హోమ్ / వార్తలు / తెలంగాణాలో డిగ్రీ చదివిన విద్యార్థులకూ రీయింబర్స్‌మెంట్
పంచుకోండి

తెలంగాణాలో డిగ్రీ చదివిన విద్యార్థులకూ రీయింబర్స్‌మెంట్

తెలంగాణాలో డిగ్రీ చదివిన విద్యార్థులకూ రీయింబర్స్‌మెంట్

తెలంగాణాలో డిగ్రీ చదివిన విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సంబంధిత విద్యార్థులు దరఖాస్తులు పంపాలని సాంఘిక సంక్షేమశాఖ ఎస్వీయూ అధికారులను ఆదేశించింది. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతంలో డిగ్రీ చదివి ప్రస్తుతం ఎస్వీయూలో పీజీ చేస్తున్న విద్యార్థులను నాన్‌లోకల్‌గా పరిగణించి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ అంశంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 12న ‘విద్యార్థులకు విభజన కష్టాలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన సాంఘిక సంక్షేమ శాఖ దరఖాస్తులను పంపాలని  ఎస్వీయూ అధికారులను ఆదేశించింది.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు