తట్టు పూత మారు పేరు రూబెల్లా, దీనికి కారణ జీవి వైరస్
లక్షణాలు
- తట్టు అనే జ్వరం తీవ్రంగా వ్యాప్తి చెందే శ్వాసకోశాల ఇన్ఫెక్షన్
- ఫ్లూ వంటి లక్షణాలు మరియు దగ్గు, ఎర్రబడి నీరు కారుతున్నటు వంటి కళ్ళు, కారుతున్న ముక్కు వంటి లక్షణాలు కూడా కనబడవచ్చు
- నోటి లోపలి భాగంలో ఎర్రటి గుండ్రటి మచ్చలు వాటి మధ్య భాగం నీలం తెలుపు కలిపినట్టు వుండడం
వ్యాప్తి చెందడం
- తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ తట్టు సూక్ష్మజీవి (వైరస్) దగ్గు, తుమ్ములు వ్యాధిగ్రస్ధులకు దగ్గరగా మెసలడం వ్యాధిగ్రస్ధుల ముక్కు, గొంతుల స్రావాలు నేరుగా చేతులతో ముట్టుకొనడం మూలాన వ్యాప్తి చెందుతుంది
- ఈ క్రిములు వ్యాధిని వ్యాపించే శక్తి కలిగి 2 గంటల వరకూ గాలిలో జీవించి వుంటాయి
- వ్యాధిగ్రస్ధులైన వారు వ్యాధి లక్షణాలు కనపడే 4 రోజుల ముందు, లక్షణాలు బయటపడిన 4 రోజుల తరువాత కూడా వ్యాధిని వ్యాపింపచేసే స్ధితి లేదా శక్తి కలిగి ఉంటారు
ఆచరించ గలిగిన సాధారణ చిట్కాలు
- వైద్యుల సలహా మేరకు టీకాలు వేయించుకోవడం
- పౌష్ఠికాహార లోపం వున్న పసి పిల్లలలో ఇది ప్రాణాంతక జబ్బుకావచ్చు
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/10/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.