ఈ వ్యాధి శరీరం మొత్తం సోకుతుంది. ముఖ్యంగా కండరాలకు, మరియు నరాలకు సోకుతుంది.
పోలియో వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ మానవ మలం, మురుగు నీరుతో కలుషితమైన బావులు, గుంటలు, ట్యాంకుల నీటి ద్వారా సాధారణంగా 5 సం.లలోపు పిల్లలకు, వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్ధుడైన వ్యక్తి మలముతో కలుషితమైనది తీసుకోవడం వలన ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. వ్యాధి కారకం ముక్కు, గొంతు ద్వారా జీర్ణాశయంలోకి చేరుకొని, ప్రేగు గోడలలోని కణాలలో వృధ్ది చెందుతుంది. ఒక్క వైరస్ కొన్ని వేల వైరస్ లుగా వృధ్ది చెందుతాయి. తర్వాత మల విసర్జన ద్వారా విసర్జింపబడతాయి. ఈ ప్రక్రియ కొద్ది వారాలపాటు జరుగుతుంది. ఈ విధంగా మరల మరల ప్రమాదకరంగా ఒక ప్రాంతములో మొత్తం వ్యాధికి గురవవచ్చు.
స్వల్ప / కొద్దిపాటి ఇన్ఫెక్షన్ (అంటు)
చాలా కేసులలో, వ్యాధిగ్రస్ధునిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించవు. మిగతా కేసులలో, లక్షణాలు, ఫ్లూ వంటి లక్షణాలు కడుపు నొప్పి విరేచనాలు, వాంతులు, గొంతు నొప్పి , జ్వరము, తల నొప్పి
ఒక మోస్తరు/ మధ్యస్ధ ఇన్ఫెక్షన్ (అంటు)
మెదడు మరియు వెన్ను యొక్క తీవ్ర ఇన్ఫెక్షన్
హృదయపు గుండె కండరాలకు ఈ వ్యాధి సోకితే కోమాలోనికి వెళ్ళి తర్వాత చనిపోయే ప్రమాదం ఉంటుంది.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020