్న ప్రయోజనాన్ని వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. కమ్యూనిటీలో ఆసరాబృందాల్ని ఏర్పాటు చెయ్యడానికి సహాయపడడంలో మీరు మూడు మంచి! పాత్రల్ని పోషించగలరు.

 • సమష్టి సమస్యవున్నవారు ఒకరితో ఒకరు కలిసే ఏర్పాటు చెయ్యండి. మానసిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్న చాలా కుటుంబాలు ఆసమస్య గురించి బిడియపడతాయి, తమ సమస్య గురించి ఇతరులకు తెలియడం వారికి ఇష్టం వుండదు. ఉదాహరణకు కమ్యూనిటీలో బుద్ధిమాంద్యం వున్న బిడ్డగల కుటుంబాలు కొన్ని మీకు తెలిసే వుండొచ్చు. ఒకకుటుంబాన్ని మరొకకుటుంబానికి పరిచయం చెయ్యొచ్చు, చిన్న ఆసరా బృందాన్ని తయూరు చెయ్యడంలో సహాయపడొచ్చు. బయటివారితో చెప్పే ముందుగా దీనిని ప్రతి కుటుంబంతో చర్చించడం ముఖ్యం. మనుషుల్ని కలపడానికి మరొక మార్గం ఒక బహిరంగ ప్రదేశంలో ఆబృందపు సమాచారాన్ని ప్రదర్శించడం, ఉదాహరణకు ఆరోగ్య కేంద్రంలో ఒక పోస్టర్ని పెట్టడం. మీరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో పాల్గొని బృందం గురించి మరింత ఎక్కువ సమాచారం తెలుసుకొనడానికి ఆబృందంలో ఎవరు అర్జులో అందరికీ చెప్పండి.
 • సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి చోటును ఇవ్వండి. ఆసరా బృందాలు సభ్యుల ఇళ్ళల్లో కలవడం మంచిది. కాని ఇది అన్నిసారూ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు అంతగా రద్దీ లేని సమయంలో క్లినిక్‌లో ఒక గదిని వారు కలవడానికి ఇవ్వొచ్చు. అప్పుడు ఒక భద్రమైన చోట వారు ఆసరా బ్బంద సమావేశంలో పాల్గొనడమేకాక మీతో పరీక్ష చేయించుకోవాలనుకుంటే అదికూడా అవుతుంది.
 • బ్బంద ఏర్పాటుకు సహకరించండి. స్వయంసహాయక బృందాల గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. మొదటి కొన్ని సమావేశాల్లో పాల్గొని వారికి మార్గదర్శకాన్నిస్తూ బృందం కొనసాగడానికి సహాయపడొచ్చు.

మొదటి సమావేశం

బృందానికి కార్యక్రమ నిర్ణయం జరగడానికి మొదటి సమావేశం ముఖ్యమైన సమయం. ఎలాంటి కార్యక్రమాలలో బృందం పాలుపంచు కుంటుంది? ఎంత తరచుగా బృందం కలుస్తుంది? తరువాత ముఖ్యమైన అంశం సభ్యులందరినీ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రోత్సహించగల బ్బంద నాయకుడిని ఎంపిక చెయ్యడం. తరచుగా, బృందాన్ని ఏర్పాటుచెయ్యడానికి సహాయపడిన వ్యక్షే బృంద నాయకుడు అవుతాడు. మొదటి కొన్ని సమావేశాలకు మీరు నాయకుడిగా వ్యవహరించ వచ్చు. బృందాన్ని తమంతట తాము చక్కగా నిర్వహించు కోగలిగినప్పుడు బృందంలో ఒకరిని వారు నాయకుడిగా ఎంపిక చేసుకోగలరు.  కాలానికి నాయకుడు మారుతూ వుంటాడు.

బృంద నాయకుడి పాత్ర

బృందాల మరొలిక నిబంధనలు

ప్రతి బృందంలోనూ కొన్ని మౌలిక నిబంధనలు ఉంటాయి:

 • అక్కడ ఏమి జరుగుతోందో దానిని రహస్యంగా ఉంచడం,
 • ప్రతి ఒక్కరూ ఇతరులు చెప్పేదాన్ని వినడానికి సన్నద్ధంగా వుండడం, వారికి ఇబ్బంది లేనప్పుడు తమ అనుభవాల్ని పంచుకోవడం,
 • ఎవరూకూడా ఇతరుల గురించి తీర్పుల్ని ఇవ్వకుండా, విమర్శించకుండా వుండడం,
 • ప్రతి ఒక్కరూ ఇతరుల పరిస్థితిని గౌరవించడం. ఒకరికి సరైనది మరొకరికి సరైనది కాకపోవచ్చు.

బృందం కొనసాగేలాగా చెయ్యడం

బృందం పాలా పనిచేస్తోందో బ్బంద నిబఁలు నిర్ణీత గడువులో సమీక్షించాలి. మీరు అప్పుడప్పుడూ సమావేశాలకు వెళ్ళి కొంత సమాచారాన్ని ఇస్తూ, బృందాన్ని కొనసాగించడానికి మీ సలహానివ్వొచ్చు. బృందాన్ని కొనసాగించడంలో ఎదురయే సాధారణ ఇబ్బందులు, సమావేశం జరుపుకోవడానికి అసౌకర్యంగా వుండే చోటు, బృందాల్ని కలవడానికి సమయం లేకపోవడం, చర్చలు ఉపయోగకరంగా లేవనిపించడం, తమనోప్రక్కకు నెట్టేసారన్న భావన. ఆసరాబృందం సక్రమంగా పనిచెయ్యడానికి పరిష్కారాలు సహాయపడాలంటే ఈ ఇబ్బందుల్ని గుర్తించడం ముఖ్య౦.

బుద్ధిమాంద్యాన్ని నివారించడం

బుద్ధిమాంద్యం బిడ్డ జీవితాంతం కొనసాగే పరిస్థితి. మనం బుద్ధిమాంద్యాన్ని నివారించగలిగితే బిడ్డకు ఆరోగ్యాన్ని బ్రతుకు అవకాశాల్ని కలిగించినట్లే. బుద్ధిమాంద్యాన్ని నివారించడానికి మీరు చాలా చెయ్యొచ్చు. సులభమైన, ముఖ్యమైన నివారణచర్య తల్లులకు గర్భవతిగా వున్నప్పుడు, ప్రసవమయాక మంచి, నాణ్యమైన సంరక్షణను ఇవ్వడం, తరువాత మంచి, నాణ్యమైన సంరక్షణను బిడ్డకు అందించడం.

బిడ్డపుట్టక ముందు

తల్లి గర్భవతిగా వున్నప్పుడు కీలకమైన విషయం, ఆమెను బాగా సంరక్షించి అవసరమైనప్పుడు పెద్ద ఆసుపత్రికి పంపడం తెలిసి వుండడం. తల్లిని సంరక్షించడంలో ఈ క్రింది విభాగమవుతాయి:

ప్రసవమయేటప్పుడు

ప్రసవం తరువాత

ఎక్కువ ప్రమాదం వున్న వారిగురించి తొలి దశలోనే శ్రద్ధ తీసుకోవడం

నెలలు నిండకమునుపే ప్రసవం, శిశువు తక్కువ బరువుతో పుట్టడం, ఫిట్స్, పచ్చకామెర్లు, మెదడు పొరలకు ఇన్ఫెక్షన్ రావడం, పుట్టినప్పుడు ఆక్సిజన్ సరిపోకపోవడం, డౌన్స్ సిండ్రోమ్ మొదలైన వాటి కారణంగా కొంతమంది పిల్లల ఎదుగుదల ఆలస్యమవొచ్చు. ఈ పిల్లలకు సత్వరచర్యలు తీసుకునే కార్యక్రమాలు అవసరం. మెదడు సక్రమంగా ఎదగడానికి పని, వ్యాయామం, ఉత్తేజం కావాలి. తన శరీరాన్ని మెదడును నెమ్మదిగా ఉపయోగించే బిడ్డకు అదనపు సహాయం అవసరం. ఎదుగుదలలో ఆలస్యాన్ని అరికట్టడానికి లేక అతి తక్కువ స్థాయికి పరిమితం చెయ్యడానికి శిశువు, బిడ్డ లేక కుటుంబంతో తొలి దశలోనే పనిచేసి తగిన చర్యలు తీసుకోవడం అవసరం. సత్వర చర్యల లక్ష్యాలు:

 • బిడ్డ అభివృద్ధిని మెరుగుపరచడం
 • బిడ్డ సాధ్యమైనంత స్వతంత్రంగా బ్రతకడానికి సహాయపడడం
 • వైకల్య పరిణామాల్ని సాధ్యమైనంతగా తగ్గించడం
 • తల్లిదండ్రులకు బిడ్డ వైకల్యం గురించి చెప్పి, వైకల్యం వున్న బిడ్డను సాకడానికి అవసరమైన నైపుణ్యాల్ని నేర్పించడం
 • తల్లిదండ్రులకు బిడ్డ వైకల్యాన్ని అంగీకరించి, కుటుంబాన్ని మెరుగ్గా నడపడానికి సహాయపడడం తొలి దశలో అమలుచేసే కార్యక్రమాలకు కొన్న నిబంధనలు వున్నాయి
 • బిడ్డ ఏమి చెయ్యగలదో, ఏమి చెయ్యలేదో గమనించి బిడ్డ ఎదుగుదల స్థాయిని నిర్ణయించడం;

పాఠశాలల్లో మానసిక ఆరోగ్యం పెంపుదల

పాఠశాలలు విద్యార్థులకు అనేక అవకాశాల్ని అందిస్తాయి. విద్యతోపాటు అక్కడ ఎలా స్నేహితుల్ని పొందాలో, క్రీడల్ని ఆడడం, బృంద కార్యక్రమాలలో పాల్గొనడం ఎలాగో నేర్చుకోవచ్చు, బాగా  చేసినప్పుడు బహుమతిని పొందడంవుంటుంది. చాలామంది పిల్లలు పాఠశాల జీవితాన్ని బాగానే గడుపుతారు. కాని కొంతమంది మొదటినుండి ప్రయాసపడతారు, మరికొంతమంది మొదట్లో బాగానేవున్నప్పటికి తరువాత సంవత్సరాలలో విఫలమవుతారు. పాఠశాల మానసిక ఆరోగ్య కార్యక్రమం రెండు ముఖ్యమైన విషయాల్ని లక్ష్యం చేసుకుంటుంది.

 • చదువు విషయంలోగాని, బడిలో సాంఘిక కార్యక్రమాల విషయంలోగాని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న పిల్లల్ని గుర్తించి వారికి సహాయం చెయ్యడం;
 • పిల్లలు నేర్చుకోవడానికి, ఎదగడానికి సురక్షితమైన, ఆసరానిచ్చే బడి వాతావరణం వుండేలా చెయ్యడం. ఈ విభాగంలో ప్రత్యేకంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యం గురించి చర్చించబడింది

కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు క్రమబద్ధంగా బడి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాంటి కార్యక్రమాల పరిధిని విస్తృతపరచడం ద్వారా సులభంగా బడి ఆరోగ్య కార్యక్రమాలను పెంపొందించవచ్చు. చాలా కార్యక్రమాలు ఉపాధ్యాయుల ద్వారానే నిర్వహింప బడతాయి కనుక వారి భాగస్వామ్యం ఉండడం కీలకం. అంతేకాక ఉపాధ్యాయుడే తరచుగా బిడ్డకు ఇబ్బంది ఉందని, లేక సమస్య రావచ్చని గమనించే మొదటి వ్యక్తి

పాఠశాల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం

బడిలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మీరు బడికి క్రమబద్ధంగా, కనీసం నెలకొకసారి, ఒక నిర్దిష్టమైన రోజున వెళ్ళాలి. అప్పుడు ఉపాధ్యాయులు తాము సవ్యంగా లేరని గమనించిన వారినందరినీ వారి పరిస్థితిని అంచనా

ఆత్మగౌరవాన్ని పెంపొందించడం

ఆత్మగౌరవాన్ని నిర్మించడానికి సహాయం చేసే కార్యక్రమాల వలన పిల్లలందరూ లాభపడతారు (పెట్టె 10.2). ఆత్మగౌరవాన్ని నిర్మించడానికి చేసే కార్యక్రమాలను తరగతి గదిలో చెయ్యడానికి ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించాలి. ఆ కార్యక్రమాల వలన బిడ్డ మానసిక ఆరోగ్యానికి కలగగల లాభాలగురించి ఉపాధ్యాయులకు తెలపడంద్వారా మీరు ముఖ్యమైన పాత్రను పోషించగలరు. మళ్ళీ ఇవి వారి చదువును మెరుగు పరచగలవు, ప్రవర్తనా సమస్యలను, తరగతిగదిలో పోట్లాటల్ని తగ్గించగలవు. ఈ కార్యక్రమాలను వేధింపులకు గురవుతున్న పిల్లలకు లేక పాఠశాలను మానేసిన పిల్లలకు కూడా వర్తింపజేయొచ్చు

పిల్లల్లో ఆత్మగౌరవాన్ని నిర్మించడం– “మనగురించి మనం మెరుగ్గా భావిడ్లాం

భద్రతాభావాన్ని నిర్మించడం.

పిల్లలు తాము క్షేమంగా ఉన్నామని భావించడం, వారి నుంచి ఏమి ఆశింపబడుతోంది అనేది తెలుసుకోవడం అవసరం.దీనిని పెంపొందించడానికి :

 • స్పష్టమైన తరగతి గది నిబంధనలు, పరిధులు వుండాలి-తరగతిగదిలో మాట్లాడేముందు చెయ్యెత్తవలసిన అవసరం, ప్రతి ఒక్కరికి మాట్లాటే అవకాశం వుండేలా చూడడం, మర్యాదగా వుండాల్సిన అవసరం, తరగతిలోకి ప్రతి ఒక్కరికీ ఆహ్వానం, ఆసరా వుంటాయనే విశ్వాసం కలిగించడం;
 • నిబంధనలగురించి, అవి వుండవలసిన అవసరం గురించి చర్చించడం;

ఒక బిడ్డ బడి మానేసినప్పుడు

మానసిక ఆరోగ్యాన్ని తొలి దశలో గుర్తించడం

కొత్త మానసిక అనారోగ్యాన్ని కనిపెట్టడం

తరచుగా మానసిక అనారోగ్యం వున్న వ్యక్తిని మీదగ్గరకు తీసుకురావడానికి చాలా ఆలస్యం జరుగుతుంది. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:

 • చాలా మానసిక వ్యాధులు అతి నెమ్మదిగా మొదలవు+తాయి. ఉదాహరణకు డిప్రెషన్, షిజోఫ్రినియా రావడానికి కొన్ని వారాలు పడుతుంది, అందుచేత అకస్మాత్తుగా ఆరోగ్యం పాడయిందనే భావన వుండదు.
 • కొంతమంది మానసిక వ్యాధి అంటే బిడియ పడి, న్యూనతతో వ్యాధి వున్నవారిని ఇతరులకు కనపడకుండా దాస్తారు.
 • కొన్ని కుటుంబాలు మానసిక వ్యాధి వున్న బంధువును మత, ఆధ్యాత్మిక వైద్యులకు చూపిస్తారు. వారు మానసిక వ్యాధి శాపం లేక చేతబడి ఫలితమని భావించడమే దానికి కారణం.

శారీరక వ్యాధులకు వలెనే మానసిక వ్యాధులకు కూడా ఎంత త్వరగా వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే అంత బాగా ఫలితం వుంటుంది. మీదగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిలోనూ మానసిక వ్యాధి తొలి లక్షణాలు ఉన్నాయేమో నిశితంగా గమనించాలి. అదే సమయంలో కమ్యూనిటీ నాయకుల్ని కూడా ఈవిషయాలపై చైతన్యపరచాలి, ఎందుకంటే మీదగ్గరకు రాని వారిలో కూడా వారు ఈ చిహ్నాల్ని గుర్తించే వీలుంటుంది. తొలి దశలో గుర్తించడానికి అనేక సందర్భాలలో అవకాశాలు వస్తాయి. ఉదాహరణకు ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్యకు క్లినిక్‌లో మిమ్మల్ని సంప్రదిస్తే, మీరు ఇలా అడగొచ్చు ఇంటిదగ్గర అంతా బావుందా? ఇంట్లో మీవాళ్ళంతా ఎలా వున్నారు?. తెలియకపోవడం వలన లేక బిడియం వలన చాలామంది వారంతట వారు స్వచ్ఛందంగా తమ సమస్య గురించి చెప్పరు గనుక మీరు అడగాలని గుర్తుంచుకోండి.

కొన్ని ప్రాంతాలలో బాధలలో ఉన్నవారిని చేరడానికి ఒక మార్గంగా టెలిఫోన్ హాట్లైన్స్ని ఏర్పాటు చెయ్యడం ప్రసిద్ధమవుతోంది. ఈహాట్లైన్స్ని డిప్రెషన్లో ఉన్నవారు, బాధలలో వున్నవారు శిక్షణ పొందిన కౌన్సిలర్ని సలహా లేక మార్గదర్శనం కోసం అడగడానికి ఉపయోగించుకోవచ్చు (మీప్రదేశంలో వున్న వనరులను నమోదు చెయ్యడానికి,  టెలిఫోన్ ద్వారా సంప్రదిస్తున్న వ్యక్తి సమస్యను అంచనా వెయ్యడానికి)

వ్యాధి తిరగబెట్టకుండా నిరోధించడం

దురదృష్టవశాత్తు చాలామంది మానసిక వ్యాధిగ్రస్తులు మరీ త్వరగా మందుల్ని మానేస్తారు, ఇది వ్యాధి తిరగబెట్టేందుకు దారితీస్తుంది. మీరు మానసిక వ్యాధులతో బాధపడుతున్నవారు చికిత్సను అవసరమైనంత కాలం తీసుకునేలాగా చూడాలి. వ్యక్తికి, అతని కుటుంబానికి చికిత్స తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి, మందు తీసుకున్నాక అది పని చెయ్యడానికి పట్టే సమయం గురించి, మందులతో రాగల ఇబ్బందులు, వాటిని తగ్గించే విధానం గురించి బోధించండి. తీవ్రమైన మానసిక వ్యాధి వున్నవారు క్రమబద్ధంగా మీదగ్గరకు పరీక్షకు రానట్లయితే మీరు వారి ఇంటికి వెళ్ళి ఎలావుందో చూడడం వలన వ్యాధి తిరగబెట్టడాన్ని నిరోధించవచ్చు. ఎవరైనా తనకింక మందుల అవసరంలేదని

పట్టుబడితే, తరచుగా ఆమె ఇంటికి వెళ్ళడం ద్వారా వ్యాధి తిరగబెడుతున్న చిహ్నాల్ని కనిపెట్టవచ్చు.

మద్యం, పొగాకు దుర్వినియోగాన్ని నిరోధించడం

మద్యం,పొగాకు, రెండిటి దుర్వినియోగం కలిసి కలిగించే హాని ప్రపంచంలో నివారించగలిగిన మరణాలు, వైకల్యాలకు ప్రధానకారణాలలో ఒకటి. ఒక వైపు మద్యం, మరొక వైపు ఇతర మత్తుమందులు, పొగాకు మధ్య భేదాన్ని కనుగొనడం ముఖ్యం. పరిమితంగా, తెలివిగా తీసుకుంటే తాగుడు ఆరోగ్యాన్ని అంతగా దెబ్బతీయదు, కాని, పొగాకు, మత్తుమందులు మోతాదుతో సంబంధం లేకుండా, ప్రమాదకరం. ఆవిధంగా మద్యం వ్యసనాన్ని నిరోధించడం తెలివిగా తాగడం గురించి ప్రజలకు బోధించే వ్యూహాలపై కేంద్రీకృతమవుతుంది. (సవ్యమైన లైంగిక ప్రవర్తన గురించి బోధించినట్లుగానే). అలాకాక, మత్తుమందులు, పొగాకును పూర్తిగా వాడగూడదనే ప్రచార వ్యూహాలు వుండాలి. కేవలం "నొ" అనిచెప్ప ఈ పదార్థాల నిరోధానికి కీలక నినాదం.

క్లినిక్‌లో నిరోధించడం

అతి  సామాన్య వ్యూహం, ప్రతి ఒక్కరిని రెండు సాధారణ ప్రశ్నల్ని అడగడం:

 • నువ్వు మద్యం తాగుతావా? ఒకవేళ తాగితే, నువ్వెంత తాగుతున్నావో దాని పరిమాణం గురించి చింత వుందా?
 • నువ్వు పొగాకును పీలుస్తావా లేక నములుతావా? ఆవ్యక్తి చెప్పేదాని ఆధారంతో వ్యసనాలవలన వచ్చే ప్రమాదాల గురించి, తాగుడును తగ్గించడం లేక పూర్తిగా పొగాకును మానేయడం గురించి బోధించండి. ఇంతకంటే మెరుగైన నిరోధపద్ధతి వుండదు

కమ్యూనిటీలో నిరోధించడం

మీదేశంలో మద్యం,పొగాకుకు సంబంధించిన చట్టాల గురించి మీకు తెలిసి వుండడం ముఖ్యం. ఉదాహరణకు మద్యం దుకాణాలు కొంత సమయం తరువాత తెరిచి వుంచగూడదు, చిన్నపిల్లలకు మద్యం లేక పొగాకును కొనడానికి అనుమతి లేదు. ఈ చట్టాలను అతిక్రమించే అవకాశం ఉన్నవారి గురించి మీకు తెలిసి వుంటే మీరు కమ్యూనిటీ

బడుల్లో, కళాశాలల్లో నిరోధించడం

మానసిక వ్యాధి ఉన్నవారి హక్కులను పెంపొందించడం

స్టిగ్మా కు సాహిత్య అర్థం శరీరంమీద భౌతిక ముద్ర. కొన్ని సమాజాల్లో మానసిక వ్యాధులు ఉన్నవారిని భిన్నంగా చూపడానికి ఇదే చేసారు. ఈ రోజుల్లో మానసిక వ్యాధులు ఉన్నవారు ఇంకా ఎక్కువగా వెలివేయబడుతున్నారు, ఎక్కువ కపటంగా సమాజంనుంచి నెట్టి వేయబడుతున్నారు. సమాజం కుపువ్యాధి నుంచి ఎయిడ్స్ వ్యాధి వరకు అనేక

మానవహక్కులు, మానసిక వ్యాధి

బాధలలో ఉన్నప్పుడు బాంధవ్యాలు

బాంధవ్యాలు ఎందుకు తెగిపోతాయి

కొన్ని సార్లు చాలా కాలంగా బాంధవ్యంలో అసంతోషం వుంటుంది. కొన్నిసార్లు బిడ్డ చనిపోవడం లేక ఉద్యోగం పోవడం లాంటి అకస్మాత్తుగా జరిగిన సంఘటన వలన బాంధవ్యం సంక్షోభంలో పడుతుంది. బాంధవ్యాలు కష్టాల్లో పడడానికి అనేక సామాన్య కారణాలు ఉంటాయి.

 • పెద్ద జీవిత సంఘటనలు. సంతోషం కలిగించేవి, విచారం కలిగించేవి, రెండూ బాంధవ్యాలు కష్టాల్లో పడడానికి కారణమవుతాయి. ఉదాహరణకు సామాన్యంగా చంటిపిల్లలు తల్లిదండ్రులకు, కుటుంబానికి సంతోషాన్నికలిగిస్తారు. ఐతే, వారు తల్లిదండ్రులమధ్య ఆప్యాయత తగ్గడానికి కూడా కారణమవుతారు. చంటి పిల్లల్ని పెంచడం చాలా శ్రమతో కూడుకున్న పని. తగిన ఆసరాలభించడం లేదని తల్లి భావిస్తే, ఆమెకు ఆగ్రహం కలగొచ్చు. అలాగే భర్త తనభార్యతో తగినంత సమయం గడపడానికి వీలవడం లేదని చికాకు పడొచ్చు. ఉద్యోగం పోవడం లాంటి అసంతోష ఘటనలు మనుషులమీద విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి, ఇతరులతో బాంధవ్యాలలో దుఃఖానికి కారణమవుతాయి. నిరుద్యోగ వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతింటుంది, దానితో అతను విచారంగా, చిరాగ్గా వుంటాడు. అతని భార్య కుటుంబాన్నంతటినీ తనే పోషించాల్సి వచ్చిందని తిరస్కార ధోరణితో వుంటుంది.
 • చాలా సమస్యలు. డబ్బుకొరత వలన కుటుంబం చెయ్యాలనుకున్న చాలా పనులు చెయ్యడానికి సాధ్యమవదు. ఎవరు, ఎంత డబ్బును ఖర్చు పెడుతున్నారు, ఎవరు డబ్బును సంపాదిస్తున్నారు అనే విషయాలు కుటుంబసభ్యుల మధ్య సంఘర్షణలు, వాదాలకు కారణమవుతున్నాయి.
 • హింస. హింసను సంబాళించడం చాలా కష్టం. బాంధవ్యాలలో సామాన్యంగా హింసా పీడితులు భార్యలే. చిన్న
 • పిల్లలు కూడా తల్లిదండ్రుల చేత వేధింపబడవచ్చు, పెద్దవారు తమ పిల్లల వేధింపులకు గురికావచ్చు. బెదిరింపులు, తిట్లు, శారీరక హింసలాగానే బాంధవ్యాన్ని గాయపరుస్తాయి. అలాగే భార్యను సెక్స్‌కి బలవంతం చెయ్యడం వారి మధ్య బాంధవ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది .
 • వేరేవారితో ప్రేమలో పడడం. వివాహమంటే జీవితకాలబంధం అని. కాని ఇది అన్నివేళలా జరగదు. వివాహేతర ప్రేమ వ్యవహారం తరచుగా అసంతోషంగా వున్న వివాహబంధం ఫలితం, ఇది వివాహబంధాన్ని ఇంకా అసంతోషకరంగా చేస్తుంది.
 • లైంగిక ఇబ్బందులు. వివాహబంధంలో ఇది చాలా సున్నితమైన, కాని ముఖ్యమైన అంశం. లైంగిక భాగస్వాములిద్దరూ సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని గడిపినప్పుడే వారిమధ్య బాంధవ్యం సంతోషంగా వుంటుంది. లైంగిక సంతృప్తిఅంటే అర్ధం ఎక్కువస్థాయిలో లైంగిక చర్య జరుగుతూందనికాదు, భార్యాభర్తలిద్దరూ తరచుగా లైంగిక సంపర్కాన్ని ఆనందిస్తున్నారని. ఇద్దరిలో ఒకరికి రెండో వారి కంటే లైంగిక ఆసక్తి తక్కువగా వుంటే లేక ఒక భాగస్వామి తక్కువ లైంగిక సంతృప్తిని పొందుతూంటే సమస్య మొదలవుతుంది. లైంగిక సమస్యలతో అసలు ఇబ్బంది ఇదివ్యక్తి ప్రైవేట్ జీవితానికి సంబంధించినది, ఈ విషయాల్ని వేరేవారితో చర్చించడానికి సిగ్గుపడతారు.
 • అశక్తత, అనారోగ్యాలు. అశక్తత, శారీరకమైనది లేక మానసికమైనది, ముఖ్యంగా చాలా కాలంగా వున్నప్పుడు, బాంధవ్యాన్ని దెబ్బ తీస్తుంది, అశక్తత అంటే అర్థం పనిచెయ్యలేకపోవడం లేక బాంధవ్యాన్ని సంతృప్తికరంగా వుంచే రోజువారీ కార్యక్రమాలలో పాల్గొన లేక పోవడం. అశక్తతతో ఉన్న వ్యక్తి సంరక్షణ తిరస్కారానికి, క్రోపానిక్రి దారితియ్యొచ్చు.
 • మద్యం అలవాటు. మద్యం అలవాటు వున్న వ్యక్తులు, ముఖ్యంగా తాగి వున్నప్పుడు తిడతారు, హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. తాగుడు సమస్యలు డబ్బుసమస్యలకు, లైంగిక ఇబ్బందులకు దారితీస్తాయి.

బాంధవ్యాలను తిరిగి నిర్మించుకోవడానికి సహాయపడడమెలా

బాంధవ్యాలను తిరిగి నిర్మించుకోవడానికి సహాయపడడంలో మీరు ముఖ్యమైన పాత్రను పోషించగలరు.అసంతోషంగా వున్న బాంధవ్యం ఆరోగ్య సమస్యలను కలగజేస్తుందని, లేక ఆరోగ్యాన్నింకా దిగజారుస్తుందని గుర్తుంచుకోవడం కీలకం. దుఃఖపూరితమైన బాంధవ్యం వుందని గుర్తించడం బాంధవ్యాలను తిరిగి నిర్మించుకోవడానికి సహాయపడడంలో మొదటి అడుగు. చిన్న కమ్యూనిటీలో ఒక కుటుంబం గురించి ఇతరులు చెప్పకునే మాటల్నిబట్టి మీకు ఏ కుటుంబంలో బాంధవ్య సమస్య వుందో అర్ధమవుతుంది. ఎక్కువ తరచుగా మీరు బాంధవ్యాల గురించి అడగవలసి వుంటుంది. ఈక్రిందివారికి సమస్యలు ఎదురయే ప్రమాదం వుంటుంది:

భాగస్వాములిద్దరితోనూ ఒకేసారి వారి ఇబ్బందుల గురించి మాట్లాడండి. ఇది సాధ్యం కాకపోతే, విడివిడిగా ఇద్దరితోనూ మాట్లాడండి, కాని వారి బాంధవ్యం ఇంకా దిగజారకుండా చూసుకోవాలనే ఆసక్తి వారికి వుంటే, ఇద్దరూ కలిసి రావాలని స్పష్టం చెయ్యండి. తరచుగా, వారిని ఇబ్బంది పెడుతున్న విషయాలేమిటో దాపరికం లేకుండా చర్చించడం బాంధవ్యాన్ని మెరుగు పరచుకోవడానికి అవసరమయే కొన్ని సూచనలను ఇవ్వడానికి దారితీస్తుంది. నమ్మకాన్ని ఆశను తిరిగి నిర్మించుకోవడానికి తమ భావాల్ని విప్పిచెప్పుకోవడం సహాయపడుతుంది. మీరు కొన్ని ఆచరణలను కూడా సూచించవచ్చు, ఉదాహరణకు, ఒకభాగస్వామిలో అశక్తత వుంటే, లేక ఉద్యోగం పొందడానికి సలహా.

ప్రాథమిక నిబంధనలను ఏర్పరచడం

ప్రాథమిక నిబంధన ఒక భాగస్వామి మరొకర్ని తిట్టగూడదు, కొట్టగూడదు. అప్పుడు వారు తమ భాగస్వామి అనుసరించాలని తను కోరుకుంటున్న ఇతర నిబంధనలను సూచించవచ్చు. తమ బాంధవ్యాన్ని తిరిగి నిర్మించుకునే విధానాన్ని నిర్దేశించే కొన్ని నిబంధనలను భాగస్వాములిద్దరూ మీతో చర్చలో అంగీకరించవచ్చు. ఉదాహరణకు, భార్య తన భర్త తాగుడును తగ్గించి వారానికొకసారి మాత్రమే తాగాలనే షరతును పెట్టొచ్చు. అలాగే భర్త తన స్నేహితుల గురించి తన భార్య నస పెట్టగూడదని చెప్పొచ్చు. ఈ నిబంధనలను వారు అనుసరిస్తున్నారో లేదో గమనిస్తూ, దంపతులిద్దరూ ఎలా మెలగుతున్నారో తెలుసుకోవచ్చు. అన్నీ సక్రమంగా జరుగుతూంటే ఈసూత్రాలన్నీ క్రమేపీ నిత్యజీవితంలో భాగాలవుతాయి.

భావ వ్యక్తీకరణను మెరుగుపరచడం

బాంధవ్యాలను తీరీగి  నిర్మించడానికి ఇది కీలకం. మనుషులు విషయాలు మాట్లాడుకుని సమస్యల్ని స్పష్టంగా తెలుసుకుంటే, వారు ఒకరినొకరు నమ్మడానికి, పరిష్కారాలతో ముందుకు రావడానికి అవకాశం కలుగుతుంది. భాగస్వాములిద్దరిని కొంతసమయం, రోజుకు కనీసం అరగంట, తాము ఆరోజు ఎలా గడిపారో వ్యక్తం చేస్తూ గడపమని చెప్పడం ద్వారా, వారిమధ్య సంభాషణ మెరుగు పడుతుంది. భాగస్వాములు మెరుగ్గా మాట్లాడుకోవడడానికి క్రింద కొన్ని సాధారణ విధానాలు ఉన్నాయి:

ఎప్పుడు విడిపోవాలో తెలుసుకోవడం

కొన్నిసార్లు బాంధవ్యం ఎంత అసంతోషంగా వుంటుందంటే విడిపోవడమే మంచి పరిష్కారం అనిపిస్తుంది. కుటుంబం మొత్తానికి విడిపోవడంకంటే అసంతోషంగా వుండే బాంధవ్యం ఎక్కువ బాధను కలిగిస్తుంది. విడిపోవడమే మంచిది అనిపించే సందర్భాలు ఇవి:

 • బాంధవ్యంలో హింస అలాగే వుండిపోతే లేక ఇంకా ఎక్కువ అవుతూంటే
 • ఒక భాగస్వామికి వివాహేతర సంబంధంవుండి ఆప్రవర్తనను మార్చుకునే ఉద్దేశమే లేకపోతే
 • భాగస్వాములిద్దరూ విడిపోవాలనుకుంటే;
 • సహాయం చేసినప్పటికి వారిమధ్య బాంధవ్యం ఎక్కువ అసంతోషంగా వుంటే.

ఎలా విడిపోవాలో, (ఉదాహరణకు, పిల్లల బాధ్యతల్ని ఇద్దరూ పంచుకోవడం) ఖర్చు ఎక్కువైన, అసహ్యకరమైన

న్యాయపోరాటాలు లేకుండా విడిపోవడం గురించి సరైన నిర్ణయం తీసుకునేలాగా ఇద్దరికీ ఆసరానిస్తూ మీరు సహాయపడగలరు. విడిపోయాక ఇద్దరికి, ముఖ్యంగా ఒంటరిగా మిగిలిన వ్యక్తికి కొత్త జీవితంతో సమాధాన పడేందుకు, సంతోషకరమైన భవిష్యత్తు గురించి ఆశను కల్పిస్తూ కౌన్సిలింగ్ చెయ్యడంలో మీరు ప్రముఖ పాత్రను నిర్వహించగలరు

దారిద్ర్యం, మానసిక ఆరోగ్యం

పేదరికంతో మానసిక ఆరోగ్యం ముడిపడి వుంది. పేదరికంతో అనేక ఒత్తిడులు వుంటాయిగనుక ఇది ఆశ్చర్యకరం కాదు. లేమి పరిస్థితుల్లో జీవించే వ్యక్తికి మానసిక అనారోగ్యం రావడానికి దారితీసేందుకు కొన్ని కారణాలు

ఆ విధంగా పేదరికం కారణంగా మానసిక వ్యాధులు వస్తాయి, మానసిక వ్యాధుల కారణంగా పేదరికం పెరుగుతుంది. ప్రపంచమంతటా గ్లోబలైజేషన్, ఆర్థిక సరళీకరణ ప్రజల నిత్యజీవితంలో పెనుమార్పులకు దారితీస్తున్నాయి. ఈ పథకాలు ప్రతి పౌరుని ఆరోగ్య అంశాల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు తీసేసినందువలన ఆరోగ్య సంరక్షణ ఖరీదయిపోయింది. యూజర్ ఛార్టీలను వసూలు చెయ్యడమంటే ఇంక ప్రజారోగ్య సంరక్షణ ఉచితంకాదు, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ మరీ ఖరీదవుతూంది. మందుల ఖరీదు పెరిగిపోతూంది. ప్రపంచంలో మందుల ఉత్పత్తి, అమ్మకాన్ని నియంత్రించే కొత్త అంతర్జాతీయ చట్టాల అర్థం కొత్త మందులు చాలావరకు ఖరీదవుతాయి. ఆర్థిక సంస్కరణలవలన ఆరోగ్యానికి జరిగే అతి పెద్ద ప్రమాదం ప్రతి కమ్యూనిటీలోనూ అసమానతలు పెరిగిపోవడం. ప్రతి సమాజంలోనూ కొద్దిమంది సంపన్నులు ఇంకా ఎక్కువ సంపన్నులవుతూండగా, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు. ఈ అసమానత భవిష్యత్తులో మన సమాజాల సామరస్యానికి, మిలియన్లమంది పేదల ఆరోగ్యానికి పెద్ద సవాలుగా నిలుస్తూంది.

పేదల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం

పేదరికం తాలూకు సమస్యలు ఎదురైనప్పుడు మానసిక ఆరోగ్య అంశాలు అంత ప్రధానమైనవి కావని ప్రజలు తలుస్తారు. కొంతమంది డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధులు "భౌతిక వాదం", "అతి" ఫలితమని, పేదలకు మానసిక వ్యాధులు విలాసమని లేక మానసిక వ్యాధులు పేదరికపు సహజ పరిణామమని అనుకుంటారు. ఈ నమ్మకాలు తప్ప మానసిక వ్యాధులు పేదల్లో ఎక్కువ సాధారణంగా వుండడమేకాక అవి వారి ఆరోగ్యం, పనిసామర్థ్యం మీద ప్రభావం చూపుతాయి. మానసిక వ్యాధులు పేదరికపు సహజ పరిణామాలు కాదు; నిజానికి చాలామంది పేదలు అన్నిటినీ తట్టుకుని మంచి మానసిక ఆరోగ్యంతో వుంటారు. అలా మానసిక వ్యాధుల్ని పేదరికంతో కలిసి వుండే వ్యాధులలాగా చూడాలి. పేదరికంతో వచ్చే క్షయవ్యాధి చికిత్సకు ఏంటీబయాటిక్ని ఇచ్చినట్లే, పేదరికంతో వచ్చే డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధులకు మీరు చికిత్స చెయ్యగలగాలి. పేదల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఈ క్రింది ప్రయత్నాలను ప్రారంభించవచ్చు

 • కమ్యూనిటీలో మౌలిక సదుపాయాల్ని కల్పించడం. పరిశుభ్రమైన కమ్యూనిటీలో నివసించేవారికి మంచి ఆరోగ్యం వుంటుంది. ఒకవేళ, ఉదాహరణకు, మీరు కమ్యూనిటీలో విరేచనాల వ్యాధుల్ని తగ్గించడానికి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచే పనిలో చురుగ్గా కృషిచేస్తూ వుంటే, ఈ పని మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
 • కమ్యూనిటీలో సాంఘిక సంబంధాలు, సామరస్యం. వ్యక్తిగత స్థాయిలో సాంఘిక సంబంధాలను పెంపొందించడం సులువే అవొచ్చు. ఉదాహరణకు మీకు ఒంటరిగా, అసంతోషంగా జీవిస్తున్న ఒక పెద్ద వ్యక్తి తెలియొచ్చు. దగ్గరలోనే ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి జీవిస్తూ తను చేస్తున్న పని, పిల్లల సంరక్షణ రెండిటినీ నిర్వహించడానికి కష్టపడుతున్న ఒక స్త్రీ కుటుంబం వుంటుంది. ఆ ఇద్దరు భిన్న వ్యక్తుల్ని ఒకరికొకరు సహాయపడమని మీరు సూచించవచ్చు. ఉదాహరణకు ఆపెద్దాయన పగటిపూట  ఆమె పిల్లల్ని చూచుకోవచ్చు, ఆమె అతనితో స్నేహంగా వుంటూ తను వండిన భోజనాన్ని ఆయనతో పంచుకోవచ్చు. e హింస స్థాయిల్ని తగ్గించడం. కమ్యూనిటీ మత, జాతి పరంగా విభజితమై అసమానతలు పెచ్చు మీరినప్పుడు నేరం, హింస ఎక్కువ సాధారణమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇతర కమ్యూనిటీ నాయకులు, మనుషుల అభిప్రాయాల్ని ప్రభావితం చేసే వ్యక్తులతో కలిసి సాంఘిక సామరస్యాన్ని నెలకొల్పాలి. దీనిలో ఇవి వుండొచ్చు :
  • ప్రజల్ని రకరకాలుగా విభజితం చేసే రాజకీయ ఆచరణ రూపాల్ని వెలివేయాలి.
  • పోలీస్, ఆరోగ్యం, న్యాయ వ్యవస్థల పరంగా కమ్యూనిటీ సభ్యులందరితో సమానంగా వ్యవహరించేలా చూడడం.
  • హింసను తగ్గించడానికి అంకితమైన వ్యక్తుల్ని అభ్యర్థులుగా స్థానిక ఎన్నికలలో నిలబెట్టడం.
  • కుటుంబ హింస గురించి ఫిర్యాదులు వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకునేలాగా పోలీస్‌ని
 • కమ్యూనిటీలో ఆర్థిక అవకాశాలను మెరుగు పరచడం. కొత్త ఉద్యోగాల్ని ఇవ్వడానికి లేక ప్రత్యక్షంగా ఆర్థిక అవకాశాల్ని ఇవ్వడాన్ని మీరు ప్రభావితం చెయ్యలేకపోవచ్చు. కాని, సంక్షేమ, ఉద్యోగ పథకాలను లేక కార్యక్రమాల గురించి విపులంగా తెలుసుకోవడం వలన వాటి అవసరం వున్నవారికి తగిన సమాచారం చెప్పొచ్చు. ఉదాహరణకు, సూక్ష్మరుణాల పథకాల ద్వారా చిన్న స్థాయి లోన్లు తీసుకోవడానికి అవకాశం వుంటే అప్పలబారిన పడకుండా జీవించవచ్చు. మీరు స్థానిక కౌన్సిలర్ని లేక మహిళా బృందాలను అలాంటి పథకాలను ప్రారంభించమని ప్రోత్సహించవచ్చు. ఒక ఆరోగ్య కార్యకర్తగా మీస్థాయి అంటే అర్థం మీ సూచనల గురించి మిగతావారు గంభీరంగా ఆలోచిస్తారు.
 • ఆరోగ్య కేంద్రంలో సమర్థమైన సంరక్షణను అందించడం మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించడం, చికిత్స చెయ్యడంలో సమర్థంగా వుండండి. ఇవి పేదరికపు సహజ పరిణామాలేనని కొట్టిపారేయకండి. దానికి బదులు మానసిక వ్యాధికి చికిత్స చేస్తే వ్యాధి తగ్గడమేకాక, వారికి తమ సమస్యల గురించి ఆలోచించి, పరిష్కారాల్ని గుర్తించడానికి అవసరమైన బలాల్ని అందిస్తుంది

జెండర్, మానసిక ఆరోగ్యం

కమ్యూనిటీలో పురుషులు, స్త్రీల స్థాయి, పాత్రలు, హక్కులు, అధికారాలు ఆచరణలో ఎంత తేడాగా వున్నాయో తెలిపే పదం జెండర్ అసమానత. ఈమాన్యువల్లోని ఇతర విభాగాలలో మీరు సమాజంలో స్త్రీల తక్కువ ప్రతిపత్తి కారణంగా కలిగే తీవ్ర పర్యవసానాలలో కొన్నిటిని, గృహహింస, మానభంగం బాధితులవడంలాంటి వాటిని గురించి చదివారు. జెండర్ అసమానత స్త్రీ, పురుషుల మధ్య వ్యక్తిగత సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేయడానికి ఇవి ఉదాహరణలు. ఈ అధ్యాయంలో సమాజం, ఆరోగ్య వ్యవస్థ స్త్రీల మానసిక ఆరోగ్య అంశాల విషయంలో వ్యవహరించే తీరుపై జెండర్ అసమానత ప్రభావం గురించి తెలపడం జరిగింది.

జెండర్ అసమానత, మానసిక ఆరోగ్యం.

మనం స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి వుంటుంది.

 • స్త్రీలు ఎక్కువగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడతారా? ఇది మానసిక వ్యాధి రకం మీద ఆధారపడుతుంది. స్త్రీలు డిప్రెషన్, ఏంగ్టయిటీతో ఎక్కువగా బాధపడతారు. ఐనప్పటికి, ప్రీ, పురుషులిరువురూ సమానంగా తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడతారు, మద్యం సంబంధ ఆరోగ్య సమస్యలు పురుషులలో ఎక్కువ సాధారణం.
 • స్త్రీలు మానసిక వ్యాధులతో ఎందుకు బాధపడతారు? జీవితంలో ఒత్తిడులు వ్యక్తిని సులభంగా డిప్రెషన్‌కి గురయేలాగా చేస్తాయి. జెండర్ అసమానత స్త్రీల జీవితాలలో గణనీయమైన ఒత్తిడికి దారితీస్తుంది. పురుషుడితో సమాన పని చేసే స్త్రీకి ఫురుషుడితో సమాన వేతనం లభించడం లేదు. ఆమె చేసే పనికి విలువ నివ్వడం లేదు. కనుక ఆమెకు విశ్రాంతి తీసుకునే లేక కొంత సమయాన్ని తనకోసం వెచ్చించుకునే హక్కులేదు. ఇంట్లో పిల్లల్ని కనమనే ఒత్తిడి కూడా వుంటుంది.
 • మానసిక వ్యాధులతో బాధపడుతున్న స్త్రీలకి ఏమవుతుంది? స్త్రీలు ఏఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వారికి పురుషులతో సమాన స్థాయి వైద్యం లభించే అవకాశం తక్కువ. ప్రీలకు వచ్చే బాధల్ని బంధువులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా తేలికగా తీసి పడేస్తారు. డిప్రెషన్లో వున్న స్త్రీలకు తమ బాధలకు సరైన చికిత్స లభించదు, పైగా వారికి నిద్రమాత్రల్ని విటమిన్ మాత్రల్ని ఇస్తారు. బుద్ధిమాంద్యానికి గురైన ఆడపిల్లల్ని ప్రత్యేక పాఠశాలలకు పంపరు. మానసిక వ్యాధి వున్న పురుషుడికి వివాహమవుతుంది, కాని మానసిక వ్యాధి వున్న స్త్రీలు ఒంటరిగా మిగిలి పోవలసి వస్తుంది. మానసిక అనారోగ్యం వున్న స్త్రీలు వంట చెయ్యడంపై శ్రద్ధ పెట్టలేకపోయినా, పిల్లల్ని నిర్యక్ష్యం చేసినా, అది వారి స్త్రీత్వానికి విరుద్ధమని విమర్శలకు గురికావలసి వస్తుంది. స్త్రీలకు మానసిక వ్యాధి వుండడం కుటుంబానికి ఆవమానకరమైన విషయంగా పరిగణింప బడుతుంది. మానసిక వ్యాధిగ్రస్తులైన స్త్రీలలో చాలామందికి సాంఘిక ఆసరా వుండదు, మానసిక వ్యాధికి గురైన వివాహిత స్త్రీలలో చాలామందిని వారి పుట్టింటికి పంపేయడం, లేక విడిచి పెట్టేయడం, విడాకులు ఇవ్వడం జరుగుతుంది.

స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం

తమ బ్రతుకుల గురించి తాము నిర్ణయాలు తీసుకునేలాగా స్త్రీలను శక్తిమంతుల్ని చెయ్యడం, పురుషులకు స్త్రీ, పురుషుల సమాన హక్కుల గురించి బోధించడం ద్వారా జెండర్ సమానతను సాధించడం స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ముఖ్యమైన మార్గం. ఈ పనిలో మీరు ఒక ఏక్టివిస్ట్గా మారాలి, స్త్రీల హక్కులగురించి పోరాడాలి. చాలా ప్రదేశాల్లో మహిళా బృందాలు స్త్రీల హక్కుల్ని మెరుగ్గా గుర్తించడం గురించి చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం స్త్రీల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఆరోగ్య కార్యకర్త చెయ్యగల ప్రయోజనకరమైన పని.

స్త్రీలు డిప్రెషన్‌తో బాధపడే అవకాశం వుందని చెప్పడం ద్వారా నిజమైన సాంఘిక సమస్యల్ని ఆరోగ్య సమస్యలుగా పొరబడే అవకాశం వుందని కొంతమంది వాదిస్తారు. అలా, ఒక స్త్రీని భర్త కొట్టడం కారణంగా డిప్రెషన్‌కి గురైతే, అసలు సమస్య ఇంట్లో జరిగే హింస. అదే డిప్రెషన్‌కి ప్రత్యక్షకారణం. ఇది నిజమే ఐనప్పటికి, ఆస్త్రీ ప్రస్తుత ఆరోగ్యం గురించి మీరు ఆలోచించాలి. ఆవిధంగా భర్త కొట్టడం కారణంగా ఒక స్త్రీ చెయ్యి విరిగితే, ముందు విరిగిన ఎముకకు చికిత్స చెయ్యాలి. అదేవిధంగా డిప్రెషన్‌కి చికిత్స చేస్తే ఆమె ఏకాగ్రత, నిద్ర, ఆత్మగౌరవం, శక్తి స్థాయి పెరగడానికి సహాయపడతాయి. ఇది మళ్ళీ ఇంట్లో ఒత్తిడిని కలగజేస్తున్న సమస్యలకు పరిష్కారాల్ని కనుగొనే ప్రయత్నానికి సహాయపడుతుంది.

మీరు స్త్రీల ఆరోగ్యంపై జెండర్ అసమానత చూపే బలమైన ప్రభావాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి. స్త్రీల మానసిక ఆరోగ్యంపై జెండర్ అసమానత ప్రభావాన్ని తగ్గించేందుకు మీరు సహాయపడడానికి అనేక మార్గాలు వున్నాయి.

 • ఒక స్త్రీ పదే, పదే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో మీదగ్గరకు వస్తే ఆమె ఇంటి పరిస్థితి గురించి, ఇతర ఒత్తిడుల గురించి తెలుసుకొనడానికి కొంత సమయాన్ని కేటాయించండి. తమ భావాలు, సమస్యల గురించి మాట్లాడేందుకు స్త్రీలకు అవకాశమివ్వండి.
 • మీరు ఆ స్త్రీ భర్తతో (అందుకు ఆమె అనుమతిని పొంది వున్నట్లయితే) లేక ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆమె ఎదుర్కొంటున్న కష్టాలు, అవి ఆమె ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావం గురించి వారికి బోధపరచండి. బాంధవ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేకమైన సూచనల్నికూడా మీరు ఇవ్వొచ్చు
 • ఆరోగ్య సంరక్షణను అందించడంలో జెండర్ అసమానత ప్రభావం గురించి క్లినిక్‌లో మీ సహోద్యోగులను చైతన్యపరచండి. మీరు, మీసహోద్యోగులు, పురుషుల ఆరోగ్య సమస్యలకు సమాన శ్రద్ధతో చికిత్స చెయ్యండి
 • ఒకానొక స్త్రీ తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతూందని మీకు తెలిస్తే, ఆమె క్రమబద్ధంగా మీదగ్గరకు వచ్చేలాగా చేసి ఆమె అవసరాలపై ప్రత్యేక శ్రద్ధను పెట్టండి. ఆమెను క్లినిక్‌కి తీసుకు రాకపోతే ఇంటిదగ్గరే ఆమెను చూసే ఏర్పాటు చెయ్యండి. కుటుంబ సభ్యులకు ఆమె వ్యాధి గురించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కౌన్సిలింగ్ ద్వారా వాటిని తొలగించండి.
 • చాలా ఒత్తిడిని కలగజేస్తున్న ఇంట్లో ఒక స్త్రీ జీవిస్తూందని మీకు తెలిస్తే, మీరు ఆమెను అది ఎలా ఆమె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందో అడగడానికి ప్రయత్నించండి. మీరు ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూందని గమనిస్తే కౌన్సిలింగ్ చేసి ఆమె సమస్యాపరిష్కార నైపుణ్యాల్ని పెంచడానికి ప్రయత్నించండి.
 • మీకమ్యూనిటీలో మహిళా బృందాలు చురుగ్గా పనిచేస్తున్నట్లయితే, వారి సమావేశాల్లో పాల్గొనడానికి చొరవ తీసుకుని స్త్రీలకు మానసిక ఆరోగ్య సమస్యలు ఎంత ప్రాముఖ్యంగలవో చర్చించండి.
 • మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న స్త్రీలకు స్వయంసహాయక లేక ఆసరా బృందాలను ఏర్పరచడానికి సహాయపడండి.
3.0119047619
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు