హోమ్ / వార్తలు / కేంద్ర‌ప్ర‌భుత్వ సంస్థ‌ల కార్యాల‌య సముదాయం (సి.జి.ఓ. ట‌వ‌ర్స్‌) లో స్వ‌చ్ఛ్ భార‌త్ కార్య‌క్ర‌మం
పంచుకోండి

కేంద్ర‌ప్ర‌భుత్వ సంస్థ‌ల కార్యాల‌య సముదాయం (సి.జి.ఓ. ట‌వ‌ర్స్‌) లో స్వ‌చ్ఛ్ భార‌త్ కార్య‌క్ర‌మం

కేంద్ర‌ప్ర‌భుత్వ సంస్థ‌ల కార్యాల‌య సముదాయం (సి.జి.ఓ. ట‌వ‌ర్స్‌) లో స్వ‌చ్ఛ్ భార‌త్ కార్య‌క్ర‌మం

స్వ‌చ్ఛ్ భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా హైద‌రాబాద్ క‌వాడీగూడ‌లోని కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల (సి.జి.ఓ. ట‌వ‌ర్స్‌)లో పరిశుభ్ర‌త కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గ‌నుల భ‌ద్ర‌త‌ డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ సంస్థ అధికారులు స్వచ్ఛ్ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని మే 16 - 31 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం డిప్యూటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీ హుస్సేన్ ఆధ్వ‌ర్యంలో సంస్థ అధికారులంద‌రూ సి.జి.ఓ ట‌వ‌ర్స్ చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాల‌ను, రోడ్డుపైన ఉన్న చెత్తను తొల‌గించారు. సంస్థ సిబ్బంది స్వ‌చ్ఛ్ భార‌త్ ప్ర‌తిజ్ఞ కూడా చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ హుస్సేన్ మాట్లాడుతూ మ‌హాత్మాగాంధీ 150వ జ‌న్మ‌దినం (2019) వ‌ర‌కు దేశాన్ని స్వ‌చ్ఛ్ భార‌త్‌గా మార్చ‌డమే ల‌క్ష్యంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించార‌ని తెలిపారు. దేశాన్ని స్వ‌చ్ఛ్ భార‌త్‌గా మార్చ‌డమే ల‌క్ష్యంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించార‌ని తెలిపారు. దీనిలో భాగంగానే గ‌నుల భ‌ద్ర‌త డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ సంస్థ సిబ్బంది ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి కార్యాల‌యం ప‌రిస‌రాల‌లో, వారానికి ఒక‌సారి కార్యాల‌యంలో స్వ‌చ్ఛ్ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నార‌ని శ్రీ హుస్సేన్ వివ‌రించారు.

ఆదరం: త్రికా మాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు