హోమ్ / వార్తలు / గిరిజన అభ్యర్థులకు ఈ 23న స్టడీ సర్కిల్‌ ప్రవేశ పరీక్ష
పంచుకోండి

గిరిజన అభ్యర్థులకు ఈ 23న స్టడీ సర్కిల్‌ ప్రవేశ పరీక్ష

గిరిజన అభ్యర్థులకు ఈ 23న స్టడీ సర్కిల్‌ ప్రవేశ పరీక్ష

స్టడీ సర్కిల్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులకు ఈ నెల 23న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్టడీ సర్కిల్‌ ద్వారా శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే! దరఖాస్తు చేసుకున్న వారిలో 300 మందికి అశోక్‌నగర్‌లోని డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు