ఎలేర్జీ అంటే ఏమిటి
ఉన్నట్లుండి గొంతు గరమంతుంది , మరుసటి రోజు ముక్కునుండి నీరు రావటం ప్రారంభమై జలుబు చేస్తుంది . మరొ కరికి హఠాత్తుగా కళ్లు ఎర్రబడి నీరు కారడం ప్రారంభమవుతుంది . మరొకరికి కారణం లేకుండా ఒళ్ళు వెచ్చబడి ఆయాసంగా ఉంటుంది . శ్వాస వదిలేటప్పుడు పిల్లికుతలవంటి శబ్దం వస్తూ ఉంటుంది . ఇంకొకరి హఠాత్తుగా కాళ్ళు ,చేతులు వేళ్ళ మధ్య దురద ప్రారంభమవుతుంది . ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయి ... అదే అలర్జీ (allergy) అంటారు.
ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్(Allergen) అంటారు.
- మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలో ఎలాంటి అన్యపదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికుంది. దీన్నే ఇమ్యునిటీ లేదా రోగనిరోధక శక్తి అంటాం. దీని వల్ల మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, ఎలాంటి ప్రతీకూల పదార్థాలు బ్యాక్టీరియా, వైరస్, అన్యపదార్థాలు వచ్చినా తెల్ల రక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీన్నే 'హైపర్ సెన్సిటివిటీ' లేదా అలర్జీ అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు ఒకటో, రెండో తుమ్ములు రావడం సహజం. అయితే అలర్జీతో బాధపడేవారికి ఇక అదేపనిగా వరసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దాంతోపాటు కళ్లు ఎరుపెక్కి కళ్ల నుండి నీరుకారుతుంటుంది. ఈ పరిస్థితిని 'అలర్జిక్ రైనైటిస్' అంటారు. దీనిని అశ్రద్ధ చేస్తే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కల్లె వస్తుండడం, ముఖం లోపలి భాగంలో నొప్పిగా ఉండటం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. దీన్నే అలర్జిక్ సైనసైటిస్ అంటాం. క్రమంగా ఈ వ్యాధి గాలి గొట్టాలలోకి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, తర్వాత కల్లెతో కూడిన దగ్గుగా మొదలవుతుంది. దాన్ని అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తే అలర్జిక్ ఆస్తమా అంటాం.
- కొన్ని పదార్ధాలకి శరీరము పొందే తీవ్రమైన ప్రతిబంధిత చలనాన్ని(Reaction) అంటాము . మనకి తెలియదు కాని మనచుట్టూ ఉండే చెట్టు , చేమ , జంతువులు వంటివి చిన్న చిన్న రేణువుల లాంటి పదార్ధాలను విడుదల చేస్తూ ఉంటాయి . వీటిని "పోలెన్ " (pollen) అంటాము . ఈ పదార్ధాలు ఇతరచోట్లకి వ్యాపొంచి ఆ వృక్ష జాతుల్ని మల్లీ పుట్టించడం వాటిధ్యేయం .. కాని ఇవి ఆ ధ్యేయానికి చేరక మునుపే చేరకూడని మనుష్యుల ముక్కు , గొంతుక , చర్మము , కళ్లు వంటివాటిని చేరుతాయి . ఈ శరీరము పై తనది కాని పదార్ధం తనలో చేరినపుడు వికటిస్తుంది ... అంటే రియాక్ట్ అవుతుంది .. అదే అల్లెర్జి .
- ముక్కు దిబ్బడేసి జలుబు చేసే ఎలర్జిక్ రైనైటిస్ (allergicRhinitis)అంటాము , జ్వరం వస్తే "హే ఫెవెర్ " (Hay fever) అంటాము . ఎన్నో ఇలాంటి చిన్న చిన్న రేణువులు ప్రకృతిలో ప్రయాణించి మనుష్యులు వివిధ వ్యాధులను కలుగ జేస్తున్నా ... ఈ "పోలెన్ " అనే పడదార్ధం ఎక్కువగా అల్లెర్జీ ని తీసుకు వస్తుంది .
- కొన్ని ఆహార పదార్ధాలు , కొన్ని జంతువుల స్పర్శ , దుమ్ము ,ధూళి , కొన్ని మందులు , కొన్ని రసాయనాలు , ఇలాంటి ఎలర్జీని కలుగజేస్తాయి . అన్ని అందరికి ఇలాంటి అలెర్జీ ని తీసుకురకపోవచ్చు . ఎందుకంటే ఎవరి శరీరం లో వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుందో వారికి ఈ వికటించడం తక్కువలో ఉంటుంది .
- కొందరి శరీరతత్వము సున్నితమై ఉంటుంది . వాళ్ళకి ఈ ఎలర్జీ సులభంగా వస్తుంది . అలాగే ఎలేర్జీ , ఆస్తమా ఉన్నటువంటి వాళ్ల పిల్లలకి ఈ సున్నితమైన శారీర తత్వము ఉన్న వారి పిల్లలకు ఈ స్థితి వస్తూ ఉంటుంది . దీనినే వంశపారంపర్యం అంటారు .
- మన శరీరము లో న్యాది నిరోధక శక్తి తగ్గి ఉన్న సమయాల్లో అంటే - తీవ్ర జ్వరము వచ్చి తగ్గిన తర్వాత , ఆడపిల్లలు పెద్దమనిషి అయ్యే సమయం లోను , గర్భిణీ కాలం లోను , ఋతువులు మారే సంధి కాలంలోనూ , చాలా కాలం క్షయ (TB),రక్త హీనత (Anemia) సుగరు (Diabetes),ఉబ్బసము (Asthma) , కాన్సర్(Cancer),వంటి వ్యాధులతో బాధపడే వారిలో ఈ ఎలర్జీ రావవచ్చు .
- ఒక ప్రత్యేకమైన స్థితి ఏమంటే ... మిగతా కారణాలతో పాటు -- ఆత్రుత , ఆరాటం , మానసిక ఒత్తిడి , ఎక్కువ ఆలోచనలు ... ఉండే వాళ్ళలో ఈ ఎలర్జీ తొందరగా వస్తుంది .
శరీర రక్షక వ్యవస్థ :
- మన్ శరీరమనే కోటను రక్షించడం కోసం శరీరమంతా ఎప్పుడు తిరుగుతూ ప్రమాదం వచ్చిన వెంటనే స్పందించే రక్షణ వ్యవస్థ మనలో ఉంది ... దానినే immunity Sysatem అంటాము . ఈ శరీరం లో ఏడారిలో నైనా నీరు ,గాలి , ఆహార , సంపర్క లాంటి మార్గాల ద్వారా వచ్చే సూక్ష్మ జీవుల ఆయుదాలైన "Toxins" ని ఎదుర్కొనేందుకు ఈ రక్షణ వ్యవస్థ
"Antibody" అనే పదార్ధానీ విడుదల చేస్తుంది దాన్ని " igE"అంటాము ... ఈ సూక్ష్మ జీవుల Toxin కి Antibody కి జరిగే పోరు లో వచ్చే చిన్న మార్పు ఈ ఎలర్జిక్ యాక్షన్ .
లక్షణాలు :
- ముక్కు చీదడం,
- ముక్కునుండి నీరు కారుతూ ఉండడం,
- ముక్కులోపల, గొంతులోపల, కళ్ళలోపల దురదగా ఉండడం,
- చర్మము పై దద్దురులు రావడం,
- చర్మమంతా దురద గా ఉండడం,
- దగ్గు ఆయాసము రావడం,
గుర్తించడం ఎలా?:
- మొదట ఇది మాములుగా వచ్చే జలుబు అనుకుంటారు . తరచూ వస్తుంటే డాక్టర్ దగ్గరికెళ్ళి మందులు వాడుతారు . . తగ్గుతూ వస్తూ ఉంటుంది... పూర్తిగా నయము కాదు..
- చర్మం పరీక్షలో తేలుతుంది. రక్తపరీక్షలు ముఖ్యం గా 'RAST' టెస్ట్ చేస్తారు . ఇది చాల ఖరీదైనదే కాక ఫలితం రావడానికి చాల సమయం పడుతుంది.
రక్షించుకోవడం ఎలా?:
- ఎలర్జీని కలుగచేసే పరిసరాలని పదార్ధాలని దూరం గా ఉంచడం,
- ఎలర్జీ లక్షణాలకి వివిధ మందులు వేసుకోవడం,
- శరీర సహజ వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం,
- శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు మానివేయాలి.
- దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కు తప్పని సరిగా ధరించాలి.
- సరిపడని పదార్థాలను గుర్తించి వాటిని కొద్ది రోజులు తినకుండా ఉండాలి.
- కాస్మొటిక్స్, స్ప్రేలు, పౌడర్లు, హెయిర్ డైలు వాడేముందు వైద్యుల సలహా తప్పని సరిగా తీసుకోవాలి.
- ప్రతి రోజు విధిగా శారీరక వ్యాయామం చేయాలి.
సన్నగా, లాలిత్యం గా, సున్నితం గా ఉండే వారిలో ఇది ఎక్కువగావస్తుంది.
ట్రీట్మెంట్ :
- పడని ఆహార పదార్దములు గుర్తుపెట్టుకొని వాటిని ఎప్పుడు తీసుకోకూడదు,
- దుమ్ము, ధూళి, వాతావరణ మార్పులకు దూరము గా ఉండాలి.
- మానసిక వత్తిడి కి లోనుకాకుండా మనసును ప్రశాంతము గా ఉంచుకోవాలి,
- నిద్ర, సమయానికి భోజనం, తగిన విశ్రాంతి తప్పనిసరిగా ఉండాలి,
- సమాజము లో వీరు ప్రత్యేకం గా జీవన విధానము సాగించాలి.
ఆధారము: వైద్య రత్నాకరం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/3/2024
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.