অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కల్తీ మరియు ఆహారపు భధ్రత

ఒక ఆహారపదార్ధం కల్తీ చెయ్యబడిందనటానికి

  • అది ఆహారపదార్ధం యొక్క గుణానికి మరియు నాణ్యతకు చెరుపు చేసే ద్రవ్యం అదనంగా కలపబడి ఉండవచ్చు,మానవులకు హానికలిగించవచ్చు లేదా నాసిరకమైన లేదా చౌక ద్రవ్యం అయ్యుండవచ్చు.
  • తయారీలో,పొట్లం కట్టేటప్పుడు మరియు భధ్రపరచేటప్పుడు అనారోగ్యకరమైన పద్ధతి వల్లకూడా కలుషితం అయ్యుండవచ్చు.
  • అందులో కుళ్ళిన పాడయిన జంతువుయొక్క లేదా కూరగాయల యొక్క లేదా కీటకాలవల్ల కుళ్ళిన మలినాలు మొత్తంగా కానీ ఒకభాగం కానీ,ఉండటం వల్ల మలినమయి ఉండవచ్చు తద్వారా మానవవినియోగానికి పనికిరావు.
  • అందులో విషపూరితమయిన లేదా ఆరోగ్యానికి హానికలిగించే ఏదయినా భాగాలు కలిగియుండవచ్చు.
  • అనుమతి లేని రంగులు కలపబడి ఉండవచ్చు.
  • అనుమతి లేని సంరక్షణకారులను కలిపి ఉండవచ్చు లేదా కలిపిన సంరక్షణకారి ఆ ప్రయోజనానికి అనుమతించినదాని కన్నా మించిన మోతాదులోఉండవచ్చు.
  • ఆ ఉత్పత్తి యొక్క నాణ్యత మరియు స్వచ్చత ఆ నిర్దిష్టవస్తువుకు నిర్దేశించినప్రమాణాలకన్నా తక్కువగా ఉండవచ్చు.
  • పాలు మరియు పాల ఉత్పత్తులు,తృణధాన్యాలు మరియు తృణధాన్య ఉత్పత్తులు,వంటనూనెలు,మసాలా లలో సాధారణంగా కల్తీ అవుతాయి.
  • కల్తీజరగటం వల్ల ఆరోగ్యసమస్యలు ఎన్నో.కల్తీజరిగిన ఆహారపదార్ధాలను స్వీకరించటం వల్ల విషాహారానికి దారితీయవచ్చు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate