অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మెదడువాపు వ్యాధి (మెనన్ జైటిస్‌)

మెదడువాపు

మెదడువాపు వ్యాధి అనేది వెన్నెముక, మెదడు చుట్టూ ఉండే  ద్రవాలకు ఇన్ఫెక్షన్ సోకడంవల్ల వస్తుంది.

కారణాలు

  • మెదడువాపు వ్యాధి సాధారణంగా  వైరస్ లేదా బాక్టీరియా సోకడంవల్ల వస్తుంది
  • వైరల్ మెనంజైటిస్ అనేది తక్కువ తీవ్రతతో ఉండి, ఎలాంటి ప్రత్యేకమైన చికిత్స అవసరం లేకుండా నయమౌతుంది

వైరల్ మెనంజైటిస్

  • ఎంటరో వైరస్ అనే వైరస్ వల్ల వైరల్ మెనెంజిటిస్ సోకుతుంది
  • ఇవి ఆ వ్యాధి సోకినవారి ఉమ్ము, చీమిడి, శ్వాస మూలంగా పక్కవారికి సోకుతుంది
  • ఈ వైరస్ అంటువ్యాధి కారకాలు. అందువల్ల ఈ వ్యాధి సోకినవారితో  కరచాలనం చేసినా,  ఆ చేత్తో ముక్కును, నోరును గోక్కున్నా /తాకినా ,  వారు వాడిన వస్తువులను తాకినా,  ఆ వ్యాధి వీరికి  సోకే ప్రమాదం ఉంది
  • ఈ వైరస్ మలం ద్వారా  బైటకొస్తుంది. అందువల్ల మరుగుదొడ్లను వాడటం రాని  పిల్లలకు ఇది సోకే అవకాశం ఎక్కువ
  • ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్  సోకిన 3 నించి 7 రోజులకు వ్యాధి లక్షణాలు పొడచూపనారంభిస్తాయి. అలాంటి వ్యక్తి ఆ వైరస్ ను పక్కవారికి 3 నించి 10 రోజుల్లోగా వ్యాపింపజేస్తారు.

బాక్టీరియల్ మెనంజైటిస్

  • హెబ్ కాకుండా నెయిస్సెరియా మెనెంజిటిడిస్, స్ట్రెఎ్టోకాకస్ న్యుమోనియై అనేవి ఈ బాక్టీరియల్  మెనంజైటిస్ కు ప్రధాన కారణాలు.
  • ఈ బాక్టీరియా  సాధారణంగా మనిషి నోట్లో, గొంతులో  నిరపాయకరంగా నివసిస్తుంది. అరుదైన సమయాల్లో అది మనిషి దేహంలోని నిరోధక శక్తిని ఓడించి  వెన్నెముక, మెదడు చుట్టూ ఉండే  ద్రవాన్ని చేరుతుంది. అక్కడ అత్యంత వేగంగా వృద్ధి చెంది వెన్నెముక, మెదడు చుట్టూ ఒక పల్చని పొరలా ఏడ్పడుతుంది. వెన్నెముక ఉబ్బి ఎర్రగా అయ్యి సాంప్రదాయిక మెనెంజిటిస్ లక్షణాలను పొడచూపుతుంది.
  • బాక్టీరియా నేరుగా రోగి ముక్కునించి లేదా గొంతునించి కారే చీమిడి, ద్రవాల్లో  ఉండి త్వరగా పక్కవారికి వ్యాపిస్తుంది.

లక్షణాలు

వైరల్ మెనంజిటిస్

  • ఈ వైరస్ సోకిన రోగులకు ఎలాటి లక్షణాలూ ఉండకపోవచ్చు, లేదా కేవలం జలుబు లేదా దద్దుర్ల తో కూడిన చిన్నపాటి జ్వరం రావచ్చు. అతి తక్కువ మందికి మెనెంజిటిస్ సోకవచ్చు.
  • సాధారణ వ్యాధి నిరోధకత ఉండే వారు ఇన్ఫెక్షన్ సోకిన 7 నించి 10 రోజుల్లో తిరిగి కోలుకోగలరు.

బాక్టీరియల్ మెనంజిటిస్

  • తరచూ వైరల్ మెనంజైటిస్  బాక్టీరియల్ మెనంజైటిస్ - రెండిటికీ లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.
  • 2 ఏళ్ల వయస్సులో పిల్లకు సాధారణంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మెడనొప్పి - ఈ వ్యాధి లక్షణాలుగా పొడజూపుతాయి. ఈ లక్షణాలు పొడజూపటానికి  కొన్ని గంటలపాటు లేదా 1నించి 2 రోజులు పట్టవచ్చు.
  • ఇవిగాక ఈ వ్యాధి లక్షణాలలో  కడుపులో  వికారంగా ఉండటం, వాంతి చేసుకోవడం,  కాంతిని తట్టుకోలేక పోవడం,  అయోమయంగా ఉండటం, చర్మంపై దద్దుర్లు త్వరత్వరగా వ్యాపించడం కూడా జరగొచ్చు.
  • అపుడే పుట్టిన పిల్లలలో, పసికందుల్లో   తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మెడనొప్పి - వంటివాటిని గుర్తించడం కష్టం. అలాంటి పిల్లల్లో వాంతులు, స్థబ్దుగా వుండటం, విసుగ్గా ఉండటం, పాలు తాగకపోవడం అనేవి ఉన్నాయా అని చూడాలి.
  • ఈ రోగం పొడజూపేకొద్దీ,  ఆ రోగి ఏవయస్సు వారైనా హఠాత్తుగా అంగవైకల్యానికి లోనవచ్చు.
  • బ్యాక్టీరియల్  మెనంజైటిస్ అనేది చాలా ప్రమాదకారి. దీనివల్ల అంగ వైకల్యమే కాదు, సరైన చికిత్స అందని పక్షంలో ఒక్కోసారి  మరణం సంభవించవచ్చు.
  • బ్యాక్టీరియల్  మెనంజైటిస్ మరీ ఎక్కువైతే(అడ్వాన్డ్స్ స్టేజి) అది మెదడుకు బాగా నష్టం కల్గించవచ్చు, రోగిని కోమాలోకి తీసుకెళ్లవచ్చు లేదా రోగి మరణించవచ్చు. ఒకవేళ ఆరోగి ప్రమాదంనించి బైటపడ్డా, అతనికి వినికిడి లోపం,  మతిభ్రంశం, పక్షవాతం, అంగవైకల్యాలవంటి  దీర్ఘకాలిక సమస్యలు ఎదురవవచ్చు.

నిరోధక చర్యలు

వైరల్ మెనంజిటిస్

  • చక్కని వ్యక్తిగత శుభ్రత ఉంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువ.
  • ఇన్ఫెక్షన్ సోకిన రోగి ఉంటే, తరచూ ఇంట్లో చేతులు శుభ్రంచేసుకోవడం, వారు వాడిన వస్తువులను వారున్న ప్రదేశాలను బాగా సబ్బు పెట్టి కడగటం వంటి పనులద్వారా ఇన్ఫెక్షన్ ను తగ్గించవచ్చు.

బ్యాక్టీరియల్   మెనంజిటిస్

  • వ్యాక్సీన్లు : హిబ్ వైరస్ నిరోధించే  వ్యాక్సిన్లు చాలా క్షేమకరమైనవి, చక్కగా పనిచేస్తాయి. 6 ఏళ్ల వయస్సులో పిల్లలకు  కనీసం 3 డోసుల హిబ్ వ్యాక్సిన్ ఇప్పించాలి. 4వ డోసు(బూస్టర్)ను 12, 14 నెలల మధ్య  వయస్సులో  ఇప్పించాలి.
  • కొన్ని రకాల మెనెంజైటిస్ వ్యాధికి  యాంటీ బయోటిక్స్ వాడి వాటిని వ్యాపించకుండా నిరోధించవచ్చు.

ఆధారము: http://www.cdc.gov/

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate