హోమ్ / ఆరోగ్యం / పారిశుధ్యం మరియు పరిశుభ్రత / వండిన ఆహార పదార్ధాల వృధాను తగ్గిద్దాం.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వండిన ఆహార పదార్ధాల వృధాను తగ్గిద్దాం.

సాధారణంగా వునం ఎన్నో రకాల ఆహారపదార్దాలను వినియోగిసుంటాం. వినియోగించుకోగా మిగిలిన ఆహార పదార్ధాలను వ్యర్థం చేయటం లేదా పారవేయటంలాంటివి చేస్తుంటాం.

లక్ష్యం

వండిన ఆహారపదార్థాలు వృథా కాకుండా చూసుకోవలసిన అవసరాన్ని గుర్తిద్దాం

నేపథ్యం

సాధారణంగా వునం ఎన్నో రకాల ఆహారపదార్దాలను  వినియోగిసుంటాం. వినియోగించుకోగా మిగిలిన ఆహార పదార్ధాలను వ్యర్థం చేయటం లేదా పారవేయటంలాంటివి చేస్తుంటాం. ముఖ్యంగా హోటల్స్ రెస్టారెంట్లలో లేదా వివాహాలు, వేడుకల, పండుగలు వెుదలైన సందర్భాలలో అవసరానికి మించి ఆహారపదార్థాలను వండటం, మిగిలిపోయినవి పారేయడం, వృథా చేయటం సర్వసాధారణం. ఎంతో విలువైన ఆహారపదర్గాలను వ్యర్ధం చేయటం తగ్గించి, మిగిలిపోయిన ఆహారాన్ని సద్వినియోగపరిచే దిశలో ఆలోచించడం, ఆచరించడం ప్రతిఒక్కరి బాధ్యత.

పద్ధతి

1. మీ వీలును బట్టి మీ ఇంటిని గాని, ఏదైనా వేడుక, వివాహం, ఉత్సవ సమయాన్ని ఎంచుకోండి.

కనీసం మూడు రోజులు పరిశీలించండి. ఆయా సందర్భాల్లో ఎంతమంది హాజరైనారు? ఏ ఏ ఆహారపదార్థాలను తయారుచేసారు? అందులో వినియోగించబడగా మిగిలినదెంత? వాటిని ఏం చేశారు? వంటి వివరాలను సేకరించి, కింది పట్టికలో నమోదుచేయండి.

2. వ్యర్థమైన ఆహార పదార్ధాల మొత్తాన్ని అంచనావేయుటకు అనువైన కొలతను నిర్ణయించుకోండి. ఆహార పదార్గాన్ని బట్టి కిలోలు, లీటర్లు, పాత్రలు లేదా ముక్కల రూపంలో కొలవవచ్చు.

3.శుభకార్య నిర్వాహకులను, వంటచేసినవారిని, వడ్డించిన వారిని ఆహారాన్ని వ్యర్థం చేసినవారిని కలిసి, మాట్లాడి ఆహారపదార్థాల వ్యర్ధానికి కారణాలను కనుక్కోండి.

ముగింపు

ఆహార పదార్థాల వృథా రెండు రకాలుగా జరుగుతుంది. ఆహారం వండక ముందు, ఆహారం వండిన తరువాత, శాస్త్రీయ గణాంకాల ప్రకారం పండించిన 10 కిలోల ధాన్యంలో 3 కిలోలు ఎలుకలు, పందికొక్కులు తినేయడం. 2 కిలోలు గోదాముల్లో పరుగుపట్టి పోవడం, వండిన తరువాత 2 కిలోల వరకు వృధా అయిపోతుంది. అంటే చివరికి 3 కిలోలే తినడానికి ఉపయోగపడుతోందన్నమాట.

ఆహార ఉత్పత్తిని పెంచడానికి సంకరజాతులు అభివృద్ధి, విపరీతంగా ఎరువులు, పురుగు మందులు వాడడం ద్వారా పర్యావరణాన్నికలుషితం చేయడం కన్నా ఉత్పత్తి అయిన దానిని భద్రపరచుకునే పద్ధతులమీద దృష్టిపెట్టడం మంచిది. ఆహారం వృథా కాకుండా ఉండాలంటే వడ్డించుకోడానికి చిన్న గరిటె వాడుకుందాం. అవసరమైనంతే వడ్డించుకుందాం. సాధారణంగా ఆహారం ఎందుకు వృథా అవుతుందో, దానిని ఎలా అరికట్టవచ్చో ఆలోచించండి.

సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించి ప్రదర్శించండి.

తదుపరి చర్యలు

  1. "ఆహార పదార్థాలను వ్యర్థం చేయరాదు" అనే సమాచారాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేయండి.
  2. ఏదేని హోటల్లో వినియోగించకుండా మిగిలిపోయే ఆహారపదార్థాలను ఏంచేస్తారో అడిగి తెలుసుకోండి.
  3. మీ ఇంట్లో తినకుండా మిగిలిపోయిన ఆహార పదార్ధాల్ని ఏం చేస్తున్నారో కనుక్కోండి.
  4. మీ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో వృథా అయ్యే ఆహారపదార్థాల పరిమాణం (రోజు, నెల, సంవత్సరం) ప్రకారం లెక్కించండి.వృథాను సద్వినియోగపరిచే లేదా అరికట్టే మార్గాలను కనుక్కోండి. ఆచరించండి.
  5. ఆహారపదార్థాలను వృథా చేయకుండా సద్వినియోగపరిచే మార్గాలను అన్వేషించండి.
  6. ఆహారపదార్థాల వృధా చేయడాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను గురించి ప్రజలలో అవగాహన కల్పించండి.
  7. మిగిలిన ఆహారపదార్థాలను సద్వినియోగపరిచే దిశలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఇలాంటి సంస్థలు మీకు అందుబాటులో ఉంటే, వారి ఫోన్ నెంబర్లను  సేకరించి వేడుకల సమయాల్లో వారికి తెలియజేయండి.

ఆధారము: http://apscert.gov.in/

2.95698924731
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు