హోమ్ / వార్తలు / 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రానికి స‌వ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం విత్త లోటును 3.9 శాతం వ‌ద్దే నిలిపి ఉంచ‌డం జ‌రిగింది
పంచుకోండి

2015-16 ఆర్థిక సంవ‌త్స‌రానికి స‌వ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం విత్త లోటును 3.9 శాతం వ‌ద్దే నిలిపి ఉంచ‌డం జ‌రిగింది

నిర్దేశించుకున్న విత్త ల‌క్ష్యాల‌కు క‌ట్టుబ‌డి 2015 - 16 ఆర్థిక సంవ‌త్స‌రానికి స‌వ‌రించిన అంచ‌నా

నిర్దేశించుకున్న విత్త ల‌క్ష్యాల‌కు క‌ట్టుబ‌డి 2015 - 16 ఆర్థిక సంవ‌త్స‌రానికి స‌వ‌రించిన అంచ‌నాల (ఆర్ ఇ) ప్ర‌కారం విత్త లోటును జీడీపీ లో 3.9 శాతం స్థాయి వ‌ద్దే నిలిపి ఉంచ‌డం జ‌రిగింది. అలాగే, 2016 - 17 బ‌డ్జెట్ అంచ‌నాల ప్ర‌కారం విత్త‌లోటును జీడీపీ లో 3.5 శాతం స్థాయి వ‌ద్ద అట్టిపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 2016 -17 సాధార‌ణ బ‌డ్జెట్ ను ఈరోజు లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతూ.. విధాన ఐచ్ఛికాల‌ను అయితే ఆర్థిక సుసంఘ‌టితానికి మ‌రియు స్థిర‌త్వానికి అనుకూలంగా మ‌ల‌చ‌డ‌మా, లేక మ‌రింత త‌క్కువ స్థాయి దూకుడు క‌లిగిన సుసంఘ‌టిత ప్ర‌క్రియ‌కు, వృద్ధికి అండ‌దండ‌లు అందించ‌డానికి అనుకూలంగా మ‌ల‌చ‌డ‌మా అని మ‌థ‌నం చెందాన‌న్నారు. విత్త ల‌క్ష్యాల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టంలోనే వివేకం ఉంద‌ని నిర్ణ‌యించుకున్నాను అన్నారు. అయితే, అదే స‌మ‌యంలో అభివృద్ధి కార్యాచ‌ర‌ణ పై రాజీకి తావు ఇవ్వ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఆధారము: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హైదరాబాద్

పైకి వెళ్ళుటకు