పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కిడ్నీ యొక్క నిర్మాణము, అది పని చేసే విధానము

కిడ్నీ యొక్క నిర్మాణము, అది పని చేసే విధానము

 • కిడ్నీ (మూత్రపిండము), మానవుని శరీరములో ఒక మహత్పూర్శమైన అంగము. కిడ్నీని ఒక సూపర్ కంప్యూటర్తో పోల్చవచ్చును. ఎందుకంటే కిడ్నీ నిర్మాణము చాలా అనిర్దిష్టముగాను మరియు జఠిలముగాను ఉంటుంది. కిడ్నీ శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేసి మూత్రమును తయారు చేస్తుంది. శరీరము నుండి మూత్రమును బయటకు పంపించే పని మూత్రనాళం (యురెనరీ) మూత్రాశయము (యురెనరీ బ్లాడర్) మూత్ర ద్వారము (యురెట్మి) ద్వారా జరుగును.
 • స్త్రీ పురుషుల శరీరాలలో సామాన్యముగా రెండు కిడ్నీలు ఉంటాయి.
 • కిడ్నీలు కడుపులో వెనక భాగములో వెన్నెముకకు ఇరువైపుల, చాతీకి క్రింది భాగములో ఎముకల మధ్య సంరక్షితముగా ఇమిడి ఉంటాయి.
 • కిడ్నీ యొక్క ఆకారము జీడిపప్పులా ఉంటుంది. ప్రతీ వ్యక్తిలోనూ సామాన్యముగా కిడ్నీ 10 సెంటీమీటర్ల పొడవు 5 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల లావుగా ఉంటుంది. కిడ్నీ యొక్క బరువు 150 నుండి 170 గ్రాములు ఉంటుంది.
 • దీ కిడ్నీ ద్వారా తయారు అయ్యే మూత్రాన్ని మూత్రాశయము వరకు పంపించే గొట్టమును మూత్రనాళము అంటారు. ఇది సాధారణంగా 25 సెంటీమీటర్ల పొడవుగా ఉంటుంది. విశేషమైన రబ్బర్ లాంటి కండతో నిర్మించబడి ఉంటుంది.
 • మూత్రాశయము పొట్ట కింది ఎదుటి భాగములో స్నయువుతో చేయబడ్డ సంచి. ఇందులో మూత్రము చేరి ఉంటుంది. మూత్రాశయములో ఎప్పుడైతే 300 నుండి 400 మి.లీ. వరకు మూత్రము సేకరణ అవుతుందో అప్పుడు ప్రతీ మనిషికి మూత్రవిసర్జన చేయవలసిన అవసరము కలుగుతుంది.
 • మూత్ర ద్వారము ద్వారా మూత్రము బయటకు వస్తుంది.

కిడ్నీయొక్కపని

కిడ్నీ యొక్క అవసరము మరియు ప్రాముఖ్యత ఏమిటి ?

 • ప్రతీ రోజు మానవుడు తీసుకునే ఆహారము రక రకాలుగానూ విభిన్న పరిణామాలతోనూ ఉంటుంది.
 • రక రకాల ఆహారం కారణంగా శరీరములో నీరు, పుల్లటి కటువు పదార్ధాల పరిణామములో మార్పు జరుగుతూ ఉంటుంది.
 • ఆహారము జీర్ణమైన పిమ్మట అనేకమైన అనవసరపు పదార్థాలు శరీరములో ఉత్పన్నమవుతాయి.
 • శరీరములో నీరు, ఆమ్ల పదార్ధములు, లవణ పదార్ధములు, రసాయనిక పదార్థాలు, అలా శరీరములో ఉత్పన్నమయ్యే ఈ పదార్థాల సమన్వయము ఏ మాత్రము భంగం అయిన లేక ఎక్కువైనా ఆ వ్యక్తికి ప్రాణ సంకటము అవుతుంది.
 • కిడ్నీ శరీరములో ఇటువంటి అనవసరపు ద్రవాలను, పదార్థాలను మూత్రము ద్వారా బయటకు పంపి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్తములో లవణ పదార్ధములను, ఆమ్ల పదార్ధములను సరైన పరిణామములో ఉంచుతుంది. ఈ విధముగా కిడ్నీ శరీరాన్ని శుభ్రముగా, స్వచ్ఛముగా ఉంచుతుంది.

యొక్క ముఖ్యమైన పని ఏమిటి ?

రక్తాన్ని శుభ్రపరచుట

కిడ్నీ నిరంతరము పని చేస్తూ శరీరములోని అనవసరమైన విష పదార్థాలను మూత్రం ద్వారా పంపివేస్తుంది. శరీరంలో నీటిని సమపాలుగా ఉంచడము, కిడ్నీ శరీరానికి కావలసిన నీటిని మాత్రమే ఉంచి మిగిలిన నీటిని మూత్రము ద్వారా బయటకు పంపివేస్తుంది.

ఆమ్ల, లవణ పదార్థాల సంతులనం

కిడ్నీ శరీరములో సోడియము, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్పరస్ బైకార్బోనేట్ వంటి పదార్థాలను సమపాలుగా ఉంచుతుంది. పైన వివరించిన పదార్థాలు శరీరములోని లవణాల ఆమూల పరిమాణాలని నిర్ధారిస్తాయి. సోడియము (హెచ్చుతగ్గులు) ఎక్కువ తక్కువలు అవడంతో మెదడుపైన, పొటాషియము ఎక్కువ తక్కువలు అవడము గుండె పైన, ఎముకల పైన ప్రభావము పడవచ్చును.

రక్త పీడనంను అదుపులో వుంచుట

కిడ్నీ పలు విధములైన హర్మోనులని ఉత్పన్నము చేస్తుంది. మొదలగు ఈ హార్మోనుల ద్వారా కిడ్నీ శరీరములో నీరు, లవణ పదార్థాలు, ఆమ్ల పదార్థాలు యొక్క సమన్వయం చేకూరుస్తుంది. ఈ సమన్వయం మూలముగా రక్త పీడనాన్ని సమపాలల్లో ఉండే పని చేస్తుంది.

రక్త కణాల ఉత్పాదనలో సహాయము

రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల ఉత్పాదన ఏరిత్రోపోఇటిన్ సహాయముతో బోన్మేరో నుండి అవుతుంది. ఎరిత్రోపోఇటిన్ కిడ్నీలో తయారు అవుతుంది. కిడ్నీ ఫెయిల్ అయిన సందర్భములో ఈ పదార్ధము తక్కువగా తయారు అవ్వడము గానీ లేక పూర్తిగా తయారు కాకపోవడము గానీ అవుతుంది. దీని వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పాదన తక్కువ అయిపోయి రక్తం నిస్సారమవుతుంది. దీనినే ఎనీమియా అంటారు.

ఎముకల పటిష్టత

కి విటమిన్  'ఢీ'  తూర్ణ  చేయడములో సహాయము చేస్తుంది. విటమిన్ 'ఢీ  శరీరములోని కాలియం పాస్ఫరస్ల  పరిమాణాలను సమపాలల్లో ఉంచి, ఎముకలు  మరియు పళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పటిష్టతను  కాపాడుతూ వుంటుంది.

రక్తాన్ని శుభ్రపరచిన తరువాత మూత్రాన్ని కిడ్నీ ప్రతినిమిషం ఎలా తయారు చేస్తుంది

 • కిడ్ని అవసరమైన పదార్థాలను ఉంచి అనవసరమైన పదార్థాలను మూత్రము ద్వారా బయటకు పంపివేస్తుంది. ఇది ఒక  అణోన్యమైన అద్భుతమైన క్లిష్టమైన ప్రక్రియ.
 • మీకు తెలుసా? శరీరములోని రెండు కిడ్నీలలో ప్రతి నిముషానికి 1200 మి.లీ. రక్తము శుభ్రమవుతుంది. ఇది మొత్తము శరీరములో గుండె ద్వారా ప్రవహిస్తున్న రక్తములో 20వ శాతము. ఈ విధముగా 24 గంటలలో సుమారు 1700 లీటర్ల రక్తము పరిశుభ్రము అవుతుంది.
 • రక్తాన్ని శుభ్రపరిచి మూత్రాన్ని తయారు చేసే కిడ్నీ యొక్క ముఖ్య అంశాన్ని నెఫ్రాన్ అంటారు. నెఫ్రాన్ ఒక చిన్న జల్లెడలా ఉంటుంది.
 • ప్రతి కిడ్నీలో 10 లక్షలు లేదా 13 లక్షలు నెఫ్రాన్లు ఉంటాయి. నెఫ్రాన్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని గ్లోమెరూలస్ అని రెండవ భాగాన్ని ట్యుబులెస్ అని అంటారు.
 • శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలోని నీటిని, లవణ పదార్థాలను సంతులనం చేసి మూత్రం తయారు చేయడం కిడ్నీ యొక్క ಮಿಖ್ಯ కార్యము.
 • గ్లోమెరూలస్ అనే పేరుతో సామాన్యమైన జల్లెడ ప్రతీ నిముషానికి 125 మి.లీ. ప్రవాహ వేగముతో మొదటి చరణములో 24 గంటల్లో 180 లీటర్ల మూత్రాన్ని తయారు చేస్తుందని తెలిసి మీరు ఆశ్చర్యపడక తప్పదు. ఈ 180 లీటర్ల మూత్రములో అనవసరమైన పదార్థాలు, లవణ పదార్థాలు, విషపు పదార్థాలు కూడా ఉంటాయి. అయితే వీటితో పాటు శరీరానికి కావలసిన ఉపయోగకరమైన గూకోస్, ఇది కాక మరికొన్ని ఇతర పదార్థాలు కూడా ఉంటాయి.
 • గ్లోమెరూలస్ ద్వారా తయారు చేయబడ్డ 180 లీటర్ల మూత్రము ట్యుబులెస్ లోకి వెళుతుంది. ఇందులో 99 శాతము శరీరములో తిరిగి విలీనమవుతుంది.
 • ట్యుబులెస్లో జరిగే ఈ విలీనాన్ని వివేకమైన విలీనము అంటారు. ఈ చర్యను వివేకమైన విలీనము అని ఎందుకంటారంటే 180 లీటర్ల వంటి అతి పెద్ద మొత్తమైన మూత్రం నుండి కావలసిన పదార్థాలను, నీటిని తిరిగి శరీరములోకి తీసుకుంటుంది. 1 లేక 2 లీటర్లు మూత్రముతో చెత్త పదార్థాలను, అనవసరమైన లవణ పదార్థాలను బయటకు పంపి వేస్తుంది.
 • ఈ విధముగా కిడ్నీలో చాలా క్లిష్టమైన ప్రక్రియ ద్వారా శుభ్రము చేయబడిన పిమ్మట మూత్రము మూత్రవాహిని ద్వారా మూత్రాశయములోకి వెళ్తుంది. పిమ్మట మూత్ర నాళిక ద్వారా శరీరము బయటకు పోతుంది.

ఆరోగ్యమైన కిడ్నీ గల వ్యక్తి యొక్క మూత్ర విసర్జన ఎక్కువగాను, తక్కువగాను అవుతూ ఉంటుందా

 • అవును మూత్రము యొక్క పరిమాణము ఆ వ్యక్తి తీసుకున్న నీటిని బట్టి, వాతావరణములోని ఉష్ణోగ్రతను బట్టి ఉంటుంది.
 • ఎవరైన ఒక వ్యక్తి తక్కువ నీరు తీసుకున్న పక్షములో ఒక అర లీటర్ అంటే అతి తక్కువగా చిక్కటి మూత్రము తయారు అవుతుంది. ఎక్కువ నీరు తాగితే ఎక్కువగాను పల్చగాను మూత్రము తయారు అవుతుంది. వేసవి కాలములో అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువ చెమట పట్టడము మూలంగా మూత్రము యొక్క పరిమాణము తక్కువగా ఉంటుంది. అది చలి కాలములో తక్కువ ఉష్ణోగ్రతలో తక్కువ చెమట పట్టడముతో ఎక్కువ మూత్రము అవుతుంది.
 • సగటు పరిమాణములో నీటిని సేవించే వారికి 500 మి.లీ. కంటే తక్కువ లేక 3000 మి.లీ. కంటే ఎక్కువగానూ మూత్రము అవుతుంది అంటే ఇది కిడ్నీ రోగానికి ప్రారంభము అని అనుకోవాలి.

కిడ్నీ యొక్క ముఖ్య పని రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో నీరు. ఆమ్ల పదార్థాలను సమతుల్యంగా ఉంచే మూత్రంను తయారు చేస్తుంది

ఆధారం : కిడ్నీ ఎడ్యుకేషన్

3.0
సత్యబాబు May 14, 2017 03:47 PM

ఒక రోజుకు ఎన్నిసార్లు విసర్జించిచలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు