హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

తెలంగాణా ప్రభుత్వం వృధ్ధులకు, వికలాంగులకు , ఫింఛను కోసం ఆసరా పథకాన్ని ప్రారంభించింది.

తెలంగాణా ప్రభుత్వం వృధ్ధులకు, వికలాంగులకు , ఫింఛను కోసం ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, HIV-AIDS ఉన్నవారు లబ్ధి పొందుతారు.

ఆసరా ఫింఛను పథకం

అర్హతలు :వృధ్ధులు:65 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు

అవసరమైన పత్రాలు :

 • జనన ధ్రువీకరణ పత్రము లేదా
 • ఆధార్ కార్దు లేదా
 • వయస్సుని సూచించే ఏదైనా ఇతర పత్రములు .

పైన తెలిపిన పత్రములు లేనిచో గవర్నమెంటు అధికారి లభ్ధిదారుని పిల్లల వయస్సు, మనుమలు, మనుమరాళ్ళ వివాహ వయస్సు ఆధారంగా గుర్తిస్తారు. అలా గుర్తించలేని పరిస్థితిలో మెడికల్ బోర్డుకు సూచిస్తారు.

చేనేత కార్మికులు
 • అర్హత : 50 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వారు
 • వితంతువులు
 • అర్హత: 18 సంవత్సరాలు నిండిన వారు
 • భర్త మరణ ధ్రువీకరణ పత్రము
 • నిర్ధారణ సమయంలో అవసరమగు పత్రాలు:
 • భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. మరణ ధ్రువీకరణా పత్రం లేకపొతే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మూడు నెలల్లో ధ్రువీకరణ పత్రం పొందాలి. లబ్ధిదారుని పునర్వివాహం విషయంలో విలేజి సెక్రెటరీలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి.
 • కల్లు గీత కార్మికులు
 • అర్హత: 50 సంవత్సరాలు నిండిన వారు
 • లబ్ధిదారుడు కల్లు గీత కార్మికుల సహాయక సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి.
 • వికలాంగులు
 • అర్హత: వయస్సుతో సంబంధం లేదు.
 • 40 శాతం వైకల్యం కలిగి ఉండాలి.
 • వినికిడి లోపం ఉన్నవారు 51 శాతం వైకల్యం కలిగి ఉండాలి.
 • వికలాంగులకు అందించే SADAREM సర్టిఫికెట్ నందు 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు.
 • HIV-AIDS ఉన్నవారు
 • అర్హత: యాంటీ రిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్నవారు.
 • నిర్ధారణ సమయంలో అవసరగు పత్రాలు :

  వ్యాధిని నిర్ధారిస్తూ ఏదైనా ఆసుపత్రి యాజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్

  సామాజిక-ఆర్ధిక అర్హతలు :

  ఆసరా ఫింఛను పథకం కేవలం వృధ్ధులు, వికలాంగులు , మరియు వితంతువులు , కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం ప్రారంభించారు. ఈ క్రింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఆసరా ఫింఛనుకు అనర్హులు.

  1. 3 ఎకరాల సాగునీటి సదుపాయం ఉన్న భూమి / 7.5 ఎకరాల బీడు భూమి
  2. ప్రభుత్వ/ప్రభుత్వ రంగ / ప్రైవేటు రంగ /కాంట్రాక్టరు ఉద్యోగం ఉన్న పిల్లలు కలవారు
  3. వైద్యులు, కాంట్రాక్టర్లు , స్వయం ఉపాధి కలిగిన పిల్లలు కలవారు
  4. పెద్ద వ్యాపార సంస్థలు ( నూనె మిల్లులు, బియ్యం మిల్లులు, పెట్రోలు పంపులు, షాపు యజమానులు ) ఉన్న వారు
  5. ఇప్పటికే ప్రభుత్వం నుండి ఫింఛను పొందుతున్న వారు
  6. తేలికపాటి మరియు భారీ వాహనములు కలిగిన వారు
  7. జీవన శైలి , వృత్తి , మరియు ఆస్తుల ఆధారంగా అనర్హులని అధికారులచే గుర్తించబడ్డ వారు.

  ఫింఛనుకు అర్హులు:

  1. ఆదిమ మరియు అసహాయ గిరిజన గుంపులు.
  2. మహిళల నేతృత్వంలోని కుటుంబాలు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారు.
  3. వికలాంగుల కుటుంబాలకు.
  4. వికలాంగులు మరియు వితంతువులు తప్ప అన్ని రకాల ఆసరా ఫింఛనుకు కుటుంబములో ఒక్కరు మాత్రమే అర్హులు.
  5. భూమి లేని వ్యవసాయ కార్మికులు , గ్రామీణ కళాకారులు (కుమ్మరి, చేనేత, వడ్రంగి, కమ్మరి) మురికి వాడల ప్రజలకు , రోజు వారీ వేతనం మీద ఆధార పడే వారు , పూలు, పండ్ల వ్యాపారులు , రిక్షా కార్మికులు, పాము మంత్రం వేయు వారు , చెప్పులు కుట్టేవారు , నిరాశ్రయులు ,గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన ఇటువంటి వారు.
  6. ఇళ్ళు లేని వారు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో తాత్కాలిక గృహ నివాసాలను ఏర్పాటు చేసుకున్న వారు.
  7. వృధ్ధులు, వితంతువులు, వికలాంగులు, జీవనాధారం లేని వ్యక్తుల నేతృత్వంలోని కుటుంబాలు.

  దరఖాస్తుల స్వీకరణ:

  1. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతి సెక్రెటరి/ విలేజి రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతాలలో బిల్ కలెక్టరు దరఖాస్తులను స్వీకరిస్తారు.
  2. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతి సెక్రెటరి/ విలేజి రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతాలలో బిల్ కలెక్టరు దరఖాస్తులను పరిశీలిస్తారు.
  3. మున్సిపల్ కమిషనర్ , డిప్యూటీ / జోనల్ అధికారి , దరఖాస్తులను పరిశీలించి వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే మార్గదర్శకాల ఆధారంగా ఫింఛను మంజూరు చేస్తారు.
  4. లబ్ధిదారులను గుర్తించే క్రమంలో గృహ సర్వే సమాచారాన్ని, జనాభా లెక్కలను, వికలాంగులు,వితంతువులు, వృధ్ధులు, మరియు కమ్యూనిటీలకు చెందిన వివిధ వర్గాలను పరిగణలోనికి తీసుకుంటారు.
  5. దరఖాస్తు పరిశీలనలో లేదా ఆకస్మిక తనిఖీలో ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నచో, అటువంటి వారిపై క్రమశిక్షణా చర్య తీసుకుంటారు లేదా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేస్తారు.

  ఇతర వివరముల కోసం :

  టోల్ ఫ్రీ నంబరు : 1800-200-1001.

  ఇ-మెయిల్ : aasarapensions@gmail.com

  అధికారిక వెబ్ సైట్: http://www.aasara.telangana.gov.in/

  G.H.M.C. డ్రైవర్ కం. ఓనరు పథకం

  సమైక్య అంధ్రప్రదేశ్ రాష్త్రంలో G.H.M.C. (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) వారు “G.H.M.C.డ్రైవర్ కం. ఓనరు” పథకాన్ని ప్రారంభించాలనుకున్నారు. రాష్త్రంలోని నిరుద్యోగ యువతకు

  న్యూ మారుతి డిజైర్ కార్లను ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఈ పథకానికి “G.H.M.C. డ్రైవర్ కం. ఓనరు” అనే పేరును నిర్ణయించారు.

  కానీ సమైక్య అంధ్రప్రదేశ్ ఏఅష్త్రంలో ఈ పథకం అమలు కాలేదు. తెలంగాణా రాష్త్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఈ పథకాన్ని ప్రారంభించారు.

  వారు ప్రభుత్వ/ ప్రైవేటు రంగాలు/ క్యాబ్ సర్వీసెస్ ను ప్రారంభించాలనుకునేవారికి డ్రైవింగ్ రంగంలో ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు.

  డ్రైవర్ కం. ఓనరు పథకానికి దరఖాస్తు ఎలా?

  ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారునికి 21 నుండి 35 సంవత్సరాల వయస్సు , తెల్ల రేషను కార్డు , చెల్లుబాటులో ఉన్న డ్రైవింగు లైసెన్సు , మరియు కనిష్ఠంగా మూడు సంవత్సరాల డ్రైవింగు అనుభవము తప్పనిసరి.

  దరఖాస్తుదారుడు ప్రాజెక్టు ఖర్చులో 15% చెల్లించడానికి మరియు 85% మొత్తం బ్యాంకు నుండి ఋణం తీసుకోవడానికి అంఘీకరించాలి.

  కులం ఆధారంగా రాయితీ (సబ్సిడీ) నిర్ణయించబడుతుంది .

  ఈ పథకం ప్రకారం ఆసక్తి కలిగిన యువత ( స్త్రీ మరియు పురుషులు ) 21 నుండి 35 సంవత్సరాల వయస్సు, డ్రైవింగు లైసెన్సు కలవారు దరఖాస్తుల కోసం జోనల్ కార్యాలయం నందు సంప్రదించవచ్చు.

  "తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది" అని రవికాంత్ జిల్లా మిషన్ సమన్వయకర్త చెప్పారు.

  కావలసిన పత్రాలు :

  • డ్రైవింగ్ లైసెన్సు
  • కుల ధ్రువీకరణ పత్రము
  • అడ్రస్ ప్రూఫ్ ( ఆధార్ కార్డు/ గ్యాసు బిల్లు/ కరెంటు బిల్లు )
  • పాన్ కార్డు/ ఓటరు గుర్తింపు కార్డు
  • తాజా పాస్ పోర్టు సైజు కలరు ఫోటోలు (2).

  మరిన్ని వివరాల కోసం G.H.M.C. కార్యాలయ ఫోను నంబరు 040-21111111 కి కాల్ చెయ్యండి.

  బీడీ కార్మికులకు నెలకు రూ.1000/-ల జీవన భృతి

  తెలంగాణా ప్రభుత్వం బీడీ కార్మికుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆసరా ఫింఛను పథకం కింద జీవో 29 ప్రకారం ఒక కొత్త పథకాన్ని బీడీ కార్మికుల కోసం ప్రవేశ పెడుతూ ఆదేశాలను జారీ చేసింది.

  పథకం వివరాలు:

  బీడీ కార్మికుల ఫింఛను పథకం అమలు సమీక్ష సమయంలో రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన ప్రజలు బీడీ తయారీ మీద ఆధారపడి ఉన్నారని అందువలన వారి ఆరోగ్యం దెబ్బతింటుందనిప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

  రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి బీడీ కార్మికులకు ఆర్ధిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

  గవర్నమెంటు నిశిత పరిశీలన తర్వాత ఇటువంటి కార్మికులకు ఆసరా ఫింఛను పథకం నందు ఒక ప్రత్యేక కేటగిరీ కింద ఈ పథకాన్ని అమలుచేయనుంది.

  బీడీ కార్మికుల ఫింఛనుకు అర్హతలు:

  1. బీడీ కార్మికుల సంక్షేమ నిధి చట్టం, 1976 (act. 62) ప్రకారం కంట్రాక్టరు ద్వారా ముడి పదార్థాలను తీసుకొని బీడీలను తయారు చేసే వారు , 28 ఫిబ్రవరి 2014 కంటే ముందు కాంట్రాక్టరు నుండి ముడి పదార్థాలను తీసుకొని బీడీలను చుట్టడం ప్రారంభించినవారు అర్హులు.
  2. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు.
  3. బీడీ కార్మికులు సామాజిక ఆర్థిక ప్రమాణల ప్రకారం పేద కుటుంబానికి చెందిన వారై ఉండాలి.
  4. లబ్ధిదారుడు సమగ్ర కుటుంబ సర్వే - 2014 లో బీడీ కార్మికునిగా నమోదు చేయించుకొని ఉండాలి.
  5. కేవలం కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే ఆసరా పథకం లోని ఒక ప్రత్యేక కేటగిరీ ద్వారా బీడీ కార్మికుల ఫింఛను అందించబడుతుంది.
  6. బీడీ కార్మికులు అతను/ఆమె స్వయంగా గానీ లేదా కుటుంబంలోని ఏ వ్యక్తి గానీ ఆసరా ఫింఛను పథకం ద్వారా ఫించను పొందుతున్న వారై ఉండకూడదు.
  7. బీడీ కార్మికులు అతను/ఆమె స్వయంగా గానీ లేదా కుటుంబంలోని ఏ వ్యక్తి గానీ బీడీ కార్మికుల E.P.F.ఫింఛను పొందుతున్న వారై ఉండకూడదు.

  అర్హత కలిగిన బీడీ కార్మికులు ఈ పథకం ద్వారా నెలకు రూ.1000/-ల ఫింఛను పొందుతారు.

  అన్ని జిల్లాల కలెక్టర్లు సమగ్ర కుటుంబ సర్వే - 2014 లో బీడీ కార్మికులుగా నమోదు చేయించుకున్న వారు ఆసరా ఫింఛను పథకం ద్వారా గానీ లేదా బీడీ కార్మికుల E.P.F. ఫింఛను గానీ పొందుతున్నారేమో చూసి వారిని అనర్హులుగా ధ్రువీకరించాలి.

  ఇతర వివరముల కోసం :

  టోల్ ఫ్రీ నంబరు : 1800-200-1001.

  ఇ-మెయిల్ : aasarapensions@gmail.com

  అధికారిక వెబ్ సైట్: http://www.aasara.telangana.gov.in/

  షాదీ ముబారక్ పథకం

  తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పథకం ద్వారా తెలంగాణా రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వధువులకు ఆర్ధిక సహాయం అందించనుంది.

  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి సంబంధించి జీవో (G.O.MS.No. 4)ను జారీ చేసింది. ఈ పథకం ద్వారా ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ప్రతి పెళ్ళికాని యువతికి రూ.51000/- పెళ్ళి సమయంలో అందించనున్నారు. అక్టోబరు 2,2014 తర్వాత నుండి ఈ పథకం అమల్లోకి రానుంది.

  షాదీ ముబారక్ పథకం మార్గదర్శకాలు:

  అర్హత:

  • ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన పెళ్ళి కాని యువతులు.
  • వధువు తెలంగాణా రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
  • పెళ్ళి సమయానికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  • అమ్మాయి పెళ్ళి అక్టోబరు 2,2014 న లేదా ఆ తర్వాత జరిగి ఉండాలి.

  ఆదాయ ప్రమాణాలు:

  • తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2,00,000/-కు మించి ఉండకూడదు.

  దరఖాస్తు చేయు విధానం:

  1. ఏదైనా మీ సేవ కేంద్రంలో క్రింద తెలిపిన వెబ్ సైటు ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేయవచ్చు.
  2. http://epasswebsite.cgg.gov.in

  3. జత చేయవలసిన పత్రాలు:

  కావలసిన పత్రాలు :

  • జనన ధ్రువీకరణ పత్రము:మీ సేవ కేంద్రం ద్వారా అర్హులైన అధికారులచే జారీ చేయబడినది.
  • కుల ధ్రువీకరణ పత్రము: మీ సేవ కేంద్రం ద్వారా అర్హులైన అధికారులచే జారీ చేయబడినది.
  • ఆదాయ ధ్రువీకరణ పత్రము: వివాహ తేదీ నుండి 6 నెలల కంటే పాతది అయి ఉండకూడదు.
  • వధువు మరియు వరుడి యొక్క ఆధార్ కార్డు స్కానింగ్ కాపీ అప్ లోడ్ చేయాలి.
  • బ్యాంకు పాసు పుస్తకంలోని మొదటి పేజీ వధువు ఫోటో మరియు ఖాతా (సేవింగ్స్ ఖాతా) వివరములు కలిగిఉన్న పేజీ యొక్క స్కానింగ్ కాపీ.
  • పెళ్ళి శుభలేఖ (అందుబాటులో ఉంటే)
  • పెళ్ళి సమయంలో తీసిన ఫోటోలు (అందుబాటులో ఉంటే)
  • వివాహం జరిపించిన గ్రామ పంచాయతీ/చర్చి /మసీదు/ ఏ ఇతర అధికారిక సంస్థ ద్వారా అందిన ఉత్తరం స్కానింగ్ కాపీని అప్ లోడ్ చేయాలి.

  స్కానింగ్ మరియు అప్ లోడ్ చేయుటకు ఆప్షనల్ వివరాలు:

  • SSC హాల్ టికెట్ నంబరు మరియు పాసైన సంవత్సరం.

  పథకం మార్గదర్శకాలు::

  1. షాదీ ముబారక్ పథకం షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలను అందించే పథకం కాదు.
  2. షాదీ ముబారక్ పథకం జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.
  3. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి దరఖాస్తులను, జత చేసిన పత్రాలను పరిశీలించి పథకం ద్వారా అందించవలసిన మొత్తాన్ని వధువు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
  4. వ్యయం ఈ ఖాతాల నుండి డెబిట్ చేయబడుతుంది.

   2025- షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమం.
   80- జనరల్
   800- ఇతర వ్యయాలు
   G.H. 11-సాధారణ రాష్ట్ర ప్రణాళిక
   S.H. 17-మైనారిటీ వివాహాలు జరిపించుట

  5. కమీషనర్/డైరెక్టర్ మైనారిటీ సంక్షేమ శాఖ అవసరమైన సాఫ్ట్ వేర్ ను దరఖాస్తులను అందించుటకు ఇ-పాస్ వెబ్ సైటును ప్రారంభించారు. http://epasswebsite.cgg.gov.in
  6. ఈ పథకానికి సంబంధించి విస్తృత ప్రచారానికి కమిషనర్/డైరెక్టర్ మైనారిటీ సంక్షేమ శాఖ హామీ ఇస్తున్నారు.
  7. ఆర్ధిక శాఖ విధానాలకు అనుగుణంగా సెప్టెంబరు 16,2014 నాటి U.O. No.297/PFS/2014 జారీ చేయబడ్దాయి.

  ఆధారము: విషయ రచన భాగస్వామ్యులు - సౌమ్య ఏనేపల్లి

   

  3.11801242236
  Kethavath Sardhar Mar 06, 2020 05:35 PM

  నాకు లైసెన్స్ కొత్తగా వుంది నాకు ఎలాంటి వృత్తి లేదు నేను ఎపుడు కెసిఆర్ స్కీమ్ కింద కారు లోన్ ఎలా తిస్కోవలి నాకు క్లారిటీ లేదు ఎలా

  Kethavath Sardhar Jan 27, 2020 02:55 PM

  నాకు క్యాబ్ గురించి S T చట్టం కింద కెసిఆర్

  యన్నమాల అశోక్ Oct 26, 2019 06:45 PM

  మా అమ్మ గారికి వితంతు పెన్షన్ రావడం లేదు. నేను rtc emplee ని.

  Raviparangi Dec 26, 2018 02:30 AM

  తెలంగాణ అన్ని పథకాలు పూర్తి సమాచారం ఉంటే బాగుంటుంది.

  Srinivas goud Aug 22, 2018 10:18 PM

  Sir dabul bed room ku sambandhinchi ela apply cheyalo and evaru arhulo chepandi

  మీ సూచనను పోస్ట్ చేయండి

  (ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

  Enter the word
  నావిగేషన్
  పైకి వెళ్ళుటకు