హోమ్ / వార్తలు / 2016 నవంబర్, 24 నుంచి 14వ రూరల్ టెక్నాలజీ మరియు క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం
పంచుకోండి

2016 నవంబర్, 24 నుంచి 14వ రూరల్ టెక్నాలజీ మరియు క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం

2016 నవంబర్, 24 నుంచి 14వ రూరల్ టెక్నాలజీ మరియు క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న ఎన్ ఆర్ డి & పి ఆర్ స్థాపక దినాన్నిపురస్కరించుకొని ఒక నెల రోజులపాటు నిర్వహించనున్న కార్యక్రమాలలో భాగంగా ఎన్ ఆర్ డి& పి ఆర్ క్యాంపస్ లో 2016, నవంబర్ 24 నుంచి 28 తేదీ వరకు 14 రూరల్ టెక్నాలజీక్రాఫ్ట్స్ మేళాను జరపనున్నారు.

సందర్భంగా ఎన్ ఆర్ డి డి & పి ఆర్ లో ఏర్పాటైన విలేఖరుల సమావేశాన్ని ఉద్దేశించి ఎన్ ఆర్ డి డి & పి ఆర్ డైరెక్టర్ జనరల్ శ్రీ డాక్టర్ డబ్ల్యు.ఆర్. రెడ్డి మాట్లాడుతూ మేళాలోదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక బృందాలు (ఎస్ హెచ్ జి)లు /ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు / చేతివృత్తి కళాకారులు / సంస్థలు / ప్రభుత్వేతర సంస్థలు /ప్రభుత్వ సంస్థల నుంచి 300 లకు పైగా స్టాల్స్ ఏర్పాటుకానున్నాయని తెలిపారు. స్టాల్స్ లోనిర్వాహకులు వారి వారి టెక్నాలజీలను, ఉత్పత్తులను ప్రదర్శిస్తారని చెప్పారు. 18 రాష్ట్రాలనుంచి ప్రతినిధులు విచ్చేసి వేర్వేరు కార్యక్రమాలలో పాలుపంచుకుంటారని చెప్పారు.హస్తకళలు, చేతి వృత్తుల వైపు పట్టణ ప్రాంత యువత దృష్టిని ఆకర్షించడం / అవగాహనకలిగించడం మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఎన్ ఆర్ డి డి & పి ఆర్ క్యాంపస్ లో 2016, నవంబర్ 24, 25 తేదీలలో గ్రామీణ అభివృద్ధిసంబంధిత చిత్రోత్సవాన్ని ఎన్ ఆర్ డి డి & పి ఆర్ నిర్వహించనుందని డైరెక్టర్ జనరల్వెల్లడించారు. చిత్రోత్సవంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి డాక్యుమెంటరీలతో సహా 50కిపైగా చిత్రాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. వివిధ గ్రామ పంచాయతీలలోని విజయ గాథలనుప్రజలకు చాటి చెప్పడం చిత్రోత్సవం లక్ష్యమని శ్రీ డాక్టర్ డబ్ల్యు.ఆర్. రెడ్డి అన్నారు. వివిధసాంకేతిక విజ్ఞానాలను గ్రామీణ ప్రజలకు వివరించడం చిత్రోత్సవం ముఖ్యోద్దేశమని ఆయనచెప్పారు. ఎన్ ఆర్ డి డి & పి ఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ లలో కొంత మంది ప్రారంభకార్యక్రమానికి హాజరై, మేళాను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మేళా 2016, నవంబర్ 24నాటి సాయంత్రం 4 గంటలకు ఆరంభమవుతుందని చెప్పారు. ప్రతి రోజు వృత్తి కళాకారులు వివిధసాంస్కృతిక కార్యక్రమాలను సమర్పిస్తారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నూతనఆవిష్కర్తలు, సాధికారత బృందాలు కార్యక్రమంలో భాగమవుతాయని వివరించారు.

డి ఆర్ డి పూర్వ శాస్త్రవేత్తలు గ్రామీణ ఉత్పత్తులకు సంబంధించి సుమారు 17 సాంకేతికపద్ధతులను రూపొందించారు. ఇవి తక్కువ ఖర్చుతో కూడినవే కాకుండా భారతదేశంలోనిపల్లెవాసుల జీవనశైలులను సుసంపన్నం చేసేవి. తాగునీటి శుద్ధి, పర్యావరణ హితకరమైనదోమ తెరలు, మెరుగైన మరుగుదొడ్లు, వ్యర్థాల వినియోగం, పుట్టగొడుగుల సేద్యం వంటివి వీటిలోకలిసి ఉన్నాయి. నెల 24 స్వచ్ఛత పైన, 25, గ్రామీణాభివృద్ధి అంశంపైన, 26 మహిళాసాధికారత అంశం పైన ఇలా వేరు వేరు అంశాలపై బృంద చర్చలు కూడా మేళాలో భాగంగానిర్వహించనున్నారు. ప్లాస్టిక్ కు చోటు లేకుండా చూడాలనేది కార్యక్రమంలో ప్రధానమైనఅంశంగా ఉండబోతున్నది. స్వచ్ఛతకు పెద్ద పీట వేయడానికి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.చిత్రోత్సవం ముగిసిన అనంతరం ఉత్తమ చిత్రాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులనుప్రదానం చేయనున్నారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు