పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వైకల్యం గలవారు

గ్రామీణ ప్రాంతాలలో 75% మంది వికలాంగులు ఉన్నారు, వికలాంగులలో 49 % అక్షరాస్యులు ఉన్నారు మరియు 34% మాత్రమే పనిచేస్తున్నారు. ఇంతకుముందు వైద్య పునరావాసానికి ప్రాముఖ్యత నిచ్చేవారు, మరి ఇప్పుడు సామాజిక పునరావాసానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.

జనాభా లెక్కలు

2001 జనాభా లెక్కల  ప్రకారం, ఇండియాలో 2.19 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు. వారు మొత్తం జనాభాలో 2.13% ఉన్నారు. వీరిలో కంటికి, వినికిడికి, మాట, లోకోమోటారు మరియు మానసిక సంబంధమైన వైకల్యా ల్ని కలిగి ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో 75% మంది వికలాంగులు ఉన్నారు, వికలాంగులలో 49 % అక్షరాస్యులు ఉన్నారు మరియు 34% మాత్రమే పనిచేస్తున్నారు. ఇంతకుముందు వైద్య పునరావాసానికి ప్రాముఖ్యత నిచ్చేవారు, మరి ఇప్పుడు సామాజిక పునరావాసానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.

జనాభా లెక్కలు, ఇండియా 2001 ప్రకారం, వికలాంగుల డేటా

కదలిక 28%
చూపు 49%
వినికిడి 6%
మాట 7%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: 2001 జనాభా లెక్కలు, ఇండియా
జాతీయ మోతాదు సర్వే సంస్థ (ఎన్ ఎస్ ఎస్ ఒ) 2002 ప్రకారం వికలాంగుల డేటా
కదలిక 51%
చూపు 14%
వినికిడి  15%
మాట  10%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: జాతీయ మోతాదు సర్వే సంస్థ, 2002

సామా జిక న్యాయం మరియు సా ధికార మంత్రిత్వశాఖలో ఉన్న డిజెబిలిటీ డివిజన్ విక లాంగులకు అధికారమిచ్చేఅవకాశం  కల్పిస్తుంది. ఈ విక లాంగులు 2001 జనాభా లెక్కల ప్రకారం, 219 కోట్ల మంది మరియు మొత్తం  జనాభాలో 2.13 శాతము ఉన్నారు. వీరిలో కనుచూపు లేనివారు, వినికిడిలేని వారు, మాటలేనివారు, కదలిక లేనివారు మరియు మానసికంగా వెనుకబడిన వారు ఉన్నారు.

భారత రాజ్యాంగం ప్రతివారికీ సమానత్వాన్ని, స్వేచ్ఛని, న్యాయాన్ని మరియు మర్యాదని కల్పిస్తుంది. విక లాంగులందరూ సమాజంలో భాగమని పరిపూర్ణముగా అజ్ఞాపిస్తుంది. రాజ్యాంగం, సబ్జెక్ట్ షెడ్యూల్ లో, విక లాంగులకి అధికారమివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా భాధ్యతల్నిచ్చింది. అందుచేత, విక లాంగులకు సాధికారతనిచ్చే ప్రాధమిక భాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. భారతరాజ్యాంగం, ఆర్టికిల్ 253 క్రింద యూనియన్ లిస్ట్ యొక్క అయిటమ్ 13వ నంబరు, వికలాంగులకు సమాన అవకాశాలు మరియు జాతీయ నిర్మాణంలో వారికి పూర్తి పాత్రను కల్పించే ప్రయత్నంగా ఈ చట్టం, జమ్ము & కాశ్మీరు రాష్ట్రానికి తప్ప మిగతా భారతదేశమంతా వర్తిస్తుంది. జమ్ము & కాశ్మీరు ప్రభుత్వం, విక లాంగుల (సమాన అవకాశాలు, హక్కుల సంరక్షణ మరియు పూర్తి పాత్ర) చట్టం, 1998 ని అమలు చేసింది. వికలాంగులకు ( సమాన అవకాశాలు, హక్కులు సంరక్షణ మరియు పూర్తి పాత్ర ) చట్టం, 1975 ని భారత ప్రభుత్వం శాసనాన్ని అమలు చేసింది.
తగినన్ని ప్రభుత్వాలు, అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలు మంత్రత్వశాఖలు, కేంద్ర / రాష్ట్ర అనుబంధ సంస్థలు, స్థానిక అధికారులు మరియు ఇతర అధికారులు మొదలైనవారి సహకారం తో ఈ చట్టంలోని నియమాలని అమలు చేస్తున్నారు.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, వికలాంగులలో పూర్తి పాత్ర మరియు సమానత్వాన్ని వెల్లడి చేస్తానని ఇండియా సంతకం చేసింది. అడ్డంకులు లేని మరియు హక్కుల ఆధారితమైన సమాజము పై చర్య తీసుకునే బివాకో మిలియనిమ్ ఫ్రేమ్ వర్క్ మీద కూడ ఇండియా సంతకం చేసింది. 2007 సంవత్సరం, మార్చి 30వ తేదిన, యునైటెడ్ నేషన్స్ కన్ వెక్షన్ ఆన్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ద రైట్స్ మరియు డిగ్నిటీ ఆఫ్ పెర్సన్స్ విత్ డిజబిలిటీస్ మీద ఇండియా సంతకం చేసింది. 2008 సంవత్సరము, అక్టోబరు ఒకటవ తేదిన , యునైటెడ్ నేషన్స్ కన్ వెక్షన్ ను ఇండియా అమోదించింది.

ప్రభుత్వ పథకాలు

కొనుగోలు / ఫిట్టింగులలో సహాయోపక రణాలు మరియు ఉపకరణాలను వికలాంగులకు కల్పించ డానికి సహాయం (  ఎ డి ఐ పి పథకం ) వైకలాంగిక ప్రభావాన్ని తగ్గించి మరియు ఆర్థిక స్తోమతని పెంచి వారి భౌతిక, సామాజిక మరియు శాస్త్రీయంగా తయారు చేసిన, నూతనమైన ప్రమాణాలు గల సహాయోపకరణాలు మరియు ఉపకరణాలు, అవసరమైన వికలాంగులకు కొనుగోలు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ పథకం క్రింద, సరఫరా చేసిన సహాయోపకరణాలు మరియు ఉపకరణాలపై ఐ ఎస్ ఐ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టేండర్డ్) మార్క్ ఉండాలి.

ఎ డి ఐ పి పథకం క్రింద, మొత్తం సహాయం మరియు ఆదాయ పరిమితి ఈ క్రింద ఇవ్వబడింది.
మొత్తం ఆదాయం మొత్తం సహాయం

మొత్తం ఆదాయం మొత్తం సహాయం
(i) నెలకి 6500 రూపాయల వరకు (i) సహాయోపకరణాల/ ఉపకరణాల మొత్తం ధర
(ii) నెలకి 6501 రూపాయల నుండి 10000 రూపాయల వరకు 50% సహాయోప కరణాల/ ఉపకరణాల మొత్తం ధర

స్వ చ్ఛంద సేవా సంస్థలు (ఎన్ జీ ఓ) , ఈ మంత్రిత్వశాఖ క్రింద ఉన్న జాతీయ సంస్థలు, కృత్రిమ అవయవాలు తయారు చేసే సంస్థ (ఒక భారత ప్రభుత్వ సంస్థ)ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం:

వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం క్రింద, మెట్రిక్ తరువాత ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉండే ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ కోర్సులు చదువుకోడానికి ప్రతి సంవత్సరం 500 క్రొత్త ఫింఛనులు ఇస్తారు. అయినప్పటికి, మెదడుకు సంబంధించిన పక్షవాతము, మానసిక మాంద్యము, ఒక్కటి కన్నా ఎక్కువ వైకల్యాలు మరియు అధిక  లేదా త్రీవ్రమైన చెవుడు ఉన్న విద్యార్థుల విషయంలో 9 వ తరగతి నుండి చదువుకోడానికి విద్యార్థి ఫింఛన్లు ఇస్తారు. ఫింఛన్ల కొరకు ధరఖాస్తుల్ని తీసుకోనే ప్రకటనల్ని ప్రముఖ జాతీయ/ ప్రాంతీయ వార్తా పత్రికలలో జూన్ నెలలో ఇస్తారు మరియు మంత్రిత్వ శాఖ వైబ్ సైట్ లో కూడా పెడతారు. ఈ పథకానికి విస్తారమైన పబ్లిసిటీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాల్ని / కేంద్రపాలిత ప్రాంతాల్ని కూడా అభ్యర్ధించడం జరిగింది.

40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉండి, వారి నెలసరి ఆదాయం 15000 రూపాయలకన్నా ఎక్కువ లేని విద్యార్థులకి ఈ ఫింఛను తీసుకోవడానికి అర్హత ఉంటుంది. గ్రేడ్యుయే ట్ మరియు పోస్టు గ్రేడ్యుయే ట్ లెవెల్ టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి నెలకి 700 రూపాయల ఫింఛను మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 1000 రూపాయల ఫింఛను ఇస్తారు. డిప్లోమో మరియు సర్టిఫికెట్ లెవెల్ ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి విద్యార్థి ఫింఛను లేదా నెలకి 400 రూపాయలు మరియు  వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 700 రూపాయల ఫింఛను ఇస్తారు. ఈ ఫింఛను ఇవ్వడమే కాకుండా, సంవత్సరానికి 10,000 రూపాయల వరకూ కోర్సు ఫీజుని విద్యార్థులకు ఇస్తారు. ఈ పథకం క్రింద గ్రుడ్డి మరియు చెవిటి గ్రేడ్యుయే ట్ మరియు పోస్టు గ్రేడ్యుయే ట్ విద్యార్థులకి (ప్రొఫెషనల్ కోర్సు చదువు తున్న) ఎడిటింగు సాఫ్ట్ వేరుతో పాటు కంప్యూటర్ కొరకు మరియు మెదడుకి సంబంధించిన పక్ష వాతము ఉన్న విద్యార్థులకి సపోర్టు ఏక్సెస్ సాఫ్ట్ వేరు కొరకు ఆర్థిక సహాయం చేస్తారు.

జాతీయ సంస్థలు / అఖిలస్థాయి సంస్థలు

వికలాంగులకు సాధికారతని చ్చే పా లసీకి అనుగుణంగా మరియు వారి పలు పరిమాణాల సమస్యల్ని ప్రభావితం చేయడానికి ఈ క్రిందనిచ్చిన జాతీయ సంస్థలు/అఖిలస్థాయి సంస్థలు ప్రతి పెద్ద వైకల్యం ఉన్న ప్రాంతంలో పెట్టారు.

  • దృష్టి లోపముగల వారికి జాతీయ సంస్థ, డెహరాడూన్
  • ఎముకల లోపముగల వారికి జాతీయ సంస్థ, కలకత్తా
  • వినికిడి లోపముగల వారికి ఆలి యవర్ జంగ్ జాతీయ సంస్థ, ముంబాయి
  • మాన సిక లోపముగల వారికి జాతీయ సంస్థ, సికింద్రాబాద్
  • పు నరావాస అభ్యాసం మరియు రీసెర్చ్ జాతీయ సంస్థ, కటక్
  • వికలాంగుల సంస్థ, క్రొత్త ఢిల్లీ
  • ఒకటి కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి సాధికారత  కొరకు జాతీయ సంస్థ ( ఎన్ ఐ ఇ పి ఎమ్ డి ), చెన్నై

ఉత్పాదక స్ధానం: http://www.disabilityindia.com/ మరియు సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ

పునర్జనని

పునర్జనని, మానసికంగా ఎదగని పిల్లల (ఎం.ఆర్) ల కోసం ఐ.సి.టి ఆధారిత సమగ్రమైన మదింపు చేయడానికి ఉపయోగపడే ఒక ఉపకరణం. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

3.06629834254
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు