অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పరిచయము

పరిచయము

అందముగా, స్వచ్ఛముగా, ఆరోగ్యముగా ఉండాలని ఎవరికుండదు? శరీరము యొక్క బహ్య సౌందర్యము మీ చేతులలోనే వుంటుంది. కానీ శరీరము లోపల పరిశుభ్రతని కిడ్నీలు చూసుకుంటాయి. శరీరములో ఉన్న అవసరమైన కల్మశ పదార్థాలను బయటకు పంపించి శరీరాన్ని పరిశుభ్రముగా ఉంచే మహత్పూర్వ కార్యాన్ని కిడ్నీలు చేస్తున్నాయి. కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్న రోగిష్ణుల సంఖ్య గత పలు సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది. డయాబెటిస్ మరియు హై బ్లడ్ ప్రెషర్ (అధిక రక్తపోటు) వ్యాధులతో బాధ పడే వారి సంఖ్యలు పెరగడంతో కిడ్నీ వైఫల్యము రోగుల సంఖ్య విపరీతంగా పెరగడానికి దారి తీసింది.

ఈ పుస్తకము ద్వారా ప్రతీ వ్యక్తికి కిడ్నీ గురించి అవగాహన, సూచనలు, సలహాలు ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నము చేయబడింది. అంతేగాక కిడ్నీ వ్యాధుల లక్షణాలు, వ్యాధుల చికిత్స, అరికట్టే విధానము వంటి విశేష సమాచారము కూడా ఇవ్వబడింది.

ఈ పుస్తకములోని ప్రతీ అధ్యాయములోనూ సులభమైన చక్కటి భాషలో కిడ్నీ రోగాలనుండి ఎలా సంరక్షించుకోవడం, కిడ్నీ రోగాల పై మూఢ నమ్మకాల గురించి మరియు డయాలసిస్, కిడ్నీ ప్రత్యారోపన కెడేవర్ ప్రత్యారోపన ఆహారము, నిగ్రహము మొదలగు విషయాల గురించి విస్తారముగా వివరించడమైనది. పాఠకులకు ఏ విధమైన కష్టము లేకుండా ఈ పుస్తకాన్ని సరలముగా చదవగలిగేలా పుస్తకానికి చివర మెడికల్ టెర్మ్స్ మరియు అబ్రివేషన్స్ యొక్క అర్ధములు విశ్లేషించబడినవి. సాధారణ వ్యక్తులకు, కిడ్నీ రోగులకు ఈ పుస్తకములో వివరించిన విషయాలు అత్యంత ఉపయోగకరముగా ఉంటాయి.

ఆధారం : కిడ్నీ ఎడ్యుకేషన్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate