హోమ్ / శక్తి వనరులు / ఇంధన వనరులు / ఇంధన వనరులు మరియు దాని ప్రస్తుత ఉపయోగం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంధన వనరులు మరియు దాని ప్రస్తుత ఉపయోగం

ఇంధన వనరుల సంబంధించి భారతదేశంలో శక్తి వినియోగం, శక్తి వినియోగం వాడుకలోకి నమూనా, గ్రామీణ పట్టణ విభజన హైలైట్.

బయోమాస్ బొగ్గుతో బ్రికెటింగ్

ప్రతి గ్రామంలోనూ, ప్రతి పంటనూర్పిడి అయ్యాక ఎంతో వ్యవసాయ వ్యర్థాలు తయారౌతాయి.  వీటిని ఎక్కువగా పొల్లాలో బయటనే కాల్చి వేయడం జరుగుతుంది.  ఐతే, బయోమాస్ బొగ్గుతో ఇటుకలు చేసే పరిజ్ఞానంతో ఈ వ్యర్థాలను సరసమైన ధరలకు ప్రత్యామ్నాయ ఇంధనాలుగా మార్చుకోవచ్చు. అంతేకాదు. ఇది పర్యావరణానికి మిత్రునిగా పనిచేస్తుంది. కుటుంబాలకు ధనాన్ని సంపాదించిపెడుతుంది.

బ్రికెటింగ్ అంటే ఏమిటి

తక్కువ సాంద్రత ఉండే బయోమాస్ ను ఎక్కువ సాంద్రత ఉండి, శక్తివంతమైన బొగ్గు ఇటుకలుగా చేయడాన్ని బ్రికెటింగ్ అంటారు

తయారుచేసే పద్ధతి

బయోమాస్ తో బొగ్గును చేయడానికి రెండు విభిన్న పద్ధతులున్నాయి.

 • ప్రత్యక్ష పద్ధతి
  ప్రత్యక్ష పద్ధతిలో  ఉన్న రసాయన వ్యర్థాలను వేడిచేసి, అసంపూర్తిగా కాల్చడం, తద్వారా బొగ్గునేర్పరచడం జరుగుతుంది.
 • పరోక్ష పద్ధతి
  పరోక్ష పద్ధతిలో  బాహ్యంగా  గాలి చొరని అరగల  మూత వేసిన ఒక పొయ్యిలో  రసాయన వ్యర్థాలను కాలుస్తారు. దీనివల్ల హెచ్చు నాణ్యతగల బొగ్గు, తక్కువ కాలుష్యాలతో, తక్కువ పొగతో ఏర్పడుతుంది.

ఎం.సి.ఆర్.సి పద్ధతిలో బొగ్గును తయారుచేయడం

కావలసినవి-

 • స్థానికంగా లభ్యమయ్యే బయోమాస్( చవుకుమాను నుంచి రాలిన ఆకులు, చెరుకు పిప్పి,  వడ్లు నూర్చాక మిగిలిన గడ్డి, పీచు, వేరుశనగ తొక్కలు వగైరా)
 • కార్బొనైజింగ్ ఛాంబర్(కొలిమి లేదా పొయ్యి)
 • కలపడానికి వీలునిచ్చే గంజిపిండి లేదా కస్సవ పిండి
 • చిన్న ఇటుకల తయారీ యంత్రం(గంటక 10 కిలో గ్రాములు)

అంచెలవారీగా బొగ్గు తయారీ

1.    బయోమాస్ ను సేకరించడం
స్థానికంగా లభ్యమయ్యే  బయోమాస్ ను సేకరించి దానిని  వివిధ రకాలుగా విడదీయాలి.  పెద్ద ఆకారంలో ఉన్నవాటిని చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. అలా చేసిన దానిని సూర్యరశ్మిలో ఎండబెట్టాలి.

2. కర్బనీకరించడం

2.i.  కొలిమిని తయారు చేయడం
•  బయటి డ్రమ్ము - ఒక 200 లీ. లోహపు నూనె డ్రమ్ముని తీసుకోవాలి. దాని పైభాగాన్ని కత్తిరించాలి. కింది భాగాన 12" నిడివి x 10" ఎత్తు ఉన్న రంధ్రాన్ని ఏర్పాటుచేసుకోవాలి.
•  రెండు ఇనుప కడ్డీలను(8”) ఆ లోహపు డ్రమ్ కిందభాగాన ఒక వైపునుంచి మరొక వైపుకు వెళ్లేలా రెండిటిని సమాంతరంగా బిగించాలి. ఇవి మనం లోపలివైపుకు ఉంచే  స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ కు సపోర్టునిస్తుంది.
•  లోపలి డ్రమ్ము - ఒక 100 లీ. స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ము సరైన మూతలుండేది. దీనికి కిందిభాగాన ఆరు(3/8") రంధ్రాలుండాలి.
•  ఈ లోపలి డ్రమ్మును పెద్ద డ్రమ్ములోపల ఉంచాలి.

2.ii.  బయోమాస్ ను కర్బనీకరించడం
• బయోమాస్ ను లోపలి డ్రమ్ములోపల గట్టిగా కుక్కాలి. ఆ తర్వాత బయోమాస్ ను బట్టి 45 నిమిషాలనుంచి 1 గంట వరకు దాన్ని బయోమాస్ తోనే మండించాలి.
• అలా మండించాక, లోపలి డ్రమ్ములో ఉన్న కర్బనీకరించబడిన బయోమాస్ ను సేకరించి బరువు చూడాలి. ఈ పద్ధతిలో 30 శాతం కర్బనీకరించిన బొగ్గు లభిస్తుంది.

3.  కలపడానికి వీలునిచ్చే గంజిపిండి లేదా కస్సవ పిండిని తయారుచేయడం
ఈ ఇటుకలను గట్టిగా ఉండేలా చూడటానికి కలిపే బైండింగ్ పదార్థాన్ని వాడతారు.
ప్రతి 100 కిలోల కర్బనీకరించిన బొగ్గుపొడికి 5 లేదా 6 కిలోల గంజిపిండి లేదా   కస్సవ పిండి తీసుకొని దానిని 60 - 100 లీటర్ల నీళ్లలో (వ్యర్ధ పదార్ధాల బరువుని బట్టి)కలపాలి.

4.  కలపడం

కర్బనీకరించిన బొగ్గుపొడిని బాగా బైండింగ్ పదార్థాన్ని వేసి కలపాలి. ప్రతి కణము ఈ బైండింగ్ పదార్థంలో కలిసే విధంగా చేస్తే,  అన్ని ఇటుకలు ఒకే రకంగా తయారవుతాయి.

5.   ఇటుకల తయారీ
బొగ్గుపొడిని చేత్తోగానీ యంత్రాలతోగానీ చిన్న ఇటుకలుగా చేసుకోవాలి. ఇటుకల అచ్చుల్లోకి / యంత్రాల్లోకి నేరుగా ఈ పిండిని వేసి అన్ని ఇటుకలూ ఒకే పరిమాణంలో వచ్చేలా చూసుకోవాలి.

6.   ఆరబెట్టడం, ప్యాకింగ్
తయారైన ఇటుకలను ఒక పళ్లెంలో  సేకరించి, వాటిని ఎండలో బాగా ఎండేలా చూడాలి. ఆ తర్వాత ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి సిల్ చేయాలి.

ఈ ఇటుకల సాధారణ లక్షణాలు :

తేమ                   :  7.1%-7.8%
కరిగే పదార్థాలు        :  13.0%-13.5%
స్థిర కార్బన్            :  81.0%-83.0%
బూడిద                 :  3.7%-7.7%
గంధకం                 :  0.0%
వేడిమి విలువ          :  7,100-7,300 kcal/kg
సాంద్రత                 :   970kg/m 3

సాంకేతిక శాస్త్ర ఉపయోగాలు
1. పొగ ఉండదు : ఈ బొగ్గు ఇటుకలను మండించేటప్పుడు ఎలాటి పొగ వెలువడదు.
2. బూడిద తక్కువ: అతి కనిష్ట స్థాయిలో బూడిద ఏర్పడుతుంది(బొగ్గు యదార్థ బరువులో 5 శాతం కన్నా తక్కువ).
3. హెచ్చు స్థిర బొగ్గు, కెలోరిఫిక్ విలువ :  సాధారణంగా స్థిర కర్బన సారం 82 శాతంగా ఉంటుంది. ఈ ఇటుకల కెలోరిఫిక్ విలువ ఒక కిలోకు 7500 కి.కేలరీలు/కిలో గ్రాములుగా ఉంటుంది.
4. వాసన ఉండదు : బయోమాస్ బొగ్గు ఇటుకల్లో ఆవిరయ్యే పదార్థాలు అతి తక్కువ. అందువల్ల ఎలాంటి వాసన ఉండే ఆస్కారం లేదు.
5. ఎక్కువ సేపు మండుతుంది:  మామూలు బొగ్గు కాలేదానికన్నా బయోమాస్ బొగ్గు ఇటుకలు రెండింతలు ఎక్కువసేపు మండుతాయి.
6. నిప్పుల రవ్వ ఉండదు : మామూలు బొగ్గు మాదిరి కాక, బయోమాస్ బొగ్గు ఇటుకలు వాడటంవల్ల మిణుకుమనడం ఉండదు.
7. తక్కువ పగుళ్లు, ఎక్కువ పటిష్టత : తక్కువ పగుళ్లు ఏర్పడటం, ఎక్కువ పటిష్టతగా ఉండటంవల్ల బయోమాస్ బొగ్గు ఇటుకలు ఎక్కువసేపు మండుతాయి.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా :
డైరెక్టరు/సంచాలకులు
శ్రీ ఏ.ఎం.ఎం మురుగప్ప చెట్టియార్ పరిశోధనా కేంద్రం

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.97945205479
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు