మానవులకు కావలసిన పోషకహార పదార్థాలు కూరగాయలలో పుష్కలంగా లభిస్తాయి. అందువలన మనం తీసుకొనే సమతుల ఆహారంలో కూరగాయలు ఎంతో ప్రదాన పాత్ర వహిస్తాయి. కూరగాయలు అతి తక్కువ ధరలలో లభ్యమవడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు మానవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి.
కాకరకాయ: | కాకరకాయ భారతదేశం అంతా పెంచబడుతున్న మొక్క. చేదు అయినప్పటికీ, ఆరోగ్యాన్నిచ్చేదని అందరూ తింటారు. కాకరను మదుమేహానికి మందుగా వాడుతున్నారు. కాకర రసంలోని హైపోగ్లైసమిక్ పదార్థం, ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర రసం ను కుక్క, నక్క కాటులకు విరుగుడుగా ఉపయోగిస్తారు. సోరియాసిస్ నివారణలో కాకర కీలక పాత్ర వహిస్తుంది. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ. విటమిన్ బి6, ఫాంథోనిక్ యాసిడ్, ఫాస్పరస్ లు ఎక్కువగా లభిస్తాయి. అందుకే కాకరను తినడం మంచిది. కనీసం పదిహేను రోజులకు ఒక్కసారైన టీ స్పూన్ కాకర రసం త్రాగడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చు. |
![]() |
గుమ్మడి: | తెలుగువారికి ప్రీతికరమైన, శుభప్రదమైన తరుచూ వాడబడే కూరగాయ గుమ్మడి. దీనిలో అద్బుత ఔషదాలు ఉన్నాయి. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం విశేషం. మలబద్దకం మొదలుకొని మధుమేహం వరకు చాల విధాలుగా గుమ్మడి ఉపయోగపడుతుంది. గుమ్మడిలో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఎ (అధికంగానూ), కొద్దిగా విటమిన్ సి (కొద్దిగానూ) ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు కడుపులోని 'టేప్ వార్మ్స్' నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు. | ![]() |
పొట్లకాయ | పొట్లకాయలో పోషకాలు, విటమిన్లు మరియు పీచు పదార్థాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. పొట్లకాయ లో ఎ, బి, సి విటమిన్లు, అలాగే మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. పొట్లకాయ కడుపు ఉబ్బరం, తిమ్మిర్లు, మలబద్దకాన్ని తొలగిస్తుంది. పొట్లకాయ కషాయాన్ని జ్వరం వచ్చినపుడు మందుగా వాడుతారు. ఇది మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. |
|
దొండ కాయ: | దొండకాయ ఆఫ్రికా నుండి ఆసియాకు వచ్చింది. సాంప్రదాయ వైధ్యంలో దొండ పండును కుష్టు, జ్వరం, ఆస్తమ, బ్రాంకైటిస్, కామెర్ల చికిత్సకు వాడేవారు. దొండకాయ రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది రోగనిరోదక ఔషధంగా పని చేస్తుంది. దొండలో అధికంగా బీటా-కెరోటిన్ ఉంటుంది. | |
బీరకాయ | బీరకాయ సులువుగా జీర్ణం అవుతుంది. విరేచన కారి కూడ. అందువలన పథ్యంగా బీరకాయ చాల మంచిది. లేత బీరపొట్టు వేపుడు జ్వరం ను తగ్గిస్తుంది బీరలు 3 రకాలు - పందిరి బీర, పొట్టి బీర, నేతి బీర. | ![]() |
కీరదోసకాయ: | చూడగానే తినాలనిపించే దోస, వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా దీనిలోని పొషకాలు, రీహైడ్రేటింగ్ ఏజెంట్ గా పని చేస్తాయి. పోటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో భాదపడేవారికి ఇది చక్కని ఆహారం. ఎ విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కళ్ళ కింద నల్లటి చారలను దోసకాయ ముక్కలు తొలగిస్తాయి. శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. దోస తొక్కలో " విటమిన్ 'కే' " సమృద్ధిగా ఉన్నందున చర్మానికి మేలు చేకూరుతుంది. | ![]() |
క్యారెట్: | క్యారెట్లలో అన్ని పొషకాలలో కెల్లా విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే గంటకో క్యారెట్ తినాలి. కంటిచూపును మెరుగుపరిచే బీటా-కెరొటిన్ క్యారెట్లో పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారెట్ గుండె పోటును పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. అందుకే క్యారెట్ ఓ క్యాన్సర్ పోరాట యోధుడు. ఉత్తమ యాంటీ క్యాన్సర్ ఉధ్యమ కార్యకర్త. నిండుగా ఆరెంజ్ రంగులో నిగనిగలాడే క్యారెట్లు తింటే ఆరోగ్య పరిరక్షణ, ముఖ్యంగా కంటి రక్షణ కలుగుతుంది. | ![]() |
చిలగడ దుంప | దీనినే కొన్ని ప్రదేశాలలో గెణుసుగడ్డ, మొహర్రం గడ్డ, రత్నపు గడ్డ, అని కూడా అంటారు. బంగాళదుంప, కందగడ్డలలో కన్నా చిలగడదుంపలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చిలగడదుంపల్లో విటమిన్ బీ6 ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి. వీటిల్లోని సి విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచితే, ఇ విటమిన్ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. | |
బంగాళదుంప | కొన్ని చోట్ల ఆలు గడ్డ అని ఉర్ల గడ్డ అని కూడా పిలువబడుతుంది. ఆహార పౌష్టికత పరంగా బంగాళ దుంపలో పిండి పదార్ధాలు ప్రధానమైన ఆహార పదార్ధం. బంగాళ దుంపలో పలు విధాలైన విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల సి విటమిన్ (ఒక రోజు అవసరంలో 45%), 620 మి.గ్రా. పొటాషియం ( అవసరంలో 18%), 0.2 మి.గ్రా. విటమిన్-B6 (అవసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్దిమోతాదులలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి. వర్ధమాన దేశాలలో బంగాళాదుంప యొక్క ఆహారపు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించింది. | ![]() |
ఉల్లిగడ్డ | ఎన్నో హర్మోన్ల గుణాలు ఉల్లిరసంలో ఉన్నాయి.. ఉల్లిలో శరీరానికి అవసరమైన పోషకాలు తక్కువే. కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. కాని కేలరీలు ఎక్కువ. ఉల్లిని అన్ని కూరలలో వాడుతారు; దీని ప్రత్యేకమైన వాసన వంటకాలకు కమ్మదనాన్ని అందిస్తుంది. ఊల్లిపాయను కోస్తున్నప్పుడు కంటినుండి నీరు రావడానికి కారణం దానిలో ఉండే సైన్-ప్రొపంథియాల్-ఎస్-ఆక్సైడ్ అనే బాష్ప వాయువు విడుదల కావడం. ఊల్లిపాయను కోసినప్పుడు కణాలు దెబ్బతిని అల్లినేస్ అనే ఎంజైము విడుదల అవుతుంది. ఎంజైములో ఉండే అమైనో ఆమ్లాలు, సల్పనిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. దీనికి కన్నిటిని విడుదల చేసే నరాలను ప్రేరేపించే గుణం ఉంటుంది. గాలిద్వారా వేగంగా కంటిని చేరి కన్నీరు వచ్చేట్లుగా చేస్తుంది. ఇదంతా సెకండ్లలో జరిగి పోతుంది. ఉల్లిరసాన్ని, నెయ్యిని సమభాగాలుగా కలిపి దీనిని ఒక టీస్పూన్ మోతాదుగా మూడుపూటలా తీసు కుంటే శారీరక బలహీనత దూరమవుతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. | |
కంద: | ఇది దీర్ఘకాలిక మొక్క. కంద పేరు వినగానే గుర్తు వచ్చేది దురద. కందని తినడానికి ప్రయత్నిస్తే నోరంతా ఒకటే దురద వేస్తుంది. కంద దుంపలో ఉండే కాల్షియం ఆక్సలేట్ అనే రసాయనం కారణంగా కందకి ఆ దురద వచ్చింది.కందలో రెండు రకాలు ఉన్నాయి: (1) తీట (దురద) కంద, (2) తియ్య కంద. తీట కందని ముక్కలుగా కోసి, నీళ్లల్లో ఉడికించి, ఆ నీళ్లని పారబోస్తే, ఆ దురద పోతుంది. ఒక మోస్తరుగా కేలరీలను కలిగి ఉంటుంది, పొటాషియం, మాంగనీస్, పీచు పదార్థం ఎక్కువ స్థాయిలోనే ఉంటాయి. కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. బంగాళ దుంపతో పోలిస్తే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి మధుమేహులు అడపదడపా తీసుకోవచ్చు | |
ముల్లంగి |
ఘాటైన వాసన, రుచి కలిగి ఎన్నో రంగుల్లో, ఆకారాలలో దొరికే ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని సలాడ్ల కూరగాయగా భావిస్తారు. దుంప లన్నింట్లో తక్కువ శక్తిని కలిగిఉన్నది ముల్లంగే. తాజా దుంపలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రత్యేకత సలొరాఫేన్ అనే యాంటి ఆక్సైడ్‌ను కలిగి ఉండటం. ప్రోస్ట్రేట్, రొమ్ము, ఓవరీ, కోలాన్ మొదలైన క్యాన్సర్ల చికిత్సలో సలొరాఫేన్ ప్రముఖపాత్ర వహిస్తుందని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. క్యాన్సర్ కణాలను నశింప చేసే శక్తి వీటికి ఉంది. మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది, కనుక ముల్లంగి తప్పకుండా తీసుకోవాలి. దీనితో వివధ రకాల వంటలు చేసుకోవచ్చు. రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌రూపంలో తీసుకోగలిగితే 'సి' విటమిన్ పుష్కలంగా అందుతుంది. తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది. జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి. |
గోరు చిక్కుడు | చిక్కుడు జాతిలో ఒకటి. ఇది బలమైన ఆహారం. భారతదేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో పండిస్తున్నారు. ప్రొటీన్ మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. బరువు తగ్గడం మరియు మధుమేహ చికిత్సలో ఉపయోగపడుతుంది. పిండం అభివృద్దికి సహకరిస్తుంది. | ![]() |
సోయా చిక్కుడు | సోయాబీన్స్ పసుపు రంగులో, చిక్కటి గోధుమ రంగులో ఉంటాయి. సోయాబీన్స్ లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. నూనె తీసిన సోయాబీన్ లో ప్రొటీన్ శాతం 45-48% ఉంటుంది. సోయాను పిల్లల ఆహార పదార్థాలు, బిస్కెట్స్, బ్రెడ్ల తయారీలో వాడతారు. సోయాలోని ప్రొటీన్లు మాంసంలోని ప్రొటీన్ల వంటివే. | ![]() |
పందిరి చిక్కుడు | పందిరి చిక్కుడు ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు. పందిరి చిక్కుడు కాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పు దినుసులుగా వాడుతారు. బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఫ్రెంచ్ చిక్కుడు(సన్న చిక్కుడు): సన్న చిక్కుడులో ఖనిజ సిలికాన్ ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మరియు కనెక్టివ్ కణజాలం ఆరోగ్యంగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. |
|
అనపకాయ | అనపకాయ లేదా అనుములు అనేది చిక్కుడు జాతికి చిందిన ఒక కాయ. ఇది తీగజాతికి చెందినది. అనపకాయలను కూరలకు, గుగ్గిళ్ళు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు . దీని కాయలు పలచగా చిక్కుడు కాయల లాగే ఉంటాయి. దీనిని ఎక్కువగా రాయల సీమ ప్రాంతంలో వర్షాధార పంటగా - వేరుశనగ లో అంతర పంటగా పండిస్తారు. | ![]() |
టమాటో | టమాటో వాడని కుంటుంబం, టమాటో లేని వంటకం లేదు. టమాటో శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. లైకోపిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఎసిడిటితో భాదపడేవారు టమాటలతో తయారు చేసిన వంటకాన్ని తింటే ఉపశమనం కలుగుతుంది. సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటి దూరం అవుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. టమోటాల్లో ఏ విటమిన్ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది. టమోటాలు తింటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి. లైకోపేన్ తీసుకోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడటం, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది. | ![]() |
బెండకాయ | బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్థము కడుపులో మంటనుండి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, సి విటమిన్ దీనిలో చాలా ఎక్కువ. దీనిలో గల డయూరిటిక్ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్ నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. | ![]() |
వంకాయ | తెలుగు దేశంలో చాలా ప్రాముఖ్యమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయలలో ఒకటి. వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. వంకాయ పోట్టులో ఉండే ఆంథోసియానిన్ పైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిక్ అంటారు. ఇది యాంటి ఆక్సీడెంట్ గా పనిచేస్తుంది. వంకాయలో ఎక్కువగా పోటాషియం ఉంటుంది. ఇది బి.పి ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. | ![]() |
ఆధారం: కుమారి బి.పావని, విద్యార్థి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2013/041.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమ...
ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూర...
కూరగాయలు సాగు