హోమ్ / వార్తలు / గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ నేడే!
పంచుకోండి

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ నేడే!

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ నేడే!

నిరుద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. గత నోటిఫికేషన్లలో భర్తీకి నోచుకోని క్యారీఫార్వర్డ్‌ ఖాళీల విషయంలో స్పష్టత వస్తే మంగళవారమే ఈ నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. లేనిపక్షంలో బుధవారం విడుదలవుతుంది. తొలుత 750 పోస్టులతో గ్రూప్‌-2ను విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే తర్వాత వివిధ శాఖాధిపతుల నుంచి అందిన సమాచారం మేరకు దాదాపు 200 క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలు ఉన్నాయి. వీటిని కూడా కలిపి మొత్తం సుమారు 950 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉంటాయి. ముందుగా 150 మార్కులకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనిని క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌గానే పరిగణిస్తారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు