పంచుకోండి

భోజన సమయంలో నీరు

భోజన సమయంలో నీరు

పోస్ట్ చేయబడింది Anonymous తేదీ December 02. 2015
భోజన సమయంలో ఎక్కువ నీరు త్రాగటం వలన జీర్ణక్రియను నష్టపరిచే ప్రక్రియ అని కొంతమంది అభిప్రాయం, కావున సరైన మోతాదులో నీరు త్రాగటం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. భోజన సమయంలో ఎక్కువ నీరు త్రాగటం వలన జీర్ణాశయంలో విడుదల అయ్యే హార్మోన్, ఆమ్లాల గాడతలు తగ్గిపోయే అవకాశం ఉంది, కావున శక్తివంతంగా ఈ రసాయనాలు జీర్ణక్రియను కొనసాగించలేవు లేదా జీర్ణక్రియను ఆలస్యం చేసే అవకాశం ఉంది. జీర్ణక్రియ నెమ్మదిగా అవటం వలన కలిగే నష్టం ఏమి లేదు కానీ, జీర్ణక్రియ ఆలస్యం అవటం వలన మీరు తినే ఆహరంలో విషపదార్థాల స్థాయిలు అధికం అయ్యే అవకాశం ఉంది.

Re: భోజన సమయంలో నీరు

పోస్ట్ చేయబడింది Krishnpriya తేదీ December 06. 2015

రోజు శరీరానికి సరిపోయేన్ని నీటిని త్రాగటం ఆరోగ్యానికి మంచిదే, శరీరానికి చాలా అవసరం కూడా. నీరు లేకుండా మానవ మనుగడ లేదు, సరైన మొత్తంలో నీరు త్రాగకపోవటం వలన కూడా ఆరోగ్యంగా ఉండలేము. కావున ఆరోగ్యంగా ఉండటానికి, మానవులు జీవనం కొనసాగించుటకు నీరు తప్పని సరి అని చెప్పవచ్చు. భోజన మధ్యలో నీరు త్రాగవచ్చా? ఈ ప్రశ్న చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. నిపుణులు కూడా వీటి పైన చర్చలు జరుపుతున్నారు. భోజన సమయంలో నీరు త్రాగటం ఆరోగ్యానికి హానికరమా! లేదా ఉపయోగకరమా! అనేది అందరిని ఆలోచింప చేస్తున్న ప్రశ్న..... అంతేకాకుండా తినేటపుడు నీటికి బదులుగా ఇతర ద్రావణాలు అందుబాటులో లేవు అని చెప్పవచ్చు, ఈ విషయం ఇప్పటికి కూడా చర్చలలో ఉంది.

Re: భోజన సమయంలో నీరు

పోస్ట్ చేయబడింది Krishnpriya తేదీ December 06. 2015

భోజన సమయంలో ఎక్కువ నీరు త్రాగటం వలన జీర్ణక్రియను నష్టపరిచే ప్రక్రియ అని కొంతమంది అభిప్రాయం, కావున సరైన మోతాదులో నీరు త్రాగటం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

భోజనానికి ముందు ఒక గ్లాసు వేడి నీటిని త్రాగటం వలన మీ జీర్ణక్రియ స్థాయిలను మెరుగుపడుతుంది. దీనికి బదులుగా ఆహరం తినేటపుడు కాకుండా భోజనానికి 30 నిమిషాల ముందు మరియు తిన్న 30 నిమిషాల తరువాత నీరు త్రాగటం అనేది మంచి పద్దతి అని చెప్పవచ్చు. ఇలా చేయటం వలన మీరు మంచి ఫలితాలను పొందినట్లయితే దీనిని అనుసరించండి లేదా భోజనం మధ్యలో నీరు తాగటాన్ని అనుసరించండి. కానీ చల్లటి నీరు కన్నా వేడి నీరు తాగటం చాలా మంచిది అని చెప్పవచ్చు

Re: భోజన సమయంలో నీరు

పోస్ట్ చేయబడింది neelakanta sidda తేదీ March 14. 2016
నిజానికి సిద్ద ఆయుర్వేదం ప్రకారం ఆహారం తినడానికి ముందు నీరు త్రాగితే శరీరంలోని ధాతువులు క్షీనిస్తాయి తద్వారా మనిషి సన్నబడటం జరుగుతుందని మరియు శరీరానికి శ్లేష్మ సంబంద ఉదర వ్యాదులు( జలోదరం,అగ్నిమాన్ద్యం వంటివి) వస్తాయని, అదేవిదంగా పూర్తిగా నీటినే తాగకుండా భోజనం తర్వాత నీటిని తాగడం ద్వారా కడుపులో పిత్త దోషం వల్ల గాస్త్రిక్ ,అల్సెర్లు మరియు ఉబకాయమ్ వంటి వ్యాదులు వచ్చే అవకాశం ఉందని అగస్త్య మహర్షి సూచించారు. సరైన రీతిలో భోజనం చేయడం అంటే ముందు ఆహారం తినడానికి ఉపక్రమించినపుడు రెండు గుటకల నీరు త్రాగాలి అప్పుడు పొడిగా ఉన్న ఆహహారనాలం తడిగా అయ్యి ఆహారం లోపలికి సులభంగా వెళ్ళడంతో పాటు,ఉదరంలోని తీక్షణమైన జతరరసం కొద్దిగా గాడత తగ్గి జీర్ణం సరిగా అవ్వడానికి సిద్దం అవుతుంది,తర్వాత మనం తింటున్నపుడు ఆహారం జతరారసంతోను,ఇతర ద్రవాలతో కలవడానికి తక్కువ మోతాదులో నీటిని మద్య మద్యలో తాగాలి చివరగా భోజనం పూర్తయ్యాక 30 నిముషాల తర్వాత నీటిని బాగా తాగాలి....క్లుప్తంగా ఉదరంలో రెండు భాగాలు ఆహారం,ఒక భాగం నీరు,ఒక భాగంలో గాలి ఉండాలన్నమాట....అంటే భోగానం ఆరంభించి ముగించేలోపు మనం సుమారు ఒక గ్లాస్ నీరు తాగి ఉండాలి...ఒక్క విషయం మాత్రం ఎప్పుడు గుర్తించుకోవాలి కడుపు నిండిపోయేలా నీరు త్రాగరాదు అలాగే దాహం అయ్యేంతవరకు నీటిని తాగకుండా ఉండరాదు.
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు