অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పాలు

  • ఈ సమూహములో పాలు,పాలపొడి,పెరుగు,మజ్జిగ,పన్నీర్ వగైరాలున్నాయి.
  • శిశువులకు,పిల్లలకు పాలు మంచి ఆదర్శమైన ఆహారము,మరియు అన్ని వయసులవారికి మంచి అనుంబంధఅహారము.
  • మంచి నాణ్యతగల మాంసకృత్తులకు ఇది మంచి ఆధారవనరు.
  • పాలలో కాల్షియం,రైబోఫ్లోవిన్,విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి కానీ ఐరన్,విటమిన్ సి తక్కువగా లభిస్తాయి.
  • మాంసాహారం తిననివారికి విటమిన్ బి 12 పాలలోనే లభ్యమవుతుంది.
  • పాలలో సహజంగా ఉండే పోషక పదార్ధాలన్ని - పెరుగు, జున్ను వంటి వాటిలో కూడా ఉండాలంటే  వీటిలోని నీరును తొలగించకూడదు. మీగడ తీసిన పాలలో క్రొవ్వు ఉండదు కానీ మాంసకృత్తులు మరియు తేమ లేని చక్కెర పుష్కలంగా ఉంటాయి.
  • పెరుగులో కాల్షియం,ఫాస్ఫరస్,రైబోఫ్లోవిన్,విటమిన్ బి2,మరియు అయోడిన్ బాగా ఉంటాయి.అలాగే ఇందులో విటమిన్ బి12, పాంటోథెనిక్ యాసిడ్-విటమిన్ బి5,జింకు,పొటాసియం,మాంసకృత్తులు, మాలిబ్డినమ్ కూడా అధికంగా లభిస్తాయి.

గుర్తుంచుకోదగ్గ ఆరోగ్యచిట్కాలు

  • పచ్చిపాలల్లో బాక్టీరియా ఉండటంవల్ల అవి త్రాగటం ప్రమాదకరం.ఈ బాక్టీరియా వల్ల విరేచనాలు, క్షయ, బ్రుకెల్లోసిస్, టైఫాయిడ్ (సన్నిపాత జ్వరం)కు  దారితీయవచ్చు.పాలను కాచటం వల్ల బాక్టీరియా సంహరింపబడుతుంది.
  • అదేవిధంగా పట్టణప్రాంతాలలో పాలను పాశ్చరైజ్ చేస్తారు తద్వారా ప్రమాదకరమైన బాక్టీరియా నాశనమవుతుంది, పాలను తాగేందుకు అనువుగా అందులోని క్రొవ్వును సమానంగా సర్దుబాటుచేసేందుకు హోమోజనైజుడ్ చేస్తారు.
  • కొందరికి పాలంటే పడదు (పాలచక్కెర – లాక్టోస్ సహించకపోవడం) వారు పెరుగును వినియోగించవచ్చు.
  • పాలను తాగడం,పాల ఉత్పత్తులను వాడటం వల్ల శరీరం కాల్షియంను ఎక్కువగా నిలుపగలుగుతుంది.
  • పెరుగు వల్ల శరీరములో రోగనిరోధకశక్తి పెరుగుతుంది అదేవిధంగా ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate