హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / “చంద్రన్న భీమా పధకం”
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

“చంద్రన్న భీమా పధకం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఎంతోమంది అసంఘటిత రంగానికి చెందిన వారున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అసంఘటిత కార్మిక రంగం పరిధి లోనికి వచ్చే ప్రతీవ్యక్తి యొక్క కుటుంబ రక్షణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు “చంద్రన్న భీమా పధకం” ఏర్పాటు చేసారు. భారత దేశంలో అసంఘటిత కార్మికులకు భీమా కల్పించిన ఏకైక రాష్ట్రము “ఆంధ్రప్రదేశ్”.

“చంద్రన్న భీమా పధకం”

(అసంఘటిత కార్మికులకు ధీమా)

ఉపోద్ఘాతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఎంతోమంది అసంఘటిత రంగానికి చెందిన వారున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అసంఘటిత కార్మిక రంగం పరిధి లోనికి వచ్చే ప్రతీవ్యక్తి యొక్క కుటుంబ రక్షణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు “చంద్రన్న భీమా పధకం” ఏర్పాటు చేసారు. భారత దేశంలో అసంఘటిత కార్మికులకు భీమా కల్పించిన ఏకైక రాష్ట్రము “ఆంధ్రప్రదేశ్”.

ప్రారంభం

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు.
 • అక్టోబర్ 2వ తేదీ 2016 నుండి ప్రారంభం.
 • తిరుపతి లోని యన్.టి.ర్ స్టేడియం లో అక్టోబర్ 2వ తేదీ 2016 ఆదివారము మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు.

నమోదుకు అర్హులు

 • 18 నుండి 70 సంవత్సరాల మధ్య గల అసంఘటిత కార్మికులు.
 • రూ.15/- చెల్లించి పూర్తి చేసిన అప్లికేషనుతో పాటూ ఆధార కార్డు, రేషన్ కార్డు మరియు బ్యాంకు ఖాతా వివరాలు తెలిపితే చాలు. ఇతర ఏ దృవీకరణ పత్రాలు అవసరం లేదు.
 • ఆధార్, బ్యాంక్ ఖాతా లేని వారికి వాటిని సమకూర్చి భీమా పధకం క్రింద నమోదు.
 • భీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

అసంఘటిత కార్మికులు

 • వ్యవసాయం మరియు అనుబంధ రంగాలైన పూలు-పండ్ల తోటల పెంపకం.కొబ్బరి కోయుట-వలుచుట,పశువుల పెంపకం,కోళ్ళ పెంపకం మొదలైన ఉపాధికి చెందిన వారు.
 • కమ్మరి, కుమ్మరి, క్షౌర వృత్తి, చేనేత, స్వర్ణ కారులు, చాకలి మొదలైన చేతి వృత్తుల పనివారు.
 • వీధి వ్యాపారస్థులు, చిన్న ఉత్పత్తి దారులు, కిళ్ళీ, బడ్డీ వంటి ఇతర చిన్న వ్యాపారస్తులు, సైకిల్, స్కూటర్, ఇతర గృహోపకరణాలు రిపేర్ చేసే చిన్న స్థాయి మెకానిక్ లు.
 • కళాకారుల వంటి స్వయం ఉపాధి పొందే వారు.
 • ఎవరైనా నెలకు జీతం 15000/- మించకుండా ఆర్జించే వారు.
 • ఇంటిపని, ఇండ్లలో వృద్ధులకు సేవ చేసేవారు, లెటర్స్, పార్సిల్స్, వస్తువులు, బిల్లులు వంటివి చేరవేసే కొరియర్ బాయ్స్, పారిశుధ్య పనివారు, ఇండ్ల వద్ద చెత్త సేకరించేవారు మొదలైన సేవారంగ వ్యక్తులు.
 • అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, ఆరోగ్య మిత్ర, భీమా మిత్ర మరియు 104/108 మొదలైన ప్రభుత్వ పధకాల అమలులో గౌరవ వేతనం పొందేవారు.
 • గోదాములు, మార్కెట్ యార్డులు, దుకాణాలు, , రైల్వే స్టేషన్లు ,  బస్టాండ్ లు, పోర్టులు, రేవుల వద్ద పనిచేసే హమాలీలు (లోడింగ్, అన్ లోడింగ్ పనివారు)
 • పబ్లిక్ మరియు ప్రవేటు ఆటో,కారు,వ్యాను,ట్రాక్టర్,లారి, బస్సు వంటి రోడ్ రవాణా మరియు లాంచీలు, పడవలు, జట్టీలు, బల్లకట్టు వంటి జల రవాణా రంగం లోని డ్రైవర్స్,క్లీనర్,కండక్టర్,హేల్పర్ వంటి రవాణా రంగ పనివారు.
 • చిన్న దుకాణాలు, సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీలలో రేగుల, క్యాజువల్ , టెంపరరీ, దినసరి వేతనం,పేస్ రేటు, కమిషన్ పద్దతిన పనిచేసేవారు (పదిమంది కన్నా తక్కువ పనివారలు ఉన్నవి)
 • అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పనివారు ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ శాఖలలో మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ, పంచాయతీలలో పనిచేసే అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పనివారు.
 • భవన లేదా ఇతర నిర్మాణాలలో పనిచేసే – తాపీ పని, సెంట్రింగ్ పని,రాడ్ బెండింగ్, ప్లంబింగ్/సానిటరీ, వడ్రంగి,రంగులు వేయడం, టైల్స్ పని,ఎలక్ట్రీషియన్, బొర్ వెల్, ఇంటీరియర్ డిజైన్ పని,ఇటుక బట్టీలు,ఫ్లయ్ యాష్, ఇతర రకాల ఇటుకల తయారి, ఇసుక క్వారీలు, రాళ్ళ క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్ పనివారు, బావులు తవ్వడం-పూడిక పనివారు, మరియు అన్ని రకాల నిర్మాణ రంగంలో పనిచేసేవారు మరియు నిర్వాహణ పనులు చేస్తున్న వారు.
 • ఉపాధి హామీ పధకం (NREGS) పరిధిలోనికి వచ్చే మేట్, మట్టి పని మరియు ఇతర రకాల పనివారు అర్హులు.

నమోదు ప్రక్రియకు/క్లైములు పరిష్కరించుటకు అధికారులు

 • గ్రామ సమాఖ్య అధికారి ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ జరుగుతుంది.
 • ఈ పధకం క్రింద లబ్ది దారుల నమోదుకు గ్రామాలలో ,పట్టణాలలో, నగరాలలో నివాస స్థాయి నమోదు సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి.
 • ఈ పధకం క్రింద లబ్ది దారుల నమోదు మరియు పధకం ప్రయోజనాల అమలు పర్యవేక్షణ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో ఏర్పాటు చేసిన కమిటీల బాధ్యత.
 • జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన –ఫై.డి., డి.ఆర్.డి.ఓ. ఆధ్వర్యంలో ఈ పధకం అమలవుతుంది.
 • ఈ పధకం క్రింద అస్న్ఘతిత కార్మికుల నమోదు మరియు క్లైముల పరిష్కారములో లబ్దిదారులకు సహాయ పడడానికి “కార్మిక సహాయ కేంద్రాలను” గ్రామాలలో, మండలాలో, పట్టణాలలో,నగరాలలో ఏర్పాటు చేస్తున్నారు.

ముగింపు:

అసంఘటిత రంగం పరిధిలోనికి వచ్చే ప్రతి వారికి “ చంద్రన్న భీమా పధకం” గురించి తెలియ చేయాల్సిన బాధ్యత మన అందరిది.

ఆధారము: http://chandrannabima.ap.gov.in

3.10126582278
P RAJASEKHAR Oct 10, 2018 11:40 AM

Chandranna beema lo name namodhu chesucovadam ala

ఆలజంగి విజయ లక్ష్మి Jun 28, 2018 06:32 PM

బీమా

ఆలజంగి కిరణ్ వర ప్రసాద్ Jun 28, 2018 06:31 PM

బీమా నమోదు కొరకు.

రహిమాన్ Mar 09, 2018 12:28 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావు పేట గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి 24.11.2016 వతేదీన చంద్రన్న భీమా పతాకం 15 రూపాయలు చెల్లించి రసీదు పొందాడు 6 నెలల క్రితం అతను చనిపోయాడు ...(న్యాచురల్ డేట్ ) కానీ ఇక్కడి అధికారులు అల్లలైన్ లో ఎక్కలేదని మేమేం చేయలేమని చేతులెత్తేశారు. వారిపై దాయఉంచి వారి కుటుంబసభ్యులను చంద్రన్న భీమా పథకం ద్వారా వారికి న్యాయం చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు ...

శ్రీనివాస్. కె Dec 13, 2017 07:46 PM

ఇప్పుడు నమోదు చేయడం అవుతుంద

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు