హోమ్ / శక్తి వనరులు / ఇంధన సముదాయము / సహజ వనరులు తరిగిపోతున్నాయి.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సహజ వనరులు తరిగిపోతున్నాయి.

సహజ వనరుల తగ్గుదలపై పెరుగుతున్న జనాభా ప్రభావాన్ని పరిశీలిద్దాం.

లక్ష్యం

సహజ వనరుల తగ్గుదలపై పెరుగుతున్న జనాభా ప్రభావాన్ని పరిశీలిద్దాం.

నేపథ్యం

మానవ జీవనం సుస్థిరంగా ముందుకు సాగాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, సేవలు వంటి చాలా ఆర్థిక కార్యకలాపాలు అవసరం. అంతే కాక సుస్థిర జీవనానికి నీరు, గాలి, శక్తి, వ్యవసాయ భూములు మొదలైనవి అవసరం. జనాభా పెరుగుదల, ఇతర కార్యక్రమాల్లో మార్పుల వలన స్థానిక వనరులలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. వనరులు తరిగిపోవటం జరుగుతున్నది.

పద్ధతి

  1. మీ నివాస ప్రాంతానికి దగ్గరలోగల గ్రామాన్ని లేదా పట్టణాన్ని ఎన్నుకోండి.
  2. ఆ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో జనాభా పెరుగుదల లేదా తగ్గుదల రేటును గురించి పెద్దలు లేదా గ్రామ పంచాయితీ లేదా మండల అధికారి వద్ద నుండి సమాచారం సేకరించండి.
  3. వారి ఆదాయ వూరాలను కనుక్కోండి. వ్యవసాయం, కోళ్ళపెంపకం, పశుపోషణ కూలీ, ఇతర వ్యాపారాలు ఉదాహరణకు బట్టలుకుట్టడం, రవాణా మొదలైన వాటి నుండి వచ్చే రాబడిని కనుగొనండి.
  4. ప్రధాన నీటి వనరుల జాబితాను రూపొందించండి. (చెఱువు, బావి ఉపరితల మరియు భూగర్భజలం) ఆహార సరఫరా, ఇంధనాలు (బొగ్గు,కలప) మొదలైన వాటి గురించిన సమాచారాన్ని సేకరించండి.
  5. స్థానిక వనరుల స్థితిలో మార్పులను గుర్తించండి. తరచుగా వనరుల కొరత ఉందా? వనరుల నాణ్యత పెరగటం కాని తరగటం కాని జరుగుతున్నదా? పరిశీలించండి.
  6. నివాస ప్రాంతాల్లో చుట్టుపక్కల గల పరిశ్రమల ద్వారా గాలి కాలుష్యం జరుగుతుందేమో గుర్తించండి.

ముగింపు

నీటికరువు, ఆహారపు కొరత, కలుషితమైన గాలి మొదలైనవన్నీనేడు మనల్ని పీడిస్తున్న సమస్యలు. వనరులను వీలైనంతగా వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నాం. పంటపొలాలను చేపల చెరువులుగా మార్చేస్తున్నాం. ఆర్థిక మండళ్ళుగా అటవీ ప్రదేశాలను ఉపయోగిస్తున్నాం. కాలుష్య నియంత్రణ అవధులు దాటి పర్యావరణంలోకి కాలుష్యం విడుదల చేస్తున్నాం. వనరులు మన సౌకర్యం కోసం వినియోగించుకోవడంలో తప్పలేదు. అవసరానికి మించి మనం దురాశతో వాడుతున్నాం. వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. వాన సంరక్షణ, చెట్లు పెంపకం, విద్యుత్ వంటి ఇంధనాలను పొదుపుగా వాడడం మన దినచర్యలో భాగంగా కావాలి.

జనాభా పెరుగుదల, వనరుల లభ్యతల మధ్య గల సంబంధం పరిశీలించి మీ అభిప్రాయాలతో నివేదిక రూపొందించండి.

తదుపరి చర్యలు

  1. సహజ వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలిపే చైతన్య కార్యక్రమాలను చేపట్టండి.
  2. సహజ వనరుల సంరక్షణ విధానాలను ఛార్జుపై ప్రదర్శించండి.
  3. సౌకర్యాలు కావాలంటే సహజ వనరులు ఉపయోగించుకోవల్సిందే కదా! మరి వాటిని కాపాడుకోవాలంటే మనం మన అలవాట్లలలో ఏఏ మార్పులు చేసుకోవాలో సూచించండి.

ఆధారము: http://apscert.gov.in/

3.05714285714
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు