హోమ్ / వార్తలు / సబ్సిడీ ప్రయోజనాలకు 'ఆధార్' తప్పని సరి కాదు
పంచుకోండి

సబ్సిడీ ప్రయోజనాలకు 'ఆధార్' తప్పని సరి కాదు

సబ్సిడీ ప్రయోజనాలకు 'ఆధార్' తప్పని సరి కాదు

సబ్సిడీ, తదితర ప్రయోజనాలకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్రం తెలిపింది. ఆధార్‌ లేదనే కారణంగా ప్రభుత్వ సబ్సిడీ, ఇతర ప్రయోజనాల నుంచి పౌరులను మినహాయించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తాము తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ లేని వారు ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు చూపించి ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలు, సేవలు పొందవచ్చని పేర్కొంది. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి పి.పి.చౌదరి ఈ విషయాన్ని బుధవారంనాడు లోక్‌సభకు తెలిపారు. 2015, ఆగస్టు 11న సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల్లో ఆధార్ లేదనే కారణంగా పౌరునికి ప్రభుత్వ సబ్సిడీలు, సేవలు మినహాయించరాదని కేంద్రానికి స్పష్టం చేసింది. తొలుత పీడీఎస్ స్కీమ్, కిరోసిన్, ఎల్పీజీ సబ్సిడీ మినహా ఎలాంటి ప్రయోజనాలకు ఆధార్ కార్డు వాడరాదంటూ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ఆ తర్వాత 2015 అక్టోబర్ 15న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్లాం పెన్షన్ (వద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు), పీఎంజేడీవై, ఈపీఎఫ్ఓ వంటి స్కీమ్‌లకు కూడా ఆధార్ కార్డు వినియోగాన్ని విస్తరించింది. ఆధార్ స్కీమ్ పూర్తిగా స్వచ్ఛందమేనని అక్టోబర్ 15 ఉత్వర్లులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని మంత్రి లోక్‌సభలో పేర్కొంటూ...అత్యన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చేంతవరకూ ఆధార్‌ను తప్పనిసరి చేయమని స్పష్టం చేశారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు