పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఉచిత న్యాయ సహాయం

ఉచిత న్యాయ సహాయం

పరిచయం

న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్పా బీదా అన్న తేడా లేదు. అందరికీ సమానావకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడూ ఆర్థిక కారణాల మూలంగా గానీ మరే ఇతర బలహీనతల మూలంగా గానీ న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. బీద, బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక, ఆర్థిక న్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించినారు. ఫలితంగా 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39-ఎ జతచేసి బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించినారు.

అంతే కాకుండా ఇందుకోసం ఒక చట్టాన్ని రూపొందించినారు. అదే న్యాయ సేవల అధికరికల చట్టము. ఇది కెంద్ర చట్టము. ఈ చట్టము నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశికాలను రూపొందించినారు.

అరులు : ఈ చట్టము, దాని అనుబంధ సూత్రాల ప్రకారము దిగువ కనబరచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అరులుగా నిర్ణయించినారు.

 • షెడ్యూల్డ్ కులము లేక తెగకు చెందినవారు
 • మానవ అక్రమ రవాణా బాధితులు, బెగారులు
 • స్త్రీలు, పిల్లలు
 • మతిస్థిమితం లేనివారు, అవిటివారు సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి భూకంపాలు, పారిశ్రామిక విపత్తుల వంటి విపత్తులలో చిక్కుకున్నవారు.
 • పారిశ్రామిక కార్మికులు
 • ఇమ్మెరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టము 1956లో సెక్షన్ 2 (జి)లో తెలిపిన "నిర్బంధము", లేక బాలనేరస్తుల న్యాయ చట్టము 1986 సెక్షన్ 2 (జె)లో తెలిపిన నిర్బంధము లేక మెంటల్ హెల్త్ చట్టము 1987 సెక్షన్(జి)లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయములో తెలిపిన "నిర్బంధము"లో ఉన్న వ్యక్తులు మరియు
 • వార్షిక ఆదాయం రూ. 1,00,000 (రూ లక్షకు మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చును.

ధరఖాస్తు చేయు పద్ధతి

న్యాయ సహాయం కోరువారు తను కేసు యొక్క పూర్వాపరాలు, కావలసిన పరిష్కారము (రిలీఫ్) వివరిసూ అఫిడవిడ్ ను సంబంధిత డాక్యుమెంటులను జత చేసూ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు పైన తెలిపిన అర్హతలలో ఏవి కలిగి ఉన్నదీ తెలియపరుస్తూ తగిన ఆధారాలను (వీలైనంతమేరకు) పంపిన ఎడల నిబంధనల మేరకు తగు చర్య తీసుకొనబడును.

దరఖాస్తు చేయవలసిన చిరునామా

ఉచిత న్యాయ సహాయము కోరువారు తమతమ జిల్లాలకు చెందిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు గాని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు గానీ తమ యొక్క కేసుల వివరములను తెలుపుతూ దరఖాస్తు చేసుకొనవచ్చును.

జిల్లా స్థాయిలో అయితే

కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంబంధిత జిల్లా కోర్టు భవనములు

రాష్ట స్థాయిలో అయితే

సభ్య కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, 2వ అంతస్తు, న్యాయసేవా సదన్, సిటిసివిల్ కోర్టు భవనములు, పూరానీహవేలి, హైదరాబాద్ - 500 002.

లేదా

హైకోర్టులో

హైదరాబాద్ హైకోర్టులో గల కేసుల యందు న్యాయ సహాయం కోరువారు క్రింది చిరునామాకు దరఖాస్తు చేసుకొనవచ్చును.

కార్యదర్శి,హైకోర్టు న్యాయ సేవాధికార సంఘం, హైకోర్టు భవనములు, హైదరాబాద్ - 500 066.

న్యాయ సహాయ విధానాలు

 1. న్యాయ సహాయ విధానాలు : న్యాయవాదిచే ఉచితముగా న్యాయ సలహా ఇప్పించుట
 2. కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టుట.
 3. న్యాయ సహాయం పొందినవారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించుట.
 4. న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసుల్లో జడ్జిమెంటుల నకల్లు ఉచితముగా ఇచ్చుట. మొదలగు సహాయాలు అందించబడుతాయి.
ఆధరం: తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ
2.98780487805
ఆంజనేయులు May 21, 2020 01:43 PM

సార్, మాకు 4ఎకరాలు పొలం ఉండేది. దాన్ని మా నాన్న మేం చిన్న వయసులో ఉన్నప్పుడే అమ్మేశాడు. అప్పుడు మేము మైనార్టీ లో ఉన్నాము. ఇప్పుడు మాకు ఆ పొలం పైన హక్కు ఉంటుందా

Harish puttabhanthi Jul 16, 2019 11:05 AM

మాకు ఫారెస్ట్ ల్యాండ్ లో పోడు కోట్టిన భూమి ఉంది 2006 కన్నా ముందే ముప్పై మూడు సంవత్సరాలుగా అందులో ఉన్నట్టు రెవెన్యూ అధికారులు మాకు కాగితాలు ఇచ్చారు మా దగ్గర ఉన్న కాగితాలను బట్టి కానీ ఫారెస్ట్ అధికారులు జాప్యం చేస్తున్నారు కాబట్టి దీనిని కోర్టుకు వేసి ఫారెస్ట్ అధికారుల మీద కేసు వేయాలి అనుకుంటున్నాను

E.srinivas. Aug 23, 2018 05:55 AM

సర్ నాకు న్యాయ సహాయం కావాలి. గత 6 సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాను. కారుణ్య ఉద్యోగం గురించి సింగరేణితో ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. రైట్ పిటిషన్ వేయాలి. సలహా చెప్పండి.
మానవ హక్కుల వారిని సంప్రదించాలి, లేక న్యాయ సహాయం వారిని దయచేసి చెప్పండి.

దోమకొండ శ్యామరవు Feb 02, 2018 11:37 AM

ఒక అమ్మాయి నేను గత 8yrs నుండి లవ్ చేసుకున్నాము.అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.మాకు న్యాయం కావాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు