కుష్ఠు వ్యాధిగా ఎప్పుడు అనుమానించాలి :
- శరీరముపై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ఉన్నప్పుడు
- ఆ మచ్చలపై స్పర్శజ్ఞానము లేనపుడు మరియు నొప్పి తెలియనపుడు
- శరీరమందు ముఖ్యంగా పాదములు, చేతులు, వ్రేళ్లు తిమ్మెరలు ఉన్నప్పుడు
- చర్మం దళసరిగా ఉన్నప్పుడు
- చర్మము ముఖ్యంగా ముఖం నూనె రాసినట్లు నిగనిగలాడుతూ కన్పించినపుడు ఈ వ్యాధిగా అనుమానించాలి.
కుష్టు వ్యాధి ఎందుకు వస్తుంది :
- కుష్ఠువ్యాధి ఇతర అంటు వ్యాధులవలె సూక్ష్మ క్రిమి, ఇది మైక్రో బాక్టీరియల్ ద్వారా సంక్రమించు ఒక అంటు వ్యాధి.
- 1873వ సం.లోనే హన్ సన్ అను నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధి కారకమైన సూక్ష్మ జీవిని సూక్ష్మ దర్శనితో కనుగొన్నాడు.
- ఈ వ్యాధి, వ్యాధి గ్రస్తుని నుండి గాలి ద్వారా, సన్నిహిత సాన్నిధ్యం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
కుష్టు వ్యాధిగ్రస్తులు చేయవలసినదేమిటి:
- కుష్ఠు వ్యాధిగా అనుమానించిన వెంటనే సమీపంలో కుష్ఠు వ్యాధి నిర్మూలనా కేంద్రంలో చూపించుకోవాలి
- వెంటనే వైద్యం ప్రారంభించండి
- వ్యాధి తీవ్రతను అనుసరించి 6 నెలలు లేదా 12 నెలలు సక్రమంగా మందులు సేవించండి
- వ్యాధిని దాచవద్దు, ఇతర అనుమానితులను కూడా వైద్యుని దగ్గరకు వెళ్ళుటకు ప్రోత్సహించండి
కుష్టువ్యాధి నయమౌతుందా :
- బహుళ ఔషధ (మల్టీడ్రగ్) చికిత్స కుష్ఠు వ్యాధికి ఒక నమ్మకమైన చికిత్స,
- ఈ చికిత్సతో వ్యాధి ఏ దశలోనైనా నయమవుతుంది
- ప్రారంభ దశయందే గుర్తించి సరైన చికిత్స సక్రమంగా తీసుకుంటే అంగవైకల్యం కూడా నివారించవచ్చు
కుష్టువ్యాధి గురించి వ్యక్తిగత బాధ్యతలేమిటి :
- శిక్షణ పొంది, మీ విజ్ఞానమును బంధుమిత్రులతో పాలుపంచుకొని వాస్తవ విషయాల గురించి చర్చించండి
- ఎవరిలోనైనా కుష్ఠు వ్యాధి యొక్క ప్రారంభ చిహ్నములను గమనించినా, వారిని వెంటనే వైధ్య పరీక్షకు ప్రోత్సహించండి
- కుటుంబ సభ్యులకు, ఇతరులకు కుష్ఠు రోగులను బహిష్కరించకుండా ఉండుటకు సరైన శిక్షణ, అవగాహన కల్పించండి
- కుష్ఠు రోగులను కుటుంబంలోనూ, సంఘంలోనూ ఆదరణతో చూడండి మరియు వారు సంతోషముతో, ఆరోగ్యదాయకమైన జీవితం గడుపుటకు సహాయం చేయండి
- చదువు సంధ్యలయందు, ఉద్యోగ వివాహములందు కుష్ఠు రోగులకు, వారి పిల్లలకూ, సమానంగా అవకాశాలు కల్పించండి
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 9/8/2023
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.