హోమ్ / సామాజిక సంక్షేమం / గిరిజన సంక్షేమం / గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు

భారతరాజ్యాంగంలో గిరిజనులకు ప్రాథమికహక్కులు,అధికరణలు

దేశంలో గిరిజన చరిత్ర అతి పురాతనమైనది. వారి వికాసం భిన్నమైనది. అడవుల్లో అనాదిగా ఆదివాసులు జీవిస్తున్నారు. తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లుతున్న గిరి పుత్రుల అభివృద్దికి రాజ్యాంగ నిర్మాతలు వారి సంక్షేమంతో పాటు వారికి కొన్ని హక్కులను ప్రసాదించారు. వారికోసం ప్రత్యేక చట్టాలు కూడా చేసారు. వాటిల్లో కొన్ని మీకోసం.

15వ అధికరణ

విద్యాపరంగా ఆర్ధికంగా వెనుక పడిన  షెడ్యూల్ కులాల, తెగల ప్రభుత్వం ప్రత్యేక నిబందనలు చేయవచ్చు.

16 వ అధికరణ

ప్రభుత్వ సర్వీసులలో వెనుకబడిన వారికి తగినంత ప్రాతినిద్యం లభించడం లేదని ప్రభుత్వం భావించినపుడు ప్రత్యేక నిభందనలు చేయడానికి ఆటంకం లేదని చెప్తుంది

46వ అధికరణ

హరిజన గిరిజన తెగలకు చెందిన ప్రజల ఆర్ధికాభివృద్దికి ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్ని రకాల దోపిడీ  నుండి రక్షణ కల్పించాలని ఈ అధికరణం తెలియజేస్తుంది

244 వ అధికరణ

ఏ ప్రాంతాన్నైనా షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనుల భూముల బడలాయిమ్పును నిషేదించడానికి ఆయా ప్రాంతాల్లో శాంతిని పెంచుతూ నిబంధనలు చేసే అధికారం గవర్నర్ కు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గిరిజన శాసన సభ్యులతో కూడిన గిరిజన సలహామండలి సలహాలను పొందాలి.

275 అధికరణ

రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో సమానంగా షెడ్యూల్ ప్రాంతాలలో రాష్ట్రనికర ఆదాయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రం వివిధ పధకాలను భారత సంచిత నిధినుండి ఖర్చు చేయవచ్చు

330, 322, 334 అధికరణాలు

శాసన సభ పార్లమంట్ స్థానాలను షెడ్యూల్తెగల వారికి కేటాయించాలి

338 అధికరణ

ప్రత్యేక అధికారి ద్వారా రక్షణ నియమాల అమలు తీరును రాష్ట్రపతి కోరవచ్చు

339 అధికరణ

షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన తీరుపై ఒకసంఘాన్ని రాష్త్రపతి నియమించవచ్చు

342 అధికరణ

ఏ జాతినైన షెడ్యూల్ తెగల మరియు వాటి గ్రూపులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది

3.09219858156
నాడేల. సాయి ప్రసాద్ Jan 25, 2020 07:46 AM

సమాచారం అందిచినదుకు ధన్యవాదాలు

కుండంగి పద్మ Jul 10, 2019 04:02 AM

అయ్యా, నేను గిరిజన 5 వ షెడ్యూల్డ్ ప్రాంతం నకు చెందిన గ్రామము లో గిరిజన మహిళకు పుట్టి అదే ప్రాంతం లో పెరిగాను, నా తండ్రి నా తల్లి తో పాటు 5 వ షెడ్యూల్డ్ ప్రాంతంలో నివాసం ఉండిన 5 వ షెడ్యూల్డ్ ప్రాంతేతర సమాన గిరిజన తెగకు చెందిన వాడు. నాకు 5 వ షెడ్యూల్డ్ ప్రాంతం హక్కులు వర్తిస్తాయా?

మండంగి సూర్యారావు Jun 21, 2019 06:19 PM

అయ్యా మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు పంచాయితీ మా పంచాయితీలో 100 %గిరిజనులం అయినప్పటికీ మపంచాయితీని 5 షెడ్యూల్ జాబితాలో చేర్చబడలేదు అందువలన మేము ఉద్యోగ ,రాజకీయ ,ప్రభుత్వపథకాలు కోల్పోవడంజరుగుతుంది దీనికిసంబందించిన సమాచారం పోస్ట్ చేయగలరు

Venkat Ramana Vanjari Oct 24, 2018 11:18 PM

మాది వంజరి/ వంజర కులం ..1979 కి ముందు S.T. లొ వుండె..తరువాత BC D లో చేర్చారు..
మల్లి S.T.లొ కలపాలి అంటె మేము ఏమి చేయాలి.
మాది అడవులొ సంచరించే జాతి..వన చరులము మేము..గిరిజనులము..

Venkat Ramana Vanjari Oct 24, 2018 11:18 PM

మాది వంజరి/ వంజర కులం ..1979 కి ముందు S.T. లొ వుండె..తరువాత BC D లో చేర్చారు..
మల్లి S.T.లొ కలపాలి అంటె మేము ఏమి చేయాలి.
మాది అడవులొ సంచరించే జాతి..వన చరులము మేము..గిరిజనులము..

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు