హోమ్ / వార్తలు / లోక్‌ అదాలత్‌ ద్వారా నిరుపేదలకు న్యాయ సహాయం
పంచుకోండి

లోక్‌ అదాలత్‌ ద్వారా నిరుపేదలకు న్యాయ సహాయం

లోక్‌ అదాలత్‌ ద్వారా నిరుపేదలకు న్యాయ సహాయం

న్యాయ సహాయం కావాల్సిన పేదలకు లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడుతుందని, అన్ని స్థాయిల్లో లోక్‌ అదాలత్‌ నిర్వహించాలని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన 14వ అఖిలభారత న్యాయాధికార సంస్థ సదస్సులో సదానందగౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు న్యాయం దక్కే చోటు లోక్‌ అదాలత్‌, లోక్‌ అదాలత్‌ లక్ష్యసాధనకు మరింత కృషి జరగాలని అభిప్రాయపడ్డారు. లోక్‌ అదాలత్‌ల ద్వారా దేశ వ్యాప్తంగా 5.5లక్షల బ్యాంకు కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. లోక్‌ అదాలత్‌లో సహాయం పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. లోక్‌అదాలత్‌లో ప్రవేశపెట్టిన 7 పథకాలను వినియోగించుకోవాలని కోరారు. పారా లీగల్‌ వాలంటీర్లకు న్యాయ శిక్షణ ఇవ్వాలన్న లోక్‌అదాలత్‌ ఆలోచన సముచితమని పేర్కొన్నారు. న్యాయవాదుల నైపుణ్యం మెరుగుకోసం లోక్‌ అదాలత్‌ శిక్షణ ఇస్తుందని తెలిపారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు