অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మెదడు వాపు వ్యాధి

వ్యాధి లక్షణాలు

  • జ్వరము, వణుకు, ప్రవర్తనలో మార్పు, అగుతూ అపస్మారక స్థితికి చేరుకోవడం, నిద్రమత్తు, రోగ తీవ్రతని తెలియచేస్తుంది. దృష్టిలోపం కూడా కలుగవచ్చు. మూత్ర విసర్జనపై, బయలు విసర్జనపై నియంత్రణ కోల్పోవచ్చు. సరైన సమయంలో రోగ నిర్థారణ కాకపోతే మరణం సంభవించును. జబ్బు నుండి కోలుకున్నాక కూడా
  • ఆకస్మిక జ్వరం వచ్చుట, జ్వర తీవ్రత ఎక్కువగా ఉండుట
  • కండ్లను అసాధారణంగా త్రిప్పుట
  • అపస్మారక స్థితి సంభవించుట
  • ఏదో ఒక పక్క శరీరం పక్షవాతానికి గురి అగుట
  • వాంతులు, విరేచనాలు సంభవించుట
  • శరీరం మెలికలు తిరిగి కొట్టుకొనుట
  • మానసిక మాంద్యము

వ్యాప్తి చెందు విధానం

  • జపనీస్ బి వైరస్ అనే సూక్ష్మజీవి దోమల ద్వారా ఇతర జంతువుల ద్వారా (ముఖ్యంగా పందులు) ఈ వ్యాధిని సంక్రమింప చేస్తాయి.
  • పందులు, పశువులు, గుర్రాలు, కొంగలు ఈ వైరస్ ముఖ్యస్థావరాలు. దోమలు వీటిని కుట్టి మనిషిని కుట్టినప్పుడు ఈ వైరస్ మనిషిలో ప్రవేశించి రోగాన్ని కలుగచేస్తాయి. మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తి చెందదు.
  • పందులను కుట్టిన దోమలు ఆరోగ్యవంతుని కుట్టిన తర్వాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కన్పించును. ఈ వ్యాధి ముఖ్యంగా 1 నుండి 14 సంవత్సరముల లోపు పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం వుంది.

వ్యాపించే సమయం

సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు మెదడువాపు వ్యాధి ప్రబలుతున్నది. వర్షాధారంగా నిలువవున్న నీటి స్థావరాలు పెరిగిన కొలదీ దోమలు ఉత్పత్తి పెరుగును. క్యూలెక్స్ (గూని దోమ) దీని వ్యాప్తికి దోహదపడతాయి.

వ్యాధిని అరికట్టడానికి కార్యాచరణ పథకం

  • దోమల ఉత్పత్తి అరికట్టడం
  • నీటి స్థావరాలని పూడ్చి వేయడం
  • ప్రజలలో వ్యాధి అరికట్టడానికి ఒక నెల ముందే అవగాహన శిక్షణలు / సదస్సులు గ్రామ కమిటీలలో చర్చించడం.
  • ఆరోగ్యశాఖ తీసుకొనే చర్యలలో ప్రజలని భాగస్వామం చేసి పాల్గొనేలా చేయడం.
  • రోగిని గుర్తించి వెంటనే ఆసుప్రతికి తరలించడం.
  • గ్రామ ప్రజలతో చర్చించి పందులను ఊరికి దూరంగా ఉంచేటట్లు చర్య తీసుకోవాలి.
  • వ్యాక్సిన్ ఇచ్చు కార్యక్రమంలో సహకరించి పిల్లలకి వ్యాక్సిన్ డోసులు ఇప్పించాలి.

వ్యాధి రాకుండుటకు ముందు జాగ్రత్త చర్యలు

  • దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి
  • ఇంటిలోనికి దోమలు రాకుండా కిటికీలకు తలుపులకు సన్నని జాలి బిగించుకోవాలి
  • ఓడోమాస్ లాంటి క్రీములను శరీరానికి రుద్దుకోవాలి
  • ఇంటిలో జెట్, మస్కిటో కాయిల్ ఉపయోగించాలి
  • పందులను గ్రామానికి కనీసం 5 కి. మీ. దూరంలో ఉంచాలి
  • జాలరి గుంటలు, ఇంటిచుట్టు ప్రక్కల నీటినిల్వ ఉన్నచో ఆ నీటిలో కిరోసిన్ లేక వాడిన ఇంజన్ ఆయిల్ చుక్కలు వేయాలి
  • సెప్టిక్ట్ ట్యాంక్ గొట్టాలకు దోమలు వెళ్లకుండా, దోమ తెర గుడ్డ లాంటి ఇనుప జాలీని బిగించాలి
  • ఒక వేళ పిల్లలకు జ్వరం వచ్చినచో ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి

మలేరియా అంశంలో పేర్కొనిన దోమల నివారణ జాగ్రత్తలను పాటించాలి

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate