నిపా వైరస్ గబ్బిలాల్లో, వాటిలోనూ ప్రధానంగా పండ్లు తినే గబ్బిలాలో (ఫ్రూట్ బ్యాట్స్) ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా చాలా రకాల వ్యాధుల దాడికి ఆస్కారం ఉంది. అందుకే వీటిని ఎగిరే నక్కలనీ (ఫ్త్లెయింగ్ ఫాక్స్) పిలుస్తుంటారు.
నిపా వైరస్ కొత్తదెం కాదు. కానీ ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది, పైగా సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. నిపా వైరస్ కొంత అరుదైనదే గానీ మరీ అంతా కొత్తదెం కాదు. ఇది జంతువుల నుంచి మనషులకు సంక్రమిస్తుంది. జంతువులకూ మనషులకు కూడా జబ్బు తెచ్చిపెడుతుంది. మనుషుల్లోనైతే ప్రాణాంతకమనే చెప్పుకోవాలి. గబ్బిలాలు, పందులే మూలం
మరీ ఎక్కువగా కాకపోయినా. గత రెండు దశాబ్దాలుగా అప్పుడప్పుడు విజృంభ్రించి కలవరం సృష్టిస్తున్న వైరస్ ఇది. దీన్ని తొలిగా 1998 లో మలేషియా, సింగపూర్ లలో గుర్తించారు. అప్పట్లో ఇది పందుల ద్వారానే వ్యాపిస్తోందని భావించారుగానీ తర్వాత దీని పై అవగాహన మరింతగా పెరిగింది. 2004లో పశ్చిమ బెంగాల్లో ఈత ఖర్జూర కల్లు తాగిన వారిలో ఈ వ్యాధి కనిపించింది. లోతుగా పరిశోధిస్తే ఆ కల్లు గబ్బిలాలకు సంబంధించిన స్రావాలతో కలుషితమైందనీ దాని ద్వారానే వ్యాధి మనుషులకు సంక్రమించిందని గుర్తించారు. ఈ వైరస్ మనుషుల్లో చేరితే ఒకరి నుంచి మరొకరికి కూడా వేగంగా వ్యాపిస్తోంది.
నిపా వైరస్ బారినపడితే జ్వరం, వాంతులు వికారం, తలనొప్పి వంటి సాధారణ వైరస్ జ్వర లక్షణాలే మొదలవుతాయిగానీ... దీనితో వచ్చే పెద్ద సమస్య మెదడువపు. జ్వరంతో పాటే వీళ్లలో తలనొప్పి గందరగోళం, విపరీతమైన మగత సోయి సరిగా లేకపోవటం వంటి లక్షణాలు బయల్దేరతాయి. కొందరీలో శ్వాస కష్టమవుతుంది. ఈ దశలో సరైన వైద్యం అందకపోతే కోమాలోకి వెళ్లిపోయి, వేగంగా మృత్యువాతపడతారు. ఈ జ్వరం బారినపడిన వారిలో సగటున 70 మంది మృత్యువాతపడుతున్నారంటే దీని త్రీవ్రత అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి ముందే అనుమానించటం ముఖ్యం. కేవలం లక్షణాల ఆధారంగానే దీన్ని నిర్ధారించటం కూడా కష్టం. అనుమానం బలంగా ఉంటే రక్తం సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వంటి సంస్ధలకు పంపిస్తే వాళ్లు పరీక్షించి నిపా వైరస్ ఉందేమో నిర్ధారిస్తారు.
గబ్బిలాల కొరికిన పండ్లు తినటం ఈ వైరస్ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎలాంటి గాట్లు లేని పండ్లు ఎంచుకోవటం వాటిని పూర్తి శుభ్రంగా కడుక్కుని తినటం ముఖ్యం. రెండోది పందుల వంటి జంతువులకు దూరంగా ఉండటం మంచిది.
ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించేది కాదు. ఇప్పటికే దీని బారినపడిన జంతువులను లేదా మనుషులను నేరుగా ముట్టుకుంటేనే ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఇది ఒంట్లో చేరిన 4 నుంచి 18 రోజుల్లోపు ఎపుడైనా జ్వర లక్షణాలు మొదలవ్వచ్చు.
నిపా వైరస్ బారినపడకుండా నివారించే టీకాల వంటివేమీ లేవు. ఒకవేళ ఈ వైరస్ బారినపడి సమస్యలు మొదలైనా దీనికంటూ ప్రత్యేకమైన చికిత్సేమీ లేదు. లక్షణాల తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఉపశమన చికిత్స చేస్తూ. త్వరగా కోలుకునేలా చూడటం ఒక్కటే మార్గం.
ఈ వైరస్‌ను నియంత్రించే టీకాలు ఇంకా తయారు కాలేదు. అయితే ఈ వైరస్‌ను సమర్థంగా చంపగలిగేది ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ చికిత్స ఒక్కటే! ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వైరస్ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిళాలు లేకుండా చూసుకోవాలి. చికిత్స చేసే వైద్యులు మాస్క్‌లు, గ్లోవ్స్ వేసుకోవాలి.
ఆధారం : పోర్టల్ సభ్యలు
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/24/2020